
వేలూరు: క్లాసులు జరుగుతున్న సమయంలో విద్యార్థులు ఇతర తరగతి గదులకు వెళ్లకూడదన్నందుకు ఓ విద్యార్థి సోమవారం ప్రధానోపాధ్యాయుడిని కత్తితో పొడిచాడు. తమిళనాడులోని వేలూరు జిల్లా తిరుపత్తూరు రైల్యేస్టేషన్ రోడ్డులో ఉన్న రామకృష్ణా ప్రభుత్వ పాఠశాలకు బాబు (56) హెడ్‌మాస్టర్‌గా ఉన్నారు. ఇదే పాఠశాలలో తిరుపత్తూరు హౌసింగ్ బోర్డుకు చెందిన హరిహరన్ అనే విద్యార్థి (16) పదకొండో తరగతి చదువుతున్నాడు.
క్లాసులు జరుగుతున్న సమయంలో హరిహరన్ తన క్లాస్‌రూమ్‌లో కాకుండా మరో గదిలో కనిపించడంతో హెచ్‌ఎం మందలించారు. దీంతో హరిహరన్ తన వద్దనున్న కత్తితో హెచ్‌ఎంను కడుపులో పొడిచాడు. రక్తపు మడుగులో పడి కేకలు వేయడంతో స్కూల్ టీచర్లు, విద్యార్థులు హెచ్‌ఎంను తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి, ఆ తర్వాత వేలూరుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న హరిహరన్ కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment