నిందితుడు ఇంట్లో ఉంచుకున్న కత్తులు, శేషారత్నమ్మ (ఫైల్)
ప్రకాశం, పీసీపల్లి: పొలం వ్యవహారంలో మనస్పర్థలు ఏర్పడి సొంత అన్న, వదినపై తమ్ముడు దాడి చేసిన ఉదంతంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వదిన ఆదివారం కన్నుమూసింది. గ్రామానికి చెందిన పులవర్తి వెంకటేశ్వర్లు తల్లి రమణమ్మకు 12 సెంట్ల పొలం ఉంది. ఆ పొలాన్ని పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు భార్య శేషారత్నమ్మ పేరు మీద రమణమ్మ రాసి ఇచ్చింది. ఇది వెంకటేశ్వర్లు తమ్ముడు తిరుపతయ్యకు నచ్చక అన్న, వదినపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 4వ తేదీ తెల్లవారు జామున అందరూ నిద్రిస్తుండగా తిరుపతయ్య కత్తితో అన్న, వదినపై దాడి చేశాడు.
పథకం ప్రకారమే ఓ చిన్న కత్తి, మరో రెండు పెద్ద కత్తులు చేయించి తిరుపతయ్య ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ కుట్రలో తిరుపతయ్యకు తన , సడ్డుగడు గల్లా నరసింహం సహకరించాడు. గతంలో పొలం విషయంలో తమ్ముడు ఇబ్బందులు పెడుతుంటే వెంకటేశ్వర్లు పీసీపల్లి, కనిగిరి పోలీసులకు మౌఖికంగా తెలిపాడు. సివిల్ విషయాల్లో తాము జోక్యం చేసుకోమని, రాతపూర్వకంగా ఇస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పడంతో కేసు ఎందుకులే అని వెంకటేశ్వర్లు వెనక్కు తగ్గాడు. వెంకటేశ్వర్లు, శేషారత్నమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వెంకట భరత్, బాలాజీ. వీరు చదువు కోసం నరసరావుపేట, కనిగిరిలో ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment