ముస్లింను ప్రేమించిందని కన్న కూతుర్నే.. | Christian man who killed daughter for she dating a Muslim | Sakshi
Sakshi News home page

ముస్లింను ప్రేమించిందని కన్న కూతుర్నే..

Published Wed, Jul 19 2017 1:06 PM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM

ముస్లింను ప్రేమించిందని కన్న కూతుర్నే..

ముస్లింను ప్రేమించిందని కన్న కూతుర్నే..

జెరుసలెం: తన కూతురు ఓ ముస్లిం యువకుడితో డేటింగ్ చేయడం, ఆపై మతం మారుతానని చెప్పడాన్ని జీర్ణించుకోలేని క్రిస్టియన్ తండ్రి ఆమెను హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ దారుణ ఘటన ఇజ్రాయెల్ లోని రామ్లే పట్టణంలో ఇటీవల చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సామి కర్రా(58) క్రైస్తవుడు. ఆయనకు కూతురు (17) ఉంది. గత కొన్ని రోజులుగా ఓ ముస్లిం యువకుడితో బాలిక సన్నిహితంగా ఉంటోంది. ముస్లింతో కూతురు సంబంధం పెట్టుకోవడాన్ని సామి కర్రా జీర్ణించుకోలేకపోయాడు.

ఈ విషయంపై పలుమార్లు ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. మే నెలలో ఇంట్లో గొడవపడ్డ బాలిక తన బాయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది. యువకుడి తల్లి బాలికకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నారు. దీంతో ఆగ్రహించిన సామి ముస్లిం యువకుడిపై, అతడి ఫ్యామిలీపై కేసు పెడతానంటూ వేధింపులకు పాల్పడేవాడు. విషయం చాలా సీరియస్ అని గుర్తించిన బాలిక పోలీసుల జోక్యం లేకుంటేనే ఇంటికి వస్తానని కండీషన్ పెట్టింది. చెప్పిన ప్రకారం ఇంటికి వెళ్లిన యువతి టెన్త్ క్లాస్ లో పాస్ కావడంతో జూలై 12న సెలబ్రేట్ చేసుకుంది.

తన బాయ్ ఫ్రెండ్ జైలులో ఉన్నాడని ఆ మరుసటి రోజు తెలిసి ఆవేదనకు లోనైంది. అతడికి 100 డాలర్లు మనీయార్డర్ చేసింది. తాను ఇస్లాంలోకి మారతానని, సమస్యలకు కారణం మతమేనని ఇంట్లో వాళ్లకు చెప్పింది. ఇన్ని రోజులు ముస్లిం అబ్బాయితో తిరిగావ్, ఇప్పుడు మతం మారతావా అంటూ సామి మండిపడ్డాడు. తాను జైలుకు వెళ్లినా సరే పర్లేదు, కానీ కూతురిని మాత్రం వదిలిపెట్టనంటూ వంటింట్లోని కత్తి తీసుకొచ్చి కూతురిని పలుమార్లు పొడిచి హత్యచేశాడు. కత్తిపోట్ల వల్లే బాలిక మృతిచెందిందని వైద్యులు తెలిపారు. కూతుర్ని హత్యచేసిన సామి కర్రాను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement