planning
-
‘క్రూయిజ్’కు పెరుగుతున్న క్రేజ్
సాక్షి, అమరావతి: పర్యాటకుల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆసక్తి, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రణాళికల ఫలితంగా క్రూయిజ్ పర్యాటకం దేశంలో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 4.70 లక్షల మంది క్రూయిజ్‌లో ప్రయాణించడమే ఇందుకు నిదర్శనం. ఇది కరోనా ముందు 2019–20లో 4.20 లక్షల మంది క్రూయిజ్ ఫుట్‌ఫాల్‌తో పోలిస్తే గణనీయమైన పెరుగుదలను చూపిస్తోంది. ఈ క్రమంలోనే 2041 నాటికి 40లక్షల మందిని క్రూయిజ్‌లో పర్యటించేలా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది.లోతైన సముద్ర క్రూయిజ్‌లు, తీర ప్రాంత క్రూయిజ్‌లు, రివర్ క్రూయిజ్‌లు, యాచ్ క్రూయిజ్లలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రూ.45 వేల కోట్ల పెట్టుబడితో రివర్ క్రూయిజ్ టూరిజంను అభివృద్ధి చేయాలని చూస్తోంది. ప్రస్తుతం కోర్డెలియా, కోస్టా క్రూయిజ్ వంటి క్రూయిజ్ లైన్లు ప్రస్తుతం అరేబియా సముద్రంలో దేశీయ విహార యాత్రలను నిర్వహిస్తున్నాయి.దేశీయంగా పెరుగుదల..గడిచిన ఆర్థిక సంవత్సరంలో 80 శాతం మంది దేశీయంగానే ప్రయాణించారు. ఇందులో 29వేల మంది మాత్రమే అంతర్జాతీయ పర్యటనలు చేశారు. ఇప్పటికీ అంతర్జాతీయ క్రూయిజ్ టూరిజం ఇంకా కోవిడ్‌కు మునుపటి స్థాయిలో చేరకపోవడంతో విదేశీ పర్యాటకులు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేశీయ పర్యాటకులలో క్రూయిజ్‌లకు ఆదరణ పెరుగుతోంది. 2019–20లో 50 శాతం దేశీయ, 50 శాతం అంతర్జాతీయ క్రూయిజ్ పర్యటనలు నమోదయ్యాయి. వాటితో పోలిస్తే తాజాగా దేశీయ పర్యాటకులు దాదాపు 85శాతం పెరిగారు. సింగపూర్ వంటి దేశాలలో క్రూయిజ్ పరిశ్రమకు భారతీయ పర్యాటకులు కీలకంగా ఉన్నారు. అయితే అబుదాబి కూడా భారతీయ పర్యాటకులను తన క్రూయిజ్ ఆఫర్లకు ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది.క్రూయిజ్ పర్యటనలు ఇలా..ముంబై, గోవా, న్యూ మంగళూరు, కొచ్చి, విశాఖ పోర్టులకు అంతర్జాతీయ క్రూయిజ్ షిప్‌ల రాక పెరుగుతోంది. దేశీయ క్రూయిజ్‌లు ముంబై–గోవా, ముంబై–డయ్యూ, ముంబై–కొచ్చి, ముంబై–లక్ష ద్వీప్, ముంబై–హై సీస్, చెన్నై–వైజాగ్ మార్గాల్లో అందుబాటులో ఉన్నాయి. నది క్రూయిజ్ టూరిజం కోసం తొమ్మిది జలమార్గాలను గుర్తించారు. వాటిలో గంగానదిపై వారణాసి–హలి్దయా, బ్రహ్మపుత్రలోని ధుబ్రి–సాదియా మార్గాలున్నాయి. గుజరాత్ తీర్థయాత్ర పర్యటనలు, పశ్చిమ తీర సాంస్కృతిక, సుందరమైన పర్యటనలు, సౌత్ కోస్ట్ ఆయుర్వేద వెల్నెస్ పర్యటనలు, తూర్పు తీర వారసత్వ పర్యటనలు వంటి థీమ్–ఆధారిత పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ యోచిస్తోంది.అందుబాటులో విశాఖ అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్..దక్షిణ భారతదేశంలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే దేశీయ, అంతర్జాతీయ క్రూయిజ్ టూరిజం అందుబాటులో ఉంది. విశాఖలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పర్యాటకులకు విశేష సేవలందిస్తోంది. సుమారు రూ.100 కోట్లతో నిర్మించిన విశాఖ అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ సుమారు 2వేల మంది ప్రయాణికులకుపైగా సామర్థ్యం ఉన్న నౌకలకు వసతి కల్పిస్తోంది. -
సరైన ఆచరణతోనే సంపద సృష్టి!
సంపద సృష్టికర్తల్లో ఎవరి జీవితాన్ని పరిశీలించి చూసినా.. సమయానికి ఎంతో ప్రాధాన్యత కనిపిస్తుంది. ప్రణాళిక, ఆచరణ, క్రమశిక్షణ కనిపిస్తాయి. సంపద సృష్టించాలంటే కాలం విలువ తెలిసి ఉండాలి. ఇవాళ కాకపోతే రేపు, ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది ఇలాంటి ధోరణి అస్సలు పనికిరాదు. దీనివల్ల కేలండర్లో సంవత్సరాలు మారుతుంటాయే కానీ, ఆశించిన ఫలితాలు కానరావు. కొత్త సంవత్సరం తనకు అనుకూలంగా ఉండాలని, అనుకున్నవి సాధించాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఆచరణ లోపంతో దానికి దూరంగా ఉండిపోతుంటారు. అన్నీ ఒకేసారి సాధించేద్దామని అనుకుంటే, ఫలితాలు ఆలస్యం అవుతాయి. అందుకుని ప్రణాళిక మేరకు అడుగులు వేయాలి. నూతన సంవత్సరంలో ఏం సాధించాలనుకుంటారో, అవి వాస్తవికంగా ఉండాలి. అప్పుడే చక్కని ఫలితాలు కనిపిస్తాయి. ఏడాది కాలానికి కార్యాచరణ ప్రణాళిక అంటే, అందుకు తగినంత సమయం కేటాయించాలి. సంపద సృష్టించాలనే ఆకాంక్ష కలిగిన వారు కొత్త సంవత్సరంలో ఆ దిశగా అమల్లో పెట్టాల్సిన ఆచరణ ఎలా ఉండాలో నిపుణులు తెలియజేస్తున్నారు. మనీ ఒక్కటేనా..? అందరికీ ధనం కావాల్సిందే. అందులో సందేహం లేదు. కానీ, మనిషి ఎప్పుడూ డబ్బు చుట్టూ పరుగెత్తడం సరైనది అనిపించుకోదు. తండ్రి లేదా తల్లి కావచ్చు. కుమారుడు లేదా కుమార్తె కావచ్చు. జీవిత భాగస్వామి, స్నేహితులు, సహోద్యోగులు, శ్రేయోభిలాషులు.. ఇలా మన చుట్టూ పెద్ద ప్రపంచమే ఉంది. దాన్ని కూడా పట్టించుకోవాలి. సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపూ అవసరమే. మనీ లైఫ్‌తోపాటు ఇతరత్రా అన్నీ మేళవించినప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది. అస్తమానం డబ్బు గురించే ఆలోచిస్తూ, వేదన చెందుతుంటే అదొక వైరల్ వ్యాధిగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే జీవితంలో అన్నింటికీ సమతుల్యత అవసరం. దీర్ఘ ప్రయాణం సంపద సృష్టించడం అన్నది ఇన్స్టంట్ నూడుల్స్ చేసుకున్నంత ఈజీ కాదు. అదొక దీర్ఘకాలిక పరుగు. దశాబ్దాల పాటు స్థిరమైన పెట్టుబడులతో సాగిపోయేది. ప్రణాళిక మేరకు అడుగులు వేసేది. కొత్త సంవత్సరంలో సంపద సృష్టికి బీజం వేసుకోవాలే కానీ, సంపద సృష్టిని ఏడాదిలోనే సాధించేయాలంటే అది ఆచరణసాధ్యం కాదు. క్రమం తప్పకుండా ఆదాయం నుంచి పొదుపు చేస్తూ, ఆ పొదుపును ఏటా పెంచుకుంటూ, మెరుగైన రాబడినిచ్చే సాధనాల్లోకి పెట్టుబడిగా మళ్లిస్తూ సాగిపోవాల్సిన సుదీర్ఘ ప్రయాణం. కనుక షార్ట్ కట్స్, ఇన్స్టంట్స్ అంటూ ఇందులో దారులు వెతుక్కోవడం వల్ల ఫలితం ఉండదు. ఎంత వీలైతే అంత మొత్తంతో మొదట పెట్టుబడిని ఆరంభించాలి. దాన్ని కొనసాగించాలి. సంపద అంటే..? సంపద అంటే డబ్బు, బంగారం, పెట్టుబడులు, ప్రాపరీ్టలే కాదు. మంచి ఆరోగ్యం కూడా గొప్ప సంపదే అవుతుంది. సంపద కోసం ఆరోగ్యం పాడు చేసుకుంటే, ఆ తర్వాత అదే సంపదతో ఆరోగ్యం కొనుక్కుందామంటే సాధ్యపడకపోవచ్చు. ఆరోగ్యంగా ఉంటేనే సంపద సృష్టి కోసం సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించగలరు. తద్వారా మరింత సంపదను సమకూర్చుకోగలరు. అనారోగ్యకర అలవాట్లను విడిచి పెట్టాలి. ఆరోగ్యకరమైన, పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. యోగ, మెడిటేషన్, వ్యాయామాలు వంటి వాటికి రోజూ కొంత సమయం కేటాయించాలి. ఆదాయం.. వ్యయం.. ఆదాయం కంటే వ్యయానికి ఆర్థిక శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. చాలా మంది ఎలాంటి ప్రణాళిక లేకుండా ఖర్చు చేస్తుంటారు. మంచి డిస్కౌంట్ ఆఫర్లు కనిపించిన వెంటనే కొనుగోలు చేస్తుంటారు. క్రెడిట్ కార్డ్‌పై చాలా తక్కువకే వస్తుందని కొనుగోలు చేస్తుంటారు. ఇవన్నీ విక్రయాలు పెంచుకోవడానికి కంపెనీలు చేసే మార్కెటింగ్ వ్యూహాలు. వాటి ఆకర్షణలో పడకుండా చూసుకోవాలి. సంపద సృష్టించాలనే పట్టుదల ఉన్న వారు మొదట వ్యయాలపై అదుపు సాధించాలి. వస్తున్న ఆదాయంలో వ్యయాలను 60–80 శాతానికి మించకుండా అదుపు చేసుకోవాలి. ఎంత సంపాదించామన్నది కాకుండా, ఎంత పొదుపు చేశామనే తత్వంతో ముందుకు సాగాలి. అవసరాలకే కొనుగోళ్లు పరిమితం కావాలి. అంటే ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజు, కిరాణా, పాలు, కూరగాయలు, యుటిలిటీ బిల్లులు ఇవన్నీ అవసరాలు. రెస్టారెంట్లో తినడం, సినిమాలు, టూర్లు ఇవన్నీ కోరికలు. వెసులుబాటు ఉంటేనే కోరికలకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. అవసరాలు, కోరికలకు కేటాయింపుల తర్వాత కూడా ఆదాయంలో 40 శాతాన్ని పెట్టుబడిగా మళ్లించారంటే సంపద సృష్టి అనుకున్నదానికంటే ముందే సాధ్యపడుతుంది. సరైన సాధనాలు సంపాదనలో పొదుపుతోనే ఆగిపోకూడదు. ఆ పొదుపు మదుపుగా మారినప్పుడే సంపద సాధ్యపడుతుంది. ఈ మార్గంలో ఎంపిక చేసుకునే పెట్టుబడి సాధనాలు కీలక పాత్ర పోషిస్తాయి. జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లను పెట్టుబడి సాధనాలుగా చూడకూడదు. ద్రవ్యోల్బణం తరుగు తీసిన తర్వాత ఈ సాధనాల్లో మిగిలేదీ ఏమీ ఉండదు. రాబడితోపాటు, అవసరమైనప్పుడు నగదుగా మార్చుకునే లిక్విడిటీ కూడా మెరుగ్గా ఉండాలి. ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ మేలైనవి. వీటితోపాటు వెసులుబాటును బట్టి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లలోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీలతోపాటు, రియల్ఎస్టేట్, బంగారం దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని తెచ్చి పెట్టినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పెట్టుబడుల్లో స్థిరత్వం కోసం కొంత డెట్ సాధనాలకూ చోటు ఇవ్వొచ్చు. గ్యారంటీడ్ రాబడి అనే ఉత్పత్తుల ఆకర్షణలో పడొద్దు. పన్ను ఆదా కోరుకునే వారు సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల కోసం ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ వంటి పథకాలను పరిశీలించొచ్చు. పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, రుణంపై ఇల్లు కొనుగోలు చేస్తే, అసలు, వడ్డీపైనా పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో వేలాది పథకాలున్నాయి. నిపుణుల సాయంతో నాలుగైదు పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఫండ్స్‌లో ఎన్‌ఎఫ్‌వోల కంటే ట్రాక్ రికార్డు ఉన్న పథకాలను ఆశ్రయించడమే మెరుగైనది అవుతుంది. లిస్టింగ్ రోజున లాభాల కాంక్షతో ఐపీవోను ఎంపిక చేసుకోవద్దు. మంచి కంపెనీ, ఆకర్షణీయమైన వ్యాల్యూషన్లలో వస్తే దీర్ఘకాలానికి ఐపీవో మార్గంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు లిస్టింగ్‌లో లాభం వస్తే విక్రయించుకోవచ్చు. రాకపోతే పెట్టుబడిని కొనసాగించుకోవచ్చు. ఇతరులను అనుసరించడం ట్రేడింగ్‌తో రోజులో రూ.10వేలు, రూ.లక్ష సంపాదించుకోవచ్చనే ప్రకటనలు చూసి మోసపోవద్దు. తాము నేరి్పంచే స్ట్రాటజీతో ట్రేడింగ్‌లో రూ.లక్షలు సంపాదించొచ్చనే సోషల్ మీడియా ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దు. స్వీయ అధ్యయనంతో పెట్టుబడి సాధనాలను అర్థం చేసుకోవాలి. లేదంటే ఫైనాన్షియల్ ప్లానర్లు లేదా అడ్వైజర్ల సాయం తీసుకోవాలి. సంపన్న ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోని అనుకరించడం సరికాదు.తోటి ఇన్వెస్టర్ల సలహా, సూచనలను గుడ్డిగా అనుసరించొద్దు. ప్రతి ఇన్వెస్టర్ రిస్క్, ఆకాంక్షలు వేర్వేరుగా ఉంటాయి. ఆర్థిక రక్షణ మెరుగైన కవరేజీతో కుటుంబం అంతటికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మొదట చేయాల్సిన పని. దీనివల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, పొదుపు, పెట్టుబడులకు విఘాతం కలగకుండా, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీతో గట్టెక్కొచ్చు. నలుగురు సభ్యుల కుటుంబానికి కనీసం రూ.10 లక్షల కవరేజీ, అపరిమిత రీస్టోరేషన్ సదుపాయంతో తీసుకోవాలి. ఇక అనుకోనిది జరిగితే కుటుంబం ఆర్థిక కష్టాల పాలు కాకుండా ఉండేందుకు, మెరుగైన కవరేజీతో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా తీసుకోవాలి. కనీసం 20 ఏళ్ల కుటుంబ అవసరాలను తీర్చే స్థాయిలో కవరేజీ ఉండాలి. ప్రమాదం కారణంగా ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసే కవరేజీ కూడా ఉండాలి. ఇంటికి, ఇంట్లోని విలువైన వాటికి బీమా ప్లాన్ తీసుకోవాలి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా కనీసం ఆరు నెలల అవసరాలను తీర్చే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. రాబడి ఒక్కటే కాదు.. పెట్టుబడి కోసం ఎంపిక చేసుకునే సాధనం విషయంలో రాబడి ఒక్కటే ప్రామాణికం కాకూడదు. సంబంధిత ఉత్పత్తిలో ఉండే రిస్‌్కను కూడా మదింపు వేయాలి. తమ రిస్క్ సామర్థ్యానికి తగినట్టుగానే ఉందా? అని విశ్లేషించుకోవాలి. ఉదాహరణకు 2020 మార్చి కరోనా విపత్తు సమయంలో ఈక్విటీ మార్కెట్ 40 శాతానికి పైగా పతనమైంది. విడిగా కొన్ని స్టాక్స్ 80–90 శాతం వరకు పడిపోయాయి. అలాంటి సమయాల్లో పెట్టుబడుల విలువ గణనీయంగా పడిపోతుంది. ఆ నష్టాన్ని చూసి భయపడిపోకూడదు. ఈక్విటీలకు ఆటుపోట్లు సహజం. కాలవ్యవధి అనేది సాధనాలను ఎంపిక చేసుకోవడానికి కీలకం. ఆటుపోట్లు ఎదురైనా, ధైర్యంగా కొనసాగించే వారే వీటిని ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీల్లో అస్థిరతలు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మెరుగైన రాబడి వస్తుంది. రిస్క్ వద్దనుకుంటే, రాబడిలో రాజీపడి డెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. తప్పులకు దూరంగా.. పెట్టుబడుల్లో వీలైనంత వరకు తప్పులకు చోటు లేకుండా చూసుకోవాలి. అయినా కానీ తప్పులు జరగవన్న గ్యారంటీ ఏమీ ఉండదు. ఫండ్ మేనేజర్లు సైతం తమ ప్రయాణంలో తప్పులు చేస్తుంటారు. కాకపోతే చేసిన తప్పును వేగంగా గుర్తించి, దాన్ని సరిదిద్దుకోవడం తెలియాలి. ఫండ్స్‌లో మానవ తప్పిదాలకు చోటు లేకుండా ఉండాలంటే ఇండెక్స్ ఫండ్స్ ఉత్తమమైనవి. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు ఎంతో ఆచితూచి వ్యవహరించాలి. మెరుగైన స్ట్రాటజీ, చక్కని అవగాహన, స్థూల ఆర్థిక అంశాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రభుత్వ, ఆర్బీఐ పాలసీలు, కరెన్సీ మారకం తదితర ఎన్నో అంశాలను వేగంగా అర్థం చేసుకునే నైపుణ్యాలు అవసరం. అంత సమయం లేకపోతే ఆ భారం ఫండ్ మేనేజర్లపై వేయాలి. లక్ష్యం.. ప్రణాళిక ప్రతి లక్ష్యానికీ విడిగా ప్రణాళిక అవసరం. సొంతిల్లు, కారు, రిటైర్మెంట్, పిల్లల విద్య, వివా హం ఇవన్నీ అందరికీ ఉండే ముఖ్యమైన భవిష్యత్ లక్ష్యాలు. తమ ఆదాయం నుంచి విడిగా ఒక్కో దానికి ఎంత చొప్పున కేటాయిస్తే, వాటిని చేరుకోవచ్చన్న దానికి స్పష్టత ఉండాలి. అవసరమైతే ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకోవాలి. రుణాలు–చెల్లింపులు తప్పనిసరి అయితేనే రుణం తీసుకోవాలి. తీసుకుంటే దాన్ని తీర్చివేయడానికే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. రుణ చెల్లింపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఫల్యం లేకుండా చూసుకోవాలి. నామినేషన్ చివరిగా అన్ని ఆర్థిక సాధనాలకూ నామినేషన్ ఇవ్వడం తప్పనిసరి. బ్యాంక్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్, బీమా పథకాలు, డీమ్యాట్ ఖాతాలు, ఈపీఎఫ్ ఇలా ప్రతి సాధనానికీ నామినేషన్ లేకపోతే వెంటనే నమోదు చేయాలి. మార్గమిది... లక్ష్యాల్లో వాస్తవికత: జనవరి 1 నుంచే రోజూ 5 కిలోమీటర్ల నడక లేదా పరుగు ఆచరణలో పెట్టాలని కోరుకోవచ్చు. మొదటి రోజే 5 కిలోమీటర్లు సాధ్యం కానప్పుడు ఒక కిలోమీటర్‌తో ఆరంభిస్తే, క్రమంగా కొన్ని రోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. సామర్థ్యాలకు తగినట్టుగా కార్యాచరణ అవసరం. ఎంత వీలైతే, అంత మొత్తంతో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించాలి. స్థిరత్వం: పెట్టుబడుల ప్ర పంచంలో ప్రేరణ కంటే స్థిర త్వానికే ప్రాముఖ్యం ఇస్తారు. ప్రేరణ అనేది కొన్ని రోజులు, నెలల పాటే ఉండొచ్చు. కానీ, స్థిరత్వం అన్నది విజయానికి కీలకం . ఇన్స్టంట్ సక్సెస్: స్వల్ప కాలంలో సంపద పోగేయాలన్నట్టుగా కొందరు ఇన్వెస్టర్ల ధోరణి ఉంటుంది. కానీ, జీవితం అందరికీ ఒకే విధంగా నడవదు. ఫలితాలకు తగినంత వ్యవధి ఇచి్చనప్పుడే సాధన సులభమవుతుంది. ఇక్కడ ఓపిక, క్రమశిక్షణ, అంకితభావం కీలకం అవుతాయి. కృషి: ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులు అవుతారు’అని ఓ సినీ కవి చెప్పినట్టు.. చేసుకున్న తీర్మానాలను విజయవంతంగా చేరుకోవడం కంటే కూడా, దాన్ని సాధించడానికి మీరు చేసిన ప్రయత్నాలు, కృషి ఇక్కడ కీలకం అవుతాయి. ప్రతి నెలా ఆదాయంలో 50 శాతాన్ని ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ, అది సాధ్యం కావ డం లేదని దాన్ని పక్కన పెట్టేయడం విజయానికి చేరువ చేయదు. కనీసం 20–30–40 శాతం మేర అయినా ఆదాతో మొదలుపెట్టి, ఆ తర్వాత దాన్ని మరింత పెంచుకోవచ్చు. ఆర్థిక అంశాలపై పట్టు: ఆర్థికంగా విజయం సాధించాలని కోరుకునే వారికి అందుకు సంబంధించి ప్రాథమిక అంశాలు తప్పకుండా తెలిసి ఉండాలి. ఆర్థిక అంశాలను అర్థం చేసుకోవడం, వాటిని అమలు చేయడం, వ్యక్తిగత ఆర్థిక అంశాల నిర్వహణ, బడ్జెట్, పొదుపు, పెట్టుబడులు, రుణాలు వీటన్నింటి గురించి తెలియాలి. ఆర్థిక, పెట్టుబడి సూత్రాలపై అవగాహన ఉండాలి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఈల్డ్స్ తెలిసి ఉండాలి. -
ప్రొఫెసర్లకు పునశ్చరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వివిధ విభాగాల అధిపతులు, సీనియర్ ప్రొఫెసర్లకు ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. సెప్టెంబర్ 21 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ పునశ్చరణ బాధ్యతలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇటీవల జరిగిన ఉన్నత విద్య పాలక మండలి సమావేశంలో ఈ మేరకు చర్చించినట్టు స్పష్టం చేశారు. ఈ వివరాలను లింబాద్రి మంగళవారం మీడియాకు వివరించారు. అధ్యాపకుల ఆలోచనా ధోరణిని విస్తృతపర్చేందుకు.. దేశవ్యాప్తంగా ఉన్నత విద్య కోర్సు ల్లో అనేక మార్పులు చోటు చేసు కుంటున్నాయి. అంతర్జాతీయ విద్యా ప్రమాణాల వైపు వెళ్ళాలనే ఆకాంక్ష బలపడుతోంది. ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు కూడా ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నాయి. డిజిటల్ యూనివర్సిటీ ప్రాధ్యానత అన్ని స్థాయిలను ఆకర్షిస్తోంది. వివిధ సబ్జెక్టుల మేళవింపుతో, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా శాస్త్రీయ విద్యా విధానం విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తోంది. మరోవైపు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. స్వదేశీ యూనివర్సిటీలు వీటి పోటీని తట్టుకుని నిలబడాల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మన రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఉన్న అధ్యాపకుల ఆలోచనాధోరణిని మరింత విస్తృతపర్చేందుకు ప్రత్యేక ఓరియంటేషన్ చేపడుతున్నట్టు లింబాద్రి తెలిపారు. శిక్షణ ఇలా... విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రధాన విభాగాల ముఖ్య అధికారులను వర్సిటీల వీసీలతో కలిసి ఉన్నత విద్యా మండలి ఎంపిక చేస్తుంది. ఇలా అన్ని యూనివర్శిటీల నుంచి తొలి దశలో వంద మందిని ఎంపిక చేసే అవకాశం ఉంది. సీనియర్ అధ్యాపకుడు భవిష్యత్‌లో ఉన్నత విద్యలో కీలకపాత్ర పోషిస్తాడు. ఈ కారణంగా బోధనపై నవీన మెళకువలే కాకుండా, నాయకత్వ లక్షణాలు అవసరం. గ్లోబల్ లీడర్‌గా ఉన్నత విద్యను అర్థం చేసుకునే స్థాయి కల్పిస్తారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ దిశగా ప్రత్యేక ఓరియంటేషన్ మెళకువలను నిష్ణాతులు రూపొందిస్తారు. వీటిని అనుభజ్ఞులైన అధికారులు పరిశీలిస్తా రు. అర్థమయ్యేలా వివరించే అధికారులతో ప్రత్యేక బోధన తరగతులు నిర్వహిస్తారు. అధ్యాపకులతో మొదలయ్యే ఈ పునశ్చరణ తరగతులు తర్వాత దశలో వీసీల వరకూ విస్తరించాలని భావిస్తున్నారు. -
Chandrayaan-3: చంద్రయాన్–3 ప్లానింగ్ షెడ్యూల్ సక్సెస్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత నెల 14న ప్రయోగించిన చంద్రయా న్–3 మిషన్ ప్లానింగ్ షెడ్యూల్ ప్రకారం దశలవారీగా చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లే ఆపరేషన్‌ను విజయవంతంగా చేపట్టారు. చంద్రయాన్–3 మిషన్ భూమధ్యంతర కక్ష్యలో ఉన్నప్పుడు ఐసారు, లూనార్ ఆర్బిట్‌లోకి చేరుకున్న తర్వాత మరో ఐసా ర్లు ఆర్బిట్ రైజింగ్ కార్యక్రమాన్ని బెంగళూరులోని మిషన్ ఆపరేటర్ కాంఫ్లెక్స్ (ఎంఓఎక్స్), ఇస్రో టెలీమేట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(ఇస్ట్రాక్), బైలాలులో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ (ఐడీఎస్ఎన్) భూనియంత్రతి కేంద్రాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించా రు. ల్యాండర్, రోవర్ మాడ్యూల్‌ను తీసుకెళుతున్న ప్రపొల్షన్ మాడ్యూల్ మొత్తం బరువు 2,145 కిలోలు. ప్రపొల్షన్ మాడ్యూల్‌ను భూ మధ్యంతర కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి 1,696 కేజీల ఇంధనాన్ని నింపారు. మిగిలిన 449 కేజీలు పేలోడ్ ఇనుస్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఈ ప్రపొల్షన్ మాడ్యూల్‌కు అనుసంధానం చేసిన ల్యాండర్, అందులో ఉన్న రోవర్‌ను చంద్రుడి మీదకు విజయవంతంగా తీసుకెళ్లి వదిలిపెట్టింది. ఇప్పటికి రెండు ఘట్టాలను పూర్తిచేశారు. ఇక మూడో ఘట్టమే మిగిలి ఉంది. ఈ ఘట్టాన్ని కూడా ఈనెల 23న బుధవారం సాయంత్రం 5.47 గంటలకు ప్రారంభించి 6.04 గంటలకు ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడి ఉపరితలంపైన దించుతుంది. దశలవారీగా చూస్తే.. ► జులై 14 మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించారు. ► మొదటిగా చంద్రయాన్–3 మిషన్ భూమికి దగ్గరగా అంటే పెరిజీ 175 కిలోమీటర్లు, భూమికి దూరంగా అపోజి 36,500 కిలోమీటర్లు దూరంలోని భూ మధ్యంతర కక్ష్య (జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్)లోకి ప్రవేశపెట్టారు. ► చంద్రయాన్–3 మిషన్ కక్ష్యలోకి ప్రవేశించగానే బెంగళూరులోని ఇస్ట్రాక్ కేంద్రం (ఉపగ్రహాల నియంత్రిత భూకేంద్రం) శాస్త్రవేత్తలు స్వాధీనం చేసుకున్నారు. ► గత నెల 15న మొదటి ఆర్బిట్ రైజింగ్ (కక్ష్య దూరం పెంపుదల) మొదటి విడతలో భూమికి దగ్గరగా 173 కిలోమీటర్లు ఎత్తుకు, భూమికి దూ రంగా 41,762 కిలోమీటర్లు ఎత్తుకు పెంచారు. ► 17న రెండోసారి భూమికి దగ్గరగా 173 కిలోమీ టర్ల ఎత్తును 223 కిలోమీటర్లుకు, భూమికి దూరంగా 41,762 కిలోమీటర్లు ఎత్తును 42,000 కిలోమీటర్ల దూరానికి పెంచారు. ► 18న మూడో విడతలో 224 కిలోమీటర్లు, దూ రంగా 51,568 కిలోమీటర్లు ఎత్తుకు పెంచారు. ► 22న నాలుగో విడతలో భూమికి దగ్గరగా 233, దూరంగా 71,351 కిలోమీటర్ల ఎత్తుకు పెంచారు. ► 25న ఐదోసారి భూమికి దగ్గరగా 236, భూమికి దూరంగా 1,27,609 కిలోమీటర్లు ఎత్తుకు పెంచారు. 25 నుంచి ఆగస్టు 1 అర్ధరాత్రి దాకా చంద్రయాన్–3 మిషన్ భూమధ్యంతర కక్ష్యలో పరిభ్రమించింది. ► ఈనెల 1న అర్ధరాత్రి చంద్రయాన్–3 మిషన్నుపెరిజీలోకి అంటే భూమికి దగ్గరగా వచ్చిన సమయంలో లూనార్ ట్రాన్స్ ఇంజెక్షన్ అనే అపరేషన్‌తో భూమధ్యంతర కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్య వైపునకు మళ్లించారు. ►5న భూ మధ్యంతర కక్ష్య నుంచి 3,69,328 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి లూనార్ ఆర్బిట్ (చంద్రుని కక్ష్య)లో 164్ఙశ్రీ18074 ఎత్తుకు చేరింది. ► 6న ప్రపొల్షన్ మాడ్యూల్ లూనార్ ఆర్బిట్‌లో మొదటి సారిగా కక్ష్య దూరాన్ని తగించే ప్రక్రియను ప్రారంభించి 170్ఙశ్రీ4,313 కిలోమీటర్లకు తగ్గించారు. ►9న రెండో సారి కక్ష్య దూరాన్ని తగ్గించి 174్ఙశ్రీ1437 కిలోమీటర్లు చంద్రుడికి దగ్గరగా తీసుకొచ్చారు. ► 14ప మూడోసారి 151్ఙశ్రీ179 కిలోమీటర్లకు తగ్గించారు. ► 16న నాలుగోసారి 153్ఙశ్రీ163 కిలోమీటర్లకు తగ్గించారు. ► 17న చంద్రయాన్–3 119్ఙశ్రీ127 కిలోమీటర్ల ఎత్తులో ప్రపొల్షన్ మాడ్యూల్ ల్యాండర్ మాడ్యూల్‌ను విజయవంతంగా విడిచిపెట్టింది. ► 18న ల్యాండర్ మాడ్యూల్లో ఉన్న కొద్దిపాటి ఇంధనాన్ని మండించి చంద్రుడికి చేరువగా అంటే 113్ఙశ్రీ157 కిలోమీటర్లు దగ్గరగా వెళ్లింది. ► 20న అంటే ఆదివారం ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడికి మరింత చేరువగా 25్ఙశ్రీ134 కిలోమీటర్లకు చేరుకుంది. ► 23 బుధవారం సాయంత్రం 5.27 గంటలకు ల్యాండర్ మాడ్యూల్లో ఇంధనాన్ని 37 నిమిషాలపాటు మండించి 6.04 గంటలకు చంద్రుడి ఉపరితలంపై దక్షిణధృవం ప్రాంతంలో దించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు. ► ఈ ప్రయోగంలో ఇస్రో మొట్టమొదటి సారిగా థొరెటల్–అబల్ అనే లిక్విడ్ ఇంజిన్లను ఉపయోగించి చంద్రుని ఉపరితలంపై ల్యాండర్‌ను మదువైన చోట సేఫ్‌గా ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ల్యాండర్ చంద్రుడిపై దిగిన తరువాత అందులో నుంచి రోవర్ చంద్రుడి ఉపరితలంపై రావడానికి సుమారు 4 గంటల సమయాన్ని తీసుకుంటుంది. రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి వచ్చా క సెకనుకు ఒక సెంటీమీటర్ వేగంతో కదులుతూ ఒక లూనార్ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. ఒక లూనార్ డే అంటే భూమి మీద కొలిస్తే 14 రోజులు అవుతుంది. ఈ 14 రోజుల్లో అంటే సెప్టెంబర్ 7 దాకా 500 మీటర్లు దూరం ప్రయాణించి చంద్రుడి ఉపరితలంపై మాలాలను పరిశోధించి భూ నియంత్రిత కేంద్రానికి సమాచారాన్ని చేరవేస్తుంది.. -
ఫస్ట్ టైమ్ ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోకుంటే..
సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. కావున ఉద్యోగస్థులైనా, వ్యాపారస్తులైనా తప్పకుండా ఇల్లు కొనుగోలు లేదా నిర్మించుకోవడం చేస్తారు. అయితే ఇల్లు కొనుగోలు చేసే వారు మాత్రం తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 👉ఇల్లు కొనటం అనేది కేవలం భావోద్వేగానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఆర్థిక పరమైన అంశం కూడా. కావున ఇల్లు కొనేటప్పుడు ఎక్కడ కొనుగోలు చేస్తున్నాము, ధర ఎంత ఉంది అనే మరిన్ని విషయాలు ముందుగానే తెలుసుకోవాలి. సొంత ఇల్లు భద్రతాభావం అందిస్తుంది. 👉కొత్త ఇల్లు కొనుగోలు చేయడంలో సరైన నిర్ణయం తీసుకోకుంటే అది విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది. అభివృద్ధి చెందని ప్రాంతంలో ఇల్లు కొనుగోలు చేస్తే, అవసరమైన సౌకర్యాలు లభించకపోగా.. రవాణా & ఇతర ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. 👉సాధారణంగా ఇంటికయ్యే ఖర్చులో 10 నుంచి 20 శాతం డౌన్ పేమెంట్ అవసరం. అయితే మిగిలిన మొత్తం బ్యాంకుల నుంచి హోమ్ లోన్ రూపంలో తీసుకునే వెసులుబాటు ఉంటుంది. మీ దగ్గర ఉన్న బడ్జెట్లో ఇల్లు కొనుగోలు చేయడానికి అన్వేషించాలి. 👉ఇల్లు కొనుగోలు చేస్తే మాత్రం సరిపోదు.. దానికి కట్టుదిట్టమైన రిజిస్ట్రేషన్ వంటివి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఖర్చులు మీరు ఇల్లు కొనుగోలు చేసే డబ్బుతో పాటు అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. ఇది కొంత ఆర్థిక ఒత్తిడికి దారితీయవచ్చు. 👉బిల్డర్లు లేదా ప్రాపర్టీ డీలర్లతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇల్లు కొనటానికి ముందే లాయర్‌ను సంప్రదించడం మంచిది. ఎందుకంటే మీరు తీసుకోబోయే ప్రాపర్టీకి కో-ఓనర్ ఎవరైనా ఉన్నారా? లేదా? అనేది ముందుగానే తెలుసుకోవాలి. అంతే కాకుండా తీసుకోబోయే ప్రాపర్టీ లిటిగేషన్స్ ఏవైనా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. అన్ని సరిగ్గా ఉన్నాయన్న తరువాతే రిజిస్టర్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు నిశ్చింతగా కొత్తింట్లో అడుగుపెట్టవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కావలసిన వివరాలు తెలుసుకోకుండా.. ఇల్లు కొంటే భవిష్యత్తులో ఏదైనా సమస్యలు తలెత్తవచ్చు. దీనిని వినియోగదారుడు గుర్తుంచుకోవాలి. -
అన్నంత పని చేస్తున్న కిమ్! 'ఆయుధాలను పెంచాలని పిలుపు'
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి బెదిరింపులకు తెగబడ్డాడు. ఈ మేరకు కిమ్ మరిన్ని అణ్వాయుధాల ఉత్పత్తిని పెంచాలని, శక్తిమంతమైన ఆయుధాలను తయారు చేయాలని పిలుపునిచ్చాడు. గతంలో ఆయన మరిన్నీ ఆయుధాలు పెంచుతానంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడూ దాన్నే నిజం చేస్తూ.. కిమ్ ఇలా అణ్వాయుధా సంస్థ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే తన అణ్వాయుధాలను ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించడాని రెడీగా ఉండాలని చెప్పారు. మరింత ముందుచూపుతో అణు ఆయుధాలను తయారు చేసేలా అణు పదార్థాల ఉత్పత్తిని పెంచాలాని ఆదేశించారు. మనం ఆయుధాలను దోషరహితంగా ముందుచూపుతో సిద్ధం చేస్తే.. శత్రువు మనకు భయపడతాడని అన్నారు. తద్వారా దేశ సార్వభౌమాధికారాన్ని, వ్యవస్థను, ప్రజలను రెచ్చగొట్టే సాహసం చేయలేడని చెప్పారు. గతేడాదే ఉత్తరకొరియా తిరుగులేని శక్తిగా ప్రకటించుకుంది. ప్రస్తుతం మరిన్ని అణ్వాయుధాల ఉత్పత్తికి పిలుపునిచ్చి తన మాటను నిజం చేసుకుంది. అమెరికా, దక్షిణ కొరియా మంగళవారమే ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించాలని షెడ్యూల్ ఖరారు చేసుకున్న నేపథ్యంలోనే ఉత్తర కొరియా నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. కాగా, ఇటీవలే ఉత్తరకొరియా తన అణ్వాయుధాలను వైవిధ్యపరిచేలా సరికొత్తగా నీటి అడుగున అణుదాడి చేసే డ్రోన్ సంబంధిత పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఇది సముద్రంలో సునామీ సృష్టించి తీర ప్రాంతాలను తుడిచిపెట్టేలా చేయడం లేదా నౌక స్థావరాలను ముంచేయడం వంటి విధ్వంసాలను సృష్టిస్తుంది. (చదవండి: ఇదొక జబ్బులా ఉంది! స్కూల్ ఘటనపై జోబైడెన్ ఫైర్) -
పెట్టుబడుల నిర్వహణకు సామ్కో సీఆర్పీ ప్లాట్‌ఫాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రోకరేజి సంస్థ సామ్కో కొత్త తరం క్యాపిటల్ రిసోర్స్ ప్లానింగ్ (సీఆర్పీ) ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. ప్రామాణిక సూచీల స్థాయిలో రాబడులను అందుకునేలా ఇన్వెస్టర్లు సులువుగా తమ పెట్టుబడులను నిర్వహించుకునేందుకు, ట్రేడింగ్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ వ్యవస్థాపకుడు జిమీత్ మోదీ తెలిపారు. ఇటు తమ పెట్టుబడులపై రాబడులను, అటు ప్రామాణిక సూచీలపై రాబడులను రియల్ టైమ్‌లో ట్రాక్ చేసుకునేలా స్వంతంగా ఒక వ్యక్తిగత సూచీని ఏర్పాటు చేసుకునేందుకు కూడా ఇందులో సౌలభ్యం ఉంటుందని ఆయన పేర్కొ న్నారు. మరోవైపు, 67 శాతం మంది ఇన్వెస్టర్లు .. ప్రామాణిక సూచీల స్థాయిలో రాబడులు అందుకోలేకపోతున్నారని తాము నిర్వహించిన సర్వేలో వెల్లడైందని మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో దేశీ ఇన్వెస్టర్లు, ట్రేడర్లలో సూచీలను మించి రాబడులను అందుకునే ధోరణులను పెంపొందించేందుకు ’మిషన్ – ఏస్ ది ఇండెక్స్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. -
మూడేళ్లకు వ్యూహాత్మక ప్రణాళిక
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్ల కాలానికి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను (పీఎస్‌బీలు) కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. 2023–24 సంవత్సరం నుంచి దీన్ని ఆచరణలో పెట్టేందుకు వీలుగా తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. సాధించతగిన లక్ష్యాలను నిర్వచించుకోవాలని, కొత్తగా తీసుకోవాల్సిన చర్యలను గుర్తించాలని, వీటిని చేరుకునేందుకు కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని కోరింది. ఈ తరహా చర్యలు ‘మెరుగు పరిచిన సేవల అందుబాటు, శ్రేష్టత సంస్కరణలు 6.0 (ఈజ్ 6.0)’లో భాగమని, దీన్ని గత ఏప్రిల్‌లో ప్రారంభించినట్టు ఓ అధికారి తెలిపారు. ‘‘గడిచిన రెండేళ్లలో పీఎస్‌బీలు చాలా బాగా పనితీరు చూపించాయి. ప్రస్తుతం పీఎస్‌బీల తదుపరి దశ వృద్ధి నడుస్తోంది. ఆస్తుల నాణ్యత, ఐటీ సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం, నూతన తరహా సాంకేతిక పరిజ్ఞానాలను అమల్లోకి తీసుకురావడం, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల నిర్వహణపై దృష్టి సారించాలని కోరినట్టు’’ ఈ వ్యవహారం గురించి తెలిసిన ఓ అధికారి తెలిపారు. అప్రాధాన్య వ్యాపారాలను సమీక్షించుకోవాలని, ఆర్థిక పనితీరును బలోపేతం చేసుకోవాలని పీఎస్‌బీలను కేంద్రం కొన్నేళ్ల నుంచి కోరుతూనే ఉన్నట్టు ఓ ప్రభుత్వ బ్యాంక్ అధికారి వెల్లడించారు. ఇప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకులు సమర్పించే కార్యాచరణ ప్రణాళికల్లో అవి వైదొలిగే వ్యాపారాల వివరాలు కూడా ఉండొచ్చన్నారు. టెక్నాలజీకి ప్రాధాన్యం.. ప్రైవేటు రంగ బ్యాంకులు టెక్నాలజీ వినియోగం పరంగా ముందుంటున్నాయి. అదే మాదిరి ప్రభుత్వరంగ బ్యాంకులు సైతం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించుకోవాలన్నది కేంద్రం ఉద్దేశ్యంగా ఉంది. పీఎస్‌బీలు బిగ్ డేటా అనలైటిక్స్‌ను వినియోగించుకోవడం, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యాపారపరమైన మంచి ఫలితాలు రాబట్టడం అన్నది నూతన ప్రాధాన్య అంశాల్లో భాగమని మరో బ్యాంకర్ తెలిపారు. మరింత సమర్థవంతగా మార్కెటింగ్ చేసుకోవడం, కొత్త ఆదాయ మార్గాలను గుర్తించడం, కస్టమర్ ఆధారిత సేవలు, నిర్వహణ సామర్థ్యాలు పెంచుకోవడం గురించి కూడా ప్రస్తావించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల లాభం 2021–22లో రూ.66,539 కోట్లుగా ఉంటే, 2022–23లో రూ.లక్ష కోట్లకు చేరొచ్చన్న అంచనా నెలకొంది. మరింత బలోపేతం గతేడాది డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాని మాట్లాడిన మాటలు ఓ సారి గుర్తు చేసుకుంటే, బ్యాంకింగ్ రంగానికి కేంద్రం ఏ మేరకు ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి అయినా, బ్యాంకింగ్ రంగం బలోపేతంపైనే ఆధారపడి ఉంటుందని ప్రధాని ఆ సందర్భంలో పేర్కొనడం గమనార్హం. ‘‘దేశంలో అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడానికి జన్‌ధన్ ఖాతాలు పునాది వేశాయి. తర్వాత ఫిన్‌టెక్ సంస్థలు ఆర్థిక విప్లవానికి నాందీ పలికాయి’’అని ప్రధాని చెప్పారు. ‘ఈజ్ 5.0’ కింద ప్రభుత్వరంగ బ్యాంకులు తమ మధ్య అంతర్గత సహకారం అవకాశాలను గుర్తించాలి. ప్రాంతాల వారీ, ఒక్కో వ్యాపారం వారీగా అవకాశాలనూ పరిశీలించాలి. హెచ్ఆర్ సంస్కరణలు, డిజిటలైజేషన్, టెక్నాలజీ, రిస్క్, కస్టమర్ సేవలు తదితర అంశాలకు సంబంధించి అంచనా వేయాల్సి ఉంటుంది. -
వచ్చే ఏడాది జీప్ కొత్త మోడళ్లు
ముంబై: దేశీయ మార్కెట్ కోసం వచ్చే ఏడాది కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్టు జీప్ ఇండియా హెడ్ నిపుణ్ మహాజన్ తెలిపారు. ‘వచ్చే ఏడాది కూడా వృద్ధిని చూస్తున్నాం. ఉత్పత్తిని జోడించినప్పుడు వృద్ధి జరుగుతుంది. కస్టమర్ సంఖ్యను, పరిమాణాన్ని పెంచుతాం. మరింత వ్యాపారాన్ని జోడిస్తామని ఆయన ప్రకటించారు. ఇదీ చదవండి: Zomato డెలివరీ ఫెయిల్: భారీ మూల్యం చెల్లించిన జొమాటో పరిమాణం పరంగా 2023 మెరుగ్గా ఉంటుంది. 2022లో మూడు ఉత్పాదనలను పరిచయం చేశాం.నూతన శ్రేణిని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. ప్రస్తుతం నాలుగు ఉత్పత్తులు ఉన్నాయి. ఇవి పూర్తిగా ఖరీదైన విభాగంలో పోటీపడుతున్నాయి. మార్కెట్ పనితీరు బాగుంది’ అని అన్నారు. భారత్‌లో కంపెనీ జీప్ కంపాస్, రాంగ్లర్, మెరీడియన్, గ్రాండ్ చెరోకీ మోడళ్లను విక్రయిస్తోంది. గ్రాండ్ చెరోకీ 2022 ఎడిషన్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా నిపుణ్ ఈ విషయాలను వెల్లడించారు. కాగా, ఈ ఎస్యూవీ ధర రూ.77.5 లక్షలు. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో తయారైంది. 110కిపైగా అత్యాధునిక భద్రతా ఫీచర్లను జోడించారు. యాక్టివ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్, ఎనమిది ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ, డ్రౌజీ డ్రైవర్ డిటెక్షన్, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్, ఆక్యుపెంట్ డిటెక్షన్ వీటిలో ఉన్నాయి. -
ప్లాన్ చెయ్.. గోల్ వెయ్!
