
సాక్షి, విశాఖ పట్నం : జిల్లాలోని పాడేరు మండలం వంటలమామిడి ఘట్‌రోడ్డులో మంగళవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ప్రైవేట్ టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందగా మరో 37 మంది ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి.బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాకినాడకు చెందిన కొంత మంది భక్తులు రాయగడ మజ్జి గౌరమ్మ ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో పాడేరు నుంచి విశాఖ వచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
మల్లన్న దర్శనం కోసం వెళ్తుండగా...
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి చెట్టును ఢికొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సున్నిపెంట ఆసుపత్రికి తరలించారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన జగధీశ్వర్‌రెడ్డి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment