బాధితుడు రాము ,శ్రీకాంత్ వాడిన కత్తి, రక్తపు మరకలు..
కరీమాబాద్ : వరంగల్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో ఆదివారం రాత్రి ఓ యువకుడిపై మరో యువకుడు దాడిచేసి కత్తితో గాయపర్చిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు, మిల్స్‌కాలనీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎస్‌ఆర్‌ఆర్‌తోటలోని సీఆర్‌నగర్‌కు చెందిన సమ్మెట శ్రీకాంత్ ఆదివారం రాత్రి స్థానిక పుట్నాల మిల్లులోని గల్లీలో బతుకమ్మ ఆడుతున్న మహిళల ముందు ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తూ వెళుతున్నాడు. స్థానికులతోపాటు మండల రాము అనే వ్యక్తి అడ్డుకున్నాడు. ర్యాష్‌గా ఎందుకు డ్రైవ్ చేస్తున్నావని శ్రీకాంత్‌ను అడుగగా అతని వద్ద ఉన్న కత్తితో రాము మెడపై ఇష్టమొచ్చినట్లు పొడిచాడు.
గమనించిన స్థానికులు దాడికి పాల్పడిన శ్రీకాంత్‌ను పట్టుకుని కొట్టారు. ఈ క్రమంలో దాడిలో గాయపడిన రాము, దాడికి పాల్పడిన శ్రీకాంత్‌ను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా గతంలో కూడా సమ్మెట శ్రీకాంత్ ఓ వ్యక్తిని కత్తితో మెడపై పొడిచిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. మిల్స్‌కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు.