knife attack
-
నిలకడగా సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం
ముంబై: బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సైఫ్ అలీ ఖాన్(54)పై గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో నటుడికి తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో సంపన్నులు నివాసం ఉండే బాంద్రా వెస్ట్ ప్రాంతంలో ఉన్న సద్గురు శరణ్ భవనం 12వ అంతస్తులో సైఫ్ సొంత ఫ్లాట్‌లో గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో ఇంట్లో సైఫ్ భార్య కరీనాకపూర్ ఖాన్‌తో కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. దుండగుడి దాడిలో గాయపడి రక్తమోడుతున్న సైఫ్‌ను ఆయన పెద్ద కుమారుడు ఇబ్రహీం, పనిమనుషులు వెంటనే ఆటోలో సమీపంలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించడంతో ప్రాణాపాయం తప్పింది. రెండు బలమైన కత్తిపోట్లు సహా మొత్తం ఆరు చోట్ల గాయాలయ్యాయని డాక్టర్లు చెప్పారు. వెన్నుముక నుంచి 2.5 అంగుళాల కత్తి మొనను ఆపరేషన్ ద్వారా తొలగించారు. సైఫ్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు. సైఫ్‌పై దాడిపట్ల బాలీవుడ్ నటులతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కత్తితో దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండాపోయిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రత్యేక బృందాలతో గాలింపు సైఫ్‌పై దాడి ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బాంద్రా పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. రాత్రిపూట ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడడంతో సెక్షన్ 331(4), సెక్షన్ 311 కింద కేసు పెట్టారు. సాక్ష్యాధారాల కోసం సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. సైఫ్‌పై దాడి తర్వాత దుండగుడు మెట్లు దిగి పారిపోయినట్లు గుర్తించారు. వీపున తగిలించుకున్న ఓ బ్యాగ్‌తో అతడు పారిపోతున్న దృశ్యాలు ఆరో అంతస్తులో తెల్లవారుజామున 2.33 గంటల సమయంలో రికార్డయ్యాయి. స్థానికంగా మొబైల్ ఫోన్ల డేటాను పోలీసులు వడపోశారు. దుండుగుడి ఆచూకీ కనిపెట్టడానికి పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతడి ఫోటోను విడుదల చేశారు. దుండగుడి దాడిలో సైఫ్ పనిమనిషికి సైతం గాయాలయ్యాయి. దుండగుడితో జరిగిన పెనుగులాటలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. బాధితురాలి నుంచి పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. స్టేట్మెంట్ రికార్డు చేశారు. అసలేం జరిగింది? దొంగతనం కోసమే దుండగుడు సైఫ్ ఫ్లాట్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. సైఫ్, కరీనా దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి తమ ఫ్లాట్‌లో నిద్రిస్తున్న సమయంలో అలికిడి వినిపించింది. అప్పటికే సైఫ్ చిన్నకుమారుడు జహంగీర్ గదిలో మాటువేసిన దుండగుడి కదలికలను పనిమనిషి గమనించి బిగ్గరగా కేకలు వేసింది. అలారం మోగించింది. దాంతో అతడు ఆమెపై కత్తి దూశాడు. ఈ శబ్దాలు వినిపించి నిద్రనుంచి మేల్కొన్న సైఫ్ అలీ ఖాన్ ఆ గదిలోకి వచ్చి దుండగుడిని అడ్డుకొనేందుకు ప్రయతి్నంచాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చాలాసేపు పెనుగులాట జరిగింది. వాగ్వాదం చోటుచేసుకుంది. సైఫ్‌ను దుండగుడు కత్తితో విచక్షణారహితంగా పొడిచి తక్షణమే మెట్ల మార్గం గుండా పరారయ్యాడు. ఫైర్ ఎగ్జిట్ ద్వారా అతడు సైఫ్ ఫ్లాట్‌లో ప్రవేశించినట్లు పోలీసులు చెప్పారు. సైఫ్ కుమారుడి గదిలో నాలుగు గంటలపాటు నిశ్శబ్దంగా నక్కి ఉండి, అవకాశం కోసం ఎదురు చూశాడని, అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగతనానికి ప్రయతి్నంచాడని తెలిపారు. కారు అందుబాటులో లేకపోవడంతో సైఫ్‌ను ఆయన కుమారుడు, సహాయకులు ఆటోలో ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాధితుడికి న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే, కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ లీనా జైన్, అనస్థీషియాలజిస్టు డాక్టర్ నిషా గాంధీ శస్త్రచికిత్స చేశారు. ఆరు చోట్ల గాయాలైనట్లు తెలిపారు. మెడ, వెన్నుముక భాగంలో సర్జరీ చేశారు. ఎడమ చెయ్యి, మెడ కుడి భాగంలో రెండు లోతైన గాయాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలో పూర్తిస్థాయిలో కోలుకుంటారని వెల్లడించారు. నిప్పులు చెరిగిన ప్రతిపక్షాలు మహారాష్ట్రలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణిస్తున్నాయని ఎన్సీపీ(శరద్ పవార్ అధ్యక్షుడు శరద్ పవార్ ఆరోపించారు. బాంద్రాలో ఇటీవలే ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడని, ఇప్పుడు సైఫ్‌పై దాడి జరిగిందని చెప్పారు. ఇవన్నీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. హోంశాఖ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్దే ఉందని, శాంతిభద్రతల పరిరక్షణపై ఇకనైనా దృష్టి పెట్టాలని సూచించారు. ముంబైలో ఎవరికీ రక్షణ లేదని శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. -
బీజింగ్: స్కూలులో కత్తితో ఉన్మాది దాడి.. 8 మంది మృతి
బీజింగ్: చైనాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక స్కూలులోకి చొరబడిన ఉన్మాది కత్తితో దాడికి తెగబడిన ఘటనలో 8 మంది మృతి చెందారు. ఇదే ఘటనలో 17 మంది గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను నేరాన్ని అంగీకరించాడు.ఈ ఘటన తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఓ ఉన్మాది ఒకేషనల్ స్కూల్లోకి ప్రవేశించి, అక్కడున్నవారిని విచక్షణా రహితంగా కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 17మంది గాయపడ్డారు. యిక్సింగ్ నగరంలోని వుక్సీ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీలో ఈ దాడి జరిగింది.రాష్ట్ర వార్తా సంస్థ ‘జిన్హువా’ తెలిపిన వివరాల ప్రకారం ఈ దారుణానికి పాల్పడిన 21 ఏళ్ల నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇంటర్న్‌షిప్ జీతంపై అసంతృప్తితో ఉన్నాడని, దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, స్కూల్లోకి ప్రవేశించి, కత్తితో దాడికి తెగబడ్డాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఎన్నికల ప్రచారంలో నటుడు గోవిందాకు అస్వస్థత -
స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరుల దౌర్జన్యం
సాక్షి,అనకాపల్లి: రాష్ట్రంలో కూటమి నేతలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. తాము ఏం చేసినా చెల్లుతుంది అనే రీతిలో దాడులకు తెగబడుతున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ నేత కర్రి శ్రీనివాసరావుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరుడు పప్పల అప్పలనాయుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో శ్రీనివాసరావు తప్పించుకోగా.. ఆయన సహచరుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడితో అప్రమత్తమైన బాధితుడి కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స కోసం నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అయ్యన్నపాత్రుడి అనుచరుల దాడిపై సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ బాధితుడిని పరామర్శించారు. సర్కార్ గూండాగిరీ.. కి డ్నాపులు.. అక్రమ కేసులు.. దాడులు -
జర్మనీలో కత్తితో దాడి.. ముగ్గురి మృతి
బెర్లిన్: పశ్చిమ జర్మనీలోని సోలింగెన్ నగరంలో జరిగిన కత్తిపోట్ల ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. శుక్రవారం రాత్రి సోలింగెన్ నగర 650వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఉత్సవాల్లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి పులువురిపై విక్షణారహితంగా కత్తితో దాడి చేశాడని పేర్కొన్నారు. ఈ దాడికి పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ‘ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటనలో పలువరు గాయపడ్డారు. చికిత్స పొందుతున్న వారందరూ కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’అని సోలింగెన్ మేయర్ టిమ్-ఒలివర్ కుర్జ్బాచ్ ఒక ప్రకటనలో తెలిపారు. జర్మనీలో ఘోరమైన కత్తిపోట్లు, కాల్పులు తరచూ జరుగుతుంటాయి. ఇక.. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు కోసం ప్రత్యేక టీంలో గాలిస్తున్నారు. సోలింగెన్ పట్టణం నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియా రాష్ట్రంలో ఉంది. నెదర్లాండ్స్ సరిహద్దులో ఉన్న అత్యధిక జనాభా నగరం సోలింగెన్. -
వరంగల్ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం
వరంగల్ జిల్లాలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించిన అమ్మాయి కుటుంబంపై విచక్షణా రహితంగా తల్వార్‌తో దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా చంద్రరావు పేట మండలం 16 చింతల తండా జరిగింది. ఈ దాడిలో యువతి తల్లి, తండ్రులు మృతి చెందారు. యువతి, ఆమె తమ్ముడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.పోలీసుల కథనం ప్రకారం.. గూడూరు మండలం గుండెంగకి చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్నీ 16 చింతల తండా దీపిక ప్రేమించుకున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యులకు చెప్పా పెట్టకుండా ఇంట్లోనుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన రెండు నెలలకే దీపిక, నాగరాజుల మధ్య మనస్పర్దలు తలెత్తడంతో పోలీసులు, పెద్దల సమక్షంలో విడిపోయారు. ఈ క్రమంలో నిందితుడు ముందస్తు కుట్రలో భాగంగా బుధవారం అర్ధరాత్రి 1:35 నిమిషాల సమయంలో తల్వార్‌తో దీపిక ఇంటికి వచ్చాడు. ఇంటి బయట గాడ నిద్రలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో అమ్మాయి తల్లి బానోతు సుగుణ అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి బానోతు శ్రీనివాస్ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.నిందితుడు దాడితో తీవ్రగాయాల పాలైన దీపిక, ఆమె తమ్ముడు మదన్‌లు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడి అనంతరం నిందితుడు పరారాయ్యాడు.నిందితుడి దాడితో స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు నాగరాజు కోసం బృందాలుగా విడిపోయి పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. -
కరీంనగర్లో ప్రేమోన్మాది ఘాతుకం
కొత్తపల్లి(కరీంనగర్): ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడిచేసి పరారైన ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి కట్టేమిషన్ ఏరియాలో గురువారం సాయంత్రం కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. కొత్తపల్లి గ్రామానికి చెందిన బొద్దుల సాయి, ఓ యువతి ఎదురెదురు ఇంట్లో ఉంటున్నారు. సాయి ఇసుక క్వారీలో ఉద్యోగం చేస్తుండగా ఎమ్మెస్సీ పూర్తిచేసిన యువతి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతోంది. ఆమెను నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాంటూ సాయి వేధిస్తున్నాడు. విషయం తెలిసిన పెద్దలు సాయిని మందలించారు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూడా నిర్వహించారు. తర్వాత కొన్నిరోజులు బాగానే ఉన్న సాయి ఇటీవల మళ్లీ ఆ యువతిని వేధించడం ప్రారంభించాడు. పెళ్లి చేసుకుంటానని యువతి తల్లిదండ్రులకు మెసేజ్‌లు పంపాడు. ఇంట్లోకి చొరబడి.. గురువారం యువతి తండ్రి ఆడెపు వీరేశం బట్ట లు అమ్మేందుకు రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటకు వెళ్లాడు. తల్లి స్థానికంగా కిరాణాదుకాణంలో సరుకులు అమ్ముతోంది. ఇదే సమయంలో సాయి ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న యువతిపై దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి పన్ను విరిగి చేతికి గాయమైంది. అంతటితో ఆగ కుండా కత్తితో గొంతుకోసే ప్రయత్నం చేశాడు. ఆమె కేక లు వేయడంతో చుట్టుపక్కల వారు చేరుకునేసరికి పరారయ్యాడు. వెంటనే స్థానికులు యువతిని చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి పరారైన యువకుడి కోసం గాలిస్తున్నట్లు వివరించారు. -
చంపితే ఎలా ఉంటుందో చూసేందుకు... నిజంగానే మర్డర్ చేసింది!
ఆమె పేరు జుంగ్ యూ జుంగ్. వయసు 23 ఏళ్లు. ఉండేది దక్షిణ కొరియాలోని బుసాన్‌లో. నేరాలు, ఘోరాలంటే మహా పిచ్చి. ఎంతగా అంటే, టీవీల్లో రియల్ క్రైమ్ స్టోరీలను విపరీతంగా చూసేది. క్రైం నవలలు కూడా తెగ చదివేది. వాటి స్ఫూర్తితో, హత్య చేస్తే ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి నిజంగానే ఘోరానికి తెగబడింది. హత్య ఎలా చేయాలో, శవాన్ని ఎలా మాయం చేయాలో తెలుసుకునేందుకు ఇంటర్నెట్లో నెలల పాటు సెర్చ్ చేసి మరీ రంగంలోకి దిగింది. ముక్కూ మొహం తెలియని ఓ అమాయక టీచర్‌ను విచక్షణారహితంగా పదేపదే పొడిచి పొట్టన పెట్టుకుంది! చివరికి శవా న్ని మాయం చేసే క్రమంలో అద్దెకు తీసుకున్న ట్యాక్సీ డ్రైవర్ పోలీసులకు ఉప్పందించడంతో కటకటాల పాలైంది! నేరాల సంఖ్య తక్కువగా ఉండే దక్షిణ కొరియా లో ఈ ఉదంతం సంచలనం సృష్టించింది... విద్యార్థి తల్లిగా నమ్మించి... జుంగ్ ఓ నిరుద్యోగి. తాతతో కలిసి నివసించేది. చేసేందుకు పనేమీ లేకపోవడంతో క్రైం ప్రోగ్రాంలు, సంబంధిత రియాల్టీ షోలకు, క్రైం నవలలకు బానిసగా మారింది. హత్యానుభవం ఎలా ఉంటుందో చూడాలని నిర్ణయించుకున్నాక సంబంధిత సమాచారం కోసం ఇంటర్నెట్లో వెదికింది. అనంతరం తగిన వ్యక్తి కోసం ట్యూటరింగ్ యాప్‌ల్లో నెలల పాటు వేట సాగించింది. హోం ట్యూషన్లు చెబుతారా అంటూ కనీసం 50 మందిని సంప్రదించింది. చివరికి గత మే నెలలో ఒక 26 ఏళ్ల మహిళను ఎంచుకుంది. తనను తాను ఓ హైస్కూలు స్టూడెంట్ తల్లిగా పరిచయం చేసుకుంది. తన బిడ్డకు ఇంగ్లిష్ పాఠాలు చెప్పాలంటూ నమ్మించింది. అందుకామె సమ్మతించాక ఆన్లైన్లో ఆర్డర్ చేసి స్కూల్ యూనిఫాం కూడా తెప్పించుకుంది! అది వేసుకుని ట్యూటర్ ఇంటికి వెళ్లింది. ఆమె తలుపు తీసి లోనికి రానివ్వడమే ఆలస్యం, వెంట తీసుకెళ్లిన కత్తితో పదేపదే దాడికి దిగింది. ఏకంగా 100 సార్లకు పైగా పొడిచింది! చనిపోయిన తర్వాత కూడా దాడి ఆపలేదట! ఆ తర్వాత తాపీగా మృతదేహాన్ని ముక్కలుగా నరికింది. వాటిని సూట్‌కేస్‌లో కుక్కి, ఓ ట్యాక్సీలో తీసుకెళ్లి దూరంలో నది దగ్గర పడేసి చేతులు దులుపుకుంది. రక్తమోడుతున్న సూట్‌కేసును ఓ అమ్మాయి అడవిలో పడేసిందంటూ ట్యాక్సీ డ్రైవర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. జుంగ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం యువకుడి మృతి
సాక్షి, ఖమ్మం: అమెరికాలో దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం యువకుడు వరుణ్ తేజ(24) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ మేరకు కుటుంబసభ్యులకు సమాచారం అధికారులు సమాచారం అందించారు.. వరుణ్ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా ఖమ్మం జిల్లా మామిళ్లగూడెంకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పుచ్చా రామ్మూర్తి కుమారుడు వరుణ్ తేజ్ 2022 ఆగస్టులో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ ఇండియానా రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతూ పార్ట్‌టైం జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ 31న వాల్పరైసో నగరంలో జిమ్ నుంచి బయటకు వస్తున్న వరుణ్‌పై అకస్మాత్తుగా ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన వరుణ్ రక్తపు మడుగులో పడిపోగా స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటి నుంచి వరుణ్ పరిస్థితి విషమంగానే ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచాడు. నిందితుడు ఆండ్రేడ్ జోర్డాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చదవండి: తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు -
ప్రతిపక్షాలవి చిల్లర రాజకీయాలు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కత్తిదాడికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉంటే ప్రతిపక్ష నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. మంగళవారం ఆయన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడి ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయనతో కొద్దిసేపు ముచ్చటించి ధైర్యం చెప్పారు. అనంతరం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ.. కత్తితో పొడవడంతో కత్తి 3 అంగుళాలు లోపలికి వెళ్లగా 4 చోట్ల చిన్నపేగుకు గాయమైందన్నారు. 15 సెం.మీ. చిన్న పేగును తొలగించి, మూడున్నర గంటలపాటు వైద్యులు శస్త్ర చికిత్స చేశారని చెప్పారు. ఇటువంటి సమయంలో సీనియర్ నాయకులు కూడా దీన్ని అపహాస్యం చేసేలా కోడి కత్తి అంటూ మాట్లాడటం దురదృష్టకరమన్నారు. దివాళాకోరు రాజకీయాలు చేస్తున్న పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వ్యక్తులను నిర్మూలించి రాజకీయాలు చేయాలనుకోవడం తెలంగాణలో ఎప్పుడూ లేదని, తాము అధికారంలో ఉన్న ఏ రోజూ పగతో వ్యవహరించలేదన్నారు. పగతో రాజకీయాలు చేస్తే గతంలో హౌజింగ్ స్కీముల్లో స్కాములు చేసిన కాంగ్రెస్ నాయకులు, ఓటుకు నోటుకు కేసులో దొరికిన వాళ్లు ఎప్పుడో జైలుకు వెళ్లేవారని చెప్పారు. రాష్ట్రంలో ఏదోరకంగా అల్లర్లు చేయాలని, ప్రజలను భయబ్రాంతులకు గురిచేయాలని ప్రతిపక్ష నాయకులు చూస్తున్నారని, ప్రజలు వీటిని గమనించాలని సూచించారు. ప్రచారంలో ఉన్న అభ్యర్థులపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, అభ్యర్థులకు భద్రత పెంచాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ కేసులో కుట్రకోణం రెండు మూడు రోజుల్లో బయటకు వస్తుందని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించిన వారిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. మరో నాలుగు రోజులు ఐసీయూలో మరో నాలుగు రోజుల పాటు ప్రభాకర్‌రెడ్డిని ఐసీయూలోనే ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుందని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి హెడ్ డాక్టర్ విజయ్‌కుమార్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు ప్రసాద్‌బాబు తెలిపారు. ప్రస్తుతం ఆయన స్పృహలోనే ఉన్నాడని, మరో మూడు నాలుగు రోజులు గడిస్తేనే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందో లేదో చెప్పగలమన్నారు. -
దాడికి కారణమేంటి?
మిరుదొడ్డి (దుబ్బాక)/ సాక్షి, సిద్దిపేట: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తి దాడికి కారణాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. మిరుదొడ్డి మండలం చెప్యాల కు చెందిన నిందితుడు గటాని రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పలు యూట్యూబ్ చానళ్ల లో పనిచేసిన రాజు వైఖరి తొలి నుంచీ వివాదాస్పదమని.. విలేకరి ముసుగులో దందాలకు పాల్పడేవాడని స్థానికులు చెప్తున్నారు. కలప రవాణా వాహనాలను ఆపి వసూళ్లకు పాల్పడటం, కల్లు డిపో, దుకాణాల యజమానుల నుంచి చందాలు వసూలు చేయడం వంటివి చేసేవాడని.. ఈ ఆగడాలతో సహనం నశించిన వ్యాపారులు గతంలో రాజుపై దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయని అంటున్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజు.. జిల్లా ముఖ్య నాయకులతో తిరిగేవాడని చెప్తున్నారు. అయితే ఎంపీపై దాడి చేసేంత పగ ఏమిటన్నది అంతుపట్టడం లేదని అంటున్నారు. అయితే.. దళితబంధు రాకపోవడం, ఇంటి స్థలం ఇవ్వకపోవడంతో ఎంపీపై కక్షగట్టి దాడి చేసి ఉంటాడని ప్రచారం జరుగుతోంది. అధికారులు ఇటీవల మిరుదొడ్డి మండల విలేకరులకు ఇక్కడి చెప్యాల క్రాస్‌రోడ్డులో ఇళ్ల స్థలాలు కేటాయించారు. అందులో తనకూ స్థలం కేటాయించాలని రాజు కోరగా.. ఎంపీతో చెప్పించాలని అధికారులు సూచించినట్టు తెలిసింది. రాజు పలుమార్లు ఈ విషయాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఎన్నికల కోడ్ ఉన్నందున ఇప్పుడు సాధ్యం కాదని చెప్పినట్టు సమాచారం. దీనికితోడు దళితబంధుకు ఎంపికైనవారి జాబితాలో తన పేరు లేకపోవడంతోనూ రాజు ఆగ్రహించాడని, ఇవన్నీ మనసులో పెట్టుకుని, దాడి చేసి ఉంటాడని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. -
ఆగంతకుడి దాడి, రక్తసిక్తమైన నటుడు.. వీడియో వైరల్
కాలిఫోర్నియా: జోధా అక్బర్సహా పలు హిందీ, పంజాబీ సినిమాల్లో నటించిన యువ పంజాబీ నటుడు అమన్ ధలివాల్‌పై అమెరికాలో ఒక ఆగంతకుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. ఛాతీ, మెడ, తల, భుజంపై పలు చోట్ల తీవ్రంగా గాయపరిచాడు. ఘటన తర్వాత అమన్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాణాపాయం ఏమీలేదని వైద్యులు తెలిపినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. గురువారం ఉదయం కాలిఫోర్నియా నగరంలోని గ్రాండ్ ఓక్స్ ప్రాంతంలోని ఒక జిమ్‌లో కసరత్తు చేస్తున్న అమన్పైకి ఒక ఆగంతకుడు కత్తితో దాడి చేసి బందీగా పట్టుకున్నాడు. తాగడానికి నీళ్లు కావాలని అక్కడి వారిని ఆగంతకుడు బెదిరించిన సమయంలో ఒక్కసారిగా అమన్ ఎదురుతిరిగి అతడిని పట్టుకోబోయాడు. ఈ ఘర్షణలో అమన్ గాయాలపాలై రక్తసిక్తమయ్యాడు. వెంటనే అప్రమత్తమైన జిమ్‌లోని తోటివారు ఆ ఆగంతకుడిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. అమన్‌పై ఆగంతకుడు దాడి దృశ్యం ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://twitter.com/ShekharPujari2/status/1636306115502931968 -
వివాహేతర సంబంధం తెలిసి భర్త మందలించాడు.. ప్రియుడితో కలిసి..
సాక్షి, చెన్నై(తిరువొత్తియూరు): చెన్నై ఆవడిలో ప్రియురాలి భర్తను కత్తితో దాడి చేసి పారిపోయిన ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టాభిరామ్ సత్రం కరుమారి అమ్మన్ ఆలయ వీధికి చెందిన కార్తీక్ (35) అదే ప్రాంతంలో చికెన్ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఇతని భార్య ఇలాకియా (30). వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంబత్తూరులో ఉన్న ఒక ఎక్స్‌పోర్టు కంపెనీలో ఇలక్య పని చేస్తోంది. ఇదే కంపెనీలో పనిచేస్తున్న శ్రీనివాసన్ (32)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న కార్తీక్ భార్యను మందలించాడు. దీంతో తన భర్తను హత్య చేయడానికి శ్రీనివాసన్‌తో కలిసి పథకం వేసినట్లు తెలిసింది. సోమవారం ఇంటల్లో ఉన్న కార్తీక్‌పై శ్రీనివాసన్, ఇలక్య కత్తితో దాడి చేశారు. కేకలు విన్న స్థానికులు కార్తీక్‌ను వెంటనే ఆవడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఫిర్యాదు మేరకు పట్టాభిరామం పోలీసులు కేసు నమోదు చేసి భార్య ఇలక్యను విచారణ చేస్తున్నారు. పరారీలో ఉన్న శ్రీనివాసన్ కోసం గాలిస్తున్నారు. చదవండి: (కీచక కరస్పాండెంట్.. ప్లస్‌టూ విద్యార్థినులతో..) -
భార్యను కత్తితో నరికి... మృతదేహానికి పూలమాల వేసి...
తెనాలిరూరల్: ఓ వ్యక్తి తన భార్యను బతికున్నంతకాలం అనుమానంతో వేధించాడు. చివరికి ఆమెను కత్తితో నరికి చంపేశాడు. రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహంపై మాత్రం పూలు, పూలమాలలు ఉంచి నివాళి అర్పించాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. గుంటూరు జిల్లా తెనాలిలో ఈ ఘటన గురువారం జరిగింది. తెనాలికి చెందిన స్వాతి (38)కి, ప్రకాశం జిల్లా పుల్లలచెరువుకు చెందిన లారీ డ్రైవర్ కాకర్ల వెంకట కోటయ్యతో సుమారు 17 ఏళ్ల కిందట వివాహమైంది. తెనాలిలో నివాసం ఉంటున్న వీరికి ఇంటర్, తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. గతంలో స్వాతి పట్టణంలోని ఓ బ్యూటీ పార్లర్లో పని చేస్తూ అక్కడే బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంది. తొలుత తెనాలిలోని పాండురంగపేటలో ఉన్న వీరు ఇటీవల నాజరుపేటలో మరో అద్దె ఇంట్లో చేరారు. ప్రస్తుతం స్వాతి నందులపేట ఘంటావారివీధిలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో స్వాతికి మరో యువకుడితో అక్రమ సంబంధం ఉందని వెంకట కోటయ్యకు అనుమానం ఏర్పడింది. భార్యతో తరచూ గొడవపడేవాడు. ఇటీవల ఇద్దరికీ ఘర్షణ జరగగా, స్వాతి పుట్టింటికి వెళ్లి పోయింది. కొద్దిరోజుల కిందట ఆమెను మళ్లీ తన వద్దకు తీసుకువచ్చిన వెంకట కోటయ్య తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. భార్యపై మరింత అనుమానం పెంచుకుని వేధిస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో గురువారం స్వాతి బ్యూటీ పార్లర్లో ఉండగా, మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వెంకట కోటయ్య వెళ్లి గొడవపడి కత్తితో ఆమె ముఖం, మెడపై విచక్షణారహితంగా దాడి చేశాడు. స్వాతి అక్కడికక్కడే మృతిచెందింది. వెంకట కోటయ్య ముందుగానే తెచ్చుకుని బయట ఉంచిన పూలు, పూలమాలలను రక్తపు మడుగులో పడి ఉన్న స్వాతి మృతదేహంపై వేసి నివాళి అర్పించాడు. అనంతరం తాము అద్దెకు ఉండే ఇంటి సమీపంలోని తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్యను హత్య చేసినట్లు చెప్పి లొంగిపోయాడు. రూరల్ పోలీసులు ఈ విషయాన్ని టూ టౌన్ పోలీసులకు తెలియజేయడంతో సీఐ ఎస్.వెంకట్రావు, ఎస్ఐ శివరామయ్య తమ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే స్వాతి హత్య జరిగినట్లు తెలుస్తోందని సీఐ తెలిపారు. తన కుమార్తె స్వాతిపై అనుమానంతోనే భర్త కోటయ్య ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆమె తండ్రి వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ విషయమై ఇద్దరూ తరచూ గొడవపడేవారని తెలిపారు. -
Crime News: ప్రేమించాలంటూ వెంటపడి మరీ..
మైసూరు: తన ప్రేమను నిరాకరించిందని ఓ కిరాతకుడు ఆమెను కత్తితో పొడిచి హత్యాయత్నం చేసిన ఘటన మైసూరు నగరంలోని హెబ్బాల భారత్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఆవరణంలో చోటుచేసుకుంది. చామరాజనగర జిల్లా యలందూరుకు చెందిన నంజుండ స్వామి నిందితుడు. వివరాలు.. నర్సు, నంజుండస్వామి ఇదే ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నంజుండస్వామి తనను ప్రేమించాలని నర్సుపై తరచూ ఒత్తిడి తెచ్చేవాడు. ఆమె వ్యతిరేకించింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం విధుల్లో ఉండగా నంజుండస్వామి చాకుతో గొంతుపై పొడిచాడు. బాధితురాలిని హుటాహుటిన చికిత్సకు తరలించారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. (చదవండి: కాల్’ చేశాడు కటకటాల్లోకి చేరాడు! ) -
పావురాలు కొనడానికి వచ్చి...కత్తితో దాడి
మాలూరు: పావురాలు కొనడానికి వచ్చిన వ్యక్తి ఒకే కుటుంబంలోని ఏడుగురిని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచిన ఘటన కోలారు జిల్లా మాలూరు పట్టణంలోని పటాలమ్మ కాలనీలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. కాలనీలో నివాసం ఉంటున్న రాము, భార్య హేమావతి, నాగవేణి, రాజేశ్వరి, రూపా, నాగరాజ్,మరొకరు కత్తిపోట్లకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాత్రి ఎందుకు వచ్చావనడంతో వివరాలు.... నాగరాజ్ తమ్ముడు రాము పావురాల వ్యాపారం చేస్తున్నాడు. మంగళవారం రాత్రి పావురాలు ఖరీదు చేయడానికి ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి వచ్చాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న ఇమ్రాన్‌ను చూసిన నాగరాజ్ రాత్రి సమయంలో ఎందుకు వచ్చావని అడిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఇమ్రాన్‌ఖాన్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఇంట్లో ఉన్న వారిపై దాడి చేసి ఏడుగురిని గాయపరిచాడు. చుట్టుపక్కల వారు వచ్చి బాధితులను ఆస్పత్రిలో చేర్పించారు. మాలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుని ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేశారు. దాడి వెనుక పాత కక్షలు ఏవైనా ఉన్నాయా? అని విచారణ చేపట్టారు. ఈ దాడి ఘటన పట్టణంలో తీవ్ర కలకలం సృష్టించింది. (చదవండి: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పేరిట వికృత చేష్టలు.. రంగంలోకి పోలీసులు) -
స్థానిక కౌన్సిలర్ భర్తపై కత్తితో దాడి చేసిన ఆర్ఎంపీ డాక్టర్
-
వీడియో.. నల్గొండలో దారుణం.. కౌన్సిలర్ భర్తపై ఆర్ఎంపీ కత్తితో దాడి
సాక్షి, నల్గొండ: నల్గొండ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక కౌన్సిలర్ భర్తపై ఓఆర్ఎంపీ డాక్టర్ కత్తితో దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. పట్టణంలోని దేవరకొండ రోడ్డులో 25వ వార్డు కౌన్సిలర్ ధనలక్ష్మి భర్త శ్రీనివాస్ మీద అదే ప్రాంతంలో ఉంటున్న ఆర్ఎంపీ డాక్టర్ అనంతుల యాదయ్య కత్తితో దాడికి దిగాడు. నడిరోడ్డుపై కౌన్సిలర్ వెంట పరుగెత్తి కత్తితో దాడి చేశాడు. వెంటనే అక్కడున్న స్థానికులు గమనించి దాడిని అడ్డుకున్నారు. అనంతరం బాధితుడు శ్రీనివాస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు. కత్తితో వెంబడించడం, దాడి చేయడం వంటి వీడియోలు ..సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. -
ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు ప్రేమోన్మాది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డిగ్రీ చదువుతోన్న బాధితురాలు ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన యువతిగా గుర్తించారు. ఇదీ చదవండి: ప్రేమించ లేదని.. కత్తితో పొడిచి.. నల్లగొండలో ప్రేమోన్మాది ఘాతుకం -
ప్రేమ వ్యవహారం.. యువకుడి కుటుంబంపై యువతి బంధువులు కత్తితో దాడి
సాక్షి, కరీంనగర్: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చిగురుమామిడి మండలంలో ఓ యువకుడి కుటుంబంపై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. యువకుడితోపాటు ఆమె తల్లి, తండ్రిని కత్తితో పొడిచి పారిపోయారు. తీవ్రగాయాలైన క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రేమ వ్యవహారంతోనే యువతి బంధువులు కత్తితో దాడి జరిగినట్లు తెలుస్తోంది. చిగురుమామిడి మండలానికి చెందిన చందు అనే యువకుడు జగిత్యాలకు చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న యువతి అన్నయ్య.. తన స్నేహితులతో కలిసి చందు కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువకుడితో పాటు అతడి తండ్రి శ్రీనివాస్, తల్లి స్వప్నకు కూడా గాయాలయ్యాయి. అంతేగాక చందు శరీరంలోనే కత్తి చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చదవండి: హైదరాబాద్ మలక్‌పేట్‌లో దారుణం.. డాక్టర్ శ్రావణి పరిస్థితి విషమం -
యాసిడ్ పోసి.. గొంతు కోసి..
వెంకటాచలం (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): ఇంట్లో ఎవరూలేని సమయంలో 14ఏళ్ల బాలికపై ఆమె ఇంట్లో గుర్తుతెలియని ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను ఆమెపై పోసి, కత్తితో గొంతు కోసి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నక్కల కాలనీలో సోమవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెముడుగుంట పంచాయతీ నక్కలకాలనీకి చెందిన 14ఏళ్ల బాలిక బుజబుజ నెల్లూరులోని ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. సోమవారం సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి వచ్చింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమె ఇంట్లోకి ప్రవేశించి బాలికపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను బాలిక నోరు, ముఖంపై పోశాడు. అనంతరం కత్తితో గొంతు కోసి అక్కడ నుంచి పరారయ్యాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని ఆమెను హుటాహుటిన జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న సీఐ గంగాధర్, ఎస్ఐ అయ్యప్ప నక్కలకాలనీ, ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి విచారించారు. అయితే.. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి ఒక్కరా, లేక ఇద్దరు ముగ్గురు ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కుటుంబం మొత్తాన్ని నరికి చంపిన పూజారి.. మృతదేహాల వద్ద క్షుద్రపూజలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. కుటుంబం మొత్తాన్ని ఓ ఉన్మాది అతి కిరాతకంగా హత్య చేశాడు. ఉత్తర ప్రదేశ్‌లోని బండాకు చెందిన మహేష్ కుమార్ తివారీ అనే వ్యక్తి పూజారీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత ఏడేళ్లుగా డెహ్రాడూన్‌లోని రాణి పోఖారీలో నివసిస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ సోమవారం ఉదయం సొంత కుంటుంబాన్ని నరికి చంపాడు. 47 ఏళ్ల పూజారి కుటుంబంలోని అయిదగురిని కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతుల్లో నిందితుడి తల్లి, భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. హత్య అనంతరం మృతదేహాల వద్ద క్షుద్రపూజలు నిర్వహించాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం 7:30 గంటలకు జరిగింది. అయితేఇంట్లో నుంచి కుటుంబ సభ్యుల అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న డెహ్రాడూన్ పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డెహ్రాడూన్ పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) కమలేష్ ఉపాధ్యాయ్ తెలిపారు. నిందితుడు ఇంత దారుణానికి ఎందుకు తెగబడ్డానేది ఇంకా తెలియలేదని, దీనిపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి మూడేళ్ల కొడుకుని హతమార్చిన తల్లి -
పద్దతి మార్చుకోమన్నందుకు కత్తితో దాడి
బద్వేలు అర్బన్ : అల్లరి చిల్లరిగా తిరుగుతూ వీధి ప్రజలను ఇబ్బందులు పెట్టే బదులు పద్దతి మార్చుకుని సక్రమంగా జీవించాలని ఓ వ్యక్తి చెప్పిన మాటలను అవమానంగా భావించిన యువకుడు తండ్రి, కొడుకులపై కత్తితో దాడి చేశాడు. బుధవారం బద్వేలు పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. పట్టణంలోని ఆరోగ్యపురంలో నివసించే శేషాద్రిరెడ్డి ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తుండేవాడు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. అదే కాలనీలో ఉండే నరసాపురం పోలేరు వంటమాస్టర్‌గా పనిచేస్తూ వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకుంటూ జులాయిగా తిరిగేవాడు. ఇదే సమయంలో వీధిప్రజలతో గొడవ పడుతుండేవాడు. ఇదే విషయంపై గతంలో శేషాద్రిరెడ్డి కూడా పోలేరును మందలించాడు. దీనిని అవమానంగా భావించిన పోలేరు గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని బుధవారం ఉదయం ఇంటిలో ఉన్న శేషాద్రిరెడ్డిపై కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉండి అడ్డుకోబోయిన శేషాద్రిరెడ్డి కుమారుడు పవన్కార్తీక్రెడ్డిపై కూడా దాడి చేశాడు. ఈ సమయంలో శేషాద్రిరెడ్డి భార్య పార్వతి గట్టిగా కేకలు వేయడంతో పోలేరు పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వారు అక్కడికి చేరుకుని గాయపడిన తండ్రి, కొడుకులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు అరెస్టు పోలేరు ముఖానికి ముసుగు ధరించి ఉండటంతో దాడి చేసింది ఎవరనేది తొలుత అంతుపట్టలేదు. అంతేకాకుండా ముసుగు దొంగలు ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశారని పట్టణంలో, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఊపందుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు బృందాలుగా విడిపోయి నిందితుడి కోసం గాలించారు. ఈ సమయంలో పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో నిందితుడిని అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టు ఎదుట హాజరుపరిచారు. తర్వాత విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. -
ప్రేమించ లేదని.. కత్తితో పొడిచి.. నల్లగొండలో ప్రేమోన్మాది ఘాతుకం
నల్లగొండ క్రైం: తనను ప్రేమించడం లేదన్న అక్కసుతో ఓ యువతిపై ప్రేమోన్మాది విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. మాట్లాడుదామని పిలిచి అందరూ చూస్తుండగానే కత్తితో ఇష్టమొచ్చినట్టు పొడిచాడు. దగ్గరలోనే ఉన్న యువతి స్నేహితులు అది చూసి గట్టిగా అరవడంతో పారిపోయాడు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. కత్తిపోట్లకు గురైన యువతి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కోలుకుంటోంది. స్నేహితులను కలిసేందుకు వెళ్లగా.. నల్లగొండ పట్టణ శివార్లలోని పానగల్‌కు చెందిన గుండెబోయిన నవ్య ఇక్కడి ఎన్జీ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. పట్టణంలోని దేవరకొండ రోడ్డు ప్రాంతానికి చెందిన మీసాల రోహిత్ కూడా ఇదే కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. కొంతకాలం నుంచి తనను ప్రేమించాలంటూ నవ్య వెంట పడుతున్నాడు. ఆమె తిరస్కరించడంతో కోపం పెంచుకున్నాడు. మంగళవారం కాలేజీకి సెలవు ఉండటంతో నవ్య తన స్నేహితురాలు శ్రేష్ఠతో కలిసి మరో స్నేహితుడు తాయిని కలిసేందుకు పట్టణంలోని అటవీశాఖ కార్యాలయం వద్దకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న రోహిత్ బైక్‌పై అక్కడికి చేరుకున్నాడు. ఒకసారి మాట్లాడాలని నవ్యను దగ్గరికి పిలిచాడు. ఆమె దగ్గరికి రాగానే తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో నవ్య గొంతు, పొట్ట, పెదవులు, చెయ్యి మణికట్టు, కాలుపై తీవ్ర గాయాలయ్యా యి. నవ్య స్పృహ తప్పింది. అప్పటికే స్నేహితులు తాయి, శ్రేష్ఠ గట్టిగా అరవడంతో.. రోహిత్ బైక్‌ను అక్కడే వదిలేసి పారిపోయాడు. సమాచారం అందిన వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన నవ్యను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. చంపుతానని ఇంతకుముందే బెదిరింపు తనను ప్రేమించకుంటే చంపేస్తానంటూ రోహిత్ గత నెల 27న నవ్య గొంతుపై పగిలిన బీరు సీసా పెట్టి బెదిరించినట్టు ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. బాధితురాలి తండ్రి రామలింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వన్ టౌన్ సీఐ రౌతు గోపి తెలిపారు. దాడి ఘటనపై ఎస్పీ రెమా రాజేశ్వరి ఆరా తీశారు. నిందితుడిని త్వరగా పట్టుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో పోలీసులు ముమ్మరంగా గాలించి ఫోన్ కాల్ డేటా ఆధారంగా రోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
భద్రాద్రి కొత్తగూడెం: అప్పు తీర్చలేదని మహిళపై..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఆర్థిక లావాదేవీలతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండలంలో పరిధిలో ఈ దారుణం జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని ఓ మహిళపై దాడి చేశాడో వ్యక్తి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శ్రీదేవి అనే మహిళ తన దగ్గర అప్పు తీసుకుందని, తిరిగి ఇవ్వమంటే జాప్యం చేస్తోందని నిందితుడు నవతన్ చెప్తున్నాడు. ఈ క్రమంలోనే ఆమెపై పదునైన ఆయుధంతో దాడి చేశాడట. శ్రీదేవిపై కత్తి దాడి స్థానికంగా కలకలం సృష్టించగా.. ఘటనపై నవతన్‌పై కేసు నమోదు చేశారు చంచుపల్లి పోలీసులు. ఈలోపే నవతన్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. -
తనను కాదని.. మనువాడిందని కత్తితో దాడి
అమీర్‌పేట: తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో మహిళపై కత్తితో దాడి చేశాడో వ్యక్తి. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదులు చెప్పిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతి(35)కి ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో 2007లో వివాహమైంది. వీరు జీవనోపాధి కోసం నగరానికి వచ్చి ఎర్రగడ్డ బి.శంకర్‌లాల్‌నగర్‌లో ఉండేవారు. తొలి కాన్పులో ఆమెకు కుమారుడు, రెండోసారి కూతురు జన్మించారు. కూతురు పుట్టిందనే నెపంతో 2009లో ఆమెను భర్త వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి శ్యామల కొడుకు, కూతురితో కలిసి నగరంలోనే ఉంటోంది. 2016లో సుల్తాన్‌నగర్‌లో ఉండే సైకిల్ మెకానిక్ సయ్యద్ ఖలీల్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం వీరు సహజీవనం చేశారు. ఈ నేపథ్యంలో 2017లో బి.శంకర్లాల్నగర్కు చెందిన చెఫ్ శ్రీశైల్ కోట్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. ఈ విషయం ఖలీల్‌కు తెలియడంతో ఆమెపై ఖలీల్ కక్ష పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా కడతేర్చాలనే నిర్ణయానికి వచ్చాడు. ఎర్రగడ్డ సంతలో మూడు కత్తులను కొనుగోలు చేసి గౌతంపురి కాలనీలో ఆమెపై కత్తితో దాడి చేశాడు. క్షతగాత్రురాలిని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. -
ప్రేమించి పెళ్లి చేసుకుందని చెల్లెలిపై కత్తితో దాడి
కోవూరు: ప్రేమించి పెళ్లి చేసుకుందని పోలీస్‌స్టేషన్ ఎదుటే చెల్లెలిపై అన్న దాడి చేసి కత్తితో పొడిచిన ఘటన సోమవారం రాత్రి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్‌స్టేషన్ వద్ద జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. సంగం మండలం జెండాదిబ్బ ప్రాంతానికి చెందిన శిరీష, కోవూరు మండలం కట్టకింద చెర్లోపాలేనికి చెందిన అశోక్ ప్రేమించుకున్నారు. అశోక్ క్యాటరింగ్ పనులు చేస్తుంటాడు. ఇద్దరూ మేజర్లు కావడంతో మూడు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లికి ఇరు కుటుంబాలు అభ్యంతరం చెప్పాయి. ఈ విషయం కోవూరు పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఎస్ఐ దాసరి వెంకటేశ్వరరావు సోమవారం ఇరు కుటుంబాలను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. రాత్రి కావడంతో వారిని వెళ్లిపోయి మంగళవారం ఉదయం రావాలని చెప్పారు. ఆ సమయంలో స్టేషన్ బయట ఇరు కుటుంబాల వారు మాట్లాడుకుంటున్నారు. శిరీష వారి కుటుంబ సభ్యులతో వెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో శిరీష అన్న హరీష్ ఒక్కసారిగా చెల్లెలుపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె గాయపడింది. పోలీసులు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. హరీష్‌ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. -
చావు నోట్లో నుంచి కాపాడిన ‘సమయస్ఫూర్తి’
ప్రమాదాలనేవి చెప్పిరావు. ఒక్కొసారి అనూహ్యంగా మన ప్రమేయం లేకుండానే ప్రమాదాలు జరిగిపోతుంటాయి. కానీ అలాంటి సమయంలోనే సమయస్పూర్తితో వ్యవహరించి ఆ ఆపద నుంచి సురక్షితంగా బయటపడాలి. అచ్చం అలానే చేశాడు ఇక్కడొక ఆస్ట్రేలియన్ వ్యక్తి. బ్రిస్బేన్: ఆస్ట్రేలియాలోని 60 ఏళ్ల వ్యక్తి కైర్న్స్కి సమీపంలోని హోప్ వేల్ నగరంలోని ఒక నదిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. అయితే అతను పని ముగించుకుని తిరిగి నదిఒడ్డుకి వచ్చే క్రమంలో అక్కడ ఉన్న ఎద్దుని అదిలించాడు. దీంతో ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు ఒక మొసలి క్షణాల్లో అతని పై దాడిచేసింది. పైగా ష్యూస్ వేసుకుని ఉన్న అతని రెండు కాళ్లను బలంగా లాగడానికి ప్రయత్నించింది. (చదవండి: పెళ్లి చేసుకున్న మలాల.. ఫోటోలు వైరల్) అతను అక్కడ ఉన్న చెట్టు కొమ్మలను సైతం పట్టుకుని బయటకు రావడానికి ప్రయత్నించాడు. అయితే అతను ఆ ప్రయత్నంలో విఫలం అవ్వడంతో చేసేదేమి లేక చివరికి అతని పాకెట్లో ఉన కత్తితో అదే పనిగా దాడిచేశాడు. దీంతో అతను కొద్దిమొత్తంలో గాయాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత అతను ఆసుపత్రికి వెళ్లినట్లు క్వీన్స్లాండ్ పర్యావరణ విభాగం పేర్కొంది. (కష్టపడేతత్వం ఉంటే చాలు... కుటుంబ నేపథ్యం, ఇంగ్లీష్ పరిజ్ఞానంతో పని లేదు) -
చెల్లిపై వేధింపులు: బావకు నచ్చచెప్పేందుకు వెళ్లిన అన్నపై కత్తి దాడి
నేరడిగొండ (బోథ్): బావమరిదిపై కత్తితో బావ దాడి చేసిన ఘటన మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో చోటుచేసుకుంది. ఎస్సై భరత్‌సుమన్ వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఇమ్రాన్‌ఖాన్‌తో జుబేర్ గత రెండు సంవత్సరాల క్రితం చెల్లె వివాహం జరిపారు. మూడు రోజుల కిందట భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకోగా జుబేర్ బావను నచ్చజెప్పడానికి ఆయన చికెన్ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ మాటామాట పెరగడంతో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో బావ ఇమ్రాన్‌ఖాన్ మరిది జుబేర్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆయన మెడ, చెవిపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు జుబేర్‌ను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. చదవండి: ట్రాఫిక్ చలాన్ ఎలా వేస్తారని సర్పంచ్ హల్చల్ చదవండి: ‘సింగరేణి’పై రాజకీయ పార్టీల సిగపట్లు -
సత్తెనపల్లిలో తల్లీకూతుళ్ల హత్య
సత్తెనపల్లి: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను అతి దారుణంగా నరికి చంపిన ఉదంతం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని నాగార్జున నగర్లో శనివారం రాత్రి కలకలం రేపింది. సేకరించిన వివరాల ప్రకారం.. సత్తెనపల్లి పట్టణంలోని నాగార్జుననగర్‌కు చెందిన కోనూరు శివప్రసాద్ గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేసి రిటైరయ్యారు. అనారోగ్యంతో కొంతకాలం కిందట ఆయన మృతిచెందారు. శివప్రసాద్‌కు భార్య పద్మావతి (55), కుమార్తె లక్ష్మీ ప్రత్యూష (30), కుమారుడు లక్ష్మీనారాయణ ఉన్నారు. లక్ష్మీనారాయణ గుంటూరు ఆర్డీఓ సీసీగా పనిచేస్తున్నాడు. లక్ష్మీ ప్రత్యూష గర్భిణి కావడంతో తల్లి వద్ద ఉంటోంది. శివప్రసాద్ మరణానంతరం ఆయన సోదరుడు మధుసూదనరావు కుటుంబంతో విభేదాలు తలెత్తాయి. బెల్లంకొండ మండలం నందిరాజుపాలెంలో సుమారు ఆరు ఎకరాల పొలం శివప్రసాద్ పేరుతో ఉంది. అందులో తమకు వాటా ఉందని మధుసూదనరావు కుమారుడు శ్రీనివాసరావు తరచూ ఘర్షణ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో.. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ గుంటూరులో ఉంటున్న శ్రీనివాసరావు శనివారం సత్తెనపల్లి వచ్చి పిన్ని పద్మావతి, సోదరి లక్ష్మీ ప్రత్యూషను అతికిరాతకంగా నరికి చంపాడు. సంఘటనా స్థలాన్ని సత్తెనపల్లి టౌన్, రూరల్ సీఐలు యూ. శోభన్‌బాబు, బి. నరసింహారావు, ఎస్ఐ రఘుపతి పరిశీలించి మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. -
ప్యాసింజర్ రైలులో కలకలం.. ఆడవాళ్లు సంతోషంగా ఉంటే నచ్చదట!
టోక్యో: 2020 ఒలింపిక్స్ గేమ్స్ వేదిక, జపాన్ రాజధాని నగరం టోక్యోలో కత్తి దాడి ఘటన సంచలనం సృష్టించింది. టోక్యో ప్యాసింజర్ రైలులో ఒక అగంతకుడు(36) అకస్మాత్తుగా కత్తితో మహిళలపై దాడికి తెగబడ్డాడు. దీంతో ఒక యువతి తీవ్రంగా గాయపడగా, మరో పదిమంది గాయపడ్డారు. ప్రధాన స్టేడియానికి సుమారు 15 కిలోమీటర్లు దూరంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సంతోషంగా కనిపించే మహిళలను హత్య చేయాలన్న పథకంతోనే ఈ దాడి చేశానన్న నిందితుడి ప్రకటన కలకలం రేపింది. జపాన్ మీడియా నివేదిలక ప్రకారం పశ్చిమ ప్రాంతంలో ఓడక్యు లైన్లో 36 ఏళ్ల వ్యక్తి సడన్‌గా మహిళలపై కత్తితోఎటాక్ చేశాడు. ఈ ఘటనలో యూనివర్సిటీ విద్యార్థిని తీవ్రంగా గాయ పడింది. ఈమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. సమీపంలోని స్టేషన్లో రైలు నిలిపివేసిన అధికారులు తీవ్రంగా గాయపడిన యువతి సహా తొమ్మిది మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మరో వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు. మరోవైపు దాడి చేసిన వ్యక్తిని యూసుకే సుషిమాగా గుర్తించారు. అయితే పోలీసులు విచారణలో నిందితుడు విస్తుపోయే అంశాలను వెల్లడించాడు. సంతోషంగా కనిపించే మహిళలను చంపాలని ఆరేళ్ల క్రితమే నిర్ణయించుకున్నా.. అలాంటి వారిని చూస్తే తనకు కోపం వస్తుందని, అందుకే ఏ మహిళలైనా సరే, చాలా మందిని ఖతం చేయాలనుకున్నాను అని చెప్పడంతో పోలీసులు సైతం ఖంగుతిన్నారు. అంతేకాదు అనుమానితుడు వంట నూనె, లైటర్ని కూడా వెంట తెచ్చుకున్నాడనీ, రైల్లో నిప్పు పెట్టాలని కూడా ప్లాన్ చేశాడంటూ పోలీసులను ఉటంకిస్తూ ఎన్‌హెచ్‌కే నివేదించింది. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు స్థానిక అధికారి నిరాకరించారు. చదవండి : Women's Hockey: కన్నీరు మున్నీరైన అమ్మాయిలు, అనునయించిన మోదీ Mirabai Chanu: మరోసారి మనసు దోచుకున్న చాను, ప్రాక్టీస్ షురూ, ఫోటో వైరల్ -
విడాకులిచ్చిందని 27 సార్లు కత్తితో పొడిచి మరీ హతమార్చాడు
అహ్మదాబాద్: తనకు విడాకులిచ్చి మరొకరిని పెళ్లి చేసుకున్న ఓ మహిళను ఆమె మాజీ భర్త అత్యంత కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. ఆ మహిళ రెండో భర్త ఫిర్యాదుతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అహ్మదాబాద్‌లోని వత్వా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. అజయ్ ఠాకూర్ అనే వ్యక్తి హేమ అనే మహిళ కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వివాహమైన కొన్నాళ్లు ఇద్దరూ అన్యోన్యంగానే ఉండేవారు. అయితే కొన్నాళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త ప్రవర్తనతో విసుకు చెందిన హేమ అతడిని దూరం పెట్టింది. ఇద్దరి మధ్య తరచూ మనస్పర్థలు తలెత్తాయి. ఇక ఇదే క్రమంలో.. హేమ తనకు పరిచయమైన మహేష్ ఠాకూర్ అనే యువకుడితో చేసిన స్నేహం కాస్త ప్రేమగా మారింది. వారిద్దరూ కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. దీంతో హేమ తన భర్త అజయ్ ఠాకూర్‌కు విడాకులిచ్చింది. అంతేకాక వారి ఇద్దరు పిల్లలని కూడా అజయ్ ఠాకూర్ వద్దే ఉంచింది. ఆ తర్వాత మహేష్ ఠాకూర్‌ను పెళ్లి చేసుకుని అతనితోనే కలిసి ఉంటోంది. ఇక భార్య దూరమైనప్పటి నుంచి అజయ్ ఠాకూర్ మానసికంగా కుంగిపోయాడు. తన ఇద్దరు పిల్లలను భార్య వదిలి వెళ్లడంతో వారిని ఎలా చూసుకోవాలో తెలియక మదనపడుతూ మద్యానికి బానిసయ్యాడు. తనకు ఇలాంటి దుస్థితిని తీసుకొచ్చిన భార్యపై పగ పెంచుకున్న అజయ్ ఠాకూర్ హేమను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అవకాశం కోసం కొంత కాలం ఎదురుచూడసాగాడు. తన స్నేహితులతో కలిసి పక్కా ప్రణాళిక రచించాడు. బుధవారం రాత్రి అజయ్ ఠాకూర్ తన ఇద్దరి స్నేహితులను వెంటబెట్టుకుని హేమ, మహేష్ ఠాకూర్ ఉంటున్న ఇంటికి వెళ్లాడు. మహేష్ ఠాకూర్ ఇంట్లో లేకపోవడంతో అజయ్ ఠాకూర్ హేమపై కత్తితో ఒక్కసారిగా దాడిచేశాడు. అజయ్ ఠాకూర్ దాడికి భయంతో తప్పించుకునేందుకు ప్రయత్నించిన హేమను అతని స్నేహితులు అడ్డుకున్నారు. చివరికి హేమను వెంటాడి మరీ అత్యంత కిరాతకంగా 27సార్లు కత్తితో పొడిచి చంపాడు. హేమ మరణించిందని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి అజయ్ ఠాకూర్ అతని స్నేహితులు పరారయ్యారు. ఇదంతా జరిగిన కాసేపటికి హేమ రెండో భర్త మహేష్ ఠాకూర్ ఇంటికొచ్చాడు. రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్న తన భార్య హేమను చూసి షాక్‌కు గురయ్యాడు. వెంటనే నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
నల్లపురెడ్డిపల్లెలో కాల్పుల కలకలం
పులివెందుల: వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో మంగళవారం చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కొమ్మా శివప్రసాద్‌రెడ్డి(60), ఆయనకు సోదరుడి వరుసైన భూమిరెడ్డి పార్థసారథిరెడ్డి(45)లు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. శివప్రసాద్‌రెడ్డి, పార్థసారథిరెడ్డిలు నల్లపురెడ్డిపల్లె గ్రామంలో ఎదురెదురుగా ఉన్న ఇళ్లలో నివాసముండేవారు. పార్థసారథిరెడ్డి గతంలో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవాడు. అయితే కొంత కాలంగా ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదు. భార్యతో మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఇందుకు సంబంధించి కొమ్మా శివప్రసాద్‌రెడ్డి పంచాయితీ చేశారు. పంచాయితీలో పార్థసారథిరెడ్డి తన భార్యను అందరి ముందే తిడుతుండగా ఇది సరికాదంటూ శివప్రసాద్‌రెడ్డి పార్థసారథిరెడ్డిపై చేయి చేసుకున్నాడు. ఇది మనసులో పెట్టుకుని తనకు అనుకూలంగా పంచాయితీ చేయకపోగా, చేయి చేసుకున్నాడన్న కోపంతో కొమ్మా శివప్రసాద్‌రెడ్డిపై కక్ష పెంచుకున్నాడు. గత ఎంపీటీసీ ఎన్నికల్లో కొమ్మా శివప్రసాద్‌రెడ్డికి పోటీగా పార్థసారథిరెడ్డి నామినేషన్ వేయాలని ప్రయత్నించి, ఎవరూ మద్దతు పలకకపోవడంతో విరమించుకున్నాడు. కొమ్మా శివప్రసాద్‌రెడ్డిని తరచూ దుర్భాషలాడేవాడు. 2019లో ఒకసారి కొమ్మా శివప్రసాద్‌రెడ్డి ఇంటిపై పెట్రోలు పోసి దాడి చేశాడు. ఈ నేపథ్యంలో కొమ్మా శివప్రసాద్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పార్థసారథిరెడ్డిపై అప్పట్లో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాలుస్తావా.. దమ్ముంటే కాల్చు.. కొద్దిరోజులుగా శివప్రసాద్‌రెడ్డి కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ, చంపుతానంటూ బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో పార్థసారథిరెడ్డి వీధిలోకి వచ్చి శివప్రసాద్‌రెడ్డిని బూతులు తిట్టడం మొదలు పెట్టాడు. ఇంతలో శివప్రసాద్‌రెడ్డి కొడుకు ఉమేష్ మహేశ్వరరెడ్డి వచ్చి వీధిలో గొడవ చేయొద్దని చెప్పి ఇంటిలోకి వెళ్లిపోయాడు. ఇంతలో మరింత రెచ్చిపోయిన పార్థసారథిరెడ్డి, మచ్చుకత్తితో శివప్రసాద్‌రెడ్డి ఇంటి గేటు దాటుకుని లోపలికి వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో శివప్రసాద్‌రెడ్డి తన వద్ద ఉన్న లైసెన్స్ రివాల్వర్ తీసుకుని తొలుత గాలిలోకి కాల్పులు జరిపాడు. దమ్ముంటే తనను కాల్చాలంటూ పార్థసారథిరెడ్డి బూతులు తిడుతూ రెచ్చగొట్టాడు. దీంతో శివప్రసాద్‌రెడ్డి నేరుగా కాల్పులు జరపగా, పార్థసారథిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తన కళ్ల ఎదుటే పార్థసారథిరెడ్డి మృతి చెందడంతో మనస్తాపానికి గురైన శివప్రసాద్‌రెడ్డి తన రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లా ఎస్పీ అన్బురాజన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చేరుకుని శివప్రసాద్‌రెడ్డి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరుగురి మృతి: నడివీధిలో కత్తితో నిరుద్యోగి హల్చల్
బీజింగ్: ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నాడు.. ఇంట్లో ఉందామంటే కుటుంబ కలహాలు.. దీంతో ఆ యువకుడు పిచ్చోడిలా మారాడు. ఎవరిపైనో కోపం.. ఆ కోపాన్ని ఎవరిపై చూపించుకోవాలో తెలియదు. కానీ ఫస్ట్రేషన్ తీవ్రంగా ఉంది. దీంతో చివరకు ఉండబట్టలేక వీధిలోకి వచ్చాడు. వచ్చి రాగానే కనిపించిన వారందరిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి దిగాడు. అతడి చేతికి ఆరుమంది బలయ్యారు. మరో 14 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన చైనాలో జరిగింది. ఈశాన్య చైనాలో హువైనింగ్ కౌంటీలో నివసించే వూ (25) నిరుద్యోగి. నిరాశవాదంతో కొట్టుమిట్టాడుతున్నాడు. దీనికి తోడు ఇంట్లో గొడవలు జరుగుతుండడంతో మనశ్శాంతి కోల్పోయాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం అనుహుయ్ ప్రావిన్స్‌లోని ఆన్‌కింగ్ నగరంలోకి వచ్చాడు. కత్తి తీసుకుని వచ్చి కనిపించిన వారందరినీ తీవ్రంగా గాయపర్చాడు. అతడు కత్తితో బీభత్సం సృష్టించడంతో స్థానికులు భయాందోళనలతో పరుగులు పెట్టాడు. ఈక్రమంలో అతడు మొత్తం 20 మందిని గాయపర్చాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని అతడిని అతి కష్టంగా అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడ్డవారిలో ఆదివారం ఆరుగురు మృతి చెందారు. ఇంకా 14 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. ‘ఆన్‌కింగ్ నగరంలోని రెన్మిన్ రోడ్డులో ఫుట్‌పాత్‌పై నడుస్తున్నవారిని వూ కత్తితో దాడి చేశాడు’ అని మున్సిపల్ అధికారులు తెలిపారు. అsతడు కుటుంబ కలహాలతో పాటు నిరాశావాదంతో బాధ పడుతున్నాడని అక్కడి పోలీస్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆక్రోశం.. బాధ తట్టుకోలేక కత్తితో దాడి చేశాడు అని వివరించారు. చదవండి: నగ్న ఫొటోలు, వీడియో.. కంపెనీకి కోట్ల జరిమానా -
గుంటూరులో ఆకతాయి హల్ చల్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి
సాక్షి, రంగారెడ్డి: నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో అతి దారుణంగా దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగి పోలీస్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్ లక్ష్మీ నగర్ కాలనీ లోటస్ హిల్స్‌లో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న షాలినిపై ఓ యువకుడు ఇంట్లోకి చొరబడి కత్తితో పొడిచాడు. అనంతరం ఆ యువకుడు ఇంట్లో నుంచి పారిపోతుండగా అపార్టుమెంట్ అతన్ని పట్టుకొని నార్సింగి పోలీసులకు అప్పగించారు. ఆ యువతిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చదవండి: సంతానం కలగలేదని మేనల్లుడి దారుణ హత్య? -
చులకన భావం; బావమరిదిపై బావలు దాడి
సాక్షి చీమకుర్తి: లెక్కలేని తనం, చులకన భావం, అహంకారం వెరసి నిండు ప్రాణం గాలిలో కలిసింది. మేనల్లుడిని ఒక దెబ్బ కొట్టినందుకు ఇద్దరు బావలు కలిసి బావమరిదిని తలపై ఇనుప పైపుతో బలంగా కొట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృత్యువాతపడ్డాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సంతనూతలపాడు మండలం గుమ్మనంపాడుకు చెందిన తాడి చిరంజీవి (30) తలపై తన బావలు వెలుగు శ్రీనివాస్, కోటిలు ఇనుప పైపు తీసుకొని బలంగా బాదారు. మంగళవారం సాయంత్రం ఈ సంఘటన జరగగా రాత్రి ఒంటి గంట సమయంలో ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ దాసరి రాజారావు తెలిపారు. మృతదేహాన్ని సీఐ సుబ్బారావు, ఎస్ఐ రాజారావు పరిశీలించారు. మృతుడి భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: ప్రియుడి మోసం.. నర్సు ఆత్మహత్య చదవండి: ‘నన్ను చూసి నవ్వుతావంట్రా.. ఎంత ధైర్యంరా నీకు’ గాయపడిన సాయి మణికంఠ సాక్షి, అద్దంకి : ఉన్న సమస్యను కూర్చొని మాట్లాడుకుందాం..అంటూ పిలిపించి యువకుడిపై కత్తితో దాడి చేశారు. ఆ యువకుడు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ సంఘటన పట్టణంలోని బస్టాండ్ సెంటర్ సమీపంలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జె.పంగులూరుకు చెందిన గుంజి సాయి మణికంఠ హైదరాబాద్‌లో బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పాలెపు శ్రీను కుమార్తె తనను ప్రేమించమంటూ సాయి మణికంఠ వెంట పడేది. ఆమె పదే పదే అలాగే చేస్తుండటంతో అతడు ఆమె తండ్రితో విషయం చెప్పి కుమార్తెను జాగ్రత్త చేసుకోమని కోరాడు. శ్రీను కుమార్తె అదే పనిగా మళ్లీ మణికంఠకు ఫోన్లు చేస్తోంది. కుమార్తెకు నచ్చజెప్పినా వినక పోవడంతో ఆమె తండ్రి హైదరాబాద్‌లో ఉన్న సాయి మణికంఠను ఊరికి రమ్మని కోరాడు. వస్తే తమ కుమార్తె విషయం మాట్లాడాలని చెప్పి పిలిపించాడు. యువకుడు అద్దంకి బస్టాండ్ వద్దకు రాగానే శ్రీను పథకం ప్రకారం కత్తితో దాడి చేశాడు. హఠాత్ పరిణామానికి భీతిల్లిన మణికంఠ బతుకు జీవుడా అంటూ పారిపోయి ఓ చోట దాక్కుని ప్రాణాలు దక్కించుకున్నాడు. తేరుకున్న తర్వాత 108కి ఫోన్ చేశాడు. 108 సిబ్బంది వచ్చి క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు. -
పెళ్లి చేసుకోకపోతే చంపేస్తా..
సాక్షి, విజయవాడ పశ్చిమ: జిల్లాలోని గవర్నర్‌పేట డిపో1లో విధులు నిర్వహిస్తున్న ఓ ఉన్నతాధికారినిపై అజయ్ కుమార్ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా తననే ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని బాధిత యువతిని గత రెండు నెలలుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. తనను పెళ్లిచేసుకోకపోతే చంపేస్తానంటూ ఆ యువతిపై కత్తితో దాడికి యత్నించాడు. ఈ ఘటనపై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పెజ్జోనిపేటలో నివాసముంటున్న యువతి(33) ఆర్టీసీ గవర్నరుపేట–1 డిపోలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తుంది. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న అవుట్ సోర్సింగ్ మెకానిక్ ఎం.అజయ్‌కుమార్ రెండు నెలల నుంచి యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. యువతికి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ఈ విషయం తెలిసిన అజయ్‌కుమార్ సోమవారం రాత్రి మద్యం సేవించి యువతి ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని లేకపోతే చంపేస్తానంటూ జేబులో నుంచి కత్తి తీసి ఆమెపై దాడికి యత్నించడంతో తల్లిదండ్రులు అడ్డుకున్నారు. యువతితో సహా కుటుంబ సభ్యులంతా బయటకు పరుగు తీశారు. స్థానికులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు. ఘటనపై మంగళవారం యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడిపై 307, 354డీ, 506, 452 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని నార్త్ ఏసీపీ షప్రుద్దీన్ తెలిపారు. ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. -
మార్టూరులో కలకలం..
మార్టూరు(ప్రకాశం జిల్లా): క్షుద్రపూజల ఘటనలో నిందితుడు బాధితులపై మటన్ కత్తితో దాడి చేయడం మార్టూరులో తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో బాధితుల్లో ఒకరు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో కోమా స్థితిలో చికిత్స పొందుతుండగా.. మరో మహిళ చేతి వేళ్లు తెగిపడ్డాయి. ఈ సంఘటన మార్టూరు గొట్టిపాటి హనుమంతరావు కాలనీలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, కాలనీవాసుల వివరాల మేరకు కాలనీకి చెందిన పఠాన్ ఖాశీంవలి ఇంటి ముందు శుక్రవారం రాత్రి పఠాన్ సులేమాన్ కుటుంబం క్షుద్రపూజలు నిర్వహించారని బాధితుల ఆరోపణ. దీంతో సులేమాన్ కుటుంబంపై ఖాశీంవలి కుటుంబం అదే రోజు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమపై ఫిర్యాదు చేశారనే కక్షతో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో సులేమాన్ మటన్ కత్తితో ఖాశీంవలి తలపై నరికే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఖాశీంవలి తల్లి కరీమూన్ తన కుమారుడి తలపై చేతులు అడ్డుపెట్టడంతో ఆమె ఎడమ చేతి రెండు వేళ్లు తెగిపోయాయి. కత్తి దెబ్బకు అపస్మారక స్థితికి చేరుకున్న ఖాశీంవలి, కరీమూన్‌ను మొదట మార్టూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఖాశీంవలి కోమాలో ఉన్నాడని, కరీమూన్ ఎడమ చేతి చూపుడు వేలును వైద్యులు తొలగించినట్లు బంధువుల సమాచారం. సులేమాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మార్టూరు ప్రభుత్వాస్పత్రి వద్దకు తీసుకురాగా పోలీసు జీపులో కూర్చుని బాధిత కుటుంబంపై మీసం తిప్పుతూ బెదిరించడం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పోలీసులు సులేమాన్‌పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఖాశీంవలి భార్య సల్మా కోరుతోంది. -
క్యూబెక్‌లో దారుణం, ఇద్దరు మృతి
క్యూబెక్ : నగరంలోని రీజినల్ పార్లమెంట్ భవనం దగ్గరలో కత్తి దాడికి పాల్పడ్డాడో దుండగుడు. ఈ కత్తిదాడిలో ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రగాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం కెనడాలోని, క్యూబెక్ నగర పార్లమెంట్ భవనం దగ్గరలో పురాతన కాలపు వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి జనంపై కత్తి దాడికి పాల్పడ్డాడు. పొడవాటి కత్తి సహాయంతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం పరారీలో ఉన్న దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ( బట్టతల దాచి పెళ్లి చేసుకున్నాడని.. ) దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. ‘‘ ఆదివారం ఉదయమే అతడ్ని అదుపులోకి తీసుకున్నాము. దర్యాప్తు కొనసాగుతోంది. ప్రజలు తలుపులు బిగించుకుని ఇళ్లలోనే ఉండండ’’ని హెచ్చరించారు. కాగా, కెనడా వ్యాప్తంగా గత కొద్దిరోజుల నుంచి హాలోవీన్ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో దుండగుడి విచిత్ర వేషధారణను ప్రజలు అంతగా పట్టించుకోలేదు. దీంతో దాడి చేయటం అతడికి సులభమైంది. -
దారుణం: పరీక్ష కోసం వచ్చిన యువతిపై..
జైపూర్ : పరీక్ష నిమిత్తం ఇంటి నుంచి బయటకు వచ్చిన విద్యార్థి విగత జీవిగా మారింది. కళాశాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన విచక్షణ రహిత కాల్పుల్లో హత్యకు గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన శనివారం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. ఝున్‌ఝనూ జిల్లాకు చెందిన యువతికి ఇటీవల ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ పరీక్ష ఉన్నందున ఇంటి నుంచి బయలుదేరి రాజపార్క్ ప్రాంతంలోని తన కళాశాలకు చేరుకుంది. ఉదయం 7 గంటల నుంచి 10 వరకు పరీక్ష రాసి బయటకు రాగా అదే సమయంలో ఓ వ్యక్తి యువతిపై కత్తితో దాడి చేసి ఆమెపై కాల్పులు జరిపాడు. (హేమంత్ రిమాండ్‌లో సంచలన విషయాలు) ఈ ప్రమాదంలో గాయపడిన యువతిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు ధోల్పూర్కు చెందిన విష్ణుగా గుర్తించిన పోలీసులు అతను జైపూర్‌లో పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే హత్యకు గల కారణం ఇంకా స్పష్టంగా తెలియదని, దీనిపై మరింత దర్యాప్తు జరుగుతోందని వారు తెలిపారు. (కలకలం రేపిన పరువు హత్య) -
సినిమా షూటింగ్‌లా చూస్తున్నారే గానీ..
గోపాల్పేట(వనపర్తి): సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. కళ్ల ముందు ఓ మనిషిని (అందులోనూమహిళ) కత్తితో విచక్షణారహితంగా దాడి చేస్తున్నా సినిమా షూటింగ్‌లా చూస్తున్నారే గానీ వారించేవారు కరువయ్యారు. జిల్లాలోని గోపాల్పేట మండలం బుద్దారం గ్రామానికి చెందిన అర్జున్‌రావు అదే గ్రామానికి చెందిన అనంతరావు భార్య రత్నమ్మ(60)పై మటన్ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్ర గాయాలైన రత్నమ్మను వనపర్తి ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బుద్దారానికి చెందిన అర్జున్‌రావుకు 375, 376 సర్వే నంబర్లలో 2.28గుంటల భూమి ఉండేది. ఈ భూమిని 2010లో అనంతరావు మధ్యవర్తిగా ఉండి దాయాది కుటుంబసభ్యులకు అమ్మించాడు. 2018లో 2.28 ఎకరాల అమ్మిన భూమి సమీపంలోని 405, 406 సర్వే నంబర్లలోని 13గుంటలు, 15గుంటల భూమిని వేరొకరి పేరుమీద పట్టా చేయించాడని అర్జున్‌రావు ఆరోపిస్తూ గ్రామ పెద్దల వద్ద ఇటీవల పంచాయితీకి పెట్టాడు. ‘నీ పొలం అమ్మినట్లయితే నా పొలంలో 28గుంటలు తీసుకో’ అని అనంతరావు గ్రామస్తుల సమక్షంలో కాగితంపై రాసిచ్చాడు. అప్పటినుంచి తనకు రాసిచ్చిన ప్రకారం భూమిని ఇవ్వాలని వాదనలు జరిగాయి. ఈ విషయంపై ఐదురోజుల కిందట గోపాల్పేట పోలీస్‌స్టేషన్‌లో అర్జున్‌రావు ఫిర్యాదు చేశారు. (మహిళపై కత్తితో పదేపదే దాడి) రెండు కుటుంబాలకు చెందిన వారు కూర్చొని మాట్లాడుకోవాలని ఎస్ఐ రామన్‌గౌడ్ సూచించారు. ఈ విషయంపై బుధవారం ఉదయం గ్రామంలోని పాలకేంద్రం వద్ద అర్జున్‌రావు అతని భార్య శేషమ్మ, కొడుకు నరేందర్‌రావు, అతడి మనువడు ప్రశాంత్‌రావు కలిసి అనంతరావుతో వాదనలకు దిగాడు. ఇది కాస్త ఘర్షణలకు దారితీసింది. గొడవ పెరగడంతో అర్జున్‌రావు అనంతరావు తలపై కర్రతో కొట్టాడు. ఈ క్రమంలో అనంతరావు భార్య రత్నమ్మ అడ్డువచ్చింది. అప్పటికే ఆవేశంగా ఉన్న అర్జున్‌రావు వెంట తీసుకున్న మటన్ కత్తితో రత్నమ్మను విచక్షణారహితంగా నరికాడు. అడ్డుకోబోయిన స్థానికుడు మేకల సహదేవుడుపై కత్తితో దాడి చేయగా ఆయన గాయపడ్డాడు. ఈ విషయాన్ని గ్రామస్తులు 100డయల్ చేసి సమాచారం చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు రత్నమ్మ భర్త అనంతరావు ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన అర్జున్‌రావు, అతని భార్య శేషమ్మ, కొడుకు నరేందర్‌రావు, మనువడు ప్రశాంత్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామన్‌గౌడ్ చెప్పారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అపూర్వరావు, డీఎస్పీ కిరణ్‌కుమార్, సీఐ సూర్యనాయక్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసున్నారు. చూస్తుండి పోయిన జనం బుద్దారంలో ఉదయం బాధితురాలు రత్నమ్మపై అర్జున్‌రావు కత్తితో దాడి చేస్తుండగా అక్కడ దాదాపు పది నుంచి 15మంది వరకు ఉన్నారు. సహదేవుడు ఒక్కడే ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ మిగిలిన వారు ఒక్కరూ కూడా ముందుకు రాలేదు. పథకం ప్రకారమే కత్తి, కర్రతో దాడి వనపర్తి క్రైం: బుద్దారం ఘటనపై బుధవారం సాయంత్రం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ కిరణ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. తమకు తెలియకుండా భూమి విషయంలో మోసం చేశాడని, బంధువులపై కోపం పెంచుకుని పథకం ప్రకారమే అర్జునయ్య తమ బంధువులైన అనంతరావుపై కర్రతో దాడి చేశారు. అడ్డోచ్చిన భార్య రత్నమ్మలపై మటన్ కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసినట్లు చెప్పారు. ప్రాణాలతో కోట్టుమిట్టాడుతున్న ఆమెను, గాయపడిన అనంతరావును వనపర్తి జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం నిందితులను వారి తోటలో అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. ఈ మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో వనపర్తి సిఐ సూర్యనాయక్, వనపర్తి, గోపాల్పేట ఎస్ఐలు వెంకటేష్‌గౌడ్, రామన్‌గౌడ్ తదితరులు ఉన్నారు. -
మహిళపై కత్తితో పదేపదే దాడి
సాక్షి, వనపర్తి: రెండు కుటుంబాల మధ్య మూడేళ్లుగా నలుగుతున్న భూవివాదం మారణాయుధాలతో దాడులు చేసుకునేవరకు వెళ్లింది. ఈ ఘటన జిల్లాలోని గోపాల్పేట మండలం బుద్దారంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. అర్జున్‌రావు అనే వ్యక్తి అనంతరావు, రత్నమ్మ దంపతులపై కత్తితో అతి దారుణంగా దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వారిని హైదరాబాద్‌కు తరలించారు. రత్నమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అనంతరావు దంపతులపై అర్జున్‌రావు దాడి చేస్తున్న సమయంలో చుట్టూ పదుల సంఖ్యలో జనం ఉన్నా ఎవరూ అడ్డుకోకపోవడం శోచనీయం. ఇక అర్జున్‌రావు రత్నమ్మపై కత్తితో దాడి చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (పోలీసులమంటూ ప్రేమజంటపై దౌర్జన్యం) -
కత్తితో యువకుడు హల్చల్..
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో శుక్రవారం ఓ యువకుడు కత్తితో హల్చల్ చేశాడు. అక్కయ్యపాలెం షిర్డీసాయి ఆలయంలో కత్తి పట్టుకొని చచ్చిపోతానని అనిల్ అనే యువకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. మూడు కిలోమీటర్ల మేర పోలీసులను ముప్పుతిప్పలు పెట్టించాడు. తనను పట్టుకోడానికి ప్రయత్నిస్తే కత్తితో పొడుచుకుంటానని పోలీసులకు హెచ్చరికలు అందించాడు. తనను హరే రామ హరే కృష్ణ దేవాలయానికి తీసుకెళ్లాలని పోలీసులను కోరాడు. దీంతో ద్విచక్ర వాహనంలో అనిల్‌ను తీసుకు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనిల్ నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
వీఆర్ఏ దారుణ హత్య
తాండూర్(బెల్లంపల్లి): గుర్తు తెలియని వ్యక్తులు దంపతులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, భార్య కొనఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన మండలంలో సంచలనం సృష్టించింది. ఎస్సై కె.శేఖర్‌రెడ్డి వివరాల ప్రకారం... రేచిని గ్రామానికి చెందిన గజ్జెల్లి పోశం(55) మండలంలోని గంపలపల్లి వీఆర్ఏ (గ్రామ రెవెన్యూ సహాయకుడు)గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి పోశం, అతని భార్య శంకరమ్మ ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఎవరో తలుపు కొట్టిగా పోశం తలుపు తీసేందుకు ప్రయత్నించాడు. అప్పటికే విద్యుత్ మీటర్ తీగ కట్ చేశారు. చీకట్లోనే తలుపు తీయడంతో ఇంట్లోకి చొరబడిన వ్యక్తులు పోశం, శంకరమ్మలపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. వారిని ప్రతిఘటించిన శంకరమ్మ తీవ్ర గాయాలతో అరుస్తూ రోడ్డుపైకి పరుగెత్తి కొద్ది దూరం వరకు వెళ్లి çస్పృహ తప్పి పడిపోయింది. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న 108 సిబ్బంది, స్థానికులు ఇంటికి వెళ్లి చూసే సరికి పోశం రక్తపు మడుగులో మృతిచెంది కన్పించాడు. దీంతో శంకరమ్మను మంచిర్యాలలోని ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు. శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న సీఐ సామల ఉపేందర్, ఎస్సైతో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీం, డాగ్ స్వా్కడ్‌లతో ఆధారాలను సేకరించేందుకు ప్రయత్నించారు. పోలీసు జాగిలం గ్రామంలో పలుచోట్ల వెళ్లినప్పటికీ స్పష్టమైన ఆధారాలు లభించలేదు. మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోశం కూతురు రాజేశ్వరి, అల్లుడు వెంకటేష్, బంధువుల నుంచి వేర్వేరుగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూ తగాదాలే కారణమా? పోశం దంపతులపై దాడికి భూ తగాదాలే కారణమై ఉండొచ్చని స్థానికంగా చర్చ సాగుతోంది. పోశం ఇంటి ఎదుట రోడ్డు విషయంలో కొంత కాలంగా పోశం అన్న కొడుకు తిరుపతి, పోశం తమ్ముడు రాజన్నలతో వివాదం నెలకొంది. కొన్ని రోజుల క్రితం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి రాజీ కుదిర్చారు. అయినప్పటికీ ఆ వివాదం చల్లారక హత్యకు దారితీసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూ వివాదంతోనే ఆ ఘాతుకం చోటు చేసుకుందా, వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది. పోశం భార్య శంకరమ్మ ఫోన్లో చెప్పిన సమాచారంతో అల్లుడు కాటెపల్లి వెంకటేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అనుమానితులైన గజ్జెల్లి తిరుపతి, గజ్జెల్లి రాజన్న, రాజన్న కుమారుడు గజ్జెల్లి సాయితేజలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
వదినపై మరిది దాడి
మీర్‌పేట: వదినతో గొడవపడిన మరిది ఆమెపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకట్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మీర్‌పేట ప్రగతినగర్‌కు చెందిన మరక మంజులాదేవి (37) జలమండలిలో డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పని చేసేది. ఆమె భర్త విష్‌దేవ్‌లో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కుమార్తె వరణియ తేజ, అత్త జ్యోతితో కలిసి ఉంటోంది. గురువారం ఉదయం మరిది నారదేవ్‌తో ఇంట్లో గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో ఆగ్రహానికి లోనైన నారదేవ్ కత్తితో మంజులాదేవిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీనిని గుర్తించిన అమె కుమార్తె సమీపంలో ఉంటున్న మంజులాదేవి సోదరికి సమాచారం అందించడంతో వారు ఆమెను చికిత్స నిమిత్తం అపోలో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మరదలిని చంపిన బావ
నందికొట్కూరు: సొంత తమ్ముడి భార్య, మరదలు అని కూడా చూడకుండా గొడ్డలితో నరికి చంపాడు ఓ వ్యక్తి. మండల పరిధిలోని దామగట్ల గ్రామంలో ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ జయశేఖర్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చిన్న ఏసన్న, పుష్పరాజు అన్నదమ్ములు. ఇంటి స్థలం విషయంలో కొంతకాలంగా వివాదం ఉంది. ఇదే విషయమై తమ్ముడి భార్య శ్రీలేఖ(35)తో చిన్న ఏసన్న శుక్రవారం గొడవ పడ్డాడు. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడై గొడ్డలితో మెడపై విచక్షణా రహితంగా నరికాడు. రక్తపు మడుగులో పడివున్న బాధితురాలిని స్థానికులు 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భార్యపై కత్తితో దాడి: తానూ ఆత్మహత్యాయత్నం ఆళ్లగడ్డ: భార్యభర్తల మధ్య చోటుచేసుకున్న మనస్పర్థలు చివరికి ప్రాణాలు తీసుకునే వరకు వచ్చింది. పట్టణంలోని ఎస్వీ నగర్లో శుక్రవారం చోటుచేసుకున్న ఘటన వివరాలు సీఐ సుబ్రమణ్యం తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి.. ఎస్వీ నగర్లో అల్లూరి కిరణ్, సుబ్బమ్మ దంపతులు నివసిస్తున్నారు. సుబ్బమ్మ పుట్టినిల్లు కూడా ఇదే నగర్ కావడంతో రోజూ తల్లిదండ్రుల మాటలు విని.. తనతో గొడవ పడుతుందని భర్త అల్లూరి కిరణ్ క్షణికావేశానికి లోనై భార్యపై కత్తితో దాడి చేశాడు. తానూ కత్తితో ఎడమ చేతికి కోసుకున్నాడు. సుబ్బమ్మ కేకలు వేస్తూ బయటికి రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఇద్దరినీ ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
శృంగార నటి కొడుకుపై దాడి
సినిమా: శృంగార నటి మాయ కొడుకుపై కొందరు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చెన్నై విరుగంబాక్కంలో ఉంటున్న మాయ ఇంటికి గురువారం రాత్రి ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఆమె కొడుకు విక్కీపై కత్తులదో దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు దుండగులను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు అక్కడి నుంచి పరారయ్యారు. కాగా విక్కీకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని స్థానిక వడపళనిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నారు. కాగా నుంగంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే విక్కీ మద్యం సేవిస్తూ తరచూ స్థానికులతో గొడవ పడుతుంటాడని, అతని బాధితులు పాత కక్ష్యల కారణంగా దాడి చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
చేతబడి నెపంతో అమానుషం..
విజయనగరం, గుమ్మలక్ష్మీపురం: శాస్త్రసాంకేతిక విజ్ఞానం ఎంతగానో విస్తరిస్తోంది. సోషల్‌మీడియా ద్వారా మరెన్నో విషయాలపై అవగాహన పెంచుకుంటున్నారు. అయినా ఇంకా మూఢనమ్మకాల ప్రభావం మాత్రం అక్కడ కనిపిస్తూనే ఉంది. చేతబడి... చిల్లంగి... వంటి అనుమానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే అనుమానంతో తోటివ్యక్తిని గాయపర్చి... ఆయన మరణానికి కారణమైన సంఘటన ఒకటి మంగళవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట సీఐ రమేష్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని డుమ్మంగి పంచాయతీ టెంకసింగి గ్రామానికి చెందిన కొండగొర్రి ప్రకాష్ బామ్మర్ది శంకరరావుకు గడచిన మూడు నెల లుగా అరోగ్యం బాగుండటం లేదు. ఆస్పత్రు ల చుట్టూ తిప్పినా ఫలితం కానరాలేదు. దీని కంతటికీ కారణం గ్రామానికి చెందిన తోయక నరసింహులు(55) అనే వ్యక్తి చేతబడి చేయడమేనని అనుమానించిన ప్రకాష్ ఆయనపై ప్రతీకారం తీర్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో గ్రామం బయట ప్రధాన రహదారిలో కాపు కాసి... అటుగా వచ్చిన నరసింహులుపై కర్రతో దాడిచేశాడు. ఆయన కిందపడిపోవడంతో అదే అదనుగా భావించి ఇంటికి వెళ్లి ఓ కత్తిపట్టుకొని వచ్చి తల భాగంపై దాడిచేయగా నరసింహులు కుప్పకూలిపోయాడు. అడ్డుకునేందుకు యత్నించిన నరసింహులు భార్య ఆరాలు, పెద్ద కొడుకు సురేష్‌పైనా ప్రకాష్ కత్తితో దాడి చేసి, గ్రామస్తులు గమనించి వచ్చేలోగా అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమై స్పృహ లేకుండా పడి ఉన్న నరసింహులును కుటుంబ సభ్యులు హుటాహుటిన వైద్యం నిమిత్తం భద్రగిరి సీహెచ్‌సీకి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నరసింహులు మృతి చెందాడు. ఆయన భార్య ఆరాలు చేతికి కత్తి గాయాలు కావడంతో ఆమెను ఏరియా ఆస్పత్రిలో, కొడుకు సురేష్‌కు మెడపై గాయమవ్వటంతో భద్రగిరి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, శవపంచనామా, పోస్టుమార్టం అనంతరం నరసింహు లు మృతదేహాన్ని స్వగ్రా>మానికి తరలిస్తామ ని సీఐ తెలిపారు. నరసింహులుకు సురేష్‌తో పాటు మరో కొడుకు విజయ్, కూతురు కళ్యాణి ఉన్నారు. ప్రశాంతంగా ఉన్న గిరిజన గ్రామంలో మంగళవారంచోటు చేసుకున్న ఈ సంఘటనతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
నువ్వే నీ శక్తి
ఆడపిల్లలకు ప్రమాదాలు అనుక్షణం పొంచి ఉంటాయి.ఎప్పుడు ఎవరు లైంగిక దాడి చేస్తారో ఊహించలేకపోతున్నాం.అమ్మాయి ఎంత జాగ్రత్తగా ఉన్నా జరుగుతూనే ఉండే దాడులు ఇవి. ఆ ప్రమాదాల దాడి నుంచి ఆడబిడ్డను రక్షించేదెవరు? అందుకు రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ, అవి స్పందించేలోపు ఆడపిల్లలే ప్రతిస్పందించాలి. ధైర్యంగా ముందుకు అడుగు వేసి దాడి చేయబోయిన వాడికి దడ పుట్టించాలి. అమ్మాయిల్లో అలాంటి ధైర్యాన్ని పాదుకొల్పడానికే కర్రసామునేర్చుకుని ప్రదర్శిస్తున్నానని చెప్పారు స్వర్ణయాదవ్. ఇటీవలే ఆమె హైదరాబాద్,రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ తమిళిసై ఎదుటకర్రసాము ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. స్వర్ణ యాదవ్‌ది నాగర్ కర్నూల్ జిల్లా, వెల్దండ మండలం, బైరాపూర్ గ్రామం. అమ్మానాన్నలు వెంకటమ్మ, పెద్దయ్య వ్యవసాయం చేస్తారు. ముగ్గురు అక్కలు, ఒక తమ్ముడు. అత్యంత సాధారణ నేపథ్యం నుంచి రాష్ట్రం గర్వించదగిన స్థాయిలో జానపద గాయనిగా, కర్రసాము యుద్ధ కళాకారిణిగా ఎదగడంలో ఆమె వేసిన ప్రతి అడుగూ సాహసోపేతమైనదే. ఇప్పుడు అందుకుంటున్న ప్రశంసల వెనుక ఉన్న పోరాట జీవితాన్ని సాక్షితో మాట్లాడుతున్న సందర్భంలో గుర్తు చేసుకున్నారు స్వర్ణయాదవ్. బాయిలో బచ్చలి కూర ‘‘నేను ఇప్పుడు కర్రసాము స్వర్ణగా పరిచయమయ్యాను. కానీ అంతకు ముందు జానపద గాయనిగా వందల వేదికల మీద పాటలు పాడాను. ఏడవ తరగతిలో ఉన్నప్పుడు మా సొంతూరులో ప్రభుత్వ పాఠశాలలో తొలిసారి పాట పాడాను. మా అక్కలు నేర్పించిన ‘బాయిలో బచ్చలి కూర...’ అనే ఆ పాట స్కూలు తర్వాత గ్రామస్థాయి పోటీలు, మండలం, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో నాకు ప్రథమ స్థానాన్ని తెచ్చి పెట్టింది. జానపదంలో పాటతోపాటే నాట్యం కూడా చేస్తాం. అలా వేదిక మీద డాన్స్ చేయడంతో బిడియం పోతుంది. మనుషుల్లో కలిసి పోయే చొరవ వస్తుంది. ఆ చొరవే నన్ను తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ గేయాలు పాడేలా ముందడుగు వేయించింది. ఉద్యమం ఊపందుకోవడానికి పాటలను మించిన మాధ్యమం మరొకటి ఉండదని చెప్పి, మా ఊరిలోని ఉద్యమ గాయకుల బృందంలోని వాళ్లు నన్ను కూడా పాట పాడమని అడిగారు. అలా ఉద్యమంలోకి ఉరికిన దాన్ని... గళమెత్తాక ఎన్ని వేదికల మీద ఎన్ని గేయాలు పాడానో ఎప్పుడూ లెక్కపెట్టుకోలేదు. నేను నేర్చుకున్న ఉద్యమ గేయాలే కాకుండా, అక్కడికక్కడే ఆ సందర్భాన్ని బట్టి సొంతంగా పదాలు కూర్చుకుని పాడడం కూడా వచ్చేసింది. ఇంతవరకు పాటను కాగితం మీద రాసుకున్నది లేదు, నేరుగా పాడడమే. ఆడపిల్లలు ఇలా ఉండాలంటూ గవర్నర్ తమిళిసైకర్రసాము నిపుణురాలు స్వర్ణయాదవ్నుఅక్కున చేర్చుకున్న దృశ్యం బతికించడమే బతుకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ చేస్తున్నాను. మరో యూనివర్సిటీలో ఎం.ఏ పాలిటిక్స్‌లో సీటు వచ్చింది. కానీ కళలకు కాణాచి అయిన తెలంగాణలో కళలు తెరమరుగవుతున్నాయి. సంగీత వాయిద్యాలు చిలక్కొయ్యల మీదనే ఉండిపోతున్నాయి. వాటిని కిందికి దించి తిరిగి మోగించాలని, కళలకు జీవం పోయడంలోనే జీవితాన్ని వెతుక్కోవాలని అనుకున్నాను. ఆర్ట్ ఫార్మ్‌ను బతికించడంలో మన బతుకుకు కూడా భరోసా ఉంటుందని నిరూపిస్తాను. అందులో భాగంగానే కర్రసాము, కత్తిసాము నేర్చుకుని ప్రదర్శిస్తున్నాను. మొండిగా ప్రాక్టీస్ నెల రోజుల్లో కర్రసాములో మెళకువలు పట్టుపడ్డాయి. మొదట్లో దెబ్బలు తగిలాయి. భుజాలు నొప్పి, ఒళ్లు నొప్పులతో రాత్రి నిద్రపట్టేది కాదు. ఎందుకు మొదలు పెట్టానా అని కూడా అనిపించింది. కానీ మొండిగా ప్రాక్టీస్ చేశాను. అమ్మాయిలందరికీ కర్రసాము వచ్చి ఉండాలి. నేర్చుకున్నంత మాత్రాన ఎప్పుడూ కర్ర వెంట తీసుకెళ్లడం కుదురుతుందా అనుకుంటారు. కానీ ప్రమాదం తరుముకొచ్చినప్పుడు చేతిలో కర్ర లేకపోయినా, ప్రత్యర్థిని మట్టికరిపించే ఒడుపులు ఈ సాధనలో తెలుస్తాయి. ప్రమాదం నుంచి తమను తాము రక్షించుకోగలమనే ధీమా కలిగితే అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం దానంతటదే పుట్టుకొస్తుంది’’ అన్నారు స్వర్ణయాదవ్. ఇక్కడ ఒకమాట చెప్పాలి. ప్రతి మనిషికీ ఒక అండ కావాలి. ఆ అండ బయట ఉండదు. తనలో నిద్రాణంగా ఉన్న ఆత్మవిశ్వాసమే ఆ అండ. అలాగే ప్రతి మనిషీ... ఒక ఆధారాన్ని కోరుకుంటారు. ఆ ఆధారం మరొకరు అయి ఉండకూడదు. తనకు తానే అయి ఉండాలి. ఈ ఒక్క విషయాన్ని తెలుసుకుంటే చాలు... అమ్మాయిల చుట్టూ పరిభ్రమించడానికి ప్రమాదాలు కూడా భయపడతాయి.– వాకా మంజులారెడ్డి -
సహజీవనం చేస్తున్న ప్రియురాలిపై..
మూడేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలి కేకలకు స్థానికులు రావడంతో అక్కడినుంచి పరారయ్యాడు. ఏమీ తెలియనట్టు దొంగలు దాడి చేశారంటూ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు.. అతడి ప్రవర్తనలో మార్పును గమనించి పోలీసులు లోతుగా విచారించడంతో అసలు గుట్టు బయటపడగా.. చివరకు కటకటాల పాలయ్యాడు. నల్లగొండ ,చౌటుప్పల్ (మునుగోడు) : వలిగొండ మండలం కమ్మగూడెం ప్రాంతంలో ఈ నెల 8వ తేదీన రాత్రి మహిళపై జరిగిన హత్యాయత్నం కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితుడిని బుధవారం ఏసీపీ కార్యాలయంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టి భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 09వ వార్డుకు చెందిన నర్సింగోజు వీరాచారి(35), అదే వార్డుకు చెందిన బైరు రాణి(35)లు మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. రాణికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త ఆరేళ్ల క్రితం మృతిచెందాడు. కుమార్తె మేడ్చల్ జిల్లా కీసరలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో చదువుతోంది. ఈ నెల 07న కూతురు వద్దకు వెళ్లింది. 8న గురుకులంలో జరిగే పేరెంట్స్ మీటింగ్‌కు వెళ్లాల్సి ఉందని ప్రియుడైన వీరాచారికి హైదరాబాద్ నుంచి ఫోన్లో సమాచారం ఇవ్వగా అంగీకరించాడు. తాను బైకుపై సూర్యాపేట నుంచి నార్కట్‌పల్లికి వస్తాను, నీవు హైదరాబాద్ నుంచి బస్సులో అక్కడికి రావాలని సూచించాడు. ఆ ప్రకారంగా రాణి 07న రాత్రి 10గంటలకు నార్కట్‌పల్లిలో బస్సు దిగింది. కొంత సేపటికి అక్కడికి వచ్చిన వీరాచారి ఆమెను బైకుపై తీసుకెళ్లాడు. చిట్యాల వద్ద ఆగి టిఫిన్ చేసి బయలుదేరారు. మార్గమధ్యలో హత్య చేసేందుకు కుట్ర రాణి ఇతరులతోనూ సఖ్యతగా మెలుగుతోందని వీరాచారి అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా కీసరకు వెళ్లే ప్రయాణాన్ని ఆసరగా చేసుకున్నాడు. ముందస్తుగానే పతకం వేసుకున్న వీరాచారి తన వెంట చిన్నపాటి కత్తులు తెచ్చుకున్నాడు. చిట్యాల నుంచి బయలుదేరాక అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో కమ్మగూడెం వద్ద రోడ్డు పక్కన బైకు ఆపి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగింది. ఘర్షణ తలెత్తింది. అదే కోపంలో తన వెంట తెచ్చుకున్న కత్తులతో గొంతులో, కడుపులో పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో సమీపంలో ఉన్న కొంత మంది వ్యక్తులు అక్కడికి చేరుకునే లోపే పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు రాణిని ఆస్పత్రికి తరలించారు. దొంగలు దాడి చేశారని.. వీరాచారి తెల్లవారుజామున పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు తమ బైకును ఆపి కత్తులతో దాడి చేసి తన భార్య బంగారు నగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశాడు. జరిగిన ఘటన, వీరాచారి ఫిర్యాదుకు తేడా ఉండడంతో అనుమానంతో పోలీసులు లోతుగా విచారించగా వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ క్రమంలో బుధవారం నిందితుడు నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద సంచరిస్తుండగా ఏసీపీ సత్తయ్య అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరాన్ని అంగీకరించాడు. రిమాండ్ నిమిత్తం అతన్ని రామన్నపేట కోర్టుకు తరలించారు. సమావేశంలో ఏసీపీ సత్తయ్య, రామన్నపేట సీఐ ఏవీరంగ, వలిగొండ ఎస్సై శివనాగప్రసాద్ ఉన్నారు. -
కాబోయే భార్యపై బ్లేడుతో దాడి
ఒడిశా, జయపురం: కాబోయే భార్యపై ఓ యువకుడు దాడికి పాల్పడిన సంఘటన కొరాపుట్ జిల్లాలోని పొట్టంగి సమితిలో ఉన్న చింతలగుడ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.వివరాలిలా ఉన్నాయి.. చింతలగుడ గ్రామానికి చెందిన డుమురి ఖొరా కూతురు సుస్మితా ఖొరాతో సొంబయి గ్రామానికి చెందిన విశ్వనాథ్ గుంటతో గతేడాది వివాహం నిశ్చయమైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వారిద్దరికీ వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. అయితే వివాహం నిశ్చయమైనప్పటి నుంచి ఇప్పటివరకు కాబోయే అత్తవారింటికి తరచూ విశ్వనాథ్ వస్తూ పోతుండేవాడు. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం అత్తవారింటిని చేరుకున్న విశ్వనాథ్ ఆ రాత్రి అక్కడే పడుకున్నాడు. సుస్మితా, విశ్వనాథ్‌లు కాసేపు సరదాగా మాట్లాడుకుని, పడుకున్నారు. ఈ క్రమంలో అంతా పడుకున్న తర్వాత సుస్మితా గొంతును బ్లేడుతో కోసేందుకు విశ్వనాథ్ ప్రయత్నించాడు. దీంతో నిద్రలో నుంచి ఒక్కసారిగా ఉలికిపడి లేచిన ఆ యువతి భయంతో కేకలు వేసింది. అప్పటికే దాడికి గురైన యువతి గొంతు నుంచి రక్తం ధారలై కారుతుండగా భయాందోళన చెందిన కుటుంబ సభ్యులు యువతిని పుకాలీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం సుస్మితాను హత్య చేసేందుకు విశ్వనాథ్ ప్రయత్నించాడన్న బాధిత యువతి తండ్రి ఆరోపణ మేరకు పొట్టంగి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని, అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇదే విషయంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. -
మరిది చేతిలో వదిన హతం
పాలకొల్లు అర్బన్: ఆర్థిక లావాదేవీల కారణంగా వదినను కత్తితో నరికి హతమార్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం లంకలకోడేరు శివారు వెదుళ్లపాలెంలో జరిగింది. పాలకొల్లు రూరల్ ఎస్సై పి.తులసీరావు కథనం ప్రకారం.. లంకలకోడేరు శివారు వెదుళ్లపాలెంలో మడికి చల్లాలు, కుటుంబరావు అన్నదమ్ములు. చల్లాలు భార్య మారెమ్మ (45) గల్ఫ్ వెళ్లింది. అలాగే కుటుంబరావు, అతని భార్య కూడా గల్ఫ్ వెళ్లారు. అన్నదమ్ములిద్దరూ కలిసి వెదుళ్లపాలెంలో రెండు పోర్షన్ల కొత్త భవనం ఇటీవలే నిర్మించుకున్నారు. ఇంటి నిర్మాణ ఖర్చును అన్నదమ్ములిద్దరూ సమానంగా భరించాలని ఒప్పందం. 15 రోజుల క్రితమే మారెమ్మ గల్ఫ్ నుంచి రావడంతో మరిది కుటుంబరావు ఇంటి నిమిత్తం చేసిన ఖర్చుల లెక్కలు ఆరా తీశారు. అయితే లెక్కలు తేలకపోవడంతోగ్రామ పెద్దల్లో కూర్చుని మాట్లాడుకుందామని వదిన మారెమ్మ చెప్పారు. దీంతో కోపోద్రిక్తుడైన కుటుంబరావు కత్తి తీసుకుని తాను చెప్పినట్టు వింటావా లేక పెద్దల్లోకి వెళతావా అంటూ నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. కుటుంబరావు తన వెంట తెచ్చుకున్న కత్తితో మారెమ్మను విచక్షణారహితంగా నరకడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందింది. మృతురాలు మారెమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. వారందరికీ వివాహాలయ్యాయి. గల్ఫ్ నుంచి మరియమ్మ వచ్చిన వెంటనే కుమార్తెలు వేర్వేరు చోట్ల ఉండడంతో వారి ఇళ్లకు వెళ్లి గురువారమే వెదుళ్లపాలెం వచ్చిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అన్యాయంగా తన భార్యను చంపేశాడు.. నా పిల్లలకు దిక్కెవరంటూ మారెమ్మ భర్త చల్లాలు కన్నీరుమున్నీరయ్యారు. ఇదిలా ఉండగా మారెమ్మను కుటుంబరావు తరచూ లైంగికంగా కూడా వేధించేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
తన ఓటమికి కారణమాయ్యడని కత్తితో దాడి
సాక్షి, మంచిర్యాల : ఓటమి చెందారనే కోపంతో అధికార పార్టీకి చెందిన నాయకుడే అదే పార్టీకి చెందిన మరో నాయకుడిపై కత్తితో దాడి చేసి గాయపర్చిన సంఘటన సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్ పరిదిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై ప్రమోద్‌రెడ్డి కథనం ప్రకారం... నస్పూర్ 2వ వార్డు నుంచి టీఆర్ఎస్ పార్టీ తరుఫున రౌతు రజిత పోటీ చేసింది. ఆమె భర్త శ్రీనివాస్, ఐతే రజిత ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలైంది. కౌంటింగ్ పూర్తి అయిన సాయంత్రం ఇంటికి వెళ్లిన తరువాత వారు నివాసం ఉంటే సీసీసీ శుభాష్‌నగర్‌కు చెందిన మరో టీఆర్ఎస్ నేత అమృతరాజ్‌కుమార్ తమకు ఎన్నికల్లో సహాయం చేయలేదని కోపంతో రజిత మరిది రౌతు సత్యనారాయణ అతడితో గొడవకు దిగారు. సత్యనారాయణ ముందుగా రాజ్‌కుమార్ ఇంటికి వెళ్లి మాట్లాడేది ఉందని, బయటికి రమ్మని చెప్పారు. దీంతో రాజ్‌కుమార్ బయటికి వచ్చిన తరువాత మాట్లాడుతూనే తమకు ఎన్నికల్లో సహకరించకుండా రెబల్ అభ్యర్థికి గెలుపునకు కారణం అయ్యావని, మా వదిన ఓడిపోవడానికి నీవే కారణం అంటూ కత్తితో కడుపులో దాడిచేశాడు. అంతలోనే తేరుకున్న రాజ్‌కుమార్ అక్కడ ఉన్న వారి సహాయంతో తప్పించుకున్నారు. వెంటనే స్థానికులు అతడిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆయన్ను ఓప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. రాజ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
కట్నం కోసం యువతిపై కత్తులతో దాడి
చిత్తూరు,గంగాధరనెల్లూరు: వరకట్నం కోసం భర్త కుటుంబ సభ్యులు కత్తులతో దాడి చేయడంతో వివాహిత తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మండలంలోని పెద్దకాల్వ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. స్థానికుల కథనం మేరకు.. ఐరాల మండలం సంతగేటుకు చెందిన రోజా కు, పెద్దకాల్వకు చెందిన పవన్‌కుమార్‌కు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు ఉన్నాడు. భర్త పవన్‌కుమార్, మామ జ్ఙానప్రకాష్ (ఏఎస్ఐ), అత్త భానుమతి తరచూ వరకట్న వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో వారు బుధవారం కత్తులతో ఆమెపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై ఎస్ఐ విక్రమ్ వివరణ ఇస్తూ మూడు రోజులుగా భార్య, భర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. -
భార్యతో సంబంధం కొనసాగిస్తున్నాడని..
బంజారాహిల్స్: తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో పీకలదాకా మద్యం తాగించి పథకం ప్రకారం ఓ యువకుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ శేఖర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యూసుఫ్‌గూడ, జవహర్‌నగర్‌కు చెందిన సదయ్య కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. హన్మకొండకు చెందిన అతడి దూరపు బంధువు రాంబాబు గత కొంతకాలంగా తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లుగా సదయ్య అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై పలుమార్లు ఇద్దరినీ హెచ్చరించాడు. అయినా వీరి వైఖరిలో మార్పు రాకపోవడంతో రాంబాబును అంతమొందించాలని సదయ్య పథకం పన్నాడు. ఇందులో భాగంగా శనివారం రాంబాబుకు ఫోన్ చేసి సంక్రాంతి పండుగ సందర్భంగా విందు ఇస్తానని చెప్పడంతో రాంబాబు నగరానికి వచ్చి సదయ్యకు ఫోన్ చేశాడు. ఇద్దరూ కలిసి సమీపంలో ఉంటున్న సదయ్య బావ స్వామి ఇంటికి వెళ్లగా ముగ్గురు కలిసి మద్యం తాగారు. రాంబాబుకు బలవంతంగా ఎక్కువ తాగించిన సదయ్య పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో అతడి గొంతుకోసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన రాంబాబును స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సదయ్య, అతడి బావ స్వామిలపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం నిందితులను అరెస్టు చేశారు. -
ఠాణాలోనే బావ గొంతు కోశాడు
చివ్వెంల/సూర్యాపేట క్రైం: కుటుంబ తగాదా కేసులో కౌన్సెలింగ్ కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బావపై బావమరిది దాడి చేసి బ్లేడ్‌తో గొంతు కోశాడు. ఈ ఘటన సోమవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. మండల పరిధిలోని జగన్నాయక్ తండాకు చెందిన రమావత్ దేవేందర్, శ్వేత దంపతులు. రెండు నెలల క్రితం భర్తతో గొడవ పడిన శ్వేత.. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం భగత్‌సింగ్ నగర్లో ఉంటున్న శ్వేత వద్దకు వచ్చిన దేవేందర్, పెద్దలకు నచ్చజెప్పి ఆమెను జగన్నాయక్ తండాకు తీసుకెళ్లాడు. కాగా, ఆదివారం సాయంత్రం మళ్లీ భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. దీంతో శ్వేత డయల్ 100కు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చి ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తర్వాత శ్వేతను బంధువులు వచ్చి తిరిగి తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లారు. సోమవారం ఉదయం వారు దేవేందర్‌పై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు దేవేందర్‌ను కౌన్సెలింగ్ కోసం స్టేషన్‌కు రమ్మనడంతో వచ్చాడు. ఆ సమయంలో ఎస్ఐ, సిబ్బందితో కలసి తనిఖీల నిమిత్తం బయటకు వెళ్లారు. స్టేషన్లో ఉన్న శ్వేత, దేవేందర్ల కుటుంబ సభ్యులు ఘర్షణ పడ్డారు. ఈ సందర్భంగా దేవేందర్‌పై అతని బావమరిది రఘురాం దాడి చేసి బ్లేడ్‌తో గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు దేవేందర్‌ను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దేవేందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
భార్యపై హత్యాయత్నం
వైఎస్ఆర్ జిల్లా ,బద్వేలు అర్బన్ : వేధింపులు భరించలేక కొన్నేళ్లుగా తల్లిదండ్రుల వద్ద ఉంటున్న ఓ వివాహితను పట్టపగలే ఆమె భర్త అంతమొందించేందుకు యత్నించాడు. ఆదివారం బద్వేలు పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు .... బి.మఠం మండలం రేకలకుంట గ్రామానికి చెందిన పాణ్యంశేఖర్‌కు బద్వేలు మండలం తిరువెంగళాపురం గ్రామానికి చెందిన సులోచనతో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండేళ్ల పాటు భార్యాభర్తలు కలిసే ఉన్నారు. ఆ తర్వాత అనుమానం, మద్యానికి బానిసైన శేఖర్ భార్యను చిత్రహింసలకు గురిచేస్తుండేవాడు. దీంతో చేసేది లేక సులోచన 8 ఏళ్లుగా తన ఇద్దరి పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో శేఖర్ శనివారం రాత్రి తిరువెంగళాపురానికి వెళ్లి భార్యతో గొడవకు దిగాడు. అక్కడ స్థానికులు వారించడంతో వెనుదిరిగాడు. రోజూ మాదిరే ఆదివారం పనికి వెళ్లేందుకు సులోచన ఆమె వదిన విక్టోరియాతో కలిసి మైదుకూరురోడ్డులోని ఎస్‌బీవీఆర్ డిగ్రీ కళాశాల సమీపంలో ఉండగా మచ్చుకత్తితో దాడికి యత్నించాడు. సులోచన వదిన (అన్న భార్య) విక్టోరియా అడ్డుకోవడంతో ఆమెపై మచ్చుకత్తితో దాడి చేశాడు. సులోచన, విక్టోరియాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు అర్బన్ సీఐ రమేష్‌బాబు, ఏఎస్ఐ బాలగురన్నలు కేసులు నమోదు చేశారు. -
సెల్‌ఫోన్ తెచ్చిన తంటా... బ్లేడ్‌తో దాడి
విజయనగరం, గరుగుబిల్లి: మండలంలోని లఖనాపురం గ్రామానికి చెందిన నలుగురు యువకులపై బ్లేడ్లతో దాడి చేసిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకొంది. ఈ దాడిలో లఖనాపురం గ్రామానికి చెందిన ముదిలి దినేష్‌కుమార్, శివ్వాల సంతోష్‌కుమార్, సొడవరపు వెంకటరమణ, ఎస్.సురేష్‌కు గాయాలయ్యాయి. మంగళవారం ఈ విషయం తెలుసుకొన్న పార్వతీపురం సీఐ దాశరధి, ఎస్ఐ వై.సింహచలంతో పాటు సిబ్బంది లఖనాపురం, పెదబుడ్డిడిలో సంఘటనపై దర్యాప్తు చేశారు. స్థానిక పోలీసులు అందించిన వివరాలిలా వున్నాయి. జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడికి చెందిన అఖిల్, సురేష్, సంతోష్‌లు లఖనాపురం యువకులపై బ్లేడ్లతో దాడికి పాల్పడి వీపు భాగంలో, మెడ మీద, కాళ్లపై తీవ్ర గాయాలు చేశారు. యువకులు పార్వతీపురంలోని ఓ కళాశాలతో పాటు జ్యోతి ఐటీఐలో విద్యనభ్యసిస్తున్నారు. లఖనాపురానికి చెందిన ఓ యువతి ఫొటో అఖిల్ సెల్ఫోన్లో ఉండటంతో, అమ్మాయి ఫొటో ఎందుకు ఉంచావని ముదిలి దినేష్, అఖిల్‌ను ప్రశ్నించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య స్వల్పంగా వాగ్వాదం చోటుచేసుకొంది. ఈ విషయాన్ని జ్యోతి ఐటీఐ ప్రిన్సిపాల్ దృష్టికి లఖనాపురం గ్రామానికి చెందిన యువకులు తీసుకెళ్లారు. అయితే సోమవారం సాయంత్రం పార్వతీపురం–పెదబుడ్డిడి బస్సులో లఖనాపురం వెళ్తున్న సమయంలో లఖనాపురం బస్టాండ్‌లో అనూహ్యంగా పెదబుడ్డిడి యువకులు మెరుపుదాడికి దిగారు. బ్లేడ్‌తో గాయాలు చేశారని పోలీసులు తెలిపారు. గాయాల పాలైన దినేష్‌కుమార్, సురేష్, వెంకటరమణలను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారని తెలిపారు. తీవ్రంగా గాయాలైన సంతోష్‌కుమార్‌ను రావివలస ఆరోగ్య కేంద్రానికి తరలించి అవసరమైన వైద్యాన్ని అందించారన్నారు. దాడికి పాల్పడిన సురేష్ అదుపులో వుండగా అఖిల్, సంతోష్‌లు పరారయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ యువత క్షణికావేశానికి గురై నేరాలకు పాల్పడరాదన్నారు. విచారణలో సిబ్బంది పి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఒంటరి మహిళపై గుర్తు తెలియని వ్యక్తి దాడి
సాక్షి, ప్రకాశం: ఒంటరిగా ఉన్న మహిళల పట్ల కామాంధులు ఆగడాలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి...ఇటీవల ప్రియాంక రెడ్డి (దిశా)పై జరిగిన అమానుష ఘటన మరువక ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల మహిళలపై అఘాయిత్యాల పర్వం ఎక్కువవుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరిలో ఒంటరిగా ఉన్న మహిళపై(విజయలక్ష్మి) కన్నేసిన కిషోర్ అనే యువకుడు ఆమెను అత్యాచారం చేయబోయాడు. ఆ మహిళ గట్టిగా ప్రతిఘటించడంతో, మహిళలపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. మహిళ గొంతుపై కత్తితో గాయం చెయ్యడంతో మహిళ ఒక్కసారిగా షాక్‌కు గురై పడిపోవడంతో ఆమెను స్థానికులు ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు , మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించారు. ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని చర్చించుకుంటున్నారో, ఆ యువకుడు కిషోర్ అయ్యప్ప మాల ధరించి ఉండటం గమనార్హం..నిందితుడు మానసిక పరిస్థితి బాగోలేదని స్థాయినికులు చెప్తున్నారు -
లండన్‌లో కత్తిపోట్లు
లండన్: లండన్ బ్రిడ్జ్ వద్ద కత్తితో పలువురిని గాయపరిచిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనను ముందు జాగ్రత్త కోసం ఉగ్రవాద చర్యగా పరిగణిస్తున్నామని పోలీసులు తెలిపారు. రద్దీగా ఉండే లండన్ బ్రిడ్జ్ వద్ద ఓ వ్యక్తి కత్తితో పలువురిని గాయపరిచాడు. ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు టీవీల్లో ప్రసారమయ్యాయి. పోలీసులు వెంటనే స్పందించి దుండగుడిని మట్టుబెట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో సోదాలు చేయడంతో పాటు లండన్ బ్రిడ్జిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. -
భర్తను కత్తితో హతమార్చిన భార్య, కుమారుడు
సాక్షి, మునుగోడు: భార్య, భర్తల నడుమ ఘర్షణ ఓ ప్రాణం తీసింది. ఈ సంఘటన మండలం పరిధిలోని కస్తాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. 10వ తేదీన గ్రామంలో ముత్యాలమ్మ పండుగ జరిగింది. గ్రామానికి చెందిన యోహోవా(41) భార్య యాదమ్మ, కుమారుడు మనోజ్, తల్లి లక్ష్మమ్మ కలిసి పండుగ జరుపుకున్నారు. అదే రోజు రాత్రి అత్త లక్ష్మమ్మతో కోడలు యాదమ్మ ఘర్షణకు దిగింది. ఘర్షణ తీవ్ర స్థాయికి చేరడంతో లక్ష్మమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత మద్యం మత్తులో ఇంటికి చేరిన భర్త యోహోవా అమ్మ కనిపించడం లేదని భార్యను ప్రశ్నించడంతో మొదలైన గొడవ తీవ్రస్థాయికి చేరింది. మద్యం మత్తులో ఉన్న భర్తపై భార్య, కుమారుడు కలిసి కత్తితో దాడి చేశారు. దీంతో యోహోవా సృహ కోల్పోయాడు. తల్లి, కుమారుడు రాత్రి ఇంట్లోనే పడుకున్నారు. సోమవారం ఉదయాన్నే లక్ష్మమ్మ పెద్ద మనుషులతో ఇంటికి వచ్చింది. రాత్రి జరిగిన విషయంపై ఆరా తీస్తూనే, కుమారుడి గురించి అడిగింది. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి యోహోవా అపస్మారక స్థితిలో ఉన్నాడు. దీంతో వెంటనే చికిత్స నిమిత్తం నల్లగొండకు అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. పరిస్థితి విషమించి గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. స్టేషన్ ఎదుట ఆందోళన.. ఆదివారం జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిగా పట్టించుకోలేదని ఆరోపిస్తూ మృతుని బంధువులు మృతదేహాన్ని స్టేషన్ ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. యోహోను భార్యపై ఎందుకు కేసు నమోదు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఎస్పీ వస్తేనే ఆందోళన విరమిస్తామని సీఐ సురేష్‌కుమార్‌తో వాదనకు దిగారు. నిందితులకు శిక్షపడేలా చూస్తామని సీ ఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. శిక్షపడేలా చర్యలు : సీఐ సురేష్ కుమార్ యోహోవా మృతికి సంబంధించిన సంఘటనపై విచారణ చేసి, దోషులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఐ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన ఇంట్లో ఏం జరిగిందో.. వివరాలు సేకరించే పనిలో ఉన్నాం. ఆందోళన చెందనవసరం లేదు. నిందితులను త్వరలో కోర్టుకు రిమాండ్ చేస్తాం. -
ప్రియుడి భార్యపై దాడిచేసిన రేష్మా
సాక్షి, అనంతపురం: అనంతపురం పట్టణంలో దారుణం జరిగింది. వివాహితుడితో ప్రేమాయణం నడుపుతున్న ఓ యువతి బరితెగించింది. తన ప్రేమకు అడ్డుగా ఉందనే కారణంతో ప్రియుడి భార్యపై కత్తితో దాడి చేసింది. గర్భిణి అన్న కనికరం లేకుండా కత్తితో పొడిచింది. ఈ ఘటనలో గాయపడిన గర్భిణిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి చేసిన నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. రేష్మా అనే యువతి శ్రీనివాస్ అనే వివాహితుడిని ప్రేమిస్తోంది. అయితే, శ్రీనివాస్‌కు ఇదివరకే పెళ్లయింది. అతని భార్య మహేశ్వరి గర్భవతిగా ఉంది. అయితే, తన ప్రేమకు శ్రీనివాస్ భార్య అడ్డుగా ఉందని కక్ష పెంచుకున్న రేష్మా.. మహేశ్వరిపై కత్తితో దాడి చేసింది. దీంతో గాయపడిన మహేశ్వరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో రేష్మాను అరెస్టు చేసి.. పోలీసులు విచారిస్తున్నారు. -
సహజీవనం: మరొకరితో సన్నిహితంగా ఉందనే నెపంతో..
సాక్షి, మిర్యాలగూడ: కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఓ వ్యక్తి యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం మిర్యాలగూడలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడుగుపల్లి మండలం కల్వలపాలెం గ్రామానికి చెందిన బొల్లెపల్లి వజ్రం గతంలో అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఒక మిల్క్ సెంటర్లో పని చేసేవాడు. అక్కడ ఓ భర్త లేని మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొంత కాలం తర్వాత వారిద్దరూ మిర్యాలగూడకు వచ్చి టాకారోడ్డులో నివాసముంటూ సహజీవనం చేస్తున్నారు. వజ్రం పట్టణంలోని ఎన్నెస్పీ క్యాంపులో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో వారు అద్దెకు ఉండే ఇంట్లోనే మరో గదిలో అద్దెకు ఉంటున్న నకిరేకల్‌కు చెందిన తాండు రాజు ఆ మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు వజ్రం గమనించాడు. అప్పటి నుంచి ఆమె అనుమానం పెంచుకుని తరుచూ కొట్టసాగాడు. దీంతో కొద్ది రోజుల క్రితం ఆ మహిళ ఇక్కడి నుంచి తన తల్లి గారి ఊరు భూదాన్‌పోచంపల్లికి వెళ్లిపోయింది. దీంతో తాండు రాజు కారణంగానే తాను సఖ్యతగా మెలుగుతున్న మహిళ తనను విడిచి వెళ్లిపోయిందని ఇటీవల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై విచారణ చేసిన సీఐ ఆ మహిళను మూడు రోజుల క్రితం పిలిపించి వివరాలు సేకరించారు. ఆ మహిళ తాను ఎవరిని వివాహం చేసుకోలేదని, ఎవరితోనూ తనకు సంబంధం లేదని తేల్చి చెప్పి తిరిగి వెళ్లిపోయింది. దీంతో తాండు రాజుపై కక్ష పెంచుకున్న బొల్లెపల్లి వజ్రం పథకం ప్రకారం రోడ్డుపై నడిచి వెళుతున్న రాజుపై కొబ్బరి బొండాలు నరికే కత్తితో వెనుకనుంచి నరికాడు. మరో సారి మరో వేటు వేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గయపడిన రాజును స్థానికులు పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు .. పట్టణంలో రద్దీగా ఉండే రోడ్డుపై యువకుడిపై కత్తితో దాడి చేయడంతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా హడలిపోయారు. ఏం జరుగుతుందోనని కొందరు పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న సీఐ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తాండు రాజును వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడు వజ్రం పరారీలో ఉన్నాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా రాజు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
యువతి పై కత్తితో దాడి..
-
ప్రియురాలిపై కత్తితో దాడి..
చిలకలూరిపేట: ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రియురాలిని అనుమానించిన ప్రియుడు ఆమెపై కత్తితో దాడిచేసి హత్య చేయాలని ప్రయత్నించాడు. ఆపై తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సత్తెనపల్లికి చెందిన కాటేపల్లి రాముకు వినుకొండకు చెందిన కరణం లక్ష్మీప్రసన్నతో ఏడేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఇరువురూ కలిసి తిరుపతిలో ఐదేళ్ల పాటు సహజీవనం చేశారు. రెండేళ్ల కిందట చిలకలూరిపేట పట్టణానికి చేరుకొని సుబ్బయ్యతోటలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. రాము వంట మాస్టర్‌గా పనిచేస్తుండగా, లక్ష్మీ ప్రసన్న ఓ సూపర్ మార్కెట్లో సూపర్వైజర్గా పనిచేస్తోంది. గత ఐదు నెలలుగా లక్ష్మీ ప్రసన్న వేరొకరితో సన్నిహితంగా మెలుగుతున్నట్టు రాము అనుమానిస్తూ వచ్చాడు. సెల్ఫోన్లో వేరొకరితో మాట్లాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసేవాడు. ఆదివారం లక్ష్మీప్రసన్న వేరొకరితో మోటార్ బైక్‌పై రావటం గమనించి ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన రాము కూరగాయలు కోసే కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె ఎడమ చెయ్యి, నడుము, వెనుక భాగంలో తీవ్రగాయాలయ్యాయి. అనంతరం తాను కూడా గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు ఇరువురినీ 108 ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరువురికీ తీవ్ర గాయాలు కావడంతో స్థానిక వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. -
భార్యలపై కత్తితో దాడి చేసిన భర్త
చెన్నై ,తిరువొత్తియూరు: తన ఇద్దరు భార్యలపై భర్త కత్తితో దాడి చేయడంతో మొదటి భార్య మృతి చెందగా రెండవ భార్య పరిస్థితి విషమంగా ఉంది. తిరుపూర్ కరువాంపాళయం ఏపీడీ రోడ్డు ప్రాంతానికి చెందిన రమేష్ (40)కు శాంతి (33), తిలకవతి (30) అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. రమేష్‌కు మద్యం తాగుడు అలవాటు ఉంది. రోజూ మద్యం తాగి వచ్చి ఇంటిలో గొడవ చేసేవాడని తెలుస్తుంది. మంగళవారం రాత్రి భోజనానికి వచ్చిన సమయంలో భార్యలతో గొడవ పడ్డాడు. దీంతో ఆగ్రహం చెందిన రమేష్ ఇంట్లో ఉన్న కత్తితో ఇద్దరు భార్యలపై దాడి చేశాడు. ఈ ఘటనలో మొదటి భార్య శాంతి సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. రెండవ భార్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. రమేష్ పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. -
ఒంటరి మహిళలే టార్గెట్
నేరేడ్మెట్: బైక్‌పై కాలనీల్లో తిరుగుతూ అతి చిన్న కత్తితో ఒంటరి మహిళలను బెదిరించి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న యువకుడిని ఎల్బీ.నగర్ సీసీఎస్, క్రైం పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్‌లో సీపీ మహేష్‌భగవత్ వివరాలు వెల్లడించారు. హర్యానా రాష్ట్రం, బివాని జిల్లా, బర్సి గ్రామానికి చెందిన ఖుసారియా దతారామ్ బాలాపూర్‌లోని జిల్లెలగూడ దత్తునగర్‌లో ఉంటూ కొత్తపేటలోని మోర్ సూపర్ మార్కెట్లో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. డ్యూటీ ముగిసిన అనంతరం బైక్‌పై ఎల్బీనగర్, సరూర్‌నగర్, మీర్పేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని కాలనీల్లో తిరుగుతూ..ఒంటరి మహిళలు, యువతులను వెంబడించి చెయిన్ స్నాచింగ్‌కు పాల్పడటంతోపాటు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. మంగళవారం ఎల్బీ.నగర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన దతారామ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నేరాలు అంగీకరించాడు. అతడి నుంచి బుల్లి కత్తి, రూ.35వేల విలువైన చోరీ సొత్తుతోపాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. క్రైం ఇన్చార్జి డీసీపీ నారాయణరెడ్డి, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అనైతిక బంధం :చెల్లెలిపై అన్న కత్తితో దాడి
చందంపేట (దేవరకొండ) : వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆగ్రహంతో చెల్లెలిపై అన్న కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి మండలంలోని హంక్యతండాలో చోటుచేసుకుంది. ఎస్ఐ ఉపేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తండాకుచెందిన కేతావత్ చిట్టి నాగర్కర్నూల్జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో వివాహంకాగా ఐదేళ్ల క్రితం విడాకులు తీసుకుంది. అదే గ్రామానికి చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్‌తో కొంతకాలంగా సఖ్యతతో మెలుగుతోంది. దీంతో ఆ డ్రైవర్‌ను స్థానికులు నిలదీశారు. సుమారు రూ.లక్ష, ఎకరం పొలం చిట్టికి ఇస్తానని ఆ డ్రైవర్ పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకున్నాడు. కానీ అవే వీ ఇవ్వలేదు. కాగా సోమవారం రాత్రి ఆ వ్యక్తితో చిట్టి సన్నిహితంగా ఉండడంతో ఆమె మూడో అన్న కేతావత్ వంగ్లా నిలదీశాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి తప్పించుకోగా ఆగ్రహంతో చెల్లెలిపై కత్తితో దాడి చేశాడు. దీంతో చిట్టికి తీవ్ర రక్తస్రావం కావడంతో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచిం చారు. తమవద్ద డబ్బులు లేవని, హైదరాబాద్‌కు తరలించలేమని బంధువులు తెలుపడంతో పోలీసుల సమక్షంలో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గండం నుంచి గట్టెక్కిన దీక్ష?
కర్ణాటక ,యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా ఉళ్లాలలో ప్రేమికుడు చేతిలో కత్తిపోట్లకు గురై ఆస్పత్రి చికిత్స పొందుతున్న ఎంబీఎ విద్యార్థిని దీక్షా ఆస్పత్రిలో కోలుకోంటోంది. దాడి చేసిన నిందితుడు సుశాంత్ పోలీసుల అదుపులో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శక్తినగరకు చెందిన సుశాంత్, దీక్షాల మధ్య ప్రేమ వైఫల్యంగా కారణంగానే ఆమెపై దాడి చేసిన్నట్లు పోలీసులకు చెబుతున్నాడు. డ్యాన్స్ శిక్షణకు వెళ్తుండగా వీరిద్దరి మధ్య ప్రమాయణం సాగింది. అయితే 2016లో ఒక ఘర్షణలో సుశాంత్ తప్పు చేసిన్నట్లు రుజువు కావటంతో జైలుకు వెళ్ళివచ్చాడు. దీంతో దీక్ష అతనికి దూరంగా ఉండగా, అతడేమో వెంటపడి వేధిస్తున్నాడు. ఆమె సుశాంత్‌పై కార్కళ మహిళ పోలీసుస్టేషన్లో కేసు పెట్టింది. దీంతో కక్ష పెంచుకొని దీక్షపై హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు సుశాంత్‌పై మంగళూరు బందరు స్టేషన్లో రౌడీషీట్‌ను తెరిచినట్లు మంగళూరు డీసీపీ హనుమంతరాయ తెలిపారు. 2016లో జపాన్ మంగయానె రాజేశ్, సుభాష్ పడీల్ గుంపుల మధ్య గలాటాల్లో కూడా సుశాంత్ ప్రధాన నిందితుడు. హత్య చేయాలనే దాడి : శుక్రవారం మధ్యాహ్నం సుశాంత్ దీక్షాను హత్య చేయాలని ప్లాన్ వేసుకున్నారు. అప్పుటికే తన ముబైల్ వాట్సాఫ్ స్టేటస్‌లో లవ్ యు దీచు...మిస్ యు బాబా...లవ్ యు లాట్ అని రాసి ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను స్టేటస్‌లో పెట్టాడు. అనంతరం మద్యం తాగి దేరళకట్టె క్షేమ ఆస్పత్రి వద్ద కాపుకాశాడు. సాయంత్రం కాలేజీ ముగించుకొని వస్తున్న దీక్షను అడ్డగించి చాకుతో 12 సార్లు పొడిచాడు. కాగా, ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్న దీక్ష ప్రాణగండం నుంచి బయటపడినట్లేనని వైద్యులు తెలిపారు. గొంతు, శ్వాసనాళంకి బలమైన గాయం తాగిలాయి. రక్తస్రావం అధికం కావటంతో 20 బాటిళ్ల రక్తంను ఎక్కించారు. నర్సు సాహసం ఘటన జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ అక్కడికి వస్తుండగానే అందులో వచ్చిన నర్సు యువతి దీక్ష వద్దకు వెళ్తుండగా స్థానికులు అడ్డుకోబోయారు. నిందితుడు కత్తితో అక్కడే ఉన్నందున దాడి చేస్తాడేమోనని భయపడ్డారు. కానీ నర్సు ధైర్యంగా వెళ్లి బాధితురాలికి సపర్యలు చేయడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నర్సును నెటిజన్లు అభినందిస్తున్నారు. నర్సు ఆ యువకుడిని పక్కకు నెట్టి యువతిని ఎత్తుకొంటున్న దృశ్యాలు అందరి ప్రశంసలు అందుకున్నాయి. రూ. 50 వేలు ఆర్థిక సాయం దీక్ష కుటుంబాని దక్షిణ కన్నడ ఇన్చార్జ్ మంత్రి యుటీ ఖాదర్ రూ. 50 వేలును అర్థిక సాయంగా అందించారు. ఆదివారం దేరళకట్టె కేఎస్ హెగ్డే ఆస్పత్రిలో ఆమెను పరామర్శించారు. యువతిపై దాడి జరుగుతుండగా జనం ఆమెను రక్షించకుండా వీడియోలు తీయటం దారుణమన్నారు. -
ప్రేమ నిరాకరించిందని యువతిని..
సాక్షి, బెంగళూరు : ఓ పిచ్చి ప్రేమికుడు తన ప్రియురాలిని చాకుతో పొడిచి, తాను ఆత్మహత్యకు యత్నించిన ఘటన మంగళూరులో చోటు చేసుకొంది. ఈ ఘటనతో స్థానికులు భయందోళనకు గురయ్యారు. మంగళూరు శక్తినగరకు చెందిన సుశాంత్ బగంబిలా గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. సుశాంత్ హైస్కూల్లో డ్యాన్స్ మాస్టర్‌గా పని చేస్తున్నాడు. ఇద్దరి మధ్య హైస్కూల్ నుండి ప్రేమ ఉంది. దీంతో ఇటీవల జరిగిన సదరు యువతి పుట్టిన రోజుకు సుశాంత్ రూ. 50 వేలు ఖర్చు చేశాడు. అయితే ఇటీవల కాలంలో యువతి యువకుడికి దూరంగా ఉంటోంది. దీంతో ప్రేమికుడు యువతిని మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. దీంతో యువతి వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కక్ష పెంచుకున్న సుశాంత్ తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ ఆగ్రహంతో ఉన్నాడు. శుక్రవారం సదరు యువతిని హత్య చేయడానికి మంగళూరు నుంచి బగంబిలా గ్రామానికి వెళ్లాడు. సాయంత్రం కాలేజీ నుండి ఆమె వచ్చేవరకు ఆమె ఇంటి వద్దనే ఉన్నాడు. యువతి రాకను గమనించి ముందుగానే తెచ్చుకున్న చాకుతో ఆమె కడుపుపై 12 సార్లు పొడిచాడు. బాధితురాలు ప్రాధేయపడినా కనికరించలేదు. అనంతరం అదే చాకుతో తాను గొంతు కోసుకున్నాడు. హఠాత్ పరిణామాన్ని గుర్తించిన స్థానికులు ఇద్దరి ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉండటంతో దృశ్యాలు మొత్తం రికార్డయ్యాయి. దాడికి ముందు సుశాంత్ గంజాయి సేవించినట్లు సమాచారం. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే ఆస్పత్రిలో కొద్దిగా తేరుకున్న సుశాంత్, తన ప్రియురాలు ఎలా ఉందని వాకాబు చేశాడు. అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
ప్లేట్లో ఎంగిలి నీళ్లు పడ్డాయని..
అమీర్‌పేట: ప్లేట్లో ఎంగిలి నీళ్లు పడ్డాయన్న కోపంతో ఓ యువకుడు కత్తితో ముగ్గురిపై దాడికి పాల్పడిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.ఎస్సై మహేందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన మహేష్‌బాబు తన స్నేహితులు రాకేష్, శివతేజ, ఆనంద్ తేజలతో కలిసి బీకేగూడలోని హిమాలయ డీలక్స్ బాయ్స్ హాస్టల్లో ఉంటూ సీఏ చదువుతున్నాడు. మంగళవారం రాత్రి భోజనం అనంతరం మహేష్‌బాబు నల్లా వద్ద ప్లేటు కడుగుతుండగా నీళ్లు సమీపంలో ఉన్న శ్రీనివాస్ అనే యువకుడిపై పడ్డాయి. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో స్నేహితులు జోక్యం చేసుకుని వారికి సర్ధి చెప్పారు. అనంతరం ఎవరి గదిలో వారు నిద్రిస్తుండగా కిచెన్‌లోకి వెళ్లిన వెంకటేష్ కూరగాయలు తరిగే కత్తి తీసుకుని వచ్చి మహేష్‌తో పాటు రాకేష్, శివతేజ, ఆనంద్ తేజపై దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. హాస్టల్ నిర్వాహకుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. -
ప్రశ్నించారని రెచ్చిపోయాడు
సిద్దిపేటకమాన్: మూడు ముళ్లు వేసి, ఏడు అడుగులు నడిచి కలకాలం కలిసి ఉంటానని భరోసా ఇచ్చిన కట్టుకున్న భర్తనే భార్య పట్ల కసాయిగా మారాడు. కుటుంబకలహాలతో కట్టుకున్న భార్యపై గొడ్డలితో భర్త హత్యాయత్నం చేసిన సంఘటన సిద్దిపేట పట్టణంలోని హనుమాన్ నగర్లో మంగళవారం చోటుచేసుకుంది. సిద్దిపేట టూటౌన్ పోలీస్‌ల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలం ఏలేశ్వరం గ్రామానికి చెందిన మ్యాకల లక్ష్మి, శంకర్ దంపతులు గత కొద్దికాలంగా సిద్దిపేట పట్టణంలోని హనుమాన్‌నగర్ మహేశ్వర రైస్మీల్ దగ్గరలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. శంకర్ గత కొద్దిరోజులుగా పనికి వెళ్లకుండా ఇంటిదగ్గరే ఉంటున్నాడు. ఈ క్రమంలో శంకర్ భార్య లక్ష్మి కుటుంబ పోషణ నిమిత్తం కూలీ పనులకు Ððవెళ్తోంది. శంకర్ కూలీ పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండడాన్ని గుర్తించిన శంకర్ బావమరుదులైన రాసూరి శ్రీను, రాఘవలు మా అక్క లక్ష్మిని ఎందుకు పనికి పంపిస్తున్నావు, నీవు పనికి ఎందుకు వెళ్లడం లేదని శంకర్‌ను ప్రశ్నించారు. దీంతో నన్నే ప్రశ్నిస్తారా అని ఆగ్రహించిన శంకర్ ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకుని లక్ష్మిపై హత్యాయత్నం చేశాడు. దీనిని అడ్డుకోబోయిన శ్రీను, రాఘవలకు గాయాలయ్యాయి. భార్య లక్ష్మి ఎడమభుజంపై తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన రైస్‌మిల్ యజమాని, స్థానికులు ఘటన స్థలానికి రావడాన్ని గమనించిన శంకర్ ఇంటి గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో శంకర్ తలకు రాయితగిలి తీవ్ర రక్తస్త్రావం అయింది. గమనించిన స్థానికులు 108కి సమాచారం అందించగా వారు గాయపడిన వారిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన లక్ష్మిని వైద్యులు చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిఇకి తరలించారాఉ. గాయపడిన శంకర్, శ్రీను, రాఘవాలు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్ష్మి తమ్ముడు శ్రీను ఫిర్యాదు మేరకు సిద్దిపేట టూటౌన్ పోలీసులు శంకర్‌పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
ప్రేమపై పెద్దల కత్తి
-
ప్రేమపై పెద్దల కత్తి
సాక్షి, సిటీబ్యూరో: ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులపై అమ్మాయి తండ్రితో పాటు బంధువులు కత్తులతో విరుచుకుపడ్డారు. పట్టపగలు నడిరోడ్డుపై అడ్డగించి విచక్షణా రహితంగా దాడి చేశారు. శుక్రవారం సాయంత్రం ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణం తీవ్ర కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఇంతియాజ్ (21) నాంపల్లిలోని ఓ బేకరీలో పనిచేస్తూ ఇక్కడే ఉంటున్నాడు. ఇతడికి సమీప బంధువైన బోరబండకు చెందిన సయ్యద్ అలీ కుమార్తె సయ్యద్ జైన్ ఫాతిమాతో (19) మూడేళ్ల క్రితం పరిచయమైంది. అది ప్రేమగా మారడంతో వారు తరచూ కలుసుకునేవారు. వివాహం చేసుకోవాలని భావించిన వీరు విషయం తల్లిదండ్రులకు చెప్పారు. వీరి పెళ్లికి ఫాతిమా తల్లిదండ్రులు నిరాకరించడంతో ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. దీంతో తమ కుమార్తె కనిపించడం లేదంటూ బుధవారం తల్లిదండ్రులు ఎస్సాఆర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. అప్పటి నుంచి ఫాతిమాను ఇంతియాజ్ తీసుకెళ్లి ఉంటాడని భావిస్తున్న ఆమె కుటుంబసభ్యులు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. కాగా ఫాతిమా, ఇంతియాజ్‌లు గురువారం సదాశివపేటలోని ఓ దర్గాలో వివాహం చేసుకున్నారు. అనంతరం ఫాతిమా తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలంటూ సంగారెడ్డి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ పెళ్లి విషయం ఫాతిమా తల్లిదండ్రులకు తెలిసింది. దూర బంధువు అయినప్పటికీ అంతస్తుల్లో ఉన్న తేడాతో ఇంతియాజ్‌తో ఫాతిమా వివాహం జరగడం వారికి నచ్చలేదు. దీంతో ఆమె కుటుంబీకులు, సమీప బంధువులు యువకుడిపై కక్ష పెంచుకున్నారు. ఫాతిమాను ఎలాగైనా తిరిగి ఇంటికి తీసుకొచ్చి ఇంతియాజ్ నుంచి దూరం చేయాలని నిర్ణయించుకున్నారు. బోరబండలో ఉండే ఇంతియాజ్ సమీప బంధువు ద్వారా అతడి తల్లిదండ్రులు షేక్ రహమతుల్లా, రహీమాలకు ఫోన్ చేయించారు. ‘పిల్లలు ఎలాగూ వివాహం చేసుకున్నారు కదా... ఇంటికి తీసుకొస్తే సంప్రదాయ ప్రకారం నిర్వహించే అన్ని కార్యక్రమాలు పూర్తి చేద్దామం’టూ చెప్పారు. ఈ విషయాలను వాళ్లు నమ్మకపోవడంతో కనీసం పోలీస్ స్టేషన్‌కు రావాలని సూచించారు. దీంతో గురువారమే నవ దంపతులు ఇద్దరు తమ తల్లిదండ్రులతో పాటు స్నేహితులతో కలిసి ఎస్సార్‌నగర్ ఠాణాకు వచ్చారు. తమకు రక్షణ కావాలని పోలీసుల్ని కోరడంతో అధికారులు శుక్రవారం ఇరు కుటుంబాలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇకపై అందరం కలిసి ఉంటామని వారు చెప్పడంతో పంపించారు. అప్పటికే నవ దంపతులపై దాడి చేయాలని కుట్ర పన్నిన ఫాతిమా తండ్రి సయ్యద్ అలీ తన ముగ్గురు కొడుకులు, అల్లుడితో విషయం చెప్పాడు. అంతా కలిసి ఆటోలో ఆయుధాలను దాచుకుని ఠాణా వద్దకు వచ్చారు. కౌన్సెలింగ్ అనంతరం తమ క్వాలిస్ వాహనంలో వెళ్తున్న ఇంతియాజ్ కుటుంబీకులు, స్నేహితుల్ని ఆటోలో వెంబడించారు. ఎస్సార్‌నగర్ మెట్రో రైలు స్టేషన్ సమీపంలో కారు యూటర్న్ తీసుకుంటుండగా నడిరోడ్డుపై ఆటోను అడ్డంగా పెట్టి కారును నిలిపేశారు. కారు అద్దాలు ధ్వంసం చేసి ఇంతియాజ్‌ను బయటకు లాగి కోళ్లు కోసే కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు. అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఫాతిమా తన చెయ్యి అడ్డంగా పెట్టడంతో కత్తి ఆమెకు బలంగా తగిలి రెండు చేతి వేళ్లు తెగిపోయాయి. ఓ దశలో ఇంతియాజ్ కారు దిగి వెళ్లే ప్రయత్నం చేయగా... నడిరోడ్డుపై పట్టుకొని మరోసారి దాడి చేశారు. ఈ ఘాతుకం అనంతరం నిందితులు అక్కడి నుంచి ఆటోలోనే పరారయ్యారు. తీవ్ర గాయాలైన నవ దంపతుల్ని పోలీసులు అమీర్‌పేట ప్రైమ్ ఆసుపత్రికి తరలించారు. ఇంతియాజ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. తమకు రక్షణ కల్పించాలని కోరినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే దాడి జరిగిందని ఇంతియాజ్ తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రేమే నేరమా? సాక్షి, సిటీబ్యూరో: ప్రేమే నేరమవుతోంది. ప్రేమ జంటలపైకి పెద్దల కత్తి దూసుకుపోతోంది. ఈ రక్కసికి నవ దంపతుల నుంచి వివాహమై ఏళ్లు గడిచిన వాళ్లూ బలవుతున్నారు. నడిరోడ్డుపై పట్టపగలు జరుగుతున్న ఈ దారుణాలను నిరోధించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. ఘటనలు జరిగేప్పుడు అక్కడే ఉంటున్న వారు సైతం అడ్డుకోకపోగా, వీడియోలు తీయడానికి పరిమితమవుతున్నారు. ప్రస్తుత సమాజంలో పరిచయాలు కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్తున్నాయి. అయితే ఇరువురి తల్లిదండ్రులు, కుటుంబీకులు ప్రేమ పెళ్లిళ్లకు ఒప్పుకోకపోవడంతో పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రేమికులు, ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులపై అయితే కులం లేదా ‘ధనం’ ఏదో ఒకటి కత్తి దూసేలా చేస్తోంది. కులాంతర, మతాంతర వివాహాలు, ఆర్థిక స్థితిలో వ్యత్యాసమున్న వారిని వివాహం చేసుకున్న వారిపై దాడులు చేయడం, హత్యల వరకు వెళ్లడం జరుగుతోంది. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యకు కులం కారణమైతే... తాజాగా ఎస్సార్‌నగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఘాతుకానికి ధనం కారణమైంది. అన్ని వర్గాల్లోనూ ఈ దాడులు జరుగుతున్నాయి. ఆర్థిక అసమానతల కంటే కులం తేడాల వల్లే 90 శాతం ఈ తరహా నేరాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరువు హత్యలు, దాడులు తరచూ చోటుచేసుకోవడం వెనుక ఇటు పిల్లలు, అటు పెద్దలు ఇద్దరీ తప్పూ ఉంటోందని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. కులమతాలకు అతీతంగా ప్రేమించడం తప్పు కాదు. అయితే ఆ విషయాన్ని పెద్దలకు వివరించి, తాను ఫలానా వ్యక్తినే జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం పొరపాటు కాదని సర్దిచెప్పడంలో యువత విఫలమవుతోంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని పెద్దలకు తెలియకుండా వివాహాలు చేసుకుంటూ వారికి మరింత దూరమవుతోంది. ఈ సమయంలో విచక్షణ కోల్పోతున్న పెద్దలు పరువు హత్యలు/దాడులకు పాల్పడుతున్నారు. మానవత్వం మరిచి... ఎస్సార్‌నగర్ పరిధిలో ఘటన జరిగినప్పుడు అక్కడున్న వారు చేష్టలూడిగి చూస్తూ సెల్ఫోన్లలో రికార్డు చేశారే తప్ప స్పందించలేదు. క్వాలిస్‌లో వెళ్తున్న వారిని ఆటోలో వచ్చిన నిందితులు నడిరోడ్డుపై అడ్డగించి దాడి చేయగా.. ఒక్కరూ అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. ఏ ఒక్కరూ ముందుకు రాకుండా వెనుకే ఉంటూ తమ సెల్ఫోన్లు తీసి ఈ దారుణాన్ని చిత్రీకరించడం మొదలెట్టారు. ఆ ఘాతుకాన్ని సెల్ఫోన్లలో చిత్రీకించి షేర్ చేసుకున్నారే తప్ప అంతా కలిసి కట్టడిగా నిందితుల్ని అడ్డుకునే/పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వీటి ప్రచారం, ముద్రణ వద్దంటూ మీడియాకు పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నో దారుణాలు... 2018 సెప్టెంబర్ 19: కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న సందీప్‌తో పాటు అతడి భార్య మాధవిపై ఆమె తండ్రి మనోహరచారి దారుణంగా దాడి చేశాడు. కొత్త వస్త్రాలు కొనిపెడతానంటూ ఎస్సార్‌నగర్ పరిధిలోని గోకుల్ థియేటర్ వద్దకు రప్పించాడు. ఆపై అల్లుడిపై పట్ట పగలు విచక్షణా రహితంగా దాడికి దిగాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన మాధవికీ తీవ్ర గాయాలయ్యాయి. 2018 ఆగస్టు 23: అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన ఎల్లంకి సురేష్, విజయలక్ష్మి 2014లో పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. భద్రాచలంలో ఉంటున్న వీరు సురేష్ తల్లి మృతి చెందడంతో అబ్దుల్లాపూర్‌మెట్‌కు వచ్చారు. ఎప్పటి నుంచో కక్షకట్టి కాపుకాసిన విజయలక్ష్మి కుటుంబీకులు ఆమెపై దాడి చేసి హతమార్చారు. అప్పటికే వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉండగా.. విజయలక్ష్మి ఏడు నెలల గర్భిణి. 2017 మే 2: భువనగిరి నుంచి అదృశ్యమైన అంబోజు నరేష్ దారుణహత్యకు గురైనట్లు తేలింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్‌రెడ్డి మరో సమీప బంధువు నల్ల సత్తిరెడ్డితో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తేలింది. స్వాతి సైతం అదే నెల 16న తన పుట్టింట్లో బాత్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 2007 జూలై 24: బోరబండకు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ గీతను ప్రేమ వివాహం చేసుకున్న సంగమేశ్వర్ హఠాత్తుగా అదృశ్యమై హతమయ్యాడు. ఈ కేసును ఛేదించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు గీత సోదరుడు వి.వెంకటేశ్వర్‌రెడ్డి చేయించిన కిరాయి హత్యగా తేల్చారు. రూ.6.5 లక్షలకు సుపారీ ఇచ్చిన ఇతగాడు మరో ఐదుగురితో చంపించాడు. ఇవి కేవలం సంచలనం సృష్టించిన ఘటనల్లో కొన్ని మాత్రమే. పెద్దగా ప్రాచుర్యం పొందని దారుణాలు సిటీతో పాటు శివార్లలోనూ అనేకం చోటు చేసుకున్నాయి. -
పెళ్లి విందులో అల్లుడి వీరంగం
లంగర్‌హౌజ్: పెళ్లి విందులో ఓ యువకుడు వీరంగం సృష్టించిన సంఘటన సోమవారం లంగర్‌హౌజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. లంగర్‌హౌజ్ మందుల బస్తీకి చెందిన ముత్యం(35)కు మూడేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన రజినితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. గత కొంత కాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న ముత్యం తరచూ ఆమెను వేధిస్తున్నాడు. భర్త వేధింపులు భరించలేక రజిని ఈ విషయాన్ని తన మేన మామల దృష్టికి తీసుకెళ్లింది. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి లంగర్‌హౌజ్‌లో జరిగిన రజిని బంధువుల పెళ్లి విందుకు ముత్యం కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా రజిని మేనమామలు అతడిని నిలదీయడంతో ముత్యం వారితో వాగ్వాదానికి దిగడమేగాక తన వెంట తెచ్చుకున్న పేపర్ కట్టింగ్ కత్తితో వారిపై దాడి చేసి గాయపరిచాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసు లు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
పీఎఫ్ రాకుండా అడ్డుకున్నాడని..
దుండిగల్: పీఎఫ్ డబ్బులు రాకుండా అడ్డుకుంటున్నాడన్న కోసంతో ఓ కార్మికుడిపై సహోద్యోగి వేట కొడవలితో దాడికి పాల్పడిన సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై శేఖర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సూరారం కాలనీ వెంకట్రామ్‌నగర్‌కు చెందిన అప్పలరాజు మేడ్చల్‌లోని క్వాలిటిక్స్ ఫార్మా పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. సూరారం రాజీవ్ గృహకల్పకు చెందిన సుబ్బారావు సైతం అదే పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అయితే సుబ్బారావుకు పీఎఫ్ రాకుండా అప్పలరాజు అడ్డుపడుతున్నాడని అతడిపై కక్ష పెంచుకున్నాడు. సోమవారం అప్పలరాజు బైక్‌పై సూరారం నుంచి మేడ్చల్‌కు వెళ్తుండగా దుండిగల్ మున్సిపల్ కార్యాలయం దారిలో కాపు కాసిన సుబ్బారావు అతడిని అడ్డుకుని వేట కొడవలితో దాడి చేయడంతో అప్పలరాజు చేతులు, భుజంపై తీవ్రగాయాలయ్యాయి. దీనిని గుర్తించిన స్థానికులు అక్కడికి చేరుకునేలోగా నిందితుడు పరారయ్యాడు. అప్పల రాజు ను సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. బాధితుడి మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
టెన్షన్ టెన్షన్..!
సత్యవేడు :ఆ ఊరిలో అంతా బంధువులే.. కొందరు దాయాదులు.. మరికొందరు తమ బిడ్డలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్న వాళ్లే.. అంతేకాదు.. పక్కపక్కనే ప్రశాంతంగా నివాసాలు ఉంటున్నారు. నిద్రలేస్తే మామ.. అత్తా.. అన్న.. అక్క.. అంటూ బంధుత్వాన్ని గుర్తుచేసుకుంటూ ఒకరినొకరు పలకరించుకుంటూ.. ప్రశాంతంగా తమకున్నదాంతో పాటు చిన్నచిన్న కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, ప్రశాంతంగా ఉన్న పల్లెలో పాలకపక్షానికి చెందిన ఓ నేత జోక్యంతో కమీషన్ల చిచ్చు రాజుకుంది. ఆ నేత కమీషన్లను బూచిగా చూపడంతో పాటు కాలనీలో రెచ్చగొట్టే మాటలతో పచ్చటి పల్లెను రెండు వర్గాలుగా చీల్చి వివాదాలకు ఆజ్యం పోశారు. చివరికి మానవ్వతాన్ని మరచి.. ఎన్నడూ లేనివిధంగా కత్తులతో, కర్రలతో దాడులు చేసుకునే దుస్థితికి వారిని తీసుకువచ్చారు. దాంతో ఇరుగుళం ఎస్సీకాలనీలో ప్రశాంత వాతావరణం కరువైంది. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాలనీ మొత్తం పోలీసు బలగాలతో నిండిపోయింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నామంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కత్తులు, కర్రలతో దాడులు.. రెండు వర్గాలకు చెందినవారు కత్తులు, కర్రలతో శనివారం రాత్రి ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో బాలకృష్ణ అనే వ్యక్తి కత్తిపోటుకు గురయ్యాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో సత్యవేడు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అనంతరం శనివారం రాత్రే చెన్నైలోని జనరల్ హాస్పిటల్(జీహెచ్)కు తరలించారు. మరోవైపు వారితోపాటు జీవమ్మ, బాల, శేఖర్, అజిత్ తదితరులు చిన్నపాటి గాయాలతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సత్యవేడు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి భద్రతగా పెద్ద ఎత్తున పోలీసులు ఆస్పత్రి చుట్టూ మోహరించారు. దాంతో ఆస్పత్రి వద్ద టెన్షన్ నెలకొంది. పోలీసుల నీడలో ఇరుగుళం ఎస్సీకాలనీ.. శనివారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన దాడితో శ్రీసిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ విమలకుమారి నేతృత్వంలో 11మందిని అదువులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సీఐ ఈశ్వరయ్య, ఎస్ఐ సుబ్బారెడ్డితోపాటు పెద్ద ఎత్తున శ్రీసిటి పోలీసులే కాకుండా చిత్తూరు నుంచి మరో 40మంది ప్రత్యేక భద్రతా సిబ్బంది ఇరుగుళం ఎస్సీకాలనీలో ఉద్రిక్తతను చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీకాలనీలో 144 సెక్షన్ తరహాలో ఎక్కడా జనం గుంపులు గుంపులుగా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా దాడులకు సంబంధించి రెండు వర్గాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అసలేం జరిగింది..? సత్యవేడు మండలంలోని ఇరుగుళం ఎస్సీకాలనీ శ్రీసిటీ పారిశ్రామికవాడ ప్రాంతంలో ఉంది. శ్రీసిటీ పరిధిలో పదికి పైగా పల్లెలున్నాయి. దాంతో ఆ ప్రాంతంలో కొత్త కర్మాగారం ఏర్పాటు చేస్తే.. ఆ సమీపంలోని గ్రామానికి చెందిన వ్యక్తులకు పరిశ్రమకు చెందిన కొన్ని నిర్మాణపనులు అప్పగించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ పనుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ గ్రామానికి చెందిన అందరికీ సమానంగా పంచాల్సి ఉంది. అదే తరహాలో గతేడాది బావెంటో, టొరయ్ అనే పరిశ్రమలు ఇరుగుళం సమీపంలో స్థాపించడానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో అ పరిశ్రమల నిర్మాణపనులు స్థానికులకు అప్పగించాల్సి ఉంది. అయితే పాలపక్షానికి చెందిన సత్యవేడు నేత... తమకు ఉన్న సిఫార్సుతో ఆ పనులు దక్కించుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పరిశ్రమల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దాంతో వారు స్థానికంగా ఉంటున్న ఎస్సీకాలనీలోని నలుగురు వ్యక్తులకు నిర్మాణపనులు చేయడానికి వర్క్ ఆర్డర్ ఇచ్చారు. ఆమేరకు పనులు పూర్తి చేసిన ఆ నలుగురు వాటి ద్వారా సుమారు రూ.1.50కోట్ల మేరకు వచ్చిన ఆదాయాన్ని ఆ ఎస్సీకాలనీలో నివాసం ఉంటున్న వారికి పంచాల్సి ఉంది. అయితే ఆలా చేయకుండా, వారి అకౌంట్లో పడిన మొత్తాన్ని స్వాహా చేశారనే విమర్శలు వెల్లువెత్తడంతో పలువురు వారిని ప్రశ్నించారు. అంతేకాకుండా శ్రీసిటీ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లో రెండు రోజుల క్రితమే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పనులు చేసిన వారు ఓ వర్గంగా, ప్రశ్నించిన వారు మరోవర్గంగా మారారు. దాంతో ఒకరిపై ఒకరు శనివారం రాత్రి దాడులు చేసుకోవడంతో ఎస్సీకాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
దారి కోసం నరుక్కున్న అన్నదమ్ములు
పశ్చిమగోదావరి, పెరవలి: పొలం వద్ద దారి కోసం సొంత అన్నదమ్ములు నరుక్కున్న ఘటన ఇది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పెరవలి ఎస్సై వి.జగదీశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖండవల్లి గ్రామానికి చెందిన కొవ్వూరి శేషయ్యకు నలుగురు కుమారులు. వీరిలో కొవ్వూరు ధర్మయ్య, కొవ్వూరు నాగేశ్వరరావు, కొవ్వూరు ముసలయ్యకు పంట చేను ఉంది. వీరిలో కొవ్వూరి ధర్మయ్య తన చేను నుంచి వెళ్లటానికి వీలులేదని గత కొంత కాలంగా గొడవలు పడుతున్నారు. ఈ తగువులు జరుగుతుండగానే శుక్రవారం కొవ్వూరు నాగేశ్వరరావు ఆయన కుమారుడు మార్కండేయులు, మరో తమ్ముడు కొవ్వూరి ముసలయ్యలు కలసి ఎండు గడ్డిని తీసుకువచ్చి మేటు వేద్దామని దింపారు. గడ్డిని మోస్తుండగా కొవ్వూరి ధర్మయ్య, వారి కుమారులు బార్గవ, శేఘ వచ్చి ఇలా పట్టుకెళ్లటానికి కుదరదని చెప్పటం ఘర్షణకు కారణమైంది. మాటామాటా పెరిగి తొలుత కర్రలతో దాడులు చేసుకున్నారు. ఆ తర్వాత ధర్మయ్య, ఆయన కుమారులు కత్తులతో దాడి చేయటంతో నాగేశ్వరరావు, ముసలయ్య, మార్కండేయులకు తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. దీంతో క్షతగాత్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వైద్యం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
లండన్‌లో హైదరాబాదీ హత్య
హైదరాబాద్: లండన్‌లో హైదరాబాద్ యువకుడొకరు దారుణ హత్యకు గురయ్యారు. ఉత్తర లండన్‌లోని వెల్లింగ్టన్ స్ట్రీట్‌లో టెస్కో సూపర్మార్కెట్లో పనిచేస్తున్న నదీముద్దీన్ (24) అదే సంస్థ పార్కింగ్‌లో కత్తిపోట్లతో చనిపోయాడు. అయితే, ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదని.. నదీముద్దీన్తో పరిచయం ఉన్నవారే ఈ ఘటనకు పాల్పడ్డారని లండన్ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే, ఈ కేసుకు సంబంధించి ఓ 26 ఏళ్ల అనుమానితుడు (అదే సంస్థలో పనిచేస్తున్న ఓ పాకిస్తానీ) పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. నదీమ్ తల్లిదండ్రులు, భార్యతో కలిసి లండన్‌లోనే ఉంటున్నారు. ఇప్పటికే ఈయనకు పర్మనెంట్ రెసిడెన్సీ హోదా లభించగా.. మరికొద్ది రోజుల్లో బ్రిటన్ పౌరసత్వం లభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంతలోనే ఈ దారుణం జరిగింది. మే 8న (బుధవారం) విధులకు వచ్చిన తర్వాత నదీమ్ తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో లండన్‌లో ఆయనతోపాటు ఉంటున్న తల్లిదండ్రులు, భార్య డాక్టర్ అఫ్షా.. సూపర్ మార్కెట్ యాజమాన్యాన్ని సంప్రదించారు. దీంతో ఆ సంస్థ సెక్యూరిటీ సిబ్బంది, ఉద్యోగులు వెతుకుతుండగా.. పార్కింగ్ స్థలంలో తీవ్రమైన గాయాలతో పడివున్న నదీమ్‌ను గుర్తించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కారణంగా ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు. హత్య విషయం తెలియగానే ఆయన భార్య షాక్‌కు గురయ్యారు. వైద్యులు ఆమెకు సైకలాజికల్ కౌన్సెలింగ్ అందిస్తున్నారు. నదీమ్ మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. లండన్‌లోనే అంత్యక్రియలు హైదరాబాద్‌లో 2012లో డిగ్రీ పూర్తి చేసిన నదీమ్.. ఉపాధికోసం లండన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఆ తర్వాత కొన్నిరోజులకే తల్లిదండ్రులను కూడా తనతోపాటు తీసుకెళ్లాడు. కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అఫ్షాతో ఆయనకు వివా హం జరిగింది. గర్భిణీ అయిన 25 రోజుల క్రితమే లండన్ వెళ్లారు. హత్య విషయం తెలియగానే.. పాతబస్తీలోని డబీర్‌పురా ప్రాంతం లోని నూర్ఖాన్ బజార్‌లోని నదీమ్ ఇంటి వద్ద బంధువులు విషాదంలో మునిగిపోయారు. కాగా, నదీమ్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చే అవకాశాల్లేవని.. లండన్‌లోనే అంత్యక్రియలు జరి పే అవకాశముందని సన్నిహిత వర్గాలంటున్నాయి. దీంతో కొందరు సన్నిహిత కుటుంబసభ్యులే లండన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరి ప్రయాణానికి సహకరించాలంటూ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు. -
కత్తులతో వీరంగం కేసులో నిందితుల అరెస్ట్
చాంద్రాయణగుట్ట: మారణాయుధాలతో నడి రోడ్డుపై హల్చల్ చేసిన ఘటనలో ఐదుగురు నిందితులను ఫలక్‌నుమా పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఫలక్‌నుమా ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావుతో కలిసి ఏసీపీ డాక్టర్ ఎం.ఎ.రషీద్ వివరాలు వెల్లడించారు. నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇస్మాయిల్, మీర్జా ఖాదర్ బేగ్, కాలాపత్తర్‌కు చెందిన ఇమ్రాన్ అహ్మద్, బహదూర్‌పురాకు చెందిన గులాం ముస్తఫా, కాలాపత్తర్‌కు చెందిన మహ్మద్ హుస్సేన్ మరో ఇద్దరితో కలిసి ముఠాగా ఏర్పడి రౌడీయిజం చేస్తున్నారు. ఈ నెల 1వ తేదీ రాత్రి వీరు నవాబు సాహెబ్‌కుంటలో కత్తులు, బ్యాట్లతో హల్చల్ చేస్తూ ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేశారు. దీనిపై సమాచారం అందడంతో కాలాపత్తర్, ఫలక్‌నుమా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోగా వారు అక్కడినుంచి పరారయ్యారు. ఇద్దరు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసిన కాలాపత్తర్ పోలీసులు మిగిలిన ఐదుగురిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి కత్తులు, బ్యాట్లను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్సైలు ఎల్.రమేష్ నాయక్, కె.గొకారీ తదితరులు పాల్గొన్నారు. హత్యకు కుట్ర కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ ఇస్మాయిల్ వరుసకు సోదరుడయ్యే ఇర్షాద్‌ను హత్య చేసేందుకు పథకం పన్నాడు. దుబాయిలో ఉంటూ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఇర్షాద్ వద్ద రూ.కోట్లు ఉన్నందున అతడిని హత్య చేసి అతని ఆస్తులను కాజేయాలని ఇస్మాయిల్ భావించాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 1న రాత్రి అతడి ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు.ఇర్షాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులపై పలు కేసులు నిందితులపై గతంలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇస్మాయిల్ కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో ఐదేళ్లు జైలుకు వెళ్లి వచ్చాడు. మరో నిందితుడు మిర్జా ఖదీర్ బేగ్ అక్రమ ఆయుధాల కేసు ఉండగా, మూడో నిందితుడు ఇమ్రాన్‌పై మూడు కేసులు ఉన్నట్లు ఏసీపీ వివరించారు. -
బీజేపీ నేతపై దాడి
బంజారాహిల్స్: ఫిలింనగర్‌లోని భగత్‌సింగ్ కాలనీకి చెందిన బీజేపీ నగర ఉపాధ్యక్షుడు అరుణ్‌కుమార్‌పై స్క్రూ డ్రైవర్‌తో దాడి చేసిన నిందితులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. భగత్‌సింగ్ కాలనీలో నివసించే అరుణ్‌కుమార్ ఆదివారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా అదే బస్తీకి చెందిన టిప్పర్ డ్రైవర్ మురళి నిర్లక్ష్యంగా దూసుకొస్తూ అతడిని ఢీకొట్టాడు. దీనిపై అరుణ్‌కుమార్ ప్రశ్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మురళి అరుణ్‌కుమార్‌పై దాడికి యత్నించడమే కాకుండా అసభ్యపదజాలంతో దూషించాడు. అదే బస్తీకి చెందిన తన స్నేహితుడు ఎలక్ట్రీషియన్ అభిలాష్‌కు ఫోన్ చేసి పిలిపించాడు. అక్కడికి వచ్చిన అభిలాష్ తన చేతిలో ఉన్న స్క్రూ డ్రైవర్‌తో అరుణ్‌కుమార్ మెడపై విచక్షణా రహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అరుణ్‌కుమార్ వారి నుంచి బయటపడేందుకు యత్నించినా మద్యం మత్తులో అభిలాష్ స్నేహితుడు మురళితో కలిసి అరుణ్‌కుమార్‌ను గట్టిగా పట్టుకుని దాడి చేయడంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు బాధితుడిని సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించగా నిందితులిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని రాత్రి నిందితులను అరెస్ట్ చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా అరుణ్‌పై దాడి చేస్తున్న సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతని స్నేహితుడు విష్ణుపై కూడా నిందితులిద్దరూ దాడి చేశారు. -
బరితెగిస్తున్న బ్లేడ్ బ్యాచ్
బ్లేడ్ బ్యాచ్‌లు జిల్లాలో బరితెగిస్తున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయమైన జిల్లాలోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. రాత్రి వేళ కొందరు యాత్రికులు స్టేషన్లలో సేదదీరుతుంటారు. ఈ పరిస్థితులను బ్లేడ్ బ్యాచ్‌లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. చోరీల కోసం దాడులకు తెగబడుతున్నాయి. శనివారం రాత్రి ఇద్దరు ఓ రైల్వే టీటీఈపైనే కత్తితో దాడిచేశారు. ఈ సంఘటన తెలిసిన ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. చిత్తూరు అర్బన్: గతనెల 22వ తేదీ నగరి రైల్వే స్టేషన్లో బరితెగించిన గుర్తుతెలియని వ్యక్తులు నలుగురిపై బ్లేడులతో దాడులకు పాల్పడ్డారు. భిక్షగాళ్లని కూడా చూడకుండా బ్లేడులతో దాడులుచేసి ఉన్న డబ్బును లాక్కుని పారిపోయారు. తీవ్ర రక్తస్రావం మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందిన తరువాత నలుగురూ కోలుకున్నారు. ఈ దాడులు చేసింది ఎవరనేది ఇప్పటివరకు తెలియరాలేదు. ఇప్పుడు.. రేణిగుంట రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి ఇద్దరు సైకోలు ప్రయాణికుల్లా నటించారు. ఇక్కడున్న రైల్వే ప్లాట్‌ఫాం వంతెనపై పడుకుని ఉన్న ఓ ప్రయాణికుడి జేబులో డబ్బులు చోరీ చేస్తుండగా విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న టికెట్ కలెక్టర్ ఉమామహేశ్వరరావు అనుమానం వచ్చి ప్రశ్నించారు. వెంటనే జేబుల్లో ఉన్న బ్లేడులను తీసుకుని విచక్షణారహితంగా ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడ్డారు. ఎట్టకేలకు ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ తరహా దాడులకు పాల్పడుతున్న నింది తులు బ్లేడు బ్యాచ్‌కు చెందిన వారుగా నిర్ధారణ అయ్యిం ది. రేణిగుంటలో జరిగిన దాడిలో నిందితులు చెన్నైకి చెందిన వెంకటేష్, విజయన్‌గా గుర్తించారు. అయితే ఇద్దరు నిందితులను పట్టుకోవడంతో ఇంతటితో ఈ తరహా ఘటనలకు కళ్లెం పడ్డట్లుకాదని పోలీసులు చెబుతున్నారు. బ్లేడ్ బ్యాచ్‌లో ప్రస్తుతం పట్టుబడింది ఇద్దరు నిందితులే. ఇంకా ఈ ముఠాలో ఎందరు ఉన్నారు..? వీరి స్థావరం? వీరి లక్ష్యం ఏమిటని ఇద్దరు నిందితులను విచారించిన పోలీసులు పలు విషయాలను రాబట్టారు. దురలవాట్లే వ్యసనం ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల బ్లేడుబ్యాచ్‌లు వీరంగం సృష్టించాయి. విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు ప్రాంతాల్లో దాదాపు 13 మంది బ్లేడ్‌బ్యాచ్ నిందితులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. కేవలం చిల్లర డబ్బుల కోసం, వ్యసనాల కోసమే వీరు దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మద్యం తాగడానికి, గంజాయి సేవించడానికి డబ్బులు కావాల్సి రావడంతో రద్దీ ప్రాంతాల్లో ఒంటరిగా ఉండే ప్రయాణికులపై వీరు దాడులకు పాల్పడుతుంటారు. ఒక్క చోట ఉండరు ఇప్పటికే పట్టుబడ్డ బ్లేడ్‌బ్యాచ్ నిందితుల్లో ఏ ఒక్కరికీ స్థిరమైన చిరునామా అంటూ లేదు. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ దోపిడీలు చేస్తూ వీరు జీవనం సాగిస్తుంటారు. భార్య, పిల్లల్ని వీరితో పాటు ఎక్కడకూ తీసుకురారని పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. అయితే వీరిని అరెస్టుచేసి రిమాండుకు పంపిన తర్వాత కుటుంబ సభ్యులకు విషయం తెలిస్తే జామీను ఇవ్వడానికి మాత్రం బయటకొస్తారు. కోర్టుల్లో జరిగే విచారణకు హాజరుకాకుండా మరో ప్రాంతానికి వెళ్లిపోతారు. న్యాయస్థానాల్లో వీరిపై చాలా వరకు నాన్‌బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. లోతుగా విచారిస్తే.. రేణిగుంటలో పట్టుబడ్డ నిందితులు ఇద్దరిలో ఒకరి మానసిక పరిస్థితి బాలేదని పోలీ సులు గుర్తించారు. అయితే వీరి అలవాట్లు, ఎక్కడెక్కడ ఉంటారు, వీరి ముఠా నాయకుడు ఎవరైనా ఉన్నారా, బెయిల్ ఇప్పించడంలో కీలకపాత్ర పోషించే వ్యక్తి ఎవరు అనే కోణాల్లో పోలీసులు విచారిస్తే ఆసక్తికర విషయాలు బయటపడుతాయి. -
నాపై తొమ్మిది కేసులున్నాయి, నిన్నేస్తే పదో కేసు అవుతుంది
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఆఫీసర్స్ లైన్ వద్ద శుక్రవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు గొడవపడడం స్థానికంగా కలకలం రేపింది. ఇందులో ఒకతను ‘నేను నాని అనుచరుడిని రా.. నాపై తొమ్మిది కేసులున్నాయి, నిన్ను నరికేస్తే పదో కేసు అవుతుంది’’ అంటూ ఎదురుగా ఉన్న వ్యక్తిని కత్తితో నరికాడు. తలకు తీవ్ర గాయమైన వ్యక్తిని రోడ్డుపైనే కొడుతూ, కత్తితో నరకడానికి ప్రయత్నించగా మరికొందరు అడ్డుపడ్డారు. చివరకు సమాచారం అందుకున్న బ్లూకాట్ పోలీసులు ఇద్దరినీ అడ్డుతీసి స్టేషన్‌కు తరలించారు. పోలీసుల ఎదుటే నాని అనుచరుడిని అంటూ చెప్పుకున్న వ్యక్తి మళ్లీ దాడికి ప్రయత్నించాడు. కాగా కత్తితో నరికిన వ్యక్తి జానకారపల్లెకు చెందినవాడిగా, గాయపడ్డ వ్యక్తి సీఎంటీ రోడ్డుకు చెందిన యువకుడిగా తెలిసింది. గాయపడ్డ యువకుడిని చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
మద్రాసు హైకోర్టులో దారుణం.. జడ్జీ కళ్ల ముందే..
సాక్షి, చెన్నై : మద్రాసు హైకోర్టులో దారుణం చోటు చేసుకుంది. జడ్జీ కళ్లముందే భార్యను కత్తితో పొడిచాడు ఓ దుర్మార్గపు భర్త. చెన్నైకి చెందిన శరవణన్ తన భార్య వరలక్ష్మీలు ఓ కేసు విచారణకై ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసును జడ్జి కళైవానన్ విచారిస్తుండగా వరలక్ష్మీపై శరవణన్ కత్తి దాడికి దిగాడు. కోర్టు హాలులో ఉన్న వరలక్ష్మీ దగ్గరకు ఆవేశంగా పరుగెత్తుకొచ్చి కత్తితో పొడిచాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది శరవణన్‌ను అడ్డుకున్నారు. గాయాల పాలైన వరలక్ష్మీని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
అనుమానం పెనుభూతం
హస్తినాపురం: భార్యపై అనుమానంపై పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేయడమేగాకుండా తానూ కడుపులో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా, నకిరేకల్ మండలం, కొండారం గ్రామానికి చెందిన మారెడ్డి చెన్నక్రిష్ణారెడ్డి, భార్య పద్మజ దంపతులు వనస్థలిపురం, బీడీఎల్ కాలనీలోని నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు రాకేశ్, రాహుల్. పద్మజ టైలరింగ్ పనిచేస్తుండగా పెద్ద కుమారుడు రాకేశ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. చిన్న కుమారుడు రాహుల్ ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఏ పని లేకుండా ఖాళీగా ఉండే చెన్నక్రిష్ణారెడ్డి తరచూ భార్యను అనుమానించేవాడు. ఆమె ఎవరితో మాట్లాడినా భార్యతో గొడవ పడేవాడు. దీంతో రెండేళ్లుగా పద్మ కుమారులతో కలిసి వేరుగా ఉంటోంది. సోమవారం పద్మజ హైకోర్టు కాలనీలో ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లివచ్చింది. అదే సమయంలో ఇంటికి వచ్చిన క్రిష్ణారెడ్డి భార్యతో గొడవపెట్టుకున్నాడు. దీంతో ఆగ్రహానికి లోనైన అతను మాంసం కోయడానికి ఉపయోగించే కత్తితో ఆమెపై దాడి చేశాడు. అతడి భారి నుంచి తప్పించుకున్న పద్మజ పక్కింట్లోకి పారిపోయేందుకు ప్రయత్నించగా ఆమెను వెంబడించిన క్రిష్ణారెడ్డి కుట్టుమిషన్‌పై ఉన్న కత్తెరతో వెనుకనుంచి బలంగా పొడవడంతో కుప్పకూలింది. అనంతరం అతను తన చేతిలో ఉన్న కత్తితో కడులో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని గుర్తించిన స్థానికులు 100 నంబర్‌కు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటయ్య తెలిపారు. -
తనవెంట ఇంటికి రాలేదని...
గోల్కొండ: తనవెంట ఇంటికి రావడంలేదని భార్యతో గొడవపడిన భర్త ఆమెపై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటన బుధవారం గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గోల్కొండకు చెందిన రూబీనా, రియాజ్ భార్యాభర్తలు. కాగా పెళ్లైన తర్వాత రియాజ్ జులాయిగా తిరుగుతూ చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఈ విషయంపై తరచూ భార్యాభర్తల మధ్య గొడవ జరిగేది. భర్త ప్రవర్తనకు విసిగిపోయిన రూబీనా వారం రోజుల క్రితం గోల్కొండలోని పుట్టింటికి వెళ్లిపోయింది. బుధవారం మధ్యాహ్నం అత్తింటికి వచ్చిన రియాజ్.. భార్యను తనతో ఇంటికి రమ్మని చెప్పగా ఆమె నిరాకరించింది. కోపోద్రిక్తుడైన రియాజ్ తనవెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేసి పరారయ్యాడు రూబీనా మెడ, చెవి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. విషయం పోలీసుకు చేరవేయడంతో వారు అక్కడికి చేరుకుని బాధితురాలిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించలేదని వివాహితపై దాడి
చెన్నై , తిరువొత్తియూరు: ప్రేమించలేదని వివాహితపై దాడిచేసిన వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. చెన్నై అరుంబాక్కం రాణి అన్నానగర్ నావలర్ వీధికి చెందిన శరణ్య (26) అదే ప్రాంతంలోని బ్యూటీపార్లర్‌లో పనిచేస్తోంది. ఆరేళ్ల క్రితం వివాహమైన ఈమెకు ఒక కుమార్తె(5) ఉంది. ఈ క్రమంలో ఏడాదిగా భర్త నుంచి విడిపోయి జీవిస్తోంది. శరణ్య పనిచేస్తున్న చోటే విక్టర్ (41) నిర్వాహక విభాగంలో పనిచేస్తున్నాడు. ఇతనికి ఇంకా వివాహం కాలేదు. ఓటేరి నమ్మాళ్వార్ పేటలో నివాసం ఉంటున్నాడు. నాలుగు నెలలుగా శరణ్యతో పరిచయం ఏర్పడి ప్రేమించమని ఒత్తిడి తీసుకొస్తున్నాడు. అందుకు శరణ్య ఒప్పుకోకపోగా తిరిగి ఆమె నెల రోజులుగా భర్తతో కలిసి ఉంటోంది. విషయం తెలుసుకున్న విక్టర్ శనివారం మధ్యాహ్నం బ్యూటీ పార్లర్ వద్దకు వెళ్లి శరణ్యను ప్రేమించమని బలవంతం చేశాడు. ఆమె తిరస్కరించడంతో తాన వెంట తెచ్చుకున్న కత్తితో శరణ్య గొంతు భాగంలో పొడిచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శరణ్యను చికిత్స నిమిత్తం కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. దీనిపై కేసు నమోదు చేసి ఓటేరిలో ఉన్న విక్టర్‌ను ఆదివారం అరెస్టు చేశారు. -
సిగరెట్ తాగొద్దన్నందుకు కంట్లో పొడిచాడు
కర్ణాటక, కృష్ణరాజపురం: సిగరెట్ తాగొద్దన్నందుకు ఓ వ్యక్తి తన భార్య కంట్లో కత్తితో పొడిచిన ఘటన గురువారం రాత్రి బాణసవాడిలో చోటు చేసుకుంది. లింగరాజపురంలో నివసిస్తున్న ధర్మ అనే వ్యక్తి చాలా కాలంగా దురలవాట్లకు బానిసయ్యాడు. ఈ క్రమంలో కొద్ది కాలం క్రితం ధర్మకు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో వైద్యపరీక్షలు చేసిన వైద్యులు ఇకపై సిగరెట్లు తాగొద్దంటూ సూచించారు. అయినా వినని ధర్మ సిగరెట్లు తాగేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా సిగరెట్ తాగుతుండగా గమనించిన భార్య గాయత్రి సిగరెట్ తాగొద్దంటూ సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన ధర్మ కత్తితో గాయత్రి కంట్లో పొడిచాడు. గాయత్రి కేకలు వేస్తూ బయటకు రావడంతో గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాణసవాడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
విందులో రగడ కర్రీస్ అయిపోవడంతో..
చెన్నై,తిరువొత్తియూరు: విందులో ఏర్పడిన రగడలో ఐదుగురు కత్తిపోట్లకు గురయ్యారు. వివరాలు.. వందవాసి, మేల్‌నెమిలి గ్రామానికి చెందిన యువకుడికి, చెన్నై పెరుంగళత్తూరుకి చెందిన యువతితో వందవాసి టౌన్ ఆరణి వివాహ మండపంలో ఆదివా రం వివాహం జరిగింది. శనివారం రాత్రి ఆహ్వాన కార్యక్రమాలు, విందు భోజనాలు జరి గాయి. అర్ధరాత్రి సమయంలో చెన్నై పల్లావరానికి చెందిన వధువు తండ్రి ఆర్ముగం స్నేహితుడు శ్రీని వాసన్ (బిరియానీ మాస్టర్) అతని భార్య ప్రమీల వచ్చారు. ఆ సమయంలో శ్రీనివాసన్ దంపతులకు వధువు బంధువు పచ్చయప్పన్ భోజనం వడ్డిస్తున్నాడు. కర్రీస్ అయిపోవడంతో ఆకులో వడ్డించలేదు. దీనిపై వారిని శ్రీనివాసన్ ప్రశ్నించడంతో వాగ్వాదం ఏర్పడింది. దీంతో ఆగ్రహించిన పచ్చయప్పన్, అతని బంధువులు.. శ్రీనివాసన్‌పై దాడి చేశారు. వెంటనే శ్రీనివాసన్ కత్తితో పచ్చయప్పన్, అతని బంధువులు మునస్వామి, ఆకాష్, శేఖర్, రాజాలపై దాడి చేశాడు. దీంతో గాయపడ్డ వారిని వందవాసి ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న శ్రీని వాసన్‌ను అరెస్టు చేశారు. -
నల్లగొండలో సైకో విద్యార్ధి వీరంగం
-
ఆధార్ కార్డు ఇవ్వలేదని భార్యపై కత్తితో దాడి..
టీ.నగర్: ఆధార్ కార్డు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన భర్త భార్యపై కత్తితో దాడి చేసి అనంతరం తానూ చెయ్యి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇరువురూ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన చెన్నై అరుంబాక్కంలో సోమవారం చోటుచేసుకుంది. అరుంబాక్కం తిరువీధియమ్మన్ ఆలయ వీధికి చెందిన రమేష్ (44), దేవి (36) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. ఒక కుమార్తె కోవైలోని స్కూలులో చదువుతోంది. మరో కుమార్తె చెన్నైలోని స్కూలులో ఏడో తరగతి చదువుతోంది. దంపతుల మధ్య అభిప్రాయభేదాల కారణంగా ఎనిమిదేళ్లుగా విడిగా జీవిస్తున్నారు. దీంతో రమేష్ మానసిక స్థితి దెబ్బతింది. అదే ప్రాంతంలోని అంబేడ్కర్ నగర్లో నివశిస్తున్నాడు. సోమవారం ఉదయం రమేష్ భార్యను చూసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో భార్య వద్దనున్న ఆధార్ కార్డు ఇవ్వమని కోరాడు. ఆమె నిరాకరించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో ఆగ్రహించిన రమేష్ భార్యపై కత్తితో దాడి చేసి తరువాత చేయ్యి నరుక్కుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం అందుకున్న అరుంబాక్కం పోలీసులు ఇరువురిని కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
యువకుడిపై యువతి కత్తితో దాడి..
తనకల్లు: యువకుడిపై యువతి కత్తితో దాడిచేసిన ఘటన కలకలం రేపింది. అయితే తాను ఆత్మరక్షణ కోసమే దాడి చేసినట్లు యువతి చెబుతోంది. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రం తనకల్లులోని ఇందిరానగర్‌కు చెందిన స్వప్న అనే యువతి సోమవారం అయ్యప్పస్వామి ఆలయం వద్ద ఒంటరిగా కూర్చుంది. అదే సమయంలో ఆలయ పూజారి బంధువు మంజునాథ్ లైట్లు వేసేందుకని స్విచ్‌బోర్డు దగ్గరకు వెళ్లబోయాడు. అతను దురుద్దేశంతో తనవద్దకే వస్తున్నాడని భావించిన స్వప్న తన దగ్గర ఉన్న కత్తితో అతడి తలపై దాడి చేసింది. గాయపడిన మంజునాథ్‌ను స్థానికులు, బంధువులు కదిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆత్మరక్షణకే అంటున్న అమ్మాయి తాను ఆత్మరక్షణలో భాగంగానే మంజునాథ్‌పై దాడి చేయాల్సి వచ్చినట్లు స్వప్న పోలీసులకు తెలిపింది. ఒంటరిగా కూర్చొని ఉన్న తన వద్దకు ఆతడు వేగంగా రాబోయాడని, తాను దగ్గరకు రావద్దని ఎంత వారించినా అతను అటే రావడంతో భయపడి తన వద్ద ఉన్న చిన్నపాటి కత్తితో దాడి చేసినట్లు పేర్కొంది. -
భార్యపై కత్తితో దాడి
చిత్తూరు , గుడిపాల: తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని పరువు తీస్తోందని, పోలీసులు తీరు మార్చుకోవాలని హిత వు పలికినా మారలేదని ఆగ్రహించాడు. తానింట్లో ఉన్న స మయంలోనే దూరంగా ఉన్న మరో వ్యక్తికి సైగలు చేస్తుండటంపై గమనించి కుతకుత ఉడికిపోయాడు. కత్తితో భార్యపై దాడి చేశాడు. గుడిపాల ఎస్ఐ విక్రమ్ కథనం..వసంతాపురం దళితవాడకు చెందిన సైమన్(40)అదే దళితవాడలోని శోభ(25)కు పదేళ్ల క్రితం వివామైంది. సైమన్ గ్రానైట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. కొన్ని రోజులుగా భార్య తీరు మరోలా ఉండడంతో అనుమానించాడు. గ్రామంలోని మరో వ్యక్తితో వివాహేతర సంబం ధం కొనసాగిస్తోందంటూ కొంతకాలంగా ఆమెతో గొడవ పడుతున్నాడు. పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇద్దరికీ నచ్చజెప్పారు. బుద్ధిగా మసలుకోవాలని శోభకు హితవు పలికారు. ఈ నేపథ్యంలో బుధవారం దంపతులిద్దరూ చిత్తూరుకు వెళ్లి ఇంటికి వచ్చారు. సైమన్ బాత్రూంకి వెళ్లి వచ్చేసరికి శోభ అదే దళితవాడలోని మరో వ్యక్తికి దూరం నుంచి సైగలు చేస్తుండటం గమనించి నిలదీశాడు. శోభ నిర్లక్ష్యంగా బదులివ్వడంతో ఆగ్రహించిన సైమన్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. తలపై తీవ్రగాయమైంది. చేయి విరిగిపోయింది. స్థానికులు ఆమెను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సైమన్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. -
కూతుర్ని ప్రేమికుడితో చూసి..
గూడూరు: కన్న కూతురు ప్రియుడితో ఉండడాన్ని చూసిన తండ్రి సహనం కోల్పోయి, కత్తితో దాడి చేయగా అడ్డుగా వచ్చిన కుమార్తె గాయపడి ఆసుపత్రి పాలైన సంఘటన శుక్రవారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో చోటుచేసుకుంది. ఎస్ఐ హుస్సేన్‌బాషా తెలిపిన మేరకు.. నరశింగరావుపేటలో కూకటి సిద్ధయ్య కుటుంబం నివాసముంటోంది. సిద్ధయ్య గొర్రెల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని కుమార్తె దేవయాని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన జావీద్ ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. దేవయాని, జావీద్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. దేవయాని తండ్రి సిద్ధయ్య ప్రతి శుక్రవారం సంతకు వెళ్లి గొర్రెలు కొనుగోలు చేసి, వాటిని చెన్నైకి తీసుకెళ్లి విక్రయిస్తూ వస్తుంటాడు. శుక్రవారం తెల్లవారుజామునే సిద్ధయ్య చిల్లకూరులో జరిగే సంతకు వెళ్లాడు. తల్లి లక్ష్మి బయటకు వెళ్లింది. దీంతో దేవయాని తన ప్రియుడు జావీద్‌ను ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. జావీద్ సిద్ధయ్య ఇంటికి వచ్చాడు. సంతకు వెళ్లిన సిద్ధయ్య గొర్రెలు కొనుగోలు చేసేందుకు ధరలు అనుకూలంగా లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చి తలుపు తట్టగా, భయాందోళనకు గురైన దేవయాని, జావీద్‌ను దేవునిమూల చాటుగా దాచి తలుపు తీసింది. సిద్ధయ్య ఇంట్లోకి వచ్చి నగదును బీరువాలో ఉంచేందుకు దేవుని గదిలోకిరాగా, అక్కడ నక్కి ఉన్న జావీద్‌ను చూసి కోపోద్రిక్తుడయ్యాడు. చాకుతో జావీద్‌పై దాడి చేయబోగా దేవయాని అడ్డుగా వచ్చింది. ఆమె తలకు గాయమైంది. పొరుగువారు గాయపడిన దేవయానిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ హుస్సేన్‌బాషా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య గొంతు కోసిన భర్త
గుంటూరు, కొండపల్లి(ఇబ్రహీంపట్నం): భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కత్తితో దాడి చేసిన ఘటన కొండపల్లి శ్రామికనగర్లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు.. గ్రామానికి చెందిన బురుసు పద్మావతికు గుంటూరు ఎన్టీఆర్ నగర్‌కు చెందిన బురుసు వెంకటేశ్వరరావుతో వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు. భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తాయి. ఆమె 20 రోజుల క్రితం శ్రామికనగర్‌లోని పుట్టింటికి పిల్లలను తీసుకుని వచ్చింది. తండ్రి దగ్గర ఉంటున్న ఆమెను గుంటూరు తీసుకెళ్లేందుకు శుక్రవారం ఉదయం భర్త వెంకటేశ్వరరావు వచ్చాడు. ఇంటికి రమ్మని భార్యను కోరాడు. ఇద్దరు గొడవపడ్డారు. అప్పటికే జేబులో తెచ్చుకున్న కత్తితో భార్య గొంతు కోశాడు. ఈ ఘటనతో కుప్పకూలిపోయిన భార్యను హతమార్చేందుకు యత్నించాడు. స్థానికులు అతడిని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలని చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అక్క ప్రియుడిపై కత్తితో దాడిచేసిన సోదరుడు
చెన్నై, తిరువొత్తియూరు: వివాహిత ప్రియుడితో పారిపోయిన వ్యవహారంలో వారిని పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారణ చేస్తున్నారు. ఆ సమయంలో ప్రియుడిపై వివాహిత తమ్ముడు కత్తితో దాడి చేశాడు. విరుదాచలం, పెన్నాడు సమీపం కొత్తపై గ్రామానికి చెందిన వసంతకుమార్ (27). అతనికి బంధువు అయిన సెల్వవేల్ కుమార్తె శశిప్రియ (26)తో ఆరు నెలల క్రితం వివాహం అయ్యింది. గత నెలలో పుట్టింటికి వెళ్లిన శశిప్రియకు పడుగలై గ్రామానికి చెందిన ప్రకాష్ (28)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ ఊరు వదలి పారిపోయారు. దీనిపై వసంతకుమార్, అతని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెన్నడం పోలీసులు చెన్నైకి వెళ్లి శశిప్రియ, ప్రకాష్ ఇద్దరిని పోలీసుస్టేషన్‌కు రప్పించారు. శశిప్రియ, వసంతకుమార్, ప్రకాష్‌ల తల్లిదండ్రులను పోలీసుస్టేషన్‌కు రప్పించి చర్చలు జరుపుతున్నారు. ఆ సమయంలో శశిప్రియ తాను ప్రకాష్‌తో వెళతానని చెప్పినట్టు తెలిసింది. దీంతో ఆగ్రహం చెందిన శశిప్రియ తమ్ముడు శ్రీరంగన్ (25) తాను వెంటతెచ్చుకున్న కత్తిని బయటకు తీసి ప్రకాష్ ముఖంపై దాడి చేశాడు. తదుపరి తిరిగి అతనిపై దాడికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. తీవ్ర గాయాలైన ప్రకాష్‌ను పెన్నాడం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు అందుకున్న పెన్నడం పోలీసులు శ్రీరంగన్ను అరెస్టు చేశారు. -
అనుమానంతో భార్యపై భర్త దాడి
విజయనగరం, భోగాపురం: అనుమానంతో భార్యపై భర్త దాడిచేసిన సంఘటన మండలంలోని రాజాపులోవలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వనుము పాపయ్య, అతని భార్య గురమ్మల మధ్య రెండు రోజులుగా చిన్న చిన్న తగాదాలు జరుగుతున్నాయి. పాపయ్యకి తన భార్యపైన అనుమానం ఎక్కువగా ఉండడంతో ఆమెను పనికి పంపకుండా, తాను పనికి వెళ్ళకుండా ఇబ్బందులు పెడుతుండేవాడు. వీరికి ఏడేళ్ల వయసున్న బాబు.. ఐదేళ్ల వయసున్న పాప ఉన్నారు. అయి తే ఆదివారం ఏమైందో ఏమో వారిద్దరి మధ్య తగాదా మొదలైంది. ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో పాపయ్య తన భార్య గురమ్మపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు 108 వాహనంలో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. ఎస్సై ఉపేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
యువకులపై కత్తులతో దాడి
కర్నూలు , నంద్యాల: పట్టణంలో రౌడీమూకలు రెచ్చిపోతున్నాయి. రైల్వే స్టేషన్ వద్ద రెండు గ్రూపులు గొడవ పడి కొట్టుకున్నఘటన మరువకముందే మరో రెండు గ్రూపులు గురువారం ఘర్షణకు దిగి ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో బైటిపేటకు చెందిన ఆటోడ్రైవర్ రాజు, వినోద్‌లు గాయపడ్డారు. రాజు పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నంద్యాల త్రీటౌన్ సీఐ సుదర్శన్‌ప్రసాద్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..పట్టణంలోని ఆర్జీఎం కాలేజీలో చదువుతున్న వార్డు కౌన్సిలర్ కుమారుడిని పట్టణంలోని రైతుబజార్ వద్ద దేవనగర్‌కు చెందిన కొందరు యువకులు కొడుతుండగా బైటిపేటకుచెందిన రవిరాజ్ అనే వ్యక్తి విడిపించే ప్రయత్నం చేశారు. విడిపించడానికి వచ్చిన రవిరాజును సైతం చితకబాదారు. దీంతో రవిరాజ్‌కు చెందిన బంధువులు ఎందుకు కొట్టారని బైటిపేటకు చెందిన యువకులను ప్రశ్నించడంతో మాట్లాడుకుందాం రమ్మని నౌమాన్నగర్లోని ఏవీ సుబ్బారెడ్డి అపార్టుమెంట్ వద్దకు పిలిపించారు. దీంతో రెండు వర్గాలకు చెందిన యువకులు మాటకు మాటకు వచ్చి ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో బైటిపేటకు చెందిన రాజు, వినోద్‌లను దేవనగర్‌కు చెందిన ఖాజా, అనిల్‌తో పాటు మరో కొంత మంది బైటిపేటకు చెందిన రాజు, వినోద్‌లను పిడిబాకులతో పొడిచారు. ఈ ఘటనలో రాజుకు తీవ్ర రక్తస్రావమైంది. దీంతో ఇరువర్గాలు ఎక్కడి వారి అక్కడ చెల్లా చెదురు అయ్యారు. వెంటనే గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా రవి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తరలించారు. ఈ దాడులు చేసుకున్న వారిలో రౌడీషీటర్లు, యువకులు, విద్యార్థులు ఉన్నారు. విషయం తెలుసుకున్న నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణ, టూటౌన్ సీఐ సుదర్శన్‌ప్రసాద్ వెంటనే నంద్యాల ప్రభుత్వాసుపత్రికి చేరుకొని పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ గోపాలకృష్ణ మాట్లాడుతూ.. అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జరిగిన ఘర్షణపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. -
మాజీ కౌన్సిలర్ కుమార్తెపై టీడీపీ నాయకుడి దాడి
ప్రకాశం , కందుకూరు అర్బన్: పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు ఓ మాజీ కౌన్సిలర్ కుమార్తెపై కత్తితో దాడి చేశాడు. ఫలితంగా ఆమె ఎడమచేతికి 3 కుట్లు పడ్డాయి. ఈ సంఘటన శ్రీరామ్‌నగర్‌లో ఆదివారం జరిగింది. క్షతగాత్రురాలి బంధువుల కథనం ప్రకారం..మున్సిపాలిటీలోని 14వ వార్డు మాజీ కౌన్సిలర్ పుష్ప కుమార్తె రమాదేవి వివాహం అనంతరం స్థానికంగా నివాసం ఉంటోంది. బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్తూ తన అన్న వైఎస్సార్ సీపీ నాయకుడు మాధవరావు ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో టీడీపీ చెందిన సుధాకర్ అనే వ్యక్తి మద్యం తాగి మాధవరావు ఇంటి ముందు నిలబడిఅసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు. రమాదేవి నువ్వు ఎవరిని తిడుతున్నావని ప్రశ్నించింది. మీ అన్ననే కావాలని తిడుతున్నానని సుధాకర్ చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. సుధాకర్ కత్తితో రమాదేవిని పొడవడంతో ఆమె ఎడమ చేతికి గాయమైంది. వెంటనే రామాదేవి తన అన్న మాధవరావుకు సమాచారం ఇవ్వడంతో ఆయన సంఘటన స్థలానికి చేరుకొని రమాదేవిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లాడు. దీన్ని గమనించిన సుధాకర్ తన తలను గోడకేసి కొట్టుకొని తనపై కూడా దాడి చేశారని పోలీసుస్టేషన్ ఫిర్యాదు చేశాడు. బాధితులు ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. సుధాకర్ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో పోలీసులు ఆయనకు వత్తాసు పలికారు. కత్తితో దాడి చేసిన సుధాకర్‌ను వదిలి గాయపడిన బాధితురాలి అన్నతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి పోలీసుస్టేష్టన్‌లో పెట్టారు. పోలీసులు తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు అండగా నిలవాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ అన్యాయంగా తమపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారని బాధితులు వాపోయారు. సుధాకర్ మాత్రం తనపై రమాదేవి బంధువులు దాడి చేయడంతో తలకు బలమైన గాయాలయ్యాయని ఆరోపిస్తుండటం గమనార్హం. -
జనతా గ్యారేజీ ఘటనలో 23 మందిపై కేసు
గుంటూరు, తాడేపల్లిరూరల్: తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి గ్రామంలో జనతా గ్యారేజీ పేరుతో కత్తి పట్టుకుని హల్చల్ చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు ప్రదీప్‌తో పాటు మొత్తం 23 మందిపై కేసు నమోదు చేసినట్టు తాడేపల్లి పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గాజుల సాయి సురేష్ తనపై దాడి కేసులో ప్రదీప్‌తో పాటు గ్రామంలో ఒకే ఇంటి పేరు ఉన్న 23మంది యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారందరిపై కేసు నమోదు చేశారు. దీంతో గ్రామంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ గొడవలు ఎటుపోయి, ఎటు వస్తాయోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. జనతాగ్యారేజీ గ్రూపు సభ్యులకు కౌన్సెలింగ్ ఉండవల్లిలో జనతాగ్యారేజీ పేరుతో ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటుచేసి, ఎటువంటి సమస్యలున్నా మాకు చెప్పండి మేం పరిష్కరిస్తాం అంటూ చెబుతూ అరాచకాలు సృష్టిస్తూ, రోడ్డుమీద కత్తి పట్టుకొని తిరిగిన ప్రదీప్, అతని అనుచరులకు నార్త్‌జోన్ డీఎస్పీ జి.రామకృష్ణ బుధ, గురువారాల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక నుంచి ఎవరైనా జనతాగ్యారేజీ లాంటి గ్రూపుల్లో సభ్యులుగా చేరితే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 25 మంది సభ్యులున్న ఈ గ్రూపులో ఒకరో, ఇద్దరో తప్ప మిగతావారందరూ ఏమీ తెలియని అమాయకులు కావడంతో, మొదటి తప్పుగా వారికి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నట్టు చెప్పారు. ఎవరైనా ఇలాంటి గ్రూపులు ఏర్పాటుచేసి, అసాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
నిప్పురవ్వ పడిందని కత్తితో దాడి
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): బాణసంచా నిప్పు రవ్వ పడిందన్న నెపంతో ఒక యువకుడు మరో యువకుడిని కత్తితో పొడిచాడు. ఎంవీపీ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెదజా లారిపేట కాలనీలో దీపావళి సందర్భంగా బుధవారం రాత్రి యువకులు రోడ్లపై బాణసంచా కాల్చారు. ఆ సమయంలో అక్కడి ఆటోడ్రైవర్ చందనాల దాసు(30) కాల్చిన బాణసంచాకి సం బంధించిన నిప్పు రవ్వలు సమీపంంలోనే ఉన్న మదుపాన శ్రీనివాస్‌పై పడ్డాయి. దీంతో ఆగ్రహించిన శ్రీను తన వద్ద ఉన్న కత్తితో దాసు కడుపులో పొడిచాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు దాసుని హుటాహుటిన 108అంబులెన్సులో కేజీ హెచ్‌కి తరలించారు. కొద్దిరోజుల క్రితమే ఈ ఇద్ద రు యువకుల కుటుంబాల మధ్య గొడవ జరి గింది. పది రోజుల క్రితం నిందితుడు శ్రీను సోదరుడు రాజుకి జ్వరం రావడంతో దాసు తండ్రి సత్తయ్య చేతబడి చేశాడంటూ అతని కుటుంబ సభ్యులతో గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో శ్రీను పాత గొడవ మనసులో ఉంచుకునే బాణసంచా నెపంతో దాడి చేశాడని పోలీసుల విచారణలో తేలింది. దాసు సోదరుడు పోలారావు ఫిర్యాదు మేరకు ఎంవీపీ సీఐ కె.ఈశ్వరరావు పర్యవేక్షణలో ఎస్ఐ ఐ.గోపి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పానీపూరి బండి వద్ద వివాదం
నెల్లూరు(క్రైమ్): పానీపూరి తినే క్రమంలో వివాదం నెలకొని దుండగులు కత్తులతో అన్నదములపై దాడిచేసి పరారైన ఘటన నెల్లూరులోని బీవీనగర్ సెంటర్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీ సుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజ స్తాన్ రాష్ట్రం కరోలి జిల్లా రూమ్తాకాపూరు మండలం మాసరోపూరు గ్రామానికి చెందిన సంతోష్‌కుమార్, జండేర్ అలియాస్ బబ్లూలు అన్నదమ్ములు. వారు పదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వలస వచ్చారు. ఆర్టీఓ కార్యాలయం సమీప అనగుంట కాలనీలో ఇళ్లు అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. మార్బుల్స్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొద్దిరోజులుగా అన్నదమ్ములిద్దరూ మనుమసిద్ధినగర్‌లో పనిచేస్తున్నారు. మాటామాటా పెరిగి.. శుక్రవారం రాత్రి ఇద్దరూ పనులు ముగించుకుని బీవీనగర్ మైన్స్ కార్యాలయం సమీపంలో పానిపూరి తింటుండగా ఇద్దరు వ్యక్తులు కేటీర్ (కరిజ్మా) బైక్‌పై పానీపూరి తీనేందుకు బండి వద్దకు వచ్చారు. అక్కడ బైక్‌పై వచ్చిన వ్యక్తులు పానీపూరి తినేక్రమంలో అన్నదమ్ములపై నీళ్లుపడ్డాయి. చూసుకుని తినండి అని వారు ఇద్దరు వ్యక్తులకు సూచించారు. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగింది. ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా తమ బైక్‌లో ఉన్న కత్తులు తీసి అన్నదమ్ముల వీపులపై విచక్షణారహితంగా దాడిచేసి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావంతో సంతోష్‌కుమార్, జండేర్లు అక్కడే కూలబడిపోయారు. స్థానికులు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది శ్రీను ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. విభిన్న కోణాల్లో దర్యాప్తు సమాచారం అందుకున్న నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, వేదాయపాళెం ఇన్స్పెక్టర్ నరసింహారావులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను, పానీపూరి బండి యజమానిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. వారు ఖచ్చితమైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వద్దకు వెళ్లి మాట్లాడారు. వారి ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ నరసింహారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఘటనపై పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిందితులకు, బాధితులకు గతంలో ఏవైనా గొడవలున్నాయా? లేదా అనుకోకుండా ఈ ఘటన జరిగిందా?, అలా జరిగి ఉంటే నిందితులు బైక్‌లో కత్తులెందుకు పెట్టుకుని తిరుగుతున్నారు. వారెవరు? తదితర వివరాల సేకరణలో పోలీసులు నిమగ్నమయ్యారు. సీసీపుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కాగా ఘటన జరగకముందు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి బీవీనగర్ ప్రాంతాన్ని పరిశీలించారు. గురువారం రాత్రి ఆ ప్రాంతంలో చైన్‌స్నాచింగ్ జరిగింది. ఆ బాధితురాలిని ఎస్పీ విచారించినట్లు సమాచారం. -
దారుణం : విద్యార్థినిపై టీచర్ కత్తి దాడి
సాక్షి, కర్నూలు : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. కత్తితో బాలిక గొంతు కోసి అనంతరం తాను గొంతు కోసుకున్నాడు. కర్నూలులోని రాక్‌వుడ్ హైస్కూల్‌కు చెందిన హిందీ పండిట్ శంకర్ అదే పాఠశాలకు చెందిన ఓ తొమ్మిదో తరగతి విద్యార్థినిపై శనివారం ఉదయం దాడి చేశారు. మద్యం మత్తులో బాలిక ఇంట్లోకి చొరబడి కత్తితో బాలిక గొంతు కోశారు. అనంతరం తాను గొంతు కోసుకున్నాడు. బాలిక కేకలు విని స్థానికులు ఇంట్లోకి వచ్చి శంకర్‌ను అడ్డుకున్నారు. తర్వాత అతన్ని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచరం. ప్రేమ వ్యవహారమే దాడికి కారణమని స్థానికులు చెబుతున్నారు. -
భార్యపై కత్తితో దాడి
విజయనగరం, శృంగవరపుకోట రూరల్: భార్యపై భర్త కత్తితో దాడి చేసి గాయపరిచిన సంఘటన ఎస్.కోట మండలం కొత్తూరు గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితురాలు, ప్రత్యక్ష సాక్షులు తెలియజేసిన వివరాల ప్రకారం.. ఎస్.కోట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన యర్రా లీల (24)ను లక్కవరపుకోట మండలం నీలకంఠాపురం గ్రామానికి చెందిన ఎర్నాయుడుకు ఇచ్చి రెండేళ్ల కిందట వివాహం చేశారు. కొద్దికాలం వీరి కాపురం సజావుగానే సాగింది. అనంతరం అనుమానంతో ఎర్నాయుడు తన భార్యపై పలుమార్లు దాడి చేశాడు. ఇదిలా ఉంటే లీల ఇటీవల గర్భం దాల్చింది. ఒంట్లో నీరసంగా ఉండడంతో దసరా పండుగ ముందు కొత్తూరులోని అమ్మగారింటికి వచ్చింది. గురువారం సాయంత్రం అత్తారింటికి వచ్చిన ఎర్నాయుడు శుక్రవారం సాయంత్రం భార్య లీలతో గొడవపడ్డాడు. నాతో ఇంటికి వస్తావా..? రావా..? అంటూ ప్రశ్నించాడు. దీపావళి తర్వాత వస్తానని లీల చెబుతుండగా, తాటికమ్మలు నరికే కత్తితో చేతులు, వీపుపై దాడి చేశాడు. అనంతరం కత్తితో తన చేతిపై కూడా గాయం చేసుకున్నాడు. వెంటనే స్థానికులు స్పందించి వారిద్దరినీ ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా భార్యే దాడి చేసింది.. ఇంటికి వస్తావా, రావా అని నా భార్యను నిలదీశాను. ఇంతలో గ్యాస్‌స్టవ్ సమీపంలో ఉన్న కత్తితో నాపై దాడి చేసింది. ఆమె చేతిలో ఉన్న కత్తి తీసుకునే ప్రయత్నంలో నాకు గాయమైంది. అనంతరం ఆమెపై చిన్నగా దాడి చేశాను. – ఎర్నాయుడు, నిందితుడు కట్నం కోసం హింసిస్తున్నాడు పెళ్లైనప్పటి నుంచి మా అల్లుడు ఎర్నాయుడు కట్నం కోసం నా కుమార్తెను వేధిస్తున్నాడు. ఎవరితో మాట్లాడినా అనుమానం కట్టి హింసిస్తున్నాడు. నేను ఇంట్లో లేని సమయంలో నా కుమార్తెపై దాడి చేశాడు. – అప్పలకొండ, బాధితురాలి తల్లి -
విచ్చుకత్తితో క్షణాల్లో ప్రాణాలు హరీ...
సాక్షి, అమరావతి బ్యూరో: అరచేతిలో పట్టేంత కత్తితో ప్రాణాలు తీయవచ్చా... అంటే అవును సాధ్యమే అని చరిత్ర చెబుతోంది. పోలీసు శిక్షణ తరగతుల సిలబస్ సైతం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అరచేతిలో పట్టేంత చిన్న విచ్చుకత్తి విష సంస్కృతికి సుదీర్ఘ చరిత్ర ఉంది. అప్పట్లో భారతీయ రాజులను అంతమొందించేందుకు బ్రిటీష్ పాలకులు వీటిని భారత్‌లోకి తీసుకువచ్చారు. బ్రిటీష్ పరిపాలన అంతమైనా ఆ విష సంస్కృతి అవశేషాలు ఇంకా దేశంలో మిగిలే ఉన్నాయి. విచ్చు కత్తుల విష సంస్కృతికి పుట్టినిల్లు మధ్య ఆసియా దేశం ఆర్మేనియా. అరచేతిలో పట్టేంత చిన్న కత్తులతో ప్రత్యర్థి ప్రాణాలు సులువుగా తీయడంలో ఆర్మేనియాలోని ఓ తెగ ప్రజలు సిద్ధహస్తులు. కేవలం నిమిషంలో 70 కత్తులను విసరగలడం వారి నైపుణ్యానికి నిదర్శనం. బ్రిటీష్ పాలకులు ఆర్మేనియా నుంచి పెద్ద సంఖ్యలో విచ్చుకత్తుల నిపుణులను దేశంలోకి తీసుకువచ్చారు. ప్రధానంగా మెడపైన దాడి చేసి సులువుగా ప్రాణాలు తీసేవారు. ఉత్సవాలు, జాతరలు జరుగుతుండగా చడీ చప్పుడు కాకుండా వచ్చి హత్య చేసి వెళ్లిపోయేవారు. ఎవరు హత్య చేశారో.. ఎలా చేశారో కూడా అంతుబట్టకుండా ఉండేది. నేర పరిశోధనలో... బ్రిటిష్ పాలనలోనే దేశంలో ఈ విచ్చుకత్తుల విద్య బాగా వెళ్లూనుకుంది. ఆ తర్వాత కూడా ఆర్మేనియా వాసులు కొందరు ఇక్కడే స్థిరపడ్డారు. వారిలో ఎక్కువమంది దారిదోపిడీ దారులుగా, నేరస్తులుగా మారారు. తూర్పు తీరం వెంబడి అనేక హత్యలు, ఇతర నేరాల్లో ఈ విచ్చుకత్తులతో దాడి ప్రధానంగా ఉండేది. దాంతో అప్పటి మద్రాసు ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. వీటి గురించి మద్రాసు రాష్ట్ర మినిస్టీరియల్, పోలీసు గైడ్లో ప్రత్యేకంగా పేర్కొనడం గమనార్హం. నేర పరిశోధనకు సంబంధించి పోలీసు అధికారులకు శిక్షణలో కూడా విచ్చుకత్తులతో దాడులు, హత్యల గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తారు. మెడపైనా, మెదడుకు సమీపంలో ఉండే నాడీ వ్యవస్థపైనా విచ్చుకత్తితో దాడి చేయడం ద్వారా అంతమొందించేవారు. ఇలాంటి కేసులను ఎలా విచారించాలన్న దానిపై పోలీసులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు కూడా. తాజాగా రాష్ట్ర ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగినహత్యాయత్నంతో విచ్చుకత్తుల అంశం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. వై.ఎస్.జగన్‌పై జరిగింది విచ్చుకత్తి దాడేనని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. నిపుణులైన కిరాయి హంతకుల ప్రణాళిక ప్రకారమే పకడ్బందీగా ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని స్పష్టమవుతోందని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. ఈ హత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీనివాసరావు వెనుక పెద్ద శక్తులే ఉన్నాయని తెలుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. దీని వెనుక ఉన్న కుట్ర కోణాన్ని ఛేదిస్తేనే అసలు సూత్రధారుల పాత్ర బట్టబయలు అవుతుందన్నారు. అయితే రాజకీయ ఒత్తిడికి తలొగ్గే పోలీసు శాఖ అంతటి పారదర్శకంగా దర్యాప్తు కొనసాగించగలదా అని కూడా ఆయన సందేహం వ్యక్తం చేశారు. -
ఆ కత్తే తగలరాని చోట తగిలితే..!?
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నం జరిగిన తీరుపై పలువురు వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కత్తి వేటు భుజానికి తగిలినందున క్షేమంగా బయటపడ్డారని, అదే మెడ వద్ద గాయమైతే చాలా క్లిష్టంగా ఉండేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనిషి మెడ వద్ద ఉండే రక్తనాళాలు అత్యంత కీలకమైనవని, సున్నితమైనవని.. ఇవి ఏమాత్రం కట్ అయినా అన్ని ప్రధాన అవయవాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని వివరిస్తున్నారు. ఆయువు పట్లు అంటూ మనం చెప్పుకునే చోట చిన్నపాటి గాయమైనా అది ప్రాణాంతకం అయ్యేందుకు అవకాశం ఉందని, ప్రతిపక్షనేత జగన్‌పై ఇలాంటి ఆయువుపట్టే లక్ష్యంగా హత్యాయత్నం జరిగినట్టు స్పష్టమవుతోందంటున్నారు. - గొంతుభాగంలో కొన్ని ప్రధానమైన కీలక ఆయువు పట్లు ఉంటాయి. అందులో ముఖ్యమైన రక్తనాళాలు కెరొటిడ్ ఆర్టరీస్, వర్టిబ్రల్ ఆర్టరీస్, జుగులార్ వీన్స్. ఇవిగాక వెన్నుపూస, రికరెంట్ లారింజియల్ నరం, ఫ్రెనిక్ నరం, బ్రేకియల్ ప్లెక్సర్స్ (వెన్నుపూస నుంచి వచ్చే నరాల సముదాయం) ఉంటాయి. ఇవిగాక ట్రాకియా (గాలి పంపే గొట్టం), ఈసోఫేగస్ (ఆహారనాళం), థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంథులు ఉంటాయి. ఇవన్నీ రెండు నుంచి మూడు సెంటీమీటర్ల లోతులోపే ఉంటాయి. - వైఎస్ జగన్ విషయమే తీసుకుంటే నిందితుడు మొదట టార్గెట్ చేసిన చోటు మెడ భాగంలోని కెరొటిడ్ ఆర్టరీ. ఇది గుండె నుంచి మంచి రక్తాన్ని తీసుకొని మెదడుకు సరఫరా చేస్తుంది. ఆ ఆర్టరీ మెడ ఎడమభాగంలో ఒకటి, కుడి భాగంలో ఒకటి ఉంటుంది. మెడలో రెండుగా విడిపోయి ఒకటి మెదడుకు... మరొకటి ముఖంలోని భాగాలకు రక్తాన్ని అందిస్తాయి. ఏ కారణం చేతనైనా మెదడుకు కొన్ని సెకండ్ల పాటు రక్తసరఫరా ఆగినా వెంటనే ఆ వ్యక్తి కోమాలోకి వెళ్తాడు. రెండు నిమిషాలలోపు రక్తసరఫరా పునరుద్ధరించలేకపోతే ప్రాణాపాయం తప్పదు. నిందితుడు ఈ భాగాన్నే తన లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. - సాధారణ పరిస్థితుల్లో రక్తనాళాల్లో ఏదైనా కొవ్వు పదార్థాలు అడ్డుపడి మెదడుకు అందే రక్తం తగ్గితేనే వెంటనే పక్షవాతం వచ్చేస్తుంది. అలాంటిది రక్తనాళం తెగిపోతే ఆ నష్టం ఇక మళ్లీ పూడ్చగలిగేది కాదన్నది వైద్యవర్గాలు చెబుతున్న మాట. అలాగే కొన్ని సందర్భాల్లో చూపు కోల్పోవడం, స్పర్శ కోల్పోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి తీవ్ర ప్రమాదం నుంచి మరణం సంభవించడం వరకు జరిగే ఆస్కారం ఉంది. - కత్తిదెబ్బ తగిలేందుకు అవకాశం ఉన్న మరో భాగం వేగస్ నర్వ్. మన దేహంలో తల నుంచి వచ్చే కీలక నరాలను క్రేనియల్ నరŠవ్స్ అంటారు. ఇందులో వేగస్ నర్వ్ తల నుంచి మెడ మీదుగా కడుపులోకి వెళ్తుంది. వేగస్ నర్వ్ అనేది మిగతా శరీరాన్ని ముఖ్యంగా గొంతులో మింగడానికి ఉపయోగించే కండరాలు, మాట్లాడటానికి ఉపయోగపడే వోకల్ కార్డ్స్, గుండె, ఊపిరితిత్తులు, జీర్ణకోశ వ్యవస్థలకు సంకేతాలను అందజేసే నరం. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఈ నరానికి గాయమైతే వెంటనే మాట పడిపోతుంది. ఎలాంటి ద్రవాలు మింగడం సాధ్యం కాదు. లయబద్ధమైన గుండె స్పందనల్లో మార్యులు వచ్చి, అది స్పందించే తీరు.. లయ తప్పుతుంది. బ్లడ్‌ప్రెషర్‌లో మార్పులు వస్తాయి. కడుపులో స్రవించాల్సిన యాసిడ్, స్రావాలు.. సక్రమంగా స్రవించవు. - గొంతు వెనక భాగంలో గాయమైతే కాళ్లు, చేతులు చచ్చుబడిపోవడం, మల మూత్ర విసర్జన మీద నియంత్రణ కోల్పోవడం జరగవచ్చు. వేగస్ నర్వ్ తర్వాత మెడ భాగంలో ఉండే కీలకమైన నరం ‘ప్రెనిక్ నర్వ్ ’. ఇవి మెడ భాగంలో 3, 4, 5 సర్వికల్ నరాలుగా బయటకు వచ్చి మన కడుపులో స్పందిస్తూ ఉండే డయాఫ్రమ్‌కు అనుసంధానమై ఉంటుంది. దీనికి గాయమైతే ఊపిరి తీసుకునే ప్రక్రియకు అంతరాయం ఏర్పడి, వెంటిలేటర్ సహాయం కోసం వెళ్లాల్సి రావచ్చు. వెంటనే ఊపిరి అందకపోతే ప్రాణాపాయం సంభవించే ఆస్కారం ఉంది. - గొంతులోని బ్రేకియల్ ప్లెక్సస్కు గాయమైతే.. చెయ్యి చచ్చుబడిపోయే ఆస్కారం ఉంటుంది. - ట్రాకియాకు గాయమైతే అందులోని గాలి గొంతు, ఛాతీ భాగాలలో లీక్ అయ్యి ఊపిరి తీసుకోవడం కష్టం కావడం మొదలుకొని ప్రాణాపాయం సంభవించే ఆస్కారం ఉంది. - ఈ నరాలతో పాటు బ్రాకియోసెఫాలిక్ ట్రంక్, రైట్ అండ్ లెఫ్ట్ సబ్‌క్లేవియన్ ఆర్టరీస్, పోస్టీరియర్ ఆరిక్యులార్ వీన్, వర్టెబ్రల్ వీన్, ఇంటర్నల్ జగ్లర్ వీన్, యాంటీరియర్ జగ్లర్ వీన్, ఈసోఫేగస్, థైరాయిడ్, పారాథైరాయిడ్.. లాంటి ఎన్నో కీలకమైనవి మెడ భాగంలో ఉంటాయి. లోతుగాయం తగిలి ఏ రక్తనాళం తెగినా అది చాలా ప్రమాదకరమైన అత్యవసర స్థితికి దారి తీస్తుంది. గాయం తగిలినప్పుడు తెలియకపోయినా, సుదీర్ఘకాలంలో ఎదురయ్యే ప్రమాదాల్లో ముఖ్యమైనవి ఇన్ఫెక్షన్స్, చీముగడ్డలు ఏర్పడటం, సూడో అన్యురిజమ్ (రక్తనాళాల గోడలు ఉబ్బడం), ఆర్టీరియల్ డైసెక్షన్ (రక్తనాళపు గోడలు కట్ అయి అక్కడి రక్తం గడ్డ కట్టడం), ఫిస్టులా (ఒక రక్తనాళానికీ, మరో రక్తనాళానికీ కనెక్షన్ ఏర్పడటం), కొన్నిసార్లు అదేపనిగా రక్తస్రావం అవుతుండటం, రక్తనాళం సన్నబడటం.. తద్వారా రక్తపు గడ్డలు తయారు కావడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. - సాధారణంగా ఇన్ని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున మెడ భాగంలో అయిన గాయాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇలాంటి గాయాలు చాలా అరుదుగా జరుగుతాయి. అందువల్ల ఇలాంటి గాయాలకు చికిత్స చేసే అవకాశం, తర్ఫీదు, నైపుణ్యం చాలా మంది డాక్టర్లకు అంతగా ఉండే అవకాశం ఉండదు. పైగా ఆ స్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన పరికరాలు, పరిసరాలు, న్యూరో సర్జన్, జనరల్ సర్జన్, ఈఎన్టీ సర్జన్, కార్డియో థొరాసిక్ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్ వంటి నిపుణుల అందుబాటు కూడా చాలా అవసరం. ఇది కూడా మరో ప్రమాదమైన పరిస్థితి. -
ఈ కత్తి యమ డేంజర్!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కోడి కత్తులు చాలా డేంజర్.. మామూలుగా ఉపయోగించే చాకు, కత్తుల కన్నా ఇవి అత్యంత పదునుగా ఉంటాయి. దీంతో దాడి జరిగితే ప్రాణాలకే ప్రమాదం. అసలు దాడి జరిగిందని తెలుసుకునేలోపే ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదముంది. వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తి చాలా పదునుగా ఉంది. ఇటీవలే కత్తిని సానపట్టినట్లు కనపడుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ కత్తులను కోడి పందేలతో పాటు పథకం ప్రకారం జరిగే దొమ్మీలలోనూ, హత్యల్లోనూ వాడతారు. ఇది దిగిన వారికి కూడా తెలియలేనంత పదునుగా ఉంటుంది. హత్య చేయడం కోసమే ఈ కత్తిని తీసుకువచ్చినట్లు తాజా ఘటనతో స్పష్టమవుతోంది. వీటిని సామాన్యులు పట్టుకోవడానికి కూడా భయపడతారు. అటువంటిది దాడిచేసిన వ్యక్తి దాన్ని జేబులోంచి తీసి దాడిచేసిన విధానం చూస్తే పక్కా ప్రణాళికతోనే వచ్చినట్లు అర్ధమవుతోంది. మెడను లక్ష్యంగా చేసుకుని దాడిచేయడం చూస్తుంటే ఖచ్చితంగా ప్రాణాలు తీయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు కోడి కత్తులపై బాగా అవగాహన ఉన్న వారు చెబుతున్నారు. స్టెయిన్లెస్ స్టీల్ బిట్‌తో తయారీ సాధారణంగా కోడిపందేల సమయంలో కోడి కాళ్లకు ఈ కత్తులను కడతారు. చాలా పదునుగా ఉండే వీటిని స్టెయిన్లెస్ స్టీల్ బిట్ అనే మెటల్‌తో తయారుచేస్తారు. వీటికి ఎక్కువసార్లు సానబడతారు. ఈ కత్తి పదునుకు నరం తెగితే ఆసుపత్రికి వెళ్లే అవకాశం కూడా ఉండదు. ఉదా.. ఈ ఏడాది సంక్రాంతి కోడి పందేల సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగెడిగూడెంకు చెందిన వ్యక్తి పందెం కోడిని పట్టుకునే ప్రయత్నంలో కత్తి తొడకు తగిలి నరం తెగి ఆసుపత్రికి వెళ్లేలోగా చనిపోయాడంటే అది ఎంత ప్రమాదమో అర్ధమవుతుంది. నల్లమందు, కొంగల మందు,పాదరసంతో పదును ఈ కత్తుల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి బరక కత్తి, రెండు సాన కత్తి. సాన కత్తి పాలిష్ ఎక్కువగా పడితే ఇది బ్లేడ్ కన్నా ఎక్కువ పదునుగా ఉంటుంది. వీటిని అంగుళంన్నర నుంచి రెండున్నర అంగుళాల సైజ్‌లో తయారుచేస్తారు. వీటికి ఉండే పిడి నాలుగు అంగుళాల వరకూ ఉంటుంది. వీటిని పదును పెట్టే సమయంలో నల్లమందు, కొంగల మందుతో పాటు పాదరసం కూడా రాసి ఎండ పెడతారు. ఒక్కోసారి పాదరసంలో ముంచి కూడా సానబెడతారు. అలా పెట్టడంవల్ల మెటల్ విషపూరితమవుతుంది. ఆ కత్తి తగిలితే వెంటనే ప్రాణంపోయే అవకాశం ఉంటుంది. అలాగే, ఈ కత్తులు ఉపయోగించడం అందరికీ రాదు. కోడి పందాలలో వినియోగించే కత్తులకు పూస పూస్తే పందెంలో దెబ్బతిన్న కోడి వెంటనే మరణిస్తుంది. పూస అనేది ఒక పదార్ధాన్ని అరగదీసి తయారుచేసే పదార్ధం. కత్తికి పదును ఎక్కువగా ఉండటంతో, ఆ ఆయుధంతో ఎవ్వరినైనా పొడిస్తే. చూడటానికి చిన్న గాయంగా కనిపించినా, రోజులు గడిచేకొద్దీ గాయం ప్రభావం శరీరంపై, అవయవాలపై తీవ్రంగా చూపిస్తుంది. కోడిపందేలు లేవుగా కోడి కత్తెందుకు? కోడిపందేలు ఇప్పుడేమీ లేవు, పైగా నువ్వు కోడి పందేలూ ఆడవు. కోడి కత్తి నీకెందుకు అన్న తయారీదారు ప్రశ్నకు... నాకు ప్రత్యేకంగా పని ఉందిలే అని శ్రీనివాసరావు స్పష్టంగా చెప్పి తీసుకెళ్లాడు. సుమారు నెల కిందట కోడి కత్తి తయారీదారుడు, వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై దాడి చేసిన శ్రీనివాసరావు మధ్య జరిగిన సంభాషణను స్థానికులు గుర్తు చేస్తున్నారు. దీన్నిబట్టి పక్కా ప్రణాళికతోనే శ్రీనివాసరావు దాడికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు కొన్నాళ్ల కిందట శ్రీనివాసరావు సోదరుని కుమార్తె పుట్టినరోజు పండుగ జరిగింది. ఆ సందర్భంగా అయిన వారికి, స్నేహితులకు శ్రీనివాసరావు ధూంధాంగా పార్టీ ఇచ్చారని గ్రామస్తులు గుర్తుచేశారు. వాస్తవంగా అంత పెద్దమొత్తంలో ఖర్చుపెట్టే ఆర్థిక స్థోమత శ్రీనివాసరావుకు లేదని చెపుతున్నారు. వైఎస్ జగన్‌పై దాడికి శ్రీనివాసరావును ఎంపిక చేసుకున్నట్లు, భారీగా డబ్బులు ఇచ్చినట్లు స్పష్టమవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
భార్యపై కత్తితో దాడి
ప్రకాశం,ఒంగోలు: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటన బుధవారం స్థానిక గాంధీనగర్ 6వ లైన్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వేటపాలెంకు చెందిన సుమతి అనే మహిళకు ఒంగోలు గాంధీనగర్‌కు చెందిన పాలూరి వెంకట రమణయ్యతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. స్థానిక బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్‌లో టైలర్‌గా జీవనం సాగించే వెంకట రమణయ్య.. కొంతకాలంగా ఆమెను అనుమానించి వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే బుధవారం కత్తితో దాడి చేయడంతో ముఖం, శరీరంపై బలమైన గాయాలయ్యాయి. ఆమె కేకలు విన్న చుట్టుపక్కల వారు 108కు సమాచారమిచ్చి రిమ్స్‌కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. తాలుకా ఎస్సై ఎన్టీ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తన భార్య ప్రవర్తన సరిగా లేదని, ఆమె మరో వ్యక్తితో కలిసి తనను హత్య చేస్తుందనే భయంతోనే తాను ఆమెను హత్యచేయాలని భావించినట్లు తెలపడంతో విస్తుపోవడం పోలీసుల వంతైంది. తాలూకా ఎస్సై ప్రసాద్ కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. -
టీఆర్ఎస్ నాయకుడి కుమారుడిపై దాడి
అబిడ్స్:ఫోన్ సంభాషణలో మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన ఇద్దరు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నందకిషోర్‌వ్యాస్ కుమారుడు, అతని సోదరుడి కుమారుడిపై కత్తులతో దాడి చేసి పారిపోయిన సంఘటన షాహినాయత్గంజ్పోలీస్ష్టేషన్ పరిధిలోని బేగంబజార్‌లో జరిగింది. వారికి ఉస్మానియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. గోషామహల్ ఏసీపీ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నందకిషోర్‌వ్యాస్ కుమారుడు ప్రేమ్‌బిలాల్ వ్యాస్. అతని సోదరుడు అమిత్‌వ్యాస్ స్నేహితుడు సోలంకీ... అమిత్‌వ్యాస్‌కు ఫోన్ చేయగా ప్రేమ్‌బిలాల్ ఎత్తాడు. అయితే సోలంకీ అసభ్య పదజాలంతో దూషించడంతో మాటామాటా పెరిగింది. ‘దమ్ముంటే బేగంపేట్‌కు రా’ అనడంతో ప్రేమ్, అమిత్, అశీష్, నవజ్యోత్‌సింగ్ అక్కడికి వెళ్లారు. అప్పటికే అక్కడున్న ఆకాష్, దీపక్ వీరిపై కత్తితో దాడి చేశారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని ఏసీపీ చెప్పారు. నందకిషోర్‌వ్యాస్‌ను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులుపరామర్శించారు. -
ఫేస్బుక్ తెచ్చిన తంటా! భర్తపై భార్య కత్తితో దాడి
చెన్నై ,టీ.నగర్: ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి తన ఇంట్లో భార్యతో ఉండడాన్ని భర్త గమనించడంతో భార్య అతనిపై కత్తితో దాడి చేసింది. ఈ సంఘటన చెన్నై కీల్పాక్కంలో మంగళవారం చోటుచేసుకుంది. చెన్నై పెరుమాళ్ వీధికి చెందిన కిషోర్‌కోథారి (40) వేపేరి కాలదియప్ప వీధిలో ద్విచక్రవాహనాలకు ఫైనాన్స్ చేస్తుంటారు. రాజస్తాన్‌కు చెందిన ఇతనికి సీమా (28)తో గత ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సంతానం లేదు. వీరితో మూడు నెలలుగా సీమా చెల్లెలు బేబి (18) నివశిస్తున్నారు. సీమా, బేబిలకు రాజస్థాన్‌కు చెందిన రవిప్రకాష్ (19) మూడు నెలల క్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడు. మూడు రోజుల క్రితం రవిప్రకాష్ రాజస్థాన్ నుంచి చెన్నై చేరుకున్నారు. కిషోర్‌కొథారి బయటికి వెళ్లగానే అతని ఇంటికి వచ్చి అక్కచెళ్లెళ్లతో మాట్లాడేవాడు. మంగళవారం రవిప్రకాష్ కిషోర్ ఇంటికి వచ్చాడు. అయితే కిషోర్ 11 గంటల సమయంలో హఠాత్తుగా ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్యతో రవిప్రకాష్ ఉండడం చూసి కిషోర్ ఆగ్రహించాడు. దీంతో వారిమధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆగ్రహించిన సీమా వంటింట్లోని కత్తి తీసుకుని భర్త కిషోర్‌పై దాడి చేసింది. దీనిపై కీల్పాక్కం పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకుని గాయపడిన కిషోర్‌ను ఆస్పత్రిలో చేర్చారు. ఈ కేసుకు సంబంధించి సీమా, బేబి, రవిప్రకాష్ వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
కత్తి దొరక్కపోయి ఉంటే..
-
కూతుర్ని చంపి.. తానూ చావాలనుకున్నాడు!
సాక్షి, హైదరాబాద్: ఇష్టం లేని పెళ్లి చేసుకుందని.. తనను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని.. కన్న కూతురినే కడతేర్చాలనుకున్నాడు.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. ఇదీ బుధవా రం హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో కన్న కూతురుపైనే కత్తితో దాడిచేసిన మనోహరాచారి ఆలోచన. కత్తి దాడి తర్వాత కూతురు మాధవి చనిపోయిందని భావించాడు. దీంతో రైలు కింద పడి చనిపోవాలనుకున్నాడు. ఈ విషయాన్ని భార్య లక్ష్మికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆమె ఎస్సార్‌నగర్ పోలీసులకు సమాచారం అందించింది. బుధవారం సాయంత్రం 3 గంటలు గాలించి మనోహరాచారిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం నిందితుడిని జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కేసులో మరిన్ని అంశాలు తెలుసుకోవడానికి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. మనోహరాచారి ఘా తుకానికి ఒడిగట్టడం వెనుక మిర్యాలగూడ దారుణం ప్రభావమున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పరీక్ష కలిపింది ఇద్దరినీ.. మనోహరాచారి స్వస్థలం కర్నూలు జిల్లా. ఉమ్మడి రాష్ట్రంలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సీఎంగా ఉండగా ఆ జిల్లాలో కీలక ఫ్యాక్షన్ లీడర్ల వెనుక తిరిగి ఆర్థి కంగా చితికిపోయాడు. విశ్వబ్రాహ్మణ కులానికి చెం దిన వాడు కావడంతో ఆ వృత్తి చేసుకుని బతికేందుకు దాదాపు 20 ఏళ్ల కింద హైదరాబాద్‌కు వలసొచ్చాడు. ప్రస్తుతం అమీర్‌పేటలోని ఓ జ్యువెలరీ దుకా ణం బయట ఆభరణాలకు మెరుగుపెట్టే పని చేస్తున్నాడు. కుమారుడు ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తుండగా, భార్య లక్ష్మి హైటెక్‌సిటీలో చిన్న ఉద్యో గం చేస్తోంది. ఆయన కుమార్తె మాధవి 2013లో మోతీనగర్‌లోని డాన్‌బాస్కో స్కూల్ పరీక్ష కేంద్రం లో పదో తరగతి పరీక్షలు రాసింది. అదే కేంద్రంలో సందీప్ పరీక్ష రాశాడు. వీరి నంబర్లు ముందు, వెనుక రావడంతో పరీక్షలు పూర్తయ్యేలోపు వీరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. మాధవాచారి కుటుంబం బోరబండ రాజ్‌నగర్ బస్తీలో, సందీప్ కుటుంబం ఎర్రగడ్డలోని ప్రేమ్‌నగర్‌లో నివసిస్తోంది. ఆర్య సమాజ్‌లో పెళ్లి.. వీరి వివాహానికి సందీప్ కుటుంబం అంగీకరించినా మాధవి తరఫు వారు మాత్రం కుల పట్టింపుతో సమేమిరా అన్నారు. దీంతో వీరిద్దరూ గత బుధవారం మాధవి కుటుంబీకులకు తెలియకుండా ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించగా, ఇరువురూ మేజర్లు కావడంతో వారి కుటుంబాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి సందీప్‌తో మాధవిని పంపారు. ఆ సమయంలో సందీప్ ఏం చేస్తున్నాడని పోలీసులు ఆరా తీశారు. ఓ బిర్యానీ సెంటర్లో సూపర్వైజర్గా పని చేస్తూ నెలకు రూ.8 వేలు సంపాదిస్తున్నానని చెప్పాడు. తనను లెక్కచేయట్లేదని.. వారిద్దరూ సందీప్ ఇంట్లోనే ఉంటు న్నారు. గడిచిన వారం రోజుల్లో మనోహరాచారి సందీప్ ఇంటికి 3సార్లు వెళ్లాడు. అతడి తల్లిని అమ్మా అని సంబోధిస్తూ తన కుమార్తెను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. అయితే 4 రోజుల కింద జరిగిన ఓ ఘటనతో మనోహరాచారి మానసికంగా కుంగిపోయాడు. పెద్ద మనుషుల సమక్షంలో సందీప్ ఇంట్లో పంచాయితీ జరిగింది. ఆ సందర్భంగా ఓ దశలో నీ కుమార్తె వస్తే తీసుకెళ్లండంటూ సందీప్ మనో హరాచారితో అన్నాడు. తనతో రావాలని తండ్రి కోరగా.. తనకు భర్తే సర్వస్వమని, కులమతాలకు అతీతంగా తాము కలసి ఉంటామని మాధవి చెప్పింది. దీంతో మానసికంగా దెబ్బతిన్న మనోహరాచారి ఆ తర్వాత మూడుసార్లు ఫోన్ చేసినా కుమార్తె నుంచి స్పందన రాలేదు. దీంతో తనను ఎదిరించడమే కాకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆమెపై కక్షకట్టాడు. కూతురిని ఒంటరిగా రమ్మన్నాడు.. తీవ్ర మనస్తాపానికి గురైన మనోహరాచారి రెండు రోజులుగా ముభావంగా ఉండటంతో పాటు మితిమీరి మద్యం తాగుతున్నాడు. మిర్యాలగూడలో చోటుచేసుకున్న ప్రణయ్ హత్యోదంతాన్ని మీడియాలో చూసి ప్రభావితమయ్యాడు. తీవ్ర ఉద్రేకానికి గురై కుమార్తెను మట్టుపెట్టాలని భావించాడు. మాధవికి ఫోన్ చేసి దుస్తులు కొనేందుకు ఎర్రగడ్డ రావాలని కోరాడు. సందీప్ పనికి వెళ్లి ఉంటాడని, ఇద్దరూ కలసి రారనే భావించాడు. ఫోన్ చేశాక బైక్‌పై ఎస్సార్‌నగర్ వెళ్లి మద్యం కొనుకున్నాడు. అమీర్‌పేటలోని సత్యం థియేటర్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఆ మద్యం తాగాడు. కత్తి దొరక్కపోయి ఉంటే.. మద్యం మత్తులోనే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మైత్రీ వనం వైపు వస్తూ.. ఓ కొబ్బరిబొండాల దుకాణం వద్దకు చేరుకుని లోపలకు వెళ్లి కొద్ది సేపు ఆగాడు. విజయనగరం నుంచి వలస వచ్చిన దాని యజమాని మూత్ర విసర్జనకు వెళ్లగా అక్కడున్న కొబ్బరి బొండాలు నరికే కత్తిని దొంగిలించి తన బ్యాగ్‌లో పెట్టుకుని బైక్‌పై బయల్దేరాడు. ఈ దృశ్యాలు బొండాల దుకాణం సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ ఫీడ్‌ను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. కాగా, తాను గోకుల్ థియేటర్ వద్ద ఉన్నానంటూ కుమార్తె నుంచి మనోహరాచారికి ఫోన్ వచ్చింది. 3.30–3.45 గంటల మధ్య అక్కడకు చేరుకున్న మనోహరాచారి.. కుమార్తె వెంట సందీప్‌ను చూసి మొదట అతడిపై, ఆ తర్వాత మాధవిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. కొబ్బరి బొండాల దుకాణంలో ఆ కత్తి దొరక్కపోయి ఉంటే కథ వేరేలా ఉండేదని పోలీసులు అంటున్నారు. రెండు మూడుసార్లు పథకం.. ఎంతో గారాబంగా పెంచిన కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తనకు తీవ్ర ఆగ్రహన్ని తెప్పించిందని మనోహరాచారి పేర్కొన్నాడు. మాధవిని మాత్రమే చంపాలని నిర్ణయించుకునట్లు చెప్పాడు. రెండు మూడు సార్లు పథకం వేసినా మాధవి, సందీప్ కలసి రావడంతో వదిలిపెట్టినట్లు తెలిపాడు. రద్దీ ప్రాంతానికి పిలిస్తే అనుమానం రాకుండా వస్తారనే భావనతో ఎర్రగడ్డకు పిలిపించానని మనోహరాచారి వివరించాడు. దాడి అనంతరం రోడ్డు దాటి ఆటోలో బల్కంపేట మీదుగా లాల్‌బంగ్లా వద్ద ఆటో దిగి మక్తాలోకి వెళ్లానని చెప్పాడు. భయం భయంగా.. హత్యాయత్నానికి పాల్పడ్డ మనోహరాచారి భార్యా, కుమారుడు భయంతో గడుపుతున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకూ భయపడుతున్నారు. బోరబండలో ఉన్న వారి ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాతో మాట్లాడేందుకు సైతం వారు ధైర్యం చేయలేకపోతున్నారు. మాల కులంలో పుట్టడమే నేరమా: సందీప్ తల్లి రమాదేవి మాల కులంలో పుట్టడమే తప్పా. నా కొడుకు, మాధవి ఇద్దరు ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమెను సొంత కూతురిలా చూసుకున్నాను. తమ పుట్టింటి కంటే ఇక్కడే బాగుందని చెప్పింది. కొడుకు, కోడలు జంట ఎంతో బాగుందనుకున్నాను. కానీ అంతలోనే ఈ దారుణం జరిగింది. నిలకడగా మాధవి పరిస్థితి.. కాగా, యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధవి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. గురువారం సాయంత్రం వెంటిలేటర్ కూడా తొలగించారు. ఆమెకు ప్రాణాపాయమేమీ లేదని, ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు వెల్లడించారు. ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ, కుల నిర్మూలన పోరాట సమితి, తదితర ప్రజా సంఘాల ప్రతినిధులు గురువారం యశోద ఆసుపత్రిలో మాధవిని పరామర్శించారు. నమ్మించి దాడి చేశాడు: సందీప్ తమ వివాహన్ని మాధవి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించడం వల్లే తాము ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నామని సందీప్ తెలిపాడు. గురువారం ఆస్పత్రి నుంచి సందీప్ డిచ్చార్జి అయ్యాడు. 2015లో తమ ప్రేమ విషయం మాధవి ఇంట్లో తెలిసి తల్లి లక్ష్మి, సోదరుడు వచ్చి బెదిరించి వెళ్లారని చెప్పాడు. తమ పెళ్లయ్యాక పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చిన సందర్భంగా మాధవి కోసం దాచిన రూ.5 లక్షలు ఇస్తానని మనోహరాచారి చెప్పినట్లు తెలిపాడు. వివాహ విందుకు దుస్తులు ఇప్పిస్తానని నమ్మించి దాడి చేశాడని చెప్పాడు. ఎప్పటికైనా తనను, తన భార్యను చంపేస్తాడేమోనని భయంగా ఉందని, తమ కుటుంబానికి భద్రత కావాలని కోరాడు. చనిపోయిందనుకుని.. రక్తపు మడుగులో పడిఉన్న మాధవిని చూసి చనిపోయిందని భావించి పారిపోయాడు. కొద్దిసేపటికే భార్య లక్ష్మికి ఫోన్ చేసి.. మాధవిని చంపేశానని, కుమారుడిని జాగ్రత్తగా చూసుకొమ్మని, తాను రైలు కింద పడి చనిపోతున్నానని చెప్పాడు. దీంతో లక్ష్మి ఎస్సార్‌నగర్ పోలీసులకు చెప్పింది. సనత్‌నగర్ నుంచి లక్డీకాపూల్ వరకు ఉన్న రైల్వే ట్రాక్‌లపై 3 గంటల పాటు గాలించారు. చివరకు మక్తా వద్ద రైలు పట్టాల సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పంజగుట్ట ఏసీపీ కార్యాలయానికి తరలించిన తర్వాతే అతడికి మాధవి బతికుందనే విషయం తెలిసింది. గురువారం ఉదయానికి మద్యం మత్తు దిగినాక కూడా నిందితుడిలో ఎలాంటి పశ్చాత్తాప ఛాయలు కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. నిందితుడిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మరిది చేతిలో గాయపడిన వదిన మృతి
ప్రకాశం, పీసీపల్లి: పొలం వ్యవహారంలో మనస్పర్థలు ఏర్పడి సొంత అన్న, వదినపై తమ్ముడు దాడి చేసిన ఉదంతంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వదిన ఆదివారం కన్నుమూసింది. గ్రామానికి చెందిన పులవర్తి వెంకటేశ్వర్లు తల్లి రమణమ్మకు 12 సెంట్ల పొలం ఉంది. ఆ పొలాన్ని పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు భార్య శేషారత్నమ్మ పేరు మీద రమణమ్మ రాసి ఇచ్చింది. ఇది వెంకటేశ్వర్లు తమ్ముడు తిరుపతయ్యకు నచ్చక అన్న, వదినపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 4వ తేదీ తెల్లవారు జామున అందరూ నిద్రిస్తుండగా తిరుపతయ్య కత్తితో అన్న, వదినపై దాడి చేశాడు. పథకం ప్రకారమే ఓ చిన్న కత్తి, మరో రెండు పెద్ద కత్తులు చేయించి తిరుపతయ్య ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ కుట్రలో తిరుపతయ్యకు తన , సడ్డుగడు గల్లా నరసింహం సహకరించాడు. గతంలో పొలం విషయంలో తమ్ముడు ఇబ్బందులు పెడుతుంటే వెంకటేశ్వర్లు పీసీపల్లి, కనిగిరి పోలీసులకు మౌఖికంగా తెలిపాడు. సివిల్ విషయాల్లో తాము జోక్యం చేసుకోమని, రాతపూర్వకంగా ఇస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పడంతో కేసు ఎందుకులే అని వెంకటేశ్వర్లు వెనక్కు తగ్గాడు. వెంకటేశ్వర్లు, శేషారత్నమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వెంకట భరత్, బాలాజీ. వీరు చదువు కోసం నరసరావుపేట, కనిగిరిలో ఉంటున్నారు. -
బ్యాటింగ్ ఇవ్వలేదని కత్తితో దాడి..
కోటా: రాజస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. క్రికెట్లో బ్యాటింగ్ అవకాశం ఇవ్వలేదని ఓ యువకుడిపై మరో వ్యక్తి కత్తితో దాడికి పాల్పడటంతో ఆ యువకుడు మృతిచెందాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతుల్ కుమార్‌సింగ్ (17) కోటా నగరంలోని ఓ ఇన్స్టిట్యూట్లో నీట్ పరీక్ష కోసం మూడేళ్ల నుంచి కోచింగ్ తీసుకుంటున్నాడు. రాహుల్ భటీ అనే స్థానికుడు తన మిత్రులతో కలసి శనివారం సాయంత్రం క్రికెట్ ఆడుతుండగా తనకు బ్యాటింగ్ అవకాశం ఇవ్వమని అతుల్ వారిని అడిగాడు. సమ్మతించిన వారు బ్యాటింగ్ అవకాశం ఇచ్చారు. అయితే కొన్ని ఓవర్ల తర్వాత బ్యాటింగ్ ఇవ్వమంటే అతుల్ ఒప్పుకోలేదు. మరికొన్ని బాల్స్ వేయమని కోరాడు. చిన్నగా మొదలైన గొడవ చినికి చినికి గాలివానలా మారింది. ఆగ్రహానికి గురైన రాహుల్ తన దగ్గరున్న కత్తితో అతుల్‌ను పొడిచాడు. తీవ్రగాయాలపాలైన అతుల్‌ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక కోర్టు ఎదుట హాజరుపరచడంతో.. 3 రోజుల కస్టడీ విధించింది. -
తమిళనాడులో నడిరోడ్డుపై మహిళపై కత్తితో దాడి
-
ఊహించని సంఘటన; అంతా షాక్..!
లూబెక్/బెర్లిన్: బస్సు ప్రయాణంలో అంతా ఎవరి పనుల్లో వారు తలమునకలై ఉండగా ఒక్కసారిగా హాహాకారాలు మొదలయ్యాయి. సహ ప్రయాణికుడు విచక్షణా రహితంగా కత్తితో తోటి వారిపై దాడి చేసి 14 మందిని గాయపరిచాడు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. ఈ ఘటన ఉత్తర జర్మనీలోని లూబెక్ పోర్టు వద్ద శుక్రవారం సాయంత్ర చోటుచేసుకుంది. బాధితుల్లో ఒకరు వెల్లడించిన వివరాలు.. అప్పుడే బయల్దేరిన బస్సు నిర్ధిష్ట వేగంలో ప్రయాణిస్తోంది. సీట్లు నిండుకోవడంతో కాస్త సర్దుకుని ఒక ముసలావిడకి సీటు ఇచ్చాను. అంతలోనే పక్కసీట్లో ఉన్న ఓ వ్యక్తి నా ఛాతీలోకి కత్తి దింపాడని బాధితుడు ఘటనను గుర్తు చేసుకుని వణికిపోయాడు. ఉన్మాదంతో రెచ్చిపోయిన దుండగుడు చూస్తుండగానే చుట్టూ ఉన్నవాళ్లపై కత్తితో విరుచుకు పడ్డాడని వెల్లడించాడు. దాడికి పాల్పడిన వ్యక్తికి ముప్పయేళ్లుంటాయని తెలిపాడు. కాగా, వెంటనే స్పందించిన పోలీసులు దుండగున్నిఅరెస్టు చేసి, జైలుకు తరలించారు. -
మద్యం మత్తులో ఘర్షణ
నవులూరు(దుగ్గిరాల): మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మరో వ్యక్తిని కత్తితో పొడిచి గాయపరచిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంగళగిరి మండల పరిధిలోని నవులూరుకు చెందిన బిట్రా వెంకట సాంబశివరావు అదే గ్రామానికి చెందిన దానబోయిన బాలాజీ మంగళగిరి పట్టణంలో మద్యం తాగారు. ఆటోలో నవులూరు వచ్చారు. ఈ సమయంలో మాటా మాటా పెరిగి వివాదానికి దారి తీసింది. కోపోద్రేకానికి గురైన బాలాజీ సాంబశివరావుపై కత్తితో పొడిచి దాడి చేశాడు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ వినోద్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాధితుడ్ని హుటాహుటిన చినకాకానిలోని ఎన్నారై వైద్యశాలకు తరలించారు. అయితే, వైద్యం చేసేందుకు సిబ్బంది నిరాకరించారు. నగదు చెల్లిస్తేనే చేస్తామని వాదనకు దిగారు.పైగా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకు వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. బాధితుని పరిస్థితి విషమంగా మారడంతో ఎస్ఐ వినోద్‌కుమార్ సొంత నగదును చెల్లించి చికిత్స ప్రారంభించాలని సూచించారు. సాంబశివరావుకు సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. చికిత్సకు నగదును చెల్లించి ఔదర్యాన్ని చాటుకున్న ఎస్ఐకు బాధితుడి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనపై రూరల్ ఎస్ఐ వినోద్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రి తీరుపై సర్వత్రా విమర్శ ఆస్పత్రి తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణం కంటే ధనమే ముఖ్యమనే ధోరణిలో ఆస్పత్రి యాజమాన్యాలు వ్యహరించడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. వైద్యశాఖ దృష్టి సారించి ప్రమాదంలో ఉన్న క్షతగాత్రులకు వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
ముఖంపై కత్తిపోట్లు.. ఆపై కట్టుకథ
కాల్ చేస్తే ఫోన్ బిజీ... సహనం నశించిన బాయ్ ఫ్రెండ్ ప్రేయసిని నిలదీశాడు. అయితే ఆమె ఇచ్చిన సమాధానం అతనికి చికాకు తెప్పించింది. అంతే.. తన వెంట తెచ్చుకన్న కత్తితో ప్రేయసి ముఖంపై గాయం చేశాడు. చివరకు పోలీసుల రంగ ప్రవేశంతో భయపడి కట్టుకథ చెప్పాడు. కానీ, తెలివిగా విషయాన్ని రాబట్టిన పోలీసులు చివరకు అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు. సాక్షి, చెన్నై: ఎర్నవూర్‌కు చెందిన కవియరసన్ అనే యువకుడు స్థానికంగా ఉండే ఓ యువతితో కొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తరచూ పార్క్‌ల్లో, రైల్వే స్టేషన్లో ఇద్దరు కలియదిరిగేవారు. అయితే కొన్ని రోజులుగా కవియరసన్ ఫోన్ కాల్‌కు సదరు యువతి స్పందించటం లేదు. పైగా ఆమె ఫోన్ బిజీ వస్తుండటంతో అనుమానం పెంచుకున్నాడు. గురువారం సాయంత్రం ఎన్నోర్ రైల్వే స్టేషన్ వద్ద కలుసుకున్న ఆ ఇద్దరు ఈ విషయంపై వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సదరు యువకుడు తన బ్యాగ్ నుంచి కత్తి తీసి ఆ యువతి ముఖాన్ని గాయపరిచాడు. తీవ్ర రక్తస్రావంతో యువతి రోదిస్తుంటే.. భయపడి ఆమెను బతిమాలటం మొదలుపెట్టాడు. ఆపై ఆస్ప్రతికి తీసుకెళ్తుండగా పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ వారిని గమనించి విషయం ఆరా తీసింది. భయంతో ఆ యువకుడు కట్టుకథ అల్లాడు. ‘దొంగలు తమపై దాడి చేశారని, తన ఫోన్ కూడా లాక్కుపోయారని’ పోలీసులకు తెలిపాడు. ప్రియుడ్ని జైలుకు పంపటం ఇష్టం లేని ఆ యువతి కూడా అదే జరిగిందని తెలిపింది. సరిగ్గా అదే సయమంలో కవియరసన్ ఫోన్ రింగ్ కావటంతో పోలీసులకు అనుమానం మొదలైంది. ఇద్దరినీ విడివిడిగా కూర్చోబెట్టి ప్రశ్నించిన పోలీసులకు అసలు విషయం అర్థమైంది. ఆపై యువకుడిని అదుపులోకి తీసుకుని, యువతికి ఫస్ట్ ఎయిడ్ చేయించారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కోడలిపై మచ్చుకత్తితో దాడి కేసులో మామ అరెస్ట్
సిద్దవటం: కోడలి పై మచ్చుకత్తితో దాడిచేసి గాయ పరచిన కేసులో కాడే సుబ్బయ్యను బుధవారం అరెస్టు చేశామని ఎస్ఐ అరుణ్‌రెడ్డి తెలిపారు. సిద్దవటం మండలం లోని భాకరాపేట గ్రామానికి చెందిన కాడే సుగుణ పై ఆమె మామ కాడే సుబ్బయ్య ఈనెల 3వ తేదీ ఆదివారం ఉదయం మచ్చుకత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే. బుధవారం నిందితుడు పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడన్నారు. ఈమేరకు నిందతుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామని ఎస్ఐ అన్నారు. -
మామ కాదు.. మృగాడు
సిద్దవటం : తన కోరిక తీర్చలేదని కోడలిపై మామ మచ్చుకతిత్తో దాడిచేసిన సంఘటన భాకరాపేటలో చోటు చేసుకుంది. ఎస్ఐ అరుణ్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దవటం మండలం భాకరాపేటలోని ఆంజనేయ స్వామి గుడి వెనుక వీధిలో కాపురం ఉంటున్న కాడే సుబ్బయ్య కుమారుడు రామమోహన్ అలియాస్ రామయ్యకు కదిరికి చెందిన సుగుణతో 14 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి కూతురు, కొడుకు ఉన్నారు. వీరంతా ఒకే ఇంటిలో కాపురం ఉన్నారు. సుబ్బయ్య గతంలో సుగుణపై లైంగిక దాడికి యత్నించాడు. అప్పట్లో రెండు సార్లు పెద్దమనుషులు పంచాయితీ కూడా చేశారు. సుబ్బయ్య వేధింపులు ఎక్కువ కావడంతో రెండు రోజుల క్రితం ఆమె మామపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునేందుకు వస్తే ఇంటివద్ద ఉండటం లేదు. దీంతో సుబ్బయ్య తనపైనే పోలీసు స్టేషన్లో కేసు పెడతావా అని కోడలిపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయ కోడలు సుగుణ ఇంట్లో మాంసం కోసుకుంటుండగా వెనుక వైపు నుంచి వచ్చిన సుబ్బయ్య ఆమె కాళ్లు, చేతులపై మచ్చుకత్తితో దాడి చేశాడు. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో వైద్య కోసం 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. సుబ్బయ్యను అదుపులోకి తీసుకొని అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
పెళ్లికి అంగీకరించలేదని యువతిపై దాడి
అన్నానగర్: పెళ్లికి అంగీకరించలేదని యువతిపై కత్తితో యువకుడు దాడి చేశాడు. ఈ ఘటన విరుదాచలంలో సోమవారం చోటుచేసుకుంది. విల్లుపురం జిల్లా ఉళుందూర్పేటనగర్కి చెందిన అశోకన్. ఇతని కుమార్తె అసోనా (21). ఆమె ఇంజినీరింగ్ చేసి విరుదాచలంలో ఉన్న ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ఈమె సోమవారం ఉదయం స్నేహితురాలితో కలిసి ఉళుందూర్‌పేట నుంచి బస్సులో విరుదాచలం బస్టాండ్‌కి వచ్చింది. తరువాత ఆమె అక్కడ నుంచి పని చేసే కార్యాలయం వైపు స్నేహితులతో కలిసి నడిచి వెళుతోంది. సరోజని నాయుడు వీధిలో నడిచి వెళుతుండగా ముసుగు ధరించి బైకులో వచ్చిన వ్యక్తి అసోనాపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. దాడిలో గాయపడ్డ అసోనాని స్థానికులు విరుదాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అసోనా ఇచ్చిన ఫిర్యాదు మేరకు విరుదాచలం పోలీసులు విచారణ చేశారు. విచారణలో అసోనా రెండేళ్లకు ముందు కళ్లకురిచ్చి సమీపం కొంగరాయపాలయంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లినప్పుడు, అక్కడ విజయ్‌తో (24) పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అనంతరం వీరిద్దరికి పెళ్లి చేయడానికి పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలో విజయ్ ప్రవర్తన సరిగాలేదని అసోనా, అతన్ని వివాహం చేసుకోవడానికి అంగీకరించలేదు. అప్పటి నుంచి అసోనా విజయ్‌తో మాట్లాడకపోవడంతో ఆమెను హత్య చేసేందుకు యత్నించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరిన అసోనా ప్రాణాలతో ఉందా లేదా మృతి చెందిందా అని చూడడానికి విరుదాచలం ప్రభుత్వ ఆస్పత్రికి బైకులో వచ్చిన విజయ్‌ని కొళంజియప్పర్ ఆలయ సమీపంలో పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. -
ఉగ్ర దాడితో ఫ్రాన్స్ ఉలిక్కిపడింది
-
ఉలిక్కిపడ్డ పారిస్
పారిస్: ఉగ్ర దాడితో ఫ్రాన్స్ ఉలిక్కిపడింది. ఓ ఉగ్రవాది పౌరులపై కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి సెంట్రల్ ప్యారిస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి చనిపోగా, గాయాలతో మరో నలుగురు ఆస్ప్రతిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కాల్పులు జరపటంతో ఉగ్రవాది హతమయ్యాడు. ఓపెరా హౌజ్.. బార్లు, రెస్టారెంట్లతో నిత్యం కిటకిటలాడుతుంటుంది. వారాంతం కావటంతో జనాలు పెద్ద ఎత్తున్న ఆ ప్రాంతంలో గుమిగూడారు. ఇంతలో ఓ వ్యక్తి అల్లాహూ అక్బర్ నినాదాలు చేస్తూ కనిపించినవారినల్లా గాయపరచటం ప్రారంభించాడు. పక్కనే ఉన్న రెస్టారెంట్లోకి ప్రవేశించేందుకు యత్నించగా, జనసందోహం ఎక్కువగా ఉండటంతో అది వీలు కాలేదు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఉగ్రవాదిని కాల్చి చంపాయి. కాగా, ఘటనకు తామే కారణమంటూ ఐసిస్ ప్రకటించుకుంది. ఉగ్రదాడిపై అధ్యక్షుడు ఎమ్మాన్యూయేల్ మాక్రోన్ ట్వీట్ చేశారు. ‘ఫ్రాన్స్ మరోసారి నెత్తురు చిందించింది. కానీ, శత్రువులకు ఇంచుకూడా అవకాశం ఇవ్వలేదు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఫ్రాన్స్ తరచూ ఉగ్రదాడులకు నిలయంగా మారింది. 2015 నవంబర్ 13న చోటు చేసుకున్న మారణహోమంలో 130 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. Toutes mes pensées vont aux victimes et aux blessés de l’attaque au couteau perpétrée ce soir à Paris, ainsi qu’à leurs proches. Je salue au nom de tous les Français le courage des policiers qui ont neutralisé le terroriste (1/2). — Emmanuel Macron (@EmmanuelMacron) 12 May 2018 La France paye une nouvelle fois le prix du sang mais ne cède pas un pouce aux ennemis de la liberté (2/2). — Emmanuel Macron (@EmmanuelMacron) 12 May 2018 -
యువతిపై అగంతకుడి దాడి
వరదయ్యపాళెం: మండల కేంద్రమైన వరదయ్యపాళెంలో బుధవారం యువతిపై అగంతకుడు కత్తితో దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. జెడ్పీటీసీ సభ్యురాలు రావూరి సరస్వతమ్మ కుమారుడు కరుణాకర్ నాయుడు స్థానిక ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. ఆయన బుధవారం బంధువుల ఇంటిలో జరిగే కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. ఇంట్లో ఆయన రెండో కుమార్తె సౌందర్య ఒక్కటే ఉంది. ఈ క్రమంలో ఓ అగంతకుడు ఇంట్లోకి చొరబడి ఆమెపై కత్తితో దాడికి దిగాడు. యువతి తప్పించుకుని ఇంటి మరో ద్వారం నుంచి బయటకు వచ్చి కేకలు వేసింది. ఇద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో సౌందర్య రెండు చేతులపై కత్తిగాట్లు పడ్డాయి. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు తెలిపి, ఇంటికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ హరిప్రసాద్ పరిశీలించి అగంతకుడి కోసం పరిసరాల్లో గాలించారు. దుండగుడు లుంగీ, చొక్కా ధరించి ఉన్నాడని, హిందీలో మాట్లాడుతున్నట్లు ఆ యువతి వివరించింది. ఇది పార్థీ గ్యాంగ్ పనికాదని ఎస్ఐ స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన తీరు పరిశీలిస్తే అందుకు భిన్నంగా ఉందని, విచారణ చేపడతామని పేర్కొన్నారు. -
కుమార్తెను వేధిస్తున్నాడని..
పహాడీషరీఫ్: కుమార్తెను తరచూ వేధిస్తున్నాడన్న కోపంతో ఆగ్రహంతో అల్లుడిపై కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తిని బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్సై మక్బూల్ జానీ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎర్రకుంట, తూర్ కాలనీకి చెందిన మహ్మద్ జాఫర్ కుమార్తె షాహిన్ బేగం, ఇదే ప్రాంతానికి చెందిన షేక్ హసన్ ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. గత కొన్నాళ్లుగా భార్యపై అనుమానం పెంచుకున్న షేక్ హసన్ ఆమెను వేధిస్తున్నాడు. ఈ విషయమై పలుమార్లు జాఫర్ అతడికి నచ్చజెప్పాడు. అయినా తీరు మార్చుకోని హసన్ ఆదివారం సాయంత్రం భార్యను కొట్టడంతో ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన జాఫర్ కత్తితో హసన్ కడుపులో పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు నిందితుడు జాఫర్‌ను అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
కత్తిపోట్లతో ఎస్పీ ఆఫీసుకు.
అనంతపురం సెంట్రల్ : కత్తిపోట్లకు గురైన బాధితుడు తనకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని నేరుగా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఘటన శనివారం చోటు చేసుకుంది. రక్తమోడుతున్న అతన్ని డీఎస్పీ వెంకటరావు చొరవతో ఆస్పత్రికి తరలించారు. బాధితులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. యాడికి మండలం రాయలచెరువులో ఉదయం 7 గంటల సమయంలో శ్రీరామ్‌ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే రాజేష్ (35)పై హత్యాయత్నం జరిగింది. సొంత బావ (అక్క భర్త) రవిప్రసాద్, మరో వ్యక్తి ఈశ్వరయ్యతో కలిసి కత్తులతో దాడి చేశారు. విచక్షణా రహితంగా పొడిచేశారు. రక్తమోడుతున్న రాజేష్‌ను కుటుంబ సభ్యులు నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రథమ చికిత్స అనంతరం నేరుగా అంబులెన్స్‌లో ఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. తన భర్తకు రక్షణ కల్పించా లని, యాడికి పోలీసులను వేడుకున్నా పట్టించు కోలేదని, క్షతగాత్రుడి భార్య భాగ్యలక్ష్మి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. అక్కడికి సకాలంలో చేరుకున్న అనంతపురం డీఎస్పీ వెంకట్రావ్ వెంటనే హాస్పటల్‌కు డీఎస్పీ ఆదేశాలతో క్షతగాత్రుడిని కుటుంబ సభ్యు లు అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
సాహసానికి దక్కని గుర్తింపు!
సాక్షి, సిటీబ్యూరో: అది 1993 జనవరి 13. దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఘట్కేసర్ చేరుకుంది. అకస్మాత్తుగా ఇద్దరు దుండగులు ఎస్–9 బోగీలోకి ప్రవేశించి, ప్రయాణికులపై దాడికి పాల్పడ్డారు. ఆరుగురు గాయపడ్డారు. మిగతా ప్రయాణికులు భయాందోళనతో అరుస్తున్నారు. అందులో పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తున్న ఇక్బాల్ షరీఫ్ వెంటనే అక్కడికి వెళ్లాడు. దుండగులు ఇక్బాల్‌పై కత్తులతో దాడి చేశారు. తల, శరీరభాగాల్లో తీవ్రమైన గాయాలయ్యాయి. అయినా లెక్కచేయకుండా ఆ దుండగులను అదుపులోకి తీసుకున్నాడు ఇక్బాల్. ప్రాణాలకు తెగించి ఎంతో సాహసంతో బోగీలోని 72 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు. ఇది జరిగి 25 ఏళ్లవుతోంది. కానీ ఇప్పటికీ ఇక్బాల్ సాహసానికి గుర్తింపు దక్కలేదు. ఇప్పటికైనా న్యాయం చేయండి.. ఆదిలాబాద్ రిజర్వ్ పోలీస్ విభాగంలో విధులు నిర్వహించిన ఇక్బాల్‌ను 25 ఏళ్ల క్రితం సికింద్రాబాద్‌లోని రైల్వే పోలీస్ శాఖకు డిప్యూటేషన్‌పై బదిలీ చేశారు. 1993లో జరిగిన రైల్వే ఘటనలో అతడి సాహసానికి మెచ్చి ప్రమోషన్‌తో పాటు బంగారు పతకం అందజేస్తామని అప్పటి రైల్వే ఐజీ సీహెచ్ కోటేశ్వర్రావు, డీజీపీ హామీ ఇచ్చారు. అయితే ఇది ఇప్పటికీ నెరవేరలేదు. అటు పోలీస్ శాఖ నుంచి గానీ, ఇటు రైల్వే శాఖ నుంచి గానీ ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు. దీనిపై 25 ఏళ్లుగా పోరాడుతున్నానని, తన రిటైర్మెంట్ కూడా దగ్గరపడుతోందని ఇక్బాల్ ‘సాక్షి’తో తన ఆవేదన చెప్పాడు. సీఎం, హోంమంత్రి, పోలీస్ ఉన్నతాధికారులు ఇప్పటికైనా తన సేవలను గుర్తించి, న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. తన సర్వీస్‌లో ఇప్పటి వరకు 20 క్యాష్ అవార్డులు, 20 గుడ్ సర్వీస్ ఎంటీ (జీఎస్ఈ) పతకాలు సాధించానన్నారు. -
ప్రేమించాలని విద్యార్థినికి బెదిరింపులు
చిట్టినగర్(విజయవాడపశ్చిమం): ప్రేమించాలని వేధింపులకు గురి చేయడమే కాకుండా ప్రేమించకుంటే చంపుతానని చాకుతో కళాశాల వద్దకు వచ్చిన యువకుడిపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. భవానీపురానికి చెందిన యువతి వన్‌టౌన్‌లోని ఇంజినీరింగ్ కళాశాలలో ఎంబీఏ చదువుతంది. ఆ యువతి గతంలో మహాత్మాగాంధీ రోడ్డులోని కాలేజీలో చదివే రోజులలో సీనియర్ అయిన చక్రవరం మహేష్ ప్రేమించాలని వెంట పడేవాడు. తనకు అలాంటివి ఇష్టం లేదని చెప్పడంతో కొంత కాలం కనిపించకుండా పోయాడు. ఇటీవల ఆ యువతికి ఫోన్ చేసిన మహేష్ తనను ప్రేమించాలని వేధించసాగాడు. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో కళాశాల వద్ద ఉండగా మహేష్ అక్కడకు వచ్చి తనను ప్రేమించాలని వేధించసాగాడు. అంతేకాకుండా మహేష్ చేతిలోని ఫోన్ కింద చాకు ఉండటంతో ఆ యువతి వెంటనే తన తండ్రికి సమాచారం ఇచ్చింది. తండ్రి వచ్చిన తర్వాత ఆ యువతి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కత్తితో పొడిచి...నువ్వుల నూనెతో కాల్చి..
అమీర్‌పేట: ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డలోని ఓ అపార్ట్మెంట్లో సోమ వారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూరులో స్థిరపడిన విశాఖపట్నానికి చెందిన పున్నారావు, ర మణి దంపతుల కుమార్తె సౌమ్యకు (25) అదే ప్రాంతానికి చెందిన సీతారామారావు, రత్నమాంబ దంపతుల కుమారుడు నాగభూషణంతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఏడాది కిత్రం నాగభూషణం భార్య సౌమ్య, కుమారుడు సాయి దత్తాత్రేయతో కలిసి నగరానికి వచ్చి ఎర్రగడ్డ , నందనగర్‌లోని సూరజ్ ఆర్కేడ్స్ ఫ్లాట్ నెంబర్ 104లో ఉంటున్నాడు. యూసుఫ్‌గూడలోని హైదరాబాద్ మెట్రో కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న నాగభూషణం సోమవారం రాత్రి 8.30 ప్రాంతంలో నైట్ డ్యూటీకి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లి పోయాడు. సౌమ్య తన కుమారుడితో కలిసి ఇంట్లో పడుకుంది. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాం తంలో ఫ్లాట్‌లో నుంచి దట్టమైన పొగలు వస్తుండటాన్ని గుర్తించిన పక్కింట్లో ఉండే విశాల్ అ క్కడికి వెళ్లి చూడగా తలుపులు బయ టి నుంచి గడియపెట్టి ఉన్నాయి. స్థానికుల సహాయంతో తలుపులు తెరిచి చూడగా సౌమ్య మంటల్లో కాలిపోతూ కనిపించింది. కొద్ది దూరంలో ఏడుస్తూ ఉన్న ఆమె కుమారుడిని రక్షించి పోలీసులకు సమాచారం అందజేశారు. అపార్ట్మెం ట్ వాసులు అతికష్టంపై మంటలను ఆర్పివేశా రు. కాగా సౌమ్య శరీరంపై నువ్వుల నూనె పోసి నిప్పటించడమేగాక, తప్పించుకునేందుకు వీలులేకుండా బయటి నుంచి గడియ పెట్టి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృ తురాలి ఒంటిపై మూడు కత్తి పోట్లు ఉన్నాయని, అరవకుండగా గొంతు నులిమి గదిలో ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు ఉన్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. బాత్రూం ఫ్లెష్‌లో పడి ఉన్న ఓ సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘ టనా స్థలాన్ని పశ్చిమ మండలం డీసీపీ, పంజగుట్ట ఏసీపీ సందర్శించారు. అల్లుడిపై అత్తామామ అనుమానం సౌమ్య హత్యపై అనేక అనుమానాలు వ్యక్తవుతున్నాయి. భర్త నాగభూషణంపై సౌమ్య తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్త నైట్ డ్యూటీకి వెళితే బయటి వ్యక్తులు ఇంటికి వచ్చే అవకాశం ఉండదని, లేదా తనకు తెలిసిన వ్యక్తులతో హత్య చేయించి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. అపార్ట్మెంట్ పరిసరాల్లో సీసీ కెమెరాలు లేనందున వివరాలు వెల్లడించలేమని పోలీసులు తెలిపారు. సౌమ్య తండ్రి పున్నారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
అప్పు ఇవ్వలేదని హత్యాయత్నం
నెల్లూరు(క్రైమ్): అప్పు అడిగితే ఇవ్వలేద న్న అక్కసుతో ఓ వ్యక్తిపై సన్నిహితుడే కత్తితో విచక్షణా రహితంగా హత్యాయత్నం కు పాల్పడ్డాడు. ఈ ఘటన కొరడావీధిలో సోమవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. కుక్కలగుంటకు చెందిన సయ్యద్ రియాజ్ కొరడావీధిలో ఫ్రెండ్స్ సర్వీస్ పాయింట్ పేరిట ఈ– కార్యాలయం (ఆధార్‌కార్డులు డౌన్లోడ్, ఈ రీఛార్జ్, జెరాక్స్ తదితర సేవలు) నిర్వహిస్తున్నారు. ఆయన దుకాణానికి ఎదురుగా ఖాదర్‌బాషా బంగారు దుకాణం ఉంది. అందులో గుమస్తాగా పని చేస్తున్న షేక్ షామిల్ తరచూ రియాజ్ షాపులోనే ఉండేవాడు. ఇద్దరు సన్నిహితంగా ఉండేవారు. రియాజ్ ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఆర్థికంగా సహా యం చేసేవాడు. మూడు రోజులుగా షామిల్ అప్పు కావాలని రియాజ్‌ను అడుగుతూ వస్తున్నాడు. రియాజ్ తాను ఇవ్వలేని చెప్పడంతో అతని మీద కోపం పెంచుకున్నాడు. సోమవారం రియా జ్ షాపులో ఉండగా షామిల్ వచ్చి డబ్బులు అడిగాడు. రియాజ్ లేవని చెప్పడంతో నీ అంతు చూస్తానని బెదిరించి దుకాణంలో నుంచి బయటకు వెళ్లాడు. కొద్ది సేపటికి షామిల్ తిరిగి రియాజ్వద్దకు వచ్చి ఇప్పు డు నిన్ను చంపుతా ఎవరు అడ్డొస్తారంటూ కత్తితో గొంతుపై పొడిచాడు. కుడి చేయి నరాలు కోశాడు. వీపుపై బలంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన రియాజ్ షాపులో నుంచి బయటకు వచ్చి కుప్ప కూలిపోయాడు. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. మూడో నగర పోలీసులకు ఈ ఘటనపై సమాచారం అందడంతో ఎస్సై ఎస్. వెంకటేశ్వరరాజు ఘటనా స్థలానికి చేరుకుని హత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడు షామిల్పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రియాజ్‌పై దాడి చేసి పరారవుతున్న షామిల్‌కు స్థానికులు దేహశుద్ధి చేశారు. వారి నుంచి అతను తప్పించుకుని పరారయ్యాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
తాగిన మత్తులో తల్లిని, అక్కను అసభ్యంగా..
పొన్నెకల్లు(తాడికొండ): తాగిన మత్తులో తల్లిని, అక్కను అసభ్యంగా బూతులు తిడుతున్నాడని అన్నను తమ్ముడు కత్తిపీటతో నరికి చంపిన ఘటన తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామ ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రంపచోటి నరేష్ సెంట్రింగ్ పని చేస్తుంటాడు, ఆదివారం తాగి ఇంటిలో తల్లి అవ్వమ్మ, సోదరి ధనలక్ష్మిని బూతులు తిడుతుండటంతో కోపోద్రిక్తుడైన తమ్ముడు నాగేశ్వరరావు కల్పించుకున్నాడు. మాటా మాట పెరగడంతో అన్నపై కత్తిపీటతో దాడిచేసి గుండె, గొంతుపై బలంగా నరకడంతో ఘటన స్థలంలోనే నరేష్(26) మృతి చెందాడు. హత్య జరిగిన ప్రాంతాన్ని మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ గోగినేని రామాంజనేయులు, ఎస్ఐ రాజశేఖర్‌లు పరిశీలించి, స్థానికులను ఆరా తీశారు. మృతుడు నరేష్‌కు నాలుగు సంవత్సరాల కిందట వివాహమైంది. భార్య రెండు నెలలు కాపురం చేసిన అనంతరం వెళ్లి పోయింది. సోదరుల మధ్యా తరచూ వివాదాలు జరుగుతుంటాయి. ఆదివారం అవి కాస్తా ముదరడంతో హత్యకు దారి తీసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మృతుడి తల్లి అవమ్మ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. -
ఫోన్ డెలివరీ ఆలస్యంగా ఇచ్చాడని..
సాక్షి, న్యూఢిల్లీ : ఈ కాలంలో మనుషులకు ఓపిక అనేది లేకుండా పోయింది. అనుకున్నది వెంటనే జరిగిపోవాలి. లేకపోతే విచక్షణ కోల్పోతారు. ఒక్కోసారి అది ప్రాణాలు తీసే వరకూ వెళ్తుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే దేశ రాజధానిలో కలకలం రేపింది. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన ఫోన్ ఆలస్యంగా డెలివరీ ఇచ్చాడని ఆగ్రహించిన మహిళ డెలివరీ బాయ్‌ని ఏకంగా కత్తితో 20సార్లు పొడిచింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ ముప్పై ఏళ్ల మహిళ ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌పోన్ కొనుగోలు చేసింది. అయితే ఇతర డెలివరీల కారణంగా డెలివరీ బాయ్ కేశవ్ ఆమె ఫోన్‌ని ఆలస్యంగా అందించాడు. అయితే ఫోన్ ఆలస్యంపై కోపంగా ఉన్న సదరు మహిళ కత్తితో డెలివరీ బాయ్‌పై విచక్షణా రహితంగా దాడి చేసింది. ఏకంగా 20 సార్లు కత్తితో పొడిచింది. తీవ్రంగా గాయపడిన కేశవ్‌ను సమీపంలోని సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయం నుంచి కోలుకున్న కేశవ్ నుంచి స్థానిక పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. సీసీటీవీ ఆధారంగా నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మహిళకు సహకరించిన ఆమె సోదరుడిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు నిహల్ విహార్, అంబికా ఎన్‌క్లేవ్‌కు చెందిన వాడిగా గుర్తించారు. ఈ నెల 24న జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
భర్తే కాలయముడు
పొందూరు: కష్టంలో, సుఖంలో కడవరకు తోడుంటానని మూడుముళ్లు వేసిన భర్తే కాలయముడయ్యాడు. దయాదాక్షిణ్యాలు లేకుండా భార్యను కత్తితో దారుణంగా నరికి చంపేశాడు. పెళ్లయిన కొద్ది రోజుల నుంచి భార్యను అనుమానించి, హింసిస్తూ వస్తున్న భర్త.. చివరకు పథకం ప్రకారం భార్యను కడతేర్చాడు. బాణాం గ్రామంలో ఈ దారుణ సంఘటన బుధవారం జరిగింది. బాణాం గ్రామానికి చెందిన జీరు వెంకటరమణకు ఎచ్చెర్ల మండలంలోని వెంకయ్యపేటకు చెందిన రమణమ్మ(25)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి జీరు ఢిల్లీ(5), చిన్నోడు జీరు నాని(3) ఇద్దరు కుమారులు ఉన్నారు. వివాహమైన కొద్ది రోజుల నుంచే అనుమానంతో రమణమ్మను రక్తం వచ్చేలా కొట్టడం, కోసేయడం, చురకలు పెట్టేయడం వంటి చిత్రహింసలు పెట్టేవారు. ఆ బాధలు తట్టుకోలేక ఏడాది క్రితం పిల్లలను తీసుకొని చీరాలకు కూలి పనికి వెళ్లిపోయింది. వారం రోజుల క్రితం మావయ్య జీరు రామప్పడు చనిపోవడంతో బాణాం తిరిగి వచ్చింది. భర్త కొడతాడనే భయంతో గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉన్న బంధువుల ఇంట్లో ఉంటోంది. బుధవారం రాత్రి బాణాంలో ఉన్న ఇంటిని శుభ్రం చేయాలని రమణమ్మకు వెంకటరమణ కబురు పంపించాడు. వెళ్లేందుకు కొంత భయపడినా.. తన మేనకోడలితో కలసి ఇంటికి వెళ్లింది. ఇంటికి తాళాలు వేసి బయట ఆమె కోసం వెంకటరమణ వేచి ఉన్నాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న భార్యను చూసి.. మేన కోడలిని మంచి నీరు తీసుకురావాలని బోరింగు వద్దకు పంపించారు. ఆమె నీరు తెచ్చి చూసే సరికి రమణమ్మను కత్తితో నరికి వెంకటరమణ పరారయ్యాడు. రక్తపు మడుగులో గిలగిలకొట్టుకొంటూ మృతిచెందడాన్ని చూసిన మేనకోడలు అక్కడే స్పృహ కోల్పోయింది. శ్రీకాకుళం డీఎస్పీ బీమారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులను విచారించారు. జేఆర్‌పురం సీఐ వై.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ బాలరాజు సీఐ వెంట ఉన్నారు. అనాథలైన పిల్లలు జీరు రమణమ్మ మృతి చెందడంతో ముక్కుపచ్చలారని ఇద్దరు చంటి పిల్లలు అనాథలయ్యారు. తల్లికి ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. -
తను లేని జీవితం వద్దు.. నన్నూ చంపేయండి.!
సాక్షి, చెన్నై: తనకు చేస్తున్న మోసాన్ని భరించలేకే అశ్వినిని హతమార్చినట్టు నిందితుడు అళగేశన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అశ్విని లేని జీవితం తనకు వద్దని, తననూ హతమార్చాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక, అళగేషన్‌ను ఉరి తీయాలని అశ్విని కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. చెన్నైలో ప్రేమోన్మాది అళగేషన్(22) ఘాతకానికి శుక్రవారం అశ్విని(18) బలైన విషయం తెలిసిందే. ప్రజలు చితక్కొట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అళగేషన్ ఆరోగ్యం శనివారం కుదుట పడింది. దీంతో ఉదయాన్నే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టి అతడి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ మేరకు ఆలపాక్కం ధనలక్ష్మి నగర్లో ఉన్నప్పుడు తొలిసారిగా అశ్వినిని చూసినట్టు పేర్కొన్నాడు. కొన్ని నెలలు ఆమె వెంట పడ్డానని, చివరకు తన ప్రేమను తెలియజేయడంతో అంగీకరించిదని తెలిపాడు. రెండేళ్లుగా తాను, అశ్విని ప్రేమించుకుంటున్నామని వివరించారు. ఆమెకు తండ్రి లేడని, తల్లి, సోదరుడు మాత్రమే ఉన్నట్టు చెప్పాడు. అందుకే తాను ఆమెను చదివించేందుకు కష్ట పడుతూ వచ్చానని పేర్కొన్నారు. రెండు లక్షల వరకు ఆమె చదువుల కోసం ఖర్చు పెట్టానని వివరించాడు. అయితే, కాలేజీలో చేరిన అనంతరం తనను ప్రేమించేందుకు తగ్గ అర్హతలు ఉన్నాయా అని అశ్విని ప్రశ్నించడం భరించలేక పోయాయని పేర్కొన్నాడు. ఆమె తల్లి ఒత్తిడి మేరకే అలా చెప్పినట్టు భావించానని, పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేయడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్టు తెలిపాడు. తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదని భావించి ఆమెను హతమార్చిన మరుక్షణం తాను ఆత్మాహుతి చేసుకోవాలన్న లక్ష్యంతోనే కేకేనగర్‌కు వెళ్లడం జరిగిందన్నారు. అయితే, తనను అక్కడి జనం పట్టుకోవడంతో ఆత్మహత్య చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు. ఇప్పుడు తనను చంపేయాలని లేకపోతే ఏదో ఒక రోజు ఆత్మహత్య చేసుకుంటానని వాపోయాడు. అశ్విని లేని జీవితం తనకు వద్దు అని బోరున విలపించాడు. బయటకు వచ్చిన ఫిర్యాదు : గత నెల 16వ తేదీన అశ్విని మధురవాయిల్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు తాజాగా బయట పడింది. తాను అళగేషన్ ప్రేమించుకున్నట్టు వివరించిన అశ్విని, ఇప్పుడు అతడికి ఎలాంటి అర్హతలు లేదు అని, అందుకే దూరం పెట్టినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొని ఉండడం గమనార్హం. ఈ సమయంలో పోలీసులు అళగేషన్కు బాగానే దేహశుద్ధి చేశారు. స్థానిక పెద్దల జోక్యంతో అళగేషన్‌ను హెచ్చరించి పంపించారు. అయితే, తనకు జరిగిన అవమానం, తనను మోసం చేసే విధంగా అశ్విని వ్యవహరించడాన్ని భరించ లేక హతమార్చి తీరాలన్న భావనతో వచ్చి తన పంతాన్ని అళగేషన్ నెగ్గించుకున్నాడు. తనకు దూరం అవుతున్న అశ్వినికి బలవంతంగా ఆ ప్రేమోన్మాది తాళి కట్టడం, దానిని ఆమె తెంచి పడేయడం వంటి ఘటనలు కూడా చోటుచేసుకుని ఉండడం గమనార్హం. అళగేశన్‌ను చూసి భయపడి : కళాశాల గేటు వద్ద మిత్రులతో కలిసి బయటకు వచ్చిన అశ్విని సమీపంలో నక్కి ఉన్న అళగేషన్‌ను గుర్తించింది. మిత్రులతో కలిసి వెళ్లి ఉంటే ప్రాణాల్ని దక్కించుకునేదేమో. ఎక్కడ అళగేషన్ తన ముందుకు వస్తాడోనన్న భయంతో పక్కనే ఉన్న మరో వీధి వెంట పరుగులు తీసింది. దీన్ని గుర్తించిన కిరాతకుడు వెంట పడి మరీ ఆమె గొంతులో కత్తిని దించి హతమార్చాడు. ఈ హఠాత్పరిణామాన్ని అక్కడే ఉన్న కొందరు గుర్తించి అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించేలోపు ఆమె విగతజీవిగా మారింది. అళగేషన్ వేధింపుల నేపథ్యంలో ప్రతిరోజూ తానే అశ్విని ఇంటికి తీసుకొచ్చే వాడిని అని, శుక్రవారం కాస్త ఆలస్యం కావడంతో ఆమెను పోగొట్టుకున్నట్టు ఆమె పెదనాన్న సంపత్ ఆవేదన వ్యక్తంచేశారు. అశ్విని చదువులకు తానేదో లక్షలు ఖర్చు పెట్టినట్టుగా నిందితుడు పేర్కొనడాన్ని ఆమె తల్లి శంకరి ఖండించారు. తాను అనేక ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ కుమార్తెను, కుమారుడ్ని చదివిస్తున్నట్టు వివరించారు. ఆస్పత్రిలో శనివారం పోస్టుమార్టం అనంతరం అశ్విని మృతదేహాన్ని తీసుకునేందుకు కుటుంబీకులు నిరాకరించారు. నిందితుడ్ని ఉరి తీయాలని, అప్పుడే మృతదేహాన్ని తీసుకుంటామని పట్టుబట్టారు. చివరకు పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బుజ్జగించారు. దీంతో మృతదేహాన్ని తీసుకున్న కుటుంబీకులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. -
చెన్నైలో మృగోన్మాదం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రేమించడం లేదన్న కోపంతో ఓ యువతిని ప్రేమోన్మాది కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. ఇక్కడి మధురవాయల్‌కు చెందిన అశ్వని(18) స్థానికంగా ఓ కాలేజీలో బీకాం మొదటి సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన అళగేశన్(22) అనే యువకుడితో ఆమెకు స్నేహం ఏర్పడింది. కొన్నాళ్లకు తనను తనను ప్రేమించాలని వేధించడం మొదలుపెట్టాడు. ఆమె అంగీకరించకపోవడంతో కోపంతో ఇంట్లోకి చొరబడి తాళి కట్టాడు. యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అళగేశన్ జైలు పాలయ్యాడు. ఇటీవల బెయిల్‌పై బయటికొచ్చి మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు బంధువుల ఇంట్లో ఉంచి 10 రోజులు కాలేజీకి పంపలేదు. 8 నుంచి అశ్వనీ కళాశాలకు వస్తోందని తెల్సుకుని శుక్రవారం మధ్యాహ్నం కాలేజీ నుంచి ఇంటికి తిరిగొస్తుండగా కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడిచేశాడు. వదిలేయమని బతిమాలుతున్నా వినకుండా కత్తితో నిర్దాక్షిణ్యంగా ఆమె గొంతు కోశాడు. దీంతో అశ్వని గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోయింది. పరారయ్యేందుకు యత్నించిన అళగేశన్‌ను స్థానికులు పట్టుకుని చితకబాదడంతో అతను స్పృహ కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చెన్నై కేకే నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణస్నేహితుల మధ్య ప్రేమ పగ
దొడ్డబళ్లాపురం: ప్రేమికుల రోజు వారి జీవితాల్లో విషాదం నింపింది. ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇద్దరు మిత్రులు గొడవపడి కత్తితో పొడవడంతో ఒకరి ప్రాణం పోయింది. ఈ సంఘటన తాలూకాలోని కంచిగనాళ గ్రామంలో చోటుచేసుకుంది. కంచిగనాళ గ్రామం నివాసులయిన సంతోష్ (24), హరీష్ (24) చిన్నప్పటి నుండి ఆప్త స్నేహితులు. సంతోష్ వ్యవసాయం చేసుకుంటుండగా, హరీష్ చదువు సగంలో వదిలేసి షేర్ ఆటో డ్రైవర్‌గా ఉన్నాడు. ఇలా ఉండగా ఏడాది కాలంగా హరీష్, ఇదే గ్రామానికి చెందిన ఒక యువతి పరస్పరం ప్రేమించుకున్నారు. ఇదే సమయంలో ఆ యువతి తమ కులం అమ్మాయి కావడంతో సంతోష్ కూడా ఇష్టపడి ప్రేమించడం ప్రారంభించాడు. ఈ విషయంలో స్నేహితులు కొంతకాలంగా శత్రువులుగా మారారు. తరచూ అమ్మాయి ప్రేమ కోసం కొట్టుకున్నారు. ఈ క్రమంలో గత వారం అమ్మాయికి హరీష్ ఆటోలో అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాడట. ఈ విషయం తెలుసుకున్న సంతోష్ హరీష్‌తో ఘర్షణపడి బెదిరించాడు. ఈ విషయమై హరీష్ గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారణ కోసం గ్రామానికి వచ్చి సంతోష్ ఇంటికి వెళ్లారు. దీనిని అవమానంగా భావించిన సంతోష్ మంగళవారం రాత్రి గ్రామంలోని అశ్వత్థకట్ట వద్ద హరీష్‌తో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే సంతోష్ కత్తితో హరీష్ గొంతు, ఎద భాగాల్లో విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితున్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. సంతోష్ పరారయ్యాడు. గ్రామస్థుల్లో భయాందోళన ప్రేమ పేరుతో యువకులు జీవితాలను నాశనం చేసుకోగా, ఇన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న కంచిగనాళ గ్రామంలో కొత్తగా కుల కక్షలు రాజుకోవడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరీష్, సంతోష్, వీరి ప్రేమికురాలి ఇళ్లు గ్రామంలో ఒకే వీధిలో ఉండడంతో ఎప్పుడేం గలాటా జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఎస్పీ అమిత్‌సింగ్, ఏఎస్పీ మల్లికార్జున్, డీవైఎస్పీ నాగరాజు, సీఐ సిద్ధరాజు సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమలేఖలో కొత్త విషయాలు గురువారం నాడు మృతుని తల్లితండ్రులు హరీష్‌కు సంబంధించిన వస్తువులు పరిశీలించగా కొన్ని లవ్ లెటర్లు లభించాయి. అవన్నీ హరీష్ ప్రేమిస్తున్న అమ్మాయి రాసినవే. ఆమె ఇద్దరు యువకులతోనూ ప్రేమ సాగిస్తోందని తేలింది. ముఖ్యంగా అమ్మాయి హరీష్ వల్ల గర్భవతి అయిన సంగతి తెలిసింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులే సంతోష్‌ను ఉసిగొల్పి తమ కొడుకును హత్య చేయించారని హరీష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తక్కువ కులానికి చెందిన తమ కుమారుడికి అమ్మాయినిచ్చి వివాహం చేయడం ఇష్టంలేకే హత్య చేయించారని చెబుతున్నారు. -
ప్రేమించలేదని యువతిపై దాడి
కాకినాడ రూరల్/ భానుగుడి: ప్రేమికుల రోజుకు ఒక రోజు ముందు తనను ప్రేమించలేదన్న అక్కసుతో ఓ ప్రేమోన్మోది చేసిన దాడి జిల్లా కేంద్రం కాకినాడలో కలకలం రేపింది. అడ్డు వచ్చిన మరో ముగ్గురిపై కూడా తన ఉన్మాదాన్ని చూపించి కత్తితో గాయపరిచాడు. ప్రేమికుల దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇలాంటి ఘనట చోటుచేసుకోవడం సర్వత్రా ఆందోళన కలిగించింది. కాకినాడ రాజీవ్ గృహకల్పకు చెందిన ఆకూరి ప్రసాద్ అనే యువకుడు కొంత కాలంగా పొక్లైన్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడు సాంబమూర్తినగర్ ఐదో వీధికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతూ వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని రోజూ బెదిరింపులకు దిగేవాడు. ఎప్పటికప్పుడు ఆ యువతి ప్రసాద్ ప్రేమను నిరాకరిస్తూ వస్తోంది. మంగళవారం రాత్రి మహాశివరాత్రి సందర్భంగా సాంబమూర్తినగర్లోని కనకదుర్గమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల సందర్భంగా దీపాలు వెలిగించేందుకు ఆ యువతి వచ్చింది. దీపాలు వెలిగిస్తున్న సమయంలో ఆ యువతి వద్దకు ప్రసాద్ వచ్చి నన్ను ప్రేమించాలని, నిర్ణయం ఇప్పుడే చెప్పాలంటూ పట్టుబట్టాడు. ఆమె అందుకు తిరస్కరించింది. ఆగ్రహంతో ఊగిపోయిన ప్రసాద్ ఆ యువతిని చున్నీతో రోడ్డుపైకి లాక్కుంటూ వెళ్లి కత్తితో దాడి చేశాడు. సమీపంలోనే టీ తాగుతున్న కుడిపూడి సత్యనారాయణ, పితాని శ్రీను, మేడిశెట్టి సదాసాంబశివలు ఈ సంఘటన చూసి అతడ్ని అడ్డుకున్నారు. ఆమెను విడిపించేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రసాద్ బ్లేడులాంటి వస్తువుతో వారిపై దాడి చేశాడు. యువతికి చిన్నపాటి గాయం కాగా, ముగ్గురికి గుండెలపైన తుంటిపైన గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గుర్ని కాకినాడ జీజీహెచ్‌కు 108 వాహనంలో తరలించారు. దాడికి పాల్పడిన ప్రేమోన్మోది ఆకూరి ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాగా మద్యం తాగి ఉండటంతో అతడ్ని పోలీసులు ఆస్పత్రికి తీసుకొచ్చి పరీక్షలు చేయించారు. త్రీ టౌన్ సీఐ దుర్గారావు ఆధ్వర్యంలో ఎస్సై పి.కిశోర్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మాట వినలేదని.. క్రికెటర్‌కు కత్తిపోట్లు!
సాక్షి, చెన్నై: తాను చెప్పినట్లు చేయలేదని ఓ జూనియర్ లెవల్ క్రికెటర్‌పై స్కూల్ టీచరే కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆ బాధిత విద్యార్థి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన తమిళనాడు దిండిగల్ జిల్లా మనవాడిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. దిండిగల్ జిల్లా పాయలానికి చెందిన హదికర్ రహ్మాన్(16) మనవాడిలోని ఆశ్రమ్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. అదే స్కూల్లో పన్నీర్‌సెల్వం ఫిజికల్ ఎడ్యూకేషన్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. స్కూలు తరఫున క్రికెట్ ఆడే రహ్మాన్.. ప్రైవేట్ క్లబ్ టోర్నీల్లోనూ పాల్గొనేవాడు. కేవలం మన స్కూలు, మన ప్రాంతం తరఫున మాత్రమే క్రికెట్ ఆడాలని.. ప్రైవేట్ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించొద్దని రహ్మాన్‌కు పీఈటీ వార్నింగ్ ఇచ్చాడు. కానీ రహ్మాన్ ప్రైవేట్ టోర్నీల్లోనూ పాల్గొనడంతో తీవ్ర ఆవేశానికి లోనైన పీఈటీ పన్నీర్‌సెల్వం మాట్లాడాలంటూ పిలిచాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో క్రికెటర్ రహ్మాన్ ఛాతీ, భుజం భాగాల్లో పొడిచాడు. చేతిలోని కత్తిని ఇతర టీచర్లు గుంజుకోగానే పీఈటీ పన్నీర్‌సెల్వం అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, తీవ్రంగా రక్తస్రావమవుతున్న విద్యార్థి రహ్మాన్‌ను కరూర్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తనను తానే గాయపర్చుకుని పీఈటీ సైతం ఆస్పత్రిలో చేరి విద్యార్థి తనపై దాడి చేశాడని చెప్పడం గమనార్హం. స్కూలు యాజమాన్యం ఫిర్యాదు మేరకు పన్నీర్‌సెల్వంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. -
హెచ్ఎంను కత్తితో పొడిచిన విద్యార్థి
వేలూరు: క్లాసులు జరుగుతున్న సమయంలో విద్యార్థులు ఇతర తరగతి గదులకు వెళ్లకూడదన్నందుకు ఓ విద్యార్థి సోమవారం ప్రధానోపాధ్యాయుడిని కత్తితో పొడిచాడు. తమిళనాడులోని వేలూరు జిల్లా తిరుపత్తూరు రైల్యేస్టేషన్ రోడ్డులో ఉన్న రామకృష్ణా ప్రభుత్వ పాఠశాలకు బాబు (56) హెడ్మాస్టర్గా ఉన్నారు. ఇదే పాఠశాలలో తిరుపత్తూరు హౌసింగ్ బోర్డుకు చెందిన హరిహరన్ అనే విద్యార్థి (16) పదకొండో తరగతి చదువుతున్నాడు. క్లాసులు జరుగుతున్న సమయంలో హరిహరన్ తన క్లాస్‌రూమ్‌లో కాకుండా మరో గదిలో కనిపించడంతో హెచ్ఎం మందలించారు. దీంతో హరిహరన్ తన వద్దనున్న కత్తితో హెచ్ఎంను కడుపులో పొడిచాడు. రక్తపు మడుగులో పడి కేకలు వేయడంతో స్కూల్ టీచర్లు, విద్యార్థులు హెచ్ఎంను తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి, ఆ తర్వాత వేలూరుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న హరిహరన్ కోసం గాలిస్తున్నారు. -
కత్తులు, రాడ్డులతో విశాఖలో దారుణం..
సాక్షి, విశాఖపట్నం: వ్యభిచారాన్ని ప్రశ్నించిన పాపానికి విశాఖపట్నంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తమ అక్రమ కార్యకలాపాలను నిలదీసిన ఓ యువకుడిపై కొందరు వ్యక్తులు కత్తులతో తెగబడ్డారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ చౌరస్తాలో ఏ మాత్రం బెరుకు బెంకు లేకుండా కత్తులతో పొడిచి రాడ్డుతో కొట్టి పరారయ్యారు. దీంతో ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఇంత జరుగుతున్నా అక్కడి వారు కనీసం స్పందించకపోవడం దారుణం. వివరాల్లోకి వెళితే జీవీఎంసీ 15వ వార్డు అశోక్‌నగర్‌కు చెందిన పెద్దాడ సురేష్ (30) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఆశీలమెట్టలోని ద్వారకా వైన్స్ షాపు వద్ద ఉన్న అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, రాడ్డులతో చేసి పరారయ్యారు. రక్తపు మడుగులో పడిఉన్న సురేష్‌ను బంధువులు సీతమ్మధారలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు లా అండ్ ఆర్డర్ డీసీపీ ఫకీరప్ప, ద్వారకాజోన్ ఏసీపీ పి.రామచంద్రరావు, ఎంవీపీజోన్ సీఐ మళ్ల మహేష్, ద్వారకా ఎస్ఐలు మురళీ, అడపా సత్యారావు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. సంఘటన స్థలంలో ఉన్న వారిని విచారించారు. ద్వారకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం ఆ ప్రాంతంలోనే వ్యభిచారం జరుగుతుందని, ఆ ప్రాంతం నుంచి కుటుంబ సభ్యులతో వెళ్లాలన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఆ విషయాన్ని ప్రశ్నించినందుకే సురేష్‌పై దాడి చేశారని వారు వెల్లడించారు. ఓ వ్యక్తిని హత్య చేసే వరకు వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. -
విశాఖలో రెచ్చిపోయిన దుండగులు
-
దారుణం : ఉద్యోగం ఇప్పించలేదని.. కత్తితో..!
సాక్షి, మదనపల్లి : చిత్తూరు జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తిపై బాధితుడు కత్తితో దాడికి దిగాడు. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా, మదన పల్లికి చెందని ఫరూక్ గల్ఫ్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. తన దగ్గరికి వచ్చిన వారికి గల్ఫ్ దేశాల్లో వీసాతో పాటు ఉద్యోగం ఇప్పిస్తానని చెబుతూ ఉండేవాడు. అదే మదనపల్లికి చెందిన విశ్వ కూడా గల్ఫ్‌లో ఉద్యోగం కోసం ఫరూక్‌ను సంప్రదించాడు. అయితే ఇందుకోసం రెండు లక్షలు ఖర్చవుతందని ఫరూక్ చెప్పడంతో అంత మొత్తాన్ని చెల్లించిన విశ్వ గల్ఫ్ వెళ్లిపోయాడు. అక్కడ వెళ్లిన తర్వాత విశ్వకు అసలు విషయం అర్థం అయింది. దిక్కు మొక్కులేని చిన్న కంపెనీలో అతి తక్కువ జీతానికి తనను నియమించినట్లు అర్థం చేసుకున్న విశ్వ, కొద్ది కాలం తర్వాత ఇండియాకు తిరిగి వచ్చాడు. వచ్చీరాగానే ఏజెంట్ ఫరూక్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం సంఘటనా స్థలం నుంచి విశ్వ పారిపోయాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఫరూక్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
తమ్ముడిని చంపిన అన్న
చీరాల రూరల్: కుటుంబ కలహాల నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ కారణంగా కత్తి పోటుకు గురై తమ్ముడు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం చీరాలలో జరిగింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా.. ఉద్దేశ పూర్వకంగా జరిగిందా..అనే విషయంపై స్థానికుల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందిన వివరాల ప్రకారం.. స్థానిక థామస్‌పేటకు చెందిన బడుగు ఏలియా, బడుగు వనేష్ (35)లు అన్నదమ్ములు, వీరు చీరాల నెహూ కూరగాయల మార్కెట్ సమీపంలో పండ్ల వ్యాపారం చేస్తుంటారు. సాయంత్రం సమయంలో పండ్ల దుకాణం వద్ద డబ్బుల విషయంలో ఘర్షణ పడ్డారు. వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. ఏం జరిగిందో ఏమోగానీ వనేష్ ఎడమ చేతిపై కత్తి గాటుతో రోడ్డుపై పడిపోయాడు. చేతి నరం తెగిపోవడంతో తీవ్ర రక్త స్రావమైంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వచ్చి క్షతగాత్రుడిని చికిత్స కోసం ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి వనేష్ మృతి చెందాడు. కత్తితో వనేష్‌పై ఏలియా దాడి చేశాడా.. వనేష్ తనకు తానే కత్తితో కోసుకున్నాడా.. అనే విషయాలపై స్థానికులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి భార్య సంధ్య, ఐదేళ్ల సాల్మన్‌వెస్లీ, ఏడాదిన్నర అబూజ రాణిలు ఉన్నారు. భర్త మృతి చెందాడన్న వార్త తెలుసుకున్న సంధ్య ఆస్పత్రి వద్దకు చేరుకుని రోదించింది. మృతుని బంధువులు ఆస్పత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. డీఎస్పీ డాక్టర్ ప్రేమ్‌కాజల్, టూటౌన్ సీఐ రామారావు, ఒన్‌టౌన్ సీఐ విజయ్‌కుమార్‌లు సంఘటన స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. ఈ విషయమై ఒన్‌టౌన్ ఎస్ఐ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా డబ్బులు విషయంలో గొడవ జరగడంతో బావ ఏలియానే తన భర్త వనేష్‌పై కత్తితో దాడి చేసి గాయపరిచాడంటూ సంధ్య ఫిర్యాదు చేసిందని తెలిపారు. -
కత్తులు దూసిన ఘర్షణ
నెల్లూరు(క్రైమ్) : కారణ మేంటో తెలీదు గానీ.. ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఓ వర్గం ప్రత్యర్థి వర్గంపై కత్తులతో విచక్షణా రహితంగా దాడికి తెగబడింది. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు కుమారులు తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం రాత్రి కొత్తహాల్ సెంటర్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక వివరాలిలా ఉన్నాయి. బోడిగాడి తోటకు చెందిన ఆవుల పొన్నయ్య అంజమ్మ దంపతులు. వారికి నలుగురు కుమారులు. వీరంతా నగరంలో చెత్త ఏరుకొని అమ్ముతుంటారు. రాత్రి వేళ కొత్తాహాల్ సమీపంలోని దుకాణాల వద్ద నిద్రిస్తుంటారు. సోమవారం రాత్రి అంజమ్మ, పొన్నయ్య దంపతులతోపాటు వారి కుమారులు మారివేలు, ప్రసాద్ కొత్తహాల్ సమీపంలోని దుకాణం వద్ద నిద్రకు ఉపక్రమించారు. చిత్తు కాగితాలు, పిక్‌పాకెటింగ్‌లకు పాల్పడే ముజ్జవేలు తన స్నేహితులైన కుమారు, మున్నాలతో కలిసి ఫూటుగా మద్యం సేవించి అక్కడకు వచ్చారు. ఈ క్రమంలో వారి మధ్య నగదు విషయమై గొడవ జరిగింది. కోపోద్రిక్తులైన ముజ్జవేలు అతని స్నేహితులు తమ వెంట తెచ్చుకొన్న కత్తులతో ప్రసాద్‌పై దాడికి దిగి గొంతు, మర్మావయవాలు కోశారు. అడ్డుకునేందుకు వెళ/æ్లన అంజమ్మ, మారివేలుపైనా దాడి చేయడంతో అంజమ్మ కుడి చేతికి తీవ్ర గాయమైంది. మారివేలు గొంతుకు బలమైన గాయం కావడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న తల్లి, కుమారులను గమనించిన స్థానికులు ఒకటో నగర ఇన్చార్జి ఇన్స్పెక్టర్ పాపారావుకు, 108సిబ్బందికి సమాచారం అందించారు. పాపారావు, ఒకటో నగర ఎస్సై ఖాజావలి ఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉంది. దాడికి పాల్పడిన నిందితుల్లో ముజ్జవేలు తప్పించుకోగా ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నగదు కోసమే దాడి అందరూ నిద్రిస్తుండగా ముజ్జవేలు ప్రసాద్ వద్దకు వచ్చి జేబులో నగదు లాక్కొనే ప్రయత్నం చేశాడని, అతను ప్రతిఘటించడంతో కత్తులతో దాడిచేసి గాయపరిచారని బాధితులతో పాటు సమీపంలో నిద్రిస్తున్న వారు పోలీసులకు తెలిపారు. ముజ్జవేలు రైళ్లల్లో తిరుగుతూ జేబు దొంగతనాలు చేస్తుంటాడని తెలిపారు. ముజ్జవేలు కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
వైఎస్సార్సీపీ నేతపై కత్తులతో దాడి
-
నగరంలో మళ్లీ రక్తపు మరకలు
కరీమాబాద్ : వరంగల్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో ఆదివారం రాత్రి ఓ యువకుడిపై మరో యువకుడు దాడిచేసి కత్తితో గాయపర్చిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు, మిల్స్‌కాలనీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎస్‌ఆర్‌ఆర్‌తోటలోని సీఆర్‌నగర్‌కు చెందిన సమ్మెట శ్రీకాంత్ ఆదివారం రాత్రి స్థానిక పుట్నాల మిల్లులోని గల్లీలో బతుకమ్మ ఆడుతున్న మహిళల ముందు ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తూ వెళుతున్నాడు. స్థానికులతోపాటు మండల రాము అనే వ్యక్తి అడ్డుకున్నాడు. ర్యాష్‌గా ఎందుకు డ్రైవ్ చేస్తున్నావని శ్రీకాంత్‌ను అడుగగా అతని వద్ద ఉన్న కత్తితో రాము మెడపై ఇష్టమొచ్చినట్లు పొడిచాడు. గమనించిన స్థానికులు దాడికి పాల్పడిన శ్రీకాంత్‌ను పట్టుకుని కొట్టారు. ఈ క్రమంలో దాడిలో గాయపడిన రాము, దాడికి పాల్పడిన శ్రీకాంత్‌ను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా గతంలో కూడా సమ్మెట శ్రీకాంత్ ఓ వ్యక్తిని కత్తితో మెడపై పొడిచిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. మిల్స్‌కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రేమించాడు..యువతి గొంతు కోశాడు
-
స్నూకర్ సెంటర్లో దారుణ ఘటన
-
పోలీసులపై కత్తులతో దాడి
టీ.నగర్ (చెన్నై): పోలీసులపై దుండగులు కత్తులతో దాడిచేసి నిందితుడిని విడిపించుకుపోయిన సంఘటన తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో శనివారం జరిగింది. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన సంచలనం కలిగించింది. తిరునెల్వేలి జిల్లా, నాంగునేరి సమీపంలోని మంజకుళం చెరువులో స్థానికులు మట్టిని తవ్వుతున్నారు. అదే చెరువులో వారికి సమీపంలో మరుకాలకురిచ్చి గ్రామానికి చెందిన మరికొందరు మట్టిని తవ్వుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంజకుళానికి చెందిన ఆరుముగం అనే వ్యక్తికి మరుకాలకురిచ్చి గ్రామస్తులకు మధ్య తగాదా ఏర్పడింది. అనంతరం మరుకాలకురిచ్చి గ్రామస్తులు ఆరుముగం కోసం గాలించారు. అతను కనిపించకపోవడంతో ఆయన అన్న సుడలైకన్ను ఇంటికి వెళ్లి ఇంటిని ధ్వంసంచేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో మరుకాలకురిచ్చి గ్రామానికి చెందిన ఉదయకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనంలో పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళుతున్నారు. ఆ సమయంలో ఓ ముఠా పోలీసు వాహనాన్ని అటకాయించి వారిపై కత్తులతో దాడిచేసి ఉదయకుమార్‌ను విడిపించుకెళ్లింది. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో వారు అక్కడికొచ్చి గాయపడిన వారిని చికిత్సకోసం నెల్లై ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అనంతరం నాంగునేతి ప్రాంతంలో పోలీసు భద్రత ఏర్పాటుచేశారు. ఇదిలా ఉండగా నిందితుడిని విడిపించుకెళ్లిన వారికోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. -
ముస్లింను ప్రేమించిందని కన్న కూతుర్నే..
జెరుసలెం: తన కూతురు ఓ ముస్లిం యువకుడితో డేటింగ్ చేయడం, ఆపై మతం మారుతానని చెప్పడాన్ని జీర్ణించుకోలేని క్రిస్టియన్ తండ్రి ఆమెను హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ దారుణ ఘటన ఇజ్రాయెల్ లోని రామ్లే పట్టణంలో ఇటీవల చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సామి కర్రా(58) క్రైస్తవుడు. ఆయనకు కూతురు (17) ఉంది. గత కొన్ని రోజులుగా ఓ ముస్లిం యువకుడితో బాలిక సన్నిహితంగా ఉంటోంది. ముస్లింతో కూతురు సంబంధం పెట్టుకోవడాన్ని సామి కర్రా జీర్ణించుకోలేకపోయాడు. ఈ విషయంపై పలుమార్లు ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. మే నెలలో ఇంట్లో గొడవపడ్డ బాలిక తన బాయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది. యువకుడి తల్లి బాలికకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నారు. దీంతో ఆగ్రహించిన సామి ముస్లిం యువకుడిపై, అతడి ఫ్యామిలీపై కేసు పెడతానంటూ వేధింపులకు పాల్పడేవాడు. విషయం చాలా సీరియస్ అని గుర్తించిన బాలిక పోలీసుల జోక్యం లేకుంటేనే ఇంటికి వస్తానని కండీషన్ పెట్టింది. చెప్పిన ప్రకారం ఇంటికి వెళ్లిన యువతి టెన్త్ క్లాస్ లో పాస్ కావడంతో జూలై 12న సెలబ్రేట్ చేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్ జైలులో ఉన్నాడని ఆ మరుసటి రోజు తెలిసి ఆవేదనకు లోనైంది. అతడికి 100 డాలర్లు మనీయార్డర్ చేసింది. తాను ఇస్లాంలోకి మారతానని, సమస్యలకు కారణం మతమేనని ఇంట్లో వాళ్లకు చెప్పింది. ఇన్ని రోజులు ముస్లిం అబ్బాయితో తిరిగావ్, ఇప్పుడు మతం మారతావా అంటూ సామి మండిపడ్డాడు. తాను జైలుకు వెళ్లినా సరే పర్లేదు, కానీ కూతురిని మాత్రం వదిలిపెట్టనంటూ వంటింట్లోని కత్తి తీసుకొచ్చి కూతురిని పలుమార్లు పొడిచి హత్యచేశాడు. కత్తిపోట్ల వల్లే బాలిక మృతిచెందిందని వైద్యులు తెలిపారు. కూతుర్ని హత్యచేసిన సామి కర్రాను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.