alone woman
-
ఒంటరి మహిళపై గుర్తు తెలియని వ్యక్తి దాడి
సాక్షి, ప్రకాశం: ఒంటరిగా ఉన్న మహిళల పట్ల కామాంధులు ఆగడాలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి...ఇటీవల ప్రియాంక రెడ్డి (దిశా)పై జరిగిన అమానుష ఘటన మరువక ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల మహిళలపై అఘాయిత్యాల పర్వం ఎక్కువవుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరిలో ఒంటరిగా ఉన్న మహిళపై(విజయలక్ష్మి) కన్నేసిన కిషోర్ అనే యువకుడు ఆమెను అత్యాచారం చేయబోయాడు. ఆ మహిళ గట్టిగా ప్రతిఘటించడంతో, మహిళలపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. మహిళ గొంతుపై కత్తితో గాయం చెయ్యడంతో మహిళ ఒక్కసారిగా షాక్‌కు గురై పడిపోవడంతో ఆమెను స్థానికులు ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు , మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించారు. ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని చర్చించుకుంటున్నారో, ఆ యువకుడు కిషోర్ అయ్యప్ప మాల ధరించి ఉండటం గమనార్హం..నిందితుడు మానసిక పరిస్థితి బాగోలేదని స్థాయినికులు చెప్తున్నారు -
భర్త వదిలినోళ్లకూ పింఛన్
మంత్రులం చెప్పినా నిబంధనలు మీరొద్దు : మంత్రి ఈటెల హుజూరాబాద్: భర్త వదిలిపెట్టిన మహిళలకు సైతం పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం యోచిస్తోందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. భర్తలు పారిపోవడం వల్లనో... వదిలేయడం వల్లనో పిల్లలతో ఇలాంటి మహిళలు దుర్భర జీవితం గడుపుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరించారు. శనివారం మంత్రి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవుళ్ల పేరిట ఉంటూ వివాహం చేసుకోకుండా ఉన్న జోగినిలకూ పింఛన్లు ఇచ్చే ఆలోచన ఉందన్నారు. దశల వారీగా అర్హులందరికీ పింఛన్లు అందుతాయన్నారు. తెలంగాణలో సామాజిక పింఛన్ల కోసం రూ. 6 వేల కోట్లు కేటాయించామన్నారు. పింఛన్లలో పైరవీలకు ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గ కూడదని, చివరకు మంత్రులు చెప్పినా నిబంధనలు ఉల్లంఘించవద్దని ఆదేశించారు. రేషన్ బియ్యాన్ని 4 కిలోల నుంచి 6 కిలోలకు పెంచామని, కొత్త కార్డులు వచ్చిన తర్వాత ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించారు.