World No Tobacco Day
-
Anti tobacco day: దున్నపోతు మాట దేవుడెరుగు.. పోతావుపైకి!
‘పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్’ అని అప్పుడెప్పుడో గిరీశం సెలవిచ్చాడు కానీ... అదెంత అబద్ధమో... పొగ ఆరోగ్యానికి ఎంత హానికరమో ఇప్పుడు ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకవైపు పొగాకు వినియోగంపై అవగాహన పెరుగుతున్నా... ఇంకా అజ్ఞానంలో ఉన్నవారూ కొనసాగుతున్నారు. ఒకరకంగా చూస్తే పెరిగిపోతున్నారు. ఇలాంటి వారిలోనూ ధూమపానం వ్యతిరేక ప్రభావాలపై అవగాహన పెంచేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగమే ఈ నాటి పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఈ లక్ష్యాన్ని సాధించామనుకోండి... ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రస్తుతం 80 లక్షలుగా ఉన్న పొగాకు సంబంధిత మరణాలను గణనీయంగా తగ్గించవచ్చున్నమాట!ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే..1987లో, డబ్యూహెచ్ఓలోని సభ్య దేశాలు ఏప్రిల్ 7ని ప్రపంచ ధూమపాన నిరోధక దినోత్సవంగా గుర్తించాయి. అయితే పొగాకు సంబంధిత సమస్యలన్నింటిపై అవగాహన పెంపొందించే ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పాటించాలని 1988లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అప్పటి నుంచి డబ్యూహెచ్ఓ దాని సభ్య దేశాలు ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.పొగాకు వినియోగ గణాంకాలు:వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం ఏటా పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా దాదాపు 8 మిలియన్లకు పైగా ప్రజలు మరణిస్తున్నట్లు పేర్కొంది. అలాగే దాదాపు 1.3 మిలియన్ల మంది ధూమపానం చేయనివారు సెకండ్‌హ్యాండ్ స్మోక్‌కి గురయ్యి, అనారోగ్యాల బారిన పడుతున్నట్లు తెలిపింది. అంతేగాదు ప్రపంచంలోని దాదాపు 1.3 మిలియన్ల పోగాకు వినియోగదారుల్లో సుమారు 80% మంది మధ్య ఆదాయ దేశాల్లో నివశిస్తున్నారు. కేవలం 2020లో ప్రపంచ జనాభాలో 22.3% మంది పొగాకును ఉపయోగించినట్లు అంచనా. వారిలో 36.7% మంది పురుషులు, 7.8% మంది మహిళా వినియోగదారులు ఉన్నాట్లు వెల్లడయ్యింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా 37 మిలియన్ల మంది యువకులు ధూమాపానాన్ని సేవిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది థీమ్:ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం 2024 థీమ్ “పొగాకు పరిశ్రమ జోక్యం నుంచి పిల్లలను రక్షించడం”. ఈ థీమ్‌ని ఇతివృత్తంగా చేసుకుని పొగాకు వాడకం వల్ల కలిగే హానికరమైన ఆరోగ్య ప్రభావాల గురించి అవగాహన పెంచడం, ధూమపానం దూరంగా ఉండేలా ప్రజలను ప్రోత్సహించేలా చేయడం వంటివి చేస్తారు అధికారులు. అంతేగాదు ఈ పొగాకు అడిక్షన్ నుంచి ఎలా బయటపడాలి వంటి అవగాహన కార్యక్రమాలను కూడా చేపడతారు. ఈ పొగాకులో దాదాపు ఐదు వేల నుంచి ఏడు వేల రసాయనాలు ఉంటాయి. అవి సుమారు 50 నుంచి 60 రకాల కేన్సర్ కారకాలని నిపుణులు చెబుతున్నారు. పొగాకులో ఉండే నికోటిన్ అనే రసాయనం డోపమైన్, అసిటైల్కోలిన్, నోర్పైన్ఫ్రైన్, సెరోటోనిన్ వంటి ఆనందకరమైన హార్మోన్లను విడుదల చేసి వ్యసపరుడిగా మారుస్తుంది. ఇది క్రమేణ అధిక రక్తపోటు, పక్షవాతం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, జీర్ణ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొగాకు అడిక్షన్ నుంచి బయటపడాలంటే..మన వంటింటిలో ఉపయోగించే వాటితోనే పొగాకు అడిక్షన్‌కు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..ధూమపానం సేవించాలనే కోరిక గలిగనప్పుడూ ప్రత్నామ్నాయ మార్గాలను ఎంచుకోండి. ఆ కోరికను అదుపులో పెట్టుకోలేనట్లు అనిపించనప్పుడూ ఈ క్రింది ఆహార పదార్థాలను పత్యామ్నాయంగా ఉపయోగించండని చెబుతున్నారు నిపుణులు.పుదీనా ఆకులు నమలడం, లేదా పుదీనా నీళ్లు తాగడం. పండ్లు, పచ్చి కూరగాయలు తినడంనీళ్లు ఎక్కువగా తాగడందాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు వంటివి నమలడంగోరు వెచ్చని పాలు తాగడంనిమ్మకాయ నీళ్లు వంటివి తాగాలిపైవాటిలో మీకు నచ్చినవి తాగేందుకు ప్రయత్నిస్తూ ఆ కోరికను నియంత్రించడం వంటివి చేస్తే సులభంగా పొగాకు అడిక్షన్ నుంచి బయటపడతారు. మొదట్లో ఇబ్బందిగా అనిపించినా.. రాను మీకు తెలియకుండానే మంచి ఆహారపు అలవాట్లకు అలవాటు పడతారు. దీంతో పాటు చక్కటి వ్యాయమం లేదా ఏదైనా వర్కౌట్లతో మైండ్‌ని డైవర్ట్ చేస్తూ.. ఉంటే శారీకంగానూ, మానిసకంగానూ స్ట్రాంగ్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.(చదవండి: అంతరిక్ష వ్యర్థాలకు చెక్ పెట్టేలా 'చెక్క ఉపగ్రహం'..ప్రపంచంలోనే..!) -
ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం
-
ట్రెండ్, స్టైల్ కోసమే స్మో‘కింగ్’.. దేశంలోనే 5 స్థానంలో రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో పొగాకు వాడకం ప్రధానమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పలుమార్లు తెలిపినప్పటికీ ఈ సంస్కృతిని నివారించడంలో వెనుకబడుతూన్నామని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేఖ దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థలు, సామాజిక సంఘాలు పొగాకుకు వ్యతిరేఖంగా పోరాడాలని, దీని పైన మరింత ప్రచారం అవసరమని నినదిస్తున్నాయి. దేశంలో ప్రతి రోజూ 3669 మంది పొగాకుతో మరణిస్తున్నారు. పొగతాగడంలో దేశంతో పాటు రాష్ట్రం కూడా ముందంజలో ఉంది. గత సంవత్సరం తెలంగాణాలో బహిరంగ ప్రదేశాల్లో పొగతాగిన వారిపైన నమోదైన 28 వేల కేసులతో దేశంలోనే ఐదవ స్థానంలో ఉంది. ఆధునిక జీవన విధానం పెరిగిన హైదరాబాద్ నగరంలో ఈ ధూమపానం మరింత ఎక్కువగా ఉంది. కేరళ, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ కేసులు తగ్గే ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రంలో మాత్రం ప్రతీ ఏటా పెరుతుండటం ఆందోళనపరుస్తుంది. గతంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన విషయం ఏంటంటే.. అధిక ధూమపానం జన సంచారం ఉన్న ప్రాంతాల్లో కాకుండా స్కూల్, కాలేజ్, పబ్స్ ఇతర రహాస్య ప్రదేశాల్లో జరుగుతుందని, 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో 38 శాతం, మహిళల్లో 9 శాతం పొగాకును వాడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక తెలుపుతుంది. పొగాకుకు టీనేజ్ పిల్లలు ఎక్కువగా అలవాటు పడుతుండగా, ఈ అలవాటే డగ్స్ వ్యసనానికి పునాదిగా మారుతందని మానసిక-ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ట్రెండ్, స్టైల్ కోసమే యువత ఈ స్మోకింగ్‌కు అలవాటు పడటం విశేషం. ఈ పొగాకు పదార్థాలైన బీడి, చుట్టా, సిగరెట్స్, ఖైనీ, జర్దా తదితారలాను వాడటంతో కేన్సర్, హార్ట్ఎటాక్ వంటి ప్రాణాంతక వ్యాధులకు చేరువైతున్నారు, అంతేకాకుండా ఈ వ్యసనాలే అసాంఘీక కార్యకలాపాలకు వేదికలుగా మారుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ మహమ్మారిని నివారిస్తూనే, వ్యసనానికి బానిసలైన వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చే మార్గాలపైన దృష్టి సారించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. న్యూరో మాడ్యులేషన్ ఉత్తమ పరిష్కారం.. స్మోకింగ్‌కు వ్యతిరేకంగా అవగాహాన కల్పిస్తూనే ఇప్పటికే బానిసైన వారిని మామూలు స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికోసం సైక్రియాటిస్టులను, నికోటిన్ ఉండే మెడిసిన్‌ను వాడుతున్నారు. అయితే ప్రస్తుతం న్యూరో మాడ్యులేషన్ అనే అధునాతన సాంకేతిక చికిత్సా విధానం అందుబాటులో ఉంది. ఈ న్యూరో మాడ్యులేషన్ విధానంలో కేవలం స్మోకింగ్ డిజార్డర్లను తగ్గించడానికి మాత్రమే రెండేళ్ల క్రితం ఎఫ్‌డీఐ అనుమతి లభించింది. ఈ స్టిమ్యులేషన్ విధానంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పొగాకు వ్యసనం నాడీ వ్యవస్థ, మొదడు పనితీరు పైన ప్రభావం చూపిస్తుంది. న్యూరో మాడ్యులేషన్లో భాగంగా డీప్ టీఎమ్మెస్ సాంకేతికత మొదడులోని ఇస్సులా పైన మ్యాగ్నెటిక్ వేవ్స్‌ను పంపించి దాని పనితీరును సవరిస్తుంది. దీని వలన వ్యసనానికి మెల్లిమెల్లిగా దూరమవుతారు. డిప్రెషన్, ఓసీడి సమస్యలకు ఈ ప్రక్రియ పరిష్కారంగా మారింది. దక్షిణాదిన ఈ న్యూరో మాడ్యులేషన్ థెరపీని మేము మాత్రమే అందిస్తున్నాం. -ప్రముఖ వైద్యులు ఎమ్మెస్ రెడ్డి, ఆశా న్యూరో మాడ్యులేషన్ క్లినిక్, గచ్చిబౌలి. -
బీడీ, సిగరెట్ తాగుతున్నారా? ప్రతి ఐదుగురిలో ఆ ఒక్కరు కాకండి!
