కరీంనగర్ ఎడ్యుకేషన్ : పదో తరగతి పరీక్షలు ప్రధానోపాధ్యాయులకు చుక్కలు చూపుతున్నాయి. ఐసీఆర్ ఫారాలు నింపడ ం, విద్యార్థుల పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, ఐసీఆర్, నామినల్‌రోల్స్ అందించడంలో డీఈవో ఇచ్చిన సమయం సూచికలో అనేక సందేహాలు ఉండడం కూడా వారిని కంగారుపెట్టిస్తున్నాయి.
ఎస్టీవోలో జమ చేయకుండా ఫారాల సేకరణ ఎలా?
డీఈవో ఇచ్చిన సమయసూచిలో విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 12 వరకు ఫీజు చెల్లించాలని ఉంది. ప్రధానోపాధ్యాయులు 13వరకు ఎస్టీవోలో జమ చే యాలని ఉంది. అయితే ఐసీఆర్ ఫారాలు, నా మినల్ రోల్స్ డీఈవో కార్యాలయంలో అందించడానికి ప్రణాళికలు చేయాల్సిన అధికారులు.. రెండురోజుల ముందే (మంగ ళవారం) సిరిసిల్ల, హుజూరాబాద్ డివిజన్ల విద్యార్థుల నామినల్ రోల్స్, ఐసీఆర్ ఫారాలు తీసుకురావాలని హుకూం జారీ చేశారు.
దీంతో చాలామంది ప్రధానోపాధ్యాయులు ఆగమాగం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ రెండు డివిజన్‌ల విద్యార్థులు ఈనెల 13 వరకు ఫీజు కట్టి వస్తే నామినల్ రోల్స్ తీసుకోరా..? అనే సందే హం వారిలో నెలకొంది. ఒకవేళ అలా తీసుకోకుంటే.. అపరాధ రుసుము లేకుండా 13 వరకు అవకాశం ఇచ్చినట్లు ఎలా అవుతుం దని సీనియర్ హెచ్‌ఎంలు ప్రశ్నిస్తున్నారు.
మూసివేసిన పాఠశాలల విద్యార్థుల పరిస్థితి ఏమిటో?
పదో తరగతి విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం ఆన్‌లైన్ చేయడం పుణ్యామా అని ఒకసారి ఫైయిలైన విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఓ ప్రయివేట్ పాఠశాలలో చదివి ఫెయిలైన విద్యార్థి ఈసారి ఫీజు కట్టడానికి పాఠశాలకు వెళ్తే ఆ పాఠశాల మూసి మరో పాఠశాలలో వీలినం చేశారని తెలిసింది.
ఇలాంటి పాఠశాలలో ఒకసారి ఫెయిలైన విద్యార్థికి అవకాశం కల్పించడానికి అవసరమైన నిబంధనలను విద్యాశాఖ అందించకపోవడంతో ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా అధికారులను ప్రశ్నిస్తే.. బోర్డు అధికారులను అడిగి చెబుతామంటున్నారని, అయినా సందేహాన్ని మాత్రం తీర్చడం లేదని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు.
అవగాహన లోపం.. హెచ్‌ఎంలకు శాపం
Published Thu, Nov 13 2014 3:57 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM
Advertisement