నాసిక్: ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు ట్రక్కు ట్రైలర్‌ను ఢీకొట్టిన ఘటనలో మంటలు చెలరేగి బస్సులోని ఇద్దరు చిన్నారులు సహా 12 మంది సజీవ దహనమయ్యారు. మరో 43 మంది గాయపడ్డారు. మహారాష్ట్రలోని నాసిక్–ఔరంగాబాద్ హైవేపై నాదుర్‌నాకా సమీపంలో శనివారం ఉదయం 5.15 గంటల సమయంలో దుర్ఘటన సంభవించింది. యావత్మాల్ నుంచి ముంబై వైపు వెళ్తున్న ప్రైవేట్ లగ్జరీ బస్సు ట్రక్కు ట్రైలర్‌ను, ఆపై కార్గో వ్యాన్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులో వేగంగా వ్యాపించిన అగ్నికీలలు రెండేళ్ల వయస్సున్న ఇద్దరు చిన్నారులు సహా 12 మందిని బలి తీసుకున్నాయి.
మరో 43 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆదుపులోకి తెచ్చారు. బస్సు పూర్తిగా తగులబడిపోయింది. క్షతగాత్రులను నాసిక్‌లోని వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం షిండే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేస్తామన్నారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్య సాయం అందజేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment