
తిమ్మప్ప
తిరువొత్తియూరు (తమిళనాడు): చేతులు, కాళ్లు కట్టేసి మహిళను సజీవ దహనం చేసిన చెన్నై కార్పొరేషన్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై నోలంబోర్ బైపాస్ రోడ్డులో మంగళవారం సాయంత్రం స్థానికులు ఇచ్చిన సమాచారంతో కాలుతున్న మహిళ మృతదేహాన్ని నోలంబూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మృతురాలు చెన్నై వానగరం శక్తిసాయి రాంనగర్ కు చెందిన మురుగన్ భార్య రేవతి (35)గా తేలింది. ఆమె చెన్నై కార్పొరేషన్ వలసరవాక్కం మండల కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్నారు.
అక్కడే పనిచేస్తున్న బ్యాటరీ వాహనం డ్రైవర్ తెలంగాణకు చెందిన తిమ్మప్ప (24)తో ఆమెకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ నేపథ్యంలో 16వ తేదీన రేవతి వద్ద ఐదు సవర్ల బంగారు నగ తీసుకున్నాడు. 22వ తేదీన ఇద్దరూ నిర్మానుష్య ప్రాంతంలో కలుసుకున్నారు. ఆ సమయంలో నగ గురించి రేవతి అతన్ని కోరింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆగ్రహం చెందిన తిమ్మప్ప ఆమె చున్నీతో చేతులు, కాళ్లు కట్టేసి కత్తితో గొంతు కోశాడు. స్పృహతప్పి పడి న రేవతిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పారిపోయాడు. తిమ్మప్పను గురువారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు.
చదవండి: టిక్ టాక్ స్టార్‌కు జైలు శిక్ష.. కాపాడమంటూ వేడుకోలు
రాత్రిళ్లు కల్లోకి వచ్చి నాపై అత్యాచారం చేస్తున్నాడు
Comments
Please login to add a commentAdd a comment