మన దేశంలో 26.7 కోట్ల మంది పొగతాగడం లేదా పొగాకు ఉత్పాదనలను వినియోగిస్తున్నారు. ఆ అలవాటు కారణంగా వచ్చే క్యాన్సర్లు, పక్షవాతం, గుండెజబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలూ వంటి వాటితో మన దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 13.50 లక్షల మంది ప్రాణాలు వదులుతున్నారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తం మీద 172 కోట్ల మంది సిగరెట్లు తాగుతున్నారు. వీళ్లంతా ప్రతిరోజూ 2000 కోట్ల సిగరెట్లను కాలుస్తుంటారు. వీళ్లలో 35 ఏళ్ల వయసు పైబడి, పొగతాగే అలవాటున్న వ్యక్తులు వివిధ రకాల జబ్బుల పాలబడి, తమ ఆరోగ్యం కోసం పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా 1,77,342 కోట్లు! సొంత ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ, ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ మరీ మనం చేసే వృథా ఇది!! ఈ నెల 31న ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం’ సందర్భంగా ఆరోగ్యానికి చేటు తెచ్చుకునేలా ఎన్నెన్ని అనర్థాల్ని చేజేతులారా ఆహ్వానిస్తున్నామో తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం. పొగాకు అలవాటు రెండు రకాలుగా ఉంటుంది. చుట్ట, బీడీ, సిగరెట్ వంటివి నిప్పుతో కాలుస్తూ పొగవెలువరించే అలవాటుతో పాటు... పొగ ఏదీ లేకుండానే గుట్కా, ఖైనీ. తమలపాకుతో నమిలే జర్దారూపంలో పొగాకు నమలడం, నశ్యం రూపంలో పీల్చడం ద్వారా కూడా పొగాకుకు బానిసలవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చనిపోయే ప్రతి ఐదుగురిలో ఒకరు కేవలం పొగాకు వల్లనే ప్రాణాలొదులుతున్నారు. అణువణువునా విషం... అత్యంత హానికరమైన, ఆరోగ్యానికి ప్రమాదకరమైన వాటిల్లో ప్రపంచమంతటా లీగల్‌గా అమ్మే రెండు ఉత్పాదనల్లో మరీ ప్రమాదకరమైనవి సిగరెట్లు, బీడీల వంటివి మాత్రమే. మరొకటి మద్యం. నాలుగు అంగుళాల పొడవుండే సిగరెట్లో 4,800 హానికరమైన రసాయనాలుంటాయి. అందులో మళ్లీ 70 – 72 రసాయనాలు తప్పక క్యాన్సర్‌ను కలగజేసేవే. ఒకసారి పొగతాగడం అంటూ మొదలుపెడితే... వీళ్లలో దాదాపు సగం మంది (50% మంది) దీని వల్ల వచ్చే అనర్థాలు, అనారోగ్యాల కారణంగానే మరణించే అవకాశం ఉందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రతి అవయవానికీ క్యాన్సర్ ముప్పు... వెలుపల మన తల నుంచి కాలి చివరలు మొదలుకొని దేహం లోపలా ఉన్న అన్ని అంతర్గత అవయవాల వరకు దేన్నీ వదలకుండా పొగాకు తన దుష్ప్రభావాలకు గురిచేస్తుంది. దాదాపు 30 శాతం వరకు క్యాన్సర్లకు పొగాకే కారణం. తల నుంచి లెక్క తీసుకుంటే... హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు, నోటి క్యాన్సర్లు పొగాకు కారణంగానే ఎక్కువగా వస్తాయి. నోరు మొదలుకొని... దేహంలోపలికి వెళ్లే కొద్దీ... ల్యారింగ్స్, ఈసోఫేగస్, పెద్దపేగు (కొలోన్), మలద్వార (కోలోరెక్టల్) క్యాన్సరు, బ్లడ్‌క్యాన్సర్లు, కాలేయ క్యాన్సర్లు, పాంక్రికాటిక్ క్యాన్సర్లు, బ్లాడర్ క్యాన్సర్లు... వీటన్నింటికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పొగాకే కారణం. ఇక ప్రోస్టేట్ క్యాన్సర్‌కూ, పొగాకుకూ నేరుగానే సంబంధం ఉంది. పొగాకులోని బెంజీన్ రసాయనం ‘అక్యూట్ మైలాయిడ్ లుకేమియా’ (ఒకరకం బ్లడ్‌క్యాన్సర్)కు కారణమవుతుంది. ఈ క్యాన్సర్లతో పాటు ఇక గుండెజబ్బులు, పక్షవాతం, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు... ఇలా శరీరంలోని ప్రతి కీలక అవయవాన్నీ పొగాకు దెబ్బతీస్తుంది. పొగమానేసిన మరుక్షణమే ప్రయోజనాలు... పొగతాగడం మానేసిన మరుక్షణం మనకు కలగాల్సిన ప్రయోజనాలు మొదలవుతాయి. చివరి సిగరెట్ తర్వాత 20 నిమిషాల్లో గుండె వేగం నార్మల్కు వస్తుంది. 12 గంటల తర్వాత దేహంలో కార్బన్‌మోనాక్సైడ్ మోతాదులు తగ్గడంతో బాటు రక్తంలో ప్రమాదకరమైన విషాల మోతాదులు తగ్గుతాయి. లంగ్స్ మూడు నెలల్లో నార్మల్కు వస్తాయి. ఏడాది తర్వాత హార్ట్ఎటాక్ వచ్చే ముప్పు (రిస్క్) సగానికి తగ్గిపోతుంది. పదిహేనేళ్లు మానేయగలిగితే... సిగరెట్ అలవాటుకు ముందు ఎలాంటి ఆరోగ్యం ఉంటుందో... అదే ఆరోగ్యం మళ్లీ సమకూరుతుంది. ఆరోగ్యాన్నీ వాతావరణాన్నే కాదు... సిగరెట్ వ్యర్థాలతో భూమిని సైతం... సిగరెట్లు, బీడీలు, చుట్టలు తాగే సమయంలో వెలువడే పొగతో ఆరోగ్యానికి, పర్యావరణానికీ ఎలాగూ ముప్పు చేకూరుతుందన్నది కనబడే సత్యం. కాకపోతే మనం విస్మరించే ఇంకో వాస్తవం ఉంది. సిగరెట్ తాగాక మిగిలిపోయే పీకల (బట్స్) బరువు 77 కోట్ల కిలోలు, అంటే 7.70 లక్షల టన్నులు. ఏటా ఇన్నేసి టన్నుల మొత్తంలో సిగరెట్ వ్యర్థాలు మనం నివాసం ఉంటున్న ఈ భూమిని కలుషితం చేస్తున్నాయి. పొగాకు ఉత్పాదనల కోసం ప్రపంచంలోనే అసహ్యకరమైన రంగు పాంటోన్ 448–సి అనేది ప్రపంచంలోనే అత్యంత అసహ్యకరమైన రంగు. దీన్ని చావును సూచించే రంగుగా కూడా చెబుతారు. ఈ రంగుతోనే సిగరెట్ ప్యాక్‌లు తయారవుతున్నప్పటికీ... పొగతాగేవారిని ఆకర్షించడం కోసం దాన్ని మరింత ఆకర్షణీయంగా చేసి వాడుతుంటారు. బానిసగా చేసుకునేది నికోటిన్... పొగాకులోని నికోటిన్... ఆ ఉత్పాదనలకు బానిసయ్యేలా చేస్తుంది. సిగరెట్‌లోని పొగపీల్చిన 10 సెకండ్లలో నికోటిన్ మెదడును చేరుతుంది. ఏదైనా సంతోషం కలిగించే పనిని చేయగానే... మెదడులో డోపమైన్ అనే రసాయనం వెలువడుతుంది. నికోటిన్ మెదడును చేరగానే వెలువడే ఈ డోపమైన్ కారణంగానే హాయిగా, రిలాక్స్డ్గా ఉన్న భావన కలుగుతుంది. ఆ అనుభూతిని తరచూ పొందేందుకు స్మోకింగ్‌ను ఆశ్రయిస్తారు. ఆ తర్వాత్తర్వాత అదే అనుభూతి కలగడం మునపటంత బలంగా లేకపోయినప్పటికీ... ఆ అనుభవం కోసం వెంపర్లాడటంతో నికోటిన్‌కు బానిసవుతారు. నికోటిన్ కోరిక ఎంత బలంగా ఉంటుందంటే... ప్రఖ్యాత మనస్తత్వ నిపుణుడు సిగ్మండ్ ఫ్రాయిడ్‌కు ‘స్క్వామస్ సెల్ కార్సినోమా ఆఫ్ పాలెట్’ అనే రకం క్యాన్సర్ సోకింది. అంగిలిలో వచ్చిన ఈ నోటిక్యాన్సర్ నుంచి విముక్తి కల్పించడం కోసం డాక్టర్లు ఆయనకు దాదాపు 30కి పైగా సర్జరీలు చేశారు. దవడను, సైనస్నూ తొలగించారు. అయినా ఆయన సిగరెట్ మానేయలేదు. చివరకు అంగిలికీ... కంటిగూడుకూ మధ్య ఉన్న క్యాన్సర్ గడ్డను శస్త్రచికిత్సతో తొలగించడం సాధ్యం కాలేదు. దాదాపు 16 ఏళ్ల పాటు పొగాకు మానేయమని ఎందరు ప్రాధేయపడ్డా ఫ్రాయిడ్ మానలేదు. ఇదీ నికోటిన్ పవర్. -డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ -
World No Tobacco Day 2021: ధూమపానం.. పోవును ప్రాణం
సంవత్సర కాలం పైగా మృత్యు ఘంటికలు మోగిస్తూ అందరినీ కలిచి వేస్తూ, ప్రపంచాన్ని కలవరపెడుతోంది కరోనా. కరోనాకు బలై ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిలో ముఖ్యంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఆక్సిజన్ అందక మరణించేవారే ఎక్కువ. ఊపిరితిత్తుల ఊపిరి తీస్తున్న అనేక కారకాలలో పొగాకు ముఖ్యమైనది. పొగాకు హుక్కా, చుట్ట,బీడీ, సిగరెట్, ఖైనీ తదితర రూపాలలో మార్కెట్లో అందరికీ చేరువలో లభ్యమయ్యే గొప్ప మత్తు పదార్థం. పొగ తాగడం వల్ల నోటి దుర్వాసన, గొంతు వ్యాధులు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, కఫం, దగ్గు, దమ్ము, ఆయాసం, గుండె కవాటాలు మూసుకుపోయి గుండెపోటు, రక్తపోటు, క్యాన్సర్ లాంటివెన్నో రోగాలు వస్తాయి. సరదాగా ఒకసారి మొదలైన ధూమపానం వ్యసనంగా మారి ఎందరో బలి అవుతూనే ఉన్నారు. ప్రాణాంతకమైన పొగాకును నియంత్రించాలని 1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సమావేశంలో 1988, ఏప్రిల్ 7ను ధూమపాన రహిత దినోత్సవంగా పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగదారులను ఏప్రిల్ 7వ తేదీన 24 గంటలపాటు పొగాకు ఉత్పత్తులను వాడకుండా ఉండమని కోరింది. దానిని అనుసరించి విజృంభిస్తున్న పొగాకు మహమ్మారి నుండి ప్రజలను చైతన్య పరచడంకోసం 1988లో జరిగిన సమావేశంలో ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది. పొగాకు వాడకంలో భారతదేశం రెండో స్థానంలో ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సంగతి మరిచి సిగరెట్ ఈజ్ మై సీక్రెట్ అంటూ బాధలో, సంతోషంలో, విందులో, వినోదాల్లో, టీ తాగాక ఒకటి, భోంచేశాక ఒకటి ,ఏం తోచట్లేదని ఒకటి అంటూ టైంపాస్‌కి గుటగుట నాలుగు గుటకలు మింగి ఊపిరితిత్తుల్లో పొగను నింపి ఆరోగ్యం క్షీణించాక ఆసుపత్రుల చుట్టూ తిరుగు తున్నారు. మత్తును,ఉద్రేకాన్ని కలిగించే స్వభావం కల నికోటిన్, ఏడువేల రకాల విషతుల్యమైన క్యాన్సర్ కారకాలు గల పొగాకును ఏ రూపంలో తీసుకున్నా నష్టాలే అధికం. కాబట్టి ఇప్పటికైనా యువత పొగాకు సేవనం వల్ల కలిగే నష్టాలపై జాగరూకులై, దీని బారిన పడకుండా సరైన నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. - కమలేకర్ నాగేశ్వర్ రావు అచ్చంపేట, 98484 93223 పొగాకుపై సమగ్ర వ్యూహమేది? మారుతున్న కాలానుగుణంగా నేటి యువతకు ధూమపానం అలవాటుగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలు, అనారోగ్య కారకాల్లో ధూమపానం మూడు నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ధూమపానం చేస్తున్న వారిలో 22.6 కోట్ల మంది పేదవారేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ సర్వేలో తెలిపింది. భారత్‌లో 5,500 మంది ఏటా ఈ వ్యసనానికి దాసోహం అవుతున్నట్లు అధ్యయనాలు చాటుతున్నాయి. ఈ ఏడాది ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం‘ను ’పొగాకు త్యజించు – జీవితాన్ని జయించు’ అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నాం. ప్రభుత్వం 2003లో పొగాకు ఉత్పత్తుల నిషేధంపై చట్టం చేయగా, బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడాన్ని 2008లో నిషేధించింది. ఐనప్పటికీ పొగాకు వినియోగం, ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలోనే రెండవ స్థానం ఆక్రమించింది. పొగాకు వ్యసనం ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటోంది. 15 నుండి 24 ఏళ్ల మధ్య వారిలో మొత్తం 81 లక్షల మంది పొగరాయుళ్ళు తగ్గారని సర్కారీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా 30 కోట్ల మంది బాధితులుగా మారుతున్నారు. ఏటా 13.5 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం పొగాకుతో మధుమేహం, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులతో పాటు అనేక రకాల కేన్సర్లు వస్తాయని వివిధ అధ్యయనాల ద్వారా తేలింది. ధూమపానాన్ని వదిలేసినా దాని దుష్ప్రభావం మూడు దశాబ్దాల పాటు ఉంటుందన్న శాస్త్రవేత్తల హెచ్చరికలు.. మూడు శాతం మంది పొగరాయుళ్ళు మాత్రమే ఆ అలవాటును మానుకోగలరన్న పార్లమెంటరీ స్థాయీసంఘం అధ్యయనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కిరాణా షాపులలో, విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. వాటి ప్రకటనలు, బహిరంగ ధూమపాన నిషేధం వంటివి పటిష్టంగా అమలు చేయాలి. ప్రభుత్వం, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ధూమపానం అరికట్ట కలిగితే ఆరోగ్య భారతాన్ని నిర్మించగలుగుతాం. పొగాకును పూర్తిగా నిషేధించేలా పటిష్ట వ్యూహం పట్టాలకెక్కితేనే ప్రజారోగ్యానికి భరోసా! - గుమ్మడి లక్ష్మీనారాయణ కొత్తగూడెం, మహబూబాబాద్, మొబైల్: 94913 18409 -
పొగ పెడతాడు
‘పొగ తాగి పొగచూరిపోకు... పండు తిని పండులా ఉండు’ అని అరటిపండ్లు చేతిలో పెడతాడతడు. ‘‘మంచి మాటనైనా సరే ఊరికే చెబితే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు. చేతిలో ఒక బిస్కట్టో, పండో పెట్టి చెబితే... నేను వెళ్లి పోయిన తర్వాత కూడా నా మాటలు గుర్తుంటాయి. కనీసం నేనిచ్చిన బిస్కెట్, పండు వాళ్ల చేతిలో ఉన్నంతసేపైనా నా మాట గుర్తుంటుంది’’ అంటాడు మాచన రఘునందన్. అతడు ప్రభుత్వ ఉద్యోగి. మహబూబ్‌నగర్, సివిల్ సప్లయిస్‌లో డిప్యూటీ తాసిల్దార్. ఉద్యోగం చేసుకుంటూనే ధూమపానం మానేయమని కనిపించిన వారికందరికీ చెబుతాడు. వాళ్లకై వాళ్లే చేతిలో ఉన్న సిగరెట్‌ని పారేసే వరకు చెవిలో పొగపెడతాడు. పొగతాగని వాళ్ల నరకం రఘునందన్‌ది తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా, కేశవరం. ఉండేది హైదరాబాద్‌లో. ఓ రోజు బోయినపల్లి నుంచి సికింద్రాబాద్‌కి సిటీబస్సులో వెళుతుండగా... బస్సు డ్రైవర్ సిగరెట్ తాగుతున్నాడు. ఆ వెనుక సీట్లో ఒక తల్లి చంటిబిడ్డతో ఉంది. సిగరెట్ పొగ తల్లీబిడ్డలకు వ్యాపిస్తోంది. చీర కొంగుతో బిడ్డకు విసురుతూ, మరో చేత్తో తాను ముక్కు మూసుకుందామె. అదే విషయాన్ని డ్రైవర్‌తో చెబితే సిగరెట్ తాగకుండా బస్సు నడపడం తన వల్ల కాదన్నాడు. బస్సు నంబరు నోట్ చేసుకుని డిపో మేనేజర్‌కి తెలియచేశాడు రఘునందన్. అంతటితో ఆగిపోకుండా బస్స్టేషన్లలో సిగరెట్ల అమ్మకాన్ని కూడా నియంత్రించాలని కోరుతూ 2010లో ఆర్టీసీ ఎండీకి ఉత్తరం రాశాడు. తన ప్రయత్నమైతే చేశాడు కానీ, ఎండీ నుంచి సానుకూలమైన స్పందన వస్తుందని ఊహించలేదతడు. ఎండీ సంతకంతో రఘునందన్ ప్రయత్నాన్ని అభినందిస్తూ పెద్ద సమాధానమే వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా బస్స్టేషన్లలో బహిరంగ ధూమపాన నిషేధం ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. భార్యకు నచ్చిన గుణం రఘునందన్ ధూమపానానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న విషయాన్ని భార్యకు పెళ్లి చూపుల్లోనే చెప్పాడు. ‘‘నేను చెప్పినప్పుడు మా శైలజ పెద్దగా స్పందించలేదు. కానీ ఆమె తనలో తాను ‘ఇతడికి స్మోకింగ్ అలవాటు లేదు, భవిష్యత్తులో కూడా అలవాటు చేసుకోడని నమ్మవచ్చు’ అనుకుందట. ఇప్పుడు నేను పొగతాగే వాళ్లందరికీ మానేయమని చెప్తుంటే ‘ఆ సంగతి వాళ్లకు తెలిసిందే కదా, ఎంతమందికని చెప్తారు... అని అప్పుడప్పుడూ అంటూ ఉంటుంది కానీ గట్టిగా అడ్డు చెప్పదు. ‘స్టాప్ స్మోకింగ్... స్టార్ట్ లివింగ్, లివ్ లైఫ్... లీవ్ టొబాకో’ పేర్లతో రెండు ఫేస్ బుక్ పేజీలు, వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా ప్రచారం చేస్తున్నాను. నా ప్రయత్నం ఆగదు. నా కంటిముందు ఎవరు పొగతాగుతూ కనిపించినా చేతులెత్తి దణ్ణం పెట్టి మానేయమని అడుగుతూనే ఉంటాను’’ అన్నాడు రఘునందన్. – వాకా మంజులారెడ్డి; ఫొటో: అనిల్ -
పొగ... ఆరోగ్యంపై పగ
టీనేజ్‌లో సిగరెట్ తాగడం లేదా ఇంకేవైనా మత్తు పదార్థాలకు అలవాటు పడటం అన్నది తోటి స్నేహితుల కారణంగా జరగడం చాలా సామాన్యం. ఆ వయసు పిల్లల్లో స్రవించే హార్మోన్లతో సాహసప్రవృత్తి పెరగడంతో, కొత్తగా ఏదో చేయాలన్న భావనలు కుదురుగా ఉండనివ్వవు. చాలా తేలిగ్గా చేయగలిగే సాహసం... ఇలా పొగతాగడం లేదా ఏవైనా పొగాకు ఉత్పాదనలను అలవాటు చేసుకోవడం. అంతే... ఆ దురలవాటు వాళ్లలో బలంగా అంటుకుపోతుంది. పొగ అనర్థాలు తెలుసుకుందాం, దూరంగా ఉందాం. పొగాకు అలవాటు అవడానికి కారణాలివే... సిగరెట్ తగడం లేదా పొగాకు వాడటం అనే దురలవాట్లు బలంగా అంటుకోడానికి కారణం అందులో ఉండే నికోటిన్ అనే పదార్థం. ఈ నికోటిక్ మెదడుకు ఎంత త్వరగా చేరితే... ఆ దురలవాటు అంత వేగంగా అంటుకుపోతుంది. పొగతాగడం మొదలుపెట్టిన కేవలం 6 నుంచి 10 సెకండ్లలోపు నికోటిన్ మెదడును చేరుతుంది. అందుకే మిగతా పొగాకు అలవాట్ల కంటే సిగరెట్ అంత వేగంగా అలవాటవుతుంది. సిగరెట్ ద్వారా ఊపిరితిత్తులను చేరిన నికోటిన్ రక్తంలో కలిపిపోయి, మెదడును చేరాక ఆంఫెటమైన్ః్స లేదా కోకైన్స్ వంటి డ్రగ్స్ కలగజేసే సంతోషం, హుషారులాంటి భ్రాంతిభావనలను కొంతవరకు కలగజేస్తాయి. అంతే... ఆ ఫీలింగ్స్‌నే మళ్లీమళ్లీ కోరుకుంటూ ఇక దానికి అలవాటు పడిపోతుంటారు. నికోటిన్‌ను వదలనివ్వకుండా మెదడు చేసే మాయాజాలం... ఒకసారి మెదడు నికోటిన్ ఇచ్చే భ్రాంతిభావనలకు అలవాటు పడ్డతర్వాత వాటిని వదిలిపెట్టేందుకు అంత తేలిగ్గా ఒప్పుకోదు. అందుకే సిగరెట్ అలవాటు మానేసిన వాళ్లు మళ్లీ మళ్లీ దాన్ని మొదలుపెడుతుంటారు. ఉదాహరణకు... సిగరెట్ మానేయగానే... తాము అంతకుముందు దృష్టికేంద్రీకరించినంతగా ఇప్పుడు ఫోకస్డ్గా ఉండటం లేదనే ఫీలింగ్ తెప్పిస్తుంది మెదడు. అంతేకాదు... పొగ మానేయగానే ఒక రకం ఉద్విగ్నత (యాంక్షియస్నెస్), ప్రశాంతంగా ఉండలేక, వేగంగా కోపం తెచ్చుకోవడం (ఇరిటబిలిటీ), స్థిమితంగా ఉండలేకపోవడం (రెస్ట్లెస్నెస్) వంటి తప్పుడు భ్రాంతుల (సూడో ఫీలింగ్స్)ను కలగజేస్తుంది. దాంతో సిగరెట్గానీ, పొగాకు వాడటం గానీ మానేస్తే... తమకేదో నష్టం జరుగుతుందన్న భ్రాంతి కలగజేస్తుంది. కానీ కాస్తంత విల్పవర్తో మానేస్తే దేహానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలెన్నో. ఆ అలవాటును అలాగే కొనసాగిస్తే వచ్చే అనారోగ్యాలెన్నో. వాటిని తెలుసుకుంటే మనం పొగాకు జోలికే వెళ్లం. సిగరెట్ వెలిగించగానే ఏం జరుగుతుందంటే... ► మొదట సిగరెట్ వెలిగించగానే నోరు, గొంతు, ముక్కు కళ్లపై అది తన దుష్ప్రభావాన్ని చూపడం మొదలుపెడుతుంది. పొగ ప్రభావం కారణంగా నోరు, గొంతులోని సున్నితమైన లైనింగ్ పొరలు మందంగానూ, గరుకుగానూ మారిపోతాయి. అవి అలా మందంగా మారడం అనే అంశమే... తర్వాత దశల్లో ఆయా భాగాలకు క్యాన్సర్ వచ్చేందుకు ఓ ముప్పుగా పరిణమిస్తుంది. ► గొంతుదాటిన పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. మన ఊపిరితిత్తులు ఎప్పుడూ సీలియరీ బాడీస్ అనే నిర్మాణాల ద్వారా తమను తాము శుభ్రపరచుకుంటూ ఉంటాయి. అవెప్పుడూ ఝళిపించిన కొరడా కదలికల (ఫ్లిక్కరింగ్ మూవ్మెంట్స్)తో నిత్యం కదులుతూ మాలిన్యాలను బయటకు పంపుతూ ఉంటాయి. అదేపనిగా పొగలోపలికి వచ్చేస్తుండటంతో కొన్నాళ్లకవి తమ సామర్థ్యం కోల్పోయి నిర్వీర్యమవుతాయి. దాంతో ఊపిరితిత్తులు పూర్తిగా పొగచూరిపోతాయి. వాటిల్లో కఫం పెరుగుతుంది. దాన్ని బయటకు పంపించేందుకు దగ్గు వస్తుంది. అయితే ఓ వ్యక్తికి ఉండే పొగ అలవాటు కారణంగా... ఊపిరితిత్తులు ఎంతగా ప్రయత్నించినా ఈ కఫం లేదా శ్లేష్మం బయటకు వెళ్లడానికి ఆస్కారం/అవకాశం దొరక్కపోవడంతో సూక్ష్మక్రిములు పెరిగి తేలిగ్గా అనారోగ్యానికి గురవుతుంటారు. అలా బ్రాంకైటిస్ వస్తుంది. పొగతాగే వారిలో తెల్లరక్తకణాలు తగ్గుతాయి. వ్యాధులను కలగజేసే క్రిములతో పోరాడేవి తెల్లరక్తకణాలే. ఫలితంగా పొగ అలవాటు ఉన్నవారు తేలిగ్గా వ్యాధులకు గురవుతారు. ► పొగను పీల్చగానే ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ తగ్గుతుంది. అది ఒక ప్రమాదం. అంతేకాదు... ఆ పొగవల్లనే అత్యంత హానికరమైన కార్బన్ మోనాక్సైడ్ మోతాదులూ పెరుగుతాయి. ఫలితంగా రక్తం ద్వారా వివిధ అవయవ భాగాలకు అందాల్సిన ఆక్సిజన్ అందదు. ఇక కణాలన్నింటికీ హానికరమైన కార్బన్డయాక్సైడ్, కార్బన్మోనాక్సైడ్లు పెరిగి రక్తం గాఢంగా మారడం, అది గడ్డకట్టే అవకాశాలు పెరగడం, ఫలితంగా గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశాలు పెరగడం జరుగుతుంది. ► పొగాకుతో రక్తనాళాలు సన్నబడతాయి. గుండె, మెదడుకు వెళ్లే రక్తనాళాలు సన్నబడటం వల్ల గుండెపోటు, పక్షవాతం రావచ్చు. ► క్యాన్సర్ వచ్చేందుకు కారణమైన కారకాలను కార్సినోజెన్స్ అంటారు. సిగరెట్ పొగలో దాదాపు 4000 రకాల హానికరమైన రసాయనాలతో పాటు తక్షణం క్యాన్సర్ కలిగించగల 60 రకాల కార్సినోజెన్స్ ఉంటాయి. ఫలితంగా ఊపిరితిత్తులు, స్వరపేటిక, ప్రోస్టేట్, మూత్రాశయం, మూత్రపిండాలు, జీర్ణకోశం... ఇలా ఒకటని కాకుండా అన్ని అవయవాలూ క్యాన్సర్‌కు గురికావచ్చు. ► పొగతాగడం వల్ల జీర్ణకోశం, అన్నకోశాల్లో అల్సర్ రావచ్చు. ఇది వస్తే తగ్గడం ఒకపట్టాన కష్టం. అంతేకాదు... అది ఒకసారి వస్తే మళ్లీ మళ్లీ తిరగబెట్టే అవకాశాలు ఎక్కువ. ► పొగతాగే అలవాటు ఉన్నవారికి ఆస్తమా, ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్స్ అయిన బ్రాంకైటిస్, సీవోపీడీ వంటి వ్యాధులూ ఎక్కువ. ► పొగతాగే అలవాటు పురుషుల సెక్స్ సామర్థ్యంపైనా, పిల్లలు పుట్టే సామర్థ్యం పైన కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. పొగతాగే అలవాటు ఉన్న తండ్రులు తమ పిల్లలకు పొగ వల్ల దెబ్బతిన్న డీఎన్ఏను సంక్రమింపజేస్తున్నారని, దాంతో తండ్రుల తప్పునకు పిల్లలు మూల్యం చెల్లించాల్సి వస్తోందని బ్రాడ్‌ఫోర్ట్ యూనివర్సిటీ అధ్యయనం పేర్కొంటోంది. ఆ అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... పేరెంట్స్ పొగతాగే అలవాటుతో ఉంటే పిల్లలకు క్యాన్సర్లు... అందునా ప్రధానంగా ల్యుకేమియా వచ్చే అవకాశం ఎక్కువని తేలింది. ఇందుకు కారణం... తండ్రులు తమ జన్యువులను పిల్లలకు అందించే క్రమంలో తమ వీర్యకణాల్లోని డీఎన్ఏ... పొగవల్ల తీవ్రంగా దెబ్బతింటుంది. దాంతో ఆ లోపభూయిష్టమైన డీఎన్ఏ వల్ల పిల్లల్లో క్యాన్సర్ అవకాశాలు పెరుగుతున్నాయి. ఒక వీర్యకణం ఉద్భవించాక అది పూర్తిస్థాయిలో పరిణతి చెందేందుకు కనీసం మూడు నెలల సమయం అవసరం. అందుకే కనీసం మూణ్ణెల్ల పాటు పొగతాగే అలవాటుకు దూరంగా ఉంటే డీఎన్ఏ దెబ్బతిన్న వీర్యకణాల స్థానంలో ఆరోగ్యకణాలు వస్తాయి కాబట్టి పిల్లల్లో క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. అందుకే తమ పిల్లల ఆరోగ్యం కోసమైనా పొగతాగకుండా ఉండాలని ఈ అధ్యయనం చెబుతోంది. ఇది తెలిస్తే... తమ చేజేతులా తమ కన్నబిడ్డలకు నష్టం చేసే సిగరెట్ తాగాలన్నా, పొగాకును వినియోగించాలన్నా కన్నతండ్రులెవ్వరైనా వెనకాడతారు. పొగమానేయండి... ఆ క్షణం నుంచే ప్రయోజనాలు పొందండి... పొగతాగే అలవాటు మానేసిన కొద్ది గంటల నుంచే ఆరోగ్య ప్రయోజనాలు ప్రారంభమవుతాయి. అవి... ∙పొగతాగడం వల్ల గుండె స్పందనల్లో వచ్చే మార్పులు... సిగరెట్ మానేసిన 20 నిమిషాల్లోనే నార్మల్కు రావడం ప్రారంభమవుతాయి. మీరు సిగరెట్ మానేస్తే... గుండె తన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం మొదలుపెడుతుంది. ► ఎనిమిది గంటల్లోనే... పొగతాగడం వదిలేసిన ఎనిమిది గంటల్లోనే వారి శరీరంలోని కార్బన్ మోనాక్సైడ్ పాళ్లు గణనీయంగా తగ్గిపోతాయి. ► ఐదురోజుల్లో : ఒంటిలోని నికోటిన్ తగ్గి శరీరం పరిశుభ్రమవుతుంది. ► వారంలో: వాసనలు తెలియడం, నాలుకకు రుచులు తెలియడం మరింత పెరుగుతుంది. ► పన్నెండు వారాల్లో : ఊపిరితిత్తులు తమను తమంతట తామే పరిశుభ్రం చేసుకుంటాయి. ► మూడు నెలల్లో : ఊపిరితిత్తుల సామర్థ్యం 30 శాతం పెరుగుతుంది. ► ఆర్నెల్లలో: గుండె జబ్బులు వచ్చే ముప్పు చాలావరకు తగ్గిపోతుంది. ► ఏడాదిలో: సిగరెట్ అలవాటు కారణంగా గుండెజబ్బుల ముప్పు సగానికి సగం తగ్గిపోతుంది. మీ జేబుకు పడ్డ చిల్లి పూడుతుంది. ఏడాదిలో దాదాపు రూ. 50,000 వరకు మీకు ఆదా అవుతూ ఉంటుంది. ► ఐదేళ్లలో: స్ట్రోకొచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. ► సిగరెట్ మానేసిన పదిహేనేళ్ల తర్వాత: గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఒక నాన్స్మోకర్లో ఎంత ఉంటాయో... మానేసినవారికీ అన్నే ఉంటాయి. కేవలం గుండె విషయంలోనే కాదు... నోటి క్యాన్సర్, గొంతు, ఈసోఫేసియల్ క్యాన్సర్లు వచ్చే రిస్క్ కూడా దాదాపుగా ఒక నాన్ స్మోకర్‌కు ఎంత ఉంటుందో... మానేసిన వారిలోనూ అంతే ఉంటుంది. అంటే వీరు కూడా దాదాపుగా ఒక నార్మల్ వ్యక్తిలాంటి ఆరోగ్యాన్ని పొందుతారని అర్థం. -
పొగ మానేయాలనుకుంటున్నారా?
31 మేలు 31 మే వరల్డ్ నో టొబాకో డే పొగాకు నమలడం, పొగతాగడం ఎంత హానికరమోఅందరికీ తెలియజేయడం కోసం డబ్ల్యూహెచ్ఓ ఎంచుకున్న రోజు. పొగాకు వ్యసనాన్ని మానేయాలని ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉన్నా ఈ అలవాటు మానలేకపోతున్నారు. వీళ్లకు సహాయం చేద్దామని ‘సాక్షి’ ఈ కొన్ని మేలు మార్గాలు చూపిస్తోంది. మే 31న పొగాకు అలవాటును మానేసి ఇతరులకు మీరు స్ఫూర్తిదాయకంగా ఉంటారని ఆశిస్తున్నాం. ఈ మేళ్లు ఎంతోమందికి మైలురాళ్లు కావాలి. ‘ముప్ఫయి రోజుల్లో...’ అనేది చాలా జనాకర్షణ కలిగిన అంశం. ముప్ఫయి రోజుల్లో ఆంగ్ల భాష, ముప్ఫయి రోజుల్లో కరాటే... ఇలా. దాదాపు నెల రోజుల తర్వాత... సరిగ్గా ఈ నెల 31న ‘యాంటీ టొబాకో డే’. పొగాకు వల్ల, పొగతాగడం వల్ల కలిగే అనర్థాలు ఇప్పటికే అందరికీ తెలిసినవే. కానీ తెలిసి కూడా మానలేకపోవడమే సిగరెట్ బలం... దాన్ని తాగేవారి బలహీనత. దీన్ని అధిగమించడానికీ మార్గాలున్నాయి. ఈ నెల రోజుల్లో పొగతాగడం మానేయడానికి అనేక మంది నిపుణులు సూచించిన కొన్ని మార్గాలను మీకు అందిస్తున్నాం. ఈ నెల 31న వచ్చే యాంటీ టొబాకో డే నాటికి మీరు పొగ మానేస్తారనే లక్ష్యంతో... మీకు మేము వినమ్రంగా అందిస్తున్న కథనం ఇది. పొగాకులో దాదాపు నాలుగు వేలకు పైగా హానికర రసాయనాలు ఉంటాయి. వాటిలోని ఆక్సిడెంట్స్ వల్ల వయసు పైబడిన కొద్దీ దుష్ప్రభావాలు ఎదురవు తుంటాయి. పొగలో ఉండే కార్సినోజెన్స్ వల్ల క్యాన్సర్స్ కూడా రావచ్చు. 1. ఫ్రెండ్స్ సిగరెట్ తాగుతున్నది చూసి ఎడతెరిపి లేకుండా దగ్గు వచ్చినా సరే, స్నేహితుల ముందు చిన్నబోకూడదని పంతంపట్టి మొదలుపెడతారు. 2 భార్యాపిల్లలు ‘ఎప్పుడు మానేస్తారు’ అని ఎంతగా బతిమిలాడుతున్నా అదేపనిగా కొనసాగిస్తారు. 3.ఆస్తమా లేదా ఇతర ఊపిరితిత్తుల సమస్య వచ్చినప్పుడు మానేద్దామనుకొని మళ్లీ ప్రారంభిస్తారు. 4. కానీ తప్పక మానేయడానికీ 4వ తేదీ నుంచి ప్రయత్నం చేయండి. ఆయా సూచనలు పాటించండి. ఆల్ ద బెస్ట్! 5.ముందుగా క్యాలెండర్లో సిగరెట్/పొగాకు మానాల్సిన రోజును మార్క్ చేసుకొని, అది నిత్యం మీకు కనిపిస్తుండేలా అమర్చుకోండి. 6.సిగరెట్/పొగాకుకు పురిగొల్పుతున్న అంశాల జాబితాను రాయండి. ఈ జాబితాను పూర్తి చిత్తశుద్ధితో రాయాలి. జాబితాలోని అంశాలను సమీక్షించుకుంటూ... ఆ సందర్భాలలో పొగతాగకుండా ఎందుకు ఉండలేరో ఆలోచించుకోండి. 7.భార్య, పిల్లలు, స్నేహితులు, బంధువుల నుంచి మీ పొగతాగే అలవాటు గురించి ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. మీ అలవాటు వల్ల వారు పడ్డ మనోవేదన, ఇక్కట్లు, కష్టాలను ఆలోచించండి. మీ అలవాటుతో వారిని బాధపెట్టారని పదే పదే గుర్తుతెచ్చుకోండి. 8.మంచి మూడ్‌లో ఉన్నప్పుడే సిగరెట్‌ను వదిలేయండి. ఇలా మంచిమూడ్‌లో ఉన్నప్పుడు వదిలేస్తే... ఆ అలవాటు మళ్లీ దరిదాపుల్లోకి రాదు. ఎక్కువ మందిలో ఇది నిరూపితమైందని అధ్యయనాలు చెబుతున్నాయి. 9.మీరు సిగరెట్ మానేసిన విషయం మీ భార్యకు, స్నేహితులకు, పిల్లలకు, మీ కొలీగ్స్‌కు చెప్పండి. బహిరంగంగా ఇలా ప్రకటించాక వారి ముందు మళ్లీ సిగరెట్ తాగాలంటే బిడియంగా ఉంటుంది. ఒకవేళ తీసినా పిల్లలు నేరుగా ప్రశ్నిస్తారేమోనని సిగ్గనిపిస్తుంది. 10.సిగరెట్ తాగాలనిపించినప్పుడు పంటికింద నమలడానికి ఆరోగ్యకరమైన పదార్థాలు... అంటే పల్లీలు, నట్స్ వంటివి అందుబాటులో పెట్టుకోండి. అవి మీ బరువును పెంచుతాయనుకుంటే చిన్న కప్పు గ్రీన్ టీ తాగండి. 11.మీరు సిగరెట్ బయటకు తీయగానే ముఖం ముడుచుకొని పక్కకు వెళ్లేవారినీ, మీరు సిగరెట్ తాగి రాగానే ఆ వాసన సోకిన వెంటనే ముఖం చిట్లించుకునే వారిని గుర్తుకు తెచ్చుకోండి. ఇంతటి అసహ్యాన్ని పెంచడం అవసరమా?... ఆలోచించండి. 12.మీ పనిలో బ్రేక్ వచ్చినప్పుడల్లా సిగరెట్‌కు వెళ్లడానికి బదులు కంప్యూటర్గేమ్లో నిమగ్నం కండి. ఆ తర్వాత మళ్లీ మీ పని మొదలుపెట్టేయండి. ఇంక సిగరెట్ తాగడానికి దొరికే బ్రేక్ ఎక్కడ? మీ పనిలో బ్రేక్ పడే అవకాశమెక్కడ? 13.సిగరెట్ తాగాలనిపించినప్పుడల్లా టెన్నిస్, స్క్వాష్ ఆటలు ఆడుతున్నట్లుగా ఊహించుకోండి. మర్నాడు ఆడాలని నిశ్చయించుకోండి. అందుకు ఊపిరితిత్తులకు మరింత శక్తి కావాలి కదా. సిగరెట్‌తో వాటిని కోల్పోతారన్న సంగతి గుర్తు తెచ్చుకోండి. 14.ఎప్పుడూ నో–స్మోకింగ్ జోన్లో ఉండటానికి ప్రయత్నించండి. దగ్గర సిగరెట్లు ఉంచుకోకండి. తపన (క్రేవింగ్) పుట్టినప్పుడు సిగరెట్ కొనడానికి బయటకు వెళ్తారు. చాలా సందర్భాల్లో బయటికెళ్లే సమయం లేక పొగతాగకుండా ఉండకతప్పని పరిస్థితి వస్తుంది. 15.స్మోకింగ్‌తో వచ్చే అనారోగ్యాలను జాబితా రాయండి. దాని అనేక కాపీలు తీయండి. ఇంట్లో అన్ని గదుల్లోనూ మీకు ప్రస్ఫుటంగా కనిపించేలా, మీరు నడయాడే ప్రతి చోటా అతికించండి. స్మోకింగ్‌ను కొనసాగిస్తే జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేరని అర్థమవుతుంది. 16.మీరు రెగ్యులర్‌గా తీసుకునే పాన్–షాప్ వైపునకు కాకుండా... వేరే దారుల్లో ఆఫీసుకు వెళ్లండి. అదే దారిలో వెళ్తే కాళ్లు అక్కడ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కొత్త మార్గాల్లో ఎక్కడ పాన్–షాపు ఉంటుందో తెలియదు కాబట్టి అంత తేలిగ్గా మీకు సిగరెట్ దొరకదు. 17.గతంలో మీరు నిర్వహించిన అతి కష్టమైన, టాస్క్‌లను, సులువుగా పూర్తి చేసిన వ్యవహారాలను గుర్తు తెచ్చుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని, మనోనిబ్బరాన్ని తలచుకోండి. అంత కష్టమైనవే చేశారు. ఈ పొగాకూ / సిగరెట్లు మానేయడం అనగా ఎంత? 18.సిగరెట్ మానేశాక ఇంట్లో వాళ్ల ఫీలింగ్ తెలుసుకోండి. ఆ ఫీడ్‌బ్యాక్ సిగరెట్‌కు దూరంగా ఉంచుతుంది. అగ్గిపెట్టె, లైటర్, యాష్‌ట్రే, సిగరెట్ హోల్డర్ వంటివేవీ దగ్గర ఉంచుకోకండి. అవి కళ్ల ముందు ఉంటే... మనసు సిగరెట్ మీదకు మళ్లుతుంది. 19.మీ ఫ్రెండ్స్‌లో డాక్టర్స్, పల్మనాలజిస్ట్స్, హెల్త్ కేర్ ఇండస్ట్రీ వారు ఉంటే తరచూ వారినే కలుస్తూ సిగరెట్ నుంచి వచ్చే అనర్థాలు, ఆరోగ్యానికి ముప్పుల గురించి చర్చిస్తూ ఉండండి. తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. 20.సిగరెట్ మానే ప్రయత్నంలో ఒకసారి ఫెయిలైతే మరోసారి ప్రయత్నించండి. పదో ప్రయత్నంలో విజయం సాధించిన వారు కూడా ఉన్నారు. 21.సిగరెట్ మానేసే ప్రయత్నంలో.. అరెరె... ఈ ఆనందానికి దూరం కావాలా అని బెంగపడకండి. ఎప్పుడు కావాలంటే అప్పడు సిగరెట్ దొరుకుతుంది, తాగగలను. కాకపోతే ఇప్పుడు తాగడం లేదు. అంతే...! అనుకోండి. అప్పుడు తప్పక మానేయగలరు. 22.సిగరెట్ తాగినప్పుడల్లా ఉల్లి, వెల్లుల్లి తిన్నవారి నుంచి వచ్చే వాసనను గుర్తు తెచ్చుకోండి. ఆరోగ్యాన్నిచ్చే వాటిని తినే మీటింగ్‌కు వెళ్లాలంటేనే వెనకాడుతాం. అనారోగ్యకరమైన పొగాకు, సిగరెట్‌కు, ఆ కంపునకు ఆమోదం ఉంటుందా? ఆలోచించండి. 23.సిగరెట్ తాగాలనే కోరిక పుట్టినప్పుడల్లా మీరు అమితంగా గౌరవించే పెద్దల(సిగరెట్ తాగి వెళ్లలేనివారి) దగ్గరకు వెళ్లేలా ప్లాన్ చేసుకోండి. అలా సిగరెట్‌కూ, సిగరెట్‌కూ మధ్య వ్యవధి పెరుగుతుంది. సిగరెట్ అలవాటు దూరం అవుతుంది. 24.సిగరెట్ మానడానికి ఈ–సిగరెట్‌ను ఆశ్రయించదలచుకున్నారా? వద్దనే వద్దు. పొగతాగడం మానేయాలనుకుంటే పూర్తిగా మానేయండి. ఈ ప్రత్యామ్నాయం సరికాదు. ఈ–సిగరెట్ సైతం ఆరోగ్యానికి హాని చేసేదే అని గుర్తుంచుకోండి. 25.తరచూ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంచండి. ఇందులో భాగంగా క్యాన్సర్ హాస్పిటల్స్‌ను, క్యాన్సర్ విభాగాలను సందర్శించండి. అక్కడ కనిపించే దృశ్యాలు మీ మనసు మార్చి, మీ దురలవాటును తప్పించే అవకాశం ఎక్కువ. 26.ఎడతెరిపి లేనంత పనిలో నిమగ్నం అయిపోండి. ఇది ఒత్తిడి లేని పనిౖ అయివుండాలి. మీరు పనిలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు అసలు సిగరెట్ తహతహ (క్రేవింగ్) కలగని తీరును గుర్తించండి. 27.నికోటిన్ తపనను తగ్గించే చ్యూయింగ్ గమ్స్, ప్యాచ్‌ల వంటి వాటిపై ఆధారపడండి. అవి సిగరెట్ తాగాలనే తహతహను తగ్గించి క్రమంగా ఆ అలవాటు నుంచి దూరం చేస్తాయి. 28.ధూమపానం మానడానికి వ్యాయామం మంచి మార్గం. అంత కష్టపడి వ్యాయామం చేసి సంపాదించుకున్న ఆరోగ్యాన్ని, సౌష్ఠవాన్ని కేవలం సిగరెట్‌తో బుగ్గి చేసుకోవడం సరికాదనే భావన పెరుగుతుంది. 29.బోర్ అనిపించినప్పుడు దాన్ని అధిగమించడానికి ఇతరత్రా మంచి హాబీలను పెంపొందించుకోండి. బోర్ అనిపించినప్పుడు సిగరెట్ తాగడం వల్ల బోర్డమ్ మరింత పెరుగుతుందని గుర్తుంచుకోండి. 30.ఎవరినైనా ఆపద నుంచి రక్షించడానికి మీ బలాన్ని ప్రదర్శించాల్సి వచ్చిన సందర్భాన్ని గుర్తుతెచ్చుకోండి. మీరు సిగరెట్ తాగుతూ ఉంటే అదే స్టామినాను ప్రదర్శించడం సాధ్యపడేది కాదన్న విషయాన్ని గుర్తించండి. పై మార్గాలన్నీ విఫలం అయితే కౌన్సెలర్ వద్ద సలహా తీసుకోండి. సపోర్ట్ గ్రూప్‌ల సహాయం తీసుకోండి. చివరగా మీ డాక్టర్ / సైకియాట్రిస్ట్‌ను సంప్రదించండి. 31.వరల్డ్ నో టొబాకో డే... కొన్ని అనర్థాలు లంగ్‌క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, ఈసోఫేజియల్ క్యాన్సర్, అనేక రకాల లుకేమియా, గుండెజబ్బులు, హైబీపీ, డయాబెటిస్ ముప్పు, డిప్రెషన్, అలై్జమర్స్ డిసీజ్, సంతానలేమి, పుంసత్వం తగ్గడం, ఎముకలు పలచబారడం, నాలుకకు రుచి తెలికయకపోవడం, ముక్కుకు వాసనలు తెలియకపోవడం... మొదలైనవి. ఆలోచించండి ఎలా మొదలైనా... ఇలా వదిలేయచ్చు! మీరు సిగరెట్ తాగే చోట మీరెప్పుడూ గౌరవించే వారి ఫొటో పెట్టుకోండి. ఎంతైనా అక్కడ సిగరెట్ కాల్చడానికి మీ మనసు అంగీకరించదు.మీ పిల్లలకు ముద్దు పెట్టే సమయంలో మీ నుంచి వచ్చే సిగరెట్ కంపు కారణంగా వాళ్లు ముఖం చిట్లించుకోవడం గుర్తు చేసుకోండి. మరోసారి సిగరెట్ జోలికి పోరు.మంచి చేయాలనీ, మంచిని అనుసరించాలని మనం సమాజానికి చెబుతుంటాం. మరి మనం ఏం చేయకూడదన్నది మరొకరు చెప్పడం అవసరమా?ఏదైనా ఒకటి వదిలిపెట్టాలంటే కాశీ దాకా వెళనక్కర్లేదు. సిగరెట్ తాగీ తాగీ ఆరోగ్యం చెడగొట్టుకొని మన ఆత్మీయుడు మనల్ని వీడి వెళ్లిపోతే అతడి జ్ఞాపకార్థం శ్మశానంలోనూ దాన్ని వదిలేస్తే చాలు కదా.టీనేజ్‌లో స్నేహితుడెవరో చేశారని సిగరెట్ తాగడం అవసరమా? ఆ స్నేహితుడు వదిలిపోయినా, ఈ పని వల్ల జీవితాంతం ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడతారు. దీనిని కొనసాగించడం ఎంతవరకు సబబు? పల్మనాలజిస్ట్ ను సంప్రదించండి ప్లానింగ్ ఈ నెల 31న వరల్డ్ నో టొబాకో డే. ఆ తేదీకి దాదాపు నాలుగు వారాల గడువుంది. ఈ నాలుగు వారాల్లో పొతతాగడం మానేయాలనుకున్న వారు వరుసగా ఒక్కోవారంలో వేసుకోవాల్సిన ప్రణాళిక, చేయాల్సిన పని ఇదీ! మొదటివారం సిగరెట్ మానేయాలనే ఉత్సాహం, ఉద్వేగం మొదటివారం ఉంటాయి. తొలి 72 గంటల పాటు నికోటిన్ లోపం వల్ల తహతహ, తపన కలుగుతాయి. కానీ నాలుగు, ఐదో రోజు నుంచి అంతా మామూలవుతుంది. చెమటలు పట్టడం, ఊపిరి అందనట్లుగా అనిపించడం, ఉద్వేగం వల్ల అనర్థాలేమీ ఉండవు. ఈ వారంలో చ్యూయింగ్ గమ్స్, ప్యాచెస్ దగ్గర ఉంచుకోవాలి. అలవాటు వదిలాక మీకు అధికపాళ్లలో ఆక్సిజన్ అందడాన్ని మీరే గమనిస్తుంటారు. రెండో వారం ఇది మొదటివారం అంత గడ్డుగా ఏమీ గడవదు. చాలా రిలాక్స్ అవుతారు. పొగమానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ మీకే కనిపిస్తుంటాయి. మీరు తినే ఆహారం మరింత రుచికరంగా ఉంటుంది. మీకు అనేక పరిమళాలు అందుతుంటాయి. ఇంతకాలం ఏం కోల్పోయారో కొద్దికొద్దిగా మీరు అర్థమయ్యేది ఈ వారంలోనే. మీరు కోల్పోయిన వాటిని ఆస్వాదిస్తూ ఈ వారం గడుస్తుండటం వల్ల ఇది తేలిగ్గా గడవడం మీకే తెలుస్తుంది. హ్యాపీగా అనిపిస్తుంది. మూడో వారం ఈ వారానికి మీ ఒళ్లంతా తేలిగ్గానూ, మీ ఊపిరితిత్తులు మంచి గాలితో నిండుగానూ ఉన్న అనుభూతిని మీరు అనుభవిస్తుంటారు. ఈ వారంలో కాస్త కెఫిన్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండండి. ఎందుకంటే అవి మళ్లీ సిగరెట్‌ను ప్రేరేపించే అవకాశం ఉంది. ఈ వారంలో ఏరోబిక్స్, ధాన్యం మొదలుపెట్టడం మంచిది. ఈ వారంలో మీరు ఒకింత బరువు పెరుగుతారు. కానీ ఆందోళన వద్దు. ఆ పెరిగిన బరువుకు విరుగుడే ఈ వారంలో మీరు చేసే ఏరోబిక్స్. నాలుగో వారం ఈ వారం పొగతాగే రోజులకూ, మానేసిన రోజులకూ తేడాను సమీక్ష చేసుకుంటూ ఉంటే చాలు... అదే మీ సంకల్పాన్ని మరింత దృఢతరం చేస్తుంది. డబ్బు, ఆరోగ్యం, జీవనశైలిలో మీరు అనుభవిస్తున్న తేలికదనం (ఈజ్), ఫిజికల్ ఫిట్నెస్... ఈజీగా గడిచేలా చేస్తాయి. 31 వచ్చిందా? నెల పూర్తయ్యిందా? ఇక మిమ్మల్ని ఎవరూ నియంత్రించాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఆఫర్ చేసినా మీరే సిగరెట్‌ను తోసిపుచ్చుతారు. – డాక్టర్ కె. శైలజ, కన్సల్టెంట్, పల్మనాలజిస్ట్, మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్, మాదాపూర్, హైదరాబాద్ -
స్మోకర్స్.. అతి పెద్ద కోరిక ఏంటో తెలుసా...?
స్మోకింగ్ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది తప్ప, తగ్గే ప్రసక్తే లేదు. ధూమపానంపై ఇప్పటివరకూ ఎన్నో సర్వేలో జరిగాయి. స్మోకింగ్ వల్ల కలిగే దుష్పరిణామాలు, అసలు ఎందుకు స్మోకింగ్ కు గుడ్ బై చెప్పాలో చాలా రకాలుగా సర్వేల ద్వారా వివరించారు. నేడు ప్రపంచ పోగాకు వ్యతిరేక దినోత్సవం. ప్రస్తుతం మహిళలు, పురుషులతో పోటీ పడి మరీ సిగరెట్లు కాలుస్తున్నారు. ఈ అలవాటు పెరుగుతున్న వారిలో మహిళల వృద్ధిరేటే అధికంగా ఉంటుందని కొన్ని సర్వేలలో తేలింది. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది, అలా వెళ్లి ఓ సిగరెట్ వెలిగించి నాలుగు పఫ్ లు లాగితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని ధూమపాన ప్రియులు భావిస్తారట. అలాంటి సమయాల్లో అదే అత్యుత్తం అని తోటివారికి చెబుతుంటారు. అంతేకాదు, ఓ అసక్తికర విషయాన్ని స్మోకర్స్ చెప్పడం తరచూ వింటూనే ఉంటాం. వీరిలో చాలా మంది ఈ అలవాటుగా దురలవాటుకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు, ఎంత త్వరగా వీలైతే అప్పుడు హాబిట్ కు గుడ్ బై చెప్పాలని భావిస్తున్న విషయాన్ని చెబుతుంటారు. ఇదే వారికి ఉన్న అతి పెద్ద కోరిక అని వారి సన్నిహితులు, కుటుంబసభ్యులు ఆట పట్టిస్తారు. భారత్ లో ప్రతిఏటా పోగాకు సంబంధిత కారకాల వల్ల 10 లక్షల మంది చనిపోతున్నారు. పోగాకు వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ మాత్రమే వస్తుందని అనుకుంటారు. నిజానికి ఇది ఎన్నో రకాల క్యాన్సర్ లకు తెరిచిన తలుపుగా ఉంటుందట. పాసివ్ స్మోకింగ్ గురించి అవగాహన లేకపోవడంతో కూడా ఈ అలవాటు మానేసే వారి సంఖ్య తగ్గడం లేదని విశ్లేషకులు చెబుతుండగా, ఇంట్లో భార్య, పిల్లలు లేని సమయాల్లో(బయటి ప్రదేశాల్లో) సిగరెట్ తాగుతున్నాం కదా కొందరు స్మోకర్స్ వాదిస్తుంటారని మరికొందరు చెబుతున్నారు. -
కాల్చకురా... కాలేవు...
మే 31న వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా... పొగతాగని వాడు దున్నపోతై పుడతాడో లేదో ఎలాంటి గ్యారంటీ లేదు గానీ, పొగతాగే వాడు మాత్రం ‘ధూమ్రపోతై’ గిట్టడం ఖాయం. ఈ సంగతి పొగరాయుళ్లకు కూడా బాగానే తెలుసు. అయినా ఎడాపెడా పొగచుట్టలు తగలేస్తూనే ఉంటారు. సిగరెట్, చుట్ట, బీడీ, హుక్కా... ఏదైతేనేం నిదానంగా ప్రాణాలు తీయడానికి. అందుకే ‘కాల్చకురా... కాలేవు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మాత్రమే కాదు, ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ కూడా మొత్తుకుంటూనే ఉన్నాయి. పొగ తాగే పాడు అలవాటును మానుకోవాలంటూ దశాబ్దాలుగా మొరపెట్టుకుంటూనే ఉన్నాయి. పొగ తాగడం వల్ల కలిగే అనర్థాల గురించి నిరక్షరాస్యులకు సైతం అర్థమయ్యేలా వివరిస్తూ, మారుమూల ప్రాంతాలకు సైతం చేరే రీతిలో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నాయి. ఇదీ నేపథ్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ దేశాల ప్రభుత్వాలు సాగిస్తున్న విస్తృత ప్రచారం వల్ల కొంతవరకు సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ప్రపంచ జనాభాలో పొగరాయుళ్ల శాతం గడచిన మూడు దశాబ్దాల్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. శాతం లెక్కల్లో తగ్గుదల కనిపిస్తున్నా, జనాభా పెరుగుదల కారణంగా పొగరాయుళ్ల సంఖ్యాబలం పెరిగిందని అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ చెబుతున్న తాజా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పొగరాయుళ్ల జనాభా 113 కోట్లకు పైనే ఉంది. వారిలో దాదాపు 95 కోట్ల మంది పురుషులే కాగా, సుమారు 18 కోట్ల మంది మహిళలు ఉండటం ఆందోళన కలిగించే అంశం. పొగాకు వ్యతిరేక ప్రచారం ఫలితంగా అగ్రరాజ్యాల్లో పొగరాయుళ్ల సంఖ్య బాగానే తగ్గుముఖం పట్టినా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను, వెనుకబడిన దేశాల్లోను ఈ సంఖ్య ఇంకా ఆందోళనకరమైన స్థాయిలోనే ఉంది. ముప్పయ్యేళ్ల కిందట అమెరికా జనాభాలో 42 శాతం మంది యథేచ్ఛగా పొగపీల్చేవారు. డబ్ల్యూహెచ్ఓ ప్రచార ఫలితంగా ఇప్పుడు ఆ సంఖ్య 20.8 శాతానికి తగ్గింది. ఇదే వ్యవధిలో భారత్‌లో పొగతాగే వారి సంఖ్య 33.8 శాతం నుంచి 23 శాతానికి తగ్గింది. ఇది కొంతవరకు ఆశాజనకమైన పరిణామమే అయినా, పొగతాగే వారి సంఖ్య మరింతగా తగ్గితే తప్ప ప్రపంచం ఆరోగ్యకరంగా మారదని డబ్ల్యూహెచ్ఓ భావిస్తోంది. అందుకే పొగతాగడం మాత్రమే కాదు, ఇతర రూపాల్లోనూ పొగాకు వినియోగాన్ని పూర్తిగా రూపుమాపాలనే సంకల్పంతో 1988 సంవత్సరంలో మే 31వ తేదీని ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంగా ప్రకటించింది. పొగాకు వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలనే సంకల్పంతో డబ్ల్యూహెచ్ఓ 1998 నుంచి ‘టొబాకో ఫ్రీ ఇనీషియేటివ్’ను చేపట్టింది. ‘పొగ’సెగపై అవీ... ఇవీ... 40 వేల కోట్ల డాలర్లు ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే వస్తువులు సిగరెట్లే. ఏటా దాదాపు లక్ష కోట్ల సిగరెట్లు అమ్ముడుపోతున్నట్లు అంతర్జాతీయ సంస్థల అంచనా. వీటి విలువ సుమారు 40 వేల కోట్ల డాలర్లు (రూ. 2.70 లక్షల కోట్లు). 70% సిగరెట్ల అమ్మకాల్లో అమెరికాదే గుత్తాధిపత్యం అని చెప్పుకోవచ్చు. ప్రపంచ సిగరెట్ల మార్కెట్లో దాదాపు 70 శాతం అమెరికాకు చెందిన మూడు బ్రాండ్లదే. 43 రకాల రసాయనాలు సిగరెట్ పొగలో నికోటిన్‌తో పాటు ఆర్సెనిక్, ఫార్మల్డీహైడ్, హైడ్రోజన్ సైనైడ్, అమోనియా, సీసం, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి 43 రకాల ప్రమాదకర రసాయనాలు ఉంటాయి. 15 ఏళ్లు పొగతాగని వారితో పోలిస్తే పొగతాగే వారు దాదాపు పదిహేనేళ్ల ఆయుర్దాయాన్ని కోల్పోతారు. 10 సెకన్లు సిగరెట్ పొగ పీల్చిన పది సెకన్లలోనే అందులోని నికోటిన్ మెదడుకు చేరుతుంది. 20% సిగరెట్లలో దాదాపు 20 శాతం చక్కెర ఉంటుంది. అందుకే ఇవి మధుమేహం ఉన్నవారికి మరింత ముప్పు కలిగిస్తాయి. 113దేశాలు 74% మరణాలు భారత్‌లోనే పొగాకు నమిలినా ముప్పే. అయితే, దీని వల్ల ఆ ముప్పు అలవాటు ఉన్నవాళ్లకు మాత్రమే పరిమితం. పొగాకును జర్దా, ఖైనీ, గుట్ఖా, ఖారామసాలా వంటి నానారకాల రూపాల్లో నమిలే అలవాటు చాలా దేశాల్లో ఉంది. ముఖ్యంగా భారత ఉపఖండ ప్రాంతంలో ఈ అలవాటు మరీ ఎక్కువ. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం 113 దేశాల్లో పొగాకు నమిలే అలవాటు ఉంది. ఈ అలవాటు వల్ల తలెత్తే వ్యాధులతో ఏటా దాదాపు 2.50 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాల్లో 74 శాతం కేవలం భారత్‌లోనే సంభవిస్తుండటం గమనార్హం. సమాజంపై ప్రభావం * పొగతాగే అలవాటు సమాజంపై చూపే ప్రభావం కూడా తక్కువేమీ కాదు. * పొగతాగే పెద్దలను చూసి పిల్లలు ఈ అలవాటును నేర్చుకుంటారు. పొగతాగే వారిలో దాదాపు 60 శాతం మంది పద్దెనిమిదేళ్ల లోపు వయసులోనే ‘పొగ’కు అలవాటుపడుతున్నారు. * ఇక ఆహార పంటలు పండించాల్సిన నేలలో పొగాకు సాగు చేయడం వల్ల వ్యవసాయరంగానికి ఏటా వాటిల్లుతున్న నష్టం లెక్కలకు అందనిది. * పొగతాగే అలవాటు ఉన్నవారు అల్పాదాయ వర్గాలకు చెందిన వారైతే, వారు తమ ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని ఈ అలవాటు కోసమే ఖర్చు చేస్తూ ఆర్థికంగా కుదేలవుతున్నారు. * హైదరాబాద్‌తో పాటు దేశంలోని పలు పెద్ద నగరాల్లో విచ్చలవిడిగా నడిచే హుక్కాసెంటర్లకు టీనేజర్లు బానిసలవుతున్నారు. వీరు చాలా చోట్ల అక్రమంగా నడిచే హుక్కా సెంటర్లపై జరిగే పోలీసు దాడుల్లో పట్టుబడుతున్న టీనేజర్లు తల్లిదండ్రులకు తలనొప్పిగా పరిణమిస్తున్నారు. * సిగరెట్లు, బీడీలు, చుట్టలు వంటి వాటి నుంచి వెలువడే పొగ వల్ల పర్యావరణం దెబ్బతిని, వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ‘పొగ’బడితే... ప్రాణాంతకమే ‘పొగ’ నిర్మూలన కోసం ఎందరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పొగతాగే అలవాటు కారణంగా ఏటా దాదాపు 60 లక్షల మంది మరణిస్తున్నారు. వారిలో సుమారు 10 లక్షల మంది భారతీయులు ఉంటుండటం ఆందోళన కలిగించే అంశం. నేరుగా పొగతాగకపోయినా, ఇంటా బయటా ఇతరులు వదిలే పొగ పీల్చడం వల్ల ప్రపంచవ్యాప్తంగా మరో 6 లక్షల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంతేకాదు, పొగరాయుళ్ల బాధ్యతారాహిత్యం కారణంగా గర్భస్థ శిశువులకు సైతం హాని కలుగుతోంది. ‘పొగ’ ప్రభావానికి గురై పుట్టిన పిల్లలు రకరకాల శారీరక, మానసిక రుగ్మతలకు లోనవుతున్నారు. కొన్ని వెనుకబడిన దేశాల్లో పొగాకు తోటల్లో పనుల కోసం పిల్లలను వినియోగిస్తున్నారు. పచ్చి పొగాకును ఎక్కువసేపు చేతులతో పట్టుకోవాల్సి రావడంతో అన్నెంపున్నెం ఎరుగని పిల్లలు ‘గ్రీన్ టొబాకో సిక్నెస్’కు గురవుతున్నారు. దీని ఫలితంగా ఊపిరితిత్తులు, జీర్ణాశయం, గుండె, నాడీవ్యవస్థ, చర్మం దెబ్బతిని బలహీనంగా మారుతున్నారు. వైద్య చికిత్స అందని పరిస్థితుల్లో కొందరు చిన్న వయసులోనే కన్నుమూస్తున్నారు. పొగ మానుకోవాలంటే..? పొగరాయుళ్లలో దాదాపు సగం మందికి ఆ అలవాటును మానేయాలనే ఉంటుంది. అయితే, పొగాకులోని నికోటిన్ ప్రభావానికి బానిసలుగా మారడం వల్ల అంత తేలికగా అలవాటును వదులుకోలేరు. ‘పొగ’ను వదులుకోవడం కష్టం కావచ్చేమో గానీ, అసాధ్యం మాత్రం కాదని నిపుణులు చెబుతున్నారు. చిత్తశుద్ధితో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పూర్తిగా ఈ అలవాటు నుంచి బయటపడవచ్చని అంటున్నారు. వారు చెబుతున్న జాగ్రత్తలు ఇవీ... * సిగరెట్‌ను మానేయడానికి మిమ్మల్ని బాగా ప్రభావితం చేయగల బలమైన కారణాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు పరోక్ష పొగ నుంచి మీ కుటుంబ సభ్యులను రక్షించడం, మరింత యవ్వనంగా కనిపించడం, క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవడం వంటి కారణాలు. * మీ మెదడు నికోటిన్ ప్రభావానికి బాగా అలవాటు పడే ఉంటుంది. దాని నుంచి ఎలాగైనా బయటపడాలని బలంగా తీర్మానించుకోండి. అందుకు మానసికంగా సంసిద్ధులవండి. * పొగతాగడం మానేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు చెప్పి, ఈ విషయంలో వారి సహాయ సహకారాలను కోరండి. * మానేయడం వల్ల తలనొప్పి, భావోద్వేగాల్లో మార్పులు వంటి ఇబ్బందులు తలెత్తినా కంగారు పడకండి. పదేపదే సిగరెట్ కోసం నాలుక పీకుతున్నా దాని నుంచి మనసు మళ్లించే ప్రయత్నాలు చేయండి. అప్పటికీ సాధ్యం కాకుంటే, మానసిక వైద్యులను సంప్రదించండి. * ‘పొగ’ నుంచి మనసు మళ్లించుకోవడానికి మీకు ఇష్టమైన వ్యాపకాన్ని ఏర్పరచుకోండి. ఉదాహరణకు సంగీతం, పుస్తక పఠనం, వ్యాయామం, ట్రెక్కింగ్ వంటివి ప్రయత్నించండి. * ‘పొగ’ నుంచి మనసు మళ్లించే మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సలహాపై వాటిని క్రమం తప్పకుండా వాడి, ఈ అలవాటు నుంచి విజయవంతంగా బయటపడండి. * పొగతాగే అలవాటును మానేసే ప్రయత్నంలో ఒకటికి రెండుసార్లు విఫలమైనా మరేమీ బాధపడకండి. మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉండండి. తప్పకుండా మీ ప్రయత్నం ఫలిస్తుంది. ‘పొగ’ మానేసిన సెలిబ్రిటీలు పొగతాగడం వల్ల తలెత్తే అనర్థాలపై డబ్ల్యూహెచ్ఓ, ప్రభుత్వాలు సాగిస్తున్న ప్రచారానికి పలువురు సెలిబ్రిటీలు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఒకప్పుడు గుప్పుగప్పుమంటూ సిగరెట్లను తెగ తగలేసిన పలువురు సెలిబ్రిటీలు విజయవంతంగా ఈ అలవాటు నుంచి బయటపడ్డారు. అలా ‘పొగ’ మానేసిన సెలిబ్రిటీలలో కొందరు... సల్మాన్ ఖాన్: ఇదివరకు విరివిగానే సిగరెట్లు తాగేవాడు. కొన్నేళ్ల కిందట నరాల సమస్య మొదలవడంతో ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాడు. వైద్యుల సూచన మేరకు శక్తివంచన లేకుండా ప్రయత్నించి, ఈ అలవాటును మానేశాడు. మహేష్‌బాబు: కొన్నేళ్ల కిందటి వరకు చైన్స్మోకర్గా ఉండేవాడు. భార్య నమ్రత కానుకగా ఇచ్చిన పుస్తకం ‘ద ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్’ చదివిన తర్వాత సిగరెట్ అలవాటును పూర్తిగా మానేశాడు. తన సినిమాల్లో ‘పొగ’ దృశ్యాలు లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆమిర్ ఖాన్: ఇదివరకు దమ్ముకొడుతూ బహిరంగంగానే కనిపించేవాడు. సిగరెట్లు తాగొద్దంటూ పిల్లలు జునియాద్, ఇరా పోరు పెట్టడంతో చాలావరకు సిగరెట్లను బాగా తగ్గించుకున్నాడు. ఐదేళ్ల కిందట చిన్న కొడుకు ఆజాద్ పుట్టిన తర్వాత అలవాటును పూర్తిగా మానేశాడు. సైఫ్ అలీఖాన్: ఒకప్పుడు విచ్చలవిడిగా సిగరెట్లు కాల్చేవాడు. ఐదేళ్ల కిందట గుండెలో అవరోధం ఏర్పడి గుండెపోటు వచ్చినంత పనైంది. వైద్యులు హెచ్చరించడంతో అలవాటుకు దూరమయ్యాడు. ఇప్పుడు పొగాకు వ్యతిరేక ప్రచారంలో క్రియాశీలంగా పాల్గొంటున్నాడు. ఆర్థిక రంగానికి ‘పొగ’ పొగాకు వాడకం వల్ల ఆర్థిక రంగంపై కూడా పెనుభారం పడుతోంది. పొగాకు వల్ల తలెత్తే వ్యాధులకు గురైన వారి ఆరోగ్య సేవల కోసం ప్రభుత్వాలు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. మరోవైపు పొగతాగే అలవాటు ఉన్నవారి కారణంగా విలువైన పనిగంటలు వృథా కావడంతో ఉత్పాదకత తగ్గిపోతోంది. * పొగాకు వాడకం వల్ల వాటిల్లే అన్ని రకాల ఖర్చులనూ, నష్టాలను కలుపుకొంటే ప్రపంచ ఆర్థికరంగంపై ఏటా 50 వేల కోట్ల డాలర్ల (రూ.33.69 లక్షల కోట్లు) భారం పడుతోంది. * ఇందులో పొగాకు వాడకం వల్ల తలెత్తే వ్యాధుల చికిత్స కోసం ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చే చాలా ఎక్కువ. ఇది కాకుండా పొగాకు వాడకం వల్ల సంభవిస్తున్న అకాల మరణాల కారణంగా చాలా దేశాలు విలువైన మానవ వనరులను అర్ధంతరంగానే కోల్పోతున్నాయి. * ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవించే అగ్నిప్రమాదాల్లో దాదాపు 10 శాతం ప్రమాదాలకు సిగరెట్లు, బీడీలు వంటి పొగచుట్టలే కారణం. ఈ ప్రమాదాల వల్ల సంభవిస్తున్న నష్టం 2700 కోట్ల డాలర్లు (రూ.1.81 లక్షల కోట్లు) ఉంటుందని ప్రపంచబ్యాంకు అంచనా. - పన్యాల జగన్నాథదాసు పొగ మానేస్తే... లాభాలు నెల తర్వాత: చర్మం కాంతిమంతంగా మారుతుంది. 3 నెలల తర్వాత: ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది ఏడాది తర్వాత: రోజుకు ఒక ప్యాకెట్ చొప్పున వాడే వారికైతే రూ.36,500 మిగులుతాయి. గుండెజబ్బులు వచ్చే అవకాశాలు సగానికి సగం తగ్గిపోతాయి 5-15 ఏళ్ల తర్వాత: పక్షవాతం ముప్పు చాలావరకు తగ్గిపోతుంది. పూర్తిగా పొగతాగని వారితో సమానంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పొగ తాగితే నష్టాలు పొగ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు అర్ధంతరంగానే ఆయువు తీరిపోయేలా చేస్తాయని తెలిసిందే. పొగ తాగడం వల్ల తక్షణ ఆనందం కలిగినా, కాలం గడుస్తున్న కొద్దీ ఈ అలవాటు వల్ల చాలా అనర్థాలు తప్పవు. పొగ తాగడం వల్ల కలిగే అనర్థాలు ఇవీ... 8 గంటల తర్వాత: రక్తంలోని కార్బన్ మోనాక్సైడ్ బయటకు పోతుంది వారం రోజుల తర్వాత: నోటికి రుచులు, ముక్కుకు వాసనలు మరింత మెరుగ్గా తెలుస్తాయి. శరీరంలో పేరుకుపోయిన నికోటిన్ చాలా వరకు బయటకు పోతుంది