
కొత్తపల్లి(కరీంనగర్): ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడిచేసి పరారైన ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి కట్టేమిషన్ ఏరియాలో గురువారం సాయంత్రం కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. కొత్తపల్లి గ్రామానికి చెందిన బొద్దుల సాయి, ఓ యువతి ఎదురెదురు ఇంట్లో ఉంటున్నారు. సాయి ఇసుక క్వారీలో ఉద్యోగం చేస్తుండగా ఎమ్మెస్సీ పూర్తిచేసిన యువతి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతోంది.
ఆమెను నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాంటూ సాయి వేధిస్తున్నాడు. విషయం తెలిసిన పెద్దలు సాయిని మందలించారు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూడా నిర్వహించారు. తర్వాత కొన్నిరోజులు బాగానే ఉన్న సాయి ఇటీవల మళ్లీ ఆ యువతిని వేధించడం ప్రారంభించాడు. పెళ్లి చేసుకుంటానని యువతి తల్లిదండ్రులకు మెసేజ్‌లు పంపాడు.
ఇంట్లోకి చొరబడి..
గురువారం యువతి తండ్రి ఆడెపు వీరేశం బట్ట లు అమ్మేందుకు రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటకు వెళ్లాడు. తల్లి స్థానికంగా కిరాణాదుకాణంలో సరుకులు అమ్ముతోంది. ఇదే సమయంలో సాయి ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న యువతిపై దాడి చేశాడు.
ఈ ఘటనలో యువతి పన్ను విరిగి చేతికి గాయమైంది. అంతటితో ఆగ కుండా కత్తితో గొంతుకోసే ప్రయత్నం చేశాడు. ఆమె కేక లు వేయడంతో చుట్టుపక్కల వారు చేరుకునేసరికి పరారయ్యాడు. వెంటనే స్థానికులు యువతిని చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి పరారైన యువకుడి కోసం గాలిస్తున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment