స్మోకర్స్.. అతి పెద్ద కోరిక ఏంటో తెలుసా...?
స్మోకింగ్ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది తప్ప, తగ్గే ప్రసక్తే లేదు. ధూమపానంపై ఇప్పటివరకూ ఎన్నో సర్వేలో జరిగాయి. స్మోకింగ్ వల్ల కలిగే దుష్పరిణామాలు, అసలు ఎందుకు స్మోకింగ్ కు గుడ్ బై చెప్పాలో చాలా రకాలుగా సర్వేల ద్వారా వివరించారు. నేడు ప్రపంచ పోగాకు వ్యతిరేక దినోత్సవం. ప్రస్తుతం మహిళలు, పురుషులతో పోటీ పడి మరీ సిగరెట్లు కాలుస్తున్నారు. ఈ అలవాటు పెరుగుతున్న వారిలో మహిళల వృద్ధిరేటే అధికంగా ఉంటుందని కొన్ని సర్వేలలో తేలింది.
ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది, అలా వెళ్లి ఓ సిగరెట్ వెలిగించి నాలుగు పఫ్ లు లాగితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని ధూమపాన ప్రియులు భావిస్తారట. అలాంటి సమయాల్లో అదే అత్యుత్తం అని తోటివారికి చెబుతుంటారు. అంతేకాదు, ఓ అసక్తికర విషయాన్ని స్మోకర్స్ చెప్పడం తరచూ వింటూనే ఉంటాం. వీరిలో చాలా మంది ఈ అలవాటుగా దురలవాటుకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు, ఎంత త్వరగా వీలైతే అప్పుడు హాబిట్ కు గుడ్ బై చెప్పాలని భావిస్తున్న విషయాన్ని చెబుతుంటారు. ఇదే వారికి ఉన్న అతి పెద్ద కోరిక అని వారి సన్నిహితులు, కుటుంబసభ్యులు ఆట పట్టిస్తారు.
భారత్ లో ప్రతిఏటా పోగాకు సంబంధిత కారకాల వల్ల 10 లక్షల మంది చనిపోతున్నారు. పోగాకు వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ మాత్రమే వస్తుందని అనుకుంటారు. నిజానికి ఇది ఎన్నో రకాల క్యాన్సర్ లకు తెరిచిన తలుపుగా ఉంటుందట. పాసివ్ స్మోకింగ్ గురించి అవగాహన లేకపోవడంతో కూడా ఈ అలవాటు మానేసే వారి సంఖ్య తగ్గడం లేదని విశ్లేషకులు చెబుతుండగా, ఇంట్లో భార్య, పిల్లలు లేని సమయాల్లో(బయటి ప్రదేశాల్లో) సిగరెట్ తాగుతున్నాం కదా కొందరు స్మోకర్స్ వాదిస్తుంటారని మరికొందరు చెబుతున్నారు.