జర్మనీలో కత్తితో దాడి.. ముగ్గురి మృతి | Three dead, several wounded in knife stabbing at festival in German | Sakshi
Sakshi News home page

జర్మనీలో కత్తితో దాడి.. ముగ్గురి మృతి

Published Sat, Aug 24 2024 8:10 AM | Last Updated on Sat, Aug 24 2024 8:31 AM

Three dead, several wounded in knife stabbing at festival in German

బెర్లిన్: పశ్చిమ జర్మనీలోని సోలింగెన్‌ నగరంలో జరిగిన కత్తిపోట్ల ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. శుక్రవారం రాత్రి సోలింగెన్‌ నగర 650వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఉత్సవాల్లో  ఈ  ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి పులువురిపై విక్షణారహితంగా​ కత్తితో దాడి చేశాడని పేర్కొన్నారు. ఈ దాడికి పాల్పడిన నిందితుడు పరారీలో ఉ‍న్నట్లు తెలిపారు. 

‘ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటనలో పలువరు గాయపడ్డారు. చికిత్స పొందుతున్న వారందరూ కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’అని సోలింగెన్ మేయర్ టిమ్-ఒలివర్ కుర్జ్‌బాచ్ ఒక ప్రకటనలో తెలిపారు. జర్మనీలో ఘోరమైన కత్తిపోట్లు, కాల్పులు  తరచూ జరుగుతుంటాయి. ఇక..  ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు కోసం ప్రత్యేక టీంలో గాలిస్తున్నారు. సోలింగెన్  పట్టణం నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియా రాష్ట్రంలో ఉంది. నెదర్లాండ్స్ సరిహద్దులో ఉన్న అత్యధిక జనాభా నగరం సోలింగెన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement