భారతదేశపు ప్రముఖ ఫ్యాషన్ ఇ-టైలర్ 'అజియో' (AJIO) తన ప్లాట్‌ఫారమ్‌కు ఇంటర్నేషనల్ బ్రాండ్ 'హెచ్&ఎమ్'ను జోడిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సహకారం కంపెనీ ఉనికి మరింత బలమైనదిగా చేయడమే కాకుండా.. ప్రజలకు మరింత చేరువకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది.
అజియో కంపెనీ.. హెచ్&ఎమ్ సహకారంతో తన అంతర్జాతీయ బ్రాండ్ లైనప్‌ను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. ఇదే సమయంలో కంపెనీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను, ఆన్‌లైన్ మార్కెట్ వాటాను పెంచుకోవాలని చూస్తోంది. ఈ కంపెనీ మహిళలు, పురుషుల దుస్తులు, కిడ్స్‌వేర్ వంటి వాటిని రూ. 399 ప్రారంభ ధర వద్ద విక్రయిస్తోంది.
అజియో, హెచ్ అండ్ ఎమ్ భాగస్వామ్యం గురించి అజియో సీఈఓ వినీత్ నాయర్ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా కంపెనీ అత్యుత్తమ అంతర్జాతీయ బ్రాండ్‌లను అందించడానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ భాగస్వామ్యంతో మా కస్టమర్‌లకు సరికొత్త ప్రపంచ బ్రాండ్‌లను, సరికొత్త ట్రెండ్‌లను అందించగలమని అన్నారు.
ఇదీ చదవండి: ఉద్యోగులపై ఏఐ ఎఫెక్ట్!.. గ్రేట్ లెర్నింగ్ రిపోర్ట్
ఈ సందర్భంగా హెచ్ అండ్ ఎమ్ ఇండియా కంట్రీ సేల్స్ మేనేజర్ 'యానిరా రామిరేజ్' మాట్లాడుతూ.. మా లక్ష్యం ప్రతో ఒక్కరికి మంచి నాణ్యత కలిగిన ఫ్యాషన్‌ని అందించడమే. అజియోతో మా భాగస్వామ్యం ఈ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి, దేశవ్యాప్తంగా మరింత మంది కస్టమర్‌లను చేరుకోవడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. భారతదేశంలోని మా కస్టమర్‌లకు గొప్ప ఫ్యాషన్ అనుభవాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment