బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా ఆరోగ్యాన్ని రక్షించే లక్ష్యంతో హుక్కా ధూమపానంపై నిషేధం విధించింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు గురువారం ఈ మేరకు ప్రకటన జారీ చేశారు.
"ప్రజా ఆరోగ్యం, యువతను రక్షించే ఉద్దేశంతో హుక్కాపై రాష్ట్రవ్యాప్త నిషేధం విధించాం. హుక్కా ధూమపానంతో తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయి. అందుకే సిగరెట్లు,ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (COTPA)ను సవరించాం. హుక్కా ధూమపానాన్ని నిషేధించాలని నిర్ణయించాం." అని ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు.
ప్రభుత్వం హుక్కా బార్‌లపై నిషేధాన్ని యోచిస్తోందని, పొగాకు వినియోగానికి చట్టపరమైన వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఆరోగ్య మంత్రి దినేష్ సెప్టెంబరు 2023లోనే ప్రకటించారు. హుక్కాలో ఉపయోగించే పదార్థాలు వ్యసనానికి దారితీస్తాయని అన్నారు. గతేడాది ఇదే తరహాలో హర్యానా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బార్‌లు, వాణిజ్య సంస్థల్లో వినియోగదారులకు హుక్కా సేవించడంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఇదీ చదవండి: కాశీ, అయోధ్య.. ఇక మథుర: యోగి
Comments
Please login to add a commentAdd a comment