విద్యార్థి దశలో కీలకమైన పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. సరైన మార్గాన్ని ఎంచుకోవాల్సిన సమయం ఇప్పుడు విద్యార్థుల ముందుంది. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు సాగుతున్నారంటూ పరీక్షలు రాసిన విద్యార్థులను ‘సాక్షి’ పలకరించింది. సమయాన్ని వృథా చేయకుండా పక్కా ప్రణాళికతో ముందుకెలతామని పేర్కొన్నారు. వారి అభి ప్రాయాలు వారి మాటల్లోనే... - భూపాలపల్లి
పోలీస్ ఆఫీసర్ అవుతాను
చిట్యాలలోని కాకతీయ హైస్కూల్‌లో టెన్త్ చదివాను. మొదటి నుంచి ప్రణాళిక ప్రకారం చదివాను. పరీక్షలు బాగా రాసాను. ప్రస్తుతం పాల్‌టెక్నిక్‌కు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నాను. అందులో సీట్ రాకపోతే ఇంటర్, డిగ్రీ పూర్తిచేసి ఎస్సై జాబ్ కొట్టి మంచి పోలీస్ ఆఫీసర్ కావాలని ఉంది. అదే లక్ష్యంతో కష్టపడి సాధిస్తాను. - గౌరిశెట్టి నవీన్, చిట్యాల
ఇంజనీర్ అవుతాను
చిట్యాల హైస్కూల్‌లో టెన్త్ చదివాను. 9.8 జేపీఏ పాయింట్లు వస్తాయని నాకు నమ్మకంగా ఉంది. ఇంజనీర్ కావాలని ఉంది. భౌతిక శాస్త్రం అంటే చాలా ఇష్టం. మా అమ్మనాన్నల కలలను నిజం చేస్తాను. కష్టపడి పట్టుదలతో చదివి ఇంజనీర్ నవుతాను. - ముసాపురి రజిత, చిట్యాల
సైంటిస్ట్ కావడమే లక్ష్యం
పదో తరగతి పరీక్షలు బాగా రాసాను. 9.9 జేపీఏ పాయిం ట్లు వస్తాయని నాకు నమ్మకంగా ఉంది. నాకు సైన్స్ అం టే చాలా ఇష్టం. ప్రయోగాలు చేయాలని ఉంది. మా అమ్మనాన్నల ప్రొత్సాహం ఉంది. నేను పట్టుదలతో చదివి దేశానికి మంచి సైంటిస్ట్‌ను కావాలని ఉంది. అవుతాను. - కత్తెరశాల సుస్రుత్, నవాబుపేట
ఫిజికల్ డెరైక్టర్‌గా ఎదగాలనుంది
పదో తరగతి పరీక్షలో 9/10 జీపీ సాధిస్తా. పదవ తరగతి పరీక్షల్లో 10/10 జీపీకి ప్రయత్నించినప్పటికీ కొన్ని తప్పిదాల కారణంగా 1 పాయింట్ తగ్గితుందనుకుంటున్నా. ఈ వేసవిలో ఏపీఆర్‌జేసీలో సీటు సంపాదించేందుకు ప్రిపేరవుతున్నా. ఫిజికల్ డైరక్టర్ కావలనేదే లక్ష్యంగా చదువుతున్నా. - బాసని రక్షితగీత, శాయంపేట
డాక్టర్ కావాలనే నా కోరిక
చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే కోరిక ఉంది. పదవ తరగతిలో 10/10 ర్యాంకు వస్తుందనే నమ్మకం ఉంది. ఎండాకాలంలో కంప్యూటర్‌పై అవగాహన పెంచుకోవడంతో పాటు చదువుతూ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవడానికి పుస్తకాలను సేకరిస్తున్నాను. - కట్కం సింధూ, రేగొండ