విందులో రగడ కర్రీస్‌ అయిపోవడంతో.. | Knife Attacks in Wedding Dinner in Tamil Nadu | Sakshi
Sakshi News home page

విందులో రగడ ఐదుగురికి కత్తిపోట్లు

Published Mon, Feb 18 2019 11:29 AM | Last Updated on Mon, Feb 18 2019 11:29 AM

Knife Attacks in Wedding Dinner in Tamil Nadu - Sakshi

విందులో ఏర్పడిన రగడలో ఐదుగురు కత్తిపోట్లకు గురయ్యారు.

చెన్నై,తిరువొత్తియూరు: విందులో ఏర్పడిన రగడలో ఐదుగురు కత్తిపోట్లకు గురయ్యారు. వివరాలు.. వందవాసి, మేల్‌నెమిలి గ్రామానికి చెందిన యువకుడికి, చెన్నై పెరుంగళత్తూరుకి చెందిన యువతితో వందవాసి టౌన్‌ ఆరణి వివాహ మండపంలో ఆదివా రం వివాహం జరిగింది. శనివారం రాత్రి ఆహ్వాన కార్యక్రమాలు, విందు భోజనాలు జరి గాయి. అర్ధరాత్రి సమయంలో చెన్నై పల్లావరానికి చెందిన వధువు తండ్రి ఆర్ముగం స్నేహితుడు శ్రీని వాసన్‌ (బిరియానీ మాస్టర్‌) అతని భార్య ప్రమీల వచ్చారు.

ఆ సమయంలో శ్రీనివాసన్‌ దంపతులకు వధువు బంధువు పచ్చయప్పన్‌ భోజనం వడ్డిస్తున్నాడు. కర్రీస్‌ అయిపోవడంతో ఆకులో వడ్డించలేదు. దీనిపై వారిని శ్రీనివాసన్‌ ప్రశ్నించడంతో వాగ్వాదం ఏర్పడింది. దీంతో ఆగ్రహించిన పచ్చయప్పన్, అతని బంధువులు.. శ్రీనివాసన్‌పై దాడి చేశారు. వెంటనే శ్రీనివాసన్‌ కత్తితో పచ్చయప్పన్, అతని బంధువులు మునస్వామి, ఆకాష్, శేఖర్, రాజాలపై దాడి చేశాడు. దీంతో గాయపడ్డ వారిని వందవాసి ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న శ్రీని వాసన్‌ను  అరెస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement