అగ్నిప్రమాదంలో దగ్ధమవుతున్న పూరిల్లు ,కాలి బూడిదైన రాధమ్మ మృతదేహం
ముత్తుకూరు: ముత్తుకూరు ఇందిరమ్మ కాలనీలో ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన అగ్నిప్రమాదంలో ఓ పూరిల్లు దగ్ధమైంది. అందులో నిద్రపోతున్న ఓ మహిళ సజీవ దహనమైంది. ఎస్సై సాంబశివరావు కథనం మేరకు.. భర్త లేని ఉప్పల రాధమ్మ (40) ఇందిరమ్మ కాలనీలోని పూరింట్లో పోర్టులో పనిచేసే ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఆమెకు కొడుకు, కూతురు ఉండగా, వీరు దూరంగా ఉంటున్నారు. వరుసకు అత్త అయిన ఈశ్వరమ్మ కూడా రాధమ్మతో ఉంటుంది. ఇద్దరూ మద్యానికి అలవాటు పడ్డారు. రెండు రోజుల క్రితం వచ్చిన వితంతు పింఛన్ డబ్బుతో రాధమ్మ మద్యం తాగి, ఇంట్లో పడుకొంది. రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో రేగిన మంటలు పూరింటిని పూర్తిగా దహించాయి. సామగ్రి అంతా పూర్తిగా కాలిపోయింది. నిద్రిస్తున్న రాధమ్మ కూడా సజీవ దహనం అయింది.
రాధమ్మ మృతిపై అనుమానాలు?
అయితే అత్త ఈశ్వరమ్మ, రాధమ్మ మధ్య గొడవలు ఉన్నాయి. మద్యం మత్తులో రాధమ్మ నిద్రిస్తుండగా, ఈశ్వరమ్మ ఇంటి తలుపులకు గొళ్లెం పెట్టి, నిప్పు అంటించినట్టు స్థానికులు కొందరు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ఆమెను విద్యుత్ స్తంభానికి కట్టేసి, దేహశుద్ధి చేశారు. అనంతరం పో లీసులు ఈమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇదంతా కట్టు కథ అని ఎస్సై సాంబశివరావు అన్నా రు. నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి పో స్టుమార్టం నిర్వహించి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment