త్రిపురాంతకంలో బస్సు బోల్తా | People injured in private bus accident | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 9 2013 4:34 PM | Last Updated on Wed, Mar 20 2024 5:06 PM

ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో కొండపైన కొలువైన త్రిపురాంతకేశ్వర స్వామి, బాల త్రిపురం సుందరీ దేవిలను దర్శించుకునేందుకు కొండపైకి వెళ్తున్న ప్రైవేట్ బస్సు శనివారం బోల్తా పడింది. ఆ ఘటనలో ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ప్రయాణికులను బస్సు నుంచి బయటకు తీశారు. అనంతరం 108కు సమాచారం అందించారు. ఆ వాహనంలో క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement