తప్పిన పెను ప్రమాదం | private bus accident in manesamudram | Sakshi
Sakshi News home page

తప్పిన పెను ప్రమాదం

Published Wed, Sep 21 2016 11:13 PM | Last Updated on Sat, Aug 25 2018 5:39 PM

తప్పిన పెను ప్రమాదం - Sakshi

తప్పిన పెను ప్రమాదం

హిందూపురం రూరల్‌ : ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయిన ప్రైవేట్‌ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న రేకుల షెడ్డులోకి (దుకాణం) దూసుకుపోయింది. ఈ సంఘటన హిందూపురం మండలం మణేసముద్రం వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగింది. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భారతి (సీపీసీ) ప్రైవేట్‌ బస్సు పెనుకొండ నుంచి బెంగుళూరుకు వెళ్తోంది. ఈ క్రమంలో మణేసముద్రం వద్ద ద్విచక్రవాహనం అడ్డు రావడంతో దాన్ని తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న రేకుల షెడ్డులోకి దూసుకెళ్లింది.

అదష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే బస్సులో ప్రయాణిస్తున్న నరసమ్మ (పెనుకొండ), నారాయణప్ప (గౌరీబిదనూరు)కు తలకు గాయాలయ్యాయి. వారిని  హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఆదినారాయణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement