సాక్షి, హైదరాబాద్: సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో పొగాకు వాడకం ప్రధానమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పలుమార్లు తెలిపినప్పటికీ ఈ సంస్కృతిని నివారించడంలో వెనుకబడుతూన్నామని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేఖ దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థలు, సామాజిక సంఘాలు పొగాకుకు వ్యతిరేఖంగా పోరాడాలని, దీని పైన మరింత ప్రచారం అవసరమని నినదిస్తున్నాయి. దేశంలో ప్రతి రోజూ 3669 మంది పొగాకుతో మరణిస్తున్నారు. పొగతాగడంలో దేశంతో పాటు రాష్ట్రం కూడా ముందంజలో ఉంది.
గత సంవత్సరం తెలంగాణాలో బహిరంగ ప్రదేశాల్లో పొగతాగిన వారిపైన నమోదైన 28 వేల కేసులతో దేశంలోనే ఐదవ స్థానంలో ఉంది. ఆధునిక జీవన విధానం పెరిగిన హైదరాబాద్ నగరంలో ఈ ధూమపానం మరింత ఎక్కువగా ఉంది. కేరళ, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ కేసులు తగ్గే ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రంలో మాత్రం ప్రతీ ఏటా పెరుతుండటం ఆందోళనపరుస్తుంది.
గతంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన విషయం ఏంటంటే.. అధిక ధూమపానం జన సంచారం ఉన్న ప్రాంతాల్లో కాకుండా స్కూల్, కాలేజ్, పబ్స్ ఇతర రహాస్య ప్రదేశాల్లో జరుగుతుందని, 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో 38 శాతం, మహిళల్లో 9 శాతం పొగాకును వాడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక తెలుపుతుంది. పొగాకుకు టీనేజ్ పిల్లలు ఎక్కువగా అలవాటు పడుతుండగా, ఈ అలవాటే డగ్స్ వ్యసనానికి పునాదిగా మారుతందని మానసిక-ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా ట్రెండ్, స్టైల్ కోసమే యువత ఈ స్మోకింగ్‌కు అలవాటు పడటం విశేషం. ఈ పొగాకు పదార్థాలైన బీడి, చుట్టా, సిగరెట్స్, ఖైనీ, జర్దా తదితారలాను వాడటంతో కేన్సర్, హార్ట్‌ఎటాక్ వంటి ప్రాణాంతక వ్యాధులకు చేరువైతున్నారు, అంతేకాకుండా ఈ వ్యసనాలే అసాంఘీక కార్యకలాపాలకు వేదికలుగా మారుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ మహమ్మారిని నివారిస్తూనే, వ్యసనానికి బానిసలైన వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చే మార్గాలపైన దృష్టి సారించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
న్యూరో మాడ్యులేషన్ ఉత్తమ పరిష్కారం..
స్మోకింగ్‌కు వ్యతిరేకంగా అవగాహాన కల్పిస్తూనే ఇప్పటికే బానిసైన వారిని మామూలు స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికోసం సైక్రియాటిస్టులను, నికోటిన్ ఉండే మెడిసిన్‌ను వాడుతున్నారు. అయితే ప్రస్తుతం న్యూరో మాడ్యులేషన్ అనే అధునాతన సాంకేతిక చికిత్సా విధానం అందుబాటులో ఉంది. ఈ న్యూరో మాడ్యులేషన్ విధానంలో కేవలం స్మోకింగ్ డిజార్డర్లను తగ్గించడానికి మాత్రమే రెండేళ్ల క్రితం ఎఫ్‌డీఐ అనుమతి లభించింది.
ఈ స్టిమ్యులేషన్ విధానంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పొగాకు వ్యసనం నాడీ వ్యవస్థ, మొదడు పనితీరు పైన ప్రభావం చూపిస్తుంది. న్యూరో మాడ్యులేషన్‌లో భాగంగా డీప్ టీఎమ్మెస్ సాంకేతికత మొదడులోని ఇస్సులా పైన మ్యాగ్నెటిక్ వేవ్స్‌ను పంపించి దాని పనితీరును సవరిస్తుంది. దీని వలన వ్యసనానికి మెల్లిమెల్లిగా దూరమవుతారు. డిప్రెషన్, ఓసీడి సమస్యలకు ఈ ప్రక్రియ పరిష్కారంగా మారింది. దక్షిణాదిన ఈ న్యూరో మాడ్యులేషన్ థెరపీని మేము మాత్రమే అందిస్తున్నాం.
-ప్రముఖ వైద్యులు ఎమ్మెస్ రెడ్డి, ఆశా న్యూరో మాడ్యులేషన్ క్లినిక్, గచ్చిబౌలి.
Comments
Please login to add a commentAdd a comment