నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
5 నిమిషాలకు మించి ఆలస్యమైతే అనుమతి లేదు
విద్యారణ్యపురి : పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నారుు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 53,507 మంది రెగ్యులర్ విద్యార్థులు, 298 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. రెగ్యులర్ వారిలో 27,064 మంది బాలురు, 26,443 మంది బాలికలు ఉన్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 254 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 254 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 254 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను, 3 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించారు.
పరీక్షలు ఉదయం 9: 30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 వరకు, హిందీ పరీక్ష మాత్రం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటాయని అధికారులు వివరించారు. ఉదయం 8:30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని, నిర్ణీత సమయం దాటిన 5 నిమిషాల వరకు కూడా అనుమతి ఉంటుందని, అంతకంటే ఎక్కువ ఆలస్యంగా వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రంలోకి వెళ్లనిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 9 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. కాపీయింగ్ నిరోధానికి పది సిట్టింగ్ స్క్వాడ్‌లు, 14 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పరీక్షల సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్‌సెంటర్లను మూసివేస్తారు. హాల్‌టికెట్లు అందనివారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ తెలంగాణ. ఓఆర్‌జీ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది.
సర్వం సిద్ధం
Published Mon, Mar 21 2016 3:15 AM | Last Updated on Sun, Sep 3 2017 8:12 PM
Advertisement