ప్రముఖ గ్లోబల్ ఎడ్‌టెక్ కంపెనీ గ్రేట్ లెర్నింగ్ ‘అప్‌స్కిల్లింగ్ ట్రెండ్స్ రిపోర్ట్ 2024-25’ మూడవ ఎడిషన్‌ను విడుదల చేసింది. భారతదేశంలోని నిపుణులను ప్రభావితం చేసే కీలక విషయాలను తెలుసుకోవడానికి ప్రధాన రంగాల్లోని 1000 మంది ద్వారా ఈ డేటా సేకరించారు. ఈ నివేదిక లక్ష్యం ఏమిటంటే.. ఉద్యోగులపైన ప్రభావం చూపే విషయాలను తెలుసుకోవడం మాత్రమే కాకుండా.. వ్యక్తులు లేదా వ్యాపారాలకు సహాయం చేయడం.
నివేదిక ప్రకారం.. హైదరాబాద్‌లోని 74 శాతం మందిపై టెక్నాలజీ, ఏఐ వంటివి ప్రభావితం చేస్తున్నాయని తెలిసింది. నగరంలోని 85 శాతం మంది తమ భవిష్యత్తును మెరుగు పరుచుకోవడంలో ఇవి ఎంతగానే ఉపయోగపడుతున్నాయని స్పష్టమైంది. కొంతమంది తమ ఉద్యోగాలపై కూడా నమ్మకాన్ని కోల్పోయారు.
ప్రస్తుత టెక్నాలజీని ఎదుర్కోవడానికి, నైపుణ్యాలను పెంచుకోవడానికి హైదరాబాద్‌లోని 86 శాతం మంది పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారు.గత ఏడాది చాలామంది సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యతనిస్తూ డిజిటల్ మార్కెటింగ్‌ను అనుసరించారు. ఈ ఏడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు అడుగులు వేయడానికి సిద్ధమయ్యారు.
ఇదీ చదవండి: దయచూపని సీఈఓ.. ఎక్స్‌పీరియన్స్ లెటర్ అడిగితే..
ఈ నివేదికపై గ్రేట్ లెర్నింగ్ కో ఫౌండర్ హరి కృష్ణన్ నాయర్ మాట్లాడుతూ.. గత సంవత్సరం నుంచి ఆర్థిక పరిస్థితులు కొంత మందగించాయి. అంతే కాకుండా భౌగోళిక పరిస్థితి కూడా వ్యాపారాలను కొంత దెబ్బతీశాయని అన్నారు. ఈ తరుణంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి టెక్నాలజీని అలవరచుకోవాలి, దానికి అనుగుణంగా సాగిపోవాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment