వివరాలు సేకరిస్తున్న పోలీసులు, సౌమ్య (ఫైల్)
అమీర్‌పేట: ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సోమ వారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూరులో స్థిరపడిన విశాఖపట్నానికి చెందిన పున్నారావు, ర మణి దంపతుల కుమార్తె సౌమ్యకు (25) అదే ప్రాంతానికి చెందిన సీతారామారావు, రత్నమాంబ దంపతుల కుమారుడు నాగభూషణంతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఏడాది కిత్రం నాగభూషణం భార్య సౌమ్య, కుమారుడు సాయి దత్తాత్రేయతో కలిసి నగరానికి వచ్చి ఎర్రగడ్డ , నందనగర్‌లోని సూరజ్ ఆర్కేడ్స్ ఫ్లాట్ నెంబర్ 104లో ఉంటున్నాడు. యూసుఫ్‌గూడలోని హైదరాబాద్ మెట్రో కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న నాగభూషణం సోమవారం రాత్రి 8.30 ప్రాంతంలో నైట్ డ్యూటీకి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లి పోయాడు. సౌమ్య తన కుమారుడితో కలిసి ఇంట్లో పడుకుంది.
అర్ధరాత్రి ఒంటిగంట ప్రాం తంలో ఫ్లాట్‌లో నుంచి దట్టమైన పొగలు వస్తుండటాన్ని గుర్తించిన పక్కింట్లో ఉండే విశాల్ అ క్కడికి వెళ్లి చూడగా తలుపులు బయ టి నుంచి గడియపెట్టి ఉన్నాయి. స్థానికుల సహాయంతో తలుపులు తెరిచి చూడగా సౌమ్య మంటల్లో కాలిపోతూ కనిపించింది. కొద్ది దూరంలో ఏడుస్తూ ఉన్న ఆమె కుమారుడిని రక్షించి పోలీసులకు సమాచారం అందజేశారు. అపార్ట్‌మెం ట్ వాసులు అతికష్టంపై మంటలను ఆర్పివేశా రు. కాగా సౌమ్య శరీరంపై నువ్వుల నూనె పోసి నిప్పటించడమేగాక, తప్పించుకునేందుకు వీలులేకుండా బయటి నుంచి గడియ పెట్టి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృ తురాలి ఒంటిపై మూడు కత్తి పోట్లు ఉన్నాయని, అరవకుండగా గొంతు నులిమి గదిలో ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు ఉన్నట్లు ఇన్స్‌పెక్టర్ తెలిపారు. బాత్‌రూం ఫ్లెష్‌లో పడి ఉన్న ఓ సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘ టనా స్థలాన్ని పశ్చిమ మండలం డీసీపీ, పంజగుట్ట ఏసీపీ సందర్శించారు.
అల్లుడిపై అత్తామామ అనుమానం
సౌమ్య హత్యపై అనేక అనుమానాలు వ్యక్తవుతున్నాయి. భర్త నాగభూషణంపై సౌమ్య తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్త నైట్ డ్యూటీకి వెళితే బయటి వ్యక్తులు ఇంటికి వచ్చే అవకాశం ఉండదని, లేదా తనకు తెలిసిన వ్యక్తులతో హత్య చేయించి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. అపార్ట్‌మెంట్ పరిసరాల్లో సీసీ కెమెరాలు లేనందున వివరాలు వెల్లడించలేమని పోలీసులు తెలిపారు. సౌమ్య తండ్రి పున్నారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌పెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment