బీజింగ్: స్కూలులో కత్తితో ఉన్మాది దాడి.. 8 మంది మృతి | Eight Persons Killed And 17 Injured In Knife Attack In China, More Details Inside | Sakshi
Sakshi News home page

బీజింగ్: స్కూలులో కత్తితో ఉన్మాది దాడి.. 8 మంది మృతి

Published Sun, Nov 17 2024 7:13 AM | Last Updated on Sun, Nov 17 2024 10:23 AM

Eight Persons Killed and 17 Injured in Knife Attack in China

బీజింగ్: చైనాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది.  ఒక స్కూలులోకి చొరబడిన ఉన్మాది కత్తితో దాడికి తెగబడిన ఘటనలో 8 మంది మృతి చెందారు. ఇదే ఘటనలో 17 మంది గాయపడ్డారు.  ఘటనా స్థలంలో సహాయక చర్యలు  కొనసాగుతున్నాయి. పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని  అదుపులోకి తీసుకున్నారు. అతను నేరాన్ని అంగీకరించాడు.

ఈ  ఘటన తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది.  ఓ ఉన్మాది ఒకేషనల్ స్కూల్‌లోకి ప్రవేశించి, అక్కడున్నవారిని విచక్షణా రహితంగా కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా,  మరో 17మంది గాయపడ్డారు. యిక్సింగ్ నగరంలోని వుక్సీ వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీలో ఈ దాడి జరిగింది.

రాష్ట్ర వార్తా సంస్థ ‘జిన్హువా’ తెలిపిన వివరాల ప్రకారం ఈ దారుణానికి పాల్పడిన 21 ఏళ్ల నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు  ఇంటర్న్‌షిప్ జీతంపై అసంతృప్తితో ఉన్నాడని, దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, స్కూల్‌లోకి ప్రవేశించి, కత్తితో దాడికి తెగబడ్డాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఎన్నికల ‍ప్రచారంలో నటుడు గోవిందాకు అస్వస్థత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement