class tests
-
పక్కా ప్రణాళికతో.. ముందుకెళతాం
విద్యార్థి దశలో కీలకమైన పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. సరైన మార్గాన్ని ఎంచుకోవాల్సిన సమయం ఇప్పుడు విద్యార్థుల ముందుంది. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు సాగుతున్నారంటూ పరీక్షలు రాసిన విద్యార్థులను ‘సాక్షి’ పలకరించింది. సమయాన్ని వృథా చేయకుండా పక్కా ప్రణాళికతో ముందుకెలతామని పేర్కొన్నారు. వారి అభి ప్రాయాలు వారి మాటల్లోనే... - భూపాలపల్లి పోలీస్ ఆఫీసర్ అవుతాను చిట్యాలలోని కాకతీయ హైస్కూల్లో టెన్త్ చదివాను. మొదటి నుంచి ప్రణాళిక ప్రకారం చదివాను. పరీక్షలు బాగా రాసాను. ప్రస్తుతం పాల్టెక్నిక్కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నాను. అందులో సీట్ రాకపోతే ఇంటర్, డిగ్రీ పూర్తిచేసి ఎస్సై జాబ్ కొట్టి మంచి పోలీస్ ఆఫీసర్ కావాలని ఉంది. అదే లక్ష్యంతో కష్టపడి సాధిస్తాను. - గౌరిశెట్టి నవీన్, చిట్యాల ఇంజనీర్ అవుతాను చిట్యాల హైస్కూల్లో టెన్త్ చదివాను. 9.8 జేపీఏ పాయింట్లు వస్తాయని నాకు నమ్మకంగా ఉంది. ఇంజనీర్ కావాలని ఉంది. భౌతిక శాస్త్రం అంటే చాలా ఇష్టం. మా అమ్మనాన్నల కలలను నిజం చేస్తాను. కష్టపడి పట్టుదలతో చదివి ఇంజనీర్ నవుతాను. - ముసాపురి రజిత, చిట్యాల సైంటిస్ట్ కావడమే లక్ష్యం పదో తరగతి పరీక్షలు బాగా రాసాను. 9.9 జేపీఏ పాయిం ట్లు వస్తాయని నాకు నమ్మకంగా ఉంది. నాకు సైన్స్ అం టే చాలా ఇష్టం. ప్రయోగాలు చేయాలని ఉంది. మా అమ్మనాన్నల ప్రొత్సాహం ఉంది. నేను పట్టుదలతో చదివి దేశానికి మంచి సైంటిస్ట్‌ను కావాలని ఉంది. అవుతాను. - కత్తెరశాల సుస్రుత్, నవాబుపేట ఫిజికల్ డెరైక్టర్‌గా ఎదగాలనుంది పదో తరగతి పరీక్షలో 9/10 జీపీ సాధిస్తా. పదవ తరగతి పరీక్షల్లో 10/10 జీపీకి ప్రయత్నించినప్పటికీ కొన్ని తప్పిదాల కారణంగా 1 పాయింట్ తగ్గితుందనుకుంటున్నా. ఈ వేసవిలో ఏపీఆర్జేసీలో సీటు సంపాదించేందుకు ప్రిపేరవుతున్నా. ఫిజికల్ డైరక్టర్ కావలనేదే లక్ష్యంగా చదువుతున్నా. - బాసని రక్షితగీత, శాయంపేట డాక్టర్ కావాలనే నా కోరిక చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే కోరిక ఉంది. పదవ తరగతిలో 10/10 ర్యాంకు వస్తుందనే నమ్మకం ఉంది. ఎండాకాలంలో కంప్యూటర్‌పై అవగాహన పెంచుకోవడంతో పాటు చదువుతూ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవడానికి పుస్తకాలను సేకరిస్తున్నాను. - కట్కం సింధూ, రేగొండ -
పదిలం సుమా!
విద్యార్థులకు డీఈవో సూచన నేటి నుంచి పదో తరగతి పరీక్షలు విజయవాడ : జిల్లాలో సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా రాసేందుకు విద్యార్థులు అరగంట ముందే సెంటర్‌కు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారెడ్డి సూచించారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, తొమ్మిది గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తామని తెలిపారు. జిల్లాలో పరీక్షల నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఆయన ఆదివారం సాక్షితో మాట్లాడుతూ పరీక్షల ఏర్పాట్లను వివరించారు. పరీక్షకు అరగంట ఆలస్యంగా అంటే 10 గంటల వరకు వచ్చినా విద్యార్థులను అనుమతిస్తామని, ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. ముందే వచ్చి పరీక్ష ప్రశాంతంగా రాసేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లన్నింటికీ ప్రశ్న పత్రాలు పంపించామని వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ముఖ్యంగా ప్రతి విద్యార్థి బెంచ్‌పైనే కూర్చొని పరీక్ష రాస్తారని చెప్పారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ఫర్నిచర్‌ను పరిశీలించామన్నారు. మంచినీరు, అత్యవసర వైద్య సేవల కోసం మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. -
సర్వం సిద్ధం
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు 5 నిమిషాలకు మించి ఆలస్యమైతే అనుమతి లేదు విద్యారణ్యపురి : పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నారుు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 53,507 మంది రెగ్యులర్ విద్యార్థులు, 298 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. రెగ్యులర్ వారిలో 27,064 మంది బాలురు, 26,443 మంది బాలికలు ఉన్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 254 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 254 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 254 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను, 3 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షలు ఉదయం 9: 30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 వరకు, హిందీ పరీక్ష మాత్రం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటాయని అధికారులు వివరించారు. ఉదయం 8:30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని, నిర్ణీత సమయం దాటిన 5 నిమిషాల వరకు కూడా అనుమతి ఉంటుందని, అంతకంటే ఎక్కువ ఆలస్యంగా వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రంలోకి వెళ్లనిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 9 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. కాపీయింగ్ నిరోధానికి పది సిట్టింగ్ స్క్వాడ్లు, 14 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పరీక్షల సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్‌సెంటర్లను మూసివేస్తారు. హాల్‌టికెట్లు అందనివారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ తెలంగాణ. ఓఆర్జీ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. -
ఏర్పాట్లు పదిలం..!
నేటి నుంచి టెన్త్ పరీక్షలు కేంద్రాల్లో హడావుడిగా ఫర్నిచర్ ఏర్పాటు తొలిరోజు అరగంట ఆలస్యమైనా ఓకే 62,568 మంది విద్యార్థులు.. 268 కేంద్రాలు విశాఖపట్నం/చోడవరం : పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి మొదలవుతున్నాయి. విద్యాశాఖ మంత్రి సొంత జిల్లాలోనే పరీక్ష కేంద్రాల్లో కనీస వసతులు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ విమర్శలు వెల్లువెత్తుతాయోనని అనుకున్నారో ఏమో ఎకాయెకిన అన్ని కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగుపరిచే పనులు చేపట్టారు. మెజార్టీ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో బెంచీలు, తరగతి గదుల్లో ఫ్యాన్లు కూడా లేవు. కొన్నింట విద్యుత్ సదుపాయం లేని దుస్థితి. వీటన్నింటినీ అధిగమించేందుకు ఆదరాబాదరా పడుతున్నారు. సమీపంలో ఉన్న ప్రైవేటు పాఠశాలల నుంచి సీలింగ్ ఫ్యాన్లు, బెంచీలు తెచ్చి ఏర్పాటు చేస్తున్నారు. మునుపటికి భిన్నంగా ఈ ఏడాది విద్యార్థులు నేలపై కూర్చుని పరీక్షలు రాసే బాధలను తప్పించాలని హడావుడి పడుతున్నారు. అన్ని కేంద్రాలకు అధికారులు ఫర్నిచర్ సమకూరుస్తున్నారు. మినరల్ వాటర్ , వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్నాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మొత్తం 62,568 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో 5,813 మంది ప్రైవేటు విద్యార్థులు. పరీక్షలకు 268 సెంటర్లను సిద్ధం చేశారు. సోమవా రం నుంచి ఏప్రిల్ 7 వరకు జరిగే ఈ పరీక్షలకు ఇప్పటికే విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. గత అనుభవాల దృష్ట్యా జిల్లాలో 12 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను గుర్తించారు. కాపీయింగ్ అవకాశం లేకుండా సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. 13 ఫ్లైయింగ్ స్క్వాడ్లు, ఐదు సిటింగ్ స్కాడ్లు, ఏజెన్సీలో రెండు స్ట్రయికింగ్ ఫోర్సులను నియమించారు. మరోవైపు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో జెరాక్స్ సెంటర్ల మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు.మరోవైపు ఆర్టీసీ కూడా దూర ప్రాంతంలో పరీక్షలు రాయడానికి వెళ్లే వారికోసం బస్సులను ఏర్పాటు చేసింది. తొలిరోజు మాత్రం పరీక్ష సమయం మించిపోయాక అరగంట వరకు విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్ష సమయానికి ముప్పావు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రూట్ పాస్‌లుంటేనే ఫ్రీ! సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులను హాల్టిక్కెట్లతో పాటు రూట్పాస్లుంటేనే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా అనుమతిస్తామని ఆర్టీసీ విశాఖ రీజనల్ మేనేజర్ జి.సుధేష్‌కుమార్ స్పష్టం చేశారు. హాల్టిక్కెట్లున్న అందరినీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతి లేదన్నారు. నగరం లేదా జిల్లాలో రూట్ పాస్ తీసుకుంటే ఏ రూట్లోనైనా ప్రయాణించేందుకు వీలు కల్పిస్తామన్నారు. రూట్ పాస్‌తో పాటు హాల్టిక్కెట్టును చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించాలనుకున్న విద్యార్థులు రూ.10 కాంబీ టిక్కెట్ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ సూచనలను గమనించాలని ఆర్ఎం ఒక ప్రకటనలో కోరారు. మరోవైపు విశాఖలో జిల్లాలోని పదో తరగతి పరీక్ష కేంద్రాలకు 15 బస్సులను నడుపుతున్నారు. -ఆర్టీసీ ఆర్ఎం స్పష్టీకరణ కేంద్రాల వద్ద 144 సెక్షన్ టెన్త్ పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 8 నుంచి మధ్నాహ్నం 2 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. వాటికి 200 మీటర్ల దూరంలో నలుగురు ఐదుగురికి మించి గుమిగూడి ఉండకూడదు. సమీపంలో ఉన్న జెరాక్స్ షాపుల మూసివేతకు ఆదేశించాం. విద్యార్థులు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా సంబంధిత పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించాం. పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రక్షక్, బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాలు గస్తీ తిరిగే ఏర్పాట్లు చేశాం. -అమిత్‌గార్గ్, నగర పోలీస్ కమిషనర్. -
పరీక్షకు వేళాయె..
నేటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు మొదటి రోజు 8.15 గంటలకే హాజరుకావాలి మహారాణిపేట (విశాఖపట్నం): రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వ క్వీన్ మేరీ బాలికోన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్షల జిల్లా అబ్జర్వర్ తులసీదాస్‌తో కలిసి ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 262 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకూ జరుగుతాయన్నారు. జిల్లావ్యాప్తంగా 62వేల 661మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా 13 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 29 సిటింగ్ స్క్వాడ్లు పరీక్షా కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తాయని తెలిపారు. విద్యార్థులు యూని ఫాంలో కాకుండా సాధారణ దుస్తుల్లో పరీక్షలకు హాజరుకావాలని చెప్పారు. బస్సు సౌకర్యం ఉ న్న ప్రాంతాల్లో విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి ఉచితంగా రెండు వైపులా ప్రయాణించవచ్చన్నారు. పరీక్షల కోసం నియమించిన ప్రతి ఉద్యోగి తప్పకుండా విధులు హాజరుకావాలని హాజరుకానివారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మరింత మెరుగైన ఫలితాలకు కసరత్తు పదో తరగతి పరీక్షల్లో ఐదేళ్లుగా మెరుగైన ఫలితాలే సాధించినప్పటికీ రాష్ర్ట స్థాయిలో మాత్రం ఆశించిన స్థానం లభించలేదు. గతేడాది ఉమ్మడి రాష్ర్టంలో జరిగిన పరీక్షల్లో 90.86 శాతం ఉత్తీర్ణతతో జిల్లా పదకొండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి జరుగుతున్న పరీక్షలకు ప్రత్యేకత ఉంది. విభజన నేపథ్యంలో 13 జిల్లాలతో కూడిన ఏపీలో తొలిసారి జరుగుతున్న పరీక్షలు కావడంతో జిల్లా ర్యాంకును మెరుగుపర్చుకోవాలని జిల్లా యంత్రాంగం ముమ్మర కసరత్తు చేసింది. పైగా రాష్ర్ట మానవవనరుల (విద్యా) శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ జిల్లాకు చెందిన వారుకావడంతో జిల్లా అధికారులకు ఈ పరీక్షలు నిజంగానే పరీక్షగా మారాయి.హుద్‌హుద్ తుఫాన్ సమయంలో పాఠశాలలు నెల రోజులు మూతపడినప్పటికీ నవంబర్ నుంచి మార్చి వరకు ఆదివారాలు, పండగ, రెండో శనివారాల్లో పనిచేసి సిలబస్‌ను పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తుతో పాటు కేంద్రాల్లో చూసిరాతకు పాల్పడకుండా వీడియో కెమెరాలు, వెబ్‌కెమెరాలు సిద్ధం చేశారు. విద్యార్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లు అందచేశారు. హాల్‌టికెట్లు అందని వారు ‘డబ్యూడబ్యూడబ్యూ. బీఎస్ఈఏపీ.ఓఆర్జీ’ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సంబంధిత పాఠశాల హెచ్ఎం సంతంకం, స్కూల్ స్టాంప్‌తో పరీక్షకు హాజరుకావచ్చు. 144 సెక్షన్ అమలు: ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. సమస్మాత్మక ప్రాంతాల్లో సిటింగ్ స్క్వాడ్లు వేశారు. స్థానిక తహశీల్దార్లు, డిప్యూటీ డీఈఓలు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు కూర్చునేందుకు బెంచీలు, కుర్చీలతో పాటు తాగునీరు ఏర్పాటు చేశారు. మెడికల్ కిట్‌తో సహా ఏఎన్ఎంను నియమిం చారు.పరీక్షలు జరుగుతున్న సమయంలో పరీక్షా కేంద్రం చుట్టుపక్కల జెరాక్స్ కేంద్రాలు మూసివేయాలని ఇప్పటికే విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్స్టేషన్ల ద్వారా ప్రశ్నపత్రాలు : జిల్లాలో మొత్తం 262 పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలను 76 పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. మైదాన ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో, ఏజెన్సీలో కేంద్రాలకు 76 పోలీస్స్టేషన్లు ద్వారా ఏ రోజుకారోజు ప్రశ్నపత్రాలను పోలీస్లే దగ్గరుండి తీసుకొని పరీక్షా కేంద్రాలకు తరలిస్తారు. జిల్లాలో 29 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారు. ఇవి ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతంలోనే ఉన్నాయి. ప్రతి సమస్యాత్మక కేంద్రంలోనూ వెబ్‌కెమెరాలు ఏర్పాటుచేశారు. విద్యార్థులకు సూచనలు: బార్‌కోడింగ్ విధానం అమల్లో ఉండడం వల్ల పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తొలిరోజు గురువారం పరీక్షా కేంద్రాలకు ఉదయం 8-15కే చేరుకోవాలని డీఈవో సూచించారు. మిగతా రోజుల్లో 8-45కు చేరుకోవాలని ఆయన వెల్లడించారు. పెన్నులు, రైటింగ్ప్యాడ్లు, పరీక్షకు అవసరమైన వస్తువులు విద్యార్థులు తెచ్చుకోవాలి. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. కంట్రోల్‌రూం ఏర్పాటు : పదోతరగతి పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా, ఎలాంటి సమస్యలు ఎదురైనా ఎప్పటికప్పుడు తెలియచేసేందుకు జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఎవరైనా 9180330984 నంబరుకు అత్యవసర సమయాల్లో ఫోన్ చేయవచ్చు. ఈ నంబర్ ద్వారా సమాధానం చెప్పేందుకు కంట్రోల్‌రూంలో ఆరుగురుని నియమించారు. -
భయం వీడితే.. జయం మీదే..
పరీక్షల కాలం వచ్చేసింది. మార్చి 9 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు, 25 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో ఎక్కడ చూసినా విద్యార్థులు గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పడుతూ కనిపిస్తున్నారు. అయితే పబ్లిక్ పరీక్షలంటే విద్యార్థుల్లో ఒక రకమైన భయం నెలకొంటుంది. ఎన్ని పరీక్షలు రాసినా ప్రతి పరీక్ష కొత్తగానే అనిపిస్తుంది. పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడికి గురవుతూనే ఉంటారు. దీంతో చదివింది గుర్తుకు రాక, జవాబులు రాయలేక మార్కులు కోల్పోతుంటారు. ఈ సమయంలో భయాన్ని, ఒత్తిడిని అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే వందశాతం ఫలితాలు సాధించడం సులభమేనని నిపుణులు సూచిస్తున్నారు. కచ్చితమైన ప్రణాళిక, నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు వెళితే విజయం తథ్యమని వారు చెబుతున్నారు. -మహబూబ్‌నగర్ విద్యావిభాగం పునశ్చరణ తప్పనిసరి.. ఇప్పుడు విద్యార్థులకు పునశ్చరణ తరగతులు చాలా కీలకం. కొంతమంది పరీక్షలకు ముందు బాగా చదువుతారు. పరీక్ష హాల్లోకి వెళ్లగానే చదివింది మర్చిపోతుంటారు. పరీక్షలే కీలకం కావడంతో చదివినవన్నీ గుర్తుకు తెచ్చుకోవాలి, ఏది మరిచిపోయాం, ఎందుకు మర్చిపోయామో గమనించాలి. ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వస్తాయో ముందుగానే అంచనాకు రావాలి. ఈ మేరకు పరీక్షలకు మానసికంగా సిద్ధం కావాలి. ఒత్తిడి వద్దు.. మార్కులు బాగా రావాలని తల్లిదండ్రులు చేసే ఒత్తిడే విద్యార్థుల చేత తప్పులు చేయిస్తుంది. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇంట్లో మంచి వాతావరణం ఉండాలి. బలవంతంగా తమ అభిప్రాయాలను రుద్దకూడదు. ర్యాంకులు వస్తాయని ఆశించి రాలేదని నిందించొద్దు. అలా చేస్తే వారు మానసిక స్థైర్యంకోల్పోతారు. బాగా మార్కులు వస్తే బహుమతులు కొనిస్తామంటూ ప్రోత్సహించాలి. పరీక్షల షెడ్యూల్ ఇంటర్మీడియట్: మార్చి 9 నుంచి 24 వరకు ఎస్ఎస్సీ: మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వరకు ఆహార అలవాట్లూ ముఖ్యమే.. పరీక్షల సమయంలో ఆహారపు అలవాట్లలోనూ జాగ్రత్తలు పాటించాలి. ఇష్టం వచ్చిన ఆహారం తినడంతో ఆరోగ్య సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. ఆకుకూరలు, పాలు, చేపలు తినాలి. నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. పరీక్షల్లో బాగా రాయాలని, సమయపాలన లేకుండా చదవడం కూడా సరికాదు. నిద్రలేమితో మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ఏకాగ్రత కోల్పోతుంటారు. అందుకే నిద్ర పరిపూర్ణంగా ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉండాలి.. పరీక్ష హాల్లోకి సంపూర్ణ విశ్వాసంతో వెళ్లాలి. భయం, ఒత్తిడితో సమయం వృథా చేయొద్దు. తొలుత ప్రశ్నపత్రాలను పరీక్షించాలి. తెలిసిన ప్రశ్నలన్నింటికీ మందుగా జవాబులు రాయాలి. ఆ తర్వాత సందేహం ఉన్న ప్రశ్నలకు జవాబులు రాస్తే కొంత ఒత్తిడి తగ్గుతుంది. అన్ని సబ్జెక్టులూ ముఖ్యమే... పబ్లిక్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యం ఇవ్వాలి. అన్ని అంశాలపై దృష్టి సారించాలి. రోజూ ఒక్కో సజ్జెక్టుకు నమూనా పరీక్షలు రాయాలి. ఇలా చేయడం ద్వారా చదివినవి ఎంతవరకు గుర్తున్నాయి, ఎన్ని మార్కులు వస్తాయో ఒక అవగాహన కలుగుతుంది. పరీక్షలంటే భయం కూడా పోతుంది. ఇవీ ప్రధానమే.. చదువుకోవడానికి పక్కా టైమ్‌టేబుల్ వేసుకోవడం తప్పనిసరి. ఏ సబ్జెక్టుకు ఎంత టైమ్ కేటాయించాలో ముందుగానే నిర్ధారించుకోవాలి. బలాలు, బలహీనతలను నిజాయితీగా ఒప్పుకుని, బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేయాలి. మాక్ టెస్టులు ఎక్కువగా రాస్తే పరీక్షలపై ఉన్న భయం పోతుంది. లెక్కలు, ఫిజిక్స్ సూత్రాలు, కెమిస్ట్రీలోని ఫార్ములాలు ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఇంగ్లిష్ గ్రామర్‌పై ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలి. రోజుకు ఓ పేరా అయినా ప్రాక్టీస్ చేయాలి. మార్కులపై కాకుండా సబ్జెక్టుపై ప్రధానంగా దృష్టి సారించాలి. పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన సీనియర్ల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలి. పాతప్రశ్నపత్రాల పరిశీలన మూడు, నాలుగేళ్ల క్రితం నాటి ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉంటే వాటిని కూడా చదవాలి. నమూనా ప్రశ్నలుగా పరిగణించుకుని వాటికి జవాబులు రాస్తే కొంత వరకు రాబోయే ప్రశ్నలపై అవగాహన వస్తుంది. పరీక్షలు ఎలా రాస్తున్నామో, ఎన్ని మార్కులు వస్తున్నాయో సొంతంగా పరీక్షించుకోవాలి. పరీక్షలంటే పండుగలాంటివి పరీక్షలంటే పండుగలాంటివి. విద్యార్థి సంవత్సరం అంతా చదివి కష్టపడి చదివితే మార్కులు అనే ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్నే పండుగ అంటారు. పరీక్షలంటే భయం సహజమే, అవసరాన్ని మించిన భయం మంచిది కాదు. భయపడే విద్యార్థులే మంచి మార్కులు సాధిస్తారని నిపుణులు అంటారు. విద్యార్థికి సమయపాలన చాలా ముఖ్యం. ఒకటి నుంచి పది, ఇంటర్ వరకు కొన్ని వందల పరీక్షలు విద్యార్థులు రాసి ఉంటారు. ఈ పరీక్షలు వారికి లెక్కకాదు. రోజులో చురుకుగా ఉన్నప్పుడు అతికష్టమైన సబ్జెక్టు చదవాలి. చాలా అలసిపోయినప్పుడు అతి సులభమైన సబ్జెక్టును చదవాలి. పరీక్షహాలుకు కనీసం అరగంట ముందు వెళ్లాలి. ప్రశ్నాపత్రాన్ని తీసుకున్నాక ఒకసారి ప్రశ్నలను మొత్తాన్ని చదవాలి. ప్రశ్నాపత్రాన్ని తీసుకున్న తరువాత భయం అనిపిస్తే గ ది పైకప్పు వైపు చూసి గట్టిగా రెండుమూడు సార్లు శ్వాస పీల్చుకొని వదలాలి. దీనివల్ల రక్త ప్రసరణ అదుపులోకి వస్తుంది. పూర్తి సమయం పరీక్ష హాల్లో గడిపిన తరువాతనే బయటికి రావాలి. ఆతరువాత వెంటనే ఇంటికి వెళ్లాలి కానీ జరిగిన పరీక్ష గురించి చర్చలు చేయవద్దు. పరీక్షలు పూర్తయ్యే వరకు మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది. ఎక్కువగా మజ్జిగ వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలి. - డాక్టర్ శ్రీనాథాచారి, ప్రముఖ సైకాలజిస్టు మానసిక ఆందోళనకు గురి కావద్దు... విద్యార్థి మానసిక ఆందోళనకు గురి కావద్దు. నిద్ర మానుకుని ఎక్కువగా చదవొద్దు. 6గంటలు కచ్చితంగా నిద్రపోవాలి. అప్పుడే చదువుకున్నవి గుర్తుంటాయి. త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. మసాల, జంక్ఫుడ్స్, బయటి ఆహారం తీసుకోరాదు. చదివిన దానిని మాత్రమే రివిజన్ చేసుకోవాలి. మానసిక, శారీరక సమతుల్యం పాటించాలి. ఆయిల్ ఫుడ్స్, మసాలలకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లో తీసుకున్న ఆహారాన్నే తీసుకోవాలి. పాలు, గుడ్డువంటివి తీసుకోవడం మంచిది. ప్రతిరోజు వ్యాయామం, మెడిటేషన్ చేయాలి. - పీఎస్ రెడ్డి, ఫిజిషియన్, ఛాతి వైద్య నిపుణుడు టెన్షన్ పడవద్దు విద్యార్థులు పరీక్షల ముందు టెన్షన్ పడవద్దు. ఉత్తమ ఫలితాలు సాధిం చేందుకు 60రోజుల క్రాష్ ప్రోగ్రాం ద్వా రా విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేశాం. ముఖ్యమైన ప్రశ్నల కు సంబంధించి మోడల్పేపర్లు తయారు చేసి ఇచ్చాం. పరీక్షలు దగ్గరలో ఉన్నా యి కాబట్టి చదవని వాటికి దూరంగా ఉండి చదివిన వాటిని రివైజ్ చేసుకోవాలి. సరైన ఆహారం తీసుకొని విద్యార్థులు ప్రశాం తంగా చదువుకోవాలి. - డీఎస్‌హెచ్ విజయలక్ష్మి, ఇన్చార్జి ఆర్ఐఓ, డీవీఈఓ గ్రూప్ చర్చలు ఉపయోగకరం.. విద్యార్థులు ఆందోళన పడకుండా చదివిన వాటిని రివిజన్ చేసుకోవడంతో పాటు, గ్రూపు చర్చలు ఫలితాన్ని ఇస్తాయి. అన్నిచోట్ల సిలబస్ అయిపోయింది. నేర్చుకున్న అంశాన్నే మళ్లీ నేర్చుకోవాలి. నెగెటివ్ థింకింగ్‌ను వీడాలి. పుస్తకంపై కమాండ్ పెంచుకోవాలి. అనవసరమైన భయాన్ని వీడాలి. ఎలాగైన రాయగలమనే కాన్ఫిడెన్స్‌ను పెంచుకోవాలి. ప్రశ్నాపత్రాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అన్ని ప్రశ్నలను రాసేందుకు ప్రయత్నించాలి. టైంటేబుల్ ప్రకారం చదవాలి. టీవీకి దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులకు పరీక్షలపై భయాన్ని పోగొట్టేందుకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించాం. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నాం. -నాంపల్లి రాజేష్, డీఈఓ -
అయోమయంలో టెన్త్ విద్యార్థులు
కొత్త పాఠాలు.. పాత విధానంలో పరీక్షలు ఇప్పటికీ పూర్తికాని పాఠ్యప్రణాళిక మార్చి 26 నుంచి పది పరీక్షలు యలమంచిలి: విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే పదో తరగతి పరీక్షలు మార్చి 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంకా65 రోజులు మాత్రమే ఉంది. వీటిలో ఆదివారాలు, సెలవు దినాలు మినహాయిస్తే మిగిలింది రెండు నెలల్లోపే. ఈ వ్యవధిలోనే విద్యార్థులకు పునశ్చరణ తరగతలు నిర్వహించాలి. ప్రభుత్వం పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు గంటల్లో విద్యార్థులను ఉపాధ్యాయులు చదివిస్తున్నారు. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త పాఠ్య పుస్తకాలు రావడం, ఆ పుస్తకాలు ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం’లో ఉండటం, ఈ పుస్తకాలపై ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించకపోవడం, సకాలంలో పాఠ్య ప్రణాళికల బోధన పూర్తికాకపోవడం వంటి అంశాలు పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి. కానరాని శిక్షణ తరగతులు... జిల్లా వ్యాప్తంగా పదో తరగతిలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 55వేల మందికి పైగా విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారు 35వేలకు పైగా ఉన్నారు. విద్యార్థుల సిలబస్ నిరంతర మూల్యాంకనంలో ఉంది. అయితే సమస్యల్లా ఇక్కడే ఉంది. మారిన పుస్తకాలకు అనుగుణంగా కాకుండా పాత పద్ధతిలో పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నూతన పాఠ్య విధానంపై ఉపాధ్యాయులకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, జూన్ నెలలో ఒక రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తర్వాత విస్మరించారు. గత పరీక్షలు మాదిరిగా కాకుండా నేటి పరీక్ష విద్యార్థి సామర్ధ్యంపై ఆధారపడి ఉంటుంది. అసలే మారిన పాఠ్యాంశాలు, ఆపై పరీక్షల నిర్వహణలో సరికొత్త విధానాలు వెరసి అయోమయంలోనే అగ్ని పరీక్షకు టెన్త్ విద్యార్థులు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తికాని సిలబస్..? జిల్లాలో పలు పాఠశాలల్లో పదో తరగతి సిలబస్ ఇప్పటికీ పూర్తి కాలేదు. సాధారణంగా డిసెంబరు నాటికి పూర్తి చేసి జనవరి నుంచి పూర్తి స్థాయిలో పునఃశ్ఛరణ తరగతులు నిర్వహించాల్సి ఉంది. పలు పాఠశాలల్లో 90 శాతం సిలబస్ మాత్రమే పూర్తి చేశారు. గత ఏడాది అక్టోబర్ 12న హుదూద్ తుఫాన్ ప్రభావంతో దాదాపు 10 రోజుల వరకు పాఠశాలల్లో విద్యాబోధన జరగలేదు. జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డును రద్దు చేయడంతో ప్రశ్నపత్రాల తయారీలో అయోమయం నెలకొంది. పాఠశాల, క్లస్టర్ స్థాయిలో తయారు చేసిన ప్రశ్నపత్రాలతోనే త్రైమాసిక, అర్ధసంవత్సర పరీక్షలు నిర్వహించారు. చాలా పాఠశాలల్లో సిలబస్‌ను మొక్కుబడిగా పూర్తయిందనిపించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. సిలబస్ పూర్తి చేయడం, అవగొట్టడం మధ్య చాలా వ్యత్యాసమే ఉందని విద్యానిపుణులు పేర్కొంటున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకశ్రద్ధ ఏదీ..? గత విద్యా సంవత్సరాల్లో పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. వీరికి నిష్ణాతులైన ఉపాధ్యాయులచే స్టడీ మెటీరియల్‌ను అందించి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడానికి కృషి జరుగుతుండేది. ఉత్తమ గ్రేడులు సాధించడానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేవారు. తద్వార పాఠ్యాంశంలోనే విషయాలవారీగా వెనుకబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకుని వారిపై శ్రద్ధ చూపుతూ బాగా చదివే వారికి తగిన తర్ఫీదునిచ్చేవారు. దీంతో జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉత్తీర్ణత స్థానంలో పురోగతి సాధించింది. ఈ ఏడాది వీటన్నింటికీ గుడ్‌బై చెప్పారని సమాచారం. -
అవగాహన లోపం.. హెచ్ఎంలకు శాపం
కరీంనగర్ ఎడ్యుకేషన్ : పదో తరగతి పరీక్షలు ప్రధానోపాధ్యాయులకు చుక్కలు చూపుతున్నాయి. ఐసీఆర్ ఫారాలు నింపడ ం, విద్యార్థుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేయడం, ఐసీఆర్, నామినల్‌రోల్స్ అందించడంలో డీఈవో ఇచ్చిన సమయం సూచికలో అనేక సందేహాలు ఉండడం కూడా వారిని కంగారుపెట్టిస్తున్నాయి. ఎస్టీవోలో జమ చేయకుండా ఫారాల సేకరణ ఎలా? డీఈవో ఇచ్చిన సమయసూచిలో విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 12 వరకు ఫీజు చెల్లించాలని ఉంది. ప్రధానోపాధ్యాయులు 13వరకు ఎస్టీవోలో జమ చే యాలని ఉంది. అయితే ఐసీఆర్ ఫారాలు, నా మినల్ రోల్స్ డీఈవో కార్యాలయంలో అందించడానికి ప్రణాళికలు చేయాల్సిన అధికారులు.. రెండురోజుల ముందే (మంగ ళవారం) సిరిసిల్ల, హుజూరాబాద్ డివిజన్ల విద్యార్థుల నామినల్ రోల్స్, ఐసీఆర్ ఫారాలు తీసుకురావాలని హుకూం జారీ చేశారు. దీంతో చాలామంది ప్రధానోపాధ్యాయులు ఆగమాగం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ రెండు డివిజన్ల విద్యార్థులు ఈనెల 13 వరకు ఫీజు కట్టి వస్తే నామినల్ రోల్స్ తీసుకోరా..? అనే సందే హం వారిలో నెలకొంది. ఒకవేళ అలా తీసుకోకుంటే.. అపరాధ రుసుము లేకుండా 13 వరకు అవకాశం ఇచ్చినట్లు ఎలా అవుతుం దని సీనియర్ హెచ్ఎంలు ప్రశ్నిస్తున్నారు. మూసివేసిన పాఠశాలల విద్యార్థుల పరిస్థితి ఏమిటో? పదో తరగతి విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం ఆన్లైన్ చేయడం పుణ్యామా అని ఒకసారి ఫైయిలైన విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఓ ప్రయివేట్ పాఠశాలలో చదివి ఫెయిలైన విద్యార్థి ఈసారి ఫీజు కట్టడానికి పాఠశాలకు వెళ్తే ఆ పాఠశాల మూసి మరో పాఠశాలలో వీలినం చేశారని తెలిసింది. ఇలాంటి పాఠశాలలో ఒకసారి ఫెయిలైన విద్యార్థికి అవకాశం కల్పించడానికి అవసరమైన నిబంధనలను విద్యాశాఖ అందించకపోవడంతో ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా అధికారులను ప్రశ్నిస్తే.. బోర్డు అధికారులను అడిగి చెబుతామంటున్నారని, అయినా సందేహాన్ని మాత్రం తీర్చడం లేదని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు.