సిగరెట్‌ తాగొద్దన్నందుకు కంట్లో పొడిచాడు | Husband Knife Attack on Wife in Karnataka | Sakshi
Sakshi News home page

కత్తితో కంట్లో పొడిచాడు

Published Sat, Feb 23 2019 12:02 PM | Last Updated on Sat, Feb 23 2019 12:02 PM

Husband Knife Attack on Wife in Karnataka - Sakshi

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు

కర్ణాటక, కృష్ణరాజపురం: సిగరెట్‌ తాగొద్దన్నందుకు ఓ వ్యక్తి తన భార్య కంట్లో కత్తితో పొడిచిన ఘటన గురువారం రాత్రి బాణసవాడిలో చోటు చేసుకుంది. లింగరాజపురంలో నివసిస్తున్న ధర్మ అనే వ్యక్తి చాలా కాలంగా దురలవాట్లకు బానిసయ్యాడు. ఈ క్రమంలో కొద్ది కాలం క్రితం ధర్మకు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో వైద్యపరీక్షలు చేసిన వైద్యులు ఇకపై సిగరెట్లు తాగొద్దంటూ సూచించారు.

అయినా వినని ధర్మ సిగరెట్లు తాగేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా సిగరెట్‌ తాగుతుండగా గమనించిన భార్య గాయత్రి సిగరెట్‌ తాగొద్దంటూ సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన ధర్మ కత్తితో గాయత్రి కంట్లో పొడిచాడు. గాయత్రి కేకలు వేస్తూ బయటకు రావడంతో గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాణసవాడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement