మహిళ శరీరంపై తీవ్రగాయాలు నిందితుడు ఉపయోగించిన కత్తి
ప్రకాశం,ఒంగోలు: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటన బుధవారం స్థానిక గాంధీనగర్ 6వ లైన్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వేటపాలెంకు చెందిన సుమతి అనే మహిళకు ఒంగోలు గాంధీనగర్‌కు చెందిన పాలూరి వెంకట రమణయ్యతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. స్థానిక బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్‌లో టైలర్‌గా జీవనం సాగించే వెంకట రమణయ్య.. కొంతకాలంగా ఆమెను అనుమానించి వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే బుధవారం కత్తితో దాడి చేయడంతో ముఖం, శరీరంపై బలమైన గాయాలయ్యాయి.
ఆమె కేకలు విన్న చుట్టుపక్కల వారు 108కు సమాచారమిచ్చి రిమ్స్‌కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. తాలుకా ఎస్సై ఎన్‌టీ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తన భార్య ప్రవర్తన సరిగా లేదని, ఆమె మరో వ్యక్తితో కలిసి తనను హత్య చేస్తుందనే భయంతోనే తాను ఆమెను హత్యచేయాలని భావించినట్లు తెలపడంతో విస్తుపోవడం పోలీసుల వంతైంది. తాలూకా ఎస్సై ప్రసాద్ కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment