
సాక్షి, అనంతపురం: అనంతపురం పట్టణంలో దారుణం జరిగింది. వివాహితుడితో ప్రేమాయణం నడుపుతున్న ఓ యువతి బరితెగించింది. తన ప్రేమకు అడ్డుగా ఉందనే కారణంతో ప్రియుడి భార్యపై కత్తితో దాడి చేసింది. గర్భిణి అన్న కనికరం లేకుండా కత్తితో పొడిచింది. ఈ ఘటనలో గాయపడిన గర్భిణిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి చేసిన నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు.
రేష్మా అనే యువతి శ్రీనివాస్ అనే వివాహితుడిని ప్రేమిస్తోంది. అయితే, శ్రీనివాస్‌కు ఇదివరకే పెళ్లయింది. అతని భార్య మహేశ్వరి గర్భవతిగా ఉంది. అయితే, తన ప్రేమకు శ్రీనివాస్ భార్య అడ్డుగా ఉందని కక్ష పెంచుకున్న రేష్మా.. మహేశ్వరిపై కత్తితో దాడి చేసింది. దీంతో గాయపడిన మహేశ్వరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో రేష్మాను అరెస్టు చేసి.. పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment