టోక్యో: 2020 ఒలింపిక్స్ గేమ్స్ వేదిక, జపాన్ రాజధాని నగరం టోక్యోలో కత్తి దాడి ఘటన సంచలనం సృష్టించింది. టోక్యో ప్యాసింజర్ రైలులో ఒక అగంతకుడు(36) అకస్మాత్తుగా కత్తితో మహిళలపై దాడికి తెగబడ్డాడు. దీంతో ఒక యువతి తీవ్రంగా గాయపడగా, మరో పదిమంది గాయపడ్డారు. ప్రధాన స్టేడియానికి సుమారు 15 కిలోమీటర్లు దూరంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సంతోషంగా కనిపించే మహిళలను హత్య చేయాలన్న పథకంతోనే ఈ దాడి చేశానన్న నిందితుడి ప్రకటన కలకలం రేపింది.
జపాన్ మీడియా నివేదిలక ప్రకారం పశ్చిమ ప్రాంతంలో ఓడక్యు లైన్‌లో 36 ఏళ్ల వ్యక్తి సడన్‌గా మహిళలపై కత్తితోఎటాక్ చేశాడు. ఈ ఘటనలో యూనివర్సిటీ విద్యార్థిని తీవ్రంగా గాయ పడింది. ఈమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. సమీపంలోని స్టేషన్‌లో రైలు నిలిపివేసిన అధికారులు తీవ్రంగా గాయపడిన యువతి సహా తొమ్మిది మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మరో వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు. మరోవైపు దాడి చేసిన వ్యక్తిని యూసుకే సుషిమాగా గుర్తించారు. అయితే పోలీసులు విచారణలో నిందితుడు విస్తుపోయే అంశాలను వెల్లడించాడు.
సంతోషంగా కనిపించే మహిళలను చంపాలని ఆరేళ్ల క్రితమే నిర్ణయించుకున్నా.. అలాంటి వారిని చూస్తే తనకు కోపం వస్తుందని, అందుకే ఏ మహిళలైనా సరే, చాలా మందిని ఖతం చేయాలనుకున్నాను అని చెప్పడంతో పోలీసులు సైతం ఖంగుతిన్నారు. అంతేకాదు అనుమానితుడు వంట నూనె, లైటర్‌ని కూడా వెంట తెచ్చుకున్నాడనీ, రైల్లో నిప్పు పెట్టాలని కూడా ప్లాన్ చేశాడంటూ పోలీసులను ఉటంకిస్తూ ఎన్‌హెచ్‌కే నివేదించింది. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు స్థానిక అధికారి నిరాకరించారు.
చదవండి : Women's Hockey: కన్నీరు మున్నీరైన అమ్మాయిలు, అనునయించిన మోదీ
Mirabai Chanu: మరోసారి మనసు దోచుకున్న చాను, ప్రాక్టీస్ షురూ, ఫోటో వైరల్
Comments
Please login to add a commentAdd a comment