సాక్షి, ప్రకాశం: ఒంటరిగా ఉన్న మహిళల పట్ల కామాంధులు ఆగడాలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి...ఇటీవల ప్రియాంక రెడ్డి (దిశా)పై జరిగిన అమానుష ఘటన మరువక ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల మహిళలపై అఘాయిత్యాల పర్వం ఎక్కువవుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరిలో ఒంటరిగా ఉన్న మహిళపై(విజయలక్ష్మి) కన్నేసిన కిషోర్ అనే యువకుడు ఆమెను అత్యాచారం చేయబోయాడు. ఆ మహిళ గట్టిగా ప్రతిఘటించడంతో, మహిళలపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. మహిళ గొంతుపై కత్తితో గాయం చెయ్యడంతో మహిళ ఒక్కసారిగా షాక్కు గురై పడిపోవడంతో ఆమెను స్థానికులు ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు , మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించారు. ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని చర్చించుకుంటున్నారో, ఆ యువకుడు కిషోర్ అయ్యప్ప మాల ధరించి ఉండటం గమనార్హం..నిందితుడు మానసిక పరిస్థితి బాగోలేదని స్థాయినికులు చెప్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment