hm
-
అంతర్జాతీయ బ్రాండ్‌తో అజియో.. ఎందుకంటే?
భారతదేశపు ప్రముఖ ఫ్యాషన్ ఇ-టైలర్ 'అజియో' (AJIO) తన ప్లాట్‌ఫారమ్‌కు ఇంటర్నేషనల్ బ్రాండ్ 'హెచ్&ఎమ్'ను జోడిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సహకారం కంపెనీ ఉనికి మరింత బలమైనదిగా చేయడమే కాకుండా.. ప్రజలకు మరింత చేరువకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది.అజియో కంపెనీ.. హెచ్&ఎమ్ సహకారంతో తన అంతర్జాతీయ బ్రాండ్ లైనప్‌ను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. ఇదే సమయంలో కంపెనీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను, ఆన్లైన్ మార్కెట్ వాటాను పెంచుకోవాలని చూస్తోంది. ఈ కంపెనీ మహిళలు, పురుషుల దుస్తులు, కిడ్స్‌వేర్ వంటి వాటిని రూ. 399 ప్రారంభ ధర వద్ద విక్రయిస్తోంది.అజియో, హెచ్ అండ్ ఎమ్ భాగస్వామ్యం గురించి అజియో సీఈఓ వినీత్ నాయర్ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా కంపెనీ అత్యుత్తమ అంతర్జాతీయ బ్రాండ్లను అందించడానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ భాగస్వామ్యంతో మా కస్టమర్లకు సరికొత్త ప్రపంచ బ్రాండ్లను, సరికొత్త ట్రెండ్లను అందించగలమని అన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగులపై ఏఐ ఎఫెక్ట్!.. గ్రేట్ లెర్నింగ్ రిపోర్ట్ఈ సందర్భంగా హెచ్ అండ్ ఎమ్ ఇండియా కంట్రీ సేల్స్ మేనేజర్ 'యానిరా రామిరేజ్' మాట్లాడుతూ.. మా లక్ష్యం ప్రతో ఒక్కరికి మంచి నాణ్యత కలిగిన ఫ్యాషన్‌ని అందించడమే. అజియోతో మా భాగస్వామ్యం ఈ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి, దేశవ్యాప్తంగా మరింత మంది కస్టమర్లను చేరుకోవడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. భారతదేశంలోని మా కస్టమర్లకు గొప్ప ఫ్యాషన్ అనుభవాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. -
హోంమంత్రి ఇంటిపై ఏబీవీపీ కార్యకర్తల దాడి!
శివాజీనగర: దక్షిణ కన్నడ జిల్లాలో బీజేపీ నేత ప్రవీణ్ నెట్టారు హత్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు శనివారం కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర ఇంటిని ముట్టడించారు. శనివారం బెంగళూరులో జ్ఞానేంద్ర ఇంటి ప్రాంగణంలోకి చొరబడి బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నాశనమయ్యాయని, హోం శాఖను నిర్వహించటంలో విఫలమైన మంత్రి.. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. తర్వాత ఆందోళనకు దిగిన వారిపై పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. కొందరిని అరెస్ట్ చేసి 30 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదుచేశారు. ఇదీ చదవండి: కళాశాల విద్యార్థికి ఉగ్రవాదులతో లింక్! -
భవిష్యత్తునిచ్చే విద్యమ్మ!
తల్లి గర్భం దాల్చిన దగ్గర నుంచి బిడ్డ పుట్టేంత వరకు ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. బిడ్డ ఆరోగ్యంగా పుట్టడం కోసం చేయని ప్రయత్నమంటూ ఉండదు. కానీ దురదృష్టవశాత్తూ కొంతమంది.. జన్యులోపాలతో దివ్యాంగ శిశువులు పుడుతుంటారు. చిన్నదైనా పెద్దదైనా లోపం ఉన్నప్పటికీ తమ పిల్లల్ని ప్రేమగానే చూసుకుంటుంటారు తల్లిదండ్రులు. కానీ అన్ని అవయవాలు సరిగా ఉన్న పిల్లలు ప్రయోజకులు కాకపోతే భారంగా అనిపిస్తారు తల్లిదండ్రులకు. అటువంటిది మానసిక శారీరక లోపాలున్న పిల్లలు జీవితాంతం భారమే. ఇక ఆడపిల్లల పరిస్థితి మరింత దారుణం. వీరి కనీస అవసరాలు తీరాలన్నా ఇబ్బందే. అలాగ పేరెంట్స్‌కు భారమైన అమ్మాయిలను తల్లిలా లాలిస్తోంది విద్యఫడ్కే. దివ్యాంగ అమ్మాయిల కోసం ఏకంగా ఒక హోమ్‌ను ఏర్పాటు చేసి ఆత్మీయతానురాగాలను పంచుతోంది విద్య. విద్యా ఫడ్కే నాసిక్‌లోని దివ్యాంగ ప్రత్యేక ప్రత్యేక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తోంది. 32 ఏళ్లుగా దివ్యాంగ బాలబాలికలకు చదువు నేర్పిస్తోన్న విద్య.. తన వృత్తిలో భాగంగా తరచూ ఆయా పిల్లల తల్లిదండ్రులను కలుస్తుండేది. తమ పిల్లల భవిష్యత్‌పై ఆందోళన చెందుతోన్న ఆ తల్లిదండ్రులు... తమ తర్వాత ఈ పిల్లల పరిస్థితి ఏంటి... భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తుండేవారు. వసతి సదుపాయాలే గాక, అమ్మాయిల భద్రత గురించి కూడా వారు దిగులుపడుతుండేవారు. పదేపదే వారి బాధలు విన్న విద్యకు ఆ పిల్లలకోసం ఏదైనా చేయాలనిపించింది. ఈ క్రమంలోనే వారికి చదువుతోపాటు, వివిధ రకాల నైపుణ్యాలు నేర్పించి ఆనందం గా ఉంచే ఒక హోమ్ వంటిది ఉంటే బావుంటుందన్న ఆలోచన వచ్చింది. నలుగురితో... దివ్యాంగ పిల్లలకు మంచి హోం ఉంటే బావుంటుంది కానీ వారు దానిలో ఆనందంగా ఉండగలుగుతారా! అనే అనుమానం వచ్చింది విద్యకు. దీంతో ఓ నలుగురు అమ్మాయిలకోసం ప్రత్యేకంగా క్యాంప్ ఏర్పాటు చేసింది. ఈ క్యాంప్‌లో భాగంగా నలుగురు అమ్మాయిలను నెలరోజులపాటు చూసుకుంది. నెలరోజుల తరువాత వారు ఇంటికి వెళ్లడానికి విముఖత చూపడమేగాక అక్కడే ఉండడానికి ఇష్టపడ్డారు. దీంతో 2016లో కొంతమంది దాతల సాయంతో నాసిక్‌లోని పింపల్గావ్ బాహులలో ‘ఘర్కుల్ పరివార్’ పేరిట హోంను ప్రారంభించింది. దివ్యాంగ అమ్మాయిలు, మహిళల కోసం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొలి హోం అదే కావడంతో మహారాష్ట్ర నలుమూల నుంచి అమ్మాయిలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడ వీరిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఈ హోమ్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మాత్రమే ఇచ్చింది కానీ, ఏవిధమైన నిధులూ మంజూరు చేయలేదు. అయినా, దాతలు ఇచ్చే విరాళాలమీదే విద్య దీనిని నడిపిస్తోంది. యాక్టివ్‌గా ఉంచేందుకు... హోమ్‌లోని పిల్లల్ని మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంచేందుకు మెడిసినల్ వాటర్‌తో స్నానం చేయించడం, ఆరోగ్యవంతమైన అల్ఫాహారం, వివిధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం, వివిధ థెరపీల్లో భాగంగా సింగింగ్, డ్యాన్స్, యోగాలు రోజువారి దినచర్యలో భాగం. ఇవేగాక రోజువారి పనుల్లో అనేక కొత్త విషయాలను కూడా నేర్పిస్తున్నారు. వంటలో సాయం చేయడం, కూరగాయలు తరగడం, చపాతీ పిండి కలపడం వంటి వాటిని చేయిస్తున్నారు. వీరిలో కొంతమంది పెన్నులు తయారు చేయడం, డెకరేషన్ ఐటమ్స్ రూపొందిస్తున్నారు. మసాలా తయారీ, కుట్టు మిషన్, క్యాండిల్స్ తయారీ వంటి వాటిని నేర్పిస్తున్నారు. ఈ హోంలోని అమ్మాయిలంతా కలిసి రోజుకి ఎనిమిదివేల బాల్పెన్స్ను అసెంబుల్చేస్తున్నారు. వీరిలో కొంతమందికి ఎలా బిహేవ్ చేయాలన్న దానిపై కూడా తరచు శిక్షణ ఇచ్చి మంచి çనడవడికను నేర్పిస్తున్నారు. కష్టమైనా... ఇష్టంగానే! ‘‘మానసిక స్థితిగతులు సరిగా లేనివారు ఒక్కసారి చెబితే అర్థం చేసుకోరు. వారికి నేర్పించడానికి ఒకటికి పదిసార్లు చెప్పాల్సి ఉంటుంది. ఇది కష్టమే, కొన్నిసార్లు విసుగు కూడా వస్తుంది. కానీ మనమే విసుక్కుంటే వాళ్లకు తెలియదు. అందువల్ల మా కేర్ గివర్స్ ఎంతో సహనంతో వారికి నేర్పింస్తుంటారు. రెండేళ్ల కరోనా కాలమ్‌లో బాగా కష్టంగా అనిపించింది. కరోనా సమయంలో ఎక్కువమంది అమ్మాయిల ప్రవర్తనకు ఇబ్బందులకు గురై మమ్మల్ని ఆశ్రయించారు. ఆ సమయంలో హోమ్‌లో లేని పిల్లలకు ఆన్లైన్ ద్వారా బోధించాం. సరిగా మాటలు కూడా రాకుండా ఇక్కడకు వచ్చిన అమ్మాయిలు ఇప్పుడు చక్కగా పాటలు పాడడం, డ్యాన్స్ చేయడంతోపాటు పద్యాలు కూడా రాస్తున్నారు. మా సంస్థ తరపున అదితి అనే అమ్మాయి సింగపూర్‌లో జరిగే కాంపిటీషన్లో పాల్గొని బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ అమ్మాయి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండడమేగాక, సంస్థలో ఉన్న మరికొంతమంది అమ్మాయిలకు సింగింగ్, డ్యాన్స్ నేర్పిస్తుంది’ అని విద్యఫడ్కే వివరించారు. -
ఆరుగురు విద్యార్థుల సస్పెన్షన్
నల్లమాడ: శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులను పాఠశాల నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ జిల్లా విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీన పాఠశాలలోని తరగతి గదిలో కొందరు విద్యార్థులు ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మంగళవారం డీఈఓతో పాటు డిప్యూటీ డీఈఓ మీనాక్షి, ఏడీ రామకృష్ణ, ఎంఈఓ వేమనారాయణ పాఠశాలలో విచారణ చేపట్టారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ... ఘటనపై సమగ్ర నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని, తదుపరి ఆదేశాలిచ్చే వరకూ ఆరుగురు విద్యార్థులపై సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపారు. ఇంతకీ ఏం జరిగిందంటే... ? ఏప్రిల్ 30న ఎస్ఏ పరీక్షలు ముగిసిన తర్వాత కొందరు విద్యార్థులు ఓ తరగతిలో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, డెస్క్, వైర్‌కుర్చీ(చైర్) ధ్వంసం చేశారు. ఆ రోజు విధుల్లో ఉన్న ఇన్చార్జ్ హెచ్ఎం శ్యాంప్రసాద్ ఫిర్యాదు మేరకు హెచ్ఎం రమణప్ప మరుసటి రోజు ఘటనకు బాధ్యులైన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. తమ పిల్లలు చేసిన పనికి తాము క్షమాపణలు కోరుతున్నామని, మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా చూసుకోవడంతో పాటు ధ్వంసమైన ఫర్నీచర్ మరమ్మతులకు అయ్చే ఖర్చు తామే భరిస్తామని చెప్పడంతో అప్పట్లో సమస్య సద్దుమణిగింది. తాజాగా ఈ నెల 2న ఇలాంటి సంఘటనే అనంతపురం జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. అయితే అది నల్లమాడ ఉన్నత పాఠశాలలో జరిగినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు హల్చల్ చేశాయి. దీంతో ఏప్రిల్ 30న నల్లమాడ పాఠశాలలో జరిగిన ఘటన మళ్లీ తెరపైకొచ్చింది. ఈ నేపథ్యంలో డీఈఓ పాఠశాలకు విచ్చేసి విచారణ చేపట్టారు. సామగ్రి ధ్వంసం చేసిన విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడారు. విద్యార్థులు తరగతి గదిలోని సామగ్రి ధ్వంసం చేసిన విషయం వాస్తవమేనని తేలడంతో డీఈఓ వారిపై చర్యలకు ఉపక్రమించారు. ఆ విద్యార్థులను సస్పెండ్ చేయాలని హెచ్ఎం రమణప్పకు ఆదేశాలిచ్చారు. (చదవండి: వదినతో గొడవ.. పల్సర్ బైకుకు నిప్పు.. ఆపై పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి..) -
వసతి గృహంలో కీచక్ హెచ్ఎం.. దివ్యాంగులైన బాలికలపై..
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): దివ్యాంగుల వసతి పాఠశాలలో విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న ప్రధానోపాధ్యాయుడిని నెలమంగల తాలూకా దాబస్‌పేట పోలీసులు అరెస్టు చేసారు. దివ్యాంగుల వసతి పాఠశాలలో హెచ్ఎం రంగనాథ్ (35) కోవిడ్ నేపథ్యంలో అందరిని ఊర్లకు పంపి ఏడుగురు విద్యార్థులను మాత్రమే పాఠశాలలో ఉంచుకుని వారిని నిత్యం తన గదిలోకి పిలిపించి లైంగికంగా వేధించేవాడు. ఇంట్లో చెబితే చంపేస్తానని విద్యార్థులను బెదిరించేవాడు. ఈ విషయం రంగనాథ్ తల్లికి తెలిసి ఆమె పాఠశాల పాలక మండలికి ఫిర్యాదు చేసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి: మూడేళ్ల నుంచి లైంగిక వేధింపులు.. కేసు పెట్టిన మారలేదు.. చివరకు.. -
గురువే... పశువై..
పెద్దఅంబర్‌పేట: తల్లిదండ్రుల తర్వాత కంటికిరెప్పలా కాపాడుతూ విద్యాబుద్ధుల్ని నేర్పించాల్సిన గురువే పశువయ్యాడు. చదువుకునేందుకు తన వద్దకు వచ్చిన ఓ విద్యార్థినిపై కన్నేసి గురువు పదానికే కళంకం తెచ్చాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. భార్య సహకారంతో ఓ విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కీచక దంపతుల చెరనుంచి తప్పించుకుని బయటపడిన బాలిక ఈ విషయాన్ని బయటకు చెబితే ఏమవుతుందోనన్న భయంతో రెండేళ్లపాటు మౌనాన్ని ఆశ్రయించింది. ఆతర్వాత జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో చెప్పి వారి సాయంతో పోలీసులను ఆశ్రయించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణా పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్ మండ లం బాటసింగారం గ్రామంలో ఉన్న జానెట్ జార్జి మెమోరియల్ రెసిడెన్షియల్(ప్రైవేట్) పాఠశాలలో కొలవెంటి ప్రసాద్‌రావు(51) ఇన్చార్జి హెచ్ఎంగా, అతని భార్య సారథి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఈ పాఠశాలలో 2017లో 8వ తరగతి చదుతున్న ఓ బాలిక(15)పై హెచ్ఎం ప్రసాద్‌రావు కన్నేశాడు. తరచూ రాత్రి సమయాల్లో బాలిక ఉంటున్న గదికి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించేవాడు.వారానికి ఒకటి, రెండుసార్లు తన గదిలోకి పిలు చుకుని అత్యాచారం చేసేవాడు. దీనికి ప్రసాద్‌రావు భార్య సారథి సహకరిస్తుండేది. దంపతుల మాట వినకపోతే ఇంటి పనులు చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చేవారు. ఈ క్రమంలో హాస్టల్ నుంచి తప్పించుకున్న బాలిక తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. కుటుంబీకులు, బంధువుల సహకారంతో శుక్రవారం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, షీటీం సాయంతో హాస్టల్‌పై దాడి చేసి ప్రసాద్‌రావు దంపతులను అరెస్టు చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా బాధితులు తక్షణమే రాచకొండ పోలీస్ వాట్సాప్ నంబర్: 94906 17111 లేదా 100 నంబర్లను సంప్రదించాలని సీపీ సూచించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ప్రసాద్‌రావుకు ఉరిశిక్ష విధించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. -
మొక్కుబడి సమీక్షలు సరికాదు..!
ఒంగోలు: ఇటీవల నిర్వహించిన సమ్మేటివ్–1 పరీక్షల్లో పదో తరగతి ఫలితాలు అత్యంత దారుణంగా ఉన్న పలు పాఠశాలల హెడ్మాస్టర్ల పనితీరుపై పాఠశాల విద్యగుంటూరు ఆర్జేడీ కె.శ్రీనివాసరెడ్డి ఆగ్రహించారు. స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో హెచ్ఎంలు, ఎంఈవోలు, కేజీబీవీ ప్రత్యేక అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడుసుమల్లి పాఠశాలలో 20 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతుంటే 10 మంది విద్యార్థులు ఫెయిల్ కావడం, అదే వైఆర్ పాఠశాలలో 43 మంది ఉంటే ఆరుగురు మాత్రమే ఉత్తీర్ణత సాధించడం దారుణంగా ఉందంటూ సంబంధిత పాఠశాలల హెడ్మాస్టర్ల పనితీరుపై మండిపడ్డారు. అత్యంత ప్రాధాన్యత గల మీటింగ్‌కు ముందస్తు అనుమతి తీసుకోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సంజాయిషీ నోటీసులు జారీచేయాలని ఆదేశించారు. ఉప విద్యాశాఖ అధికారులు కూడా తనిఖీలు సరిగా చేయడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత పాఠశాలలకు వెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేనిపక్షంలో తాత్కాలికంగా అక్కడకు సిబ్బందిని పంపే అవకాశాన్ని కూడా పరిశీలించాలని డీఈవోను ఆదేశించారు. ప్రస్తుతం దారుణమైన ఫలితాలను చవిచూసిన పాఠశాలలు సమ్మేటివ్–2 అంటే ప్రీ పబ్లిక్ పరీక్షల నాటికి పూర్తిస్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. 80 నుంచి 90 మంది విద్యార్థులున్న పాఠశాలల్లో పదిమంది ఉపాధ్యాయులు ఉండి కూడా విద్యార్థులను తీర్చిదిద్దడంలో విఫలమవుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంటుందన్నారు. రాబోయే రెండు నెలలు ఉపాధ్యాయులు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. తప్పనిసరైతే తప్ప మెడికల్ లీవులు మంజూరు చేయరాదన్నారు. పదో తరగతి ఫలితాల్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణుడవడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా మంజూరు కోరితే వారిని మెడికల్ బోర్డుకు రిఫర్ చేయాలని డీఈఓకు స్పష్టం చేశారు. అంతేగాకుండా పదో తరగతి పరీక్షల సమయంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ప్రభుత్వ ఉపాధ్యాయులు సహకరిస్తున్నారంటూ తమకు అనేక ఫోన్లు వస్తున్నాయని, దీనిద్వారా ప్రైవేటు పాఠశాలల అభివృద్ధికి పరోక్షంగా ప్రభుత్వ ఉపాధ్యాయులే సహకారం అందిస్తున్నట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితులలోను ప్రైవేటు పాఠశాలలకు సహకారమందిస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్ల నియామకం సమయంలో పూర్తిస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని కాంక్షించేవారినే నియమించాలని సూచించారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలలో లెసన్ ప్లానింగ్ లేకపోవడం, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు తమ పరిధిలో పాఠశాలలను విజిట్ చేయకపోవడం వంటివి సరికాదన్నారు. తల్లిదండ్రులు వలసవెళ్లే హాస్టళ్ల నిర్వహణలో ఏమాత్రం లోపం వ్యక్తమైనా అందుకు మండల విద్యాశాఖ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. భయాందోళన చెందిన హెచ్ఎంలు, ఎంఈవోలు... సమీక్షలో ఒకవైపు ఆర్జేడీ ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా సమావేశ మందిరంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా విద్యుత్ బోర్డు తగలబడింది. మెయిన్ ఆపివేసినా బోర్డు తగలబడిపోతూనే ఉండటంతో కొంతమంది ఆ సమీపంలో కూర్చుని ఉన్న హెచ్ఎంలు, ఎంఈఓలు భయాందోళనకు గురయ్యారు. అందరూ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అయితే, ఒక హెచ్ఎం మాత్రం చాకచక్యంగా స్పందించి ప్లాస్టిక్ కుర్చీతో బోర్డు వద్ద మంటలు ఏర్పడిన ప్రదేశంలో పలుమార్లు తాకించడంతో మంటలు ఆరిపోయాయి. వెంటనే విద్యుత్‌శాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని సమస్యను పరిష్కరించారు. సాయంత్రం నిర్వహించిన సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ హాజరై మార్కుల కోసం విద్యార్థులపై మానసిక ఒత్తిడి తేవద్దని సూచించారు. ప్రతి హెచ్ఎం ఒంగోలు బుల్లా వ్యవహరించి సరికొత్త ఆలోచనలతో పాఠశాలను ప్రగతి పథంలోకి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రతి మండలానికి ఒక నోడల్ అధికారి : డీఈఓ సుబ్బారావు జిల్లా విద్యాశాఖ అధికారి వీఎస్ సుబ్బారావు మాట్లాడుతూ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు జిల్లా కలెక్టర్ ప్రతి మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారన్నారు. సమ్మేటివ్–1, 2 పరీక్షలలో పదో తరగతిలో 91–100 శాతం మార్కులు సాధించినవారికి ప్రత్యేక బహుమతులు అందిస్తామన్నారు. వీరిని ప్రకాశం ఆణిముత్యాల పేరుతో పేర్కొన్నారు. 71–90 మధ్య ఉన్న ప్రకాశం వజ్రాలు, 35–70 మధ్య ఉన్నవారిని ప్రకాశం బంగారాలుగాను, 0–34 మధ్య ఉన్న విద్యార్థులను ప్రకాశం ఆశాజ్యోతులుగాను పేర్కొన్నామన్నారు. ఈ క్రమంలో ఆశాజ్యోతులు అందరినీ పాస్ అయ్యేలా తర్ఫీదునివ్వాలన్నారు. సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 11,965 మంది బడిబయట పిల్లలు ఉన్నారని, వారందరినీ బడిలో చేర్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదే విధంగా 18 మండలాల్లో 2,347 మంది విద్యార్థులకు సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందంటూ సర్వశిక్షా అభియాన్‌కు సంబంధించిన అనేక కార్యక్రమాలపై సమీక్షించారు. రుద్రమదేవి సెల్ఫ్‌డిఫెన్స్ అకాడమీ వారు కరాటే పోటీలు నిర్వహించేందుకు వస్తారని, వారికి తప్పకుండా తరగతులు నిర్వహించాలని సూచించారు. -
హెచ్ఎంను కత్తితో పొడిచిన విద్యార్థి
వేలూరు: క్లాసులు జరుగుతున్న సమయంలో విద్యార్థులు ఇతర తరగతి గదులకు వెళ్లకూడదన్నందుకు ఓ విద్యార్థి సోమవారం ప్రధానోపాధ్యాయుడిని కత్తితో పొడిచాడు. తమిళనాడులోని వేలూరు జిల్లా తిరుపత్తూరు రైల్యేస్టేషన్ రోడ్డులో ఉన్న రామకృష్ణా ప్రభుత్వ పాఠశాలకు బాబు (56) హెడ్మాస్టర్గా ఉన్నారు. ఇదే పాఠశాలలో తిరుపత్తూరు హౌసింగ్ బోర్డుకు చెందిన హరిహరన్ అనే విద్యార్థి (16) పదకొండో తరగతి చదువుతున్నాడు. క్లాసులు జరుగుతున్న సమయంలో హరిహరన్ తన క్లాస్‌రూమ్‌లో కాకుండా మరో గదిలో కనిపించడంతో హెచ్ఎం మందలించారు. దీంతో హరిహరన్ తన వద్దనున్న కత్తితో హెచ్ఎంను కడుపులో పొడిచాడు. రక్తపు మడుగులో పడి కేకలు వేయడంతో స్కూల్ టీచర్లు, విద్యార్థులు హెచ్ఎంను తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి, ఆ తర్వాత వేలూరుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న హరిహరన్ కోసం గాలిస్తున్నారు. -
ఆన్ లైన్ యాడ్.. సోషల్ మీడియాలో చిచ్చు
వాషింగ్టన్ : ‘‘కూలెస్ట్ మంకీ ఇన్ ది జంగిల్’’ అంటూ ఓ ఆన్లైన్ కంపెనీ ఇచ్చిన యాడ్ తీవ్ర దుమారం రేపుతోంది. నల్ల జాతీయులను కించపరిచేలా ఉన్న ఆ యాడ్‌పై సదరు కంపెనీ నుంచి క్షమాపణలు డిమాండ్ చేస్తూ నల్లజాతీయుల ఫోరమ్ నిరసన చేపట్టింది. స్వీడిష్ దుస్తుల కంపెనీ ఒకటి బ్రిటన్‌లో తమ అమ్మకాల కోసం ఆన్ లైన్ అమ్మకాల సంస్థ హెచ్ అండ్ ఎమ్తో ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం ఆన్లైన్లో వారు ఓ యాడ్ పోస్టు చేశారు. అందులో ఓ నల్ల జాతికి చెందిన బాలుడి స్వెటర్‌పై మంకీ అంటూ వ్యాఖ్యను పేర్కొంది. పక్కనే శ్వేత జాతికి చెందిన పిల్లాడి ఫోటోను ఉంచి.. అతని స్వెటర్‌పై పులి ఫోటోతో శ్వేత జాతీయులు గొప్పవారు అని అర్థం వచ్చేలా మరో వ్యాఖ్య చేసింది. అంతే సోషల్ మీడియాలో అంతా ఆ కంపెనీ యాడ్‌పై భగ్గుమన్నారు. ఇది జాతి వివక్షతేనన్న విషయం స్పష్టంగా తెలిసిపోతుందంటూ హాలీవుడ్ సెలబ్రిటీలు, పాత్రికేయులు, ఉద్యమకారులు హెచ్అండ్ఎమ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. న్యూ యార్క్ టైమ్స్ కాలమిస్ట్ హెచ్ అండ్ ఎమ్ కి మతి పోయిందటూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మరికొందరు హెచ్ అండ్ ఎమ్‌కు మద్దతుగా పోస్టులు చేయటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న వివాదాలు చోటు చేసుకున్నారు. ఇక నల్ల జాతీయుల ఫోరమ్ వ్యతిరేక ఉద్యమం చేపట్టడంతో ఆ ప్రభావం కారణంగా హెచ్ అండ్ ఎమ్ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. దీంతో ఎట్టకేలకు సదరు దిగ్గజ సంస్థ దిగొచ్చింది. క్షమించండి.. ‘‘ఈ ఫోటో కారణంగా చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయని అర్థమైంది. ఇందుకు మేం పశ్చాత్తాపం తెలియజేస్తూ క్షమించమని కోరుతున్నాం. మా ఛానెల్స్ నుంచి ఈ ఫోటోను తీసేస్తున్నాం’’ అని హెచ్ అండ్ ఎమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, గతంలో డోవ్ సంస్థ కూడా ఓ యాడ్‌తో జాతి వివక్ష విమర్శలు ఎదుర్కొని క్షమాపణలు తెలియజేసింది. -
ఒకే ఒక్కడు!
హెచ్ఎం, డెప్యూటీ డీఈఓ, డీసీఈబీ కార్యదర్శి మూడు పోస్టుల బాధ్యత ఒకరికే – ఏ పోస్టుకూ న్యాయం జరగని వైనం – గాడి తప్పుతున్న డీసీఈబీ అనంతపురం ఎడ్యుకేషన్: పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గతేడాది నుంచి నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అమలు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కామన్ పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి. ఇలాంటప్పుడు జిల్లా సాధారణ పరీక్ష మండలి(డీసీఈబీ) అత్యంత కీలకమయ్యాయి. ప్రశ్నపత్రాల తయారీ మొదలు.. ముద్రణ, అన్ని స్కూళ్లకు పంపిణీ, పరీక్షల నిర్వహణ పూర్తయ్యేదాకా చాలా రహస్యంగా నిర్వహించాల్సి ఉంది. ఈ మొత్తం బాధ్యత డీసీఈబీదే. జిల్లాలో డీసీఈబీ వ్యవస్థ నిర్వీర్యమవుతోంది. రెండేళ్లగా నిర్వహించిన పరీక్షల తీరును పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. విద్యార్థులకు అత్యంత కీలకమైన సంగ్రహణాత్మక మదింపు(సమ్మేటివ్) పరీక్షల ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో బహిరంగంగా అమ్మిన సందర్భాలు ఉన్నాయి. పరీక్షలు ప్రారంభం కాకముందే అన్ని సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు విద్యార్థుల చేతుల్లోకి చేరడం డీసీఈబీ పనితీరుకు అద్దం పడుతోంది. మూడు పోస్టుల్లో ఆయనే.. ప్రస్తుతం జిల్లా సాధారణ పరీక్ష మండలి కార్యదర్శిగా పని చేస్తున్న నాగభూషణం మూడు పోస్టులకు ‘ఒకే ఒక్కడు’గా వ్యవహరిస్తున్నారు. ఈయన లేపాక్షి మండలం చోళసముద్రం జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. పెనుకొండ డిప్యూటీ డీఈఓగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. కీలకమైన మూడు పోస్టులు ఒక్కరికే అప్పజెప్పడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న ఉదయిస్తోంది. డమ్మీగా డీసీఈబీ సభ్యులు డీసీఈబీలో కార్యదర్శితో పాటు మరో 8 మంది సభ్యులు ఉంటారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ ఇలా అన్ని యాజమాన్యాల పాఠశాలల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటారు. పేరుకు మాత్రమే సభ్యులు కానీ.. చాలా మందికి తమ విధులు కూడా తెలియని పరిస్థితి. ఏదో కార్యదర్శి సమాచారం చేరవేస్తే వచ్చి తూతూమంత్రంగా సమావేశంలో పాల్గొని సంతకాలు చేసి వెళ్లిపోతున్నారనే ఆరోపణలు ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే డీసీఈబీ సభ్యులు తమ విధుల గురించి అడగరు.. అధికారులు పనులు పురమాయించరు. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, పంపిణీ, పరీక్షల నిర్వహణలో కీలకంగా వ్యవహరించాల్సిన డీసీఈబీ కార్యదర్శి, సభ్యులు కనీసం ఒక్క పరీక్ష కేంద్రం కూడా తనిఖీ చేసిన దాఖలాల్లేవు. దీనికితోడు కార్యదర్శి నాగభూషణం మూడు పోస్టుల్లో కొనసాగడం వెనుక ఆంతర్యమేమిటని పలువురు ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా ముందుకొస్తే బాధ్యతలు ఒకే వ్యక్తి మూడు పోస్టుల్లో కొనసాగడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అయితే డీసీఈబీ కార్యదర్శి విషయంలో ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. పోనీ ప్రధానోపాధ్యాయుల్లో ఎవరైనా ఔత్సాహికులు ముందుకొస్తే కార్యదర్శి పోస్టులో నియమించే విషయం పరిశీలిస్తాం. - లక్ష్మీనారాయణ, డీఈఓ -
బదిలీలు.. ముప్పుతిప్పలు!
22న హెచ్ఎం, పీడీ, పీఈటీల కౌన్సెలింగ్ – ప్రిఫరెన్షియల్ కేటగిరీపై తాజాగా జీఓ – 40శాతం వైకల్యం ఉంటే ఆ కేటగిరీకి అర్హులు – దరఖాస్తు ప్రక్రియ మొదటికి.. - కౌన్సెలింగ్ మళ్లీ వాయిదా? అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు క్షేత్ర స్థాయి అధికారులతో పాటు ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఉద్యోగులకు బదిలీ సర్వసాధారణం. అయితే ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం చేస్తున్న హడావుడి.. జీఓలు.. మారుతున్న షెడ్యూళ్లు.. రోజుకో సవరణతో బదిలీ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారుతోంది. చివరగా అంటూ.. రెండు రోజుల క్రితం షెడ్యూల్ ఇచ్చిన ప్రభుత్వం తాజాగా గురువారం సాయంత్రం మరో జీఓ ఇచ్చి ఇరకాటంలోకి నెట్టింది. షెడ్యూల్ ప్రకారం శనివారం ప్రధానోపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలకు కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటికీ టీచర్ల ఫిర్యాదులు నివృత్తి చేయని పరిస్థితి. వీటిని పరిశీలించి తుది జాబితా శుక్రవారం ప్రకటించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో మరోసారి జీఓ జారీ చేయడంతో కౌన్సెలింగ్ మళ్లీ వాయిదా పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 40శాతం వైకల్యం ఉంటే ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఇప్పటిదాకా 70 శాతం వికలత్వం ఉంటే ప్రిఫరెన్షియల్ కేటగిరీకి అర్హులు. అయితే తాజాగా ఇచ్చిన 50 జీఓ ప్రకారం 40 శాతం వికలత్వం ఉంటే చాలు ప్రిఫరెన్షియల్ కేటగిరీకి అర్హులవుతారు. జీఓ వచ్చిందో లేదో అప్పుడే పలువురు టీచర్లు గురువారం సాయంత్రం జీఓ, వికలత్వ ధ్రువీకరణ పత్రాలు పట్టుకుని సైన్స్ సెంటర్ చేరుకున్నారు. మళ్లీ మారనున్న సీనియార్టీ జాబితాలు సుమారు రెండు నెలలుగా సాగుతున్న బదిలీల తంతు ప్రాథమిక సీనియార్టీ జాబితాలు ప్రకటించడంతో ఒక కొలిక్కి వచ్చిందని భావించారు. తీరా కౌన్సెలింగ్‌కు ఒక రోజు ముందు ఇచ్చిన జీఓతో సీను మళ్లీ మొదటికొచ్చింది. మళ్లీ దరఖాస్తు, వెరిఫికేషన్, ఎంఈఓలు, హెచ్ఎంలు కన్ఫర్మేషన్, ఆ తర్వాత డీఈఓ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత తాత్కాలిక సీనియార్టీ జాబితాలు తయారు చేయాల్సి ఉంటుంది. ఈ తతంగం జరగాలంటే మరిన్ని రోజులు పడుతుంది. వెంటాడుతున్న సమస్యలు టీచర్ల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కావట్లేదు. బదిలీకి దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులకు వివిధ పాయింట్లపై సందేహాలు వెంటాడుతున్నాయి. ఒకే రకమైన పాయింట్లు కొందరు టీచర్లకు నమోదవుతుండగా.. మరికొందరికి యాడ్ కాని పరిస్థితి. ఒకే స్కూల్లో పని చేస్తున్న టీచర్లకు పాయింట్లలో తేడాలొస్తున్నాయి. బడికి వెళ్లి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు పాయింట్లు, దరఖాస్తు, సర్టిఫికెట్లు అంటూ ఎంఈఓ, హెచ్ఎం, డిప్యూటీ డీఈఓ, డీఈఓ చుట్టూ తిరుగుతున్నారు. అటకెక్కుతున్న చదువులు వేసవి సెలవుల్లో చేపట్టాల్సిన బదిలీలను తీరా పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత చేపట్టడం పట్ల ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. నిజంగా ప్రభుత్వానికి పేద పిల్లల చదువు పట్ల చిత్తశుద్ధి ఉంటే వేసవి సెలవుల్లోనే బదిలీలు చేపట్టేదంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం విద్యార్థుల పాలిట శాపంగా మారిందంటున్నారు. బదిలీల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వాయిదాల పర్వం సాగుతోంది. షెడ్యూలు మీద షెడ్యూలును విడుదల చేస్తూ ప్రభుత్వమే జాప్యం చేస్తోంది. బదిలీల నేపథ్యంలో ఎన్ని పాయింట్లు వస్తాయో.. ఏ స్కూల్ వస్తుందో.. ఆ స్కూల్‌కు రోడ్డు సదుపాయం ఉందో లేదో.. పాయింట్లు పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా.. దూరం స్కూల్ వస్తే కుటుంబ పరిస్థితి ఎలా? అనే అంచనాల్లో ఉపాధ్యాయులు తలమునకలవుతున్నారు. ఫలితంగా పాఠశాలల్లో చదువు అటకెక్కుతోంది. ఆదేశాలు రాలేదు 40 శాతం వికలత్వం ఉన్న వారిని ప్రిఫరెన్షియల్ కేటగిరీలోకి చేర్చుతూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. అయితే వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి తదితర అంశాలపై ఇంకా ఉన్నతాధికారుల నుంచి స్పష్టత లేదు. ప్రస్తుత షెడ్యూల్లో భాగంగా అన్ని కేడర్ల తాత్కాలిక సీనియార్టీ జాబితాలు ప్రకటించాం. వాటిపై అభ్యంతరాలను ఆన్లైన్లో స్వీకరించాం. వాటిని పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు. – పగడాల లక్ష్మీనారాయణ, డీఈఓ -
బదిలీలకు 8286 మంది టీచర్లు దరఖాస్తు
గడువు పెంపుపై సందిగ్ధత అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలో శనివారం రాత్రికి మొత్తం 8,286 మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసున్నారు. వీరిలో 5,812 మంది తప్పనిసరిగా బదిలీలు కావాల్సిన వారున్నారు. మరో 2,474 మంది రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు గడువు పెంపుపై సందిగ్ధత నెలకొంది. శనివారం నాటికే గడువు ముగిసింది.' అయితే పాయింట్లకు సంబంధించి చాలా అంశాల్లో స్పష్టత లేదు. వాటిని కమిషనర్‌కు రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య నెలకొంది. ఈ క్రమంలో కొందరు ఇంకా దరఖాస్తు చేసుకోలేదు. గడువు పెంచే అంశాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈనెల మూడు రోజులు గడువు పెంచారని ప్రచారం సాగుతున్నా...ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు అందలేదు. పాయింట్లకు సంబంధించి ప్రభుత్వం కొన్ని అంశాల్లో స్పష్టత ఇచ్చింది. ఎఫ్ఏసీ హెచ్ఎంలకు పాయింట్లు వర్తిస్తాయి. 8 అకడమిక్ ఇయర్లు పూర్తయింటే స్పౌజ్ కేటగిరీకి దరఖాస్తు చేసుకోవచ్చు. సర్దుబాటు కింద పని చేసిన టీచర్లకు పాయింట్లు వర్తిస్తాయి. ఇంకా చాలా అంశాల్లో స్పష్టత రావాల్సి ఉంది. -
ఒక్కరు ఫెయిలైనా ఇంటికి పంపిస్తా!
– ఎంఈఓ, హెచ్ఎంలకు కలెక్టర్ హెచ్చరిక – జీతాల కోసం పని చేయొద్దని సూచన – ర్యాంకులు తెస్తే టీవీల్లో వేయిస్తానని ప్రకటన అనంతపురం టౌన్ : ‘పిల్లల భవిష్యత్ మీ చేతుల్లో ఉంది. జీతం కోసం కాకుండా బాధ్యతగా పని చేయండి. ఈసారి టెన్త్‌లో ఒక్కరు ఫెయిలైనా ఇంటికి పంపిస్తా’ అని కలెక్టర్ కోన శశిధర్ హెచ్చరించారు. మంగళవారం మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలను హెచ్ఎంలు సవాలుగా తీసుకోవాలన్నారు. పదోతరగతి పాస్ కాకుంటే కనీసం సెక్యూరిటీ గార్డు ఉద్యోగం కూడా రాదన్నారు. జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేసే సమయంలో 20 పోస్టులుంటే పది వేల దరఖాస్తులు వస్తున్నాయన్నారు. స్కిల్ డెవలప్మెంట్కు రూ.కోట్లు ఖర్చు పెడుతున్నామని, సరైన విద్యాబోధన చేయకపోతే ఎలాగని ప్రశ్నించారు. కొందరు టీచర్ల పనితీరు చూస్తే ఎంతో గర్వంగా ఉంటుందన్నారు. వాళ్లే ఇళ్ల వద్దకు వెళ్లి పిల్లలను స్కూల్స్‌కు తెస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఇలా అందరూ ఎందుకు చేయలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రధానోపాధ్యాయులపై ఆగ్రహం : గతేడాది పదో తరగతి ఉత్తీర్ణతలో వెనుకబడిన పాఠశాలల హెచ్ఎంలతో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ములకనూరు స్కూల్లో 26 శాతం ఉత్తీర్ణత రావడాన్ని చూసి హెచ్ఎం వెంకటేశ్వరరావుపై మండిపడ్డారు. రెగ్యులర్ టీచర్లు లేరని, మ్యాథ్స్ టీచర్ లేరని చెప్పడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. కుంటిసాకులు చెప్పొద్దన్నారు. ‘మీలాంటి వాళ్లు గవర్నమెంట్ సర్వీస్‌లో పనికిరారు..టీచర్‌గా జాయిన్ అయ్యి పిల్లల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారు. ఈసారి ఉత్తీర్ణత శాతం పెరగకుంటే చర్యలు తీసుకుంటానని’ హెచ్చరించారు. కల్లూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వేదవతిపైనా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ పర్సంటేజ్ ఏంటిది.. అసలు మీరు స్కూల్‌కు వెళ్తున్నారా? లేదా? అని అసహనం వ్యక్తం చేశారు. ఇద్దరు టీచర్లు ఉండడంతో ఉత్తీర్ణత తగ్గిందని చెప్పడంతో ‘అసలు ఇలాంటి స్కూళ్లు మనకు అవసరమా? మీలాంటి వాళ్ల వల్లే పిల్లలు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్తున్నారు’ అని మండిపడ్డారు. ఇదే పాఠశాలలో మ్యాథ్స్‌లో అందరూ ఫెయిల్ కావడం, ఆ సబ్జెక్ట్ టీచర్ కూడా ప్రధానోపాధ్యాయురాలే కావడంతో మరింత మండిపడ్డారు. ‘నీ సబ్జెక్టుకే దిక్కులేదు. పాస్ గురించి మాట్లాడతావు’ అని అన్నారు. అంతలో ఎంఈఓను పైకిలేపి ‘ఆమెకు ఎగ్జాం పెట్టండి.. అసలు పాస్ అవుతుందో లేదో’ అని సూచించారు. ఇంత దారుణంగా ఫలితాలు ఉంటే ఎలాగని అసహనం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం, కుందుర్పిలోని స్కూళ్లలోనూ ఇదే పరిస్థితి ఉండడంతో వారినీ మందలించారు. ఎంఈఓల పనితీరుపై మండిపాటు : మండల విద్యాశాఖ అధికారుల పనితీరుపైనా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తీర్ణత శాతం తగ్గుతుంటే ఎంఈఓలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ‘నువ్వు నా గురించి చెప్పొద్దు.. నేను నీ గురించి చెప్పను’ అన్న కోణంలో విధులు నిర్వర్తిస్తున్నారని మండిపడ్డారు. అందరూ బయోమెట్రిక్ వేస్తున్నారా? అని ప్రశ్నించారు. దొంగ అటెండెన్స్లతో కాలం వెళ్లదీస్తే ఉపేక్షించేది లేదన్నారు. అన్ని స్కూళ్లలో బయోమెట్రిక్ తప్పనిసరి అని చెప్పారు. ర్యాంకులు తెండి.. టీవీల్లో వేయిస్తా : ఈసారి టెన్త్‌లో మంచి ర్యాంకులు సాధిస్తే కార్పొరేట్ స్కూళ్లు ఇస్తున్న తరహాలో తానే టీవీల్లో యాడ్స్ వేయించి, ఫొటోలు కూడా పెట్టిస్తానని కలెక్టర్ అన్నారు. ‘ఇన్ని స్కూళ్లు.. ఇంత స్టాఫ్ ఉన్నారు.. రిజల్ట్స్ రాకుంటే ఎలా? బెస్ట్ టీచర్లున్నారు. అందరూ బాగా పని చేసి జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాల’ని సూచించారు. జేసీ లక్ష్మీకాంతం మాట్లాడుతూ అందరూ సంకల్పంతో పని చేసి మంచి ఫలితాలు తీసుకురావాలన్నారు. సమీక్షలో జేసీ–2 ఖాజామొహిద్దీన్, డీఈఓ లక్ష్మీనారాయణ, ఎస్ఎస్ఏ పీఓ దశరథరామయ్య తదితరులు పాల్గొన్నారు. -
హెచ్ఎం పోస్టల భర్తీ
కర్నూలు సిటీ: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో పనిచేస్తున్న టీచర్లకు పదోన్నతులు కల్పించి.. ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయ స్థానాలను భర్తీ చేశారు. ఇందుకు శనివారం డీఈఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం 20 ఖాళీలు ఉంటే 19 మంది హాజరయ్యారు. వికలాంగుల కోటా కింద ఒక పోస్టుకు అర్హులు లేరు. దీంతో 19 హెచ్ఎం పోస్టులు భర్తీ చేశారు. అనంతరం పదోన్నతులు పొందిన వారికి నియమాక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థి చేయి విరగొట్టిన హెడ్మాస్టర్
జ్యోతినగర్: ఓ విద్యార్థి తప్పు చేశాడని హెచ్ఎం కొట్టడంతో సదరు విద్యార్థి చేరుు విరిగిన ఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్‌షిప్‌లోని జిల్లా ప్రజాపరిషత్ పాఠశాలలో జరిగింది. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న రాచర్ల సారుుకృష్ణ అమ్మారుులను అల్లరి చేశాడని ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదుచేశారు. ఈ క్రమంలో ప్రధానోపాధ్యాయుడు కొమురయ్య విద్యార్థిని పిలిపించి మందలించాడు. ఈక్రమంలో కర్రతో కొట్టడంతో ప్రమాదవశాత్తు సారుుకృష్ణ చేరుువిరిగింది. విద్యార్థి తల్లిదండ్రులు పేదవాళ్లు కావడంతో చికిత్స చేరుుంచుకోవడానికి డబ్బులు లేక.. ఓ చిన్న వైద్యుడి వద్ద కట్టుకట్టించుకున్నారు. కాగా ప్రధానోపాధ్యాయులు కొమురయ్య వివరణ కోరగా.. ‘సారుుకృష్ణ పాఠశాలలోని అమ్మారుులను అల్లరి చేస్తున్నట్లు ఫిర్యాదు అందింది. దానిలో భాగంగా విద్యార్థిని పిలిచి మందలించాను. చిన్నగా కొట్టిన మాట వాస్తవమే. చికిత్స అవసరం అరుుతే చేరుుస్తాను. కొంతమంది కావాలని నాపై ఆరోపణలు చేరుుస్తున్నారు. వారిపై ఉన్నతాధికారులకు వివరిస్తాను’అని తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
అచ్చంపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అందరు కృషి చేయాలని అభ్యుదయ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రాంచంద్రం, పల్కపల్లి హెచ్ఎం మంతటి నారాయణ కోరారు. గురువారం మండల పరిధిలోని వివిధ పాఠశాలలో విద్యా కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అలాగే పల్కపల్లి యూపీఎస్‌లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నగరపంచాయతీ వైస్ చైర్మన్ బంధం రాజు, కౌన్సిలర్ కటకం జయ రఘురాం, ఉపాధ్యాయులు సోమ సాయిబాబు, శంకరయ్య, కవిత తదితరులు పాల్గొన్నారు. -
పర్వతగిరి జెడ్పీఎస్ఎస్ హెచ్ఎం సస్పెన్షన్
విద్యారణ్యపురి : మహబూబాబాద్ మండలం పర్వతగిరి జెడ్పీఎస్ఎస్ హెచ్ఎం కె.సుభాష్‌ను సస్పెండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆర్జేడి వై.బాలయ్య ఉత్తర్వులు జారీచేశారు. పాఠశాలలో పీఈటి ప్రేమ్‌కుమార్, హెచ్ఎం సుభాష్ నడుమ కొంతకాలంగా వివాదం నడుస్తోంది. దీనిపై మహబూబాబాద్ డివిజన్ డిప్యూటీ డీఈఓ తోట రవీందర్ ఇటీవల విచారణ జరిపి నివేదిక అందజేశారు. ఈ మేరకు హెచ్ఎం సుభాష్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆర్జేడీ ఉత్తర్వులు జారీ చేశారు. నలుగురు ఉపాధ్యాయులకు నోటీసులు భూపాలపల్లి : భూపాలపల్లి మండలంలోని ఇద్దరు హెచ్ఎంలు, ఇద్దరు ఉపాధ్యాయలకు ములుగు డిప్యూటీ ఈఓ సారంగపాణి అ య్యంగార్ గురువారం షోకాజ్ నోటీసులు జా రీ చేశారు. మండలంలోని గొల్లబుద్ధారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, దీక్షకుంట ప్రాథమిక పాఠశాల, పంబాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. డిప్యుటీ ఈవో మధ్యాహ్నం 3.30 గంటలకు పంబాపూర్ పాఠశాలకు చేరుకోగా తాళం వేసి ఉండడంతో ప్రధానోపాధ్యాయుడితో పాటు అక్కడ పనిచేసే ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం దీక్షకుం ట పాఠశాలను తనిఖీ చేయగా అక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు, ఇద్దరు విద్యార్థులే ఉన్నారు. అయితే, రికార్డుల్లో 30 మంది విద్యార్థులు ఉన్నట్లు చూపించడం పట్ల డిప్యూటీ ఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హెచ్ఎం కృష్ణమూర్తికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. మరో ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్‌పై నందిగామకు పంపించాలని ఎంఈఓ దేవానాయక్‌ను డిప్యుటీ ఈవో ఆదేశించారు. -
తప్పు ఒకరిది.. శిక్ష మరొకరికి!
♦ అంధ విద్యార్థికి స్క్రైబ్ ఏర్పాటు చేయడం మరచిన హెచ్ఎం ♦ ఇపుడేం చేయలేమంటూ చేతులెత్తేసిన ఇన్విజిలేటర్లు, పరీక్షల చీఫ్ ♦ నాలుగు పరీక్షల్లో తెల్ల కాగితాలు అప్పగించి వచ్చిన విద్యార్థి ♦ ఐదవ పరీక్షలో సమస్యను గుర్తించిన డిప్యూటీ ఈఓ ♦ స్క్రైబ్‌ను ఏర్పాటు చేసి పరీక్ష రాయించిన వైనం కమలాపురం అర్బన్ : అధికారుల అవగాహనరాహిత్యానికి ఓ అంధ విద్యార్థి పదవ తరగతి తొలి నాలుగు పరీక్షలు రాయలేకపోయిన వైనమిది. వివరాల్లోకి వెళితే.. స్థానిక ఆర్సీఎం పాఠశాలలో జి.మధుకేశవ అనే అంధ విద్యార్థి పదవ తరగతి చదువుతున్నాడు. ఇతను పది పరీక్షలు రాసేందుకు స్క్రైబ్ (సమాధానం చెబితే విని రాసేవాడు) అవసరం ఉంటుందని నామినల్ రోల్స్‌లో పొందు పరచాల్సి ఉన్నప్పటికి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆ విషయాన్ని విస్మరించాడు. పరీక్ష కేంద్రంగా కమలాపురం జెడ్పీ బాలుర పాఠశాల కేటాయించారు. ఈ నెల 21వ తేదీన తొలి రోజు పరీక్షకు హాజరైన ఈ విద్యార్థి.. తనకు చూపు లేదని, పరీక్ష రాసేందుకు సహాయకుడు ఎక్కడున్నాడని అడిగాడు. ఆ విషయం గురించి తమకు సమాచారం లేదని ఎగ్జామినేషన్ చీఫ్, ఇన్విజిలేటర్లు అనుమతించ లేదు. దీంతో ప్రశ్నలకు సమాధానాలు బాగా తె లిసిన ప్పటికీ ఆ విద్యార్థి పరీక్ష రాయలేకపోయాడు. రెండవ, మూడవ, నాలుగవ పరీక్షకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. సమయం ముగిసే వరకు ఖాళీగా కూర్చొని ఏమీ రాయని తెల్లకాగితాన్ని ఇన్విజిలేటర్లకు ఇచ్చి వచ్చాడు. అయినా పట్టు విడవక ఐదవ పరీక్ష.. ఇంగ్లిషు-2కు సోమవారం హాజరయ్యాడు. పరీక్షల పర్యవేక్షణకు వచ్చిన రాయచోటి డిప్యూటి ఈవో రంగారెడ్డి.. ఈ విద్యార్థి ఖాళీగా కూర్చొని ఉండటం చూసి ఏమైందంటూ ఆరా తీశారు. ఈ విద్యార్థి తన సమస్యను చెప్పడంతో వెంటనే స్క్రైబ్‌ను ఏర్పాటు చేయాలని పరీక్షల చీఫ్‌ను ఆదేశించారు. పరీక్ష ప్రారంభమైన గంట తర్వాత జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న టి.మహేశ్ అనే విద్యార్థి సహాయంతో పరీక్ష రాశాడు. పరీక్ష ముగిశాక ఈ విషయం కలకలం రేపింది. అధికారులు విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా స్పందించి సహాయం చేయాలే కాని నియమ నిబంధనలు అంటూ విద్యార్థి జీవితం పాడవుతుంటే చూస్తూ మిన్నకుండిపోవడం క్షమార్హం కాదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విద్యార్థి సమస్యను స్థానిక అధికారులు తొలి రోజే ఉన్నతాధికారులకు తెలియజేసింటే ఈ తప్పిదం చోటుచేసుకుని ఉండేది కాదని డిప్యూటీ ఈఓ రంగారెడ్డి అన్నారు. కాగా, తనకు స్రైబ్ ద్వారా పరీక్ష రాసే అవకాశం కల్పించడంపై మధుకేశవ హర్షం వ్యక్తం చేశాడు. ఆ వెంటనే.. తొలి నాలుగు పరీక్షలు రాసి ఉండింటే బావుండేదని ఆవేదన వ్యక్తం చేశాడు. -
‘డిజిటల్’ చదువులు
► ఉన్నత పాఠశాలల్లో పకడ్బందీగా అమలు చేయాలి ► వీడియో కాన్ఫరెన్స్‌లో హెచ్ఎంలకు డీఈఓ ఆదేశం తెలంగాణలోనే మొదటిసారిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాసుల బోధన సోమవారం జిల్లాలో ప్రారంభమైంది. ప్రైవేట్‌కు తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలతోపాటు విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు డీఈఓ రమేష్ డిజిటల్ క్లాసుల బోధనకు శ్రీకారం చుట్టారు. - తాండూరు తాండూరు: తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో దృశ్యశ్రవణం ద్వారా పాఠ్యాంశాల (డిజిటల్ క్లాసుల) బోధ న జిల్లాలో సోమవారం మొదలైంది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలతోపాటు విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు జిల్లా విద్యాధికారి రమేష్ డిజిటల్ క్లాసుల బోధనకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని ఈనెల 15న ‘సాక్షి’ దినపత్రికలో జిల్లాలో ఇక ‘డిజిట ల్ చదువులు’ శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. రాష్ట్ర మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) నుంచి ఇందుకోసం సుమారు రూ.50 వేల నిధులను కేటాయించారు. ఇందులో భాగంగా వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హైదరాబాద్ నుంచి తెర, ప్రొజెక్టర్, రెండు స్పీకర్లు తదితర సాంకేతిక పరికరాలను కొనుగోలు చేశారు. కొన్ని ఉన్నత పాఠశాలల్లో సోమవారం లాంఛనంగా డిజిటల్ క్లాసులను ప్రధానోపాధ్యాయులు ప్రారంభించారు. డిజిటల్ క్లాసుల అమలుపై డీఈఓ రమేష్ సోమవారం ప్రధానోపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిజిటల్ క్లాసులను ప్రధానోపాధ్యాయులు పక్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. తాండూరులోని ప్రభుత్వ నంబ ర్-1 పాఠశాలలో డిజిటల్ క్లాసులను ప్రధానోపాధ్యాయుడు ప్రారంభించారు. యాలాల బా లుర ఉన్నత పాఠశాలలో ఎంఈఓ ప్రారంభిం చారు. బషీరాబాద్, యాలాల, తాండూరు, పెద్దేముల్ మండలాల పరిధిలోని దామర్‌చెడ్, బెన్నూర్, యాలాల (బాలికల), దేవనూర్, రెడ్డిఘనాపూర్, మంతట్టి, బషీరాబాద్ (ఉర్దూమీడియం), నవల్గ, గోటిగ, జీవన్గీ, పెద్దేముల్ పాఠశాలలకు సాంకేతిక పరికరాలు వచ్చాయి. అందరికీ డిజిటల్ విద్య అవసరం: యాంకర్ సుమ శంషాబాద్: నేటి సమాజంలో అందరికీ డిజి టల్ విద్య అవసరమని యాంకర్ సుమ అ న్నారు. శంషాబాద్ పట్టణంలోని జిల్లా పరి షత్ బాలికల ఉన్నత పాఠశాలకు సోమవా రం సొంత ఖర్చులతో డిజిటల్ విద్యకు సం బంధించిన పరికరాలను ఆమె అందజేశారు. గతంలో పాఠశాలలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న యాంకర్ సుమ పాఠశాల అభివృద్ధికి చేయూతనందించేం దుకు సిద్ధమయ్యారు. ఇటీవలే పాఠశాలకు కొంత మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందజేసిన సుమ తాజాగా డిజిటల్ పరికరాలను అందజేయడంతో పాఠశాల హెచ్ఎం ఉమామహేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మేలు.. డిజిటల్ క్లాసులతో ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు మేలు జరుగుతుంది. దృశ్యశ్రవణబోధనతో విద్యార్థులకు పాఠ్యాంశాలపై అవగాహన పెరుగుతుంది. త ద్వారా విద్యాప్రమాణాలు మెరుగుపడతాయి. - డి.రమేష్, హెచ్ఎం, రెడ్డి ఘనాపూర్, ఉన్నత పాఠశాల -
అవగాహన లోపం.. హెచ్ఎంలకు శాపం
కరీంనగర్ ఎడ్యుకేషన్ : పదో తరగతి పరీక్షలు ప్రధానోపాధ్యాయులకు చుక్కలు చూపుతున్నాయి. ఐసీఆర్ ఫారాలు నింపడ ం, విద్యార్థుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేయడం, ఐసీఆర్, నామినల్‌రోల్స్ అందించడంలో డీఈవో ఇచ్చిన సమయం సూచికలో అనేక సందేహాలు ఉండడం కూడా వారిని కంగారుపెట్టిస్తున్నాయి. ఎస్టీవోలో జమ చేయకుండా ఫారాల సేకరణ ఎలా? డీఈవో ఇచ్చిన సమయసూచిలో విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 12 వరకు ఫీజు చెల్లించాలని ఉంది. ప్రధానోపాధ్యాయులు 13వరకు ఎస్టీవోలో జమ చే యాలని ఉంది. అయితే ఐసీఆర్ ఫారాలు, నా మినల్ రోల్స్ డీఈవో కార్యాలయంలో అందించడానికి ప్రణాళికలు చేయాల్సిన అధికారులు.. రెండురోజుల ముందే (మంగ ళవారం) సిరిసిల్ల, హుజూరాబాద్ డివిజన్ల విద్యార్థుల నామినల్ రోల్స్, ఐసీఆర్ ఫారాలు తీసుకురావాలని హుకూం జారీ చేశారు. దీంతో చాలామంది ప్రధానోపాధ్యాయులు ఆగమాగం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ రెండు డివిజన్ల విద్యార్థులు ఈనెల 13 వరకు ఫీజు కట్టి వస్తే నామినల్ రోల్స్ తీసుకోరా..? అనే సందే హం వారిలో నెలకొంది. ఒకవేళ అలా తీసుకోకుంటే.. అపరాధ రుసుము లేకుండా 13 వరకు అవకాశం ఇచ్చినట్లు ఎలా అవుతుం దని సీనియర్ హెచ్ఎంలు ప్రశ్నిస్తున్నారు. మూసివేసిన పాఠశాలల విద్యార్థుల పరిస్థితి ఏమిటో? పదో తరగతి విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం ఆన్లైన్ చేయడం పుణ్యామా అని ఒకసారి ఫైయిలైన విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఓ ప్రయివేట్ పాఠశాలలో చదివి ఫెయిలైన విద్యార్థి ఈసారి ఫీజు కట్టడానికి పాఠశాలకు వెళ్తే ఆ పాఠశాల మూసి మరో పాఠశాలలో వీలినం చేశారని తెలిసింది. ఇలాంటి పాఠశాలలో ఒకసారి ఫెయిలైన విద్యార్థికి అవకాశం కల్పించడానికి అవసరమైన నిబంధనలను విద్యాశాఖ అందించకపోవడంతో ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా అధికారులను ప్రశ్నిస్తే.. బోర్డు అధికారులను అడిగి చెబుతామంటున్నారని, అయినా సందేహాన్ని మాత్రం తీర్చడం లేదని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. -
పాఠశాలలకు నిధులేవి?
‘‘చాక్‌పీసులు, డస్టర్లు కొనలేకపోతున్నాం. పిల్లలకు అవసరమైన చార్టులు,పుస్తకాలు తెద్దామంటే డబ్బులు లేవు. సమావేశాలకు వచ్చే టీచర్లకు టీ, స్నాక్స్ ఇవ్వలేక పోతున్నాం. మొత్తంగా పాఠశాలల నిర్వహణ ఇబ్బందిగా మారిందని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. పాఠశాలలకు రావాల్సిన గ్రాంట్లను ప్రభుత్వం ఈసారి ఇంతవరకు విడుదల చేయకపోవడమే ఇందుకు కారణం.విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు కావస్తోంది. అయినా గ్రాంట్లు విడుదల కాలే. మరి సర్కారు దయ తలుస్తుందో లేదో వేచిచూడాల్సిందే. - జిల్లాకు రావాల్సినవి రూ.3.05 కోట్లు - చాక్‌పీసులు కొనడమూ కష్టమే! - నిర్వహణ కష్టంగా మారిందంటున్న ప్రధానోపాధ్యాయులు మోర్తాడ్: పాఠశాలల నిర్వహణకు కేటాయించాల్సిన గ్రాంటు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోంది. డబ్బులు రాక నిర్వహణ భారం మోయడం కష్టంగా మారిందని హెచ్ఎంలు వాపోతున్నా రు. విద్యా సంవత్సరం ఆరంభంలోనే పాఠశాలలకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసేది. కాని ఈసారి ఎందుకో ఇంత వరకు నిధులు విడుదల చేయలేదు. ఒక్కో పాఠశాలకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం కేటాయించేది. ఉన్నత పాఠశాలలకు గ్రాంటుతో పాటు మెయింటెనెన్స్ కింద అదనంగా రూ. ఏడు వేలను కేటాయించేవారు. దీంతో పాటు కాంప్లెక్స్ పాఠశాలలుగా ఉన్న ఉన్నత పాఠశాలలకు రూ. 20 వేలను కేటాయించేవారు. జిల్లాలో జిల్లాలో 1,573 ప్రాథమిక పాఠశాలలుగా ఉన్నాయి. రూ.10 వేల చొప్పున గ్రాంటు కింద రూ.1.57 కోట్లు రావాల్సి ఉంది. 265 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటికి రూ.10 వేల చొప్పున రూ. 26.50 లక్షలను కేటాయించాల్సి ఉంది. 461 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు, రూ. 17 వేల చొప్పున రూ. 78.37 లక్షలు రావాల్సి ఉంది. 461 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో 218 పాఠశాలలను కాంప్లెక్స్ పాఠశాలలుగా ఎంపిక చేశారు. కాంప్లెక్స్ పాఠశాలలకు రూ. 20 వేల అదనపు గ్రాంటు రావాలి. రూ. 43.60 లక్షల గ్రాంటును కాంప్లెక్స్ పాఠశాలలకు కేటాయించాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు మొత్తంగా రూ. 3.05 కోట్ల గ్రాంటును ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఇంత వరకు నయాపైసా కేటాయించలేదు. ఇబ్బందులేంటీ ప్రభుత్వం నిధులను కేటాయించకపోవడంతో పాఠశాలల నిర్వహణ ఇబ్బందికరంగా మారిందని హెచ్ఎంలు చెబుతున్నారు. చాక్‌పీస్‌లు, డస్టర్లు, విద్యార్థులకు అవసరమైన చార్ట్‌లు, విజ్ఞానం అందించే పుస్తకాలు, ఇతరత్రా సామగ్రి కొనుగోలు చేయలేక పోతున్నామని తెలిపారు. కాంప్లెక్స్ పాఠశాలల పరిధిలోని ఉపాధ్యాయులకు ప్రతినెలా కాంప్లెక్స్ పాఠశాలలోనే సమావేశాలు నిర్వహిస్తారు. సమావేశానికి హాజరైన ఉపాధ్యాయులకు టీ, స్నాక్స్‌ను అందించాలన్నా ఇబ్బందికరంగా ఉందని కాంప్లెక్స్ పాఠశాలల హెచ్ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి గ్రాంటును మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు. -
ప-పైరవీ... బ-బదిలీ
►స్థాన చలనం కోసం ఉపాధ్యాయుల అడ్డదారులు ► అధికార పార్టీ ఎమ్మెల్యేల అండతో ప్రయత్నాలు ►మంత్రులతో సీఎం పేషీకి సిఫార్సులు కోరుకున్న చోటకు బదిలీ చేయిస్తే నజరానా ► హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు గిరాకీ ► జిల్లా కేంద్రంతో పాటు పట్టణ ప్రాంత పాఠశాలలపై కన్ను గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీ మార్గదర్శకాలను స్వయంగా ప్రభుత్వమే తుంగలో తొక్కితే....నిబంధనలను అమలు పరిచి, బదిలీలు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లకు తలొంచితే...ఏమనాలి.. ఏంచేయాలి.. ప్రస్తుతం జిల్లాలో ఉపాధ్యాయ బదిలీల విషయమై ఈ తరహా పరిస్థితు లే నెలకొన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను దిగువస్థాయి టీచర్లకు ఉద్యోగోన్నతి కల్పించి భర్తీ చేయాల్సి ఉన్నా, అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమ బదిలీలకు తెర తీశారు. ఉపాధ్యాయుల సీనియారిటీ ప్రాతిపదికన వారు కోరుకున్న పాఠశాలకు బదిలీ చేసేందుకు ఏటా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తూ రాజకీయ పలుకుబడి కలిగిన ఉపాధ్యాయులు జిల్లా కేంద్రంతో పాటు పట్టణ ప్రాంతాలకు నేరుగా బదిలీ పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ►రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి బదిలీ అవకాశం కల్పించాలని, ఒకే స్థానంలో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ►ప్రతి ఏటా వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభానికి ముందుగా ఉపాధ్యాయ సాధారణ బదిలీల ప్రక్రియ చేపడుతున్నారు. ►గత ఏడాది నిర్వహించిన బదిలీల అనంతరం తిరిగి ఇప్పటి వరకూ కౌన్సెలింగ్ జరగలేదు. అధికారికంగా బదిలీలు నిర్వహించని సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సు లేఖలతో సీఎం పేషీకి నేరుగా రికమండేషన్ చేయించుకుని బదిలీ పొందిన సంఘటనలు గతంలో ఉన్నాయి. ► సమైక్యాంధ్ర ఉద్యమం, సార్వత్రిక ఎన్నికల కోలాహలం, కొత్త ప్రభుత్వ ఏర్పాటు తదితర కారణాలతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం ఇటీవలే ఎత్తివేసింది. బదిలీకి విశ్వ ప్రయత్నాలు ►ప్రభుత్వం నుంచి నేరుగా బదిలీ పొందేందుకు ఉపాధ్యాయులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రానికి చేరువలోని మండలాలు, పట్టణ ప్రాంతాల్లోని ఖాళీగా ఉన్న పోస్టులకు డిమాండ్ ఏర్పడింది. ►వివిధ ప్రాంతాల్లోని ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల పోస్టులు 53, స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టులు-50, ఎస్జీటీ పోస్టులు 600 వరకూ ఉన్నాయి. ►వాస్తవానికి ఆయా పోస్టులను సీనియారిటీ ప్రాతిపదికన ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతి కల్పించడం ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. అయితే కౌన్సెలింగ్ చేపడితే కీలక స్థానా లు భర్తీ అయ్యే అవకాశమున్న దృష్ట్యా దానికి ముందుగానే సీఎం పేషీ నుంచి నేరుగా బదిలీ పొందడం ద్వారా జిల్లా కేంద్రానికి దగ్గరలోని ప్రాంతాల్లోని పాఠశాలలు వెళ్లవచ్చనే ఆశతో ఉపాధ్యాయులు పైరవీలు చేస్తున్నారు. ►ఎమ్మెల్యేల ద్వారా మంత్రులకు చెప్పించి అక్కడి నుంచి సిఫార్సు లేఖలతో నేరుగా సీఎం పేషీకి వెళ్లేందుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. ►పెదపలకలూరు, ప్రత్తిపాడు, పెదకాకాని తదితర మం డలాల్లోని ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయుల పోస్టులకు పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కోరుకున్న చోట కు బదిలీ చేయిస్తే నజరానా ముట్ట జెప్పేందుకు సైతం ఉపాధ్యాయులు వెనుకాడటం లేదని తెలుస్తోంది. అర్హులైన వారికి అన్యాయం ►నిబంధనలు పక్కనపెట్టి ప్రభుత్వం చేపడుతున్న అక్రమ బదిలీల కారణంగా సంవత్సరాల తరబడి ఒకే స్థానంలో పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. -
శేషాద్రుడి అక్రమాలు ఎన్నో..
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: రాపూరులో హెచ్ఎంగా పనిచేస్తూ సస్పెండ్ అయిన శేషాద్రివాసు పనితీరు పరిశీలిస్తే అన్నీ అక్రమాలే కనిపిస్తున్నాయి. అయినా ఆయన్ను విద్యాశాఖ అధికారులు అందలమెక్కించారు. తనను ప్రశ్నించే వారి విషయంలో చిన్నచిన్న సాకులు చూపి సస్పెండ్ చేశారు. యూటీఎఫ్ నేత పరంధామయ్య సస్పెండ్‌ను వెంటనే రద్దు చేయాలని అపాయింటింగ్ అథారిటీ ఉన్న డీఈఓకు కలెక్టర్ గత నెల 28న ఆర్డర్ వేశారు. అయినప్పటికీ విద్యాశాఖ పట్టించుకోలేదు. శేషాద్రివాసు గురించి మరిన్ని వివరాలు సమాచార హక్కు చట్టం కింద ‘న్యూస్‌లైన్’ మరిన్ని వివరాలు సేకరించింది. కనుపర్తిపాడులో లెక్కలు మాస్టార్‌గా పనిచేస్తున్నప్పుడు ఈ హెచ్ఎం దీర్ఘకాలిక సెలవు పెట్టాడు. రిలీవ్ అయ్యేటప్పుడు, తిరిగి జాయిన్ అయ్యేటప్పుడు అక్కడి హెచ్ఎం ప్రొసీడింగ్స్ ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని ఎస్‌ఆర్‌లో (సర్వీసు రిజిస్టర్లో) నమోదు చేయాలి. కాని అలా జరగలేదు. సెలవులను దేని కింద ట్రీట్ చేశారో చూపకుండా జీతం పొందాడు. ఇదే స్కూల్లో ఉన్నప్పుడు ఓడీ(ఆన్‌డ్యూటీ) కింద పలుమార్లు వెళ్లాడు. కాని ఓడీకి కూడా జాయినింగ్, రిలీవింగ్ సర్టిఫికెట్స్ లేవు. దీర్ఘకాలిక సెలవులు పెట్టినందు వల్ల ఇంక్రిమెంట్ వెనక్కి వెళ్లాలి. కాని ప్రతి సంవత్సరం ఒకే టైమ్‌లో ఇంక్రిమెంట్ ఆగకుండా పొందడం విశేషం. ఎస్‌ఆర్‌లో ఆర్జిత సెలవుల అకౌంట్లో ఈఎల్ లీవులు అధికంగా, లోపల ఎస్ఆర్ ఎంట్రీలు తక్కువగా ఉండటం గమనార్హం, సీఎల్స్‌ను (సెలవులు) ఓడీగా దిద్దుకున్నారు. ఇదే పాఠశాలలో మొదట సీఎల్‌గా ఉన్న వాటిని రిజిస్టర్లో ఓడీగా దిద్దుకున్నారు. ఇలా జరగాలన్నా అక్కడి హెచ్ఎం ఇన్షియల్ ఉండాలి. కాని అలా లేదు. ఉదాహరణకు 2008, ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఇలా దిద్దారు. ఇలా దిద్దిన అనేక ఓడీల రిజిస్టర్లను సమాచార హక్కు చట్టం ద్వారా ‘న్యూస్‌లైన్’ సేకరించింది. కలెక్టర్ బహిరంగ విచారణ చేస్తే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి. రాపూరులో.. : రాపూరులో కూడా రికార్డులను తారు మారు చేశారనే అనుమానంతో రవికుమార్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరారు. ఏడు నెలలైనా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇక్కడ తనకు అనుకూలంగా ఉన్న ఓ టీచర్‌ను వెంకటగిరిలో డిపార్ట్ మెంట్ ఆఫీసర్‌గా నియమించాడు. ఎంతో సీనియారిటీ ఉన్న వారిని కాదని నియమించడంలో ఈ హెచ్ఎం పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. అనంతసాగరంలో ఈ హెచ్ఎం ఎంఈఓగా పని చేస్తూ వేధిస్తుండటంతో ఓ ఉపాధ్యాయడు ఈయన్ను కొట్టాడు. (మధ్యలో ఎంఈఓ నుంచి మళ్లీ హెచ్ఎంగా డిమోట్ అయ్యారు) మచ్చుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. సస్పెన్షన్ విషయమై గూడూరు డిప్యూటీ ఈఓ వెంకటేశ్వరరావును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఆర్జేడీ ఉత్తర్వుల మేరకు హెచ్ఎం సస్పెండ్ అయ్యాడన్నారు. రాపూరుకు ప్రత్యామ్నాయ హెచ్ఎంను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను డీఈఓ కార్యాలయానికి కూడా పంపినట్టు తెలిపారు. అయితే కోర్టు శేషాద్రివాసు సస్పెన్షన్‌ను రద్దు చేసిందని, అందుకే పరీక్షల విధుల్లోకి తీసుకున్నానని డీఈఓ చెప్పడం గమనార్హం. పరంధామయ్య సస్పెన్షన్‌ను రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశం గత నెల 28న కలెక్టర్ యూటీఎఫ్ నేత పరంధామయ్య సస్పెండ్‌ను రద్దు చేయాలని కోరుతూ అపాయింటింగ్ అథారిటీ అయిన డీఈఓకు ఆర్డర్ వేశారు. కాని డీఈఓ లెక్కచేయలేదు. సకాలంలో సిలబస్ పూర్తి చేయలేదనే ప్రధాన ఆరోపణతో పరంధామయ్యను డీఈఓ సస్పెండ్ చేశారు. అంతేకాక సస్పెండ్ చేసిన రోజే ఆగమేఘాలపై కథ నడిచింది. మరి ఆర్జేడీ శేషాద్రివాసును సస్పెండ్ చేసినప్పుడు ఇంతే వేగంగా ఎందుకు ఉత్తర్వులు డీఈఓ కార్యాలయం ఇవ్వలేదో వారికే తెలియాలి. కొంత జాప్యం జరిగినందుకు ఆర్జేడీ పార్వతి గూడూరు డిప్యూటీ ఈఓ వెంకటేశ్వరరావుకు మెమో కూడా ఇచ్చింది. పరంధామయ్య సస్పెండ్‌ను రద్దు చేయాలని కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్‌ను ఏం చేశారని ‘న్యూస్‌లైన్’ డీఈఓ రామలింగాన్ని వివరణ కోరగా ఇదొక్కటే కాదని, ఇలాంటికొంతమందికి సంబంధించిన ఫైళ్లు ఉన్నాయని చెప్పారు. అన్నీ కలెక్టర్ వద్దకు పంపిస్తానని డీఈఓ తెలిపారు.