
సాక్షి,అనకాపల్లి: రాష్ట్రంలో కూటమి నేతలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. తాము ఏం చేసినా చెల్లుతుంది అనే రీతిలో దాడులకు తెగబడుతున్నారు. తాజాగా వైఎస్సార్‌సీపీ నేత కర్రి శ్రీనివాసరావుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరుడు పప్పల అప్పలనాయుడు కత్తితో దాడి చేశాడు.
ఈ దాడిలో శ్రీనివాసరావు తప్పించుకోగా.. ఆయన సహచరుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడితో అప్రమత్తమైన బాధితుడి కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స కోసం నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అయ్యన్నపాత్రుడి అనుచరుల దాడిపై సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ బాధితుడిని పరామర్శించారు.

Comments
Please login to add a commentAdd a comment