private bus accident
-
ప్రైవేట్ బస్సు బోల్తా.. ఇద్దరు బాలికల మృతి
కోడుమూరు రూరల్: డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సు బోల్తా పడింది. ఇద్దరు బాలికలు మృతిచెందారు. మరో 21మంది గాయపడ్డారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు... ఆదోనిలోని బిస్మిల్లా ట్రావెల్స్‌కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు బుధవారం రాత్రి ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి ఆదోనికి బయలుదేరింది. కోడుమూరు వద్ద లారీని ఓవర్టేక్ చేసేందుకు డ్రైవర్ అతివేగంగా వెళ్లే క్రమంలో బస్సు బోల్తా పడింది. బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులు తమను రక్షించాలని హాహాకారాలు చేశారు.కోడుమూరు సీఐ మన్సురుద్దీన్, ఎస్ఐ బాలనరసింహులు తమ సిబ్బందితో వచ్చి స్థానికుల సాయంతో బస్సు అద్దాలను పగులగొట్టి గాయపడినవారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మైదుకూరుకు చెందిన వెంకటేశ్వర్లు కుమార్తె ధనలక్ష్మి (13), సురేష్ కుమార్తె గోవర్దనీ(9) మరణించారు. వరుసకు అక్కాచెల్లెళ్లు అయిన వీరిద్దరూ తమ మేనత్త కృష్ణవేణితో కలిసి ఆదోనికి బస్సులో వెళుతూ గాఢ నిద్రలోనే కన్నుమూశారు. హైదరాబాద్, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరులకు చెందిన కృష్ణవేణి, పుష్పావతి, మౌనిక, అశోక్, భారతి, గౌస్‌మొహిద్దీన్, పినిశెట్టి లక్ష్మి, వెంకటరెడ్డితోపాటు మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.బోయ శకుంతల, శివరాముడు, లక్ష్మి, గణేష్, అశోక్‌కుమార్‌లతోపాటు మరో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని పోలీసులు 108 అంబులెన్స్‌లలో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 29మంది ప్రయాణికులు, డ్రైవర్, ఇద్దరు క్లీనర్లు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్లు పరారైనట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, కర్నూలు డీఎస్పీ విజయశేఖర్‌లు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం
నాసిక్: ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు ట్రక్కు ట్రైలర్‌ను ఢీకొట్టిన ఘటనలో మంటలు చెలరేగి బస్సులోని ఇద్దరు చిన్నారులు సహా 12 మంది సజీవ దహనమయ్యారు. మరో 43 మంది గాయపడ్డారు. మహారాష్ట్రలోని నాసిక్–ఔరంగాబాద్ హైవేపై నాదుర్నాకా సమీపంలో శనివారం ఉదయం 5.15 గంటల సమయంలో దుర్ఘటన సంభవించింది. యావత్మాల్ నుంచి ముంబై వైపు వెళ్తున్న ప్రైవేట్ లగ్జరీ బస్సు ట్రక్కు ట్రైలర్‌ను, ఆపై కార్గో వ్యాన్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులో వేగంగా వ్యాపించిన అగ్నికీలలు రెండేళ్ల వయస్సున్న ఇద్దరు చిన్నారులు సహా 12 మందిని బలి తీసుకున్నాయి. మరో 43 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆదుపులోకి తెచ్చారు. బస్సు పూర్తిగా తగులబడిపోయింది. క్షతగాత్రులను నాసిక్‌లోని వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం షిండే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేస్తామన్నారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్య సాయం అందజేస్తామని చెప్పారు. -
నిద్రమత్తులో తూగిన డ్రైవర్: ట్రావెల్స్ బస్సు బోల్తా
రాప్తాడు (అనంతపురం జిల్లా): డ్రైవర్ నిద్ర మత్తులో తూగడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, నలుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన రాప్తాడు వద్ద జాతీయ రహదారి-44పై మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటలకు చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... బెంగళూరుకు చెందిన ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సు (కేఏ51 ఏసీ 6440) హైదరాబాద్ నుంచి బెంగళూరుకు సోమవారం రాత్రి 20 మంది ప్రయాణికులతో బయలుదేరింది. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అనంతపురంలోని తపోవనం ప్రాంతానికి చేరింది. తపోవనంలో మరొక డ్రైవర్ షఫీవుల్లా డ్రైవింగ్ తీసుకున్నాడు. రాప్తాడు దగ్గరకు రాగానే నిద్రమత్తులో తూగాడు. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి దిగింది. దాదాపు 500 మీటర్ల దూరం వెళ్లి బోల్తా పడింది. డ్రైవర్ షఫీవుల్లాతో పాటు బెంగళూరుకు చెందిన సురేష్ గౌడ్, మహమ్మద్ షఫీవుల్లా, మహమ్మద్ షేక్ ఆరిఫ్, మహమ్మద్ షమీవుల్లాకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని హైవే సిబ్బంది 108 వాహనంలో సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ ఆంజనేయులు కేసు నమోదు చేశారు. -
అరకు ప్రమాదం; కోలుకుంటున్న క్షతగాత్రులు
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: అనంతగిరి మండలం డముకు మలుపు వద్ద శుక్రవారం రాత్రి ప్రైవేటు బస్సు లోయలో పడిపోయిన ఘోర ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు కోలుకుంటున్నారు. హైదరాబాద్ షేక్‌పేటకు చెందిన 27 మంది పర్యాటకులు విహార యాత్రలో భాగంగా విశాఖ జిల్లా అరకు వచ్చి తిరిగి వెళ్తుండగా.. అనంతగిరి మండలం డముకు ఘాట్‌రోడ్డు మలుపు వద్ద వారు ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు లోయలో పడిపోయిన విషయం విదితమే. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందగా, 23 మంది గాయాల పాలయ్యారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు హుటాహుటిన రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, పోలీస్ బృందాలు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. వీరిలో 16 మంది శనివారం నాటికి పూర్తిగా కోలుకున్నారు. మిగిలిన ఏడుగురికి కేజీహెచ్‌లోనే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నారు. ఆరుగురికి శస్త్ర చికిత్స చేయగా కోలుకుంటున్నారు. మరో మహిళ కొట్టం చంద్రకళ (50) పరిస్థితి కొంత విషమంగానే ఉంది. మరో 24 గంటలు గడిస్తేగాని చెప్పలేమని వైద్యులు తెలిపారు. ప్రమాదంలో మరణించిన కొట్టం సత్యనారాయణ (61), నల్ల లత (45), సరిత (40), కొట్టం శ్రీనిత్య (8 నెలలు) మృతదేహాలను హైదరాబాద్‌కు తరలించారు. 16 మంది స్వస్థలాలకు పయనం ప్రమాదంలో గాయపడి కోలుకున్న క్షతగాత్రుల్లో 16 మంది శనివారం హైదరాబాద్‌లోని స్వస్థలానికి బయలుదేరారు. విశాఖ జిల్లా అధికారులు తెలంగాణ ప్రభుత్వాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. గాయపడి పూర్తిగా కోలుకున్న 16 మందిని మరో రోజు వైద్యుల పరిశీలనలో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. క్షతగాత్రులు మాత్రం మృతదేహాల వెంట తాము కూడా హైదరాబాద్ వెళ్లిపోతామని అధికారులను కోరారు. దీనిపై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చ సాగింది. ఇక్కడి వైద్యులు వెళ్లొద్దని వారించినా.. క్షతగాత్రులు మాత్రం వెళ్లేందుకు సిద్ధపడటంతో అధికారులు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. పరామర్శించేందుకు వచ్చిన బంధువులతో పాటు 16 మందిని రాత్రి 9 గంటలకు ఇక్కడి నుంచి పంపించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం క్షతగాత్రులకు నాలుగు వైద్య బృందాల (ఆర్థో, న్యూరో, ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ సర్జరీ)తో మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్య శాఖ) ఆళ్ల నాని చెప్పారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ వినయ్‌చంద్‌తో కలిసి శనివారం ఆయన పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను డ్రైవర్ శ్రీశైలం నుంచి తెలుసుకున్నారు. అనంతరం ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన వారందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. క్షతగాత్రుల్లో 16 మంది పూర్తి సురక్షితంగా ఉన్నారని, ఆరుగురికి శస్త్ర చికిత్స చేయగా కోలుకుంటున్నారని, కొట్టం చంద్రకళ (50) పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని చెప్పారు. కొట్టం కల్యాణి (30)కి ప్లాస్టిక్ సర్జరీ చేయించామని చెప్పారు. ఈ ఘటనపై జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీ వేయనుందని తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే బస్సు ప్రమాదం ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిద్రమత్తే కారణమని రవాణా శాఖ ప్రాథమికంగా తేల్చింది. అలసట కారణంగా డ్రైవర్ నిద్రమత్తుకు లోనవటంతో ఈ ప్రమాదం సంభవించిందని ప్రభుత్వానికి పంపిన ప్రాథమిక నివేదికలో అధికారులు పేర్కొన్నారు. బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం జరిగిందన్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. కోలుకుని హైదరాబాద్ పయనమైన వారి వివరాలు కొట్టం లత (45), యు.కృష్ణవేణి (50), కొట్టం అరవింద్‌కుమార్ (35), కొట్టం నరేష్కుమార్ (38), కొట్టం స్వప్న (32), కొట్టం శివాని (07), కొట్టం దేవాన్‡్ష(05), కొట్టం శాన్వి (05), కొట్టం విహాన్ (03), కొట్టం ఇషా (05), అనూష(26), కొట్టం హితేష్ (17), కొట్టం మౌనిక (27), కొట్టం అనిత(50), కొట్టం శ్రీజిత్(14), లోఖిశెట్టి నందకిశోర్ (25) కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారు కొట్టం కల్యాణి (30), కొట్టం జ్యోతి (55), కొట్టం శైలజ (30), కొట్టం అభిరామ్ (07), మీనా (38), కొట్టం చంద్రకళ (50), బస్సు డ్రైవర్ సర్రంపల్లి శ్రీశైలం ప్లాస్టిక్ సర్జరీతో పాతరూపు అనంతగిరి మండలం డముకు మలుపు వద్ద బస్సు ప్రమాదంలో కొట్టం కల్యాణి (30)కి ముఖంపై తీవ్రగాయాలు కావడంతో ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ప్లాస్టిక్ సర్జరీ స్పెషలిస్ట్ డాక్టర్ పివీ సుధాకర్ ఆధ్వర్యంలోని బృందం ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ చేసింది. కల్యాణి ముఖాన్ని ప్రమాదానికి ముందు ఎలా ఉందో అలా తీర్చిదిద్దారు. -
ప్రైవేట్ బస్సు బోల్తా; తప్పిన ప్రమాదం
సాక్షి, గుంటూరు: జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై రొంపిచర్ల శివారులోని తంగళ్లపల్లి వద్ద ఓ ప్రైవేట్ సబ్బు పల్టీ కొట్టింది. వేగంగా వస్తున్న బస్సు ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో బస్సులో ఉన్న 40 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. బస్సులో 45 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీస్తున్నారు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి కందుకూరు వెళుతున్నట్లు తెలుస్తోంది. -
ఆర్టీసీ సమ్మె : ప్రయాణికుడి కాలుపైకి ఎక్కిన బస్సు
సాక్షి, నల్లగొండ : ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విధులకు హాజరు కాకపోవడంతో తాత్కాలిక ఉద్యోగులతో ప్రభుత్వం బస్సులను నడిపిస్తున్నా.. అనుభవరాహిత్యం వల్ల పలు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బస్సు ఎక్కితే ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు భయపడుతున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోకి కూకట్‌పల్లిలో రెండు బస్సులు ఢీకొన్న సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తాజాగా నల్లగొండ జిల్లాలో ఓ అద్దె బస్సు డ్రైవర్ నిర్వాకం.. ఓ ప్రమాదానికి కారణమయింది. (చదవండి : రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. డ్రైవర్‌పై దాడి) నల్లగొండ జిల్లా హాలియా బస్టాండ్‌లో ప్రయాణికుడి కాలుపైకి బస్సును ఎక్కించాడు ఓ డ్రైవర్. అనుముల మండలానికి చెందిన చంద్రకాంత్.. అద్దె బస్సు ఎక్కి హాలియా బస్టాండ్‌కు చేరుకున్నాడు. బస్సు దిగుతుండగానే డ్రైవర్ ముందుకు పోనించాడు. దీంతో బస్సు వెనుక చక్రాలు అతని కాలుపై నుంచి వెళ్లాయి. ఈ ప్రమాదంలో అతని కాలికి తీవ్ర గాయాలయ్యాయి. తోటి ప్రయాణికులు వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేసి అతన్ని స్థానిక ఆస్పత్రి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తోటి ప్రయాణికులు చెబుతున్నారు. -
టూరిస్ట్ బస్సు బోల్తా,ముగ్గురు మృతి
-
విశాఖలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, విశాఖ పట్నం : జిల్లాలోని పాడేరు మండలం వంటలమామిడి ఘట్రోడ్డులో మంగళవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ప్రైవేట్ టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందగా మరో 37 మంది ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి.బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాకినాడకు చెందిన కొంత మంది భక్తులు రాయగడ మజ్జి గౌరమ్మ ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో పాడేరు నుంచి విశాఖ వచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మల్లన్న దర్శనం కోసం వెళ్తుండగా... నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి చెట్టును ఢికొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సున్నిపెంట ఆసుపత్రికి తరలించారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన జగధీశ్వర్‌రెడ్డి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. -
దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా
-
లోయలో పడిన బస్సు
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో గురువారం ఓ ప్రైవేటు బస్సు (హెచ్‌పీ 66–7065) అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 44 మంది మృతి చెందగా, మరో 34 మందికి గాయాలయ్యాయి. జిల్లాలోని బంజార్ తెహ్సిల్ వద్ద ఉన్న ధోత్ మోర్హ్ దగ్గర బస్సు 300 అడుగుల లోతున్న లోయలో పడిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షాలిని అగ్నిహోత్రి తెలిపారు. ఎక్కువ మందిని ఎక్కించడం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నామని బంజార్ పట్వారీ షీతల్ కుమార్ అన్నారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లోతైన విచారణ చేపట్టాల్సిందిగా సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. విషయం తెలుసుకున్న రవాణా శాఖ మంత్రి గోవింద్ కులు జిల్లాకు బయలుదేరారు. ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన వారి కుటుంబాలకు జిల్లా యంత్రాంగం రూ. 50 వేల తక్షణ ఆర్థిక సాయం అందించింది. ప్రభుత్వం రోడ్లను క్షుణ్నంగా పరిశీలించి, అవసరమైన చోట్ల రోడ్డు వెడల్పును పెంచాలని సేవ్ లైఫ్ ఫౌండేషన్ సభ్యుడు పీయూష్ తివారీ డిమాండ్ చేశారు. కాలువలో వ్యాను బోల్తా ముగ్గురు పిల్లల మృతి లక్నో: పెళ్లి నుంచి తిరిగొస్తుండగా 29 మంది ప్రయాణిస్తున్న వ్యాను కాలువలో పల్టీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు పిల్లలు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురి మృత దేహాలను గురువారం వెలికితీశారు. లక్నోకు సమీపంలోని నగ్రాం ప్రాంతంలోని ఇందిరా కెనాల్లో గురువారం తెల్లవారుజామున 3 గంటలకు వ్యాను బోల్తా పడింది. పొరుగున ఉన్న బారాబంకీ జిల్లాలో ఓ పెళ్లినుంచి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని లక్నో జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్‌రాజ్ శర్మ తెలిపారు. ప్రమాదం తరువాత 22 మందిని రక్షించగలిగారు. 5 నుంచి 10 ఏళ్లలోపు ఏడుగురు పిల్లలు గల్లంతవ్వగా, గాలింపుల అనంతరం మూడు మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన నలుగురిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. -
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, అమరావతి బ్యూరో/పెనుగంచిప్రోలు (జగ్గయ్యపేట) : వేగంగా ప్రయాణిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి గోతిలో బోల్తా పడ్డ సంఘటనలో పది మంది చిన్నారులతో సహా 32 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం సోమవారం తెల్లవారుజామున 2.45 గంటలకు కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబ్‌పేట క్రాస్‌రోడ్స్ వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. రమణ టూర్స్ అండ్ ట్రావెల్స్‌కు సంబంధించిన బస్సు యానాం నుంచి ఆదివారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్ బయలుదేరింది. వేగంగా ప్రయాణిస్తూ నవాబ్‌పేట్ క్రాస్‌రోడ్స్ వద్దకు చేరుకోగానే అదుపు తప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న పది అడుగుల గుంతలో పడిపోయింది. బస్సులోని 44 మందిలో డ్రైవర్లు షేక్ వలీ, షేక్ సుభానీ, 10 మంది చిన్నారులు సహా మొత్తం 32 మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ వలీ బస్సులో ఇరుక్కుపోవడంతో గ్యాస్ కట్టర్స్ సాయంతో ఇనుప కడ్డీలు కట్ చేసి బయటకు తీశారు. గాయపడినవారిని 108 వాహనాల్లో నందిగామ ప్రభుత్వాస్పత్రికి, తీవ్రంగా గాయపడినవారిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో చిన్ని (11) పరిస్థితి విషమంగా ఉంది. మరో చిన్నారి కె.వేణు (12)కి ఛాతీలో గాయమైనట్టు గుర్తించి గుంటూరు తరలించారు. ప్రమాద స్థలాన్ని నందిగామ డీఎస్పీ బోస్ తదితరులు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నబీ తెలిపారు. గతంలోనూ ఇక్కడికి కొద్ది దూరంలోనే జేసీ దివాకర్ ట్రావెల్స్ బస్సు గోతిలో పడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. గత నెల 16న తెలంగాణ ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టి ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ స్వల్పంగా గాయపడ్డవారు నందిగామ ఆస్పత్రిలో ధర్నాకుదిగారు. -
సర్కిల్లో చావుకేక
వారంతా యువకులు..జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారు..తమ అభిమాన నేత పవన్‌కల్యాణ్ వస్తున్నారని తెలిసి ఉత్సాహంగా అనంతపురం వెళ్లారు. కవాతులో కదంతొక్కారు. తిరుగు ప్రయాణంలో ఇంకొన్ని నిమిషాల్లో గడిస్తే ఇంటికి చేరుకునే వారు..అయితే డోన్ సమీపంలోని సర్కిల్లో ఓ ప్రైవేట్ బస్సు మృత్యువులా దూసుకొచ్చింది. యువకులు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో యువకుడు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నాడు. కర్నూలు, డోన్ రూరల్: డోన్ పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై యూ.కొత్తపల్లె సర్కిల్ వద్ద ఆదివారం రాత్రి 10గంటల సమయంలో కారును ప్రైవేట్ బస్సు ఢీకొనింది. ఈ ఘటనలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. డోన్ పట్టణానికి చెందిన ఏపీ02ఏజెడ్2786 నంబర్ కారులో డోన్ మండలం ధర్మవరం, వెల్దుర్తి మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన నలుగురు యువకులు అనంతపురం పట్టణంలో ఆదివారం జరిగిన జనసేన కవాత్‌లో పాల్గొన్నారు. తిరిగి డోన్ పట్టణానికి చేరుకునే సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూర్ వైపు వెళుతున్న కేఎల్07సీటీ2708 అనే ప్రైవేట్ ట్రావెల్ బస్సు కొత్తపల్లె సర్కిల్ వద్ద ఢీకొంది. ఈ ఘటనలో గోవర్ధనగిరి గ్రామానికి చెందిన హనుమంతు (31), గోవిందు (29), మౌలాలి(31), ధర్మవరానికి చెందిన మధు (32) అక్కడికక్కడే మృతి చెందారు. డోన్ మండలం కొత్తకోట గ్రామానికి చెందిన కారు డ్రైవర్ మల్లికార్జున తీవ్రంగా గాయపడడంతో పోలీసులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ ఫక్కీరప్ప, డోన్ డీఎస్పీ ఖాధర్ బాషా, సీఐలు కళా వెంకటరమణ, రాజగోపాల్ నాయుడు, ఎస్ఐలు నరేంద్రకుమార్ రెడ్డి, సునీల్ కుమార్‌లు సందర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతులను పోస్టు మార్టం నిమిత్తం డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రిలో ధర్మవరం గ్రామానికి చెందిన మధు కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మధు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. హనుమంతు మీసేవ కార్యాలయంలోæ పనిచేస్తున్నాడు. గోవిందు, మౌలాలి ఐటీఐ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నారు. మృతి చెందిన వారంతా యువకులు కావడంతో ఆ కుటుంబాల్లో విషాదం నిండుకుంది. -
30 మంది జలసమాధి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మండ్య జిల్లాలో శనివారం సుమారు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు నీటి కెనాల్లో పడింది. ఈ దుర్ఘటనలో 30 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతిచెందిన వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. గల్లంతైన వారి వివరాలు తెలియరాలేదు కాబట్టి, మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. బెంగళూరుకు సుమారు 105 కి.మీ దూరంలోని పాండవపుర తాలూకా కానగానమారండి వద్ద మధ్యాహ్నం బస్సు అదుపు తప్పి 12 అడుగుల లోతున్న వీసీ కెనాల్లో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి నీటి నుంచి 30 మృతదేహాల్ని వెలికితీసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుల్లో 8 మంది పురుషులు, 13 మంది మహిళలు, 9 మంది పిల్లలున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది సమీపంలోని వాదెసముద్ర గ్రామానికి చెందినవారని స్థానికులు తెలిపారు. పిల్లలు స్కూలు ముగించుకుని ఇంటికి తిరిగెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్రేన్ సాయంతో బస్సును బయటికి లాగారు. సంఘటనా స్థలం వద్ద భారీగా గుమికూడిన స్థానికులను నియంత్రించడం పోలీసులకు కష్టమైంది. బాధితుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మరుభూమిని తలపించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విలపించిన ముఖ్యమంత్రి ఈ ప్రమాదం గురించి తెలియగానే ముఖ్యమంత్రి కుమారస్వామి అన్ని అధికారిక కార్యక్రమాలు రద్దుచేసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఘటన జరిగిన తీరు తెలుసుకుని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. పరారీలో డ్రైవర్.. కేసు నమోదు ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్, కండక్టర్ పరారయ్యారు. ఈ దుర్ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పాండవపుర పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. ప్రమాదానికి గురైన బస్సు మండ్యకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి పేరు మీద 2001లో రిజిస్టరై ఉంది. 2019 వరకు బస్సుకు బీమా సదుపాయం ఉంది. బస్సు 15 ఏళ్లకు పైబడినదే కాకుండా, ఇప్పటి వరకు 8 మంది యజమానులు మారినట్లు తెలిసింది. ఈ ప్రమాదానికి సంబంధించి స్థానిక ఆర్డీవోను సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈత రావడం వల్లే బతికా.. అదృష్టం కలసిరావడంతో పాటు ఈత నేర్చుకోవడం వల్లే బతికిపోయానని గిరీశ్ అనే ప్రయాణికుడు తెలిపాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు కాలువలో పడి ఉండొచ్చని తెలిపాడు. తన గ్రామానికి చెందిన 15 మంది ఈ ప్రమాదంలో మరణించారన్నాడు. రోహిత్ అనే విద్యార్థిని గిరీశ్ కాపాడినట్లు తెలిసింది. కాలువలో పడిపోయిన బస్సును పైకి లాగుతున్న సహాయక సిబ్బంది కన్నీటిపర్యంతమైన సీఎం కుమారస్వామి -
తప్పిన పెను ప్రమాదం
హిందూపురం రూరల్ : ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయిన ప్రైవేట్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న రేకుల షెడ్డులోకి (దుకాణం) దూసుకుపోయింది. ఈ సంఘటన హిందూపురం మండలం మణేసముద్రం వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భారతి (సీపీసీ) ప్రైవేట్ బస్సు పెనుకొండ నుంచి బెంగుళూరుకు వెళ్తోంది. ఈ క్రమంలో మణేసముద్రం వద్ద ద్విచక్రవాహనం అడ్డు రావడంతో దాన్ని తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న రేకుల షెడ్డులోకి దూసుకెళ్లింది. అదష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే బస్సులో ప్రయాణిస్తున్న నరసమ్మ (పెనుకొండ), నారాయణప్ప (గౌరీబిదనూరు)కు తలకు గాయాలయ్యాయి. వారిని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ హెడ్‌కానిస్టేబుల్ ఆదినారాయణ తెలిపారు. -
త్రిపురాంతకంలో బస్సు బోల్తా
-
త్రిపురాంతకంలో బస్సు బోల్తా: 15 మందికి గాయాలు
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో కొండపైన కొలువైన త్రిపురాంతకేశ్వర స్వామి, బాల త్రిపురం సుందరీ దేవిలను దర్శించుకునేందుకు కొండపైకి వెళ్తున్న ప్రైవేట్ బస్సు శనివారం బోల్తా పడింది. ఆ ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ప్రయాణికులను బస్సు నుంచి బయటకు తీశారు. అనంతరం 108కు సమాచారం అందించారు. ఆ వాహనంలో క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.