మంచి వేతనం.. వీలైనంత పెట్టుబడి.. వీటితో ఆర్థిక లక్ష్యాల సాధన సులభమే అనుకుంటున్నారా..? ఎంత సంపాదించామన్నది కాదు.. భవిష్యత్తు కోసం ఎంత ప్రణాళికాబద్దంగా మదుపు చేశామన్నది ముఖ్యమనే ఆర్థిక సూత్రం గుర్తుకు తెచ్చుకోండి. ఆర్థిక లక్ష్యాల సాధనకు దగ్గరి దారి అంటూ లేదు. అనుకున్నంత సులభమూ కాదు..! సరైన అంచనాలు, రాబడులు, అంచనాలకు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని జోడించడం, వివిధ సాధనాల మధ్య సమతూకమైన కేటాయింపులు, అత్యవసరాలకు సన్నద్ధత, జీవితానికి, రుణాలకు, ఆరోగ్యానికి రక్షణలు.. ఇటువంటివన్నీ ఎంతో కీలకమవుతాయి. ఒకటి అనుకోవచ్చు. కానీ, ఫలితం మరో రకంగా ఉండొచ్చు. తుది ఫలితంపై ప్రభావం చూపించే అంశాలు ఎన్నో ఉంటాయి. మెరుగైనవి అనుకున్న ప్రణాళికలు కూడా బెడిసి కొట్టొచ్చు. ఇందుకు కారణం మీరు వేసే తప్పటడుగులు కావచ్చు. తప్పుడు అంచనాలు కూడా కావచ్చు. ఆర్థిక లక్ష్యాల సాధనలో పొరపాట్లు, తప్పులకు అవకాశం లేకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించడమే ఈ కథనం ప్రధాన ఉద్దేశం. పునాదులు బలంగా ఉంటేనే నిర్మాణం చాలా కాలం పాటు నిలుస్తుంది. మీ ఆర్థిక ప్రణాళికకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. అకాల మరణం సంభవిస్తే.. పెద్ద ప్రమాదానికి లోనైతే.. తీవ్ర అనారోగ్యం బారిన పడితే.. అనుకోకుండా ఉద్యోగాన్ని కోల్పోతే ప్రణాళికలపై పెద్ద ప్రభావమే పడుతుంది. ముఖ్యంగా గత రెండేళ్లలో (కరోనా నాటి నుంచి) ఎన్ని అనూహ్య పరిణామాలను వ్యక్తులుగా మనం ఎదుర్కోవాల్సి వచ్చిందో గుర్తు చేసుకోవాలి. ఉద్యోగాలు కోల్పోయిన వారు, వేతన కోతలను ఎదుర్కొన్నవారు, ఆస్పత్రుల్లో చికిత్సల కోసం రూ.లక్షలు ధారపోసిన వారు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా.. చాలకుండా ఇబ్బంది పడ్డవారు చాలా మందే ఉన్నారు. జీవిత బీమా లేకుండా, కరోనాతో మరణించిన వ్యక్తుల (స్థితిమంతులు కానివారు) కుటుంబాల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. అందుకే తగినంత జీవిత బీమా, వైద్య బీమా రక్షణ, రుణాలకు రక్షణ కవరేజీలతోపాటు అత్యవసర నిధి అంటూ ఒకదానిని సమకూర్చుకోవాలని ఈ పరిణామాలు తెలియజేశాయి. బీమా రక్షణ ఎంత తీసుకోవాలి? దీనికి.. అందరికీ ఒక్కటే సమాధానం కాబోదు. వ్యక్తిగత అవసరాలు, ఆర్థిక పరిస్థితులు, అప్పులు, ఆరోగ్య చరిత్ర, వయసు ఇలా ఎన్నో అంశాలు ప్రామాణికం అవుతాయి. ఎంతలేదన్నా కనీసం 10 ఏళ్ల వార్షిక ఆదాయానికి తగ్గకుండా బీమా రక్షణ ఉండాలన్నది నిపుణుల సూచన. నెలవారీ మీ కుటుంబ జీవనానికి అవుతున్న ఖర్చులు, చెల్లించాల్సిన రుణ ఈఎంఐలు కీలకం అవుతాయి. అంతేకానీ, రూ.10 లక్షలు, రూ.50 లక్షలు, రూ.కోటి జీవిత బీమా అంటూ ఇతమిద్ధమైన ప్రామాణికం లేదు. భారీగా అప్పులు తీసుకుని ఏదోలా నెట్టుకు వస్తున్న వారికి అధిక కవరేజీ అవసరం. మీ ఆదాయ వ్యయాలు, తీర్చాల్సిన రుణ బాధ్యతలు, పెట్టుబడులు అన్నీ కూడా జీవిత బీమా కవరేజీ కోసం పరిగణనలోకి తీసుకోవాలని ఫిన్‌సేఫ్ ఇండియా వ్యవస్థాపకుడు మృణ్ అగర్వాల్ సూచించారు. వైద్య బీమా విషయానికొస్తే కనీసం రూ.5 లక్షల కవరేజీ అవసరం. మెట్రోల్లో నివసించే వారికి కనీసం రూ.7–10 లక్షల కవరేజీ అయినా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక కుటుంబానికి కనీసం రూ.15 లక్షల ఫ్లోటర్ పాలసీ ఉండడం సహేతుకమన్నది ఆర్థిక సలహాదారు సూచన. ఇందుకోసం బేసిక్‌గా కొంత కవరేజీ తీసుకుని దానికి సూపర్ టాపప్ జోడించుకోవడం ద్వారా తక్కువ ప్రీమియానికే మెరుగైన రక్షణ ఉండేలా చూసుకోవచ్చు. అత్యవసర నిధితో అనుకోకుండా ఎదురయ్యే అవసరాలను గట్టెక్కవచ్చు. ‘ఆర్థిక ప్రణాళిక అత్యవసర నిధితోనే మొదలవ్వాలి. ఎందుకంటే మిగులు నిల్వలుంటేనే ప్రణాళిక మొత్తం సాఫీగా నడిచిపోతుంది’ అని టీబీఎన్‌జీ క్యాపిటల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు తరుణ్ బిరాని సూచించారు. కనీసం వచ్చే ఆరు నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అదనంగా మరో 3–6 నెలల అవసరాలకు కూడా నిధిని సమకూర్చుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో నిశ్చింతను ఇస్తుందని కొందరు ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ము ఖ్యంగా ఉద్యోగ భద్రత లేని వారు ఏడాది అవసరాలకు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. వీటికి అదనంగా క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ తీసుకోవాలి. తీవ్ర అనారోగ్యాల్లో (కిడ్నీలు, మూత్ర పిండాలు, గుండె జబ్బులు, కేన్సర్ వంటివి) బేసిక్ హెల్త్ కవరేజీ చాలకపోవచ్చు. ఒక్కటిగానే.. లేక విడిగానా ఒక్కో లక్ష్యానికి విడిగా పెట్టుబడులు పెట్టుకోవడమా? లేదంటే అన్నింటినీ కలిపి ఒక్కటే విధానం అనుసరించడమా? ఉద్యోగం లేదా వృత్తి జీవితం కొత్తల్లో చాలా మంది తమకు మిగులుతున్నంత మేరకు తీసుకెళ్లి ఒక్కటే పెట్టుబడిగా నిర్వహిస్తుంటారు. చాలా మంది యువతకు ప్రణాళికల పట్ల ఆసక్తి అంతగా కనిపించడదు. కేవలం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళుతుంటారు అంతే. తమ ఆర్థిక లక్ష్యాలకు అంకెలను జోడించకపోతే అందులో సమగ్రత లోపిస్తుంది. ఉదాహరణకు రిటైర్మెంట్ తర్వాత మీ జీవన అవసరాలకు ఎంత నిధి కావాలన్నదానిపై స్పష్టత ఉండకపోతే.. ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలన్న విషయంలోనూ స్పష్టత ఉండదు. వీలున్నంత చేసుకుంటూ వెళితే చివర్లో ఆ నిధి సరిపడకపోవచ్చు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. పైగా ప్రతీ లక్ష్యం వారీగా పెట్టుబడుల ప్రణాళిక లేకపోతే.. ఒక్కటే పెట్టుబడి నిధి కొనసాగుతుంది. అప్పుడు సమీప కాలంలో ఎదురయ్యే అవసరాల కోసం ఈ ఏకీకృత నిధి నుంచి ఎక్కువ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. దీంతో భవిష్యత్తు లక్ష్యాలకు కొంతే మిగులుతుంది. ఉదాహరణకు రుణంపై ఇల్లు సమకూర్చుకునేందుకు డౌన్ పేమెంట్ కోసమని కొంత వెనక్కి తీసుకుంటే.. అప్పుడు పిల్లల ఉన్నత విద్య, విశ్రాంత జీవన అవసరాలపై ప్రభావం కచ్చితంగా పడుతుంది. అందుకే అన్నింటికీ ఒక్కటే నిధి కాకుండా.. విడిగా ప్రతీ అవసరం, లక్ష్యానికి ప్రత్యేక ప్రణాళిక, కేటాయింపులు ఉండేలా చూసుకోవాలి. ప్రతీ బకెట్‌లోనూ ప్రత్యేక పెట్టుబడులు అవసరమని కాదు దీని ఉద్దేశ్యం. భిన్న లక్ష్యాలకు ఒకే విధమైన మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర పెట్టుబడి సాధనాలను వినియోగించుకోవచ్చు. కాకపోతే ప్రతీ లక్ష్యానికి విడిగా కేటాయింపుల ప్రణాళిక ఉండాలి. అంటే లక్ష్యం వారీగా సరిహద్దులను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే పూర్తి స్పష్టత ఉంటుంది. ‘‘అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నామనే దానిపై స్పష్టత ఉంటే ప్రణాళిక అమలు సులభంగా మారుతుంది’’ అని గెట్టింగ్ యూ రిచ్ సీఈవో రోహిత్‌షా అన్నారు. అంచనాలు సరిగ్గా ఉంటేనే.. అన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్న తర్వాత.. విడిగా ఒక్కో లక్ష్యానికి ఇన్వెస్ట్ చేస్తే మీ బాధ్యత తీరినట్టు కాదు.. లక్ష్యాన్ని చేరినట్టు కానే కాదు. ఫలానా లక్ష్యానికి పెట్టుబడులు ప్రారంభింస్తే సగమే పూర్తయినట్టు అనుకోవాలి. కొన్నేళ్ల తర్వాతి అవసరానికి ఎంత మొత్తం కావాలో నిర్ణయించుకునే ముందు కరెన్సీ విలువను, కొనుగోలు శక్తిని తగ్గించేసే ద్రవ్యోల్బణాన్ని మర్చిపోకూడదు. అంతేకాదు లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంపిక చేసుకునే సాధనాల్లో రాబడులపై కచ్చితమైన అంచనాలు ఉండాలి. అధిక రాబడుల అంచనాలు వేసుకుంటే అది చివర్లో అయోమయానికి దారితీయవచ్చు. అందుకే రాబడుల అంచనాలు సహేతుకంగా, చారిత్రక గణాంకాలకు సన్నిహితంగా ఉండేలా చూసుకోవాలి. మీ పెట్టుబడికి ఆ రాబడి అంచనా రేటును జోడిస్తే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంత ఇన్వెస్ట్ చేయాలన్నదానిపై స్పష్టత సాధించొచ్చు. ఇక ద్రవ్యోల్బణ రేటు అన్నింటికీ ఒకటే మాదిరిగా ఉండదు. విద్య, వైద్యానికి సంబంధించి మన దేశంలో ద్రవ్యోల్బణం చాలా ఎక్కువ. నిత్యావసర ఉత్పత్తులపై ద్రవ్యోల్బణం మోస్తరుగా ఉంటుంది. ఇళ్ల ధరల ద్రవ్యోల్బణం 3–4 శాతం స్థాయిల్లోనే ఉంటే.. విద్యా ద్రవ్యోల్బణం 8–10 శాతం స్థాయిలో ఉంటుంది. అంటే ఫలానా కోర్సుకు ప్రస్తుతం రూ.లక్ష ఖర్చవుతుంటే.. ఏడాది తర్వాత అదే కోర్సు కోసం రూ.1.10 లక్షలు అవసరమవుతాయి. పెట్టుబడులపై రాబడులను అధికంగా ఊహించుకోవడం కూడా విఘాతం కలిగించేదే. ఈక్విటీలపై రాబడులు 11–13% దీర్ఘకాలంలో వస్తాయని ఆశించడం సమంజసంగానే ఉంటుంది. అంతేకానీ, 22–24% స్థాయి రాబడులు వస్తాయని అంచనా వేసుకుని ఇన్వెస్ట్ చేస్తూ వెళితే చివర్లో కావాల్సిన మొత్తానికంటే తక్కువే సమకూరొచ్చు. అందరికీ ఈక్విటీ కేటాయింపులు అధికంగా ఉండాలనేమీ లేదు. ఈక్విటీలకు తక్కువ కేటాయింపులతోనూ దీర్ఘకాలంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు. కాకపోతే అప్పుడు రాబడులపై అంచనాలు మోస్తరుగానే ఉండాలి. అందుకు కావాల్సినంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అస్సెట్ అలోకేషన్... ఇన్వెస్టర్లు తమ రిస్క్ సామర్థ్యం, లక్ష్యానికి ఉన్న వ్యవధి, ఎంపిక చేసుకునే సాధనాలు, రాబడుల అంచనాలకు అనుగుణంగా ఎంత ఇన్వెస్ట్ చేయాలన్నది నిర్ణయమవుతుంది. అప్పుడే వివిధ సాధనాల మధ్య ఎంత చొప్పన ఇన్వెస్ట్ (అస్సెట్ అలోకేషన్) చేసుకోవాలన్న స్పష్టతకు రాగలరు. ఆర్జన మొదలు పెట్టిన కొత్తలో ఈక్విటీలకు 75–80 శాతం కేటాయింపులు సరైన విధానమే అవుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ, లక్ష్యాలకు చేరువ అవుతున్న తరుణంలోనూ ఈక్విటీలకు కేటాయింపులను 80 శాతం చొప్పున కొనసాగించుకుంటూ వెళ్లడం సరికాదు. ముఖ్యంగా గడిచిన 18–24 నెలల రాబడులను ప్రామాణికంగా చూడొద్దు. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత మార్కెట్లు కుప్పకూలి తిరిగి భారీ ర్యాలీ చేశాయి. 15–20 ఏళ్లలో ఈక్విటీల నుంచి 11–12 శాతం రాబడులు ఆశించడం సహేతుకం అవుతుంది. అదే డెట్, ఈక్విటీల కలబోతపై రాబడులు 9–10 శాతం స్థాయిలో ఉంటాయని ఆశించొచ్చు. స్థిరాదాయ సాధనాల నుంచి 7–8 శాతం రాబడులకు మించి ఆశించొద్దు. సమీక్ష, దిద్దుబాటు.. మీరు చేస్తున్న పెట్టుబడులపై రాబడి అంచనాలకు తగ్గట్టుగా లేదనుకోండి.. లేదంటే మీరు వేసుకున్న అంచనాలకు మించి ద్రవ్యోల్బణం ఉందని గుర్తించినట్టయితే.. తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణం అనుకున్నదానికంటే ఒక శాతం ఎక్కువ ఉన్నా అదనంగా సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఇందుకు వీలుగా పెట్టుబడులను ఏడాదికోసారి సమీక్షించుకోవాలి. ఏటా పెట్టుబడిని నిర్దేశిత శాతం మేర పెంచుకుంటూ వెళ్లడం ఒక పరిష్కారం అవుతుంది. అస్సెట్ రీబ్యాలన్స్ను అమలు చేయాలి. లక్ష్యానికి చేరువ అవుతున్న సమయంలో అస్సెట్ అలోకేషన్ పక్కాగా ఉండాలన్నది నిపుణుల సూచన. అనుకున్నట్టుగా ఆర్థిక ప్రణాళిక ముందుకు వెళ్లడం లేదని ఎప్పుడు భావించినా.. నిపుణులైన ఆర్థిక సలహాదారుల సాయం తీసుకోవడానికి వెనుకాడొద్దు. లక్ష్యాన్ని సమీపిస్తుంటే... లక్ష్యానికి చేరువు అవుతున్న క్రమంలో స్టాక్ మార్కెట్ ఏదైనా సంక్షోభం కారణంగా కుప్పకూలితే పరిస్థితి ఏంటి? ఆ సమయంలో మరింత పెట్టుబడికి మొగ్గు చూపించొచ్చు. తద్వారా తక్కువ ధరలకే ఎక్కువ యూనిట్లు సమకూరతాయి. కాకపోతే ఈక్విటీ మార్కెట్ బేర్ దశ నుంచి బయటకు వచ్చేందుకు 2–3 ఏళ్ల సమయం పట్టొచ్చు. అరుదుగా ఐదేళ్లు అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే అప్పుడు ఏం చేయాలన్నది కూడా ముందుగానే నిర్ణయించుకోవాలి. కనుక లక్ష్యానికి మరో 3–4 ఏళ్లు వ్యవధి ఉండగానే ఈక్విటీ పెట్టుబడుల నుంచి ప్రతీ నెలా నిర్ణీత శాతం చొప్పున డెట్ సాధనాలకు మళ్లించుకోవాలి. ఇందుకు సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. లక్ష్యం మరో 18 నెలలు ఉందనగా అనుకున్నంత సమకూరడం లేదని తెలిస్తే.. అప్పుడు ఈక్విటీల్లో మరింత ఇన్వెస్ట్ చేయడం ద్వారా అంతరాన్ని పూడ్చుకుందామనుకుంటే తప్పు చేసినట్టు అవుతుంది. మరో 2–3 ఏళ్ల వ్యవధి ఉంటే ఈక్విటీ కేటాయింపులు పెంచుకోవడం సరికాదు. దీనికి బదులు వీలైతే ఆ లక్ష్యాన్నే వాయిదా వేసుకోవడం ఒక మార్గం. విశ్రాంత జీవనం, పిల్లల ఉన్నత విద్య లక్ష్యాలకు ఈ వాయిదా కుదరదు. కానీ, కారు కొనుగోలు, ఇల్లు కొనుగోలు, ఇతర విలాస వస్తువుల కొనుగోలును వాయిదా వేసుకోవచ్చు. అటువంటి సందర్భాల్లో ఇతర లక్ష్యాల నిధి నుంచి కొందరు తీసేసుకుంటారు. కారు కొనుగోలు వంటి అవసరం కాని నిధి నుంచి తీసుకుంటే తప్పులేదు. కానీ, పిల్లల విద్య, విశ్రాంత జీవనం లక్ష్యాల నుంచి తీసుకోవడం సరికాదు. అటువంటప్పుడు విద్యా రుణం వంటి మార్గాలను పరిశీలించొచ్చని షా సూచించారు. -
వచ్చే ఏడాది ‘వేతన’ పండుగ!
ముంబై: భారత్‌లో వచ్చే ఏడాది వేతన పెంపులు అధిక స్థాయిలో ఉండొచ్చంటూ అంతర్జాతీయ అడ్వైజరీ సంస్థ ‘విల్లిస్ టవర్స్ వాట్సన్’ అంచనా వేసింది. 2021లో వేతన పెంపులు సగటు 8 శాతం స్థాయిలో ఉంటే, 2022లో సగటున 9.3 శాతానికి పెరగొచ్చంటూ ‘శాలరీ బడ్జెట్ ప్లానింగ్ రిపోర్ట్’లో పేర్కొంది. ఉద్యోగులను నిలుపుకోవడం, వారిని ఆకర్షించే సవాళ్లను కంపెనీలు ఎదుర్కొంటున్నాయని.. ఈ నేపథ్యంలో ఎక్కువ వేతన పెంపుల దిశగా అడుగులు వేయక తప్పదన్నది ఈ సంస్థ విశ్లేషణ. వచ్చే 12 నెలల కాలానికి మెరుగైన వ్యాపార పరిస్థితుల దృష్ట్యా.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్‌లోనే ఎక్కువ వేతనాల పెంపు ఉంటుందని తన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఈ సంస్థ ద్వైవార్షిక సర్వే నిర్వహించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 13 దేశాల్లోని 1,405 కంపెనీల అభిప్రాయాలను తెలుసుకుంది. ఇందులో 435 భారత కంపెనీలు కూడా ఉన్నాయి. భారత్‌లో మెజారిటీ కంపెనీలు (52.2 శాతం) వచ్చే ఏడాది కాలానికి సానుకూల వ్యాపార ఆదాయ అంచనాలను వెల్లడించినట్టు ఈ నివేదిక తెలియజేసింది. 2020 నాలుగో త్రైమాసికంలో ఉన్న 37 శాతం కంటే ఇది ఎంతో మెరుగుపడినట్టు ప్రస్తావించింది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న దానికి ఇది నిదర్శనంగా పేర్కొంది. సర్వే నివేదికలోని వివరాలు.. ► 30 శాతం కంపెనీలు వచ్చే 12 నెలల్లో నియామకాలను పెంచనున్నట్టు తెలిపాయి. 2020లో ఉన్న గణాంకాలతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. ► ఇంజనీరింగ్ (57.5 శాతం) ఐటీ (53.4 శాతం) సాంకేతిక నైపుణ్యాలతో కూడిన ట్రేడింగ్ (34.2 శాతం), విక్రయాలు (37), ఫైనాన్స్ 11.6 శాతం చొప్పున నియామకాలు ఉండనున్నాయి. ► ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్‌లోనే అట్రిషన్ (ఉద్యోగుల వలస) రేటు తక్కువగా ఉంది. స్వచ్చంద అట్రిషన్ రేటు (ఉద్యోగులు స్వయంగా మారిపోవడం) 8.9 శాతంగా, స్వచ్ఛందం కాని (కంపెనీలే ఉద్యోగులను తొలగించడం) అట్రిషన్ రేటు 3.3 శాతంగా ఉంది. ► 2022లో హైటెక్ రంగంలో 9.9 శాతం మేర వేతన పెంపు ఉండనుంది. ఆ తర్వాత కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, రిటైల్ రంగ్లాలో 9.5 శాతం మేర, తయారీలో 9.30 శాతం మేర పెంపు ఉండొచ్చు. నిపుణులను నిలబెట్టుకోవడం సవాలు.. ‘‘వ్యాపార ఆశావాదం పెరగడం అధిక వేతన బడ్జెట్‌కు, అధిక నియామకాలకు దారితీయనుంది. ఉద్యోగులపై ఖర్చు పెట్టే విషయంలో కంపెనీలకు కరోనా మహమ్మారి ఒక వాటర్òÙడ్ విప్లవం వంటిది’’ అని విల్లిస్ టవర్స్ వాట్సన్ కన్సలి్టంగ్ లీడర్ ఇండియా రాజుల్ మాథుర్ పేర్కొన్నారు. -
ఆస్పత్రికి డబ్బుల్లేక చందాలు.. క్రికెటర్ క్రిస్ కెయిన్స్ జీవితం నేర్పే పాఠాలివే!
ఇప్పుడు న్యూజిల్యాండ్ అంటే కెయిన్ విలియమ్సన్ గుర్తొస్తాడు. ముఖ్యంగా మన తెలుగు వాళ్లయితే ముద్దుగా కెన్ మామ అని పిలుస్తారు. కానీ కెయిన్ కంటే ముందే ఇండియన్ల మనసు దోచుకున్న క్రికెటర్ మరొకరు ఉన్నారు అతనే క్రిస్ కెయిన్. ఇండియాతో జరిగిన మ్యాచుల్ల్లో బ్యాటు, బాల్‌తో అద్భుత ప్రదర్శన చేసిన కెయిన్స్ మనకు ఓటమి రుచి చూపించాడు, కానీ నిజ జీవితంలో ఆర్థిక పాఠాలు నేర్చుకోలే తానే ఓటమి అంచున ఉన్నాడు. సాక్షి, వెబ్‌డెస్క్: ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వడం సహజమే. కానీ, దానికి కారణమయ్యే పరిస్థితులు మాత్రం మన చేతుల్లోనే ఉంటాయన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం. సాధారణంగా డౌన్ టు హై సక్సెస్ స్టోరీలు మనిషికి ఒక ఊపుని ఇస్తే... హై టు డౌన్ స్టోరీలు గుణపాఠాలు నేర్పుతుంటాయి. క్రికెట్లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న క్రిస్ కెయిన్స్ కథ.. రెండో కేటగిరీకి చెందిందే. రిటైర్ అయ్యాక విలాసాలకు బానిసై.. చివరికి రోడ్డున బస్సులు కడిగే స్థాయికి చేరుకుని వార్తల్లో నిలిచింది ఈ మాజీ ఆల్‌రౌండర్ జీవితం. న్యూజిల్యాండ్ స్టార్ హాలీవుడ్ హీరో లాంటి రూపం, రింగుల జుత్తు.. మీడియం పేస్‌తో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నాడు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్. గాయాలు ఆయన కెరీర్‌ను కిందకి లాగేశాయి. దీంతో ఆడే వయసులో ఉండగానే 2006లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటికే ఇటు టెస్టులు, వన్డేల్లో న్యూజిల్యాండ్ స్టార్ ఆటగాడు కెయిన్స్. ఆల్‌రౌండర్ ఇయాన్ బోథమ్ తర్వాత ఆ స్థాయిని అందుకున్న రెండో కివీస్ క్రికెటర్ తను ఎదిగాడు. పైసల్లేక ఎలాంటి ఆర్థిక ప్రణాళిక లేకుండా గడిపేయడం క్రిస్ కెయిన్స్ జీవితాన్ని నిండా ముంచేసింది. ఒకప్పుడు నలుగురి మధ్య హుందాగా బతికిన కెయిన్స్ చివరకు బస్సులు కడిగే క్లీనర్ స్థాయికి చేరుకున్నాడు. గంటకు 17 డాలర్లు సంపాదించే జీవితంలో కొన్నాళ్లు గడిపాడు. క్రికెటర్‌గా రిటైర్మెంట్ ప్రకటించి డైమండ్ ట్రేడర్‌గా కొత్త మలుపు తీసుకున్న క్రిస్ కెయిన్స్ కెరీర్ దశాబ్దం తిరగకుండానే బస్సు డ్రైవర్ స్థాయికి చేరుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగానే మారింది. ఈ క్రమంలో గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి... ట్రీట్మెంట్ కోసం దాతల వైపు చూడాల్సిన దీనస్థితికి చేరుకున్నాడు. ఒకప్పుడు మూడున్నర క్యారెట్ల వజ్రాల రింగుతో తనకు ప్రపోజ్ చేసిన భర్త, ఆస్పత్రి ఖర్చులకు పైసా లేక ఇబ్బంది పడుతున్న తీరుని చూసి కెయిన్స్ భార్య మెలనీ కన్నీటి పర్యంతం అవుతోంది. అదుపులేని ఖర్చులతో కెయిన్స్ వజ్రాల వ్యాపారిగా న్యూజిలాండ్‌లో ఓక్టగాన్ కంపెనీని సక్సెస్‌ఫుల్‌గానే నడిపించాడు. కానీ, డబ్బుని పొదుపు చేయడంలో ఘోరంగా విఫలం అయ్యాడు. వస్తున్న రాబడి చేస్తున్న ఖర్చులకు పొంతన లేని జీవితానికి అలవాటు పడ్డాడు. ముఖ్యంగా ఆకర్షణ మోజులో పడి అవసరం లేనివి కొనడం అతనికి వ్యసనంగా మారింది. చివరకు అదే కెయిన్స్ జీవితాన్ని నిండా ముంచింది. విలాసాలకు అలవాటుపడి అడ్డగోలుగా ఖర్చు పెట్టాడు. చివరకు రాబడి తక్కువ అప్పులు ఎక్కువ అయ్యే పరిస్థితి ఎదురైనా అతని తీరులో మార్పు రాలేదు. చివరకు భారీ నష్టాలతో డైమండ్ కంపెనీ మూసేయాల్సి వచ్చింది. ఇదంతా ఐదేళ్ల వ్యవధిలోనే జరిగిపోయింది. ఒక క్రీడాకారుడిగా గెలుపోటముల గురించి కెయిన్స్‌కి కొత్తగా చెప్పక్కర్లేదు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటే గెలుపును తన వశం చేసుకునేవాడు. కానీ అవసరాలు మించి ఖర్చు చేసే నైజం అతడిలోని స్పోర్ట్స్‌మన్ స్పిరిట్‌ని కూడా నాశనం చేసింది. అందువల్లే చిన్నాచితకా పనులు చేస్తూ సంపాదించిన డబ్బును నిర్లక్ష్యంగానే ఖర్చు చేశాడు. ఫలితంగా కనీసం ఇన్సురెన్స్ కూడా చేయించుకోలేదు. చివరకు ప్రాణాపాయ స్థితిలో మరొకరిపై ఆధారపడాల్సిన దుస్థితిలోకి తనంతట తానుగా వెళ్లి పోయాడు. అవనసర ఖర్చులు వద్దు అనవసర ఖర్చులకు తగ్గించుకోవడం ఎంతో అవసరం. ఆకర్షణల మోజులో పడి అనవసరమైన వస్తువులపై మన డబ్బులు వెచ్చించడం వల్ల తాత్కాలిక ప్రయోజానాలు తీరుతాయే తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు. అందువల్లే మన ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, ఏ అంశాలపై ఎంత ఖర్చు చేస్తున్నామనే దానికి సంబంధించి స్పష్టమైన ప్రణాళిక వేసుకోవాలి. అనవసర ఖర్చులను సాధ్యమైనంతగా తగ్గించాలి. ఇది లోపించడం వల్ల క్రిస్ కెయిన్స్ దుర్భర పరిస్థితిల్లోకి జారుకున్నాడు. ఎంత సంపాదిస్తున్నామనేది ముఖ్యం కాదు ప్రముఖ ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి అభిప్రాయం ప్రకారం మనం ఎంత సంపాదిస్తున్నామనేది ముఖ్యం కాదు. మనం ఎంత మిగుల్చుతున్నాం, సమయానికి అది మనకు ఎలా ఉపయోపడుతుంది, ఎన్ని తరాలకు సరిపడ డబ్బు మనదగ్గర ఉందని అనేదే ముఖ్యం. డబ్బును ఎక్కువ కాలం పొదుపు చేయడం, జాగ్రత్త దాచడం అనేది డబ్బు సంపాదించడం కంటే ఎంతో కష్టమైన పని అని కియోసాకి అంటారు. కెయిన్స్ విషయంలో ఈ పొరపాటు నూటికి నూరుపాళ్లు జరిగింది. డబ్బు సంపాదిస్తున్నానే భ్రమలో పడి పొదుపు, చేయడం భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా దాచుకోవడంపై నిర్లక్షం చేశాడు. అందువల్లే పదేళ్లలోనే ఆకాశం నుంచి అథఃపాతాళానికి చేరుకున్నాడు. ఖర్చులు కాదు పెట్టుబడి కావాలి డబ్బును పెట్టుబడిగా మార్చితే డబ్బుని డబ్బే సంపాదిస్తుంది. అందుకు కావాల్సింది ఓపిక, సహానం. వెనువెంటనే లాభాలు వచ్చి పడాలి అన్నట్టుగా ఖర్చు పెట్టడం కాకుండా క్రమ పద్దతిలో పొదుపు చేసిన లేదా అందుబాటులో ఉన్న డబ్బును పెట్టుబడిగా మార్చితే లాంగ్ రన్లో ఆర్థికంగా దన్నుగా నిలుస్తుంది. వారెన్ బఫెట్ మొదలు ఎందరో కుబేరులు ఈ సూత్రం ఆధారంగానే కోటీశ్వరులు అయ్యారు. ఉదాహరణకు 12 శాతం రిటర్నలు వస్తాయనే నమ్మకంతో ప్రతీనెల రూ.5000 వంతున మార్కెట్లో పెట్టుబడిగా పెడితే 20 ఏళ్లు తిరిగే సరికి 12 లక్షల పెట్టుబడి మీద 37 లక్షల రిటర్న్ దక్కుతుంది. మొత్తంగా ఇరవై ఏళ్లు పూర్తయ్యే సరికి 50 లక్షల రూపాయలు మనకు అండగా ఉంటాయి. అయితే కెయిన్స్ పెట్టుబడులు పెట్టకుండా ఖర్చులు పెట్టుకుంటూ పోయాడు. దీంతో రివర్స్ పద్దతిలో పదేళ్లు పూర్తవకముందే చేతిలో చిల్లిగవ్వ లేని స్థితికి చేరుకున్నాడు. ఆలోచన ధోరణి మారాలి డబ్బు సంపాదించాలంటే ఏళ్లు పట్టవచ్చు, కానీ దాన్ని కోల్పోవడానికి క్షణాలు చాలు. కాబట్టి డబ్బు కంటే ముఖ్యమైంది మన ఆలోచనా ధోరణి. పేదరికం, డబ్బు పట్ల మనకున్న దృక్పథం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చలేము అనుకుంటూ అలానే ఉండిపోతాం. అలా కాకుండా ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే అన్ని విషయాలు మనకే తెలియక్కర్లేదు. ఆర్థిక నిపుణులను కలిస్తే మన ఆదాయానికి తగ్గట్టుగా పెట్టుబడి ఎలా పెట్టాలో చెబుతారు. వాటిని పాటించినా చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు తప్పించుకోవచ్చు. క్రీడాకారుడిగా అంతర్జాతీయ గుర్తింపు ఉన్న కెయిన్స్ అడిగితే ఆర్థిక సలహాలు ఇచ్చే వారు కోకొల్లలు. కానీ తన చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చాలని అతను బలంగా కోరుకోలేదు. అందుకే స్టార్ క్రికెటర్ నుంచి క్లీనర్‌గా, ట్రక్ డ్రైవర్‌గా దిగజారిపోతూనే వచ్చాడు. -
రూ.100 నోటు షాకింగ్ న్యూస్!
సాక్షి, న్యూఢిల్లీ: అనూహ్యంగా పెద్ద నోట్ల రద్దుతో దేశ ప్రజలకు షాకిచ్చిన కేంద్రం మరో కీలక నిర్ణయాన్ని తీసుకోనుం దా? తాజా వార్తలు, సాక్షాత్తు ఆర్బీఐ కీలక అధికారి దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు ఈ అనుమానాలనే బలపరుస్తున్నాయి. 2021 ఏడాదిలో మరో షాకింగ్ నిర్ణయం దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యోచిస్తోంది. తాజా సమాచారం ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ నాటికి ప్రస్తుతం చలామణిలో ఉన్న కొన్ని పాత కరెన్సీ నోట్లను విత్‌డ్రా చేసుకునే ఆలోచనలో ఉంది. ఈ మేరకు కేంద్ర బ్యాంకు యోచిస్తున్నట్లు ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బీ మహేష్ శుక్రవారం వెల్లడించారు. జిల్లా పంచాయతీలోని మంగళూరు, నేత్రావతి హాల్లో జిల్లా లీడ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి భద్రతా కమిటీ (డిఎల్ఎస్సి), జిల్లా స్థాయి కరెన్సీ మేనేజ్మెంట్ కమిటీ (డిఎల్ఎంసి) సమావేశంలో బీ మహేష్ మాట్లాడుతూ రూ.100, రూ .10, రూ .5 పాత కరెన్సీ నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకోనుందనే హింట్ ఇచ్చారు. అలాగే 10 రూపాయల నాణెం ప్రవేశపెట్టి 15 సంవత్సరాల తరువాత కూడా వ్యాపారులు, వ్యాపారవేత్తలు సహా చాలామంది వాటిని అంగీకరించడానికి ఇష్టపడ్డంలేదన్నారు. నకిలీవని వారు అనుమానిస్తుండటంతో బ్యాంకులు, ఆర్బీఐకి సమస్యగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో 10 రూపాయల నాణెంపై ప్రజల్లో అవగాహన కల్సించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే మరి పాత నోట్లను మార్చుకునేందుకు ఎంత సమయం ఇస్తుంది అనేదానిపై క్లారిటీ లేదు. దీనికి సంబంధించి ఆర్బీఐ అమలుచేయనున్న సమగ్ర ప్రణాళిక, విధివిధానాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. కాగా నవంబర్ 8, 2016లో రూ.500,1000 రూపాయల నోట్ల డీమోనిటైజేషన్ తర్వాత రూ .2,000 విలువైన కరెన్సీ నోట్‌తో పాటు రూ .200 నోటును ప్రవేశపెట్టింది. 2019లో 100 రూపాయల విలువైన కొత్త కరెన్సీ నోట్లను తీసుకొచ్చింది. 2019 లో, సెంట్రల్ బ్యాంక్ రూ.2000 నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు ఇచ్చిన ఆర్టిఐ సమాధానంలో ఆర్బీఐ వెల్లడించింది. దీంతో త్వరలోనే 2వేల నోటును కూడా రద్దు చేయనుందనే వార్తలు హల్చల్ చేశాయి. అయితే అలాంటి ఆలోచన ఏదీ లేదని కేంద్రం, ఆర్బీఐ అప్పట్లోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
మీ అడుగులు ఎటువైపు..
సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఎన్నో పాఠాలు నేర్పిన సంవత్సరం.. 2020. ఒక మహమ్మారి (కోవిడ్–19) వ్యక్తుల ఆర్థిక ప్రణాళికలను కుదిపేసింది. పెట్టుబడులపై దీని ప్రభావం గణనీయంగానే పడింది. ఈ అనుభవాలను పాఠాలుగా తీసుకుని.. భవిష్యత్తు పరిస్థితులపై ఒక అంచనాతో 2021 సంవత్సరానికి ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలని భావిస్తున్నారా..? పెట్టుబడుల విషయంలో ఏ విభాగంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? ఫండ్ మేనేజర్ల అభిప్రాయాల సమాహారమే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం. ఈక్విటీలు రంగాలు.. ప్రస్తుతానికి అయితే అన్ని రకాల స్టాక్స్ ర్యాలీ చేస్తున్నాయి. కొన్ని రంగాల్లో డిమాండ్ బలంగానే ఉంది. వ్యయ నియంత్రణలు, ఆస్తుల నాణ్యత పరంగా మెరుగైన పనితీరు చూపిస్తున్నాయి. మహమ్మారిని నియంత్రించడం ఆలస్యమైనా లేదా వడ్డీ రేట్లు తక్కువ స్థాయిల్లో కొనసాగకపోయినా రంగాల వారీగా ర్యాలీ కొన్ని స్టాక్స్‌కే పరిమితం కావొచ్చు. జీడీపీ వృద్ధి తీరుపైనే మార్కెట్ రాబడులు ఆధారపడి ఉంటాయి. 2–5 ఏళ్ల కాల దృష్టితో ఇన్వెస్టర్లు పెట్టుబడుల నిర్ణయం తీసుకోవాలి. – శ్రేయాష్ దేవల్కర్, సీనియర్ ఫండ్ మేనేజర్, యాక్సిస్ ఏఎమ్‌సీ మిడ్, స్మాల్‌క్యాప్ మార్చి, జూన్ త్రైమాసికాలపై లాక్డౌన్ ప్రభావం చూపించగా.. ఆదాయాల పరంగా మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీలు 2020 సెప్టెంబర్ నాటికి మంచి రికవరీని చూపించాయి. అంతర్జాతీయంగా వెల్లువలా ఉన్న లిక్విడిటీ (నగదు లభ్యత) కూడా స్టాక్స్ ధరలను గరిష్టాలకు తీసుకెళ్లాయి. ఎర్నింగ్స్ రికవరీ ఆలస్యమవుతుందన్న అంచనాలతో మిడ్, స్మాల్‌క్యాప్ విభాగంలో.. ఇప్పటికీ బ్యాంకింగ్, ఎంటర్టైన్మెంట్, రిటైల్ స్టాక్స్ పనితీరు నిరుత్సాహకరంగానే ఉంది. కొన్ని రంగాల/స్టాక్స్ విలువలు చాలా ఎక్కువలోనే ఉన్నాయి. కనుక అధిక ఆశావాదంతో కాకుండా బలహీన కంపెనీల్లో పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఆటోమొబైల్, సిమెంట్, ఇంజనీరింగ్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విలువలు చూడ్డానికి అధికంగా ఉన్నాయి. కానీ, అవి తక్కువ ఆర్జనా సైకిల్లో (కాలంలో) ఉన్నాయి. ఆదాయాల్లో రికవరీ మొదలైతే ఇవి మంచి రాబడులను ఇవ్వగలవు. అధిక వ్యాల్యూషన్ల దృష్ట్యా ఏడాది కోసం అయితే స్మాల్, మిడ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయవద్దనే సూచిస్తున్నాము. ప్రస్తుతం చూస్తున్న అనిశ్చిత పరిస్థితుల్లో 2021 సంవత్సరానికి ప్రత్యేకంగా ఏ అంచనాలు ఇవ్వడం వివేకమని భావించడం లేదు. కనీసం ఐదేళ్ల కంటే ఎక్కువ కాలానికి ఇన్వెస్టర్లు ఈ విభాగంలోని స్టాక్స్‌లో పెట్టుబడుల వైపు చూడొచ్చు. ఏ స్టాక్స్.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నాము. అంతర్జాతీయంగా టెక్నాలజీ అనుసరణ పెరగడం వీటికి కలసివస్తుంది. అలాగే, ఆరోగ్య రంగ అవసరాలు పెరగడం అమెరికాలో స్పెషాలిటీ జనరిక్స్‌కు కలసిరానుంది. కరోనా తర్వాత డిమాండ్ కోలుకోవడం ఇందుకు తోడు కానుంది. అదే విధంగా కన్జూమర్ డిస్క్రిషనరీ రంగం కూడా క్రమంగా తెరిచే ఆర్థిక వ్యవస్థతో ప్రయోజనం పొందే రంగం అవుతుంది. ఆటోమొబైల్, సిమెంట్, ఇంజనీరింగ్ పట్ల కూడా సానుకూల అంచనాతో ఉన్నాము. ఆయిల్, గ్యాస్, పవర్ యుటిలిటీలు, మెటల్స్‌కు ఈ దశలో దూరంగా ఉంటాము. – వినిత్ సంబ్రే, హెడ్ (ఈక్విటీస్), డీఎస్పీ ఇన్వెస్ట్మెంట్ డెట్ వడ్డీ రేట్లు..! రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉండడం, ఆర్బీఐ చర్యల కారణంగా విస్తారమైన నిధుల అందుబాటు నెలకొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు లిక్విడిటీ మిగులుగానే ఉంటుంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనుకూలతల దృష్ట్యా స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి (ఐదేళ్ల వరకు) ఈల్డ్ కర్వ్ అధికంగానే ఉండొచ్చు. పాలసీ సర్దుబాట్లు క్రమంగా ఉండొచ్చు. ఈల్డ్ కర్వ్ చాలా నిటారుగా ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యామూడేళ్ల కంటే ఎక్కువ కాల దృష్టితో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో అస్థిరతలకు సన్నద్ధంగానూ ఉండాలి. – అనురాగ్ మిట్టల్, ఐడీఎఫ్సీ ఫండ్ ఏ స్టాక్స్.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నాము. అంతర్జాతీయంగా టెక్నాలజీ అనుసరణ పెరగడం వీటికి కలసివస్తుంది. అలాగే, ఆరోగ్య రంగ అవసరాలు పెరగడం అమెరికాలో స్పెషాలిటీ జనరిక్స్‌కు కలసిరానుంది. కరోనా తర్వాత డిమాండ్ కోలుకోవడం ఇందుకు తోడు కానుంది. అదే విధంగా కన్జూమర్ డిస్క్రిషనరీ రంగం కూడా క్రమంగా తెరిచే ఆర్థిక వ్యవస్థతో ప్రయోజనం పొందే రంగం అవుతుంది. ఆటోమొబైల్, సిమెంట్, ఇంజనీరింగ్ పట్ల కూడా సానుకూల అంచనాతో ఉన్నాము. ఆయిల్, గ్యాస్, పవర్ యుటిలిటీలు, మెటల్స్‌కు ఈ దశలో దూరంగా ఉంటాము. – వినిత్ సంబ్రే, హెడ్ (ఈక్విటీస్), డీఎస్పీ ఇన్వెస్ట్మెంట్ ఏవి మెరుగు? ఇన్వెస్టర్లు తమ కాల వ్యవధి, రిస్క్ సామర్థ్యం ఆధారంగా పెట్టుబడులను మూడు బకెట్లుగా వర్గీకరించుకోవాలి. లిక్విడిటీ బకెట్‌ను స్వల్ప కాల అవసరాల కోసం కేటాయించుకోవాలి. కోర్ బకెట్ అధిక నాణ్యతతో కూడిన క్రెడిట్ లేదా డ్యురేషన్ ఫండ్స్‌తో ఉండాలి. స్థిరమైన రాబడులను అందించే విధంగా ఎంపిక ఉండాలి. ఇందుకోసం అల్ట్రాషార్ట్, మీడియం టర్మ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక శాటిలైట్ బకెట్ అన్నది దీర్ఘకాల పెట్టుబడుల కోసం ఉద్దేశించినది. మూడేళ్లకు పైన కాలానికి కేటాయింపులు చేసుకునే వారికి ఇది అనుకూలం. కొంత అస్థిరతలను తట్టుకునే విధంగా ఉండాలి. అయితే స్థూల ఆర్థిక అనిశ్చిత వాతావరణంలో, క్రెడిట్ స్ప్రెడ్స్ కుచించుకుపోయిన దృష్ట్యా క్రెడిట్ రిస్క్ ఫండ్స్ అన్నవి రిస్క్‌కు తగ్గ రాబడులు ఇవ్వవని మా అభిప్రాయం. పసిడి లార్జ్‌క్యాప్.. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్య, పరపతి విధానాలు సులభంగా మారడం కారణంగా వచ్చిన స్టాక్స్ ర్యాలీ ఇది. అధిక ఫ్రీ క్యాష్ ఫ్లో (వ్యాపారంలో నగదు లభ్యత), తక్కువ రుణ భారం, అధిక ఆర్‌వోఈ (ఈక్విటీపై రాబడి) ఉన్న కంపెనీల్లోకి పెట్టుబడులు ప్రవాహంలా వచ్చాయి. గడిచిన రెండు త్రైమాసికాల గణాంకాలను పరిశీలిస్తే.. పండుగుల సీజన్‌తో ధరల పరంగా కంపెనీలకు స్వేచ్ఛ (ప్రైసింగ్ పవర్) తిరిగి లభించింది. డిమాండ్ ఎక్కువగా ఉండడానికి తోడు, ఇప్పటికీ కొన్ని రంగాల్లో సరఫరా పరంగా సమస్యలు ఇందుకు కారణమై ఉండొచ్చు. ముఖ్యంగా 2021లో ఈ డిమాండ్ నిలదొక్కుకోవడం ఎంతో ముఖ్యమైనది. తక్కువ స్థాయిల్లోనే వడ్డీ రేట్లు కొనసాగడం అనేది రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ వంటి రంగాల్లో దీర్ఘకాలిక రికవరీకి కీలకం అవుతుంది. చాలా కంపెనీల వ్యాల్యూషన్లు అధిక స్థాయిల్లోనే ఉన్నాయి. అయితే, వ్యాక్సిన్లలో పురోగతి, తక్కువ వడ్డీ రేట్లు స్థిరమైన రాబడులకు దారితీయగలవు. ర్యాలీ ముగిసినట్లేనా? కరోనా వ్యాక్సిన్ల తయారీలో పురోగతితో సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న ఆశావహ ధోరణి ఏర్పడింది. దీంతో రిస్కీ సాధనాలకు (ఈక్విటీ తదితర) డిమాండ్ ఏర్పడడంతో బంగారం ర్యాలీ గత కొన్ని వారాలుగా నిలిచింది. అయితే, సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి. పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. వ్యాక్సిన్లను ఇవ్వడం ఆరంభించినా కూడా.. గడిచిన కొన్ని నెలల్లో ఆర్థిక వ్యవస్థకు ఏర్పడిన నష్టం ఒక్క రాత్రితో పోయేది కాదు. పూర్తిగా కోలుకునేందుకు ఐదేళ్లు పడుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా. దీనికి తోడు అభివృద్ధి చెందిన దేశాల్లో వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు మరో విడత పెరిగిపోవడంతో ఆర్థిక రికవరీ బలహీనపడనుంది. మరికొన్ని నెలల పాటు ఈ అనిశ్చిత పరిస్థితులు బంగారం ధరలకు మద్దతుగా నిలుస్తాయి. బంగారం ధరల్లో అప్‌మూవ్ కరోనాకు ముందే మొదలైంది. కాకపోతే అద్భుత ర్యాలీకి కారణాల్లో కరోనా వైరస్ కూడా ఒకటి. బంగారం ధరలకు మద్దతుగా నిలిచిన స్థూల ఆర్థిక పరిస్థితులే 2021లోనూ కొనసాగనున్నాయి. అమెరికా, ఇతర పాశ్చాత్య ప్రపంచంలో కనిష్ట వడ్డీ రేట్లు దీర్ఘకాలం పాటు ఉంటాయని అంచనా వేస్తున్నాము. కనుక యూఎస్ ట్రెజరీల్లో కంటే బంగారంలో పెట్టుబడులను కలిగి ఉండడమే మెరుగైన ఆప్షన్ అవుతుంది. అనూహ్యమైన లిక్విడిటీతో ద్రవ్యోల్బణం రిస్క్ ఉండనే ఉంది. ఇది కూడా బంగారానికి మద్దతుగా నిలిచే అంశమే. గోల్డ్ ఈటీఎఫ్‌లు.. భారత్‌లో బంగారంపై పెట్టుబడుల విషయంలో ఈటీఎఫ్‌ల వాటా గతంలో 10 శాతంగా ఉంటే, 2020లో 25 శాతానికి చేరుకుంది. లాక్డౌన్ కారణంగా భౌతికంగా బంగారం కొనుగోలుకు అననుకూలతలు ఇందుకు కారణమై ఉండొచ్చు. అయితే, డిజిటైజేషన్, బంగారంలో స్వచ్ఛత, ధరలు, సౌకర్యం కూడా ఇన్వెస్టర్లను ఈటీఎఫ్‌లకు దగ్గర చేస్తోంది. కనుక ఈటీఎఫ్‌లకు ఆదరణ కొనసాగుతుంది. బంగారం అన్నది రిస్క్‌ను తగ్గించి, పోర్ట్‌ఫోలియోకు వైవిధ్యాన్నిచ్చే సాధనం. మీ పెట్టుబడుల్లో 10–15 శాతం మేర బంగారానికి ఇప్పటికీ కేటాయించనట్టయితే.. అందుకు ఇది సరైన తరుణం అవుతుంది. తక్కువ ధరల నుంచి ప్రయోజనం పొందొచ్చు. – చిరాగ్ మెహతా, సీనియర్ ఫండ్ మేనేజర్, క్వాంటమ్ ఏఎమ్‌సీ రియల్టీ ఇళ్లకు డిమాండ్ 2020 ద్వితీయ ఆరు నెలల్లో (జూలై నుంచి) నివాస గృహాలకు బలమైన డిమాండ్ నెలకొంది. ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖా తీసుకున్న చర్యలు కొనుగోలు దిశగా నిర్ణయానికి దారితీశాయి. గడిచిన కొన్ని త్రైమాసికాల్లో గృహాల ధరలు చాలా మార్కెట్లలో స్థిరంగా ఉండిపోవడం, కొన్ని చోట్ల దిద్దుబాటుకు (తగ్గడం) గురి కావడం చూశాము. దీంతో అవి అందుబాటు ధరలకు వచ్చేశాయి. తక్కువ వడ్డీ రేట్లు, ఇళ్ల ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల డిమాండ్ పుంజుకుంది. కొత్త ఏడాది! ఇతర పెట్టుబడి సాధనాల పనితీరు, బడ్జెట్లో ప్రకటనలు, కేంద్రం అందించే రాయితీలు, గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఇవన్నీ డిమాండ్‌ను నిర్ణయించేవే. ఆర్థిక వృద్ధిలో సానుకూల ధోరణలు కనిపిస్తున్నప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన సవాళ్లు అంత త్వరగా అంతం కావు. వాణిజ్య రియల్టీ అంతర్జాతీయ, దేశీయ ఐటీ, టెక్నాలజీ రంగంలో క్రమబద్ధమైన వృద్ధి, కార్పొరేట్ల విస్తరణ కారణంగా.. ఆఫీసు స్థలాలకు వృద్ధి కొనసాగుతూనే ఉంది. కీలకమైన వాణిజ్య మార్కెట్లలో ఆఫీస్ స్పేస్ విభాగంలో లావాదేవీల్లో వృద్ధి నెలకొనడమే కాకుండా, సాధారణ స్థితి ఏర్పడుతోంది. వాణిజ్య కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నందున ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నాము. – శిశిర్ బైజాల్, చైర్మన్, ఎండీ, నైట్ ఫ్రాంక్ ఇండియా -
వారంపైగా ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆన్లైన్ పరీక్షల నిర్వహణ సంస్థ అయిన టీసీఎస్ స్లాట్స్ (ఖాళీ తేదీలు) సెప్టెంబర్ నెలలో లేనందున, ఆగస్టులోనే సెట్స్ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈనెలలోనే ఈసెట్, ఎంసెట్ సహా అన్ని సెట్స్‌ను నిర్వహించాల్సి ఉన్నా కోర్టు కేసు కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది. అయితే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెట్స్ నిర్వహించి ప్రవేశాలు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి వీటిని నిర్వహించేలా షెడ్యూలు ఖరారుపై కసరత్తు ప్రారంభించింది. దీనిపై శనివారం అడ్వొకేట్ జనరల్‌తోనూ చర్చించి హైకోర్టుకు తెలియజేయాలని నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్‌తో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తదితరులు శుక్రవారం సమావేశమై సెట్స్ నిర్వహణపై చర్చించారు. ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు. కోర్టు ఆమోదం లభించగానే షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. వారంపైగా ఎంసెట్ పరీక్షలు కరోనా నేపథ్యంలో సెట్స్ నిర్వహణలో భౌతిక దూరం పాటించేలా మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఇందుకోసం ఒక్కో సెషన్లో పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్యను 15–16 వేలకు తగ్గించనున్నట్లు తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. సాధారణంగా ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ పరీక్షలను వారంపైగా నిర్వహించాల్సి ఉంది. 70 వేల మందికిపైగా హాజరయ్యే అగ్రికల్చర్ ఎంసెట్‌ను మూడు సెషన్లలో నిర్వహించనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కో సెషన్‌కు విద్యార్థుల సంఖ్యను తగ్గించి ఇంజనీరింగ్ ఎంసెట్‌ను ఐదు రోజుల్లో 8 నుంచి 9 సెషన్లలో, అగ్రికల్చర్ ఎంసెట్‌ను మూడ్రోజుల్లో నాలుగైదు సెషన్లలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే 55,012 దరఖాస్తులు వచ్చిన ఐసెట్ మూడు లేదా నాలుగు సెషన్లలో, 43,356 దరఖాస్తులు వచ్చిన ఎడ్‌సెట్‌ను మూడు సెషన్లలో, 27,978 దరఖాస్తులు వచ్చిన ఈసెట్‌ను రెండు సెషన్లలో, 21,704 దరఖాస్తులు వచ్చిన పీజీఈసెట్‌ను వీలైతే ఒకే సెషన్లో, 28,805 దరఖాస్తులు వచ్చిన లాసెట్‌ను రెండు సెషన్లలో నిర్వహించే అవకాశం ఉంది. ఆగస్టు మూడో వారంలో లేదా సెప్టెంబర్‌లో ఫైనల్ సెమిస్టర్ ఫైనల్ సెమిస్టర్ విద్యార్థుల పరీక్షలను ఆగస్టు మూడో వారంలో లేదా సెప్టెంబర్‌లో నిర్వహించాలని ఉన్నత విద్యా శాఖ భావిస్తోంది. దీనికి సంబంధించిన కేసు కూడా కోర్టులో ఉండటంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఏఐసీటీఈ మార్గదర్శకాలను కోర్టుకు వివరించి పరీక్షల నిర్వహణ అనుమతి పొందాలని భావిస్తోంది. ఆ తరువాత పరీక్షల నిర్వహణకు యూనివర్సిటీలు షెడ్యూలు జారీ చేసేలా కసరత్తు చేస్తోంది. -
లాక్డౌన్ కొనసాగింపు?
న్యూఢిల్లీ: ఏప్రిల్ 14 తరువాత కూడా కొంతకాలం లాక్‌డౌన్‌ను కొనసాగించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కరోనాను పూర్తిగా కట్టడి చేసేందుకు అదొక్కటే మార్గమని తెలంగాణ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో.. కేంద్రం ఆ దిశగా సమాలోచనలు చేస్తోందని తెలిపాయి. అయితే, లాక్డౌన్ కొనసాగింపునకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మంగళవారం స్పష్టం చేశారు. ఈ విషయంలో ఊహాగానాలు చేయొద్దని సూచించారు. మరోవైపు, అన్ని విద్యాసంస్థల మూసివేతతో పాటు, ప్రార్థన స్థలాల్లో ప్రజలు సామూహికంగా పాల్గొనే మత కార్యక్రమాలపై విధించిన ఆంక్షలు మే 15 వరకు కొనసాగాలని దేశవ్యాప్తంగా కరోనా ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) మంగళవారం సిఫారసు చేసింది. ఏప్రిల్ 14 తరువాత లాక్‌డౌన్‌ను ఎత్తివేసినా లేక కొనసాగించినా ఈ నిర్ణయాలను అమలు చేయాలని సూచించింది. ప్రస్తుత లాక్డౌన్ గడువు ముగిసే ఏప్రిల్ 14 తరువాత నెలకొనే పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని ఆ జీఓఎం చర్చించింది. హోంమంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి పియూష్ గోయల్, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితర మంత్రులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, మతపరమైన కేంద్రాల్లో ఏప్రిల్ 14 తరువాత కనీసం నెల రోజుల పాటు సాధారణ కార్యకలాపాలను ఎట్లిపరిస్థితుల్లో అనుమతించకూడదని జీఓఎం సిఫారసు చేసింది. మత ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ తదితర బహిరంగ ప్రదేశాలపై డ్రోన్లతో సునిశిత పర్యవేక్షణ పెట్టాలని సూచించింది. ఎలాగూ వేసవి సెలవులు ఉంటాయి కనుక జూన్ చివరి వరకు విద్యా సంస్థలను మూసేయడమే సరైన నిర్ణయమని ప్రభుత్వం భావిస్తోంది. కరోనాపై తీసుకునే నిర్ణయాల్లో రాష్ట్రాలు ఇచ్చే సమాచారమే కీలకమని జీఓఎం పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. నిత్యావసర వస్తువుల సరఫరాపై కూడా భేటీలో చర్చించారని, దేశంలో ఎక్కడా వాటి రవాణాకు అడ్డంకులు ఏర్పడలేదని సంబంధిత మంత్రి వివరించారని అధికార వర్గాలు వెల్లడించాయి. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితిపై లోతైన చర్చ జరిపామని జీఓఎం భేటీ అనంతరం రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. 40 కోట్ల మంది మరింత పేదరికంలోకి.. కరోనా వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో మార్చ్ 25 నుంచి లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా సంక్షోభం కారణంగా భారత్‌లో 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు మరింత పేదరికంలోకి వెళ్లే ప్రమాదముం దని అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొంది. మరోవైపు, ఆల్కహాల్ ఉత్పత్తులను అమ్మేందుకు అనుమతించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ (సీఐఏబీసీ) తెలంగాణ, కర్నాటక, రాజస్తాన్, హరియాణా, మహారాష్ట్ర, యూపీ సహా 10 రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. -
ఆడించండి.. ఆస్వాదించండి!
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తోంది. స్వీయ నియంత్రణే కరోనా వైరస్‌కు విరుగుడు అని వైద్యులు పదే పదే చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏకంగా వచ్చే నెల 14 వరకు స్వీయ నియంత్రణ పాటించాలని తేల్చి చెప్పారు. అదే విధంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రజలు పాటించాల్సిన విధానాలు, సూచనలు చేశారు. 14 వరకు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి, సింగిల్ కుటుంబాలు ఎప్పుడూ లేనంతగా ఒకే దగ్గర 20 రోజులకుపైగా ఉండటం అంటే మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద కుటుంబాలైతే ఒకే దగ్గర ఉండటం వల్ల కొన్ని గొడవలు, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకే టీవీలో ఒకే సినిమా చూడాలంటే, ఒకే ఆట ఆడాలంటే అనేక ఇబ్బందులు, మనస్పర్థలు వచ్చే అవకాశమూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో కుంటుంబంలోని సభ్యులంతా వివిధ రకాల పనుల్లో ఉండటం వల్ల వచ్చే నెల 14 వరకు సంతోషంగా గడపొచ్చు. చిన్న పిల్లలకు.. చిన్న పిల్లలను స్కూల్‌కు వెళ్లినట్లుగా ఉదయం పూటే నిద్రలేపాలి. వారికి టైం ప్రకారం టిఫిన్ అందించాలి. ఏవైనా టెక్స్‌బుక్స్ ఇచ్చి దానిని పూర్తి చేయాలని సూచించాలి. అదే విధంగా వివిధ రకాల బొమ్మలు, ఆటలు ఆడుకునేందుకు తగిన సమయం ఇవ్వాలి. కొన్ని గంటల పాటు క్యారంబోర్డు లాంటి ఆటలు ఆడించాలి. అదే సమయంలో ఫోన్లకు దూరం పెట్టడం ఎంతో మంచిదని, ఫోన్లకు అలవాటు పడితే అనేక ఇబ్బందులు వస్తాయని డాక్టర్లు సూచిస్తున్నారు. పెద్దవాళ్లకు.. ఇంట్లో వారు రోజూ ఆఫీసుకు వెళ్లిన తర్వాత పెద్దవాళ్లు వాళ్లకు నచ్చిన టీవీ సీరియల్ లేదా సినిమా చూస్తారు. ఇప్పుడు అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి సీరియల్, నచ్చిన సినిమా పెట్టి వారికి కొంత సమయం కేటాయించాలి. ముందు జాగ్రత్తగా ఉదయం సమయంలోనే భోజనం అందించి, డాక్టర్లు సూచించిన మందులు ఎప్పుడు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. జాయింట్ ఫ్యామిలీ.. ఉమ్మడి కుటుంబాలు అయితే ఇంటిపనుల్లో అందరూ తలోచేయి వే యాలి. ఎక్కడా ఇబ్బందులు లేకుండా పనిని విభజించుకోవాలి. వంట లు, ఇంటి పనుల్లో అందరూ చేయి వేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎవరికి వారు వదిలేస్తే కుటుంబాల్లో తగాదాలు వచ్చే ప్రమాదం ఉంది. -
8 కారిడార్లు.. 140.13 కి.మీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మెట్రో రైలు ప్రాజె క్టు పట్టాలెక్కుతోంది. ఇన్నాళ్లూ ఆలోచనలు, ప్రతిపాదనలు, డిజైన్లలో మార్పులు, డీపీఆర్‌లో చేర్పులతోనే కాలయాపన జరగడంతో ఒకానొక సమయంలో నగరానికి మెట్రో గగన మే అనే ఆలోచనకి ప్రజలు వచ్చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లోనే విశాఖ మెట్రో ప్రస్తావన తీసుకొచ్చింది. దీంతో మెట్రో ప్రాజెక్టుకి పునరుజ్జీవం వచ్చింది. 2015–16 ఆర్థిక సంవత్సర ప్రారంభంలో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు ఈ బాధ్యతల్ని అప్పటి ప్రభుత్వం అప్పగించింది. 3 కారిడార్లతో డీపీఆర్‌ని సిద్ధం చేశారు. మొత్తం రూ. 12,500 కోట్లు ప్రాజెక్టుగా డిజైన్ చేశారు. 2016–17లో ఈ ప్రాజెక్టుని పీపీపీ పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సొంతంగానే ప్రతిప్రాజెక్టూ చేపట్టిన నేపథ్యంలో పీపీపీ విధానంలోకి వెళ్లడంతో సదరు కార్పొరేషన్ పక్కకు తప్పుకుంది. దీంతో ఈ బాధ్యతల్ని అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్(ఏఎంఆర్‌సీ)కి అప్పగించారు. మెట్రో నుంచి.. లైట్ మెట్రోగా... పీపీపీ విధానంలో సాధ్యాసాధ్యాలపై ఆర్ఎఫ్పీకి ఆహ్వానించగా 5 సంస్థలను 2017లో ఎంపిక చేశారు. డీపీఆర్‌లో మార్పులు తీసుకొచ్చి.. మెట్రో రైల్ కాకుండా లైట్ మెట్రోగా ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు. లైట్ మెట్రో వల్ల వ్యయం తగ్గింది. గతంలో రూ.12,500 కోట్లుగా ప్రాజెక్టుని సిద్ధం చెయ్యగా.. లైట్ మెట్రో ప్రాజెక్టు వల్ల రూ.8,300 కోట్లకు అంచనా వ్యయం తగ్గింది. లైట్ మెట్రో వల్ల.. ప్రాజెక్టు స్వరూపం మారకపోయినా.. రైళ్లలో మార్పులు వస్తాయి. మెట్రో కోచ్‌లు తగ్గుతా యి. సాధారణంగా ఒక మెట్రో రైల్ సామర్ధ్యం 600 ఉంటే.. లైట్ మెట్రోలో 400 ప్రయాణికులు ఏక కాలంలో ప్రయాణించగలరు. ఈ విధంగా మార్పులు తీసుకొచ్చిన ప్రాజెక్టుపై 5 సంస్థలు పీపీపీ పద్ధతిలో ఆసక్తి చూపించాయి. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ 52 శాతం భరించగా.. మిగిలిన 48 శాతం నిధుల్ని సదరు కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ భరించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.4,200 కోట్లు కొరియా నుంచి రుణం తీసుకొచ్చేందుకు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అప్పట్లో ప్రయత్నించింది. తరువాత మరుగున పడిపోయింది. తొలిదశలో 35 కి.మీ.. కానీ... వాస్తవానికి 2016 పనులు ప్రారంభించాలన్నది మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి లక్ష్యం. కానీ అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టులో మార్పులు, చేర్పులూ చేస్తూ కాలయాపన చేసింది. 2016లో పనులు ప్రారంభించి తొలిదశలో 35 కి.మీ వరకూ కారి డార్ల పనులు పూర్తి చేసేందుకు 2018 డిసెంబర్‌ని గడువుగా నిర్దేశించుకున్నారు. గత ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడంతో ప్రాజెక్టు ఇంకా పరిశీలన స్థాయిలోనే నిలిచిపోయింది. ఏఎంఆర్‌సీకి 245 ఎకరాలు.. ఈ ప్రాజెక్టుకి నిధులు సమకూర్చుకునేందుకు అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ఏఎంఆర్‌సీకి ప్రభుత్వ భూములు అందించాలని సర్కారు నిర్ణయించింది. నగరంలోని 245 ఎకరాలు ఇచ్చేందు కు ప్రభుత్వం అంగీకరించింది. ఈ భూముల్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి వాటి ద్వారా వచ్చి న ఆదాయాన్ని సముపార్జించుకోనుంది. ఇప్పటికే పలు చోట్ల వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన భూముల్ని గుర్తించారు. ముడసర్లోవలో 100 ఎకరాలు, మధురవాడ క్రికెట్ స్టేడియం సమీపంలో 2 ఎకరాలు, ఎన్వీపీ లా కాలేజీ ఎదురుగా 50 ఎకరాలు రెవిన్యూకి చెందిన భూములతో పాటు శిల్పారామం సమీపంలో 13 ఎకరాలు, టూరిజం శాఖకు చెందిన స్థలం, పరదేశీపాలెంలో రెవెన్యూ, జీవీఎంసీకి చెందిన 80 ఎకరాలు ఏఎంఆర్‌సీకి ఇచ్చేందుకు ప్రతిపాదించారు. మొత్తంగా కొత్త ప్ర భుత్వం వచ్చాక మెట్రో రైలు ప్రాజెక్టు పరుగులు పెట్టేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. ►ప్రారంభంలో ప్రతి స్టేషన్ నుంచి 10 నిమిషాలకో ట్రైన్ ►రద్దీని బట్టి.. ప్రతి రెండు నిమిషాలకో ట్రైన్ పరుగులు ►రెండు 750 వాట్స్ డీసీ కోచ్ ►డిపోలు ఏర్పాటు చేసేలా ప్రాజెక్టు రూపకల్పన ►విమానాశ్రయ ప్రాంతంలో ఒకటి, హనుమంతువాక వద్ద మరొక డిపో ఏర్పాటు హైదరాబాద్ మెట్రో కంటే మిన్నగా... హైదరాబాద్ మెట్రో రైల్ కంటే మిన్నగా విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు ఉండబోతుంది. అన్నింటికీ అనుకూలంగా.. ఇక్కడి వాతావరణానికి అనువుగా ప్రణాళికలు రూపొందించాం. మెట్రో నిర్మాణంలో ప్రస్తుత జాతీయ రహదారి భవిష్యత్తు అవసరాల్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాం. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ స్థలం అందుబాటులో ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నగరంలోని ట్రాఫిక్ పరిస్థితుల్ని అంచనా వేసి ప్రాజెక్టుకి రూపకల్పన చేశాం. ప్రభుత్వం నిర్దేశించే మార్గంలో మెట్రో ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తాం. – రామకృష్ణారెడ్డి, అమరావతి మెట్రోరైల్ ప్రాజెక్టు ఎండీ రాష్ట్రానికే ప్రతిష్టాత్మకం... విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు రాష్ట్రానికే ఎంతో ప్రతిష్టాత్మకమైంది. విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా విశాఖ మెట్రో ప్రాజెక్టుని శరవేగంగా పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాం. నగరంలో ట్రాఫిక్, మెట్రో అవకాశాల్ని పరిశీలించిన తర్వాత సమగ్రమైన ప్రణాళికతో రూట్ మ్యాప్‌ని అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ సిద్ధం చేసింది. – బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ మంత్రి -
ఇంటికి జియో ఫెన్సింగ్
సాక్షి, హైదరాబాద్: స్వగ్రామంలో మీ ఇల్లు ఎక్కడుందో చూసుకోవాలంటే ఏం చేస్తారు. ఠక్కున గూగుల్ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్లి ఇంటిని వెతుకుతారు. ఊరు నమూనా తెలుసు కాబట్టి.. మీ ఇల్లు ఎక్కడుందో పసిగడతారు. అదే ప్రభుత్వం మీ ఇంటి చిరునామా తెలుసుకోవాలంటే.. చాలా కష్ట పడాలి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచన చేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రతి ఇంటిని ‘జియో ఫెన్సింగ్’చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ‘నజరీ నక్షా’ఆధారంగా ప్రతి ఇంటిని ఓ నిర్దిష్ట ఆకారంగా గుర్తిస్తోంది. దీనికోసం ఉపగ్రహ ఛాయాచిత్రాలను వాడుతోంది. వీటిని సాధారణ మ్యాప్‌లతో అనుసంధానించడం ద్వారా ఏ శాశ్వత నిర్మాణం ఎక్కడ ఉందో స్పష్టంగా తెలిసిపోతుంది. జియో రిఫరెన్సింగ్ అని పిలిచే ఈ పద్ధతితో పోలింగ్‌స్టేషన్ పరిధిలో నివసించే ఓటర్లందరి వివరాలను అదే స్టేషన్లో నిక్షిప్తం చేసేందు కు ఈసీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఒకే కుటుంబ సభ్యుల ఓట్లు వేర్వేరు వార్డుల్లో ఉండటంతో గందరగోళం ఏర్పడుతోంది. ఈ సమస్యను మాన్యువల్‌గా అధిగమించేందుకు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఈసీ చేస్తున్న కసరత్తు నజరీ నక్షా ద్వారా పూర్తి కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకు 31,76,699 ఇళ్ల ఆకారాలను గుర్తించగా.. 2,01,255 ఇంటి నంబర్లను అనుసంధానించింది. 2,56,441 ఓటర్ల వివరాలను కూడా సేకరించింది. ఏం చేస్తారంటే.. మొదట నియోజకవర్గ సరిహద్దులను ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా నిర్దారిస్తారు. ఆపై పోలింగ్ కేంద్రాల పరిధిని గుర్తిస్తారు. ఆయా కేంద్రాల పరిధిలోకి వచ్చే ఓటర్ల వివరాలను బూత్‌స్థాయి అధికారి సహకారంతో క్రోడీకరిస్తారు. ఓటరు గుర్తింపు కార్డుల్లోని వివరాల ఆధారంగా ఇళ్లు ఉన్న ప్రాంతాలను, అందులోని సభ్యులను గుర్తిస్తారు. ఈసీ ఈ ఇక్కడి వరకే పరిమితం అవుతుండగా, రెవెన్యూ శాఖ దీనికి అదనంగా ఇళ్లకు జియో రిఫరెన్స్ ఇచ్చే ప్రక్రియకు పూనుకుంటోంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఇటీవల జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశా రు. ఓటర్ల వివరాలకే పరిమి తం కాకుండా.. ప్రజావసరాలకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలని ఆ లేఖలో సూచించారు. ఉపయోగమేంటి.. రేషన్ పంపిణీ నుంచి మౌలి క సదుపాయాల కల్పన వరకు ఈ టెక్నాల జీ ఉపయోగపడనుంది. గ్రామాల్లో వార్డుల విభజన, క్లస్టర్లను తయారీ సులువు కానుంది. పౌరసేవల పరిధిని కూడా నిర్దేశించే వీలుంది. పట్టణాల్లో కష్టమే.. ఈ ప్రక్రియ పట్టణ ప్రాంతాల్లో అనుకున్నంత ఈజీ కాదని నిపుణులు చెబుతున్నారు. పట్టణాల్లో నివసించే వారి చిరునామాలు తరచుగా మారే అవకా శం ఉందని, ఈ మేరకు నివాసం మారినప్పుడల్లా ఈ వ్యవస్థను అప్డేట్ చేసుకోవాలని భావిస్తున్నా రు. ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియలోనూ మార్పులు చేసుకోవాల్సి వస్తుందని చెబుతున్నా రు. ఏదేమైనా రాష్ట్రంలోని శాశ్వత నిర్మాణాలకు జియోఫెన్సింగ్ ఇవ్వడం ద్వారా ప్రజావసరాలను త్వరితగతిన సమకూర్చడంతోపాటు పలు సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలను సులువుగా అమలు చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
విసిగిపోయాం..సొంత పేరు పెట్టుకుంటాం!
సాక్షి. న్యూఢిల్లీ: బ్రిటన్ ట్రావెల్ దిగ్గజం థామస్‌కుక్ దివాలా తీయడం దేశీయంగా సేవలు నిర్వహిస్తున్న థామస్‌కుక్ ఇండియాకు పెద్ద ఇబ్బందులు తెచ్చిపెట్టింది. 2012 నుంచి దేశీయంగా స్వతంత్ర సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న థామస్ కుక్ ఇండియా పేరు మార్చుకోవాలని యోచిస్తోంది. ఎందుకంటే దివాలా తీసిన బ్రిటిన్ సంస్థకు చెందిన 22వేల ఉద్యోగాలు (ప్రపంచవ్యాప్తంగా) ప్రమాదంలో పడనున్నాయి. అలాగే అకస్మాత్తుగా పలు విమానల సర్వీసులను నిలిపి వేయడంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడిక్కడ చిక్కుక పోయారన్న వార్త ఆందోళనకు దారితీసింది. స్టాక్మార్కెట్లో ఈ కౌంటర్లో అమ్మకాల వెల్లువ ఈ రోజు (మంగళవారం) కూడా కొనసాగుతోంది. దీంతో ఈ పరిణామాంలపై స్పందించిన థామస్‌కుక్ (ఇండియా) లిమిటెడ్ (బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీ)కి యుకెసంస్థతో ఎటువంటి సంబంధం లేదని పునరుద్ఘాటించింది. అలాగే తమకు, ప్రస్తుత సంక్షోభానికి ఎలాంటి సంబంధమూ లేదని ప్రకటించింది. నిర్వహణ, లాభాల పరంగా తాము చాలా పటిష్టంగా ఉన్నామని స్పష్టం చేసింది. 2012 నాటికి ఒప్పందం ప్రకారం 2024 వరకు 'థామస్ కుక్' బ్రాండ్ పేరును ఉపయోగించుకునే హక్కు కంపెనీకి ఉందని కంపెనీ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ మాధవన్ మీనన్ వెల్లడించారు. అయితే సంస్థ సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున సంస్థలో సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున రాబోయే రోజుల్లో కూడా దీనిని సమీక్షించే అవకాశం ఉందనీ, దాదాపు రెండు వారాల్లో వివరణాత్మక పరివర్తన ప్రణాళిక అమలుకు సిద్ధంగా ఉన్నామన్నారు. . కాగా థామస్ కుక్ (ఇండియా) లిమిటెడ్‌లో మేజర్ వాటాను(77 శాతం) ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ 2012లో కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఫెయిర్‌బ్రిడ్జ్ క్యాపిటల్ (మారిషస్) లిమిటెడ్ - ఫెయిర్‌ఫాక్స్ కంపెనీ దాదాపు 67 శాతం వాటాను కలిగి ఉంది. చదవండి: కుప్పకూలిన దిగ్గజం, 22 వేల ఉద్యోగాలు ప్రమాదంలో చదవండి : ‘థామస్ కుక్’ దివాలా... -
బల్దియాపై బీజేపీ కార్యాచరణ
సాక్షి, ఆదిలాబాద్: మున్సిపాలిటీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. బల్దియాల్లో పాగా వేయాలని ఆ పార్టీ ఉవ్విల్లూరుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి తమ సత్తా చాటాలనే దృఢ సంకల్పంతో ముందుకు కదులుతోంది. పట్టణాల పార్టీ కేడర్‌లో ఇప్పటికే జోష్ కనిపిస్తోంది. ఎన్నికలు ఇప్పుడే వచ్చినా ఢీ అనేందుకు సిద్ధమవుతున్నారు. కార్యాచరణ ఇలా.. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కమలం పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా లోక్‌సభ నియోజకవర్గాల వారీగా మున్సిపల్ ఎన్నికల కోసం క్లస్టర్ ఇన్చార్జీలను నియమించింది. ఆదిలాబాద్ పార్లమెంట్ క్లస్టర్‌కు ఇన్‌చార్జీగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బా పురావును నియమించింది. దీనికి సంబంధించి రెండు రోజుల కిందే పార్టీ నుంచి ప్రకటన వెలబడింది. పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ఆదిలా బాద్, నిర్మల్, భైంసా, ఖానాపూర్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలకు పార్టీ పరంగా ఆయన ఇన్‌చార్జీగా వ్యవహరించనున్నారు. ఆదిలా బాద్, నిర్మల్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో గతంలో టీఆర్ఎస్, భైంసాలో ఏఐఎంఐఎం పార్టీలు గెలుపొందాయి. ఖానాపూర్ మున్సిపాలిటీగా మారిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఇటు టీఆర్ఎస్తోపాటు అటు ఏఐఎంఐఎంతో పోరుకు సిద్ధమవుతోంది. గతంలో ప్ర త్యక్ష ఎన్నికల ద్వారా ఆదిలాబాద్, నిర్మల్ ము న్సిపాలిటీల్లో బీజేపీ గెలుపొందింది. అయితే ఆ తర్వాత జరిగిన పరోక్ష ఎన్నికల్లో ఆ పార్టీ ఈ రెండు మున్సిపాలిటీలతోపాటు మిగతా ము న్సిపాలిటీల్లోనూ నామమాత్రంగా ప్రభావం చూపెట్టింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుపొందింది. ఆయా చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన సోయం బాపురావును ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు ఇన్‌చార్జీగా నియమించడంతో పార్టీ కేడర్‌లో జోష్ కనిపిస్తోంది. పక్కా ప్రణాళిక.. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాగైనా పాగా వే యాలని చూస్తున్న బీజేపీ తగు ప్రణాళిక రూ పొందిస్తుంది. అయితే రిజర్వేషన్లు ఖరారు త ర్వాతే ఈ కార్యాచరణకు బీజం వేయాలని చూ స్తున్నారు. ఆదిలాబాద్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, రాష్ట్ర నాయకురాలు సు హాసిని రెడ్డి మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్ రిజర్వేషన్ జనరల్ ఉన్న పక్షంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ అయినటువంటి సుహాసిని రె డ్డి రంగంలోకి దిగాలని యోచిస్తున్నారు. ఇం దుకోసం ఆమె పార్టీ పెద్దలను కూడా కలిసిన ట్టు ప్రచారం జరుగుతోంది. అయితే జిల్లా అ« ద్యక్షుడు పాయల శంకర్‌తో ఆమెకు రాజకీయంగా పొసగకపోవడంతో పరిణామాలు ఎలా ఉం టాయనేది ఆసక్తికరంగా మారింది. అదే స మయంలో జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ తన అల్లుడు సిద్ధార్థ్‌ను మున్సిపల్ ఎన్నికల్లో రంగంలోకి దించడం ద్వారా చైర్మన్ పీఠంపై గురిపెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ రాజకీయాలు రసకందాయంగా సాగుతున్నా యి. నిర్మల్లోనూ బీజేపీకే పటిష్ట కేడర్ ఉంది. అక్కడ కూడా టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చి బల్దియాలో ప్రభావం చూపాలని ఆ పార్టీలో ఉత్తేజం కనబడుతోంది. ఇక ముథోల్ నియోజకవర్గంలో గత పార్లమెంట్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి టీఆర్ఎస్ కంటే అధిక ఓట్లు సాధించా రు. అయితే భైంసా మున్సిపాలిటీలో ఎంఐఎం ప్రభావం ఉంది. దీంతో బీజేపీ ఎంఐఎంతో పోటీగా నిలవనుంది. ఇక కాగజ్‌నగర్‌లోనూ ప్రభావం చూపాలని ఆ పార్టీ ఆశిస్తుంది. కొత్త మున్సిపాలిటీ అయిన ఖా నాపూర్‌లో ఉనికి చాటాలనే ప్రయత్నాలు చేస్తోంది. -
అంతరిక్ష పంట.. అదిరెనంట!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వ్యోమగాములు నెలల తరబడి ఉండి.. పరిశోధనలు చేస్తుంటారని తెలిసిన విషయమే. అయితే వారు ఏం తింటారు.. ఎలా జీవిస్తారనే విషయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. వారు తినేందుకు ఇక్కడి నుంచి ప్యాక్ చేసిన ఆహారాన్ని పంపిస్తారు. అయితే వీటిల్లో సరైన పోషకాలు ఉండటేదని, వారికి మరిన్ని పోషకాలు అందేలా చేసేందుకు అక్కడే పంటలు పండించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఐఎస్ఎస్లో చాలా మొక్కలనే పెంచారు. ఆ జాబితాలోకి తాజాగా మరో రకం చేరనుంది. ఇస్పనోలా చిలీ పెప్పర్ అనే మిరప రకం మొక్కను ఇప్పుడు అంతరిక్షంలో పండించనున్నారు. ఈ మొక్కలను ఈ ఏడాది నవంబర్ లేదా వచ్చే ఏడాది మొదట్లో అంతరిక్షంలోకి పంపించనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. అరుణగ్రహం వంటి చాలా దూరంగా ఉన్న గ్రహాలపైకి వెళ్లే వ్యోమగాములకు ఈ ప్రయోగం చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకు ఏం పండించారో తెలుసా? క్యాబేజీ గోధుమ వరి తులిప్ ఉల్లి బఠానీలు ముల్లంగి వెల్లుల్లి దోస బంగాళదుంప పొద్దుతిరుగుడు తదితరాలు.. -
ఇలా సాగుదాం..
ఖమ్మంవ్యవసాయం: జిల్లా వ్యవసాయ శాఖ ఖరీఫ్ సీజన్‌కు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనలు, ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న వనరుల ఆధారంగా పంటల సాధారణ సాగు విస్తీర్ణాన్ని ప్రణాళిక కమిటీ గుర్తించింది. జిల్లాలోని నేలలు, వాతావరణం, నీటి ఆధారం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని.. వాటికి అనుగుణంగా సాగు చేయాల్సిన పంటలను గుర్తించారు. రానున్న ఖరీఫ్‌లో రైతులు వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జలు, కందులు, పెసలు, మినుము, వేరుశనగ, నువ్వులు, పత్తి పంటలు సాగు చేయవచ్చని గుర్తించారు. జిల్లాలోని 21 మండలాల్లో ఆయా పంటల సాగుకు 2,30,498 హెక్టార్లు అనువుగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. అయితే గత ఏడాది ప్రణాళికతో పోలిస్తే సాధారణ సాగు విస్తీర్ణం ఈ ఏడాది ప్రణాళికలో తగ్గింది. గత ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం 2,32,707 హెక్టార్లు కాగా.. అంతకుమించి 2,53,158 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. గత ఏడాది వరి, మిర్చి పంటల సాగు విస్తీర్ణంపెరిగింది. గత ఏడాది వరి సాధారణ సాగు విస్తీర్ణం 60,547 హెక్టార్లు కాగా.. 82,437 హెక్టార్లలో సాగు చేశారు. ఈ ఏడాది మాత్రం వరి సాధారణ సాగు విస్తీర్ణం ప్రణాళికలో కొంచెం తక్కువగా చూపారు. ఈ ఏడాది వరి 59,361 హెక్టార్లలో సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అదే విధంగా పప్పు దినుసులు పెసర, కంది, మినుము, వేరుశనగ పంటల సాగు విస్తీర్ణాన్ని కూడా పెంచే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు. 43,862 క్వింటాళ్ల విత్తనాలు అవసరం వచ్చే ఖరీఫ్ కాలానికి సాగు చేసే వివిధ రకాల పంట లకు సంబంధించిన విత్తన ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. 43,862 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉంటాయని వ్యవసాయ శాఖ ప్రణాళికలో పొం దుపరిచింది. వీటిలో దాదాపు 22,189 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం ఉంటాయని నిర్దేశించారు. టీ సీడ్స్ కార్పొరేషన్ నుంచి విత్తనాలను అందుబాటులో ఉంచుకునే విధంగా ప్రణాళికలు రూపొందించారు. అయితే ఇప్పటికే టీ సీడ్స్ సంస్థ 15వేల క్వింటాళ్ల వరి విత్తనాలను అందుబాటులో ఉంచింది. పెసర 2,910, కంది 50 క్వింటాళ్లను అందుబాటులో ఉంచింది. పచ్చిరొట్టకూ.. జీలుగు, పిల్లి పెసర, జనుము పంటలను సాగు చేసి.. సాగు భూమిని సారవంతం చేయాలని నిర్ణయించారు. జీలుగు 12,500 క్వింటాళ్లు, పిల్లి పెసర 6 వేల క్వింటాళ్లు, 635 క్వింటాళ్ల జనుము విత్తనాలను ఇప్పటికే టీ సీడ్స్ సంస్థ అందుబాటులో ఉంచింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనల మేరకే.. రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనల మేరకు వచ్చే ఖరీఫ్ సీజన్ ప్రణాళికను రూపొందించాం. అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే విత్తనాలను టీ సీడ్స్ అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపట్టింది. ఎరువుల కొరత లేకుండా ముందస్తుగానే అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం. – ఏ.ఝాన్సీలక్ష్మీకుమారి జిల్లా వ్యవసాయాధికారి -
వేసవికి ప్లాన్ ఏంటి..?
వేసవి సెలవుల్లో రీఫ్రెష్ అవ్వడం కోసం చక్కని పర్యాటక ప్రదేశాలను చుట్టి రావాలన్న ఆకాంక్ష అందరికీ ఉంటుంది. అయితే, ఎంపిక దగ్గరే సమస్యంతా. దూర ప్రాంతాలకు వెళ్లి రావడం అనేది కొంచెం కష్టమైన టాస్కే. ఎంపికను బట్టే ప్లానింగ్ ఆధారపడి ఉంటుంది. ముందుగా ఎక్కడికి వెళ్లాలన్న దానిపై కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం అవసరం. ఆ తర్వాతే ప్రణాళిక ఆరంభమవుతుంది. కొంచెం ముందుగా సన్నద్ధం అయితే టికెట్ల బుకింగ్ దగ్గర నుంచి హోటళ్ల బుకింగ్ వరకు సాఫీగా సాగిపోతుంది. ఆలస్యం చేస్తే ఆదరాబాదరతోపాటే బడ్జెట్ కూడా పెరిగిపోవచ్చు. ఇప్పటికీ వేసవి పర్యటనకు ప్రణాళిక రూపొందించుకోకుండా, ఎక్కడో ఒక చోటకు వెళ్లొద్దామనుకునేవారు.. వెంటనే తాము చూడాలనుకుంటున్న వాటిపై స్పష్టతకు రావాలి. ఇందుకు నిపుణులు తెలియజేస్తున్న ప్లానింగ్ మీకోసం... ఎన్నో ఎంపికలు రవాణా సదుపాయాలు విస్తృతమైన తర్వాత పర్యాటక ప్రియులకు ఎన్నెన్నో గమ్యస్థానాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు, ఏది ఎంచుకోవాలన్న మీమాంస కూడా ఎదురవుతుంది. వేసవి ట్రిప్ ద్వారా తాము ఏం ఆశిస్తున్నామనే ఆకాంక్ష, బడ్జెట్ తదితర అంశాల ఆధారంగా ఎంపిక మారిపోవచ్చు. ‘‘భారత పర్యాటకులకు దక్షిణాఫ్రికా సఫారీ అనుభవం ప్రముఖ ఎంపిక. ఇక ఫ్రాన్స్ అయితే వంటకాలు, వైన్‌కు ప్రసిద్ధి. చరిత్ర, సంస్కృతి, నిర్మాణ కళ పట్ల ఆసక్తి ఉన్న పర్యాటకులు హంగేరి, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియాలను ఎంచుకుంటుంటారు. స్పా, వెల్నెస్, రెజువెనేషన్ అనుభవాలు కోరుకునే వారికి దక్షిణ కొరియా ఎంపిక అవుతుంది. స్విట్జర్లాండ్, క్రోయేషియా ఫొటోగ్రఫీ ప్రియులకు అనుకూలం’’ అని థామస్ కుక్ ఇండియా లీజర్ ట్రావెల్ విభాగం అధిపతి రాజీవ్ కాలే వివరించారు. సంపాదనా శక్తి పెరుగుతుండడంతో భారతీయ పర్యాటకులు ప్రముఖ పండుగల సమయాల్లో (విదేశీ పండుగలు)నూ ఆయా దేశాలకు వెళ్లి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. థాయిలాండ్‌లో ఏప్రిల్ 13–15 మధ్య జరిగే సాంగ్‌క్రాన్ (వాటర్ ఫెస్టివల్), హాంకాంగ్‌లో జూన్ 7న జరిగే డ్రాగన్ బోట్ ఫెస్టివల్, స్పెయిన్‌లో ఆగస్ట్ 28న జరిగే లా టమాటినా(టమాటా ఫెస్టివల్), దక్షిణ కొరియాలో జూలై 19–28 మధ్య జరిగే బోర్యాంగ్ మడ్ ఫెస్టివల్ ను చూసేందుకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోందని రాజీవ్ కాలే తెలిపారు. యూకేలో మే నుంచి ఆరంభమయ్యే ఐసీసీ ప్రపంచ క్రికెట్ కప్‌కూ ఇప్పుడే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఆఫ్‌బీట్ డెస్టినేషన్స్ అయిన జపాన్, దక్షిణ అమెరికా, క్రోయేషియా, ఐస్‌ల్యాండ్ కూడా ఉన్నాయి. చిన్న పిల్లలు ఉంటే థీమ్ పార్క్స్ అనుకూలం. ‘‘సింగపూర్, మలేషియాలోని లెగోల్యాండ్లో యూనివర్సల్ స్టూడియోలు ఉన్నాయి. టోక్యో, హాంకాంగ్, ప్యారిస్, ఓర్లాండోలలో డిస్నీల్యాండ్స్ ఉన్నాయి’’ అని బ్రాండ్ ఎక్స్పీడియా మార్కెటింగ్ హెడ్ మన్మీత్ అహ్లువాలియా తెలిపారు. ఇక ఆఫీసు బాధ్యతల నుంచి స్వల్ప విరామం తీసుకునేవారికి వీసా అవసరం లేని, సులభ వీసాలకు అవకాశం ఉండే సింగపూర్, బాలి, థాయిలాండ్, శ్రీలంకను ఎంచుకోవచ్చు. బడ్జెట్ ఎంత? పర్యటనకు వెళ్లొద్దామనే ఆలోచన వచ్చిన తర్వాత ముందుగా తేల్చుకోవాల్సినది ఎంత ఖర్చు పెడతారని. బడ్జెట్‌ను బట్టే ఎక్కడికి వెళ్లి రావచ్చన్నది నిర్ణయించుకోవడానికి వీలు పడుతుంది. ఆర్థిక సలహాదారులు అయితే వార్షికంగా మీరు చేసే ఖర్చుల్లో విచక్షణారహిత వినియోగం 15 శాతాన్ని మించకుండా చూసుకోవాలని చెబుతుంటారు. ‘‘సెలవు కాలంలో చేసే ఖర్చులు విచక్షణారహితం కిందకే వస్తాయి. మీ వార్షిక ఖర్చులో ఇది 10 శాతం మించకుండా ఉండడం అనుకూలం. వేసవితోపాటు, శీతాకాలంలోనూ పర్యాటక ప్రదేశాలను చూడాలనుకునే వారు ఈ పరిధికి లోబడే బడ్జెట్‌ను రెండు భాగాలు చేసుకోవాలి. అంతేకానీ మొత్తం బడ్జెట్‌ను వేసవి కోసం ఖర్చు పెట్టేయరాదు’’ అని ప్లాన్ అహెడ్ వెల్త్ అడ్వైజర్స్ సీఎఫ్‌పీ విషాల్ ధావన్ సూచించారు. మీరు ఎంత ఖర్చును భరించగలరన్న దాని ఆధారంగా పర్యాటక ప్రదేశాల జాబితాను షార్ట్‌లిస్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. ‘‘తక్కువ బడ్జెట్ ఉన్నవారు భారత్‌లోపల లేదా దక్షిణాసియాలో ఏదైనా ప్రదేశాన్ని ఎంచుకోవచ్చు. కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టుకోగలిగితే తూర్పు యూరప్‌లోని ప్రాంతాలను సందర్శించొచ్చు. ఇంకా ఎక్కువ ఖర్చు చేయగలిగే వారు పశ్చిమ యూరప్‌కు వెళ్లొచ్చు’’ అని అహ్లువాలియా సూచించారు. కరెన్సీ ప్రభావం గత కొన్ని వారాల్లో డాలర్‌తో రూపాయి కాస్త బలపడడం కూడా బడ్జెట్‌ను తగ్గించేదే. గత 6 నెలల్లో ప్రధాన కరెన్సీలతో రూపాయి విలువ 2.9–8.8% బలపడింది. దీనివల్ల భారతీయుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఏప్రిల్, మే నెలల్లో సహజంగానే అన్ని చార్జీలు పెరిగిపోతుంటాయి. కనుక ఈ లోపే అన్నీ బుక్ చేసుకోవడం మంచిదని కాక్స్ అండ్ కింగ్స్ కరణ్ ఆనంద్ తెలిపారు. వీసా కోసం.. వీసాను ముందే తీసుకోవడం వల్ల సమయం కలిసొస్తుంది. చాలా మందికి వీసాకు పట్టే సమయంపై తగిన అవగాహన ఉండదు. బ్రిటన్, షెంజెన్‌కు వీసా కావాలంటే కనీసం 10–15 రోజులు పడుతుందనేది నిపుణుల మాట. అదే ఆస్ట్రేలియాకు అయితే ఇది 20 రోజుల వరకు సమయం తీసుకుంటుందని చెబుతున్నారు. ముందుగా బుక్ చేసుకుంటే.. విమాన టికెట్లను ముందుగా బుక్ చేసుకోవడం వల్ల చార్జీల భారం తగ్గే వెసులుబాటు ఉంటుంది. చివరి నిమిషంలో టికెట్ల చార్జీలు పెరిగే వరకు వేచి చూడకుండా ముందే బుక్ చేసుకోవాలని ఎస్‌వోటీసీ ట్రావెల్ హెడ్ డానియల్ డిసౌజౌ సూచించారు. రెండు నెలల ముందే టికెట్లను బుక్ చేసుకోవడం ద్వారా కనీసం 20–22 శాతం వరకు ఆదా చేసుకోవచ్చని కరణ్ ఆనంద్ తెలిపారు. ‘‘డైరెక్ట్‌గా వెళ్లే విమానాల్లో టికెట్ చార్జీలు ఎక్కువ. కనెక్టింగ్ విమానాలు చౌక. తగిన వ్యవధి ఉన్న వారు కనెక్టింగ్ విమానాల ద్వారా వెళ్లడం వల్ల ఖర్చులు తగ్గించుకోవచ్చని అహ్లువాలియా తెలిపారు. ఇక ఏ సమయంలో మీరు చేరుకుంటున్నారు అనేది కూడా ముఖ్యమే. మీరు వెళ్లాలనుకుంటున్న ప్రదేశానికి విమానం సాయంత్రానికి చేరుకుంటే, ఆ రోజు స్థానిక సందర్శనకు వీలు పడదని అహ్లువాలియా గుర్తు చేశారు. అదే సమయంలో ఆ రాత్రికి విడిది కోసం గాను హోటల్, భోజన ఖర్చులను పెట్టుకోవాల్సి వస్తుందన్నారు. కనుక ఉదయం సమయానికి తీసుకెళ్లే ఫ్లయిట్‌ను ఎంచుకోవడం కూడా ఖర్చు ఆదాకు ముఖ్యమని తెలియజేశారు. ఇక హోటల్స్ విషయంలోనూ ముందుగానే త్వరపడడం మంచిది. చాలా హోటళ్లు డిమాండ్‌ను సృష్టించేందుకు, సీజన్ ఆరంభానికి ముందే బుకింగ్‌లను పూర్తి చేసుకునేందుకు ఎర్లీబర్డ్ స్కీమ్‌లను అమలు చేస్తున్నాయని రాజీవ్ కాలే తెలిపారు. ఇక హోటల్ స్టార్ రేటింగ్‌ను బట్టి కూడా చార్జీల్లో మార్పులు ఉంటాయి. నగరం లోపల ఉన్న హోటళ్లు దూరంగా ఉన్న హోటళ్లతో పోలిస్తే ఎక్కువ చార్జీలు తీసుకుంటుంటాయి. అన్ని రకాల బుకింగ్‌లను ఇప్పుడు సులభంగా ఆన్లైన్లో చేసుకునే సదుపాయం కూడా ఉన్న విషయం తెలిసిందే. ముందుగా లోడ్ చేసిన ఫారెక్స్ కార్డులను వినియోగించుకోవడం వల్ల కొంత పొదుపు చేసుకోవచ్చు. పర్యాటకులు మెచ్చే ప్రాంతాలు ప్రముఖ ట్రావెల్ సైట్ ‘ట్రిప్ అడ్వైజర్’ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన ప్రాంతాలకు ట్రావెలర్స్ చాయిస్ అవార్డులను (2019 సంవత్సరానికి) ప్రకటించింది. ట్రిప్ అడ్వైజర్ కస్టమర్ల అభిప్రాయాల ఆధారంగా ఎంపిక చేయడం జరిగింది. భారత్‌లో పర్యాటకులకు నచ్చినవి... 1. జైపూర్ (రాజస్తాన్) 2. గోవా (గోవా) 3. న్యూఢిల్లీ 4. మనాలి (హిమాచల్‌ప్రదేశ్) 5. కోచి (కేరళ) 6. బెంగళూరు (కర్ణాటక) 7. జైసల్మేర్ (రాజస్తాన్) 8. ముంబై (మహారాష్ట్ర) 9. ఉదయ్‌పూర్ (రాజస్తాన్) 10. ఆగ్రా (ఉత్తర్‌ప్రదేశ్) ఆసియాలో టాప్10 డెస్టినేషన్స్... 1. బాలి (ఇండోనేషియా) 2. ఫుకెట్ (థాయిలాండ్) 3. సీమ్‌రీప్ (కంబోడియా) 4. హనోయ్ (వియత్నాం) 5. టోక్యో (జపాన్) 6. ఖాట్మండు (నేపాల్) 7. జైపూర్ (భారత్) 8. హాంగ్‌కాంగ్ (చైనా) 9. సియోల్ (దక్షిణ కొరియా) 10. గోవా (భారత్) అంతర్జాతీయంగా టాప్ ఇవీ... 1. లండన్ (ఇంగ్లండ్) 2. పారిస్ (ఫ్రాన్స్) 3. రోమ్ (ఇటలీ) 4. క్రెటే (గ్రీస్) 5. బాలి (ఇండోనేషియా) 6. ఫుకెట్ (థాయిలాండ్) 7. బార్సెలోనా (స్పెయిన్) 8. ఇస్తాంబుల్ (టర్కీ) 9. మర్రాకెచ్ (మొరాకో) 10. దుబాయి (యూఏఈ) రూ.2–3 లక్షల బడ్జెట్ అయితే ప్రాంతం బడ్జెట్(రూ.లక్షల్లో) సీషెల్స్ 2 ప్రాగ్ 2 ఇటలీ 3 హాంకాంగ్ 2.75 గ్రీస్ 3 -
పకడ్బందీగా.. ప్రశాంతంగా..
సిరిసిల్లక్రైం: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార యంత్రాంగం తనకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పూర్తిపారదర్శకంగా, అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ముందుచూపుతో వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు సహా ప్రధాన రహదారుల వెంట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు అదనపు పోలీసు బలగాలను వినియోగించాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు ముమ్మరం చేసింది. 60 సమస్యాత్మకం.. 9 అత్యంత సమస్యాత్మకం.. జిల్లాలో 492 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 60 సమస్యాత్మక, 9 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని పోలీసు, రెవెన్యూ అధికారులు గుర్తించారు. గతంలో జరిగిన అల్లర్లు, వివాదాలను ఆధారంగా చేసుకుని వీటిని విభజించారు. గతంలో నక్సల్స్ ప్రభావం ఉన్నగ్రామాలు, ఒకేచోట అధికంగా పోలింగ్స్టేషన్లు, ఓటర్ల రద్దీ అధికంగా ఉండే పోలింగ్ కేంద్రాలను సైతం సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు సమాచారం. ఆయా కేంద్రాల్లో అదనపు పోలీస్ భద్రతను ఏర్పాటు చేస్తారు. జిల్లాలో ఇప్పటికే అవసరమైన పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి.. నేరాలను నియంత్రించేందుకు సిరిసిల్లతోపాటు వేములవాడలో ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే వెంటనే సరిచేస్తున్నారు. ప్రధాన రహదారుల వెంట, జనసమ్మర్థం ఉండే ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఫుటేజీల్లో స్పష్టత వచ్చేలా పోలీసులు అధికారులు నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకోసం ఆయా మండలాల పోలీసు అధికారులు.. తమ పరిధిలోని గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేపనిలో ఉన్నారు. ప్రధాన పట్టణాలే కాదు.. ప్రతీ గ్రామంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదేవిషయంపై ఎస్పీ రాహుల్‌హెగ్డే తరచూ సమీక్ష సమావేశాల్లో ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారుల వెంట ఏర్పాటు చేయబోయే సీసీ కెమెరాలు.. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు తోడ్పడతాయని అదికారులు భావిస్తున్నారు. ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు.. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్నతాధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం సాధారణ, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు సమన్వయంతో వీటిని గుర్తించి అక్కడ పూర్తిస్థాయిలో వీడియో చిత్రీకరించేందుకు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన సీసీ కెమెరాలు సమకూర్చేందుకు కాంట్రాక్టర్లతో చర్చిస్తున్నారు. దీనికితోడు సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అడిషనల్ డీజీపీ జితేందర్ ఇటీవల జిల్లా పోలీస్ అధికారులను అదేశించారు. జాయింట్ కలెక్టర్ యాస్మిన్‌బాషా సీసీ కెమెరాల ఏర్పాటు విషయాన్ని పోలీస్ అధికారులతో చర్చించారు. పోలింగ్ నాటికి సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. -
సమయానికి తగు బీమా
వివాహాది శుభకార్యాలు సంతోషాలు కలిగించడంతో పాటు కొత్త బాధ్యతలను కూడా మోసుకొస్తాయి. పెళ్లి, కొత్తగా సొంతిల్లు .. పిల్లల కోసం, వారి చదువుల కోసం ప్లానింగ్ ఇవన్నీ వరుసగా ఒకదాని తర్వాత మరొకటి వచ్చేస్తాయి. వీటి కోసం ప్లానింగ్ చేసుకోవడంతో పాటు దురదృష్టకరమైన సంఘటనేదైనా జరిగితే ..కుటుంబం ఆర్థికంగా ఇబ్బందిపడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో సరైన సమయంలో బీమా పాలసీ తీసుకున్న పక్షంలో ఆర్థికంగా ఎలాంటి అవరోధాన్నైనా ధీమాగా ఎదుర్కొనవచ్చు. సాధారణంగా పెళ్లిళ్లకు సంబంధించి సగటు వయస్సు అంతర్జాతీయంగా 28 ఏళ్లుగా ఉంటుండగా.. మన దగ్గర 22.8 సంవత్సరాలుగా ఉంటోంది. వయస్సు పెరిగే కొద్దీ బీమా ప్రీమియం పెరుగుతుందన్న సంగతి తెలిసిందే. కాబట్టి వివాహం నాటికే లేదా వివాహ సమయానికే బీమా తీసుకుంటే.. స్వల్ప ప్రీమియానికి అధిక కవరేజీ పొందడానికి వీలవుతుంది. మరికాస్త వివరంగా చెప్పాలంటే పలు అధ్యయనాల ప్రకారం .. సాధారణంగా 55–60 ఏళ్లు వచ్చేసరికి పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు పూర్తయిపోవడం .. ఇతరత్రా ఇంటి రుణాల చెల్లింపు మొదలైన బాధ్యతలను తీర్చేసుకోవడం జరుగుతుంటుంది. కనుక.. సరైన సమయంలో జీవిత బీమా టర్మ్ పాలసీ తీసుకున్న పక్షంలో అత్యంత కీలకమైన సమయంలో ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. కవరేజీని పెంచుకోవచ్చు.. వివాహానికి ముందో లేదా వివాహ సమయంలోనో పాలసీ తీసేసుకున్నా.. ఆ తర్వాత పిల్లలు పుట్టాక మరికొన్ని బాధ్యతలు జతవుతాయి కాబట్టి.. కవరేజీని, సమ్ అష్యూర్డ్‌ను పెంచుకోవడం శ్రేయస్కరం. ఇటు ద్రవ్యోల్బణం.. అటు పెరిగే బాధ్యతలకు అనుగుణంగా వయస్సు పెరిగే కొద్దీ ఆటోమేటిక్‌గా సమ్ అష్యూర్డ్ కూడా పెరిగేలా ప్రస్తుతం పలు పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీ పాలసీ ఈ కోవకి చెందినది కాకపోతే కొత్తగా మరో పాలసీ తీసుకోవడమో లేదా.. కొంత ప్రీమియంలో వ్యత్యాసాలన్ని కట్టేసి.. ఇప్పటికే ఉన్న పాలసీలో సమ్ అష్యూర్డ్‌ను పెంచుకోవడమో చేయొచ్చు. పిల్లల భవిష్యత్ చైల్డ్ పాలసీలు .. పిల్లల బంగారు భవిష్యత్ కోసం ప్లానింగ్ చేసేందుకు అనువైన చైల్డ్ ప్రొటెక్షన్ ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ బీమా తీసుకున్న పేరెంట్‌కి ఏదైనా అనుకోనిది జరిగినా పాలసీ కొనసాగేలా భవిష్యత్ ప్రీమియంలను కట్టడం నుంచి మినహాయింపునిచ్చే పథకాలు కూడా ఉన్నాయి. ఇటు పొదుపు, అటు రక్షణ ప్రయోజనాలు కూడా కల్పించే ఇలాంటి పాలసీలు పిల్లల బంగారు భవిష్యత్ కోసం బాటలు వేసేందుకు ఉపయోగపడతాయి. ఇక సొంతింటి కోసం రుణం తీసుకున్నా .. ఆ భారం మరీ అధికం కాకుండా మార్టిగేజ్ లోన్ తీసుకుంటే శ్రేయస్కరం. 30 ఏళ్ల లోపే పాలసీని తీసుకోవటం మంచిది.. వయస్సు పెరిగే కొద్దీ ప్రీమియంలు పెరుగుతాయి కాబట్టి సాధ్యమైనంత వరకూ 30 ఏళ్ల లోపే పాలసీని తీసుకోవటం మంచిది. పెరిగే వయస్సుతో పాటు ఆరోగ్య సమస్యలూ తలెత్తవచ్చు.. ఫలితంగా ప్రీమియం పెరగొచ్చు. ఒకవేళ 60 ఏళ్లు దాటేస్తే.. బీమా సంస్థలు కవరేజీనిచ్చేందుకు నిరాకరించే అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకు.. 30–35 ఏళ్ల వ్యక్తి (సిగరెట్ల అలవాటు లేకుండా) రూ. 1 కోటి సమ్ అష్యూర్డ్‌కి పాలసీ తీసుకుంటే.. ప్రీమియం దాదాపు రూ. 8,000 ఉంటుంది. అదే మరో పదిహేనేళ్లు వాయిదా వేసి.. 45 ఏళ్లప్పుడు తీసుకుందామనుకుంటే.. అదే కవరేజీకి ఏకంగా రూ. 20,100 దాకా కట్టాల్సి ఉంటుంది. పైగా ఆరోగ్య సమస్యల్లాంటివేమైనా ఉన్న పక్షంలో ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కనుక.. పెళ్లి, పిల్లలు, వారి చదువులు, ఇంటి కొనుగోళ్లు ఇలా సందర్భాలను బట్టి బీమా కవరేజీని ఎప్పటికప్పుడు పునఃసమీక్షించుకుంటూ ఉండాలి. కుటుంబానికి అంతటికీ ఆధారమైన ఇంటి పెద్దకేదైనా జరిగిన పక్షంలో వారు లేని లోటు తీర్చలేనిదే అయినా.. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఇలాంటి బీమా పాలసీలతో రక్షణ కల్పించవచ్చు. - రిషి శ్రీవాస్తవ , హెడ్ (ప్రొప్రైటరీ చానల్), టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ -
పెళ్లి చేస్తారు.. రిటైరవుతారు!
సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం : పెళ్లి ఎలా చెయ్యాలి? తల్లిదండ్రులందరికీ... ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులకిది పెద్ద సవాలే. నిజానికి పెళ్లి ఎలా అయినా చెయ్యొచ్చు. దానికి ఎంతయినా ఖర్చు పెట్టొచ్చు. తక్కువలో తక్కువగా వేలల్లో ముగించేయొచ్చు. అట్టహాసంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనూ వచ్చు. ఇవన్నీ పక్కనబెడితే... మధ్య తరగతి కుటుంబాల్లో... పెళ్లనేది చాలావరకూ వరుడి కుటుంబీకుల ఇష్టప్రకారం చేయాల్సి ఉంటుంది. సదరు సంబంధం కావాలనుకుంటే దానికి తగ్గట్టు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కూడా. నిజానికి పెళ్లికి ముందు నుంచే సన్నద్ధం అయ్యేవారు మనలో చాలా తక్కువ. మునుపటికన్నా ఇపుడు వివాహానికి ప్రాధాన్యం పెరిగింది. దాంతోనే ఖర్చులూ పెరిగాయి. అందుకని ముందు నుంచే ప్రణాళిక వేసుకుని... ఆ మేరకు పిల్లల వివాహ అవసరాల కోసం కొంత నిధిని సమకూర్చుకోవడం తప్పనిసరి. ఉదాహరణకు రాజమండ్రికి చెందిన సుకుమార్‌నే తీసుకుంటే... తనకు 17 ఏళ్ల ఇంటర్ చదివే కుమార్తె ఉంది. ఉన్నత విద్య పూర్తయ్యాక ఆమెకు పెళ్లి చేయాలన్నది సుకుమార్ ఆలోచన. ఆమె పెళ్లికి సుమారు 8–10 ఏళ్ల వ్యవధి ఉంది. అలాగే, తన రిటైర్మెంట్ జీవితం కోసం కూడా కొంత నిధిని సమకూర్చుకోవాలని భావించాడు. ఇందుకు మరో పదేళ్ల వ్యవధి ఉంది. దీనికి ప్రణాళిక ఏ విధంగా ఉండాలన్నది నిపుణుల సూచనల ఆధారంగా ఒకసారి చూద్దాం... వివాహం కోసం ఏం చేయొచ్చంటే... హరిత వివాహ అవసరాల కోసం రూ.25 లక్షలను సమకూర్చుకోవాలన్నది సుకుమార్ లక్ష్యం. అది కూడా ఇప్పటి ఖర్చుల ఆధారంగా అతడు వేసుకున్న అంచనా. 8 శాతం ద్రవ్యోల్బణం ఆధారంగా చూస్తే మరో ఎనిమిదేళ్ల తర్వాత హరిత వివాహ సమయానికి రూ.46 లక్షలు అవసరం అవుతాయి. సుకుమార్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ప్రతీ నెలా కనీసం రూ.25,000 పింఛను రూపంలో వస్తుందని అతడి అంచనా. అయినా సరే... రిటైర్మెంట్ తర్వాత అనూహ్యంగా వచ్చే అవసరాల కోసం అతను రూ.1.5 కోట్లు సమకూర్చుకోవాలనుకుంటున్నాడు. ప్రణాళిక ఇలా ఉండాలి సుకుమార్ ప్రతి నెలా తీసుకునే వేతనం రూ.60,000. అదృష్టవశాత్తూ సుకుమార్ అర్ధాంగి జ్యోతి కూడా ఉద్యోగే. ఆమె నెలసరి వేతనం రూ.40,000. వీరి నెలసరి కుటుంబ ఖర్చు రూ.50,000. దీంతో ప్రతి నెలా వారి మిగులు నిధులు రూ.50,000. ఇందులో రూ.45,000ను బ్యాంక్ రికరింగ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తుండగా, మిగిలిన రూ.5,000ను ఈక్విటీ బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీరి కుమార్తె హరిత ఇంటర్ చదువుతోంది. తరవాత ఇంజనీరింగ్ చేయాలన్నది ఆమె లక్ష్యం. ఇక సుకుమార్‌కు రూ.కోటి మేర టర్మ్ బీమా పాలసీ ఉంది. దీన్ని ఆయన పనిచేస్తున్న సంస్థే సమకూర్చింది. వైద్య బీమా పాలసీ కూడా సంస్థ అందిస్తున్నదే ఉంది. మరో పదేళ్లలో సుకుమార్ రిటైర్ అవుతారు. కనుక తర్వాత అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విడిగా ఓ వైద్య బీమా పాలసీ ఇప్పుడే తీసుకోవాలి. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత ఆ వయసులో వైద్య బీమా పాలసీ తీసుకోవాలంటే ప్రీమియం చాలా అధికంగా ఉంటుంది. పెట్టుబడులు, మార్పులు... సుకుమార్‌కు ప్రస్తుతం రికరింగ్ డిపాజిట్ ఖాతాలో రూ.25 లక్షలున్నాయి. బ్యాంకు ఎఫ్‌డీల రూపంలో రూ.40 లక్షలున్నాయి. సొంత ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. దీని విలువ రూ.1.15 కోట్లు. సుకుమార్ పెట్టుబడుల్లో సింహభాగం రికరింగ్ డిపాజిట్లకే వెళుతోంది. అతని కుమార్తె వివాహానికి ఇంకా కనీసం ఎనిమిదేళ్ల వ్యవధి ఉంది. కనుక పెట్టుబడుల్లో కొంత మేర అధిక రాబడులకు కేటాయించుకోవచ్చు. రూ.50,000 పెట్టుబడుల్లో కనీసం రూ.30,000ను ఈక్విటీ బ్యాలన్స్డ్ మ్యూచువల్ ఫండ్, లార్జ్‌క్యాప్ ఈక్విటీ పథకాలకు కేటాయించుకోవాలి. మిగిలిన రూ.20,000ను ఆర్డీకి మళ్లించొచ్చు. బ్యాలన్స్డ్ ఫండ్స్‌లోనూ మంచి ట్రాక్ రికార్డు ఉన్న వాటినే ఎంచుకోవాలి. హెచ్డీఎఫ్సీ బ్యాలన్స్డ్ ఫండ్, ఎల్అండ్టీ ఇండియా ప్రుడెన్స్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలన్స్డ్ ఫండ్ పథకాలు బ్యాలన్స్డ్ ఫండ్స్‌కు పనితీరు పరంగా మంచి చరిత్ర ఉంది. లార్జ్‌క్యాప్ డైవర్సిఫైడ్ పథకాల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ, మిరే అస్సెట్ ఇండియా ఈక్విటీ, ఇన్వెస్కో ఇండియా గ్రోత్ ఫండ్ పథకాలను పరిశీలించొచ్చు. ఈ విధంగా పెట్టుబడులు పెడితే వార్షికంగా 12 శాతం రాబడి అంచనాల మేరకు 2026 నాటికి రూ.48.5 లక్షలు సమకూరుతుంది. దీంతో సుకుమార్ కుమార్తె హరిత వివాహ అవసరాలకు సరిపడా నిధి చేతికి అందుతుంది. ఇక రికరింగ్ డిపాజిట్లో ప్రతీ నెలా చేసే రూ.20,000 పెట్టుబడి సైతం 2028 నాటికి రూ.34 లక్షలు అవుతుంది. వార్షికంగా 7 శాతం రాబడుల ఆధారంగా వేసిన అంచనా ఇది. ఇక బ్యాంకు ఎఫ్‌డీల్లో ఉన్న రూ.40 లక్షలను కదపకుండా అలానే కొనసాగిస్తే 7 శాతం రాబడి ఆధారంగా 2028 నాటికి (సుకుమార్ రిటైర్మెంట్ అయ్యే సంవత్సరం) రూ.78.7 లక్షలు అవుతాయి. అలాగే, ప్రస్తుతం రికరింగ్ డిపాజిట్ ఖాతాల్లో ఉన్న రూ.25 లక్షలను కూడా లార్జ్‌క్యాప్ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీంతో పదేళ్ల కాలంలో వార్షికంగా 12 శాతం రాబడుల అంచనా ఆధారంగా రూ.77.6 లక్షలు అవుతాయి. దీంతో ఈ మొత్తం కలిపి సుకుమార్ రిటైర్మెంట్ నాటికి రూ.1.9 కోట్లు అవుతాయి. -
మీ టూర్ ప్లానింగ్ ఎలా ఉంటుంది..?
కొత్త కొత్త ప్రదేశాలు, సందర్శనీయ స్థలాలను చూడటం వల్ల విజ్ఞానంతో పాటు వినోదం కూడా దొరుకుతుంది. అందుకే చాలా మంది ఏడాదిలో ఒక్కసారైనా ఏదో కొత్త ప్రదేశానికి టూర్ ప్లాన్ చేసుకుంటారు. అయితే మరికొందరు మాత్రం ముందస్తు టూర్ ప్రణాళిక వేసుకోరు. దాంతో కొత్త ప్రదేశంలో ఇబ్బందులు పడతారు. మీరు టూర్ ప్లానింగ్‌లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటారు? చెక్ చేసుకోండి. 1. మీరు వెళ్తున్న ప్రదేశం గురించి ముందుగానే ఇంటర్నెట్లోనో, గైడ్ నుంచో సమాచారం సేకరిస్తారు. ఎ. అవును బి. కాదు 2. అవసరమైన మేరకు నగదు ఉంచుకుని డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ట్రావెల్ చెక్స్ వంటివి దగ్గర పెట్టుకుంటారు. ఎ. అవును బి. కాదు 3. అక్కడి వాతావరణం, వేసుకోవాల్సిన దుస్తుల గురించి వాకబు చేస్తారు. ఎ. అవును బి. కాదు 4. ఫస్ట్ ఎయిడ్ కోసం అవసరమైన మందులను క్యారీ చేస్తారు. ఎ. అవును బి. కాదు 5. కలుషితమైన నీళ్లు తాగే ప్రమాదాన్ని నివారించడానికి వాటర్‌బాటిల్‌ను క్యారీ చేస్తారు. ఎ. అవును బి. కాదు 6. మీరు వెళ్లాల్సిన ప్రదేశం రూట్ మ్యాప్‌ను జాగ్రత్తగా స్టడీ చేస్తారు. ఎ. అవును బి. కాదు 7. మీరు వెళ్లే ప్రదేశంలోని హోటల్స్, బస చేయదగ్గ ప్రదేశాల గురించి ముందుగానే సమాచారం తీసుకుంటారు. ఎ. అవును బి. కాదు 8. అక్కడ స్థానికంగా ఉంటున్న ఒకరిద్దరి చిరునామాలు ముందుగానే తీసుకుని దగ్గర ఉంచుకుంటారు. ఎ. అవును బి. కాదు 9. దారిలో మీరు చూడదగ్గ ప్రదేశాల విషయంపై కూడా మీకు అవగాహన ఉంటుంది. ఎ. అవును బి. కాదు 10. భద్రత పరంగా టూర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు బాగా తెలుసు. ఆ మేరకు భద్రతచర్యలు తీసుకుంటారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు ఏడు కంటే ఎక్కువ వస్తే టూర్ ప్లానింగ్‌లో మీరు పక్కాగా ఉంటారు. మీరు వెంట ఉంటే మీ వెంట వచ్చేవారికి సైతం బోల్డంత ఊరటగా ఉంటుంది. ఒకవేళ ‘బి’ లు ఎక్కువగా వస్తే మీరు టూర్ ప్లానింగ్ గురించి పెద్దగా ఆలోచించరు. అప్పుడు వచ్చే ఇబ్బందుల గురించి అప్పుడే ఆలోచించవచ్చు అని అనుకుంటారు. ఇలా ముందుగా ప్లాన్ చేసుకోకపోతే ప్రయాణంలో ఇక్కట్లు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ. వాటిని వీలైనంతగా తగ్గించుకోడానికి ‘ఎ’లను సూచనలుగా తీసుకుని టూర్ ప్లాన్ చేయండి. -
టూరుకు 'ప్లాన్' చేశారా?
ప్రణాళిక ఉంటే ఖర్చు తక్కువలోనే పర్యటన ► ముందు నుంచే సన్నద్ధం కావటం తప్పనిసరి ► అప్పటికప్పుడు నిర్ణయించుకుంటే ఖర్చులెక్కువే ► రవాణా, వసతి, ఇతర ఖర్చులన్నీ ఆన్లైన్లో లభ్యం ► అందుకు తగ్గట్టు ప్లాన్ చేసుకుంటే పర్యటన సక్సెస్ సెలవులొచ్చేశాయి. రోజూ కాసేపు స్కూలుకు వెళ్లి... ఆ తరవాత ఇంటికొచ్చి హోమ్‌వర్కుల వంటివి చేసే పిల్లలు... రోజంతా ఇంట్లో ఉంటే భరించటం కష్టమే. అందుకే సెలవులకు ఊళ్లకు పంపిస్తుంటారు. కానీ ఇప్పుడంతా ఎండలమయం. ఎక్కడికి పంపించాలన్నా చాలా కష్టం. పోనీ సమ్మర్ క్యాంపుల్లో చేరిస్తే... అవి గంటా రెండు గంటల కన్నా ఎక్కువసేపు లేవు. ఇవన్నీ పక్కనబెడితే... పిల్లలే కాదు, ఇంట్లో వాళ్లు కూడా వేసవిలో ఏదో ఒక చల్లని ప్రాంతానికి విహారయాత్రకు తీసుకెళ్లమంటుంటారు. ఒకవేళ వాళ్లు అడగకపోయినా కూడా వేసవిలో ఏదైనా టూర్‌కు వెళ్లాలని చాలామంది ప్లాన్ చేస్తుంటారు. అయితే... అనుకున్న వెంటనే ఏదో ఒక ఆపరేటర్‌ను సంప్రతించటం, తాము వెళ్లాలనుకున్న ప్రాంతం కనక తమ బడ్జెట్లో లేకపోతే బాధపడటం... చివరకు తమ బడ్జెట్లో ఏది ఉందో చూసుకుని, ఆ ప్రాంతానికి వెళ్లటం చేస్తుంటారు. నిజానికి కాస్తంత ముందే ప్లాన్ చేసుకుని... దాని ప్రకారం అడుగులు వేస్తే తక్కువ బడ్జెట్లోనే అనుకున్న టూర్ సాధ్యమవుతుంది. ఆ వివరాలన్నీ తెలియజేసేదే ఈ ప్రత్యేక కథనం... వేసవి సెలవుల్లో యాత్రలకు వెళ్లాలని ముందుగానే చాలామంది ఫిక్స్ అవుతారు. కానీ ఎక్కడికి వెళ్లాలో, కచ్చితంగా ఏఏ తేదీల్లో వెళ్లాలో నిర్ణయించుకోరు. వీటిపై చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఖర్చులు తడిసిమోపెడవుతాయి. ముందుగానే ప్లాన్ చేసుకోకపోవడం వల్ల అనుకున్నంత ఎంజాయ్మెంట్ కూడా ఉండకపోవచ్చు. అందుకే ఎక్కడికి వెళ్లాలన్నది ముందుగానే డిసైడ్ అవ్వాలి. పర్యటన కొంచెం ఎక్కువ రోజులుపాటు ఉండాలనుకుంటే అందుకు ఎంత బడ్జెట్ కావాలి? తామెంత కేటాయించగలరు? వంటివన్నీ చూసుకోవాలి. ఎందుకంటే నలుగురు సభ్యులున్న కుటుంబం రూ.50,000 బడ్జెట్‌తో కశ్మీర్ సహా ఉత్తర భారతాన్ని చుట్టొద్దామనుకుంటే సాధ్యం కాకపోవచ్చు. అలాగే, ఇదే బడ్జెట్‌తో సింగపూర్ వెళ్లాలనుకున్నా అసాధ్యమే. కాకపోతే విమానాల బదులు రైలు ప్రయాణాన్ని ఎంచుకుని... కశ్మీర్ బదులు ఊటీ, కులుమనాలీ వంటి ప్రాంతానికి వెళ్లిరావాలనుకుంటే... ఇదే బడ్జెట్‌తో మరీ లగ్జరీకి పోకుండా టూర్ పూర్తిచేయొచ్చు. ధరల గురించి పూర్తి సమాచారం ఇపుడు ఆన్లైన్లో దాదాపు అన్ని రకాల సమాచారమూ అందుబాటులో ఉంటోంది. కాబట్టి ఏ ప్రాంతానికి వెళ్లాలనుకున్నారో అక్కడ వసతి, ఆహార ఖర్చులు, వెళ్లి వచ్చేందుకు అయ్యే రవాణా ఖర్చుల గురించి ముందుగానే పూర్తిస్థాయిలో ఓ అంచనాకు రావచ్చు. ఇలా బయల్దేరిన దగ్గర్నుంచి, తిరిగి వచ్చే వరకు అయ్యే వ్యయాలను ఓ జాబితాగా రాసుకోవడం వల్ల ఎంత మేర ఖర్చవుతుందీ తెలిసిపోతుంది. దీనికి ఓ పది శాతం అదనంగా కలుపుకోవాలి. ఊహించని ఖర్చులు, చివరి నిమిషంలో టూర్ పొడిగించుకోవడం వంటి అంశాలే దీనికి కారణం. క్రెడిట్ కార్డు వాడకుంటేనే బెటర్... పర్యటనల సమయంలో క్రెడిట్ కార్డు వాడకాన్ని తగ్గించుకుంటే మంచిది. ముందుగానే పర్యటనకు ప్లాన్ చేసుకోవడం అదనపు వ్యయాలకు కళ్లెం వేయాలనే కదా!!. కానీ, కొందరికి తమ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే ఎంత ఖర్చు చేస్తున్నామనేది లెక్క ఉండదు. అందుకే క్రెడిట్ కార్డు వాడకాన్ని తగ్గించాలి. క్రెడిట్ కార్డు బిల్లులపై నెలకు 2 నుంచి 3 రూపాయల వడ్డీని బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. మరో విషయం విదేశీ పర్యటనల సమయంలో క్రెడిట్ కార్డును వాడితే విదేశీ లావాదేవీల రుసుము చెల్లించుకోవాలి. ఇది లావాదేవీ విలువపై 3%గా ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి పర్యటన ఎక్కడికైనా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీతో రక్షణ కల్పించుకోవడం ఎంతో అవసరం. విదేశీ పర్యటనల్లో స్వదేశంలో తీసుకున్న హెల్త్ పాలసీ అక్కరకు రాదు. అదే ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే ఊహించని ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లోను, ప్రమాదాల కారణంగా తలెత్తే వైద్య చికిత్సలకు ఆసరాగా నిలుస్తుంది. హాస్పిటల్లో అయ్యే వ్యయాలతో పాటు, అవుట్ పేషెంట్ చికిత్సలకూ ఇది ఉపయోగపడుతుంది. అదేకాక... లగేజీ మిస్సయినా, పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నా, ట్రిప్ ఆలస్యమైనా, పర్యటన రద్దు కావడం వల్ల అయ్యే వ్యయాలను కూడా పాలసీ భరిస్తుంది. ఆస్తులు, వ్యక్తిగత నష్టాలకు థర్డ్ పార్టీ కవరేజీ కూడా ఉంటుంది. ఇంకా దంత సంబంధ చికిత్సలకు, ప్రమాదాల్లో మరణిస్తే స్వదేశానికి తరలించేందుకు అయ్యే ఖర్చులను భరించే పాలసీలూ ఉన్నాయి. ఇన్ని విధాల రక్షణనిస్తున్న ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను బడ్జెట్లో భాగం చేసుకోవడం మంచిది. తొలిసారి.. ప్యాకేజ్ టూరే బెటర్ పర్యాటక సంస్థలు వివిధ రకాల ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలను ఇపుడు చౌకగానే అందిస్తున్నాయి. వీటిని ఎంపిక చేసుకోవడం వల్ల తోడుగా ఇతర పర్యాటకులు ఉంటారు. అలాగే, ఆయా ప్రాంతాల గురించి తెలియజేసే గైడ్లు కూడా వెంట ఉంటారు. పర్యటన పరిమితంగా ఉండాలని, తక్కువ ఖర్చులోనే పూర్తి చేసుకోవాలని అనుకునే వారికి ఈ ప్యాకేజీలు అనుకూలం. అయితే ఎక్కువ సమయం పాటు, అదే ప్రాంతంలోని అన్ని విశేషాలనూ చూసేందుకు అవకాశం ఉండదు. మొదటిసారి విదేశీ పర్యటనలకు వెళ్లేవారికి ఇవి అనువైనవి. స్వయంగానూ ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ తగిన సమయం, బడ్జెట్, అవగాహన ఉంటే కనక స్వయంగానూ ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే తెలియని కొత్త ప్రాంతాల సందర్శనకు వెళుతుంటే మాత్రం ముందుగానే తగినంత సమాచారాన్ని రాబట్టుకుని అందుకు తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలి. ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు రవాణా సదుపాయాలు చక్కగా ఉంటాయి. ధరలు కూడా అందుబాటులో ఉంటాయి. అదే అంతగా ప్రాచుర్యంలో లేని వాటిని ఎంచుకుంటే బడ్జెట్ ఎక్కువ అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. -
పక్కా ప్రణాళికతో ఇంటర్ ప్రాక్టికల్స్
జాయింట్ కలెక్టర్–2 రాధాకృష్ణమూర్తి కాకినాడ సిటీ : జిల్లాలో ఇంటర్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలను పక్కా ప్రణాళికతో నిర్వహించాలని జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన చాంబర్లో అధికారులతో ఈ పరీక్షలు నిర్వహణపై సమీక్షించారు. ఫిబ్రవరి 3 నుంచి 22వ తేదీ వరకూ జిల్లాలో 96 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. -
పర్వేందర్ కోసం పంజాబ్‌కు..
తీవ్ర ప్రయత్నాల్లో రూరల్ పోలీసులు నిజామాబాద్ రూరల్ (మోపాల్) : రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధవనగర్ గ్రామశివారులో డిసెంబర్ 8వ తేదీన పాతనోట్ల మార్పిడి చేసి ఇస్తామని రూ.14లక్షలతో పారిపోయిన పర్వేందర్ సింగ్ కోసం సౌత్‌జోన్ రూరల్‌పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా పంజాబ్ రాష్ట్రానికి వెళ్లారు. రెండురోజులుగా అక్కడ తీవ్రంగా గాలిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ ఎస్ఎచ్వో ఇందూరు జగదీష్ ఆధ్వర్యంలో ఐడీపార్టీ హెడ్‌కానిస్టేబుళ్లతో కూడిన బృందం పంజాబ్‌కు బయలుదేరి వెళ్లింది. రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎలాగైనా నిందితుడి ని పట్టుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. గత నెలలో సంఘటన జరగగానే ఎస్సై చందర్ రాథోడ్ ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లిన పోలీసు బృందం వారం రోజుల తరువాత తిరిగొచ్చారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి పర్వేం దర్సింగ్ పాస్‌పోర్టు, వీసా ఆయన ఏ ప్రాంతాలకు వెళ్లాడనే కోణంలో విచారణచేసి వచ్చారు. అయితే కోర్టులో లొంగిపోతాడని ప్రచారం జరిగినప్పటికీ తర్వాత ఎలాం టి స్పందనా లేదు. ఈ సంఘటనలో నిందితులు పర్వేం దర్ సింగ్, కమల్‌లు బాధితులకు పిస్తోలు, తల్వార్ చూ పి బెదిరించి డబ్బులతో కారులో పారిపోయినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసుకున్నారు. ఈ సంఘటనలో నిందితుల్లో కమల్జిత్ సింగ్, కరణ్‌బీర్‌సింగ్, జగ్‌ప్రీత్‌సింగ్, అలియాస్ జగ్గాలను పోలీసులు డిసెంబర్లో అరెస్ట్ చేశారు. వీరు పంజాబ్‌కు చెందిన వారిగా విచారణలో తేలిందని రూరల్ స ర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో ఇందూరు జగదీష్ తెలిపారు. -
గంజాయిపై ఉక్కుపాదం
వివిధ శాఖలతో 12న రాష్ట్ర డీజీపీ సమావేశం స్మగ్లర్లపై దాడులకు కార్యాచరణ ప్రణాళిక ఎక్సైజ్ సిబ్బందికి ఆర్మ్డ్ రిజర్వు ఫోర్సు రక్షణ? రాజమహేంద్రవరం క్రైం : గంజాయి సాగు, అక్రమ రవాణా అరికట్టేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 12న రాజమహేంద్రవరంలో వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర డీజీపీ సాంబశివరావు సమావేశం ఏర్పాటు చేశారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు, అక్రమ రవాణా అధికంగా సాగుతోంది. పోలీస్, ఎక్సైజ్ అధికారులకు సవాలుగా మారిన గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఏఓబీ ప్రాంతం పూర్తిగా కొండలు, లోయలు, దట్టమైన అడవులతో విస్తరించి ఉంది. దీంతో స్మగ్లర్లు గిరిజనులను ప్రోత్సహిస్తూ భారీ ఎత్తున గంజాయి పండిస్తూ, దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు డీజీపీ సాంబశివరావు పోలీస్, ఎక్సైజ్ శాఖ, నార్కోటిక్ కంట్రోల్ బోర్డు, కస్టమ్స్, రెవెన్యూ తదితర శాఖలతో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఎక్సైజ్ సిబ్బందిపై గంజాయి స్మగ్లర్లు దాడులు జరుపుతున్న నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ రైడింగ్ పార్టీలకు ఆర్మ్డ్ రిజర్వుఫోర్సు సమన్వయంతో దాడులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టనున్నారు. విశాఖ జిల్లాలోని చింతపల్లి, పాడేరు, జి.మాడుగల తదితర ఎనిమిది మండలాల్లోనూ, తూర్పుగోదావరి జిల్లాలోని వై.రామవరం తదితర మండలాల్లోని అడవుల్లో గంజాయి సాగు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. రవాణాలో కొత్త పుంతలు గంజాయి రవాణా చేయడంలో సగ్లర్లు రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నారు. కాయగూరలు, పండ్లు, «ధాన్యాలు, చింతపండు, పుచ్చకాయల లోడు, నర్సరీ మొక్కలు మాటున లారీలు, మినీ వ్యా¯ŒSలు, ఖరీదైన కార్లలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. లారీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరల్లో గంజాయిని దాచి తరలిస్తున్నారు. ఈ నేపథ్యలో గంజాయిని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు విశాఖ జిల్లాలో మూడు చెక్ పోస్టులు, తూర్పుగోదావరి జిల్లాలో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. భారీగా గంజాయి స్వాధీనం తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో గంజాయి రవాణాలో అరెస్ట్‌లు ఏటా పెరుగుతున్నాయి. జిల్లాలో 2015 – 16లో 8 కేసుల్లో 16,009 కేజీల గంజాయి, 91 వాహనాలు స్వాధీనం చేసుకొని 280 మందిని అరెస్ట్ చేశారు. 2016–17లో 7 కేసుల్లో 13,576 కేజీల గంజాయి, 71 వాహనాలు స్వాధీనం చేసుకుని 199 మందిని అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లాలో 2015–16లో 129 కేసులు, 2016 –17 సంవత్సరాలలో 97 కేసులు నమోదు చేశారు. రైడింగ్ సమయాల్లో పోలీసులపై దాడులు గంజాయి స్మగ్లర్లు పేట్రేగిపోతున్నారు. ఎౖMð్సజ్, స్థానిక పోలీసులు రైడింగ్ చేస్తున్న సమయాలలో వారిపై దాడులకు పాల్ప డుతున్నారు. ఈ నేపథ్యంలో గంజాయి స్మగ్లర్లపై రైడింగ్ చేసే పార్టీల రక్షణకు రిజర్వు ఫోర్సు సహకారం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అవసరమైతే మావోయిస్టు ప్రాంతాల్లో పోలీసులకు ఇచ్చే షూటింగ్ అర్డర్ వీరికి కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. -
ఏపీ కార్ల్‌లో టీకాల ఉత్పత్తికి సన్నాహాలు
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న ఏపీకార్ల్ (ఆంధ్రప్రదేశ్ అత్యున్నత స్థాయి పశుపరిశోధన కేంద్రం)లో గర్భకోశ వ్యాధులు (బ్రూసెల్లా) నివారణకు టీకాల ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నారు. అమెరికాకు చెందిన జినోమిక్స్ బయోటెక్ కంపెనీ ఆధ్వర్యంలో ఇదివరకే తమిళనాడు రాష్ట్రం కోసం డిమాండ్ మేరకు టీకాల ఉత్పత్తి చేసి ఆపివేశారు. అయితే తిరిగి వచ్చేనెల నుంచి బ్రూసెల్లా టీకాల ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వైఎస్ఆర్, అనంతపురం జిల్లాల్లో నాలుగు గ్రామాలు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 6 గ్రామాల్లో బ్రూసెల్లా వ్యాధికి నిర్ధారణకు రక్త నమూనాలు సేకరిస్తున్నారు. బ్రూసెల్లా వ్యాధి పాజిటివ్ అని తేలితే ఆ గ్రామంలోని మొత్తం గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలతోపాటు పశువుల కాపరులు, పశువైద్యుల రక్తనమూనాలను సైతం పరిశీలిస్తారు. ఆ గ్రామాల్లో పూర్తిస్థాయిలో నివారణకు సన్నాహాలు చేస్తారు. అనంతరం కేంద్రప్రభుత్వం నుంచి అనుమతి పొంది దేశం మొత్తం బ్రూసెల్లా వ్యాధి నివారణకు పులివెందుల ఏపీకార్ల్ నుంచి వ్యాక్సిన్ తయారుచేసేందుకు జినోమిక్స్ మరో ముందడుగు వేస్తోంది. బ్రూసెల్లా వ్యాధి వలన కలిగే నష్టాలు బ్రూసెల్లా(గర్భ సంబంధిత) వ్యాధి సోకిన ఆ పశువు గర్భం దాల్చితే అబార్షన్‌కు గురై అవకాశం ఉంది. పశువులకు వ్యాధి ఉన్నట్లయితే అది మనుషులకు సైతం సక్రమించే అవకాశం ఉంది. ఈ వ్యాధివలన పశువులతోపాటు మనుషులకు సైతం నష్టం కల్గనుంది. త్వరలో ఉత్పత్తి చేస్తాం : ఏపీకార్ల్‌లో జినోమిక్స్ ఆధ్వర్యంలో పశువుల్లో సక్రమించే బ్రూసెల్లా వ్యాధి నివారణకు టీకాల ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నాం. వచ్చేనెల నుంచి ఉత్పత్తికి చేసేలా ప్రణాళిక తయారుచేశాం. ఈ టీకాలు భవిష్యత్‌లో భారతదేశం మొత్తం సరఫరా చేసేలా ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకోనున్నాం. – రత్నగిరి(జినోమిక్స్ ఎండీ), పులివెందుల 01పీఎల్‌వీడీ104–15050007 :– పట్టణంలోని ఏపీ కార్ల్ పరిపాలన భవనం -
బీఆర్కే భవన్లో ఎవరెక్కడ?
• తొమ్మిది అంతస్తులు.. మూడు బ్లాక్‌లు • తొమ్మిదో అంతస్తులో సీఎం, డిప్యూటీ సీఎంలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం తరలించే చర్యల్లో భాగంగా తాత్కాలిక భవనాల ప్రణాళికను ప్రభుత్వం తయారు చేసింది. ప్రస్తుతమున్న సచివాలయంలో అత్యధిక శాఖల ఆఫీసులన్నీ సమీపంలోని బూర్గుల రామకృష్ణారావు (బీఆర్కే) భవన్‌కు తరలించాలని నిర్ణయించింది. బీఆర్కే భవన్లో మొత్తం తొమ్మిది ఫ్లోర్లున్నాయి. ఒక్కో ఫ్లోర్లో మూడు బ్లాక్‌లున్నాయి. వీటిలో ఏ ఫ్లోర్‌కు ఏ కార్యాలయం తరలించాలి.. తాత్కాలిక వసతికి ఎంత స్థలం కేటాయించాలనే ప్రణాళికను ప్రభుత్వం రూపొందించుకుంది. ఎనిమిదో ఫ్లోర్లో సీఎస్... ఎనిమిదో ఫ్లోర్లో డీ బ్లాక్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆఫీసు, సీఎస్ పేషీ, మీటింగ్ హాల్, అదే ఫ్లోర్‌లోని సీ బ్లాక్‌లో పొలిటికల్ ముఖ్య కార్యదర్శి, విజిటర్స్ రూమ్, ముగ్గురు డిప్యూటీ సెక్రెటరీలు, అడిషనల్ సెక్రెటరీ, ముఖ్య కార్యదర్శి (జీపీఎం అండ్ ఏఆర్), సెక్రెటరీ సర్వీసెస్ విభాగం. బీ బ్లాక్‌లో హోంమంత్రి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి, వైద్యారోగ్య మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఆఫీసు. ఏడో ఫ్లోర్లో జీఏడీ.. ఏడో ఫ్లోర్లో డీ బ్లాక్‌లో జీఏడీ అసిస్టెంట్ సెక్రెటరీలు ముగ్గురు, జీఏడీకి సంబంధించి 19 సెక్షన్లుంటాయి. సీ బ్లాక్‌లో ముగ్గురు డీఎస్‌లు, ముగ్గురు డీఎస్, ముగ్గురు ఏఎస్‌లు, ఆర్థిక శాఖకు సంబంధించి 25 సెక్షన్లుంటాయి. బీ బ్లాక్‌లో ఆర్థిక మంత్రి, ముఖ్య కార్యదర్శి ఆఫీసు. ఆరో ఫ్లోర్లో ఇంధన శాఖ... ఆరో ఫ్లోర్లో అడ్వకేట్ జనరల్, జీఏడీ డీఎస్, ఏఎస్ సెక్షన్లు, పశుసంవర్థక ముఖ్య కార్యదర్శి, విద్యుత్ మంత్రి, ఆ శాఖ కార్యదర్శి. అయిదో ఫ్లోర్... స్టోర్ రూమ్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, డిజిటల్ విభాగాలు, సంబంధిత జాయింట్ సెక్రెటరీ, డిప్యూటీ, అసిస్టెంట్ సెక్రెటరీలు. పర్యాటక మంత్రి, శాఖ కార్యదర్శి, రవాణా మంత్రి, రాష్ట్ర ప్రణాళిక విభాగం ఉపాధ్యక్షుడు. నాలుగో ఫ్లోర్... ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి, మంత్రులు, కార్యదర్శులకు ఉమ్మడి ఆఫీస్ రూమ్, అదే ఫ్లోర్లో సీ బ్లాక్‌లో కాన్ఫరెన్స్ హాల్, బీ బ్లాక్‌లో ఐటీ, మున్సిపల్ మంత్రి, ఆ శాఖ స్పెషల్ సీఎస్, పేషీ, ఎక్సైజ్ మంత్రి, రెవెన్యూ(ఎక్సైజ్) ముఖ్య కార్యదర్శి. మూడో ఫ్లోర్... మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ సెక్షన్లు, ప్రభుత్వ సంస్థల విభాగం, సీ బ్లాక్‌లో ఐదు గురు ప్రభుత్వ సలహాదారులు, పరిశ్రమలు , వాణిజ్యం, పబ్లిక్ ఎంటర్‌ప్రెజైస్ కార్యదర్శి, ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖల కార్యదర్శులు. రెండో ఫ్లోర్... రెవెన్యూ (వాణిజ్య పన్నులు), రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) విభాగాలు, ప్లానింగ్ విభాగం, పశుసంవర్ధక శాఖ, ఎస్సీ అభివృద్ధి శాఖ, కార్మిక ఉపాధి కల్పన, ఫ్యాక్టరీల శాఖ అధికారులు, సెక్షన్లు, కార్మిక ఉపాధి ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ ముఖ్య కార్యదర్శి, కమలనాథన్ కమిషన్, ఇంధన శాఖ అధికారులు, ఆఫీసులు. ఒకటో ఫ్లోర్... వైద్య ఆరోగ్య శాఖ, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ అధికారులు, సెక్షన్లు, సీపీఆర్వో, సీఎం పీఆర్వోలు, ఉన్నత విద్య, పాఠశాల విద్య శాఖ గ్రౌండ్ ఫ్లోర్, గ్యారేజీలు.. చీఫ్ సెక్యూరిటీ ఆఫీస్, గిరిజన, మైనారిటీ సంక్షేమ విభాగాలు, ఎస్బీ స్టోర్స్, ఆర్ అండ్ బీ సివిల్ అండ్ ఎలక్ట్రికల్, ఎంఈఏ బ్రాంచ్. తొమ్మిదో ఫ్లోర్లో సీఎం ఆఫీస్ బీఆర్కే భవన్లో అత్యంత ఎత్తున ఉన్న తొమ్మిదో ఫ్లోర్లో డీ బ్లాక్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కార్యాలయం, సీ బ్లాక్‌లో సీఎంవో కార్యదర్శులు, విజిటర్స్ రూమ్, జీఏడీ ప్యాంట్రీ, బీ బ్లాక్‌లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రెవిన్యూ ముఖ్య కార్యదర్శి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, విద్యా ముఖ్య కార్యదర్శి, డిప్యూటీ సీఎంల పేషీలు ఉంటాయి. -
ట్రంప్ అనూహ్య నిర్ణయం..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. తన ప్రచార వ్యయాన్ని అనూహ్యంగా పెంచారు. ఇప్పటి నుంచి ఎన్నికల తేదీ వరకు ప్రచార ప్రకటనల కోసం 140 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నట్లు ట్రంప్ సీనియర్ కమ్యూనికేషన్ అడ్వైజర్ జెసన్ మిల్లర్ తెలిపారు. ఈ 140 మిలియన్ డాలర్లలో 100 మిలియన్ డాలర్లను టెలివిజన్ యాడ్లకు ఉపయోగించనుండగా... మరో 40 మిలియన్ డాలర్లను డిజిటల్ యాడ్ల కోసం ఖర్చుచేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకూ ఎన్నికల ప్రచారంలో తన ప్రత్యర్థి హిల్లరీ కంటే తక్కువ ఖర్చు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకొస్తున్న ట్రంప్.. అనూహ్యంగా తన ప్రచార వ్యయాన్ని పెంచడం విశేషం. దీంతో హిల్లరీ అంచనాలు వారానికి 11 మిలియన్ డాలర్లుగా ఉండగా.. ట్రంప్ 16 మిలియన్ డాలర్లతో ప్రచార వ్యయంలో దూకుడు పెంచారు. -
పారిస్‌లో మరో ఉగ్రదాడికి కుట్ర!
పారిస్: ఫ్రాన్స్‌లో మరో ఉగ్రదాడికి ఇస్లామిక్ స్టేట్ కుట్ర పన్నిందా? అవుననే అంటున్నాయి అక్కడి నిఘా వర్గాలు. అయితే, ఈ సారి దాడిని మహిళలతో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు గురువారం రాత్రి ముగ్గురు ఉగ్రవాద అనుమానిత మహిళలను పారిస్‌లో అదుపులోకి తీసుకోవడంతో ఉగ్రకుట్ర బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. ఆరు గ్యాస్ సిలిండర్లతో అనుమానాస్పదంగా పార్కింగ్‌లో ఉన్న కారును ఆదివారం పారిస్‌లో గుర్తిచారు. దీనిపై విచారణ జరుపుతున్న పోలీసులు గురువారం రాత్రి ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు మహిళలు 39, 23, 19 సంవత్సరాల వయస్సు గల వారిగా గుర్తించారు. అరెస్ట్ సమయంలో వారు తీవ్రంగా ప్రతిఘటించి పోలీసులపై దాడికి దిగారు. పోలీసులు కాల్పుల్లో ముగ్గురిలో ఓ మహిళ గాయపడింది. ఎట్టకేలకు వీరిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్న పోలీసులు ఒకరికి ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలున్నట్లు ప్రాధమికంగా నిర్థారించారు. అరెస్ట్‌కు ముందు వీరిని గమనించిన ఓ స్థానికుడు మీడియాతో మాట్లాడుతూ.. ముగ్గురు మహిళలు చాలా ఉద్వేగంగా కనిపించారని, అనుమానాస్పదంగా సంచరించారని వెల్లడించాడు. విదేశీ టూరిస్టులతో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాన్ని వీరు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. వీరు కొత్త తరహాలో దాడి చేయడానికి ప్రణాళికలు వేసినట్లు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి బెర్నార్డ్ కెజ్న్యూవ్ తెలిపారు. -
రాజధానిలో రవాణా ప్రణాళిక కోసం అధ్యయనం
సాక్షి, అమరావతి : రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న రోడ్ నెట్వర్క్, బీఆర్టీఎస్, మెట్రో, రైల్ నెట్వర్క్, వాటర్ వేస్‌కు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని జపాన్‌కు చెందిన జైకా ప్రతినిధి బృందానికి సీఆర్డీఏ అధికారులు సూచించారు. అమరావతి రాజధాని నగరం, రీజియన్‌లో రవాణా వ్యవస్థపై అధ్యయనం చేసి ప్రణాళికS రూపకల్పనకు జైకా బృందం మూడు రోజుల పాటు పర్యటనకు వచ్చింది. ఆ సందర్బంగా గురువారం సీఆర్డీఏ కార్యాలయంలో జైకా ప్రతినిధులతో అధికారులు సమావేశమై రవాణా ప్రణాళికలపై అవగాహన కల్పించారు. రాజధాని నగరం పరిధిలోని, రీజియన్ పరిధిలో సమగ్ర రవాణా ప్రణాళిక రూపొందించాల్సిన అవశ్యకతను జైకా ప్రతినిధులకు సీఆర్డీఏ అధికారులు సూచించారు. కేపిటల్ సిటీ, రీజియన్‌కు, ప్రతి అర్బన్ సెంటర్‌కు ప్రత్యేక ప్రణాళిక ఉండాలని చెప్పారు. రీజియన్‌తో ఎలా లింక్ చేయాలి, టీఓడీ కారిడార్ ఎలా ఉండాలి, ఇంటిగ్రేషన్ విత్ ట్రాన్స్‌పోర్టు ప్లాన్, దశలవారీగా ప్రణాళిక, ఇనిస్టిట్యూషనల్ ఫ్రేమ్‌వర్క్, మేజరల్ రోడ్ నెట్వర్క్ ప్లాన్, ఇంటిలిజెంట్ ట్రాన్స్పోర్ట్ ప్లాన్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్, రోడ్ సేఫ్టీ ప్లాన్ తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి నివేధిక రూపొందించాలని సూచించారు. రవాణా ప్రణాళిక, ఫిజిబిలిటీ రిపోర్ట్, ఫైనాన్సియల్ రిపోర్ట్ అందజేయాలని సూచించారు. 2020 నుంచి ప్రతి ఐదేళ్లకు ప్రత్యేక ప్రణాళిక, 2050 నాటికి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జైకా ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీనియర్ అడ్వయిజర్ కవహర షుంటారో, యాక్టింగ్ డైరెక్టర్ సనద అకికో, ప్రతినిధి హిరోషి యొషిదా, ఏపీసీఆర్డీఏ అదనపు కమిషనర్ వి.రామమనోహరరరావు, ఎడిసి చీఫ్ ఇంజినీర్ రామమూర్తి, ఎకనామిక్ డెవలప్మెంట్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రిన్సిపల్ ప్లానర్ అరవింద్, ప్రిన్సిపల్ ప్లానర్ వివిఎల్‌ఎన్ శర్మ, ఆర్వీ కన్సల్టెంట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
పాక్ భారత్ సరిహద్దుల్లో భారీ స్కెచ్.!
-
తాడోపేడో.. ఆస్తుల స్వాధీనానికి ప్రణాళిక
ఇప్పటికే కల్యాణమండపం, బంక్ స్వాధీనం కార్మికసంఘాల తొలి విజయం తగరపువలస : చిట్టివలస జూట్‌మిల్లు యాజమాన్యం కార్మికులకు ముఖం చాటేసి ఏడుసంవత్సరాల నాలుగు మాసాలు అవుతుంది. కార్మికులకు యాజమాన్యం చెల్లించాల్సిన బకాయిలు 170 కోట్లు ఉన్నాయి. వీటిలో ట్రస్టీల వద్ద ఉన్నపీఎఫ్ నిల్వలు రూ.13.30 కోట్లు, యాజమాన్యం నేరుగా చెల్లించాల్సిన గ్రాట్యూటీ రూ.50కోట్లు, అక్రమ లాకౌట్‌కు సంబంధించి వేతనాలు చెల్లింపు చట్టం ప్రకారం 2015 మార్చి వరకు రూ.106 కోట్లు బకాయి ఉంది. ఈ మొత్తం మిల్లు యజమాని తన ఆస్తులను అమ్మితే తప్ప కార్మికులకు చెల్లించలేని పరిస్థితి. ఆదిశగా ప్రయత్నించక పోవడంతోకార్మిక సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ మిల్లు ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచన కార్మిక ఉద్యమానికి బలం చేకూర్చింది. కల్యాణమండపం, పెట్రోల్ బంక్ స్వాధీనం.. మిల్లు యాజమాన్య ప్రతినిధుల చేతుల్లో ఉన్న కల్యాణమండపం, లేబర్ వెల్ఫేర్ సెంటర్, పెట్రోల్‌బంక్‌లను మూడురోజుల కిందట స్వాధీనం చేసుకున్నారు. మరో వారం రోజుల్లో యాజమాన్యం నుంచి అనుకూల ప్రకటన రాకపోతే బంతాటమైదానం, ఇతర ఆటస్థలాలను స్వాధీనం చేసుంటామని కమిటీ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు కార్మికుల ఆకలికేకలు, సంఘాల ఆక్రందనలు ఖాతరు చేయని మిల్లు యాజమాన్యం ప్రతినిధులు పెట్రోల్‌బంక్ స్వాధీనం చేసుకోవడంతో కదులుతున్నారు. ఈ పట్టు వదిలితే ఇక యాజమాన్యం ఎంతమాత్రం రాడని అందువలన మిల్లు స్థిరాస్తులను స్వాధీనం చేసుకునే పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. కార్మికవాడలోని కార్మికులను చెదరగొట్టేందుకు ఇళ్లు ఖాళీచేయాలని జారీచేసిన నోటీసులకు కార్మికులు బెదరలేదు. -
తల్లిదండ్రుల హోదా వస్తోందా?
♦ పుట్టబోయే బిడ్డకోసం కాస్తంత ప్లానింగ్ ♦ బీమా, విద్య, సంరక్షకులే ప్రధానం... దంపతులు తల్లిదండ్రులుగా మారుతున్నపుడు ఎన్నో ఆశలు, ఊహలు మదిలో మెదులుతుంటాయి. చిన్నారి కోసం ప్రత్యేకంగా ఓ గది అలంకరించడం దగ్గర్నుంచి వారికోసం ఓ ఉయ్యాల, ఇతర సామగ్రిని సిద్ధం చేసే పనిలో పడతారు. కానీ, వీటితోపాటు కాబోయే తల్లిదండ్రులు చేయాల్సింది మరొకటి ఉంది. చిన్నారి బంగారు భవిత కోసం చక్కని ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవడం. ఇప్పటి వరకు ఇద్దరే. ఇకపై ముగ్గురు. మీ మధ్యకు మూడో వ్యక్తి రాకతో జరిగే మార్పులపై దృష్టి సారించాలి. తమ కలల రూపమైన చిన్నారి అభివృద్ధికి, అవసరాలకు అనుగుణంగా ఇంటి ఖర్చులు, పొదుపు, మదుపు ఇలా అన్నింటినీ పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. వారికి తగినంత సమయం కేటాయించాలి. పిల్లలు రాక ముందు ఆదాయం ఎంతున్నా... ఒక్కరు సంపాదించినా చీకూ చింతా లేకుండా జీవించేస్తారు. కానీ, చిన్నారి రాకతో అదనపు, ఊహించని ఖర్చులు వచ్చి పడతాయి. వాటిని తట్టుకునేలా ఆర్థిక ప్రణాళిక అవసరం. ఎంత వరకు సంపాదిస్తున్నారు? ఎంత ఖర్చు చేస్తున్నారు? ఎంత పొదుపు చేస్తున్నారు? ఈ విషయాలపై ముందుగా స్పష్టత ఉండాలి. దాంతో చిన్నారి సంరక్షణ కోసం ఎంత వరకు ఖర్చు చేయగలరు? వారి బంగారు భవిష్యత్తు కోసం ఎంత పొదుపు చేయగలరు? వారి కోసం ఎన్ని సెలవులు తీసుకోవాలన్న దానిపై స్పష్టత వస్తుంది. జీవిత బీమా తప్పనిసరి... తల్లిదండ్రులుగా మారిపోయిన తర్వాత అప్పటి వరకు తమ కోసం జీవించిన వారు... అప్పటి నుంచి తమ చిన్నారి కోసం జీవించడం మొ దలు పెడతారు. ఒకవేళ తల్లిదండ్రుల్లో ఏవరో ఒకరికి లేదా ఇద్దరికీ దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితే...? ఆ చిన్నారి సంరక్షణ, భవిష్యత్తు అవసరాలను ఎవరు చూస్తారు? అందుకే తల్లిదండ్రులు ఇద్దరూ తమ పేరిట జీవిత బీమా తీసుకోవాలి. తాను లేకపోయినా తనపై ఆధారపడిన వారి పోషణ, అవసరాలు, పిల్లల విద్యావసరాలు, ఆర్థిక ఇబ్బందులు, రుణాలను తీర్చేంత బీమా తీసుకోవాలి. సంరక్షకుల్ని ముందే నిర్ణయించాలి తన మరణానంతరం తన ఆస్తులు ఎవరికి చెందాలన్నది చెబుతూ విల్లు రాయటం ముఖ్యమే. కానీ, అంతకంటే ముందు పిల్లలున్న తల్లిదండ్రులు సంరక్షణ బాధ్యతలను ఎవరు చూడాలన్నది నిర్ణయించడం ఎంతో ముఖ్యం. దంపతులకు ఏదైనా జరిగితే... సంరక్షణ బాధ్యతలు ఎవరు చూడాలన్నది నిర్ణయించి ఉండకపోతే... అప్పుడు కోర్టే ఆ పని చేస్తుంది. కోర్టు నియమించిన సంరక్షకుడు దంపతుల ఆశలకు అనుగుణంగా చిన్నారికి తగిన న్యాయం చేయలేకపోవచ్చు. అందుకే ఈ బాధ్యతలకు తగిన వ్యక్తిని నిర్ణయించాలి. చిన్నారుల విద్యకూ ప్రాధాన్యం! జీవన వ్యయాన్ని మించి విద్యా వ్యయం మన దేశంలో పరుగులు తీస్తోంది. అందుకే భవిష్యత్తు ఖర్చులను తీర్చేందుకు వీలుగా మదుపు చేయాలి. ఇందుకోసం మార్కెట్లో ఎన్నో రకాల పథకాలున్నాయి. పిల్లల అన్ని రకాల విద్యావసరాలకు తగినట్టు మధ్య మధ్యలో రాబడులను ఇచ్చే పథకాలు అనువుగా ఉంటాయి. ఈ అవసరాలను తీర్చే విధంగా బీమా కంపెనీలు భిన్న ప్రయోజనాలతో కూడిన పథకాలను అందిస్తున్నాయి. ఒకవేళ జరగరానిది జరిగితే తల్లిదండ్రులు లేకపోయినా, చిన్నారి విద్యా అవసరాలను బీమా పాలసీ తీరుస్తుంది. చాలా కంపెనీలు ప్రీమియం వైవర్ రైడర్‌తో వస్తున్నాయి. పాలసీదారుడు మరణించిన సందర్భంలో ప్రీమియం చెల్లించే పని లేకుండానే కొనసాగుతుంది. వారి వారసులకు 18 లేదా 21 ఏళ్లు వచ్చిన వెంటనే బీమా ప్రయోజనాలు చెల్లించబడతాయి. -
పుష్కర విధులకు 60వేల మంది
72 గంటలు ముందుగానే విధుల్లో చేరనున్న ఉద్యోగులు వారికి ‘అక్షయ పాత్ర’ భోజనం విద్యాసంస్థల భవనాల్లో సిబ్బందికి వసతి 12 రోజులపాటు ప్రత్యేక కాల్ సెంటర్లు కృష్ణా పుష్కరాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధమైంది. పోలీసులు సహా అన్ని శాఖల ఉద్యోగులు 60 వేల మంది పుష్కర విధుల్లో పాలుపంచుకోనున్నారు. ఆయా శాఖల వారీగా ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక జాకెట్లు సిద్ధం చేస్తున్నారు. పుష్కరాలు జరిగే 12 రోజులు పనిచేసేలా ప్రత్యేక కాల్సెంటర్లను ఏర్పాటుచేయనున్నారు. కలెక్టర్ బాబు.ఎ అధ్యక్షతన బుధవారం జరిగిన జిల్లా అధికారుల సమావేశంలో ఈ మేరకు కార్యాచరణ రూపొందించారు. విజయవాడ : వచ్చేనెల 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ జరగనున్న కృష్ణా పుష్కరాల నిర్వహణకు చేపట్టాల్సిన కార్యాచరణపై జిల్లా యంత్రాంగం వ్యూహం సిద్ధం చేసింది. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి అధికార యంత్రాగంతో కలెక్టర్ బాబు.ఎ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పుష్కరాలను విజయవంతం చేసేం దుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. పుష్కర విధులకు వచ్చే పోలీసులు, సాధారణ ఉద్యోగులు, వారికి కల్పించే వసతికి సంబంధించి కార్యాచరణపైనా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ పోలీసులు, సాధారణ ఉద్యోగులకు పుష్కర నగర్‌లకు 500 మీటర్లలోపు వసతి ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పుష్కరఘాట్, పుష్కర నగర్‌కు సమీపంలో ఉన్న ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల భవనాల జాబితాలు తక్షణమే ఇవ్వాలని జిల్లా విద్యాశాఖాధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖాధిపతులు తమ శాఖల నుంచి పుష్కర విధులకు కేటాయిస్తున్న ఉద్యోగుల వసతిపై రెండురోజుల్లో వేదిక ఇవ్వాలని కోరారు. మూడు రోజులు ముందుగానే విధులకు పుష్కరాల ప్రారంభానికి 72 గంటల ముందుగానే ఉద్యోగులు కేటాయించిన ప్రదేశంలో విధులకు హాజరై అక్కడి వాతావరణానికి అలవాటు పడాలని కలెక్టర్ సూచించారు. ఘాట్ల వారీగా బందోబస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పుష్కర విధులు నిర్వహించే ఆయా శాఖల ఉద్యోగులను సులభంగా గుర్తించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన జాకెట్లను అందజేస్తామన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఆకుపచ్చరంగు, పారా మెడికల్ సిబ్బందికి కాషాయం రంగు జాకెట్లను ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. 85 శాతం మంది భక్తుల స్నానాలు ఇక్కడే.. సుమారు ఆరు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పద్మావతి, కృష్ణవేణి, దుర్గ, పున్నమి ఘాట్లు, పవిత్రసంగమం వద్ద 85 శాతం మంది యాత్రీకులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనావేశారు. ఈ ప్రాంతాల్లో యాత్రికులకు అసౌకర్యం కలగకుండా సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. 3 చోట్ల అక్షయపాత్ర వంటశాలలు పుష్కర విధుల్లో పాల్గొనే 60 వేల మంది ఉద్యోగులకు అక్షయపాత్ర సంస్థ ద్వారా భోజన సదుపాయం కల్పించేందుకు నిర్ణయించామని కలెక్టర్ చెప్పారు. ఆయా శాఖలు సిబ్బంది భోజన వసతి కోసం ఇచ్చే నిధులను అక్షయపాత్ర సంస్థకు కేటాయించాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. విజయాడలో మూడు ప్రాంతాల్లో అక్షయపాత్ర సంస్థ వంట శాలలు ఏర్పాటు చేసి ఐదు లక్షల మందికి ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. ఉద్యోగులు పుష్కర విధులు నిర్వహించే చోటే ఆహారాన్ని పంపిణీ చేస్తామని కలెక్టర్ చెప్పారు. పుష్కర కాల్‌సెంటర్లు పుష్కరాల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. పుష్కర సమాచారం, వివిధ హోదాల్లో ఉన్న ముఖ్యుల (వీఐపీ) పర్యటనలను ముందుగానే తెలుసుకుని, సాధారణ యాత్రికులకు అసౌకర్యం కలగకుండా, ముఖ్యులకు ఏర్పాట్లు చేసేందుకు వీలుగా ఇవి పనిచేస్తాయని చెప్పారు. 10 మంది ఉద్యోగులు నిరంతరం ఈ కాల్ సెంటర్లలో విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా అధికారులు పలువురు పాల్గొన్నారు. -
సన్నీలియోన్ మరో సంచలనం!
ముంబయి: తొలుత పోర్న్ చిత్రాల్లో.. అనంతరం బాలీవుడ్ లో అడుగుపెట్టి షేక్ చేసిన సన్నీ లియోన్ ఇప్పుడు సింగర్ గా మారబోతుందా అంటే.. ఆమె పోస్ట్ చేసిన ఓ ఫొటో అవుననే సమాధానం చెబుతోంది. బాలీవుడ్ మొత్తాన్ని ఒక్కసారిగా షేక్ చేసి ఇటీవల కనిపించడం మానేసిన సన్నీ లియోన్ తాజాగా కొత్త అవతారంలో దర్శనం ఇచ్చింది. అది కూడా ఓ మైక్ ముందు నిల్చొని. ఓ సాంగ్ రికార్డింగ్ స్టూడియోలో నిల్చొని గట్టిగా ఓ పాట పడుతున్నట్లు అందులో కనిపించింది. ఈ ఫొటోను స్వయంగా సన్నీనే పోస్ట్ చేసింది. ఆ ఫొటోకు ట్యాగ్ లైన్ గా ’నా భయాలన్నింటిని పక్కకు పెట్టి ముందుకెళ్లాను.. మొత్తానికి బిగ్గరగా పాడగలిగాను. రిహార్సింగ్ కోసం ఒక నెల వెచ్చించాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను’ అని ఆమె చెప్పింది. ప్రస్తుతం ఈ నటి యూత్ కు సంబంధించిన రియాలిటీ టీవీ స్ప్లిట్స్ విల్లా సీసన్ 9 అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. -
పన్నుల పని మొదలెట్టారా?
శ్రీకర్‌కు జీతం నెలకు 70వేల పైనే. కాకపోతే గత నెల జీతం... అంటే మార్చిది కేవలం 30వేలే వచ్చింది చేతికి. ఎందుకంటే ప్లానింగ్ లోపం. ఆదాయపు పన్ను మినహాయింపులకు ఏమేం చేస్తున్నారో చెప్పాలని వాళ్ల ఆఫీసు ఫైనాన్స్ విభాగం ముందు నుంచీ అడుగుతున్నా... రకరకాల కారణాలు చెబుతూ వచ్చాడు శ్రీకర్. రకరకాల ప్రతిపాదనలు ముందు చెప్పినా... చివరికొచ్చేసరికి అవేమీ చెయ్యలేకపోయాడు. ఫలితం... మార్చి జీతంలో భారీగా కోతపడింది. ఒక్క మార్చి మాత్రమే కాదు. అంతకు ముందు మూడు నెలల నుంచీ... అంటే డిసెంబర్ నుంచీ అలా కోతలు పడుతూనే వచ్చాయి. ఇక లాభం లేదు!! వచ్చే ఏడాదైనా ముందు నుంచీ ప్రణాళిక వేసుకుని పన్ను మినహాయింపుల కోసం ఏదో ఒకటి చెయ్యాలని గట్టిగా అనుకున్నాడు. అలా అనుకుంటూ ఉండగానే ఏప్రిల్ నెలాఖరు వచ్చేసింది. శ్రీకర్‌కు భయం పట్టుకుంది. నిజానికి ఒక్క శ్రీకర్ మాత్రమే కాదు. చాలామంది పరిస్థితి ఇదే. ఆర్థిక సంవత్సరం మొదలైన దగ్గర్నుంచీ పన్ను ప్లానింగ్ చెయ్యాలని అనుకుంటారు. కానీ సమయం గడిచిపోతూ ఉంటుంది. అందుకే... అలాంటి వారికోసమే ఈ ప్లానింగ్ పాఠం... నిజం చెప్పాలంటే... హడావుడిలోనే ఎక్కువ తప్పులు జరుగుతాయి. ఆర్థిక ప్రణాళికైనా అంతే. ఆఖరు నిమిషం నిర్ణయాలకు తావులేకుండా గరిష్టంగా పన్ను లాభాలు పొందటానికి ప్రణాళిక కావాలి. ఇప్పటి నుంచీ మొదలుపెడితే అందుకు బోలెడంత సమయం లభిస్తుంది. అవసరమైతే మధ్యలో తగు మార్పులు కూడా చేసుకోవచ్చు. ఈ ఏడాది ఆదాయ పన్ను చట్టంలో పెద్దగా మార్పులు జరగలేదు కాబట్టి గతేడాదిలాగే ప్రణాళికలను సిద్ధం చేసుకోవచ్చు. కానీ గతేడాదితో పోలిస్తే కొన్ని పెట్టుబడి సాధనాల పనితీరులో చాలా మార్పు వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు. - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఏడాది ఆరంభం నుంచే ప్లానింగ్ తప్పనిసరి * అలాగైతే జేబుకు భారం లేకుండా మినహాయింపులు * ఆఖరి క్షణం నిర్ణయాల్లో తప్పులు కూడా జరగొచ్చు * మధ్యలో నిర్ణయాలు మార్చుకోవటానికీ తగినంత సమయం * వడ్డీరేట్లు తగ్గుతున్నాయి కనుక ఇపుడే డిపాజిట్లు చేయటం బెటర్ * ఈ ఏడాది స్టాక్ మార్కెట్ల పనితీరు కూడా ఆశావహమే షేర్లు కొన్నా పన్ను లాభమే... గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలు స్వల్ప నష్టాలను అందించినా... ఈ ఏడాది ప్రారంభం నుంచి సానుకూల సంకేతాలనే ఇస్తున్నాయి. దీర్ఘకాలంలో ఈక్విటీలు మంచి రాబడినిచ్చే అవకాశం ఉంటుంది కనుక కొద్దిగా రిస్క్ చేయగలిగే సామర్థ్యం ఉన్నవారు వీటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వివిధ మార్గాల్లో పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఇందుకోసం ఆదాయ పన్ను చట్టంలో 80సీ, 80సీసీజీ అని రెండు సెక్షన్లు ఉన్నాయి. తొలిసారిగా డీమ్యాట్ ఖాతా తెరిచి షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ కొన్న వారు సెక్షన్ 80సీసీజీ కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. దీన్నే రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీం (ఆర్జీఈఎస్ఎస్)గా పిలుస్తున్నారు. ఈ పథకం కింద గరిష్టంగా ఇన్వెస్ట్ చేసే రూ.50,000లలో సగభాగం అంటే రూ.25,000 పన్ను ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవచ్చు. ఇలా వరుసగా మూడేళ్ళు చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఈ మినహాయింపు పొందవచ్చు. వార్షికాదాయం పన్నెండు లక్షల లోపు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఎంపిక చేసిన కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందొచ్చు. వీటిని ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్‌లు లేదా ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌గా పిలుస్తారు. దాదాపు అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌ను అందిస్తున్నాయి. వీటి రాబడులు మార్కెట్ కదలికలపై ఆధారపడి ఉంటాయి. వీటికి లాకిన్ పిరియడ్ మూడేళ్లు. ఆరోగ్యంతో పాటు పన్ను లాభం... ప్రస్తుత పరిస్థితుల్లో దురదృష్టవశాత్తూ ఆసుపత్రి పాలైతే అంతే!! ఎందుకంటే ఆసుపత్రి ఖర్చులు మామూలు జీతగాళ్లు తట్టుకునే స్థాయిలో లేవు. అందుకని ప్రతి ఒక్కరికీ ఇపుడు జీవితబీమా మాదిరే ఆరోగ్య బీమా కూడా అత్యవసరం. కాకపోతే ఈ ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు. - గతేడాది నుంచి సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియంపై లభించే పన్ను మినహాయింపు పరిధిని పెంచారు. 60 ఏళ్ళలోపు వయస్సున్న వారైతే ఆరోగ్య బీమాకు చెల్లించే మొత్తంలో రూ.25,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అదే సీనియర్ సిటిజన్స్‌కైతే ఈ పరిమితి రూ. 30,000. ముందస్తు వైద్య పరీక్షలకు చేసే వ్యయంపై గరిష్టంగా రూ.5,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ ఈ మొత్తం రూ.25,000 పరిధిలోకే వస్తుంది. భారా ్యభర్తలు, పిల్లలు, తల్లిదండ్రుల వైద్య పరీక్షలకోసం చేసే ఖర్చులు కూడా ఈ పరిధిలోకి వస్తాయి. ఇది కాకుండా తల్లిదండ్రులకు చెల్లించే వైద్య బీమా ప్రీమియంపై కూడా మినహాయింపు ఉంటుంది. తల్లిదండ్రులు 60 ఏళ్ళలోపు వారైతే రూ. 25,000, అదే సీని యర్ సిటిజన్స్ అయితే రూ.30,000 అదనంగా పొందొచ్చు. అంటే ఈ సెక్షన్ ద్వారా గరిష్టంగా రూ. 50 వేల నుంచి రూ. 60 వేలవరకు ప్రయోజనం పొందవచ్చు. ఇవి కాకుండా బీమా, పీపీఎఫ్, హోమ్లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, పిల్లల ట్యూషన్ ఫీజులు వంటి అనేక పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని చక్కగా వినియోగించుకోవడం ద్వారా సాధ్యమైనంత వరకు పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. పైన పేర్కొన్న వాటిలో మీకు అనువైన పథకాలను ఎంచుకొని వాటిలో క్రమ శిక్షణతో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను లాభాలతో పాటు దీర్ఘకాలంలో తగినంత సంపదను వృద్ధి చేసుకోవచ్చు. డిపాజిట్లు... వడ్డీ తగ్గుతోంది ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరాదాయం పొందాలనుకునే వారికి ఈ ఏడాది కాస్త నిరాశే మిగిలింది. గడిచిన ఏడాది కాలంగా డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గుతుండటమే కాకుండా... మరింత తగ్గే అవకాశాలున్నాయంటూ బలమైన సంకేతాలు వస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో డిపాజిట్లపై వడ్డీరేట్లు ఇంచుమించు రెండు శాతం వరకు తగ్గాయి. మున్ముందు మరింత తగ్గొచ్చు కూడా. అందుకని పన్ను మినహాయింపు కోసం బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారికి కాస్తంత ఇబ్బందే. పెపైచ్చు ఇకపై పోస్టాఫీసుకు సంబంధించిన చిన్న మొత్తాల పొదుపు రేట్లను ప్రతి మూడు నెలలకోసారి సమీక్షించనున్నారు కూడా. * ప్రస్తుతం పోస్టాఫీసు ఐదేళ్ల డిపాజిట్‌పై 7.9 శాతం వడ్డీని అందిస్తుండగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదేళ్ల కాలానికి 7 శాతం వడ్డీరేటు మాత్రమే అందిస్తోంది. * అమ్మాయిల పెళ్లిళ్లకు అక్కరకొచ్చేలా సుకన్య-సమృద్ధి పేరుతో మరో ప్రత్యేక సేవింగ్స్ పథకం ఉంది. 10 ఏళ్లలోపు అమ్మాయిల పేరిట ఈ * ఖాతా ప్రారంభించొచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై 8.6 శాతం వడ్డీ వస్తోంది. ఈ పథకం పోస్టాఫీసు, కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల్లో అందుబాటులో ఉంది. * మున్ముందు వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉంది కనుక ఇన్వెస్ట్ చేసే ముందు ఎక్కడ అధిక వడ్డీ వస్తోందో పరిశీలించుకోండి. ప్రస్తుతానికి బ్యాంకుల కన్నా పోస్టాఫీసులే అధిక వడ్డీ అందిస్తున్నాయి. * పన్ను ప్రయోజనాల కోసం ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే ఆలస్యమయ్యే కొద్దీ వడ్డీరేట్లు మరింత తగ్గే ప్రమాదం ఉందని గుర్తుంచుకోవాలి. ఎన్పీఎస్... ఆకర్షణ పెరిగింది ఈ రోజుల్లో ప్రభుత్వోద్యోగాలంటే అతి కొద్ది మందికే పరిమితం. ప్రైవేటు ఉద్యోగాల్లో ఎక్కువ జీతంతో ఉండి రకరకాల పథకాల్లో ఇన్వెస్ట్ చేసేవారికైతే ఇబ్బంది ఉండదు. కానీ చిన్న జీతాలుండి... రిటైరైనవారు ఆ తరవాత ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానమే పెన్షన్ ప్లాన్లు. అందులో ప్రభుత్వ నియంత్రణలో నడిచే న్యూ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ప్రధానమైంది. ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ అందించే ఈ ఎన్పీఎస్ పథకానికి ప్రతి ఏడాదీ కొన్ని అదనపు ఆకర్షణలు చేరుస్తున్నారు. ఈ సారి కూడా ఎన్పీఎస్ విత్డ్రాయల్స్పై చేసిన సవరణలు ఈ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. మొన్నటి వరకు ఎన్పీఎస్ నుంచి వెనక్కి తీసుకునే ప్రతి పైసానూ పన్ను ఆదాయంగా పరిగణించి దానిపై పన్ను చెల్లించమని అడిగేవారు. కానీ మొన్నటి బడ్జెట్లో ఎన్పీఎస్ నుంచి వెనక్కి తీసుకునే 40 శాతం మొత్తంపై ఎలాంటి పన్నూ విధించకూడదని ప్రతిపాదన చేశారు. అంతేకాక ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసే మొత్తంపై సెక్షన్ 80సీసీడీ కింద గరిష్టంగా రూ.50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. -
పక్కా ప్రణాళికతో.. ముందుకెళతాం
విద్యార్థి దశలో కీలకమైన పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. సరైన మార్గాన్ని ఎంచుకోవాల్సిన సమయం ఇప్పుడు విద్యార్థుల ముందుంది. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు సాగుతున్నారంటూ పరీక్షలు రాసిన విద్యార్థులను ‘సాక్షి’ పలకరించింది. సమయాన్ని వృథా చేయకుండా పక్కా ప్రణాళికతో ముందుకెలతామని పేర్కొన్నారు. వారి అభి ప్రాయాలు వారి మాటల్లోనే... - భూపాలపల్లి పోలీస్ ఆఫీసర్ అవుతాను చిట్యాలలోని కాకతీయ హైస్కూల్లో టెన్త్ చదివాను. మొదటి నుంచి ప్రణాళిక ప్రకారం చదివాను. పరీక్షలు బాగా రాసాను. ప్రస్తుతం పాల్టెక్నిక్కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నాను. అందులో సీట్ రాకపోతే ఇంటర్, డిగ్రీ పూర్తిచేసి ఎస్సై జాబ్ కొట్టి మంచి పోలీస్ ఆఫీసర్ కావాలని ఉంది. అదే లక్ష్యంతో కష్టపడి సాధిస్తాను. - గౌరిశెట్టి నవీన్, చిట్యాల ఇంజనీర్ అవుతాను చిట్యాల హైస్కూల్లో టెన్త్ చదివాను. 9.8 జేపీఏ పాయింట్లు వస్తాయని నాకు నమ్మకంగా ఉంది. ఇంజనీర్ కావాలని ఉంది. భౌతిక శాస్త్రం అంటే చాలా ఇష్టం. మా అమ్మనాన్నల కలలను నిజం చేస్తాను. కష్టపడి పట్టుదలతో చదివి ఇంజనీర్ నవుతాను. - ముసాపురి రజిత, చిట్యాల సైంటిస్ట్ కావడమే లక్ష్యం పదో తరగతి పరీక్షలు బాగా రాసాను. 9.9 జేపీఏ పాయిం ట్లు వస్తాయని నాకు నమ్మకంగా ఉంది. నాకు సైన్స్ అం టే చాలా ఇష్టం. ప్రయోగాలు చేయాలని ఉంది. మా అమ్మనాన్నల ప్రొత్సాహం ఉంది. నేను పట్టుదలతో చదివి దేశానికి మంచి సైంటిస్ట్‌ను కావాలని ఉంది. అవుతాను. - కత్తెరశాల సుస్రుత్, నవాబుపేట ఫిజికల్ డెరైక్టర్‌గా ఎదగాలనుంది పదో తరగతి పరీక్షలో 9/10 జీపీ సాధిస్తా. పదవ తరగతి పరీక్షల్లో 10/10 జీపీకి ప్రయత్నించినప్పటికీ కొన్ని తప్పిదాల కారణంగా 1 పాయింట్ తగ్గితుందనుకుంటున్నా. ఈ వేసవిలో ఏపీఆర్జేసీలో సీటు సంపాదించేందుకు ప్రిపేరవుతున్నా. ఫిజికల్ డైరక్టర్ కావలనేదే లక్ష్యంగా చదువుతున్నా. - బాసని రక్షితగీత, శాయంపేట డాక్టర్ కావాలనే నా కోరిక చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే కోరిక ఉంది. పదవ తరగతిలో 10/10 ర్యాంకు వస్తుందనే నమ్మకం ఉంది. ఎండాకాలంలో కంప్యూటర్‌పై అవగాహన పెంచుకోవడంతో పాటు చదువుతూ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవడానికి పుస్తకాలను సేకరిస్తున్నాను. - కట్కం సింధూ, రేగొండ -
రూ.2681 కోట్లతో ‘స్మార్ట్’
సాంస్కృతిక రాజధానిగా ఓరుగల్లు పర్యాటకులను ఆకర్షించేలా పనులు పట్టణంలో పచ్చదనానికి ప్రాధాన్యం మారనున్న నగరం రూపురేఖలు స్మార్ట్‌సిటీ డీపీఆర్ లక్ష్యాలు ఇవే.. వరంగల్ నగరాన్ని రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్మార్ట్‌సిటీ సమగ్ర ప్రణాళిక రూపొందించారు. నగరానికి ఉన్న చారిత్రక ప్రాశస్త్యాన్ని ఉపయోగించుకుని పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కేలా పనులు చేపట్టనున్నారు. ముఖ్యంగా భద్రకాళి, పద్మాక్షి ఆలయాల కేంద్రంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) సిద్ధమైంది. దీంతో పాటు నగర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. అదేవిధంగా బస్‌స్టేషన్, డ్రెరుునేజీల నిర్మాణం, సోలార్ విద్యుత్ దీపాలు, వర్షపు నీరు ఒడిసి పట్టడం వంటి పనులు ఉన్నాయి. ఈ పనులకు రూ.2681 కోట్లతో సిద్ధం చేసిన స్మార్ట్‌సిటీ ప్రతిపాదనల్లో ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి.. హన్మకొండ: నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన స్మార్ట్‌సిటీ పథకం తొలి దశ అమలులో వరంగల్ నగరానికి అవకాశం త్రుటిలో చేజారిపోయింది. మలిదశ అమలులో చోటు దక్కించుకునేందుకు లీ కంపెనీ నేతృత్వంలో సమగ్ర నివేదికను రూపొందించారు. మొత్తం రూ.2,681 కోట్ల వ్యయంతో నగరం రూపురేఖలు మార్చే విధంగా పనులు చేపట్టాలని ఈ ప్రణాళికలో పేర్కొన్నారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేషన్ భాగస్వామ్యంలో ఏర్పాటయ్యే స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ద్వారా రూ.1686 కోట్ల నిధులు సమీకరించాలని సూచించారు. మిగిలిన రూ.995 కోట్లను పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా సేకరించాలని డీపీఆర్‌లో పేర్కొన్నారు. ఇలా సేకరించిన నిధులతో ఐదేళ్ల పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. ముఖ్యవిభాగాలు స్మార్ట్‌సిటీ ద్వారా చేపట్టబోయే పనులను ప్రాంతాల వారీగా వర్గీకరించారు. ఇందులో రెట్రోఫిట్టింగ్ పేరుతో భద్రకాళీ చెరువు చుట్టూ 500 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తారు. రీడెవలప్మెంట్ స్కీం కింద 50 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి, ఆ ప్రాంతాన్ని అన్ని రకలా అధునాతన సదుపాయాలు ఉండేలా అభివృద్ధి పరుస్తారు. దీని తర్వాత 250 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి దీన్ని గ్రీన్‌ఫీల్డ్ సిటీగా రూపాంతరం చెందేలా పనులు చేపడుతారు. వీటితో పాటు నగర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేలా మరికొన్ని కార్యక్రమాలు చేపడుతారు. ఈ విభాగంలో ఈ గవర్నెన్స్ సిటిజన్ సర్వీసెస్, వేస్ట్ మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్, ఎనర్జీ మేనే జ్మెంట్, అర్బన్ మొబిలిటీ వంటి పనులు నిర్వహిస్తారు. -
‘ఆరోగ్య వరం’గల్
మల్టీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలుగా నిర్మాణం ఎంజీఎం స్థానంలో నీలోఫర్ మాదిరిగా మాతాశిశు ఆస్పత్రి ఏరియా ఆస్పత్రులుగా హన్మకొండ ప్రసూతి, సీకేఎంలు హన్మకొండ : వైద్య సేవలకు హైదరాబాద్‌పై ఆధారపడకుండా వరంగల్ నగరాన్ని స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఉత్తర తెలంగాణకు ప్రభుత్వ వైద్య సేవలపరంగా పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీగా మారుస్తామని తాజాగా బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఎంజీఎం ఆస్పత్రి సూపర్‌గా మారుతుండగా హన్మకొండ ప్రసూతి , వరంగల్ సీకేఎం ఆస్పత్రులు ఏరియా ఆస్పత్రులుగా మార్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. సెంట్రల్ జైలు స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఎంజీఎం సూపర్ స్పెషాలిటీగా మారడంతో పాటు ప్రభుత్వ వైద్యపరంగా నగరంలో పలు మార్పులు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఇటీవల ఆదేశించారు. జనవరిలో హన్మకొండలోని నందనా గార్డెన్స్‌లో జరిగిన సమావేశంలో ఈ విషయంపై చర్చించారు. ఈ మేర కు జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటి ప్రకారం ఎంజీఎం ఆస్పత్రిని ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుంచి పూర్తిగా తరలించాలని నిర్ణయిం చారు. వరంగల్ కేంద్ర కారాగారాన్ని వేరేచోటుకు తరలించి ఆ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఎంజీఎంను అప్‌గ్రేడ్ చేయనున్నారు. కేంద్ర కారాగారాన్ని తరలించిన తర్వాత కాకతీయ మెడికల్ కాలేజీ ప్రాంగణం విస్తీర్ణం పెరగనుంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యా నిబంధనల కాలేజీ క్యాంపస్‌లోనే 1200 పడకల సామర్థ్యంతో భవనాలు నిర్మిస్తారు. ఇందులో ప్రధానమంత్రి స్వస్థా సురక్షా యోజనా పథకం ఫేజ్-3 కింద 300 పడకల సామర్థ్యం కలిగిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తారు. దీంతో ఎంజీ ఎం పడకల సామర్థ్యం 1500కు చేరుకుంటుంది. మల్టీ, సూపర్ విభాగాలు 1500 పడకలు కలిగిన ఎంజీఎంలో మల్టీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలు కొనసాగుతాయి. మల్టీ స్పెషాలిటీ విభాగంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, పాథాలజీ, ఈఎన్టీ, మైక్రో బయాలజీ, పాథాలజీ, బయోమెడికల్, శస్త్ర చికిత్స విభాగాలు కొనసాగుతా యి. సూపర్ స్పెషాలిటీ విభాగంలో కార్డియాలజీ, అంకాలజీ(క్యాన్సర్), గ్యాస్ట్రో, ఎండ్రోకైనాలజీ, న్యూ రో, ప్లాస్టిక్ సర్జన్లతో పాటు ఇంటెన్సివ్ కార్డియోథోరియాసిక్, కార్డియో థోరియాసిక్ సర్జన్ విభాగాలు కొనసాగుతాయి. ప్రస్తుతం ఎంజీఎంలో కొన్ని సూప ర్ స్పెషాలిటీ విభాగాలే కొనసాగుతున్నారుు. మాతా శిశు ఆస్పత్రి ఎంజీఎం ఆస్పత్రిని కాకతీయ మెడికల్ కాలేజీలో నిర్మించబోయే నూతన భవనంలోకి తరలించిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని పూర్తి స్థాయిలో మాతా శిశు ఆస్పత్రి(ఎంసీహెచ్ , మెటర్నల్ చైల్డ్ హెల్త్)గా మారుస్తారు. ఇందులో గైనకాలజీ (స్త్రీల సంబంధిత ఆరోగ్య సమస్యల విభాగం) పీడియాట్రిక్ (పిల్లలు) విభాగాలు కొనసాగుతాయి. పీడియాట్రిక్ విభాగంలో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్(నవజాత శిశువు) యూనిట్లు ఉంటాయి. అంతేకాకుండా వేర్వేరుగా వంద పడకల సామర్థ్యం కలిగిన హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, వరంగల్ సీకేఎం(చందా కాంతాయ్య మెమోరియల్) ఆస్పత్రులను ఎంజీఎం భవనాల్లోకి మారుస్తారు. 500కు పైచిలుకు పడకల సామర్థ్యంతో ఎంజీఎం ఆస్పత్రిలో ప్రాంతీయ మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిగా పని చేస్తుంది. దాదాపుగా హైదరాబాద్‌లో ఉన్న నీలోఫర్ ఆస్పత్రి స్థాయిలో ఈ ఆస్పత్రిని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. జనరల్ ఆస్పత్రులు హన్మకొండ ప్రసూతి ఆస్పత్రి, సీకేఎం ఆస్పత్రులను ఎంజీఎంలోకి మార్చిన తర్వాత ఈ భవనాల్లో సాధారణ ఆస్పత్రులను కొనసాగిస్తారు. ప్రస్తుతం ఇక్కడున్న వంద పడకల సామర్థ్యాన్ని రెండు వందల పడకలకు పెంచుతారు. ఇవి వరంగల్ తూర్పు, పశ్చిమ ఏరియా ఆస్పత్రులుగా సేవలు అందిస్తాయి. ఇక్కడ సాధారణ వైద్యసేవల ద్వారా సానుకూల ఫలితం కనిపించని రోగులను ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రిఫర్ చేస్తారు. హన్మకొండ, సీకేఎం ఆస్పత్రులు జనరల్ ఆస్పత్రులుగా మారడం వల్ల ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై పని భారం తగ్గుతుంది. -
‘రియల్’ ప్లాన్!
ఆదాయం పెంపుపై హెచ్ఎండీఏ దృష్టి వెంచర్ల అభివృద్ధి, ప్లాట్ల వేలానికి నిర్ణయం ‘ఉప్పల్ భగత్’ ప్లాట్ల విక్రయానికి సన్నాహాలు భవిష్యత్ నగరాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తూ కొత్త కొత్త ప్రాజెక్టులతో దిశా నిర్దేశం చేయాల్సిన హెచ్ఎండీఏ ఇప్పుడు తన పంథాను మార్చుకుంటోంది. ఆర్థికంగా పరిపుష్టి సాధించేందుకు రియల్ ఎస్టేట్ రంగంవైపు మళ్లీ దృష్టి సారిస్తోంది. నాగోలు వద్ద ఉప్పల్ భగత్‌లో అభివృద్ధి చేసిన లే అవుట్లో తన వాటాగా వచ్చే ప్లాట్లను వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో నగర శివార్లలో ల్యాండ్ పూలింగ్ చేయడం ద్వారా భారీ వెంచర్లు అభివృద్ధి చేసేందుకు సైతం హెచ్ఎండీఏ సన్నద్ధమైంది. - సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: ఇటీవల మూసీనది పరిశీలన సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన సూచనలు కూడా హెచ్ఎండీఏకు పూర్వవైభవం తెచ్చే విధంగా ఉన్నాయి. ‘గతంలో జరిగిన కొన్ని తప్పిదాల వల్ల హెచ్ఎండీఏ అభాసుపాలైంది. ఇకపై ఏం చేసినా... పక్కాగా చేస్తాం. ప్రజలకు క్లియర్ టైటిల్ ప్లాట్లను అందజేస్తాం. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రైవేటు నిర్మాణ సంస్థ ఎలా పని చేస్తుందో... హెచ్ఎండీఏ కూడా అదే స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకొంటున్నాం ’ అంటూ మునిసిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు మూసీ పరిశీలన సందర్భంగా స్పష్టం చేశారు. దీంతో హెచ్ఎండీఏ కొత్త వెంచర్ల అభివృద్ధికి ల్యాండ్ పూలింగ్ వైపు దృష్టి సారించింది. ఇప్పటికే ఉప్పల్-నాగోల్ మార్గంలోని ఉప్పల్ భగత్‌లో 413.32 ఎకరాల్లో సుమారు రూ.93 కోట్ల వ్యయంతో భారీ లే అవుట్‌ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ లేఅవుట్‌ను అభివృద్ధి చేసినందుకు గాను 9,25,000 చదరపు గజాల విస్తీర్ణం ప్లాట్లు హెచ్ఎండీఏ వాటాగా రానున్నాయి. అయితే... ఉప్పల్ భగత్‌లో భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్లు ఇవ్వగా ఇంకా సుమారు 1,75,000 చ.గ. విస్తీర్ణం మిగులుతోంది. దీన్ని వేలం ద్వారా విక్రయించి నిధులు సేకరించాలని హెచ్ఎండీఏ ఉవ్విళ్లూరుతోంది. త్వరలో రైతులకు ప్లాట్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో మిగిలిన ప్లాట్లను వేలం ద్వారా విక్రయానికి పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇప్పుడున్న ధరల ప్రకారం ఒక చ.గ. ధర రూ.20 వేలకు అమ్మినా... 1,75,000 చ.గ.ల ప్లాట్లకు సుమారు రూ.350 కోట్లు ఆదాయం రానుంది. అయితే... ఉప్పల్ భగత్ లేఅవుట్లో ఇంకా నీటి సరఫరా పైపులైన్ వ్యవస్థ, ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపులు, ఫెన్సింగ్ వంటివి నిర్మిం చాల్సి ఉంది. ఇందుకోసం మరో రూ.10 కోట్లు వెచ్చిం చాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అన్ని ఖర్చులు పోయినా... ఇక్కడి ప్లాట్లు అమ్మడం ద్వారా రూ.340-350 కోట్లు ఆదాయం రానుంది. రూ.వెయ్యి కోట్లు ఆదాయం ఉప్పల్ భగత్ సమీపంలోనే 150 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని కూడా అభివృద్ధి చేస్తే ఈ లేఅవుట్ మరింత విస్తరించవచ్చని, తద్వారా ఖర్చు తగ్గడంతో పాటు నీరు, డ్రైనేజీ, రోడ్డు సదుపాయాలు సులభమవుతాయని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఆ 150 ఎకరాల్లో లేఅవుట్ అభివృద్ధి చేస్తే సుమారు 3.50 లక్షల చ.గ. విస్తీర్ణంలో ప్లాట్లు రూపొందుతాయని, ఒక చదరపు గజం రూ.20 వేల ప్రకారం విక్రయించినా రూ.700 కోట్లు ఆదాయం వస్తుం దని అంచనా. అయితే...ఈ లేఅవుట్‌ను అభివృద్ధి చేయడానికి రూ.45-50 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని ఆ మొత్తా న్ని తీసేస్తే రూ.650 కోట్లు ఆదాయం రానుంది. కొత్త లేఅవుట్ అభివృద్ధి చేయడం వల్ల రూ.650 కోట్లు, ఉప్పల్ భగత్‌లో తమ వాటాగా వచ్చిన 1,75,000 చ.గ. ప్లాట్లను విక్రయించడం ద్వారా రూ.350 కోట్లు.. మొత్తం రూ.1000 కోట్లు ఆదాయం రానుందని ప్రాథమిక అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆదాయంతో హెచ్ఎండీఏ ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడమే గాక, నగరాభివృద్ధికి సంబంధించి కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు వెసులుబాటు కలగనుంది. అయితే... గతంలో ప్రభుత్వ భూములు అమ్మిపెట్టినందుకు గాను రూ.470 కోట్లు ఆదాయపన్ను కింద చెల్లిం చాలని ఐటీ శాఖ చాలాకాలంగా హెచ్ఎండీఏను వెంటాడుతోంది. దీంతో కొత్త వెంచర్లపై ఆ సంస్థ ఆచితూచి అడుగులేస్తోంది. కొత్త వెంచర్ల అభివృద్ధి విషయమై హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులును ‘సాక్షి’ వివరణ కోరగా తర్వాత వెల్లడిస్తామంటూ ఆయన దాటవేశారు. -
పల్లెల్లో డబుల్ కు ట్రబుల్
♦ ఒక్కో ఇంటిపై అదనంగా రూ.70 వేల భారం ♦ అంచనా వ్యయం సవరించాలంటున్న కాంట్రాక్టర్లు ♦ గ్రామీణ ప్రాంతాల్లో ‘రెండు పడకల’పై సందిగ్ధత ♦ ప్రభుత్వ నిర్ణయం కోసం యంత్రాంగం ఎదురుచూపు ♦ ఆ లోపు పట్టణాల్లో నిర్మాణాల ప్రారంభానికి సన్నాహాలు మంజూరైన ఇళ్లు: 6,850 గ్రామీణ ప్రాంతాలకు: 3,610 పట్టణ ప్రాంతాలకు: 3,240 నిర్మించే స్థలాలు: 105 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘రెండు పడక గదుల ఇళ్ల’ నిర్మాణ అంచనా వ్యయం లెక్క తప్పింది. నిర్దేశిత యూనిట్ విలువకు అనుగుణంగా ఇళ్లను నిర్మించలేమని కాంట్రాక్టు సంస్థలు చేతులెత్తేశాయి. ఒక ఇంటి యూనిట్ విలువను సగటున రూ.70వేలు పెంచితే తప్ప.. డబుల్‌బె డ్రూం ఇళ్ల నిర్మాణంలో ముందడుగు వేయలేమని తేల్చిచెప్పాయి. యూనిట్ విలువను రాష్ర్టస్థాయిలో ఖరారు చేసినందున.. ప్రభుత్వ నిర్ణయం కోసం జిల్లా యంత్రాంగం ఎదురుచూస్తోంది. ప్రతిపాదిత వ్యయాన్ని సవరిస్తే తప్ప పునాదిరాయి పడే అవకాశం లేకపోవడంతో టె ండర్ల ప్రక్రియ చేపట్టేందుకు వెనుకడుగు వేస్తోంది. ఈ పరిస్థితి గ్రామాల్లో నిర్మించే ఇళ్ల విషయంలోనే ఎదురవుతుండడంతో దీనిపై విధానపర నిర్ణయం తీసుకునేలోపు పట్టణ ప్రాంతాల్లో (మున్సిపాలిటీ) ఇళ్ల నిర్మాణాలను చేపట్టడానికి యంత్రాంగం ప్రణాళికలు తయారు చేస్తోంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి పట్టణాల్లో నో ప్రాబ్లమ్ గ్రామీణ ప్రాంతాల తో పోలిస్తే పట్టణాల్లో ప్రభుత్వం ఖ రారు చేసిన ధరకే ఇళ్లను నిర్మించేందుకు కాంట్రాక్టు సంస్థలు అంగీకరించాయి. జీ+1, అపై అంతస్తులతో జరిగే అపార్ట్మెంట్ల నిర్మాణంతో యూనిట్ విలువ కలిసివస్తుందని అంచనా వేసిన కాంట్రాక్టర్లు నిర్దేశిత ధరకే గృహ నిర్మాణాలను చేపట్టగలమనే నిర్ణయానికి వచ్చారు. దీంతో తాండూరు, వికారాబాద్, బడంగ్‌పేట, మేడ్చల్, పెద్ద అంబర్‌పేట నగర పంచాయతీలతోపాటు శివార్లలోని ఫీర్జాదిగూడ, చెంగిచర్ల, ఘట్కేసర్, ఫీర్జాదిగూడ, మీర్‌పేట, జిల్లెల్గూడ పంచాయతీల్లో జీ+1+2+3 భవనాల్లో ఫ్లాట్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రభుత్వం ఏప్రిల్‌లో వీటికి పునాదిరాయి వేసే దిశగా ఆలోచన సాగిస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: డబుల్బెడ్రూం పథకం కింద జిల్లాకు 6,850 గృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంట్లో గ్రామీణ ప్రాంతాల్లో 3,610, పట్టణ ప్రాంతాల్లో 3,240 ఇళ్లను లబ్ధిదారులకు అందజేసేలా ప్రతిపాదనలు రూపొందించింది. జిల్లావ్యాప్తంగా 105 చోట్ల ఈ మేరకు ఇళ్లను నిర్మించేందుకు స్థలాలను కూడా ఎంపిక చేసింది. కాగా, స్థలాల లభ్యతకు అనుగుణంగా ప్రస్తుతం పల్లెల్లో 3,290, పట్టణాల్లో 1,160 ఇళ్ల నిర్మాణానికి కార్యాచరణ తయారు చేసింది. యూనిట్ విలువను కూడా ఇదివరకే ఖరారు చేసిన ప్రభుత్వం.. ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేయాలని భావించింది. అయితే, నిర్దేశిత వ్యయానికి అనుగుణంగా ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ఆసక్తి చూపకపోవడంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్ విలువ (ఒక ఇల్లు) రూ.5.04 లక్షలు. దీంట్లో కేంద్రం రూ.35వేలు, రాష్ట్రం రూ.4.69 లక్షలను సబ్సిడీ రూపంలో అందజేస్తోంది. అదే పట్టణ ప్రాంతంలో యూనిట్ కాస్ట్ రూ.5.30లక్షలు. దీంట్లో కేంద్రం రూ.లక్ష, రాష్ట్రం రూ.4.30 లక్షలను రాయితీగా భరిస్తోంది. తొలిదశలో 78 గ్రామాల్లో సగటున 20 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించిన జిల్లా యంత్రాంగం.. లేఅవుట్లను కూడా కొలిక్కి తెచ్చింది. ఇక ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టాలనుకుంటున్న తరుణంలో కాంట్రాక్టర్లు ముఖం చాటేస్తుండడం అధికారులను కలవరపరుస్తోంది. ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడూల్స్ ఆఫ్ రేట్స్) రేట్లకు అనుగుణంగా ప్రభుత్వం యూనిట్ విలువను ప్రకటించినప్పటికీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని కాంట్రాక్టు ఏజెన్సీలు అంటున్నాయి. ప్రభుత్వ నిర్దేశిత రేట్ల ప్రాతిపదికన పల్లె ప్రాంతంలో ఒక గృహాన్ని నిర్మించాలంటే రూ.5.98 లక్షల వ్యయం అవుతుందని లెక్క తేల్చాయి. చేవెళ్లలోని గ్రామాల్లో ఇళ్లను నిర్మించేందుకు ఈ మేరకు కోట్ చే యడంతో బిత్తెరపోయిన యంత్రాంగం దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. ఒక్కో ఇంటికి అదనంగా రూ.70వేల భారం భరించాల్సి రావడం.. జిల్లా వ్యాప్తంగా ఈ భారం రూ.25.27 కోట్లు కావడంతో యంత్రాంగానికి ఎటూ పాలుపోవడంలేదు. ఈ నేపథ్యంలో తడిసిమోపెడవుతున్న అంచనా వ్యయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేగానీ టెండర్లను పిలిచే అవకాశం కనిపించడంలేదు. రాష్ట్ర స్థాయిలో విధానపర నిర్ణయం తీసుకునేలోపు పట్టణ ప్రాంతాల్లో జీ+1 (గ్రౌండ్ + అంతస్తులు) గృహాసముదాయాల నిర్మాణాలను మొదలు పెట్టేదిశగా కార్యాచరణ ప్రణాళికలు తయారుచేస్తోంది. ఇదిలావుండగా, గృహ నిర్మాణ వ్యయంలో 13.5శాతాన్ని కాంట్రాక్టర్‌కు ప్రాఫిట్ బెన్ఫిట్ కింద ప్రభుత్వం చెల్లిస్తోంది. ‘లబ్ధిదారులకే ఇళ్ల నిర్మాణ బాధ్యతలను బదలాయిస్తే.. అదనపు భారం నుంచి సర్కారుకు వెసులుబాటు దక్కుతుంది. డిజైన్‌కు అనుగుణంగా సొంత స్థలాల్లో నిర్మించుకునే వీలు కలిగిస్తే స్థలాల కొరతను కూడా అధిగమించవచ్చని’ గృహనిర్మాణరంగ నిపుణులు అంటున్నారు. -
ప్రాణహిత, పాలమూరుకు 15 వేల కోట్లు
బడ్జెట్లో ఈ రెండు ప్రాజెక్టులకు పెద్దపీట కొత్తగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు రూ.771 కోట్లు డిండి, కంతనపల్లికి భారీగానే కేటాయింపులు మిషన్ కాకతీయకు రూ.2 వేల కోట్లు కేటాయింపు ప్రణాళికలకు కేబినెట్ ఆమోదం హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నిర్మించతలపెట్టిన, రీ ఇంజనీరింగ్ చేసిన ప్రాజెక్టులకు వచ్చే బడ్జెట్లో నిధుల పంట పండనుంది. మొత్తంగా రూ.25 వేల కోట్ల సాగునీటి శాఖ బడ్జెట్లో వాటికే దాదాపు 65 శాతం నిధులు కేటాయించేలా ప్రణాళికలు తయారయ్యాయి. ఈ బడ్జెట్ ప్రణాళికకు ఆదివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని కేబినెట్ ఆమోదముద్ర వేసింది. బడ్జెట్లో పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత ఎత్తిపోతలకే సుమారు రూ.15 వేల కోట్లు కేటాయించనున్నారు. రీ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న డిండి, సీతారామ, కంతనపల్లి, ఇందిరమ్మ వరద కాల్వకు కూడా భారీగా నిధులు కేటాయించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కొత్త ప్రాజెక్టులకూ పెద్దపీట: రాష్ట్ర బడ్జెట్లో సాగునీటి శాఖకు ఏటా రూ.25 వేల కోట్లు కేటాయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ప్రాజెక్టులవారీగా కేటాయించాల్సిన నిధులపై పలు దఫాలుగా కసరత్తు చేశారు. మొదట వేసిన అంచనాల్లో ప్రాణహిత, పాలమూరు ప్రాజెక్టులు ఒక్కోదానికి రూ.8 వేల కోట్ల చొప్పున కేటాయించాలని ప్రతిపాదనలు రూపొందించారు. తాజాగా రెండింటికి కలిపి రూ.15 వేల కోట్లు కేటాయించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందు లో పాలమూరు ప్రాజెక్టుకు రూ.7,860.88 కోట్లు, ప్రాణహితకు రూ.7,400 కోట్లు కేటాయించేందుకు ఓకే చేశారు. కొత్తగా చేపట్టిన సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టుకు రూ. 771.80 కోట్లు, డిండి ఎత్తిపోతలకు రూ.780 కోట్లు కేటాయిం చేందుకు ఆమోదముద్ర వేశారు. ఇక చివరి దశలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు మొత్తంగా రూ.685 కోట్ల మేర కేటాయింపులు జరిపారు. ఆదిలాబాద్‌లోని మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తిచేసి ఆయకట్టు లక్ష్యాలను చేరేలా కేటాయింపుల ప్రతిపాదనలు ఓకే అయ్యాయి. వీటితోపాటు మిషన్ కాకతీయకు రూ.2 వేల కోట్లు కేటాయించనున్నారు. ఆయకట్టు లక్ష్యం మరో 52 లక్షల ఎకరాలు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ప్రాజెక్టుల కింద ఇప్పటివరకు మొత్తంగా రూ.46 వేల కోట్ల మేర ఖర్చు చేయగా, వృద్ధిలోకి వచ్చిన ఆయకట్టు 9 లక్షల ఎకరాల వరకు ఉంది. పాత ప్రాజెక్టులు, చిన్న నీటి వన రుల కింద ఉన్న ఆయకట్టుతో కలిపి మొత్తంగా 48,22 లక్షల ఆయకట్టుకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరందుతోంది. ఈ లెక్కన ప్రభుత్వం లక్ష్యం మేరకు మరో 52 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. దీనిపైనా కేబినెట్లో చర్చ జరిగింది. ఈ లక్ష్యాన్ని చేరుకునేలా కృషి చేయాలని సీఎం సూచించినట్లు తెలిసింది. -
ప్లాన్ 100 డేస్‌పై కేటీఆర్ మార్క్
గత ప్రణాళికకు పలు సవరణలు రూ. 163 కోట్లతో జలమండలి కార్యాచరణ సిటీబ్యూరో: వంద రోజుల కార్యాచరణ ప్రణాళికపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తనదైన ముద్రవేశారు. ఇటీవల జలమండలి రూ. 78.25 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ప్రణాళికలో పలు మార్పులు, చేర్పులను మంత్రి సూచించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రూ. 163 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి సవరించిన కార్యచరణ ప్రణాళికను మంత్రికి సమర్పించారు. దీంతో గురువారం సచివాలయంలో జరిగిన సమావేశంలో ప్రతిపాదనలను మంత్రి ఆమోదించారు. సాధారణంగా వేసవిలో చేపట్టే నిర్వహణ, మరమ్మతు పనుల స్థానే బల్దియా ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం, ఐటీ కారిడార్ సహా శివారు ప్రాంతాల దాహార్తిని తీర్చడం, హుస్సేన్‌సాగర్, దుర్గం చెరువు వంటి జలాశయాల పరిరక్షణకు తాజా కార్యాచరణలో చోటు కల్పించడం విశేషం. సవరించిన ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. రూ.40 కోట్ల అంచనా వ్యయంతో శాస్త్రీపురం, గోల్డెన్ హైట్స్, బుద్వేల్, సులేమాన్ నగర్ (రాజేంద్రనగర్ సర్కిల్), బార్కాస్, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లో 30 వేల నూతన నల్లా కనెక్షన్ల ఏర్పాటు. హుస్సేన్‌సాగర్ కాలుష్య కాసారం కాకుండా చూసేందుకు రూ. 58 కోట్ల వ్యయంతో ట్రంక్ సీవర్ మెయిన్ పైప్‌లైన్ ఏర్పాటు. రూ. 35 కోట్లతో దుర్గం చెరువుకు కాలుష్య విముక్తి కల్పించేందుకు ట్రంక్ సీవర్ మెయిన్ ఏర్పాటు. రూ. 25 కోట్ల అంచనా వ్యయంతో మాదాపూర్ పరిధిలోని ఐటీ కారిడార్‌లో నీటిసరఫరా వ్యవస్థ ఏర్పాటు చేసి ఐటీ జోన్ దాహార్తి తీర్చడం. రూ. 5 కోట్ల అంచనా వ్యయంతో హఫీజ్‌పేట్, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో నీటిసరఫరా పైపులైన్ వ్యవస్థ ఏర్పాటు. చాంద్రాయణగుట్ట డివిజన్ పరిధిలోని బండ్లగూడలో మూడువేల నూతన నల్లా కనెక్షన్ల ఏర్పాటు. రూ.15 లక్షల అంచనా వ్యయంతో హైదర్‌గూడ ప్రాంతంలో బూస్టర్ పంపు ఏర్పాటు చేసి నీటి సరఫరాను మెరుగుపరచడం. లో ప్రెజర్ సమస్యను పరిష్కరించడం. మల్కాజ్గిరి ప్రాంతంలో పలు కాలనీలకు నీటి పంపిణీ పైపులైన్లు ఏర్పాటు. మణికొండ, పుప్పాలగూడ, నార్సింగ్ ప్రాంతాలకు నీటి సరఫరాకు 400 ఎంఎం వ్యాసార్థం గల పైపులైన్ ఏర్పాటు. నల్లా కనెక్షన్లు మంజూరు. కూకట్పల్లి, శేరిలింగంపల్లి సర్కిళ్ల పరిధిలో నూతన ఫిల్లింగ్ కేంద్రాల ఏర్పాటు. ఇక్కడి నుంచి అదనపు ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరా వ్యవస్థ అందుబాటులో లేని ప్రాంతాలకు రోజువారీగా నీటి సరఫరా. నల్లా కనెక్షన్ల కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు మోక్షం కల్పించడం. సరఫరా వ్యవస్థ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో తక్షణం నూతన నల్లా కనెక్షన్ల మంజూరు. హెచ్ఎండీఏ ప్రణాళిక ఇదీ.. సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కార్యాచరణ ప్రణాళికను మంత్రి ఆమోదించారు. ఈమేరకు హెచ్ఎండీఏ కమిషనర్ టి. చిరంజీవులు ‘100 డేస్ యాక్షన్ ప్లాన్’ను మీడియాకు వెల్లడించారు. కొత్త భవన నిర్మాణాలు, లేఅవుట్ పర్మిషన్లు, భూ వినియోగ మార్పిడికి సంబంధించి నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్ఓసీ) వంటివాటిని డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం (డీపీఎంఎస్) ద్వారా ఆన్లైన్లోనే హెచ్ఎండీఏ అందించనుంది. 2007-08లో ఎల్ఆర్ఎస్/బీఆర్ఎస్ కింద క్రమబద్ధీకరణ కోసం వచ్చి పెండింగ్‌లో ఉన్న 14,500 దరఖాస్తులను వచ్చే మూడు నెలల్లో పరిష్కరించనున్నారు. ఘట్కేసర్-కీసర-శామీర్‌పేట మధ్య నిర్మాణం పూర్తి చేసుకున్నట ఔటర్ రింగ్‌రోడ్డుపై వాహనాల రాకపోకలకు అనుమతి. ఔటర్‌పై ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లు పనిచేసేలా చర్యలు. ఔటర్ రింగ్‌రోడ్డులో మెయిన్ కాజ్‌వేకు- సర్వీసు రోడ్ మధ్యలో రైల్వే కారిడార్ కోసం కేటాయించిన స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో సైక్లింగ్ ట్రాక్ అభివృద్ధి. ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణంలో భాగంగా చేపట్టిన భూసేకరణలో భూములు/ స్థలాలు కోల్పోయినవారికి కొహెడ వద్ద ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపు. హరితహారం ప్రాజెక్టులో భాగంగా ఈఏడాది మే 31న ప్రజలకు 50 లక్షల మొక్కలు పంపిణీ చేసేందుకు హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ ఏర్పాటు. గ్రేటర్‌లోని 150 డివిజన్లలో వందరోజుల్లో వార్డు, ఏరియా కమిటీల ఏర్పాటు.రూ. 200 కోట్లతో 569 బీటీ రోడ్ల పనులు పూర్తి. రూ. 30 కోట్లతో మేజర్ నాలాల్లో డీసిల్టింగ్ పూర్తి.పది శ్మశానవాటికల అభివృద్ధి, ఒక్కోదానికి కోటి ఖర్చు. రూ. 3 కోట్లతో 50 బస్‌బేల అభివృద్ధి -
కలసి నడుద్దాం
అధికారులకు మేయర్ పిలుపు ప్రజల ఆశలు.. ఆకాంక్షలు నెరవేర్చేందుకుసమైక్యంగా పని చేద్దామని మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులకు పిలుపునిచ్చారు. చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని... దీర్ఘ కాలిక లక్ష్యాలను నిర్ణీత వ్యవధిలో సాధించాలని సూచించారు.వీటికి సంబంధించి 100 రోజుల ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. సిటీబ్యూరో: దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్ణీత వ్యవధిలో.. చిన్న సమస్యలను వెంటనే స్పందించి పూర్తి చేయాలని మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులను కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసినప్పుడే సమస్యలను సమర్థంగా పరిష్కరించుకోగలుగుతామని చెప్పారు. శుక్రవారం ఆయన మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌తో కలిసి జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరంలో తక్షణమే పూర్తి చేయాల్సినవి, వివిధ విభాగాల్లోని స్వల్ప కాలిక పనులపై 100 రోజుల ప్రణాళికను రూపొందించాల్సిందిగా సూచించారు. నగరాభివృద్ధితో పాటు పౌర సదుపాయాల మెరుగుకు కొత్త పాలకమండలిపై ప్రజలు భారీ ఆకాంక్షలతో ఉన్నారని చెప్పారు. వాటిని నెరవేర్చేందుకు అందరం కలిసికట్టుగా పని చేయాల్సి ఉందని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్ మార్గ దర్శకత్వానికి అనుగుణంగా పనులు చేయాలని సూచించారు. పన్ను వసూళ్లకు కృషి చేస్తాం అభివృద్ధి పనులకు నిధుల అవసరం ఉన్నందున సమర్థంగా ఆస్తిపన్ను వసూలు చేయాలని పిలుపునిచ్చారు. భారీ బకాయిలు ఉన్న వారి నుంచి ఆస్తిపన్ను వసూళ్లకు తనతో పాటు డిప్యూటీ మేయర్ కూడా ప్రత్యేకంగా కృషి చేస్తామని మేయర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీలో సిబ్బంది కొరత తీర్చేందుకు సీఎంతో చర్చిస్తామన్నారు. స్టాండింగ్ కమిటీ, కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ డా.జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. వివిధ పథకాల అమలులో ఎదురువుతున్న సవాళ్లను మేయర్‌కు వివరించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్లు సురేంద్రమోహన్, శివకుమార్‌నాయుడు, రామకృష్ణారావు, శంకరయ్య, రవికిరణ్, కెనెడి, భాస్కరాచారి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
నీటియాతన
కృష్ణమ్మ చెంత.. తాగునీటికి చింత మున్సిపాలిటీల్లో దాహం కేకలు కొన్నిచోట్ల వారానికి ఒక రోజే మంచినీరు అన్ని చోట్లా ట్యాంకర్లే దిక్కు బందరు, పెడన, తిరువూరుల్లో నీటికోసం ఎదురుచూపులు పాలకుల ప్రణాళికాలోపమే కారణం కృష్ణమ్మ చెంతనే ఉన్నా జిల్లాప్రజల దప్పిక తీరడం లేదు. వేసవి ఇంకా రాకముందే చుక్కనీటి కోసం పాలకులు చుక్కలు చూపిస్తున్నారు. ముందస్తు ప్రణాళికలు లేక పోవడంతో కృష్ణానది సహా అనేక వాగులు, వంకలు పూర్తిగా ఎండిపోయాయి. నిత్యం ట్యాంకర్లు నడవనిదే చుక్క నీరు అందదు. వారంలో రెండుసార్లు.. అదీ రెండు గంటలు వస్తే గొప్ప. తాగునీటి సరఫరా ఫర్వా లేదనుకుంటే ఆ ప్రాంతాల్లో పైప్ లైన్ లీకేజీలు. ఇవీ జిల్లాలోని మున్సిపాలిటీల్లో ‘సాక్షి’ నెట్ వర్క్ బృందం గమనించిన అంశాలు. విజయవాడ : విజయవాడ నగరం సహా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో జల యుద్ధాలు మొదలయ్యాయి. ప్రధాన నీటి వనరులుగా ఉన్న కృష్ణానది, మునేరు, కృష్ణా కుడి కాలువ ఎండిపోవడంతో నీటి కొరత వెంటాడుతోంది. విజయవాడ నగరపాలక సంస్థ సహా ఎనిమిది మున్సిపాలిటీల్లో నెలకు సగటున అదనంగా కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టే పరిస్థితి వేసవి రాకముందే ఉత్పన్నమైంది. ఇక ఎండాకాలంలో దానికి రెట్టింపు మొత్తం ఖర్చు పెట్టినా మంచినీరు దొరకని దుర్భర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. బందరులో మూడు రోజులకోసారి... జిల్లా కేంద్రమైన మచిలీపట్నం మున్సిపాలిటీలో 2.25 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. వీరికి రోజుకు 18 మిలియన్ లీటర్ల నీరు కావాల్సి ఉండగా.. దానిలో 20 శాతం కూడా సరఫరా కావడం లేదు. బందరుకు నీరందించే తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పూర్తిగా ఎండిపోయింది. కనీసం ఆరు మీటర్ల లెవల్ వరకు ఉండాల్సిన నీరు ప్రస్తుతం అర మీటరు కూడా లేకపోవడంతో 12 ట్యాంకర్లు ఏర్పాటు చేసి మూడు రోజులకు ఒకసారి తాగునీరు అందిస్తున్నారు. పెడన మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ ఉన్న 30 వేల మంది జనాభా అవసరాలకు రోజుకు 30 లక్షల లీటర్ల నీరు కావాల్సి ఉండగా దానిలో 50 శాతం కూడా విడుదల కాని పరిస్థితి నెలకొంది. ఈ మున్సిపాలిటీకి తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి పైప్‌లైన్ ద్వారా నీరు వస్తుంది. అక్కడ నీరు లేకపోవడంతో రామరాజుపాలెం పంటకాల్వ ద్వారా కృష్ణా నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నారు. కృష్ణా నీరు కూడా లేకపోవడంతో బోర్లపై ఆధారపడి ట్యాంకర్ల ద్వారా వారానికి ఒకరోజు సరఫరా చేస్తున్నారు. ఉయ్యూరు మున్సిపాలిటీలో 40 వేల జనాభా అవసరాలకు అనుగుణంగా నీటి విడుదల లేదు. నీరు మురుగు వాసన వస్తుండడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. సుందరంపేట, దళితవాడ, ఉర్దూ పాఠశాల సెంటర్, డొంకరోడ్డు సెంటర్ ప్రాంతాల్లో కాలువల్లోనే మంచినీటి పైప్లైన్లు ఉండడంతో ఈ పరిస్థితి దాపురించింది. జగ్గయ్యపేట మున్సిపాలిటీలో 53 వేల జనాభాకు 70 ఎంఎల్డీ నీరు అవసరం కాగా 30 ఎంఎల్డీకి మించి విడుదల కావడం లేదు. జగ్గయ్యపేటకు పాలేరు రిజర్వాయర్ నుంచి నీరు విడుదలవుతోంది. అది ఎండిపోవడంతో ట్యాంకర్ల ద్వారా బోర్ల నుంచి నీటిని తెచ్చి సరఫరా చేస్తున్నారు. దీంతో రెండు రోజులకు ఒకసారి మాత్రమే గంటసేపు నీరు విడుదలవుతోంది. నందిగామ మున్సిపాలిటీలో 50 వేల జనాభా అవసరాలకు అనుగుణంగా మునేరు, కృష్ణానదితోపాటు మూడు పథకాల ద్వారా నీరందుతోంది. 80 శాతం కుళాయిలకు హెడ్స్ లేకపోవడం, లీకేజీల వల్ల నీరు ఎక్కువ వృథాగా పోతోంది. ఫలితంగా వారంలో ఒక్కసారే నీరు అందుతోంది.తిరువూరుకు శాశ్వత మంచినీటి వ్యవస్థ లేకపోవడంతో మూడు రోజులకు ఒకసారే మంచి నీరు అందుతోంది.నూజివీడు, గుడివాడ పట్టణాల్లో తాగునీటి ఇబ్బంది కొంత ఉన్నా మున్సిపాలిటీలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం వల్ల సమస్య పెద్దగా లేదు. విజయవాడలో నీరు వృథా విజయవాడ నగరంలో నిత్యం సరఫరా అయ్యే మంచినీరులో 30 శాతం పైప్‌లైన్ లీకుల వల్ల మురుగుకాల్వల పాలవుతోంది. ఎన్నో ఏళ్లుగా ఇలా జరుగుతున్నా పాలకులకు మాత్రం కనువిప్పు కలగడం లేదు. నగర జనాభా 11.48 లక్షల మంది. వారి అవసరాలకు అనుగుణంగా రోజుకు 1.50 మిలియన్ గ్యాలన్ల నీరు కావాల్సి ఉండగా నగరపాలక సంస్థ 1.65 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. వృథా అయ్యే 30 శాతం నీరు వల్ల 1.10 మిలియన్ గ్యాలన్ల కంటే ఎక్కువ నీరు ఇళ్లకు చేరకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పైప్‌లైన్ పాతది కావడం వల్ల నీటి లీకేజీలు అధికంగా ఉన్నాయి. తూర్పు నియోజకవర్గంలోని పటమట, కరెన్సీనగర్, ఎన్టీఆర్ కాలనీ తదితర ప్రాంతాల్లో మురుగునీరు అధికంగా కలుస్తోంది. నగరానికి వచ్చే నీటిలో 22 శాతం బోర్ల ద్వారా, మిగిలిన నీరు కృష్ణానది ద్వారా సరఫరా అవుతోంది. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న వాటర్ రిజర్వాయర్లకు నీరు సరిగా ఎక్కకపోవటంతో హైస్పీడ్ మోటార్లు ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేశారు. అవి వచ్చేసరికి వేసవి పూర్తయ్యే అవకాశం ఉంది. రామలింగేశ్వరనగర్లో ఉన్న ప్లాంట్ ద్వారా మురుగునీరు అధికంగా వస్తోంది. నగర మేయర్ మంచినీటి సమస్య రాకుండా నిధులు మంజూరు చేస్తామని ప్రకటిస్తున్నారే కాని ఆచరణలో పూర్తిస్థాయిలో కనిపించకపోవడంతో నగరంలోనూ రానున్న రోజుల్లో నీటిఎద్దడి పెరిగే అవకాశం ఉంది. -
ప్రణాళికాబద్ధంగా నగర అభివృద్ధి
♦ సిద్ధంగా ప్రణాళికలు ♦ పాలనలో ప్రజల భాగస్వామ్యం పెంచుతాం ♦ అవినీతికి అడ్డుకట్ట వేస్తాం ♦ కార్పొరేటర్లు వెంటనే కార్యరంగంలోకి దిగాలి ♦ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తా ♦ ‘సాక్షి’తో మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయనున్నామని, దీనికి తగిన ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలకు ఈ అయిదేళ్లలో కంటికి కని పించేలా అభివృద్ధిని చేసి చూపెడతామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచార సారథ్య బాధ్యతలను మంత్రి కేటీఆర్ నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా తన వద్ద ఉన్న మున్సిపల్ శాఖ బాధ్యతలను కేటీఆర్‌కు అప్పజెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ గత నెల 30న జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభావేదికపై ప్రకటించిన నేపథ్యంలో నేడో, రేపో మంత్రి కేటీఆర్‌కు మున్సిపల్ శాఖ బాధ్యతలను అప్పజెప్పే అవకాశం ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెబుతున్న మంత్రి కేటీఆర్ శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ ప్రణాళికలను గురించి వివరించారు. ప్రజల భాగస్వామ్యంతో ముందుకు.. హైదరాబాద్‌కు సంబంధించి ప్రత్యేకంగా కొన్ని సమస్యలున్నాయని, డబుల్‌బెడ్ రూం ఇళ్లకు కావాల్సిన స్థలాలు లేకపోవడం, పార్కుల కొరత, పుట్ పాత్ల లేమి వంటి వాటిపై దృష్టిపెడతామని కేటీఆర్ అన్నారు. వాస్తవానికి ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాదని, దీనికోసం పురపాలనలో పౌరుల భాగస్వామ్యం పెంచడంపై దృష్టిపెడతామని చెప్పారు. ఇందులో భాగంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ మాదిరిగానే నైబ ర్ హుడ్ కమిటీలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. కార్పొరేషన్లో పనిచేసే వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించాల్సి ఉందన్నారు. పబ్లిక్ హెల్త్, ఆర్అండ్బీ, ట్రాన్స్‌కో, జెన్కో, హెచ్ఎండబ్ల్యూఎస్, ఇంజనీరింగ్ విభాగాలతో జాయింట్ వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు చేసి, వీటిల్లో కార్పొరేటర్లను భాగస్వాములుగా చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. టెక్నాలజీతో అవినీతి ప్రక్షాళన: కార్పొరేటర్లలో జవాబుదారీ తనం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రజల ప్రాధాన్యమే వారి ప్రాధాన్యం ఆయ్యేలా మార్పులు తెస్తామని కేటీఆర్ అన్నారు. అవినీతి చీడ వదిలించేందుకు టెక్నాలజీని వాడుకుంటామని, దీనిపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఎవరి చేయి తడపాల్సిన పనిలేకుండా పనులు కావాలని, జీహెచ్ఎంసీలో పైసా ఇవ్వకుండా సామాన్యుడికి పనులు జరిగేలా చూస్తామని చెప్పారు. ఈ మార్పులు సమూలంగా జరిగితే పాలనలో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో ప్రజలకు మౌలిక సౌకర్యాలు తక్కువగా ఉన్నాయని, చివరకు పెద్ద రోడ్లలో కూడా ఫుట్ పాత్‌లు లేవని అన్నా రు. ట్రాఫిక్ రద్దీతో రోడ్లు దాటేవారు ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు హైదరాబాద్‌లో అవసరమైన చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని మురికి వాడలను అభివృద్ధి చేస్తామని, అక్కడి ప్రజలకు వారి ప్రాంతాల్లోనే ఇళ్లు నిర్మించి ఇస్తామని అన్నారు. అయిదేళ్లలో చేసి చూపిస్తాం.. నగరంలో కార్పొరేటర్లుగా గెలిచిన వారంతా వెంటనే కార్యరంగంలోకి దిగాలని మంత్రి కేటీఆర్ కోరారు. తనకు పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని పేర్కొన్నారు. ‘గతంలో నగరాన్ని ఏలిన పార్టీలు యాభై ఏళ్లలో చేయలేని పనిని అయిదేళ్లలో చేస్తామని చెప్పాం. ఆ హామీని నిజం చేసేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతాం’ అని కేటీఆర్ వివరించారు. -
ఫైబర్ ఆప్టిక్ పథకానికి సహకారం
► దావోస్‌లో సీఎంకు సిస్కో హామీ ► దావోస్ నుంచి సింగ్‌పూర్‌కు వెళ్లిన చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక సదస్సు చివరిరోజున దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. సిస్కో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాన్ చాంబర్స్ సీఎం చంద్రబాబుతో సమావేశమైనపుడు రాష్ర్ట ప్రభుత్వం ఇంటింటికీ ఫైబర్ ఆప్టిక్ సదుపాయం కల్పించే పథకానికి సహకారం అందిస్తామని చెప్పారని రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇక కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీతో సీఎం భేటీ అయినపుడు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఈసారి ఏపీ కేంద్ర బిందువైందని చెప్పారు. భారత దేశం అంటే ఏపీ అన్నట్లు ఉందని ప్రశంసించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి ప్రైవేటు రంగంతో పాటు ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి నిధుల సేకరణకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న మెకన్సీ గ్లోబల్ కంపెనీ సీఈవో డొమినిక్ బార్టన్తో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇండోరమ సింథటిక్ కంపెనీ సీఈవో శ్రీ ప్రకాష్ లోహియా.. సీఎంకు చెప్పారు. సంస్థ ఏర్పాటుపై అధ్యయనానికి మార్చిలో బృందాన్ని పంపనున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య పరికరాల ఉత్పత్తి సంస్థ మెడ్ ట్రానిక్ సీఈవో మైఖెల్ కోయిల్‌తో చంద్రబాబు భేటీ అయిన సందర్భంగా.. పేదలకు గుండె జబ్బుల వైద్యం అందుబాటులోకి తేవాలని కోరారు. సన్‌గ్రూప్ చైర్మన్ శివ్ఖేమ్కా, ఫోర్టిస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల చైర్మన్ మల్వీందర్ సింగ్, సేల్స్ ఫోర్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ కుంద్రా, జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (జైకా) అధ్యక్షుడు షిన్షి కిటావొకాలతో కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా దావోస్ పర్యటన ముగించుకుని చంద్రబాబు సింగపూర్ వెళ్లారు. అక్కడ ఆయన రాజధాని నిర్మాణం తదితర అంశాలపై ఆ దేశ మంత్రి ఈశ్వరన్ తదితరులతో చర్చించనున్నారు. -
సరికొత్త సంప్రదాయానికి తెరలేపుతున్న టీసర్కార్
-
అధికార యంత్రాంగం ప్రక్షాళన !
-
బడికి తీసుకొద్దాం..
గిరిజన విద్యార్థుల డ్రాపవుట్ల నిరోధానికి చర్యలు ‘సాక్షి’ కథనంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన విద్యార్థులు మధ్యలోనే బడి మానేయడం (డ్రాపవుట్), అసలు బడికే వెళ్లకపోతుండడంపై ‘బడికి దూరం.. బతుకు భారం’ శీర్షికన సాక్షి శనివారం ప్రచురించిన కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గిరిజన విద్యార్థుల డ్రాపవుట్లను తగ్గించేందుకు వెంటనే కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని అధికారులను సోమవారం ఆదేశించింది. దీంతోపాటు అసలు బడికే వెళ్లని వారి సంఖ్య (అవుట్ ఆఫ్ స్కూల్స్) కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో... దానిపైనా దృష్టిసారించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించింది. దీంతోపాటు డ్రాపవుట్స్, అవుట్ ఆఫ్ స్కూల్ పిల్లల అంశంలో ప్రత్యక్ష పర్యవేక్షణకు హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ కమిషనర్ కార్యాలయంలో, జిల్లా శాఖల కార్యాలయాల్లో ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు. 2014-15లో డ్రాపవుట్స్‌కు సంబంధించి మండలాల వారీగా వివరాలను రాజీవ్ విద్యామిషన్ (సర్వశిక్షా అభియాన్) ప్రాజెక్టు అధికారుల ద్వారా ఈ నెల 20వ తేదీలోగా తెప్పించుకోవాలని, 30వ తేదీలోగా డ్రాపవుట్ పిల్లలను గుర్తించాలని డిప్యూటీ డెరైక్టర్లు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులను గిరిజన సంక్షేమ శాఖ ఆదేశించింది. డ్రాపవుట్ల సంఖ్య ఎక్కువగా ఉన్న మండలాలకు దగ్గరగా ఉన్న ఆశ్రమ పాఠశాలలు, కసూర్భాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), మినీ గురుకులాలను గుర్తించి మే 10వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు శిక్షణాకేంద్రాలను నిర్వహించాలని నిర్దేశించింది. ఎస్సీఈఆర్టీ, బ్రిడ్జికోర్సు నమూనాను తీసుకుని.. డ్రాపవుట్లకు ప్రాథమిక, ఉన్నత స్థాయిలో విడివిడిగా శిక్షణ ఇవ్వాలని సూచించింది. -
అధికారమే లక్ష్యంగా రోడ్‌మ్యాప్
టీ బీజేపీ నేతలకు అమిత్ షా ఉద్బోధ న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చేలా 2018 నాటికి మార్గదర్శక ప్రణాళిక (రోడ్ మ్యాప్) సిద్ధం చేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణ బీజేపీ నేతలకు సూచించారు. తెలంగాణలో పార్టీ బలోపేతంతోపాటు రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని కోరారు. ప్రజా సమస్యలపై పోరుబా ట పట్టాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో బీజేపీ సాధిం చిన ఫలితాలను అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో ముందుకు కదలాలని సూచించారు. ఆదివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావులతో కలసి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఫ్లోర్‌లీడర్ లక్ష్మణ్, నేతలు శ్రీనివాసరావు, రాంచందర్‌రావు తదితరులు అమిత్‌షాతో సమావేశమయ్యారు. సభ్యత్వ నమోదు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలు, రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి చేపట్టిన చర్యలను వివరించారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల కార్యాచరణను తెలియచేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ రాంచందర్‌రావును అమిత్‌షా అభినందించారు. ఈ భేటీ అనంతరం దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు విలేకరులతో మాట్లాడుతూ ‘‘చేతివృత్తులు, బలహీనవర్గాలవారిని పార్టీలో చేర్పించే కార్యక్రమం నిర్వహించాలని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజ లకు వివరించాలని అమిత్‌షా సూచించారు’’ అని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ, ఇతర పార్టీలతో పొత్తులపై చర్చలు జరగలేదని ఒక ప్రశ్నకు కిషన్‌రెడ్డి బదులిచ్చారు. ఎన్డీయేలోకి టీఆర్ఎస్ చేరుతుందనే విషయమై అడ గ్గా.. ఆ పార్టీతో సయోధ్య విషయంలో రాష్ట్ర, జాతీయ స్థాయి లో ఎక్కడ చర్చ జరగలేదని బదులిచ్చారు. -
పదికి పదిలమే
ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి నూతన సిలబస్‌పై అవగాహన పెంచుకోవాలి అప్పుడే పదికి పది పాయింట్లు సాధ్యం మరి కొద్ది రోజుల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో సుమారు 50 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త సిలబస్ అందునా సీసీఈ మోడల్ పరీక్ష విధానం మొదటి సారిగా అమలు చేయనున్నారు. దీంతో విద్యార్థులో కాస్త భయం, ఎలా ప్రిపేరవ్వాలా అన్న ప్రశ్న వేధిస్తున్నాయి. సరైన ప్రణాళి కతో చదువుకుంటే అన్ని సబ్జెక్టుల్లోనూ పది పాయింట్లు సాధించొచ్చని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. - లబ్బీపేట తెలుగులో మార్కులు సులువే ► ప్రశ్న పత్రాన్ని క్షుణ్ణంగా చదివి, ప్రశ్నలను అర్థం చేసుకోవాలి. ►ప్రతిపదార్థాలు చదివేటప్పుడు నక్షత్రం గుర్తుగల పద్యాలను ఎక్కువగా చదవాలి. ► పద్య పూరణలు చేసేటప్పుడు ప్రాస అక్షరాలను సరిచూసుకోవాలి. ► అపరిచిత పద్యగద్యాలను చదవి అర్థం చేసుకుంటే మార్కులు ఎక్కువ పొందొచ్చు. ►వ్యాస రూప ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు సామెతలు గానీ, జాతీయాలు గానీ వాడితే ఎక్కువ మార్కులు వస్తాయి. ►ఉపవాచకంలో సంఘటనలను వరుసక్రమంలో రాసేందుకు క్షుణ్ణంగా ఉపవాచక పఠనం చేయాలి. ► ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టే పార్ట్-బీ విషయంలో తగిన శ్రద్ధ వహించాలి ►వాక్యాలు, వానిలోని రకాలు అన్నింటిలోను ప్రాక్టీసు చేయాలి. ► సంస్కృతం చదివేటప్పుడు, రాసేటప్పుడు సారాంశాలను క్షుణ్ణంగా చదవాలి. ► శబ్దధాతువులను ఎక్కువుగా సాధన చేయాలి. హిందీపై ఆందోళన అనవసరం ► హిందీలో పది పాయింట్లు సాధించడానికి పాఠ్యాంశాలపై పూర్తి అవగాహన ఉండేలా సాధన చేయాలి. పాఠ్యపుస్తకాలను చదవాల్సిన అవసరం చాలా ఉంది. అప్పుడే పూర్తిసామర్థ్యంతో సారాంశం రాయగలుగుతారు. ► వ్యాకరణంలో కూడా 25 కి 25 మార్కులు సాధించే అవకాశం ఉంది. పాఠ్యపుస్తకంలోని భాషను ఉపయోగించి ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఏ విధంగా ప్రశ్నను అడిగినా సమాధానం రాయగలిగేలా సాధాన చేయాలి. ►ప్రతి వాక్యాన్ని అర్థవంతంగా రాయాలి. ప్రతి ప్రశ్నకూ కవిని పరిచయం చేస్తూ సమాధానం రాయాలి. దీని వల్ల పూర్తి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ►పరీక్ష రాసేటప్పుడు సమయపాలన చాలా అవసరం. ప్రశ్నకు కేటాయించిన మార్కులకు అనుగుణంగా మన సమాధానం ఉండాలి. ► లేఖ రాసేటప్పుడు ఒక్క పేజీలోనే ఉండేలా జాగ్రత్తలు పాటించాలి. ► వ్యాసం రాసేటప్పుడు ముఖ్యాంశాలను పరిచయం చేస్తూ, సైడ్ హెడ్డింగ్ రాస్తూ పేరాలుగా విభజించాలి. ► పాఠ్యపుస్తకంలోని ప్రతిపాఠం వెనుక ఇచ్చిన వ్యాకరణాన్ని తప్పకుండా చదివి సాధన చేయాలి. ఇంగ్లిషులో మార్కులు ఎంతో ఈజీ ► మొదట ఇచ్చిన పశ్న పత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి ► సమాధానాలను వరుసక్రమంలో రాయాలి. ►ఇంగ్లిష్‌లో ప్రశ్నలకు మూడు విధాలుగా మార్కులు కేటాయిస్తారు. ఒక మార్క్, రెండు మార్కులు, పది మార్కులు విభాగాలు ఉంటాయి. ► రెండు మార్కుల విభాగంలో రెండుకు రెండు మార్కులు వచ్చే విధంగా పది వ్యాక్యాలకు తగ్గకుండా సమాధానాలు రాయాలి. ► ఒక మార్కు ప్రశ్నలకు 3, 4 వాక్యాలకు తగ్గకుండా సమాధానం రాయాలి. ముఖ్యమైన వాక్యాలను అండర్లైన్ చేయాలి. ► టెక్ట్స్‌బుక్ ఒకేబులరీని తప్పనిసరిగా వాడాలి. వ్యాక్యాలు సమాధానానికి సంబంధించినవిగా ఉండాలి. ► పేపర్-2లో ఉండే పది మార్కుల ప్రశ్నలకు రైటింగ్ స్కిల్స్ అండ్ లెటర్ రైటింగ్ రెండు పేజీలకు తగ్గకుండా టాఫిక్‌కు సంబంధించిన పదాలను వాడుతూ సమాధానాలను రాయాలి. ► లెటర్ రైటింగ్‌లో ఫార్మెట్‌ను ఫన్క్చ్యుయేషన్ సహా పాటించాలి. మంచి పదాలను ప్రయోగించాలి. గణితమంటే భయమొద్దు ► గణితంపై భయం వీడాలి. భావనలు, పద్ధతులను ఉపయోగించి లెక్కల సాధన రోజూ చేయాలి. ► సూత్రాలను బాగా చదివి అర్థం చేసుకోవాలి. ఉదాహరణ సమస్యలను అవగాహన చేసుకోవాలి. ► సమస్యలో ఉన్న గణిత భావనలను అవగాహన చేసుకుని లెక్క చేసే పద్ధతిని తెలుసుకోవాలి. ► వాస్తవ సంఖ్యలు, త్రికోణమితి, ప్రోగ్రేషన్స్, ప్రాబబులిటీ, కో ఆర్డినెట్ జామెట్రీ, మెన్సురేషన్, సంఖ్యాకశాస్త్ర అంశాలపై దృష్టి సారించాలి. ► లెక్కల సాధనకు అన్ని సూత్రాలను నేర్చుకోవాలి. ► పార్ట్-బీ కోసం ఎక్కువ బిట్స్‌ను సాధన చేయాలి. వీలైనన్ని నమూనా ప్రశ్నా పత్రాలు సాధన చేయాలి. ► ఒక్క మార్కు ప్రశ్నల కోసం అన్ని అధ్యాయాలందు ఉన్న నిర్వచనాలు, ఫజిల్స్, పదసమస్యలు, పట సమస్యలను సాధన చేయాలి. సాంఘికశాస్త్రంలో బిట్లు, మ్యాపులు కీలకం ► ప్రస్తుత సిలబస్‌ని అనుసరించి ప్రతి విద్యార్థి పాఠ్య పుస్తకంపై పూర్తి అవగాహన పొందాలి. ► సాంఘికశాస్త్రంలో పది పాయింట్లు రావడానికి ముఖ్యమైన అంశంగా బిట్స్ మ్యాప్ పాయింటింగ్‌పై పూర్తి అవగాహన ఉండాలి. ► ప్రశ్నాపత్రంలో వచ్చిన మార్పులను విద్యార్థి అవగాహన చేసుకుంటే మంచి మార్కులు పొందవచ్చు. ► ఇచ్చిన ప్రశ్నను అర్థం చేసుకుని పూర్తి అవగాహనతో ఏ విధంగా ప్రశ్న అడిగినప్పటికీ సరైన సమాధానం రాసేలా సాధన చేసి సిద్ధంగా ఉండాలి. ► పాఠ్యపుస్తకంలో ఇచ్చిన ప్రశ్నలను తప్పనిసరిగా నేర్చుకుని వాటిపై పట్టు సాధించాలి. ► ఆయా పాఠ్యాంశాలు, ప్రశ్నలకు సంబంధించిన కాలం(సంవత్సరాలు), వ్యక్తుల పేర్లపై పూర్తి అవగాహన పొందాలి. ► పాఠ్య పుస్తకంలో ఇచ్చిన బార్ గ్రాఫులను, వెన్, డయాగ్రామ్స్, టైమ్ లైన్ చార్ట్స్‌ను అర్థం చేసుకుని రాయగలిగితే పూర్తి మార్కులు సాధించే అవకాశం ఉంది. ఫిజికల్ సైన్స్.. పాఠ్యపుస్తకాలను చదవాలి ► విషయ పరిజ్ఞానం కోసం పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి. ► అకడమిక్ స్టాండర్డ్స్ మార్కుల వెయిటేజీ గురించి అవగాహన ఉండాలి. ► కెమిస్ట్రీలో ఉన్న ఈక్వేషన్స్‌ను బాలెన్స్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. ►పాఠ్యపుస్తకంలోని బొమ్మలు, వాటి భాగాలను సరైన విధంగా గుర్తించేటట్లుగా సాధన చేయాలి, భాగాల విధులను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ►పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలకు, బిట్స్‌కు ప్రధాన్యత ఇవ్వాలి. సమ్స్(సాల్వ్డ్, అన్సాల్వ్డ్)ను సాధన చేయాలి. ►డు యు నో దిస్, ట్రై దిస్, అడిషనల్ ఇన్షర్మేషన్, థింక్ అండ్ డిస్కస్, బిల్డ్ అప్ క్వశ్చన్స్, ఇన్ఫర్మాటిక్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, ఇన్టెక్ట్స్ క్వశ్చన్స్ వంటి వాటిని హైయర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్(హాట్స్)గా అడగవచ్చు. ►కేటాయించిన మార్కులను బట్టి సమాధానాలు హెచ్చుతగ్గులు లేకుండా రాయాలి. ముఖ్యమైన పదాలను అండర్లైన్ చేయాలి. ► ప్రతి లెసన్‌కు మైండ్ మ్యాపింగ్ ఫార్మెట్‌ను తయారు చేసుకుని దానిని సాధన చేయాలి. నేచురల్ సైన్స్‌లో.. విశ్లేషించి జవాబులు రాయాలి ► పాఠ్యపుస్తకాలను అనుసరించి విషయ పరిజ్ఞానం పొందడంతో పాటు, దానిలోని అన్ని ప్రశ్నలను అధ్యయనం చేయాలి. ప్రశ్నలన్నింటినీ విశ్లేషించి సమాధానాలు రాయాలి. ►రాసిన సమాధానాలను పుస్తక పరిభాషను అనుసరించేలా చూసుకోవాలి. ముఖ్యంగా చిత్రాలు గీసేటప్పుడు చెక్కినట్లుగా అర్థవంతంగా గీయాలి. అన్ని భాగాలను సరిగా గుర్తించాలి. ►దైనందిన జీవితంలో జరిగే విషయాల గురించి అవగాహన ఉన్నచో సమాధానాలు సులువుగా రాయగలుగుతారు. ► అన్నింటికంటే మంచి ఆరోగ్యం, {పశాంతమైన మనస్సు ఎంతో అవసరం సరిగా ప్రజెంట్ చేయడం ముఖ్యం మనం ఎంతకష్టపడి చదవినా దానిని సరిగా ప్రజెంట్ చేయలేకపోతే అనుకున్న ఫలితాలు రావు. అందమైన చేతిరాత, మార్జిన్లు కొట్టడం, కొట్టివేతలు లేకుండా జాగ్రత్త పాటించడం ముఖ్యం. పేజీకి 18 నుంచి 20 వాక్యాలు ఉండేలా రాయాలి. సైడ్ హెడ్డింగ్స్‌కు తప్పనిసరిగా అండర్లైన్ చేయాలి. బ్లూ, బ్లాక్ పెన్ను మాత్రమే ఉపయోగించాలి. స్కెచెస్, షేడ్పెన్స్ వాడకూడదు. పరీక్ష సమయానికి అర్ధగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరాలి. పరీక్ష రాసేటప్పుడు పూర్తి ఏకాగ్రత, సమయపాలన పాటించాలి. ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే పదిలో పదికి పది పాయింట్లు తేలిగ్గా సాధించవచ్చు. - మురళీకృష్ణ, ఏజీఎం, శ్రీ చైతన్య స్కూల్స్ ఒత్తిడిని దూరంచేయాలి పదో తరగతి విద్యార్థులు తొలిసారిగా కామన్ పరీక్షలు రాస్తున్నారు. అందునా ఈ ఏడాది కొత్త సిలబస్ ఎలా ఉంటుందోనని ఆందోళన సహజం. అయితే ఎటువంటి ప్రశ్నలు ఇచ్చినా కచ్చితంగా సమాధానం రాయగలమనే సానుకూల దృక్పథంతో పరీక్ష హాలులోకి వెళ్లాలి. ఎటువంటి ఒత్తిడికి తావివ్వకూడదు. తీవ్రమైన ఒత్తిడికి గురైతే చదివిన ప్రశ్నలు కూడా సమాధానం రాయలేని స్థితి ఎదురవుతుంది. ఈ విషయంలో ముందుగానే ఎలా ప్రశ్నలు సమాధానాలు రాయాలి. మంచి మార్కులు పొందడం ఎలా అనే అంశంపై కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. నగరంలో విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోతున్న నేపథ్యంతో పరీక్షకు ముందుగానే ఇంటి నుంచి బయలుదేరాలి. ఒకేవేళ్ల ట్రాఫిక్‌లో చిక్కుకుని పరీక్షకు ఆలస్యంగా వెళ్తే ఆ ఒత్తిడిలో సరైన సమాధానాలు రాయలేరు. అందుకే కేర్‌ఫుల్‌గా ఉంటే మంచి మార్కులు పొందవచ్చు. - డాక్టర్ టి.ఎస్.రావు, సైకాలజిస్ట్ -
బడ్జెట్ కసరత్తు షురూ..!
నేటి నుంచి మంత్రులతో ఆర్థికశాఖ భేటీలు అధికారులతో సమావేశమైన ఆర్థిక మంత్రి ఈటెల 2015-16 బడ్జెట్‌కు ప్రతిపాదనలపై సమీక్ష గత బడ్జెట్ అంచనాలు, ఆదాయ వ్యయాలపై చర్చ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ముందుగా ముసాయిదా బడ్జెట్ తయారీకి ఆర్థిక శాఖ సన్నద్ధమైంది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం నుం చి దాదాపు వారం రోజుల పాటు అన్ని శాఖల మంత్రులతో చర్చలు జరపనున్నారు. ఏయే పథకాలకు ప్రాధాన్యమివ్వాలి, ఏయే రంగాలకు ఎంత మేరకు నిధులు కేటాయించాలనే అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా ఆదాయం పెంచుకునే మార్గాలపై సమాలోచనలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మంత్రి ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2015-16 సంవత్సరపు బడ్జెట్ మొత్తం ఎంత ఉండాలి, ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు ఎలా ఉండాలనే దానిపై చర్చించారు. అన్ని విభాగాల నుంచి ఇప్పటికే అందిన ప్రతిపాదనలను మంత్రి పరిశీలించారు. తొలి ఏడాది నిధులు ఖర్చు చేయని శాఖలకు ఈసారి కేటాయిం పులు తగ్గించాలని.. అప్రాధాన్య పద్దులకు కోత వేసి, అదే విభాగంలో ప్రాధాన్యత ఉన్న అంశాలకు నిధులు కేటాయించాలని అధికారులకు మంత్రి సూచించారు. ఆదాయ వనరులు పరిమితంగా ఉన్నందున బడ్జెట్ కేటాయిం పుల్లో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. గతం కంటే ఎక్కువ.. నాలుగు నెలల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,00,637 కోట్ల తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అది కేవలం పది నెలల బడ్జెట్ కావటంతో... 2015-16 పూర్తిస్థాయి బడ్జెట్ అంతకంటే ఎక్కువగా ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక ఈసారి భారీ బడ్జెట్ ప్రవేశపెడతామని ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు కూడా. అయితే గత బడ్జెట్ అంచనాలన్నీ తలకిందులవటం.. నెలనెలా వచ్చిన ఆదాయం ప్రణాళికేతర ఖర్చులకే సరిపోవటంతో నిధుల లేమితో సర్కారు కొట్టుమిట్టాడింది. దీంతో వచ్చే బడ్జెట్ తయారీలో గొప్పలకు పోవద్దని ఆర్థిక శాఖ నిపుణులు సూచించిన నేపథ్యంలో మంత్రులతో జరిగే సమావేశాలు కీలకంగా మారనున్నాయి. -
అదనంగా నిధులు అవసరమా?
అయితే సప్లిమెంటరీ ప్రతిపాదనలు పంపండి అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ఆదేశం సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ కేటాయింపుల కన్నా అదనపు నిధులు అవసరమైన పక్షంలో, అలాగే బడ్జెట్ కేటాయింపులకంటే ఎక్కువ నిధులను ఇప్పటికే వ్యయం చేసినట్లయితే అందుకు సంబంధించిన ప్రణాళిక, ప్రణాళికేతర పద్దు కింద సప్లిమెంటరీ ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా పూర్తి వివరణతో వాటిని పంపించాలని అన్ని శాఖలను కోరింది. ఇందులో రెవెన్యూ వ్యయానికా లేదా ఆస్తుల కల్పన వ్యయానికా లేదా అప్పులు తీర్చడానికా అనేది స్పష్టం చేయాలని తెలిపింది. అంతేగాక సంబంధిత ముఖ్య కంట్రోలింగ్ అధికారి ఆ శాఖలో ఆ పద్దు కింద నిధులు లేవని సర్టిఫికెట్ చేయాలంది. ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం మంజూరు చేసిన పక్షంలో అదనపు నిధులు అవసరమైనా లేదా బడ్జెట్లో కేటాయింపులు చాలకున్నా సప్లిమెంటరీ ప్రతిపాదనలు పంపాలని స్పష్టం చేసింది.బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి సవరించిన అంచనాలను ఆయా శాఖలకు పంపిన విషయాన్ని తెలియజేస్తూ.. వాటిని మించకుండా సప్లిమెంటరీ ఉండాలని, ఒకవేళ సవరించిన అంచనాల అనంతరం ప్రభుత్వం ఏదైనా పథకాన్ని మంజూరు చేసినట్లేతే ఆ విషయాన్ని స్పష్టంగా చేయాలని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. హోం, రహదారులు-భవనాలు, సాధారణ పరిపాలన, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, మున్సిపల్, సాగునీటి, అటవీ శాఖలు కంటింజెన్సీ నిధి నుంచి అడ్వాన్స్‌గా రూ.10.93 కోట్లు తీసుకున్నాయని, వాటికి సప్లిమెంటరీ పంపాలంది. ప్రణాళికేతర పద్దుకు మార్చండి ప్రణాళిక పద్దు నుంచి ప్రణాళికేతర పద్దుకు మార్చిన నిధులను ఆయా శాఖలు అందుకు అనుగుణంగా సంబంధిత హెడ్స్‌లో మార్పులు చేయాలని ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
స్వప్నాల దారిలో...
అది ఒక మహా స్వప్నం. వైవిధ్యభరితం.... భిన్న సంసృతుల సమ్మిళితమైన చారిత్రక భాగ్యనగరిని ప్రపంచ మహా నగరాల సరసన నిలబెట్టే మహత్తర యత్నం. అదే నిలువెత్తు ఒంటి స్తంభం పట్టాలపై పరుగులు తీసే నీలి అంచుల తెల్లటి అందమైన మెట్రో రైలు. ఈ కలల సాకార యత్నంలో ఎన్నో ఒడిదుడుకులు. మరెన్నో ఆటంకాలు. ఆ ప్రతిబంధకాలనే నిచ్చెనమెట్లుగా మలుచుకొని...‘మెట్రో’ను పట్టాలెక్కించేందుకు ఆయన భగీరథ ప్రయత్నం సాగిస్తున్నారు. ఆయనే హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డెరైక్టర్... ఎన్వీఎస్ రెడ్డిగా అందరికీ తెలిసిన నల్లమిల్లి వెంకట సత్యనారాయణరెడ్డి. ‘ఆధునిక సాంకేతిక ఫలాలు సామాన్యుడి చెంతకు చేరాలనే దే నా లక్ష్యం. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని వర్గాలకు అందుబాటులో మెట్రో రైలు ప్రయాణం ఉండాలనేది సంకల్పం. అప్పటి ప్రణాళికా సంఘ సభ్యుడు గజేంద్ర హల్దియాతో కలిసి ప్రాజెక్టు రూపురేఖలు, విధి విధానాల రూపకల్పనలో పాలు పంచుకోవడంతో నా సంకల్ప యాత్ర మొదలైందని చెప్పవచ్చు’ అంటారాయన. శనివారం మార్నింగ్ వాక్‌లో తన అంతరంగాన్ని, జీవన ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... - సాక్షి, సిటీబ్యూరో కొత్తగా ఆలోచిస్తేనే... ఎనిమిదోతరగతిలో ఇంగ్లీష్ రాకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాను. దాంతో నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ను తెలుగులోనే చదివా. ఇంటర్ వరకు ఇంగ్లీష్ బాధలు తప్పలేదు. డిగ్రీలో మా లెక్చరర్ వై.వెంకట్రామయ్య ఆంగ్లంలో ప్రావీణ్యున్ని చేశారు. మరో లెక్చరర్ డాక్టర్ రుద్రయ్య చౌదరి గొప్ప మేథావి. ఆ ఇద్దరి నుంచి విశాల దక్పథం అలవర్చుకున్నాను. జేఎన్‌యూలో రషీదుద్దీన్ఖాన్ అనే ప్రొఫెసర్ చక్కటి మార్గనిర్దేశం చేశారు. ఓపెన్ మైండ్‌తో ఉండడం, ఓటమికి వెరవకపోవడం నేను నమ్మిన ఫిలాసఫీ. తార్కిక దక్పథంతో ఆలోచించాలి. కొత్త విషయాలను నేర్చుకోవడం అలవాటు చేసుకుంటే వరుస విజయాలు సాధించవచ్చని నమ్మాను. ఆ నమ్మకమే నన్ను విజయం వైపు నడిపించింది. ప్రతి నిత్యం కొత్తగా ఆలోచించడం నేర్చుకుంటేనే ఏ రంగంలోనైనా విజయ శిఖరాలు అధిరోహించవచ్చన్న సూత్రాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతాను.‘ డీస్కూలింగ్ సొసైటీ ’ అన్న పుస్తకం నా ఆలోచనలను బాగా ప్రభావితం చేసింది. చేదు జ్ఞాపకం... 2008లో సత్యం కుంభకోణం వెలుగు చూసినపుడు మెట్రో పనులు దక్కించుకున్న మైటాస్ సంస్థ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మెట్రో ప్రాజెక్టుపై నీలినీడలు క మ్ముకున్నాయి. మా టీం కూడా డీలాపడింది. నన్ను ఈ బాధ్యతల నుంచి తొలగించాలని అప్పటి ప్రభుత్వంపై ఇంటా బయటా ఒత్తిడి అధికమైంది. కానీ నేను ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఆ సమయంలోనే నాకు కొన్ని బహుళజాతి సంస్థల నుంచి మంచి అవకాశాలు వచ్చాయి. ఏడాదికి రూ.కోటికి పైగా జీతం ఇస్తామన్నారు. కానీ నేను అంగీకరించలేదు. ఎంతో శ్రమించి సాధించిన మెట్రో ప్రాజెక్టును మధ్యలో వదిలేయడం ఏ మాత్రం ఇష్టం లేదు. పైగా జట్టు సభ్యులు నాపై నమ్మకంతోనే ఈ ప్రాజెక్టులో పని చేసేందుకు ముందుకొచ్చారు. తిరిగి 2010లో ఎల్అండ్టీ సంస్థ మెట్రో పనులు దక్కించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నాం. జీవితంలో ప్రతి దశలోనూ గెలుపోటములను సమంగా భావించాను. జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్‌గా పని చేస్తున్నపుడు పంజగుట్ట ఫ్లైఓవర్ కూలిపోయింది. నన్ను తొలగించాలని ప్రభుత్వం పైన ఒత్తిడి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ నిపుణులైన ఇంజినీర్ల బృందంతో వాస్తవాలను వెలికి తీయించారు. నా తప్పు లేదని తేలింది. రైతు కుటుంబం... తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు మా సొంతూరు. నాన్న సత్యనారాయణరెడ్డి. అమ్మ ఆదిలక్ష్మి. మాది రైతు కుటుంబం. మొదటి నుంచీ నాన్న గ్రామ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆ రాజకీయాల్లో పడిపోయి చాలా ఆస్తులు పోగొట్టుకున్నారు. అమ్మ ఎక్కువగా చదువుకోకపోయినా లోక జ్ఞానం తెలిసిన మనిషి. జీవిత పాఠాలు అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. ఆమె నేర్పిన పాఠాలు... సమాజంలో మసలుకోవలసిన తీరు... మార్గదర్శకాలు ఇప్పటికీ నన్ను ముందుకు నడిపిస్తూనే ఉంటాయి. ఎలా జీవించాలో అమ్మ చెబితే... విధులు, బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో మా తాత నుంచి నేర్చుకున్నాను. ఆయన నాకు మేనేజ్మెంట్ గురువు. ఆయన వ్యవసాయ పనులు నిర్వహించే తీరు చూసిన నేను చిన్నప్పుడే మేనేజ్మెంట్ పాఠాలు నేర్చుకున్నా. డాక్టర్‌ను చేయాలనుకున్నారు... అమ్మానాన్నలు నన్ను డాక్టర్‌ను చేయాలని కలలుగన్నారు. నేను సివిల్స్ వైపు వెళ్లాను. హైస్కూల్ వరకు మా ఊళ్లోనే చదువుకున్నాను. రామచంద్రాపురం వీఎస్ఎం కళాశాలలో ఇంటర్ చదివాను. ఆ తరవాత సివిల్స్ లక్ష్యంగా బీఏలో చేరాను. అప్పుడు మా అమ్మానాన్న, టీచర్లు కోప్పడ్డారు. సైన్స్ గ్రూపు చదివి ఆర్ట్స్‌కు వెళ్లడమేమిటని ని లదీశారు. కొందరు ఎగతాళి చేశారు. నేను ఎవరి మాటా వినిపించుకోలేదు. డిగ్రీలో ఆంధ్రా యూనివర్సిటీ టాపర్‌గా నిలిచాను. ఆ తరవాత ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ వర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్‌లో చేరాను. అప్పట్లో సివిల్స్‌కు ఎంపికయ్యే వారిలో అత్యధికులు అక్కడి వారే. తొలి ప్రయత్నంలో సివిల్స్‌లో విఫలమయ్యాను. రెండో ప్రయత్నంలో (1983లో) ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసెస్ (ఐఆర్ఏఎస్)కు ఎంపికయ్యాను.పీజీలో మా పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ రషీదుద్దీన్ ఖాన్ నా సిద్ధాంత పత్రాలు చూసి..హార్వర్డ్‌లో ప్రొఫెసరయ్యే అర్హతలుండి...సివి ల్స్‌కు ప్రిపేరవ్వడం దండగనేవారు. కానీ నేను సివిల్స్ బాటనే ఎంచుకున్నా. ఆ తరువాత దక్షిణ మధ్య రైల్వేలోనూ, రాష్ట్ర ప్రభుత్వంలోనూ వివిధ పదవులు చేపట్టాను. ఎంఎంటీఎస్ మొదటి దశ రైలు పట్టాలెక్కించిన అనుభవం కూడా ఉంది. కారల్‌మార్క్స్ ప్రభావం నాపైన మార్క్సిజం ప్రభావం ఉంది. కారల్‌మార్క్స్ సాహిత్యం బాగా చదివాను. ప్రపంచంలో ఎందరో తత్వవేత్తలు ఉన్నప్పటికీ సగానికి పైగా ప్రపంచాన్ని కమ్యూనిజం వైపు మలుపు తిప్పిన గొప్ప తత్వవేత్త ఆయన. చార్లెస్ డార్విన్, కార్ల్ పాపర్, థామస్ కున్ల రచనలు బాగా ప్రభావితం చేశాయి. తెలుగు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’ చిన్నప్పుడే చదివాను. చలం, రంగనాయకమ్మ, బుచ్చిబాబు, తిలక్, ఆరుద్ర, విశ్వనాథ సత్యనారాయణ, సినారె, దాశరథి, గజ్జెల మల్లారెడ్డి వంటి ఎంతోమంది రచనలు బాగా చదివాను. శ్రీశ్రీ అంటే చాలా ఇష్టం. తీపి గుర్తులు... కొంకణ్ రైల్వే ప్రాజెక్టులో పని చేసేందుకు మెట్రో మ్యాన్ శ్రీధరన్ నన్ను ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశాం. నగరంలో ఎంఎంటీఎస్ మొదటి దశ విజయవంతానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించాను. మన రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు మొదలైనపుడు నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఫైనాన్స్ డెరైక్టర్‌గా చేరాను. రూ.500 కోట్ల నష్టంతో ఉన్న సంస్థను ఏడాది తిరిగే లోగా లాభాల బాట పట్టించడం మరిచిపోలేని తీపి జ్ఞాపకం. పేరు : ఎన్వీఎస్ రెడ్డి స్వస్థలం : తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు తల్లిదండ్రులు : సత్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి భార్య : {పతిమ, కస్తుర్బా గాంధీ కళాశాలలో ఇంగ్లిష్ లెక్చరర్ పిల్లలు : ఇద్దరు అబ్బాయిలు. మొదటివాడు అర్జున్. అమెరికాలో ఎంఎస్ చేసి మెకిన్సే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.రెండోవాడు రాహుల్. నగరంలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. పుట్టిన తేదీ : 13 ఏప్రిల్ 1957 అభిమాన నాయకులు : జవహర్లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ. ఇష్టమైన ప్రదేశం : సింగపూర్ హాబీలు : పుస్తక పఠనం, కవితలు రాయడం, గార్డెనింగ్. మధుర జ్ఞాపకం : చిన్నపుడు పాఠశాలలో రాసిన ఓ విప్లవ కవితకు మహాకవి శ్రీశ్రీ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకోవడం. కొంకణ్ రైల్వే ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేసి నాటి ప్రధాన పీవీ నరసింహారావు నుంచి అవార్డు అందుకోవడం. ఇష్టమైన ఆటలు : చిన్నప్పుడు కబడ్డీ బాగా ఆడేవాడిని. ఇష్టమైన ఆహారం : చికెన్ కర్రీ, పాలకూర కర్రీ సినిమాలు : గత 30 ఏళ్లుగా చూడలేదు. చిన్నప్పుడు శంకరాభరణం చూశా. గుర్తుంచుకొనేవి : కొంకణ్ రైల్వే ప్రాజెక్టును పూర్తి చేయడం. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో మీటర్‌గేజ్ రైల్వే లైన్లను బ్రాడ్‌గేజ్‌లుగా మార్చే పనుల్లో కీలక బాధ్యతలు నిర్వహించడం. -
‘మొక్కజొన్న’ భారం రాష్ట్రానికే
సెంట్రల్‌పూల్ నుంచి తొలగింపు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో జరిగే మొక్కజొన్న క్రయవిక్రయాల నుంచి కేంద్రం పూర్తిగా తప్పుకుంది. నిర్ణీత సమయంలోగా మొక్కజొన్న కొనుగోలు ప్రణాళిక అందివ్వకపోవడం, కేంద్రం నుంచి తీసుకోవాల్సిన అనుమతుల్లో జాప్యం కారణంగా.. ఇప్పటి వరకు కొనుగోలు, అమ్మకం ధరకు మధ్య ఉన్న నష్టాన్ని భరించిన కేంద్రం, ఇకపై రాష్ట్రమే ఆ భారాన్ని భరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ, భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) ద్వారా ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలిపింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రం కొనుగోలు చేసే మొక్కజొన్న సెంట్రల్‌పూల్ కిందకు రాదని, లాభనష్టాలను రాష్ట్రమే భరించాలని స్పష్టం చేసింది. కేంద్ర నిబంధనల మేరకు ఆర్థిక సంవత్సరంలో జరిపే మొక్కజొన్న కొనుగోళ్లపై రాష్ట్రం ముందుగానే కేంద్రానికి తన కార్యాచరణ ప్రణాళికను అందిం చి, దానికి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం ఆమోదం లభించిన పక్షంలో కొనుగోలు జరిపే ధరకు, అమ్మకం చేసే ధరకు మధ్య వ్యత్యాసాలు ఉంటే ఆ భారాన్ని రాష్ట్రంపై మోపకుండా కేంద్రమే భరిస్తుంది. ఎఫ్‌సీఐ విధించే నిర్ణీత సమయంలోగా ఆ విక్రయాలను రాష్ట్ర మార్క్‌ఫెడ్ పూర్తి చేయాలి. లేని పక్షంలో నష్టాన్ని రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది. 2013-14లో క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.1,300 వరకు చెల్లించి 2.87లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరణ జరిపారు. అయితే గత ఏడాది రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, అంతర్జాతీయంగా తగ్గిన డిమాండ్ నేపథ్యంలో నిల్వలు పేరుకుపోవడంతో లక్ష మెట్రిక్ టన్నులను క్వింటాలుకు రూ.1,050 వరకు ధర తగ్గించి విక్రయించింది. మిగిలిన 1.87లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలో లక్ష మెట్రిక్ టన్నులను టన్నుకు రూ.10,850మేర కొనుగోలు చేసినా రూ.10వేలకే టన్ను చొప్పున విక్రయించింది. ఈ వ్యత్యాస భారం రూ. 10కోట్ల నుంచి రూ.12కోట్ల మేర కేంద్రమే భరించాల్సి వచ్చింది. ఇక ప్రస్తుత ఏడాదిలో సైతం సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్న మార్క్‌ఫెడ్ ఇప్పటివరకు 2.8 లక్షల టన్నుల మొక్కజొన్నను రూ.1,310 మద్దతు ధరకు కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుత ఏడాది కొనుగోలు ప్రణాళికను కేంద్రానికి సమర్పించకపోవడంతో సెంట్రల్ పూల్ నుంచి మొక్కజొన్నను తొలగించారు. -
పైకప్పులో పండిద్దాం
టై గార్డెనింగ్పై నగరవాసుల్లో ఆసక్తి హైదరాబాద్: ఇంటి పైకప్పు అంటే చాలు.. చాలామందికి చిన్న చూపు. ఆ స్థలం ఎందుకూ పనికిరాదని భావిస్తారు. కొందరేమో అక్కడే పాత సామాన్లు పెట్టుకుంటారు. మరికొందరు పైకప్పు మీద బట్టలు ఆరేయడానికి మాత్రమే వినియోగిస్తారు. అప్పుడప్పుడు బంధువులొస్తే కాలక్షేపం చేస్తారు. అంతేతప్ప ఓ ప్రణాళిక ప్రకారం ఈ స్థలాన్ని వినియోగించుకోవాలని అనుకోరు. ఇలాంటి వారందరికీ ఉపయోగపడే కొత్త పోకడే టై గార్డెనింగ్. ఈ స్థలాన్ని వృథాగా వదిలేయకుండా ఇక్కడే కూరగాయల్ని పండించుకోవచ్చు. ఏడాదిలో కూరగాయల ధరలు మండటాన్ని మనం చూస్తుంటాం. ఇలా హఠాత్తుగా రే ట్లు పెరగడానికో కారణం ఉందండోయ్.. ఉత్పత్తి తగ్గడమే. నగరీకరణ, పారిశ్రామికీకరణ వంటి కారణాలతో కూరగాయలను పండించటం గగనమవుతోన్న నేటి కాలంలో ఈ విధానం ఓ చక్కటి ప్రత్యామ్నాయమని చెప్పొచ్చు. ఏమేం పండించొచ్చు.. మనం నిత్యం తినే కూరగాయల్ని టై గార్డెనింగ్ ద్వారా పండించుకోవచ్చు. టమాట, మిర్చి, వంకాయ, బెండకాయ, చిక్కుడు వంటివన్నమాట. ఓ అడుగు లోతు దాకా స్థలముంటే క్యారెట్, ర్యాడిష్, క్యాబేజీ వంటి దుంప జాతి కూరగాయలు, రకరకాల ఆకుకూరలు కూడా పండించుకోవచ్చు. చలికాలంలో ఎక్కువ దిగుబడి వచ్చే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివి కూడా టై గార్డెనింగ్‌కు అనుకూలం. ఎన్ని రోజులు.. ఈ విధానంతో కూరగాయలు పండించటానికి ఎన్ని రోజులు పడుతుందనే సందేహం సహజం. సాధారణంగా విత్తనాలు వేశాక 20 రోజుల్లోపే మొలకలొస్తాయి. అప్పటినుంచి దాదాపుగా 60 రోజుల తర్వాత కూరగాయలు చేతికొస్తాయి. గరిష్టంగా 80-100 రోజుల్లోపే కూరగాయలు పండించొచ్చు. నివాస సంఘాలకు మేలు... నగరంలోని పలు నర్సరీల్లో చిన్నపాటిమొక్కలు కూడా అమ్ముతుంటారు. వీటిని తెచ్చుకొని ఇంటి పైకప్పులో ఏర్పాటు చేసుకోవచ్చు. వంద చ.అ. కనీసం 70-100 టమాట మొక్కలను పెంచవచ్చు. ఒక్కో మొక్క నుంచి కనీసం 2 కిలోల టమాట దిగుబడి వస్తుంది. అంటే వంద మొక్కల ద్వారా ఎంత లేదన్నా 200 కిలోల దాకా టమాట పండుతుంది. కాకపోతే మొక్కలను నాటిన తర్వాత నిర్వహణ విషయం లో జాగ్రత్త వహించాలి. మార్కెట్లో నాణ్యమైన విత్తనాలు కూడా లభిస్తున్నాయి. వీటి ద్వారా దిగుబడి ఎక్కువొస్తుందని తెలుసుకున్నాకే కొనుగోల చేసుకోవాలి. వంద చ.అ. ఎంత? వంద చ.అ. టై గార్డెనింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. బెడ్ సైజు సుమారు 3వ4వ8 అడుగుల సైజు అనుకుంటే దీనికి 9వ3వ4 అడుగుల సైజు ఇటుకలు అవసరమవుతాయి. ఒక్కో బెడ్ 12 చ.అ. ఉంటుంది. ఇందుకు దాదాపు 78 ఇటుకలు కావాలి. ఇలాంటివి 8 బెడ్లు అవసరం. ఒక్కో ఇటుక రేటు సుమారు రూ.5 అనుకుంటే రవాణా ఖర్చులను కూడా కలుపుకుంటే రూ.3,500 అవుతుంది. ఇటుకలు 3,500 పాలిషీలు 400 (కిలో పాలిషీటు 20 చ.అ. స్థలానికి సరిపోతుంది) వర్మి కంపోస్ట్ 3,200 విత్తనాలు 300 వేప నూనె 200 పనిముట్లు 600 ఇతర సామాగ్రి 200 పనివారు, రవాణా 2,500 మొత్తం 10,900 (ఈ పట్టిక కేవలం అవగాహన కోసమే. ఇటుకలు, బెడ్ సైజును బట్టి ధరల్లో తేడా ఉంటుంది) -
పది వేల కోట్లు కూడా మించని వ్యయం
-
ప్రణాళిక తప్పింది
పది వేల కోట్లు కూడా మించని వ్యయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రణాళిక వ్యయం కింద రూ. 48 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదన మార్చి 31 నాటికి రూ. 25 వేల కోట్లు దాటదంటున్న నిపుణులు అదే సమయంలో పట్టపగ్గాల్లేని ప్రణాళికేతర వ్యయం రూ. 500 కోట్ల ‘విచక్షణ’ నుంచి పైసా విడుదల చేయని సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిధులు నీళ్లలా ఖర్చవుతున్నాయి.. కానీ, ఆస్తుల కల్పన వ్యయం మాత్రం ముందుకు సాగడం లేదు. కొత్త రాష్ట్రంలో లక్షా ఆరువందల కోట్ల భారీ బడ్జెట్‌ను తెలంగాణ శాసనసభ ఆమోదించిన సంగతి విదితమే. అందులో ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం మధ్య తేడా రూ.3 వేల కోట్లు మాత్రమే. అయితే గడిచిన 7 నెలల కాలంలో జరిగిన వ్యయం పరిశీలిస్తే.. ప్రణాళికేతర వ్యయం ‘కళ్లెం లేని గుర్రం’లా దూసుకుపోతోంది. ప్రణాళిక వ్యయం మాత్రం నత్తను మరిపిస్తోంది. అయిన కొద్దివ్యయంలోనూ ఆస్తుల కల్పనకు వినియోగించిన నిధులు చాలా తక్కువ. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఆశించిన స్థాయిలో నిధులు వ్యయం అయ్యే అవకాశం లేదని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. తెలంగాణలో ఆస్తుల కల్పనలో భాగంగా ఇంటింటికీ తాగునీటిని అందించే వాటర్‌గ్రిడ్ పథకం, చెరువుల పునరుద్ధరణ, గ్రామీణ, ఆర్అండ్బీ రహదారులు, పాఠశాలల నిర్మాణం, ఆసుపత్రులు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద హాస్టల్స్ నిర్మాణం, కళాశాల భవనాల నిర్మాణాలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. అయితే, వీటిలో ఇప్పటివరకు ప్రభుత్వం ఒక్క కార్యక్రమాన్నీ ప్రారంభించలేదు. ఇవన్నీ ఇంకా ప్రణాళిక, అంచనాల రూపకల్పన, ఆర్థిక శాఖ అనుమతుల దశల్లోనే ఉన్నాయి. వీటికి అనుమతులు వచ్చి... టెండర్ల ప్రక్రియ ముగిసి ప్రారంభం కావడానికి మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు. రాష్ట్రంలో ఏడు నెలల వ్యవధిలో దాదాపు రూ.35 వేల కోట్ల మేరకు వ్యయం జరిగితే అందులో ప్రణాళికేతర వ్యయమే రూ. 25 వేల కోట్లు దాటింది. ప్రణాళిక వ్యయం పదివేల కోట్ల రూపాయల లోపే ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు జరిగిన ప్రణాళిక వ్యయంలో ఆస్తుల కల్పనకు మూడు వేల కోట్ల రూపాయలు మించి వ్యయం చేయలేదని ఉన్నతస్థాయివర్గాల సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 48 వేల కోట్ల రూపాయలు ప్రణాళిక వ్యయం కింద ఖర్చు చే యాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించినా... మార్చి 31 నాటికి అది 25 వేల కోట్ల రూపాయలకు మించే అవకాశం లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. వాటర్‌గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలకు ఈ ఏడాదిలో నాలుగువేల కోట్ల రూపాయలు కేటాయిస్తే.. ఈ రెండు పథకాలు ఇంకా ప్రారంభ దశను కూడా చేరుకోలేదు. వాటర్‌గ్రిడ్ పథకంలో ఇంకా సర్వేల పర్వం కొనసాగుతుంటే.. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం పరిపాలన, ఆర్థిక అనుమతుల దశలోనే ఉంది. వచ్చేనెలలో టెండర్లు పిలిచి.. పనులు ప్రారంభమైనా మూడు నెలల కాలంలో ఆశించిన మేరకు వ్యయం జరిగే అవకాశం లేదని ఆ శాఖ వర్గాలే పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రణాళిక పద్దుల కింద 15వేల కోట్ల రూపాయలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నప్పటికీ.. ఆ మేరకు నిధులు విడుదల అవుతాయా అన్నది అనుమానమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 13వ ఆర్థిక సంఘం నుంచి 2,200 కోట్లు రావాల్సి ఉందని ఆ వర్గాలు తెలిపాయి. సీఎం విచక్షణకు రూ.500 కోట్లు.. సీఎం విచక్షణతో అభివృద్ధి పనులు మంజూరు చేయడానికి దాదాపు రూ. 500 కోట్లు పెట్టారు. అయితే ఈ నిధుల నుంచి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని సమాచారం. -
తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక
చిత్తూరు(ఎడ్యుకేషన్): జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి తెలిపారు. జెడ్పీ ఒకటి, ఏడు స్థాయి సంఘాల సమావేశం బుధవారం జరిగింది. జెడ్పీ మీటింగ్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో మం చినీటి సమస్య పరిష్కారంపై చర్చించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మొదట పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లాలో ముఖ్యంగా పడమటి మండలాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, వర్షపునీటిని నిల్వ చేసి, వినియోగించుకునే విధానంపై ప్రణాళికలు అవసరమని జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి అన్నారు. ఇప్పటికే తెలుగుగంగతో శ్రీకాళహస్తి, ఏర్పేడు, రేణిగుంట మండలాల్లోని 108 గ్రామాలకు శాశ్వత తాగునీటి పరిష్కారం చూపామని గుర్తు చేశారు.అదే తరహాలో జిల్లాలో ఉన్న పెద్ద చెరువులు, జలాశయాలను తాగునీటి సరఫరాకు వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి నివేదిద్దాం: చెవిరెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కార మార్గాలపై ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని సూచించారు. జెడ్సీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో మంచినీటి వనరులను కాపాడుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుందామన్నారు. ఇందుకు ఎంపీడీవోలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. వాటర్షెడ్లతో సాధ్యం పుంగనూరు జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డియాదవ్ మాట్లాడుతూ ఉపాధిహామీ పథకంలో వాటర్షెడ్ల నిర్మాణాలు విరివిగా చేపడితే భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉందన్నారు. సదుం జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఐదునెలలుగా పెండింగ్‌లో ఉన్న మంచినీటి సరఫరా బిల్లులు చెల్లించాలని కోరారు. ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణాలు పూర్తిచేసి నెలలు గడుస్తున్నా, బిల్లుల చెల్లింపులో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లమండ్యం చెరువును రిజర్వాయర్‌గా మార్చి సమీప గ్రామాల్లో తాగునీటి సమస్యను తీర్చాలని రేణిగుంట జెడ్పీటీసీ సభ్యురాలు లీలావతి కోరారు. పెద్దేరు, చిన్నేరు ప్రాజెక్టులను హంద్రీ-నీవాకు అనుసంధానం చేయడం ద్వారా మంచినీటి ఎద్దడి పరిష్కరించుకోవచ్చని తంబళ్లపల్లి జెడ్పీటీసీ సభ్యుడు శంకర్ సూచించారు. తలకోన నీటిని పంపింగ్ విధానం ద్వారా చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం మండలాలకు సరఫరా చేసి తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని చిన్నగొట్టిగల్లు జెడ్పీటీసీ సభ్యురాలు శోభారాణి కోరారు. పాకాల, ఐరాల మండలాల్లోని 20 గ్రామాలకు భూగర్భజలాలు సమృద్ధిగా ఉన్న చుక్కావారిపల్లి నుంచి సరఫరా చేయాలని పాకాల జెడ్పీటీసీ సురేష్ సూచించారు. తాగునీటి పథకాలకు 20హెచ్‌పీ మోటార్లు అమర్చాలని బి.కొత్తకోట జెడ్పీటీసీ సభ్యుడు రెడ్డెప్ప కోరారు. చెరువులను ఆక్రమణలనుంచి కాపాడాలని పెనుమూరు జెడ్పీటీసీ రుద్రయ్యనాయుడు కోరారు. పూతలపట్టు మండలం పి.కొత్తకోట చెరువులో వర్షపునీటిని నిల్వచేసుకుని గ్రామాలకు వినియోగపడేలా చర్యలు చేపట్టాలని జెడ్పీటీసీ వనజ పేర్కొన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఈఈ విజయకుమార్,ట్రాన్స్‌కో ఎస్ఈ హరినాథ్ పాల్గొన్నారు. -
పుస్తక ప్రియుల కిటకిట
బుక్ ఫెయిర్‌కు పుస్తక ప్రియులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో ఎన్టీయార్ స్టేడియంలో జరుగుతున్న ఈ ప్రదర్శనకు జంట నగరాల నుంచి సందర్శకులుతరలివచ్చారు. స్టాల్స్ అన్నీ కిటకిటలాడాయి. చిన్నా పెద్దా అందరూ సందడి చేశారు. కవాడిగూడ: పుస్తకాలు లేని ఇల్లు.. కిటికీలు లేని గదులతో సమానం. ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు మన పెద్దలు. కొనాల్సిన పుస్తకాలు అపరిమితం. డబ్బులు మాత్రం పరిమితం. అయితే ఓ ప్లాన్ ప్రకారం బుక్ఫెయిర్లో షాపింగ్ చేస్తే మంచి పుస్తకాలు కొనుక్కోవడంతోపాటు మనం అనుకున్న దానికన్నా ఒకటి రెండు ఎక్కువ కొనుక్కునే ఛాన్స్ కూడా ఉంది. హైదరాబాద్ మహానగరంలో గత మూడు దశాబ్దాలుగా జరుగుతున్న బుక్ ఫెయిర్‌కు ఈసారీ పుస్తక ప్రియుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నగరం నలు మూలల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆదివారం సెలవుదినం కావడం, సందర్శన వేళలు ఎక్కువగా ఉండడంతో పలు ప్రాంతాలనుంచి పుస్తకప్రియులు తరలివచ్చారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద భారీ క్యూ కన్పించింది. కొంతమంది కుటుంబ సమేతంగా వచ్చి వారికికావాల్సిన పుస్తకాలు కొనుగోలు చేశారు. పుస్తక ప్రదర్శనను తిలకించేవారు, పుస్తకాలను కొనుగోలు చేసుకునే వారు, చాలా కాలంగా ఫలానా పుస్తకాన్నే కొనాలనుకునే వారు ప్రదర్శనకు విశేషంగా విచ్చేస్తున్నారు. ‘ప్లానింగ్’ ఉంటే మంచి పుస్తకాలు కొనొచ్చు... ప్రదర్శనలో కళ్లముందు దర్శనమిచ్చే ప్రతి పుస్తకంలో మనకు ఉపయోగపడే జ్ఞానం ఉంటుంది. మనం నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన పరిజ్ఞానం ఉంటుంది. మనలోని మానసిక పరిణితి స్థాయిని పెంచే విషయాలూ ఉంటాయి. వీటన్నింటినీ కొనుగోలు చేయాలంటే జేబు నిండా ఆర్థిక వనరు ఉండాలి. మన వద్ద జేబులో ఉన్న డబ్బులతో మనకు కన్పించే మంచి పుస్తకాలే ఖశ్చితంగా కొంటాము. కానీ, కొంచెం ముందుకెళ్లాక.. ఇంకా మంచి పుస్తకాలు, మన మనసుకు నచ్చిన, మనం ఎప్పటి నుంచో కొనాలని ఎదురు చూస్తున్న పుస్తకాలూ తారసపడొచ్చు. అప్పుడు కొంత బాధనిపిస్తుంది. ఇదంతా పుస్తకాల కొనుగోలు పట్ల సరైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వల్లే అని చెప్పవచ్చు. ఇందుకు కొన్ని సూత్రాలు పాటిస్తే ముందుగా మనం అనుకున్న బడ్జెట్లోనే మనకు ప్రీతిపాత్రమైన పుస్తకాలను కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. బుక్ఫెయిర్లో మొత్తం 317 స్టాల్స్ ఉన్నాయి. ముందుగా స్టాల్స్ మొత్తాన్నీ ఒక రౌండ్ వేయాలి స్టాల్స్‌ను రౌండ్ వేస్తున్నప్పుడే మనకు నచ్చిన పుస్తకాలను, వాటి ధరలను, ఆ స్టాల్ నంబర్ ఒక కాగితంపై నోట్ చేసుకోవాలి. -
ఇసుకేస్తే రాలిన చిత్రాలు
మీ పేరు విభిన్నంగా ఉందే.. ఆ పేరుకి ఏమిటి అర్థం? అని అడిగితే ‘నా పేరు కాంత్.రిసా అనే పదం నచ్చి పేరుకి చివర తగిలించుకున్నా’నంటాడు. పెరిగిన గడ్డం, తలపాగాతో ఒక మతానికి చెందిన వ్యక్తిగా కనిపించే ఈ మూడుపదుల వయసున్న మహబూబ్‌నగర్ జిల్లా తెలుగు యువకుడు.. చిన్నప్పటి నుంచీ తలపాగా అలవాటనీ, ఇప్పటి దాకా గడ్డం, మీసం కత్తిరించిందే లేదనీ వివరిస్తాడు. నిన్నటికి విలువివ్వని,రేపనేది నమ్మనని, నేటిని మాత్రమే నిజమని భావిస్తాననే కాంత్‌రిసా.. వ్యక్తిగా విచిత్రుడు. గుప్పెడు ఇసుక రేణువుల సాక్షిగా.. గుర్తుండిపోయే కథలను గుప్పించే స‘చిత్ర’గుప్తుడు. ..:: ఎస్.సత్యబాబు ‘ఎక్కడ ఉంటారు అనడిగితే ఏం చెబుతా? ఇప్పుడిక్కడున్నా. రేపెక్కడుంటానో...’ అంటూ అర్థం కానట్టు మాట్లాడే కాంత్‌రిసా.. మాటలకీ చేతలకీ ఏ మాత్రం వ్యత్యాసం ఉండదు. రాష్ట్రంలో శాండ్ ఆర్ట్‌కి ఒక ప్రత్యేకమైన ఇమేజి తీసుకొచ్చిన ఆయన ఎక్కడుంటాడో తెలియకపోయినా.. ఆయన చేతిలో ఇసుక సంచీ నుంచి తమ కోసం ఒక చక్కని కథ నేల రాలుతుందని చాలా మందికి తెలుసు. బ్యూటీ ఆఫ్ బీయింగ్ స్పాంటేనియస్.. ‘ప్లానింగ్ అంటే ఇష్టం ఉండదు. ఏ ప్రదర్శనలో పాల్గొన్నా అప్పటికప్పుడు వాళ్లు చెప్పిన ఈవెంట్‌కు అనుగుణంగా స్టోరీ అల్లుకుని అక్కడ చిత్రరూపం ఇచ్చేస్తా. అంతే’ అని చెప్పారు కాంత్. జేఎన్టీయూ ఫైనార్ట్స్ విద్యార్థిగా డ్రాప్ అవుట్ అయిన ఆయన.. అనుకోకుండా ఇసుకతో వి‘చిత్రాల’ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. అలా అలా ఇసుక చిత్రావళిని దేశవ్యాప్తం చేశారు. తెలుగు రాష్ట్రాలలోనే ఇసుక చిత్రాలతో కథలు చెప్పడం అనే అంశంలో తనదైన ప్రత్యేకతను సాధించారాయన. సిటీలో ఒకసారి హెమిటాలజీ మీద జరిగిన డాక్టర్ల సదస్సులో శాండ్ ఆర్ట్ ద్వారా మదర్ అండ్ చైల్డ్ని ప్రదర్శించారు. బిడ్డకు రక్తాన్ని పంచే తల్లి వ్యాధుల్ని పంచాలనుకోదు అంటూ సందేశాన్ని కూడా సంధించి, వినోదం కోసమే ఈ షో అనుకున్న అహూతులను విస్మయానందంలో ముంచారు. అయితే అవేవీ ముందస్తు ప్లాన్‌తో చేసినవి కావనీ, అప్పటికప్పుడు అల్లుకున్నవే అంటున్న కాంత్.. స్పాంటేనియస్‌గా జీవించడంలో ఉన్న ఆనందం మరెందులోనూ తనకు కనపించదంటారు. శాండ్ త్రూ కొరియర్.. కార్పొరేట్ కంపెనీల కార్యక్రమాలు, సిటీ ఈవెంట్లు, కళాశాలలు, యూనివర్సిటీలు.. ఇలా కాంత్‌రిసా కాలు మోపని, ఇసుక రాల్చని వేదికలు లేవనే చెప్పాలి. కొన్నేళ్లుగా దేశ విదేశాల్లో శాండ్ ఆర్ట్‌ని ప్రదర్శిస్తున్న కాంత్... తన ప్రతి ప్రదర్శనకి కనీసం కిలోన్నర ఇసుక అవసరం అని చెప్పారు. రోడ్‌సైడ్ మట్టిని దోసిళ్లతో పోసుకుంటుంటే నవ్వే నోళ్లు, పిచ్చోడిని చూసినట్టు చూసేకళ్లు తననేమీ కదిలించలేవంటారు. ఎయిర్‌పోర్ట్‌లో ఒకసారి ఆయన తీసుకెళ్లే ఇసుక సంచీ మీద ఎడతెగని సందేహంతో 4 గంటల పాటు శోధించారట.. ఈ అనుభవం తర్వాత ఇసుకని అవసరాన్ని బట్టి కొరియర్లో పంపుతున్నా అని చెప్పారాయన. ‘కొన్ని ‘షో’లకు సొంత ఖర్చులు పెట్టుకుని వెళ్లిన రోజులున్నాయి. డబ్బు ముఖ్యం కాదు. నా రోజువారీ అవసరాలు తీరిపోయిన తర్వాత నాకు డబ్బుతో పని ఉండదు. డబ్బు అనేదాన్ని జీవిత ప్రాధామ్యాల్లో నుంచి తీసేసి చూడండి. అప్పుడు ఎవరితోనైనా కలసి పనిచేయగలుగుతాం’ అంటారు కాంత్. ‘నా ఆర్ట్‌ని డస్ట్ ఆర్ట్ అనండి. శాండ్ ఆర్ట్ అనొద్దు. బియ్యపు పిండితో కూడా చిత్రాలు వేయవచ్చు. అవన్నీ మాధ్యమాలే తప్ప వాటి పేరుతో ఆర్ట్‌ని పిలవకూడదు’ అని సూచిస్తున్న ఈ వి‘చిత్ర’కారుడు త్వరలో ఒక సినిమా తీయబోతున్నాని చెబుతున్నాడు. అయితే అది హిట్టా ఫట్టా అని కాక తనకు నచ్చిన కోవలో తీస్తున్నానని, దాని ఫలితంతో తనకు పనిలేదని చెప్తున్న కాంత్‌రిసా దీనికి సిద్ధపడిన ఓ నిర్మాత కూడా దొరికాడన్నారు. ప్రస్తుతం జీవిస్తున్న క్షణ మే చివరిది అన్నట్టు ఉండడమే తనకు ఇష్టం అని చెప్పే కాంత్.. శాండ్‌తో మాత్రమే కాదు అన్ని రకాల చిత్రాలను గీయడంలో సిద్ధ‘హస్తులే’. -
రూ.48వేల కోట్లతో రుణప్రణాళిక
తెలంగాణకు నాబార్డు ప్రణాళిక సిద్ధం పంట రుణాలు రూ.25,780 కోట్లు వ్యవసాయ టర్మ్లోన్లు రూ.9.400 కోట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు రూ.5,554 కోట్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో భాగంగా వచ్చే ఏడాది రూ.48వేల 176కోట్ల రుణం అవసరమవుతుందని జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (నాబార్డు) అంచనా వేసింది. ఈ మేరకు 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను రుణ ప్రణాళికను సిద్ధం చేసింది. గత సంవత్సర రుణప్రణాళిక కంటే ఈ సారి ప్రణాళిక మొత్తం 19శాతం ఎక్కువగా ఉంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో మూలధన సమీకరణను వేగవంతం చేయడానికి ఈ రుణప్రణాళిక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇందులో పంట రుణాలకు రూ.25,780 కోట్లు, వ్యవసాయ టర్ము రుణాల కోసం రూ.9,400 కోట్లు (మొత్తంగా వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.35,180కోట్లు), సూక్ష్మ , చిన్న, మధ్యతరహా సంస్థలకు రూ.5,554 కోట్లు, ఇతర ప్రాధాన్య రంగాలకు రూ.7,441కోట్లు కేటాయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చిన్ననీటి పారుదల, పశు పోషణ, కోళ్ల పరిశ్రమ, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, ఉద్యాన వనాలు, పళ్లు, కూరగాయలు, పూల పెంపకం, మార్కెట్ ఆధారిత విత్తనోత్పత్తి, శీతల గిడ్డంగుల నిర్మాణం, పునరుత్పాదక సామర్ధ్యంగల వనరుల ద్వారా స్వల్ప వ్యయ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటును అభివృద్ధి కేంద్రీకృత రంగాలుగా నాబార్డు ఎంపిక చేసింది. శుక్రవారం జరిగిన రుణప్రణాళిక సదస్సు సందర్భంగా నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ జిజీ మెమెన్ ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఇవీ ... కేటాయింపులు జలవనరుల అభివృద్ధి కోసం రూ.667.80కోట్లు, భూముల అభివృద్ధికి రూ.317.63కోట్లు, వ్యవసాయ క్షేత్రాల యాంత్రీకరణకు రూ.1,338.95 కోట్లు, మొక్కల పెంపకం, హార్టీకల్చర్, సెరికల్చర్‌కు రూ.709.72కోట్లు, అటవీ, వృధా భూముల అభివృద్ధికి రూ.58.86కోట్లు, పాడిపరిశ్రమ అభివృద్ధికి రూ.1616.98కోట్లు, కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి రూ.507.14కోట్లు, గొర్రెలు, మేకల పెం పకం కోసం రూ.741.32కోట్లు, మత్స్య పరి శ్రమకు రూ.45.32కోట్లు, గిడ్డంగులు, మార్కెట్ యార్డుల అభివృద్ధి కోసం రూ.776.12 కోట్లు, దేశీయ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల కోసం రూ. 65.26కోట్లు, ఇతర పనులకు రూ. 2,544.98 కోట్లివ్వాలని అంచనా వేశారు. మహ బూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో శీతల గిడ్డంగుల కొరత ఉన్నట్లు గుర్తించింది. రైతు బృందాల ఏర్పాటు భూమిలేని రైతులు, కౌలు రైతులు, సన్న, చిన్నకారు రైతుల కోసం నాబార్డు ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 15,840 బృందాల (జాయింట్ ఫార్మింగ్ గ్రూప్స్)ను ఏర్పాటు చేయనుంది. ఈ సంఘాల ద్వారా వారికి రుణాలు అందించనుంది. చిన్నకారు రైతులు సైతం మార్కెట్ శ క్తులతో పోటీ పడే విధంగా చేయాలని నాబార్డు నిర్ణయించింది. -
ప్లానింగ్ లేకుండా అభివృద్ధి పనులా?
మందమర్రి : మంద మర్రి మున్సిపాలిటీ పనితీరుపై మంచిర్యాల ఆర్డీవో, మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి ఆయేషా మస్రత్ ఖానం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లానింగ్ లేకుండా, ఇష్టానుసారంగా పనులు చేపడుతారా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం ఆకస్మిక తనిఖీపై మందమర్రి మున్సిపాలిటీకి వచ్చిన ఆర్డీవో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు ఎలా చేపడుతున్నారనే ఆర్డీవో ప్రశ్నకు అధికారులు నీళ్లునమిలారు. ప్రభుత్వ పనులు, కార్యక్రమాలు చేపట్టే సమయంలో నియమ, నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఏవైనా సిఫారసులు వస్తే వాటిని పట్టించుకోకూడదని సూచించారు. ఫైళ్లు ఎలా మాయమయ్యాయి? మున్సిపాలిటీలో గతంలో నల్లా కనెక్షన్ల కోసం ఇచ్చిన రశీదులు, దాని తాలుకూ ఫైల్ తెప్పించాలని ఆర్డీవో ఆదేశించగా ఆ ఫైల్ లేదంటూ సిబ్బంది సమాధానం ఇచ్చారు. దీనిపై ఆగ్రహానికి గురైన ఆర్డీవో ఫైళ్లు ఎలా మాయమవుతాయని మండిపడ్డారు. ప్రజలు పన్నులు కట్టేలా చైతన్యపర్చాలని సూచించారు. మందమర్రి మార్కెట్లో చెత్తాచెదారం పేరుకుపోతున్నదని ఫిర్యాదులు అందుతున్నాయని, అక్కడ తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డీఈ గంగాధర్, ఏఈ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఓబులేసుకు ప్రాణాంతక వ్యాధి!
జల్సాల కోసమే అపహరణ యత్నం అరెస్టుకు ముందు ఆత్మహత్యకు ప్రణాళిక గతంలో ఓ మాజీ ఐఏఎస్ మనవడి కిడ్నాప్ చంచల్‌గూడ జైలుకు తరలింపు హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డి అపహరణకు యత్నించిన ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేసు(37) ఓ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. శుక్రవారం మీడియా సమావేశానికి ముందు అతన్ని పోలీసులు కిడ్నాప్ యత్నంపై విచారించారు. ఈ సందర్భంగా నిందితుడు పలు వివరాలను వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈనెల 19న కేబీఆర్ పార్కు వద్ద ఘటన తరువాత ఓబులేసు రాత్రి 11 గంటలకు కర్నూలుకు చేరుకుని ఓ లాడ్జిలో బసచేశాడు. తన తల్లిదండ్రులను పోలీసులు విచారిస్తున్న ఘటనను టీవీలో చూశాడు. దీంతో తనను పోలీ సులు ఎలా అయినా పట్టుకుంటారని భావించి ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. రాత్రి 11.30 సమయంలో బజారుకు వెళ్లి పురుగుల మందు తెచ్చుకున్నాడు. తర్వాత సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. కొద్ది సేపటికే పోలీసులు వలపన్ని అతన్ని పట్టుకున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేసినా నిందితుడిని ప్రాణాలతో పట్టుకునే అవకాశం దక్కేది కాదని అధికారులు పేర్కొన్నారు. జల్సాల కోసం బ్యాంకాక్.. ఓబులేసు ఎక్కువ కాలం జీవించలేని ఓ వ్యాధి తో బాధపడుతున్నాడు. బతికినన్ని రోజులు ఎంజాయ్ చేయాలన్న ఆలోచనతో జల్సాలకు అలవాటుపడ్డాడు. గత ఫిబ్రవరిలో ఓ మాజీ ఐఏఎస్ అధికారి మనవడిని కిడ్నాప్ చేసి వసూలు చేసిన రూ. 10 లక్షలు అయిపోవడంతో మళ్లీ అపహరణకు యత్నించాడు. ఈసారి వసూలు చేసిన డబ్బుతో బ్యాంకాక్ వెళ్లి జల్సా చేయాలని భావించినట్లు విచారణలో వెల్లడైంది. చంచల్‌గూడ జైలుకు ఓబులేసు.... ఓబులేసును బంజారాహిల్స్ పోలీసులు శనివారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ అతనికి 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఏకే-47 లో పోలీసులకు 17 బుల్లెట్లు మాత్రమే లభ్యమవగా, మిగతా వాటి వివరాలు తెలియాల్సి ఉంది. విచారణ కోసం బంజారాహిల్స్ పోలీసులు ఓబులేసును ఏడు రోజులు పోలీసు కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఫిబ్రవరిలో కిడ్నాప్ ఉదంతంపై బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని, లేనిపక్షంలో సుమోటోగా కేసు నమోదు చేస్తామన్నారు. మరోపక్క ఓబులేసును పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని నార్సింగి పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. గండిపేటలోని గ్రేహౌండ్స్ నుంచి గత ఏడాది డిసెంబర్లో ఏకే-47 చోరీ అయిందని అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్‌రావు ఫిబ్రవరి 3న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. చోరీ అయిన రైఫిల్ కేబీఆర్ కాల్పుల ఘటన స్థలంలో లభ్యం కావడంతో నార్సింగ్ పోలీసులు నమోదు చేసిన చోరీ కేసు మిస్టరీ కొలిక్కి వచ్చింది. ఓబులేసు అద్దె ఇంట్లో తనిఖీలు... ఓబులేసు ఉంటున్న నివాసాన్ని పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి తనిఖీ చేశారు. నార్సింగి వైఎస్సార్ చౌరస్తా ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో అతను కొన్ని నెలలుగా నివాసముంటున్నాడు. అర్థరాత్రి పోలీసులు పెద్దసంఖ్యలో నార్సింగి గ్రామానికి రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఉదయం ఓబులేసు ఇక్కడే అద్దెకు ఉన్నాడని తెలుసుకొని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో ఇదే ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌కు గురైన చైన్ స్నాచర్ శివ అద్దెకు ఉండేవాడు. సంచలనం సృష్టించిన ఈ రెండు కేసుల నిందితులు నార్సింగిలోనే తలదాచుకోవడం గమనార్హం. -
ఇసుక కొత్తపాలసీ అమలుపై అధికారుల కసరత్తు
చిత్తూరు (టౌన్) : కొత్త ఇసుక పాల సీని జిల్లాలో అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అక్రమ రవాణాను నివారించేందుకు ఇసుక అమ్మకం బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నారు. ఇసుక లభించే ప్రాంతాల్లోనే మండలానికోచోట నిల్వచేసి మహిళాసంఘాల నుంచి కొనే విధంగా ప్రణాళికలను రూపొందించారు. జిల్లాలో కుప్పం మండలంలో కంగుంది, పాలారు, నాగలాపురంలో సురుటుపల్లె, నగరిలో సత్రవాడ, నిండ్రలో కొప్పేడు, రామాపురం, చిత్తూరు రూరల్‌లో ఆనగల్లు, నీవానది, ఎన్ఆర్ పేట, చంద్రగిరిలో శానంబట్ల, నారాయణవనంలో పాల మంగళం, నయనార్ కండ్రిగలో ఇసుక రీచ్లున్నట్లు గుర్తించారు. యూనిట్ ధర రూ.850 కొత్త ఇసుక పాలసీ ప్రకారం ఒక యూనిట్ (ట్రాక్టర్ లోడ్) 2.75 క్యూ బిక్ మీటర్ల ఇసుక ధరను రూ. 850గా అధికారులు నిర్ణరుుంచారు. ఇసుక అవసరం ఉన్నవారు తమ ప్రాంతంలోని మీ -సేవ కేంద్రాల్లో వినతిపత్రాలను సమర్పించి అనుమతి పొం దొచ్చు. డబ్బులు మాత్రం నేరుగా మహిళా సంఘాలకు చెల్లించాలి. ఇసుక అమ్మకాలపై ఆసక్తి ఉన్న మహిళా సంఘాలు డీఆర్డీఏ పీడీకి దరఖాస్తు చేసుకోవాలి. ఆయన అమ్మకాలను చేపట్టే అధికారాన్ని కల్పిస్తారు. ఇప్పటికే కుప్పం ప్రాంతంలో ఒక సంఘానికి ఈ అధికారాన్ని కల్పిం చారు. ఖర్చులుపోను మిగిలిన ఆదాయంలో 25 శాతాన్ని అమ్మకాలు చేపట్టే సమాఖ్యల ఖాతాలకు జమచేస్తారు. మిగిలిన మొత్తంలో 50 శాతం మండల పరిషత్‌లకు, 25 శాతం జెడ్పీకి, మరో 25 శాతం గ్రామ పంచాయతీ ఖాతాకు జమవుతుంది. అక్రమ రవాణాపై కఠిన చర్యలు ఇసుకను అక్రమంగా రవాణాచేస్తే ప్రభుత్వం ఇకపై కఠిన చర్యలు తీసుకుంటుంది. తొలిసారి పట్టుబడితే అపరాధం విధిస్తారు. రెండోసారైతే రెట్టింపు అపరాధం వేస్తారు. మూడోసారి వాహనాన్ని సీజ్ చేస్తారు. తహశీల్దార్లు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులకు ఈ చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. కృత్రిమ ఇసుక తయారీ యూనిట్లను ఏర్పాటుచేయండి జిల్లాలో ఇసుక క్వారీలు తక్కువగా ఉన్నందున ఔత్సాహికులు కృత్రిమ ఇసుక తయారీ (రోబో శాండ్) యూనిట్లను ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రావు కోరారు. శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఇసుక కొరతను అధిగమించాలంటే కృత్రిమ ఇసుక తయారీ యూ నిట్లను విరివిగా నెలకొల్పాలని కోరా రు. ఇప్పటికే కేవీబీ పురం మండలంలో ఏర్పాటు చేసిన ఒక యూని ట్లో ఇసుక తయారవుతోందని చెప్పారు. కార్యదర్శులు గ్రామాల్లోనే కాపురం ఉండాలి గ్రామ పంచాయతీ కార్యదర్శులు తా ము పనిచేసే గ్రామాల్లోనే కాపురం ఉం డాలని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రావు కోరారు. చాలామంది పంచాయతీ కార్యదర్శులు తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో మాత్రమే అందుబాటులో ఉంటున్నట్లు ఫిర్యాదులొస్తున్నాయని చెప్పా రు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు అంటువ్యాధులు ప్రబలే పరిస్థితి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. -
విస్తరణ దిశగా ‘పాస్‌పోర్ట్’
కొత్తగా 12 కౌంటర్లు ఏర్పాటు రీజనల్ కార్యాలయంలో రెండు అంతస్తులు కేటాయింపు పదిహేను రోజుల్లో ప్రణాళిక సిద్ధం నవంబర్ 1న పాస్‌పోర్ట్ మేళా సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పాస్‌పోర్ట్ కేంద్రం మరింత విస్తరించనుంది. మన రాష్ట్రంలోని 13జిల్లాలకు కేంద్ర బిందువుగా మారనుంది. ఇందుకు అనుగుణంగా ప్రాంతీయ కార్యాలయాన్ని అభివృద్ధి చేయనున్నారు. అధికారులు 15 రోజుల్లో ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఈ విస్తరణ పూర్తయితే పాస్‌పోర్ట్ పొందడం అత్యంత సరళతరమయ్యే అవకాశం ఉంది. నగరంలోని పాస్‌పోర్ట్ కార్యాలయం సేవలు గడిచిన ఐదునెలల కాలంలో వేగాన్ని పుంజుకున్నాయి. గతంలో 42 పనిదినాల్లో వచ్చే పాస్‌పోర్ట్ ప్రస్తుతం 30 పనిదినాల్లోనే అందుతోంది. ప్రతి శనివారం పాస్‌పోర్ట్ మేళాలు, క్యాంపులు నిర్వహిస్తూ రోజుకి దాదాపు 900 దరఖాస్తులను పరిష్కరిస్తున్నారు. దానిలో భాగంగా వచ్చే నెల 1వ తేదీన విశాఖలో పాస్‌పోర్ట్ మేళాను నిర్వహించనున్నారు. ఆ మేళాలో పాస్‌పోర్ట్ పొందాలనుకునే వారికి బుధవారంతో అపాయింటమెంట్ గడువు ముగిసింది. సాధారణంగా మేళా జరిపడానికి మూడు రోజుల ముందే అపాయింట్మెంట్స్ ముగిస్తుంటారు. ఇలా మేళాలలో పాస్‌పోర్ట్‌లు ఇవ్వడంతో పాటు ఆ సంఖ్యను పెంచాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పాస్‌పోర్ట్ సేవాకేంద్రంలో 18 కౌంటర్లున్నాయి. వాటికి తోడు మరో 12 కౌంటర్లను కొత్తగా నెలకొల్పనున్నారు. అయితే పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో ఆ మేరకు అవకాశం లేకపోవడంతో రీజనల్ కార్యాలయం భవనంలోని రెండు అంతస్ధులను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. దీని కోసం ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాధనలు పంపించారు. 15 రోజుల్లో పూర్తి స్థాయి అనుమతులు సాధించి పనులు ప్రారంభించనున్నారు. పాస్‌పోర్ట్ పొందడం ప్రజల హక్కు ఈ నెల 25,26 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో క్యాంపు నిరహించి పాస్‌పోర్ట్ మంజూరు చేశాం. భవిష్యత్‌లోనూ అనేక జిల్లాలో మేళాలు జరుపనున్నాం. నగరంలోని పాస్‌పోర్ట్ కౌంటర్లను పెంచనున్నాం. ప్రస్తుతం 18 కౌంటర్ల ద్వారా రోజుకి 40 స్లాట్లు అందిస్తున్నాం. అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి సాంకేతికంగా ఇబ్బందులు ఉన్నాయి. దీంతో కౌంటర్లు పెంచాలని నిర్ణయించాం. తద్వారా స్లాట్లు పెరిగి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి తక్కువ సమయంలో పని జరిగే వెసులుబాటు లభిస్తుంది. - ఎన్ఎల్పి చౌదరి, పాస్‌పోర్ట్ అధికారి, విశాఖపట్నం -
తిరుగుబాటు కాదు... పోలీసుల పనే
కోరుకొండ ఘటనపై మావోయిస్టుల వివరణ గాలికొండ, కోరుకొండ ఏరియా కమిటీల పేరుతో లేఖలు తగిన మూల్యం తప్పదని హెచ్చరిక పాడేరు/పెదబయలు: చింతపల్లి మండలం బలపం పంచాయతీ కోరుకొండలో మావోయిస్టుల హత్య ప్రజల తిరుగుబాటు కాదని, ఎస్ఐబీ పోలీసులు, మతం ముసుగులోని ఓ వర్గం భక్తుల పనని మావోయిస్టులు వివరణ ఇచ్చారు. ఈనెల 20న వీరవరం లో జరిగిన ఘటనపై ప్రజా తిరుగుబాటుగా పోలీ సులు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని, ప్రజా బలంతోనే వారి దుష్ర్పచారాన్ని ఎదుర్కొంటామన్నారు. విప్లవకారుల సమాచారాన్ని సేకరించి వారిని అంతమొందించేందుకు ఎస్బీఎక్స్ అనుసరిస్తున్న మార్గా ల్లో ఇదొకటని స్పష్టం చేశారు. సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ, కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి విజయలక్ష్మి పేరున పాడేరు, పెదబయలు విలేకరులకు గురువారం వేర్వేరుగా ప్రకటనలందాయి. వీటి సారాంశం ఇది. ‘మతాన్ని అడ్డం పెట్టుకుని గుదలంవీధి గురువు సింహాచలం, ఇటీవల ప్రజాకోర్టులో హతమైన సంజీవరావులు ఉద్యమద్రోహులుగా మారారు. గత కొన్నేళ్లుగా వీరవరం సంజీవరావు మతం ముసుగులో గుదలంవీధి, చింతపల్లి, గూడెం ప్రాంతాల్లో ప్రచారం పేరుతో తిరుగుతూ అక్రమంగా కలప తరలిస్తుండేవాడు. కాఫీ పోరాటానికి మొదటి నుంచి వ్యతిరేకంగా ఉంటూ వీరవరం, తూరుమామిడి, కుడుముల, గిడువలసపల్లి గ్రామాల్లో మతం ముసుగులో ప్రజల్లో చీలిక తెచ్చాడు. అప్పట్లో ఎస్ఐబీ అధికారి వెంకటరావు, ఓఎస్డీ దామోదర్‌కు సన్నిహితంగా ఉంటూ కాఫీ ఉద్యమాన్ని నీరుగార్చడం, పీఎల్జీఏ, మన్యం పితూరిసేన సభ్యుల్ని అక్రమంగా అరెస్టు చేయిం చడం చేసేవాడు. వీటిపై సంజీవరావును పలుమార్లు హెచ్చరించాం. అతను ప్రజావ్యతిరేకిగా మారాడని ప్రజాకోర్టులో ప్రజలు ముక్తకంఠంతో మరణ శిక్షణ వేయాలని కోరడంతోనే హతమార్చాం. సంజీవరావును హత్యచేసిన తర్వాత గుదలంవీధి గురువు సిం హాచలంను హెచ్చరించి వదిలేయాలని కోరుకొండ సంతకు తీసుకువచ్చాం. అయితే ఎస్ఐబీ పోలీసుల ముందస్తు ప్రణాళికలో భాగంగా మతం ముసుగులో తిరుగుతున్న కొందరు గూండాలు అక్కడి ప్రజల్ని ఉసిగొలిపారు. నరకండి, చంపండి అంటూ గుదలం వీధి గురువు హెచ్చరించడంతో మావోయిస్టులు ప్రజల చేతుల్లో హతమయ్యారు. ప్రజలు చావగొడుతున్నా వారికి హానిజరగ కూడదన్న తలంపుతోనే మావోయిస్టు నేతలు కామ్రేడ్ శరత్, కామ్రేడ్ గణపతులు తమ ఆయుధాలు ఉపయోగించకుండా, ప్రతిఘటించకుండా అమరులయ్యారు. వారికి విప్లవ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఘటన మొత్తానికి గుదలంవీధి గురువు సింహాచలం ప్రధాన కారకుడు. ఇందుకు అతను తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. వీరవరం సన్యాసిరావు, పాంగిమాను అలియాస్ టంటడు, వీరవరం సంజీవరావు అన్న భాస్కరరావు, తమ్ముడు మహేష్, వలసపల్లి హోంగార్డు సునీత అన్న వెంకటరావు, తూరుమామిడి కామేష్, సత్తిబాబులంతా మతం ముసుగులో గ్రామాల్లో తిరుగుతూ ఉద్యమకారుల వివరాలు సేకరిస్తూ పోలీసులకు చేరవేస్తున్నారు. వీరందరికీ సంజీవరావు నాయకత్వం వహిస్తుండడంతో అతన్ని ప్రజాకోర్టులో హత్య చేశాం. ఇప్పుడు గుదలంవీధి గురువు తగిన మూల్యం చెల్లించుకుంటారు.’ అంటూ మావోయిస్టులు తమ లేఖల్లో పేర్కొన్నారు. మన్యంలో మావోయిస్టుల ప్రాబల్యం లేదని డీఐజీ, ఎస్పీ ప్రకటనలు చేస్తూనే కూంబింగ్ విస్తృతం చేయడంలోని అర్థం ఏమిటని కోరుకొండ కమిటీ కార్యదర్శి విజయలక్ష్మి ప్రశ్నించారు. మన్యంలోగాని, ఇతర ప్రాంతాల్లోగాని మావోయిస్టులు లేకుండా చేయడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. 30న మావోయిస్టుల బంద్ సీలేరు: కోరుకొండలో శరత్, గణపతుల హత్యకు నిరసనగా ఈనెల 30న జిల్లా బంద్ పాటిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం ఒక ప్రకటనలో తెలిపారు. కోరుకొండ ఘటనలో రాజప్రయోజిత గూండాలు చేసిన హత్యల వల్లే కామ్రేడ్ శరత్, గణపతులు అమరులయ్యారని పేర్కొన్నారు. -
సొగసు చూడతరమా!
హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు సర్కారు సరికొత్త ఆలోచన జలాశయ అందాలు ప్రతిబింబించేలా ప్రణాళిక సాక్షి, సిటీబ్యూరో: ఆకాశాన్ని తాకేలా విభిన్న ఆకృతులలోని భవనాలు... ఆ ఎదురుగా సుందర జలాశయం... చుట్టూ ఇంద్రధనుస్సును పోలినట్టుండే సప్త వర్ణాల పూలు... ఆ నీటిపై నుంచి భవనాలను కలుపుతూ ముచ్చటగొలిపే విద్యుత్ కాంతులు... ఈ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది కదూ. నగరానికి మణిహారంలా ఉన్న హుస్సేన్‌సాగర్ వద్ద ఈ దృశ్యం సాక్షాత్కరిస్తే... అబ్బో... ఆ ఊహే మహాద్భుతం... ఇక వాస్తవ రూపం దాలిస్తే...‘దాలిస్తే’ ఏంటి? దాల్చబోతోంది. అవును సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు వెలిసేందుకు అవ సరమైన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కాలుష్య కాసారంగా మారిన హుస్సేన్‌సాగర్‌ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైన ప్రభుత్వం మరోవైపు జలాశయం చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మించాలనే తలంపులో ఉంది. ఇందులో భాగంగా ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించింది. వీటికి సంబంధించి 26 కోర్టు కేసులు ఉన్న విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పం దించిన ఆయన వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అడ్వొకేట్ జనరల్‌కు సూచిం చారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న భూములను పలువురు ఆక్రమించడం.. ఏళ్ల తరబడి అవి కోర్టు కేసుల్లో నలుగుతుండటం తెలిసిందే. లీజు గడువు ముగిసిపోయినా కోర్టు స్టేతో ఖాళీ చేయకపోవడం... సాగర్‌కు ఒకవైపు ఆక్రమణలు వంటి విషయాల్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వాటిని తొలగించాలని యోచి స్తోంది. విదేశాల్లోని ప్రసిద్ధ నగరాలతో పాటు మనదేశంలోని ముంబై, కోచిల్లోని మెరైన్డ్రైవ్ల తరహాలో అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ నగరాల మాదిరిగా హైదరాబాద్‌లోనూ ‘స్కైలైన్’ భవనాలను నిర్మించేందుకు అన్ని అంశాలను అధ్యయనం చేసి.. అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సీఎం సూచించారు. ఈ ‘ఆకాశహర్మ్యాల’ విషయం వాస్తవమేనని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. -
మీ సాహసానికి సెల్యూట్!
ఘోరాన్ని ఆపేందుకు విద్యార్థులు, అధ్యాపకుల యత్నం ఉన్మాదికి ఎదురెళ్లిన వైనం ఇతరులకు స్ఫూర్తిదాయకం సహచరుల చొరవతో ప్రాణాలు దక్కించుకున్న రవళి ఊహించని పరిణామంతో విషం తాగిన ప్రదీప్ చాంద్రాయణగుట్ట, సంతోష్‌నగర్, కాటేదాన్, ముషీరాబాద్: ప్రదీప్ పక్కా పథకంతోనే కళాశాలకు వచ్చాడు. సాధారణ డ్రెస్‌లో వస్తే మెయిన్‌గేట్ వద్దే సెక్యూరిటీ గార్డు ఆపేస్తాడని గ్రహించిన అతడు అరోరా కళాశాల డ్రెస్ (బ్లూషర్టు, బ్లూ జిన్స్)వేసుకుని... బ్యాగ్ పట్టుకొని ఉదయం 8.30 గంటలకే లోపలికివ చ్చాడు. సరిగ్గా 9 గంటలకు రవళి కళాశాల మైదానంలో బస్సు దిగింది. వంద మీటర్లు నడిస్తే చాలు తరగతి గదిలోకివెళ్లిపోతుంది. ఆలోగానే దాడి చేయాలనే పథకంతో ప్రదీప్ 60 మీటర్ల దూరంలోనే కూర్చున్నాడు. తోటి విద్యార్థులతో కలిసి తరగతి గదివైపు రవళి నడిచి వెళుతోంది. మరో 20 మీటర్ల దూరం ఉండగానే ఒక్కసారిగా ఆమెపై ప్రదీప్ దాడికి పాల్పడ్డాడు. భవనంలోకి చేరుకున్నాక దాడికి అక్కడ ఆస్కారం ఉండదు. అందుకే పక్కా ప్రణాళికతో దాడికి పాల్పడ్డాడు. అతడు ఊహించనిదేంటంటే సహచరులు తిరగబడతారని. కేసు నమోదు భవనం ముందు ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లో దాడి దృశ్యాలు కనిపించలేదు. మరో పది మీటర్ల దూరం తరువాత ఘటన జరిగి ఉంటే సీసీ కెమెరాలో దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యేవి. ఈ ఘటనతో కళాశాలలో సీసీ కెమెరాల సంఖ్యను మరింత పెంచాలని యాజమాన్యం అత్యవసర సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై 307, 354ఎ,బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ తెలిపారు. ప్రదీప్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తలించామన్నారు. అతను పురుగుల మందు తాగినట్టు గుర్తించామన్నారు. కళాశాలకు ఎలా వచ్చాడు కళాశాలకు ప్రదీప్ ఎలా వచ్చాడు అనే కోణంలో పోలీసుల ఆరా తీస్తున్నారు. ఎవరైనా అతన్ని ముందే కళాశాల వద్ద బైక్‌పై దింపి వెళ్లారా? లేక అతనే ఏదైనా బస్సు, ఆటోలో వ చ్చాడా? అని ఆరా తీస్తున్నారు. కళాశాల గేటు వద్ద నుంచి లోపలికి నడిచి వచ్చినట్టు తెలుస్తోంది. లోపల కేవలం విద్యార్థుల బైక్‌లు మాత్రమే ఉన్నాయి. పార్కింగ్ స్థలంలో ఎలాంటి వాహనమూలేకపోవడంతో ప్రదీప్ నడిచి వచ్చాడని కళాశాల యాజమాన్యం చెబుతోంది. రూ.5 వేల కోసం ప్రదీప్ చికిత్స పొందుతూ మృతి చెందిన తరువాత అపోలో ఆస్పత్రి వారు అతని మృతదేహాన్ని భద్రపరిచారు. కేసు దర్యాప్తులో భాగంగా మృతదేహాన్ని స్వాధీనపర్చాలని చాంద్రాయణగుట్ట పోలీసులు కోరారు. తాము వైద్యం చేశామని, ఆ ఖర్చులు రూ.5 వేలు చెల్లిస్తేనే మృతదేహం ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యం భీష్మించుకు కూర్చుంది. బిల్లు చెల్లించేందుకు పోలీసులు ముందుకు రాకపోవడం, మృతుడి బంధువులు అక్కడికి చేరుకోకపోవడంతో రాత్రి వరకూ మృతదేహాన్ని ఆస్పత్రిలోనే ఉంచారు. బస్‌స్టాప్‌లు మార్చిన రవళి ప్రదీప్ గతంలో చేసిన హెచ్చరికల నేపథ్యంలో రవళి రోజుకోచోట బస్సు ఎక్కేది. తన తండ్రి వెంట బస్సు వద్దకు వచ్చేది. సాయంత్రం ఇంటికి వచ్చే సమయంలో తాను బస్సు ఎక్కడ దిగుతున్నదీ ముందుగానే తండ్రికి ఫోన్ చేసి చెప్పేది. అలా రక్షణ చర్యలు తీసుకునేది. కళాశాల ఆవరణలోనే బస్సు దిగుతున్నందున ప్రమాదం పొంచి ఉన్న విషయాన్ని పసిగట్టలేకపోయింది. సోమవారం ఆమె తండ్రితో కలసి వచ్చి రామ్‌నగర్ చేపల మార్కెట్ వద్ద బస్సు ఎక్కింది. కళాశాలలో రవళిపై ప్రదీప్ దాడి విషయం తెలియగానే రామ్‌నగర్‌లోని ఆమె కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. వెంటనే వారు ఆమె చికిత్స పొందుతున్న సుజాత ఆస్పత్రికి పరుగులు తీశారు. అరెస్టు చేసి ఉంటే గత నెలలో రవళి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రదీప్‌పై ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. అతన్ని అరెస్టు చేసి ఉంటే ఈపాటికి జైలులోనే ఉండేవాడు. ఈ రోజు ఈ ఘటన జరిగి ఉండేదికాదని కళాశాలలో తోటి విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఆస్పత్రిలో వాంగ్మూలం సేకరణ విద్యార్థినిపై దాడి విషయం తెలుసుకున్న ఉప్పర్‌పల్లిలోని ఎనిమిదోమెట్రోపాలిటన్ కోర్టు జడ్జి ఆస్పత్రికి చేరుకొని బాధితురాలి నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు. మరోవైపు బాధితురాలికి పెద్ద ప్రమాదం ఏమీలేదని తేల్చడంతో సుజాత ఆస్పత్రి వైద్యులు తేల్చడంతో... అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి ఆమెను తరలించారు. ఇదిలా ఉండగా తమ కుమార్తెపై హత్యాయత్నం విషయం తెలుసుకున్న రవళి తండ్రి గోపి భార్యతో కలిసి ఆస్పత్రికి వచ్చే సమయంలో రోడ్డు ప్రమాదానికిగురై రవళి చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోనే చేరారు. సోమవారం ఉదయం 9.05 గంటలు దాటింది. తరగతులు ప్రారంభమవుతుండడంతో విద్యార్థులు లోనికి వస్తున్నారు. కళాశాల ప్రధాన ద్వారం గ్రిల్స్ అప్పుడే వేస్తున్నారు. నేను లోపలే ఉన్నాను. ఆ సమయంలోనే బయటికి చూస్తుండగా ప్రదీప్ అనుమానాస్పదంగా వస్తున్నాడు. నాకు అనుమానం వచ్చి బయటికి వెళ్లేందుకు యత్నించా. మా మిత్రులు అడ్డుగా ఉన్నారు. అదే సమయంలో రవళి తలపై ప్రదీప్ వేటకొడవలితో రెండుసార్లు దాడి చేశాడు. ఆమె రక్తపు మడుగులో పడిపోయింది. వెంటనే నేను హెల్మెట్ తీసుకొని అక్కడికి వెళ్లాను. రవళి బతికే ఉందని గ్రహించిన ప్రదీప్ మరోసారి ఆమె మెడపై నరకాలని కసిగా మళ్లీ వస్తున్నాడు. ఆ సమయంలోనే నేను అడ్డుగా వెళ్లాను. నాపై కూడా దాడికియత్నించాడు. నేను హెల్మెట్‌తో అతన్ని కొట్టాను. అనంతరం విద్యార్థులు నాతో కలిశారు. ప్రదీప్‌కు, నాకు పెనుగులాట జరిగింది. ఇంతలోనే తన వెంట తెచ్చుకున్న విషం తాగాడు. ఇది గమనించిన అధ్యాపకులు, విద్యార్థులు ఇద్దరినీ వేర్వేరుగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ పెనుగులాటలో నాకు దెబ్బలు తగల్లేదు. కింద పడడంతో చేతికి నొప్పిగా ఉంది. ఒక్క నిమిషం ఆలస్యంగా వెళ్లినా రవళి చనిపోయేది. -ప్రవీణ్ కుమార్, ల్యాబ్ ఇన్చార్జి నా కళ్ల ముందే దాడి చేశాడు జూనియరైన రవళి నా ముందు నుంచే నడిచి వెళుతోంది. దాదాపు ఉదయం 9.05 గంటల సమయంలో తన వెనుక నుంచి కళాశాల యూనిఫారంలోనే వచ్చిన వ్యక్తి ఒక్కసారిగా బ్యాగ్‌లో నుంచి వేట కొడవలి తీసి రవళి తల, చేతిపై గాయపరిచాడు. ఈ ఘటనతో మేమంతా తీవ్ర భయానికి గురయ్యాం. పక్కనే ఉన్న అధ్యాపకులు, విద్యార్థులు అతన్ని పట్టుకున్నారు. ఇంతలోనే తన వెంట తెచ్చుకున్న విషాన్ని తాగేశాడు. యూనిఫారంలో రావడంతో అతన్ని గుర్తించలేకపోయాం. ఇంకా ఫస్టియర్ విద్యార్థులు చేరుతున్నందున వారికి గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. - లక్ష్మి -
తుడా ప్రాజెక్టుకు కేంద్రం బ్రేక్ !
తుడా పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు రూ.225 కోట్లతో ప్రణాళిక 450 బస్సులు కొనుగోలు చేయాలని ప్రతిపాదించిన అధికారులు జేఎన్ఎన్యూఆర్ఎం కింద ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన కేంద్రం నిధులు విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టు అమలుకు గ్రహణం సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ.. ప్రమాదాలకు చెక్ పెట్టడం.. మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించడం కోసం రూ.225 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టు కింద 450 బస్సులు కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. జేఎన్ఎన్ఆర్ఎం(జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్) కింద ఆ ప్రాజెక్టు అమలుకు కేంద్రం అంగీకరించింది. 2012-13లో 15 బస్సుల కొనుగోలుకు రూ.7.50 కోట్లు, 2014-15లో 25 బస్సుల కొనుగోలుకు రూ.12.50 కోట్లు మంజూరు చేసింది. నిధుల మంజూరులో కేంద్రం పిసినారితనం ప్రదర్శిస్తుండడంతో ప్రాజెక్టు అమలు బాలారిష్టాలను అధిగమించలేకపోతోంది. తిరుపతి నగరంతోపాటు తుడా పరిధిలోని శ్రీకాళహస్తి, చంద్రగిరి, నగరి నియోజకవర్గాల్లోని గ్రామాలు, పట్టణాల్లో జనాభా నానాటికీ అధికమవుతోంది. జనాభా పెరిగిపోతున్న మేరకు రవాణా సదుపాయాలు అభివృద్ధి చెందడం లేదు. తుడా పరిధిలో అవసరమైన మేరకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో అధికశాతం మంది ప్రజలు ఎక్కడికైనా వెళ్లడానికి ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలపై ఆధారపడుతున్నారు. తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు, అప్పలాయగుంటకు భక్తుల తాకిడి నానాటికీ అధికమవుతోంది. ఇది తుడా పరిధిలో ట్రాఫిక్ సమస్య ఏర్పడటానికి దారితీస్తోంది. ట్రాఫిక్ అధికం కావడం వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రమాదాల్లో మరణాల సంఖ్య కూడా రెట్టింపవుతూ వస్తోంది. తుడా పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ, మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడం.. ప్రమాదాల నివారణ కోసం 2011-12లో రూ.225 కోట్లతో ఓ ప్రణాళికను రూపొందించారు. లక్ష జనాభాకు కనీసం 50 బస్సులు అందుబాటులో ఉంచగలిగితే ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చునని తుడా అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు 450 బస్సులు కొనుగోలు చేస్తే తుడా పరిధిలో ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలను కల్పించవచ్చునని భావించారు. ఆ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలపై 2012-13లో కేంద్రం ఆమోదముద్ర వేసింది. 2012-16 మధ్య కాలంలో 225 బస్సుల కొనుగోలు కోసం రూ.112.50 కోట్లు, 2017-2021 మధ్య కాలంలో 113 బస్సుల ఒకనుగోలుకు రూ.56.25 కోట్లు, 2022-31 మధ్య కాలంలో 112 బస్సుల కొనుగోలుకు రూ.56.25 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి ప్రతిపాదించారు. ఆ మేరకు జేఎన్ఎన్యూఆర్ఎం కింద నిధులు మంజూరు చేస్తామని కేంద్రం పేర్కొంది. కానీ.. నిధుల విడుదలలో మాత్రం పిసినారితనాన్ని ప్రదర్శిస్తోంది. 2012-13లో బస్సుల కొనుగోలుకు కేవలం రూ.7.50 కోట్లను మాత్రమే మంజూరు చేసింది. ఆ నిధులతో 15 బస్సులను కొనుగోలు చేశారు. 2014-15లో 25 బస్సుల కొనుగోలుకు రూ.12.50 కోట్లను ఇటీవల విడుదల చేసింది. మరో రెండేళ్లలో 180 బస్సుల కొనుగోలుకు రూ.90 కోట్లను విడుదల చేయాల్సి ఉంది. కానీ.. ఆ మేరకు నిధులు విడుదల చేసే అవకాశాలు కనిపించడం లేదని తుడా అధికారవర్గాలు వెల్లడించాయి. బస్సుల కొనుగోలుకు నిధులు విడుదల చేయాలని కేంద్రానికి పదే పదే లేఖలు రాసినా ప్రయోజనం కన్పించడం లేదని అధికారులు చెబుతుండడం గమనార్హం. -
‘మరుగు’ ఉంటేనే పథకాలు
20 మండలాల్లో ఐపీపీఈ అమలు 476 పంచాయతీలకు ప్రయోజనం ఐదేళ్ల ప్రణాళిక అమలుకు కేంద్రం సిద్ధం డ్వామా పీడీ శ్రీరాములు కంఠారం(కొయ్యూరు) ప్రతి ఇంటా మహిళలు వ్యక్తిగత మరుగుదొడ్లను విధిగా నిర్మించుకుంటేనే, ఆ ఇంటికి సంబంధించి మిగిలిన ఏ అభివృద్ధి పథకానికైనా కేంద్రం నిధులిస్తుందని, లేకుంటే భవిషత్తులో ప్రభుత్వ సాయం అందే అవకాశం లేదని డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్ శ్రీరాములు స్పష్టం చేశారు. మండలంలోని కంఠారంలో నిర్వహించిన సమగ్ర భాగస్వామ్య ప్రణాళిక ప్రక్రియ 2014-15పై నిర్వహించిన సమావే శంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రణాళిక అమలుకు జిల్లాలో 20 మండలాలను ఎంపిక చేశారని, ఇందులో మన్యంలోని 11 మండలాలనూ ఎంపిక చేయడం ద్వారా చాలావరకు పేదరిక నిర్మూలన అవకాశం ఉంటుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 476 పంచాయతీల్లో ఐదేళ్లపాటు ఇది అమలవుతుందన్నారు. అభివృద్ధి పనుల ఎంపిక ఇలా! ఇందులో భాగంగా ప్రతి పంచాయతీలోనూ మూడు రోజులపాటు సిబ్బంది ఉండి ప్రణాళికలను రూపొందిస్తారని డ్వామా పీడీ శ్రీరాములు తెలిపారు. వాటిని చిత్రాల రూపంలో ఉంచి ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. రోడ్లు, భవనాలు, పంట పొలాలకు రోడ్లు లేదా కాలువలు లాంటి వాటిని ప్రణాళికలో పెట్టవచ్చన్నారు. పంచాయతీకి అవసరమైన అన్ని అభివృద్ధి పనులనూ దీనిలో చేర్చవ చ్చన్నారు. వ్యక్తులు, గ్రామ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. బహిరంగ విసర్జన కారణంగా ప్రతి వెయ్యి మందిలోనూ 30 మంది పిల్లలు మరణిస్తున్నారని చెప్పారు. ఈ పథకంలో చేపట్టాల్సిన పనులను అదనపు పీడీ ఆనందరావు వివరించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యుడు గాడిశ్రీరామమూర్తి గ్రామ సమస్యలను వివరించారు. ఎంపీడీవో గోపాలరావు, ఏపీవో పవన్‌కుమార్, ఎంపీటీసీ సభ్యురాలు మంజే సత్యవతి, సర్పంచ్ గంగాభవాని, గాడి సత్తిబాబు, పైల గంగరాజు, సాంబశివరావు పాల్గొన్నారు. -
‘మెట్రో’కు పటిష్ట భద్రత
‘ప్రత్యేక ఠాణా’పై హెచ్ఎంఆర్ ఎండీ, సైబరాబాద్ కమిషనర్ చర్చ మెట్రో స్టేషన్ల పరిశీలన సాక్షి,సిటీబ్యూరో: మెట్రో రైలు స్టేష న్లు, డిపోలు, కారిడార్ భద్రత కో సం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చే యనున్న ప్రత్యేక పోలీసుస్టేషన్ విధివిధానాలపై సైబరాబాద్ పోలీస్ క మిషనర్ సీవీ ఆనంద్, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి గురువారం చ ర్చించారు. నాగోల్-మెట్టుగూడ రూట్లో మెట్రో స్టేషన్లు, ఉప్పల్ మె ట్రో డిపో, మెట్రో కారిడార్‌లో భ ద్రతా ఏర్పాట్లను ఇద్దరూ పరిశీలించారు. మెట్రో భద్రత కోసం తాము రూపొందించిన ప్రణాళికను త్వరలో హెచ్ఎంఆర్కు అందజేస్తామని ఈ సందర్భంగా సీవీ ఆనంద్ తెలిపారు. ఉప్పల్ మెట్రో డిపో, ఆపరేషన్ కం ట్రోల్ సెంటర్, నాగోల్-మెట్టుగూడ 8 కి.మీ మార్గంలోని ఏడు మెట్రో స్టేషన్లలో భద్రతా ఏర్పాట్లను కమిషనర్ పరిశీలించారు. మెట్రో స్టేషన్లలో అడుగడుగునా సీసీటీవీలతో నిఘా ఏర్పాటు చేస్తామని ‘మెట్రో’ ఎండీ తెలిపారు. భద్రతా సిబ్బంది లేని చోట సెన్సార్లు, సెక్యూరిటీ అలారం లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆటోమేటిక్ టికెట్ జారీ యంత్రాల వద్ద తనిఖీలతో పాటు బ్యాగేజీ స్కానర్లు ఏర్పాటు చేస్తామన్నారు. స్టేషన్లను నిరంతరం పహరా కాసేందుకు వాచ్టవర్లుతో పాటు డిపోలోనూ కట్టుది ట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నా రు. భారీగా ప్రయాణికులు మెట్రో స్టేషన్లకు వచ్చినపుడు రద్దీని ఎలా క్రమబద్దీకరించవచ్చో మెట్రో ఎండీ కమిషనర్‌కు వివరించారు. ప్రయాణికుల కోసం ఏర్పా టు చేయనున్న పార్కింగ్, ఇతర సదుపాయాలను ఉన్నతాధికారులిద్దరూ పరిశీలించా రు. వారి వెంట సైబరాబాద్, హెచ్ఎంఆర్ ఉన్నతాధికారులున్నారు. -
రూ.32.47కోట్ల పనులకు జెడ్పీ ఆమోదం
బీఆర్జీఎఫ్ ప్రణాళికపై ప్రత్యేక సర్వసభ్య సమావేశం అసంపూర్తి పనులను పక్కనపెట్టి కొత్తవాటికి ప్రతిపాదనలు కలెక్టర్ సూచనలనూ పట్టించుకోని సభ్యులు జిల్లా పరిషత్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బీఆర్జీఎఫ్ పథకం కింద జిల్లాలో రూ.32.47కోట్లతో 1986 పనులు చేపట్టేందుకు రూపొందించిన ప్రణాళికలు జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆమోదించా రు. ఇందులో గ్రామ పంచాయతీ సెక్టార్ కింద 1025 పనులు చేపట్టేందుకు రూ.1140.86లక్షలు, మండల పరిషత్ సెక్టార్ కింద 668 పనులకు రూ.684.51లక్ష లు, జెడ్పీ సెక్టార్ కింద 228 పనులకు రూ.456.34లక్షలు, అర్బన్ పరిధిలోని మునిసిపాలి టీలు, నగర పంచాయతీలు, వరంగల్ కార్పొరేషన్లలో 65పనులకు రూ.965.29లక్షలు కేటాయిం చారు. బీఆర్జీఎఫ్ ప్రణాళిక అమోదం కోసం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ అధ్యక్షతన బుధవారం ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ 2014-15 ఆర్థిక సంవత్సరంలో బీఆర్జీఎఫ్ పథకం కింద చేపట్టనున్న పనుల ప్రతిపాదనలను ఆమోదం కోసం సమావేశంలో ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. జెడ్పీ ఇన్చార్జ్ సీఈఓ వాసం వెంకటేశ్వర్లు మాట్లాడు తూ బీఆర్జీఎఫ్ పథకం కింద జిల్లాకు రూ.32.47కోట్లు కేటాయించారని, ఇందులో రూరల్ లో పంచాయతీ, మండల, జెడ్పీ సెక్టార్లకు రూ.22.81కోట్లు, అర్బన్‌లో మున్సిపాలిటీ, నగర పంచాయతీలతో పాటు వరంగల్ కార్పొరేషన్‌కు రూ.965.29లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో అసంపూర్తిగా ఉన్న పనులు కాకుండా కొత్తగా సీసీరోడ్లు, సైడ్ డ్రెయిన్లు ప్రతిపాదించినందున రాష్ట్ర స్థాయి కమిటీలో తిరస్కరణకు గురయ్యే అవకాశాలున్నాయని కలెక్టర్ తెలిపినట్లు సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. దీనిని వ్యతిరేకించిన సభ్యులు జెడ్పీటీసీలుగా ఎన్నికై క్యాంపుల్లో ఉన్నప్పుడు ప్రతిపాదనలు తీసుకున్నారని, ఇప్పుడు మళ్లీ మార్చాలనడం సరికాదన్నారు. అసలు గ్రామాల్లో అభివృద్థి పనులంటేనే సీసీ రోడ్లు, సైడ్ కాల్వలని, ప్రతిపాదనలను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశా రు. ఈ క్రమంలో ప్రస్తుతం రూపొందించిన ప్రణాళికలకు యథావిధిగా ఆమోదం తెలుపుతున్నట్లు జెడ్పీ వైస్ చైర్మన్ చెట్టుపల్లి మురళి, టీఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఫ్లోర్ లీడ ర్లు సకినాల శోభన్, మూలగుండ్ల వెంకన్న, శివశంకర్ తెలిపారు. దీంతో ప్రణాళికలను జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆమోదించినట్లు చైర్పర్సన్ పద్మ ప్రకటించారు. ముఖ్యమైన ఈ సర్వసభ్య సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఈ పనులకు డీపీసీలో ఆమోదం లభించాల్సి ఉంది. -
ఉచిత విద్యకు ప్రణాళికలు రూపొందించాలి
విద్యాపరిరక్షణ కమిటీ ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి డీఎస్‌యూ ఆధ్వర్యంలో సదస్సు కేయూ క్యాంపస్ : సరైన ప్రణాళిక లేకుండా నే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని సీఎం కేసీఆర్ హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విద్యాపరి రక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.నర్సిం హారెడ్డి విమర్శించారు. డెమోక్రటిక్ స్టూడెం ట్స్ యూనియన్ (డీఎస్‌యూ) ఆధ్వర్యంలో ‘తెలంగాణ విద్యారంగం, భవిష్యత్ లక్ష్యాలు - కార్యాచరణ’ అంశంపై హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ సెమినార్‌హాల్‌లో శనివారం స దస్సు నిర్వహించారు. ఈ సదస్సులో నర్సిం హారెడ్డి మాట్లాడుతూ సీఎం చెప్పిన మాటల ప్రకారం ఉచిత విద్య కొందరికే చేరువయ్యే అవకాశముందన్నారు. సాధ్యాసాధ్యాలను సరిగా పరిగణనలోకి తీసుకోకుండా ప్రకట నలు చేయడం కాకుండా.. స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఇక కార్పొరేట్ విద్యాసంస్థలపై ప్రభుత్వం ఇంత వరకు తన వైఖరి ప్రకటించలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎంఈఓ పోస్టులతో పాటు కళాశాలల్లో ఖాళీల ను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం పాఠ్యాం శాల్లో వేదాలు, ఉపనిషత్తులను చేర్చి మనువాద రాజ్య స్థాపనకు కుట్ర పన్నుతోందని విమర్శించారు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు చేపట్టకుండా.. రేషనలైజేషన్ పేరి ట వేలాది స్కూళ్ల మూసివేతకు కుట్ర పన్నారని ఆరోపించారు. సదస్సులో డీఎస్‌యూ రాష్ట్ర అ ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కంచర్ల బద్రి, అరుణాంక్‌తో పాటు సంపత్‌రెడ్డి, జేసీ.పాణి, అమృతరాజు, సిద్ధార్థ, శ్రావణ్, జనార్దన్, అవినాష్, అనిల్, సదయ్య, శివ, నగేష్, భాస్కర్, శ్రీకాంత్, సురేష్, ప్రేంసాగర్ పాల్గొన్నారు. -
పర్యాటక శోభ
ఆదాయం పెంపునకు మార్గాల అన్వేషణ కొత్త ప్రాజెక్టులకు ఆలోచన టూర్ ప్యాకేజీల రూపకల్పన సాక్షి, విజయవాడ : కొత్త రాష్ట్రానికి విజయవాడ రాజధాని కావడంతో ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు తరలివస్తే వాటిలో పనిచేసే ఉద్యోగులూ ఇక్కడకు వచ్చేస్తారని, దీంతో వివిధ పనుల కోసం వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతుందని, తద్వారా పర్యాటక రంగానికి డిమాండ్ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. దీనికితోడు ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచాలంటూ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రక టించడంతో ప్రణాళికల తయారీ మరింత వేగవంతమైంది. జిల్లా చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలను కలిపి ఒక సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొండపల్లి ఖిల్లా, కూచిపూడి నృత్య ప్రదర్శనశాల, మంగినపూడి బీచ్, పెడన చేనేత వస్త్రాలు తదితర సందర్శనీయ ప్రదేశాలను కలిపి సర్క్యూట్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే పర్యాటకులు నగరంలో ఒక్కరోజు ఉండాల్సి వస్తే వారు జిల్లాలో ముఖ్యమైన కేంద్రాలను చూసే విధంగా టూర్ ప్యాకేజీ సిద్ధం చేస్తున్నారు. కొండపల్లి బొమ్మ... కూచిపూడి నృత్యం... కొండపల్లి బొమ్మల తయారీపై పర్యాటకులకు చక్కటి అవగాహన కల్పించడంతో పాటు వారు షాపింగ్ చేసుకునే విధంగా షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నారు. దీనికిగాను మంజూరైన రూ.1.25 కోట్ల నిధులతో కొండపల్లి ఖిల్లాపై మౌలిక సదుపాయాలు కూడా కల్పించనున్నారు. కూచిపూడి గ్రామంలోనూ మౌలిక సదుపాయాలు పెంచి అక్కడ కళాకారులతో నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఏపీటీడీసీ అధికారులు యోచిస్తున్నారు. కొత్త బస్సుల కోసం ప్రతిపాదనలు టూర్ ప్యాకేజీలో భాగంగా పర్యాటకులను తీసుకెళ్లేందుకు ప్రస్తుతం విజయవాడలో ఒక్క బస్సు మాత్రమే ఉంది. అదనంగా మరో నాలుగు బస్సులు కావాలంటూ పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చందనాఖాన్ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అవి వస్తే విజయవాడ కేంద్రంగా సూర్యలంక, తిరుపతి, అరకు, మంత్రాలయం, కర్నూలు, కడప తదితర ప్రాంతాలకు ప్యాకేజీలు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. వారాంతంలో రెండేసి రోజుల చొప్పున ప్యాకేజీ టూర్లు ఏర్పాటు చేస్తే డిమాండ్ బాగుంటుందని అంచనాలు వేస్తున్నారు. విజయవాడ కేంద్రంగా ఈ ప్రాజెక్టులను సిద్ధం చేస్తే చుట్టుపక్కల జిల్లాల ప్రజలు ఉపయోగించుకుంటారని యోచిస్తున్నారు. స్పందన నామమాత్రమే.. ప్రస్తుతం ఉన్న బస్సు జూలైలో వచ్చింది. ఇది విజయవాడ-గుంటూరు మధ్య ముఖ్యమైన ప్రదేశాలను చూపిస్తోంది. 18 సీట్లు ఉన్న ఈ బస్సులో వారాంతంలో పది పన్నెండుమంది, సాధారణ రోజుల్లో ఐదుగురు చొప్పున మాత్రమే ప్రయాణిస్తున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రదేశాల కంటే సూర్యలంక బీచ్ చూపిస్తే బాగుంటుందని పలువురు ప్రయాణికులు సూచించినట్లు తెలిసింది. ఈ బస్సుకు డిమాండ్ పెంచేందుకు బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులను కలిసి.. వారిని వినియోగించుకోవాలంటూ ఏపీటీడీసీ అధికారులు కోరుతున్నారు. ఇప్పటి వరకు రూ.66 వేల ఆదాయం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. 27 నుంచి పర్యాటక దినోత్సవాలు రాష్ట్రం విడిపోయిన తరువాత తొలిసారిగా పర్యాటక దినోత్సవం ఈ నెల 27న జరగనుంది. 27 నుంచి 30 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా భవానీ ద్వీపం, బెర్హం పార్కులలో వివిధ రకాల చేనేత కళాకారులతో దుకాణాలు, వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పర్యాటక దినోత్సవం సందర్భంగా కొత్త ప్యాకేజీలను ప్రకటించాలని ఏపీటీడీసీ ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. విజయవాడ నుంచి తిరుపతికి ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రయాణికులను తీసుకువెళ్లి స్వామి దర్శనంతో పాటు కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను చూపించి తీసుకువచ్చే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఇదే తరహాలో మరికొన్ని ప్యాకేజీలు కూడా రానున్నట్లు సమాచారం. -
ప్రణాళికతో లక్ష్యం సుసాధ్యం
జిల్లా అదనపు జడ్జి బి.రామారావు కైకలూరు : ప్రణాళికాబద్ధంగా లక్ష్యాన్ని నిర్ధారించుకుని కష్టపడి పనిచేస్తే విజయం తనంతట తానే వరిస్తుందని జిల్లా 11వ అధనపు జడ్జి బొడ్డెపల్లి రామారావు చెప్పారు. కైకలూరు కోర్డులో అందుతున్న సేవలు, రికార్డులను వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. బార్ అధ్యక్షులు గురజాడ ఉదయశంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్జి మాట్లాడుతూ సమాజంలో న్యాయవ్యవస్థ ఎంత సమర్థవంతంగా పనిచేస్తే పరిపాలన అంత బాగుంటుందన్నారు. న్యాయవాద వృత్తి ఎంతో పవిత్రమైనదని చెప్పారు. వీరికి నాణేనికి రెండు వైపుల మాదిరిగా... కేసుకు సంబంధించి రెండు పక్షాల వాదనలు తెలుస్తాయన్నారు. ఎప్పటి కప్పుడు మారుతున్న చట్టాలను లాయర్లు అవగాహన చేసుకోవాలని కోరారు. బార్ సభ్యులు రెండు నెలలకు ఒక పర్యాయం శిక్షణా తరగతులు నిర్వహించుకుంటే వృత్తి నైపుణ్యం మరింత పెరుగుతుందన్నారు. పూర్వకాలంలో వ్యాసమహర్షి రచించిన గ్రంథంలో న్యాయవ్యవస్థ గురించి చక్కగా వివరించారన్నారు. బ్రిటీష్ పాలకులు వాటిని అధ్యయనం చేసి ఇంగ్లిష్‌లో తర్జుమా చేశారని చెప్పారు. వేద కాలం నుంచే చట్టాలు భారతదేశంలో ఉన్నాయని, శ్లోకాలతో సహా ఉదాహరణలతో ఆయన వివరించడం ఆకట్టుకుంది. సీనియర్ న్యాయవాధులు తుమ్మలపల్లి బాలకృష్ణారావు, గొర్తి ప్రభాకరదీక్షితులు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. కైకలూరు కోర్టు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ జి.లక్ష్మీ వరప్రసాద్, ఏపీపీ బాబురావు, ఏజీపీ కారే శరత్‌బాబు, ప్రభుత్వ ఉచిత న్యాయ సలహాదారు మోరు శ్రీనివాసరావు, సీఐ డి.వెంకటేశ్వరరావు, టౌన్ ఎస్సై దాడి చంద్రశేఖర్, న్యాయవాధులు ఏవీ.రమణ, టి.శ్రీనివాసరావు, విఎస్ఆర్.మూర్తి, బి.ప్రసాదరావు, ఆర్.రత్నారావు, ఇందిరా, లక్ష్యణరావు, ఎంఎస్ఎస్.రాజు, పవన్ పాల్గొన్నారు. కొల్లేరు పక్షుల అందాలు అద్భుతం... ఆటపాక పక్షుల కేంద్రం వద్ద పక్షులు ఎంతో అద్భుతంగా ఉన్నాయని జడ్జి బి.రామారావు అన్నారు. కైకలూరు కోర్డు తనిఖీ నిమిత్తం వచ్చిన ఆయన ఆటపాక పక్షుల కేంద్రాన్ని సందర్శించారు. బోటు షికారు చేసి పక్షుల ఆందాలను దగ్గరుండి తిలకించారు. శ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. -
యలమంచిలికి మహర్దశ!
సమగ్రాభివృద్ధికి ఎంపిక నివేదిక రూపకల్పనలో యంత్రాంగం యలమంచిలి : యలమంచిలి పట్టణ సమగ్రాభివృద్ధికి రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో పెలైట్ ప్రాజెక్టుగా యలమంచిలిని ఎంపిక చేసి మౌలిక వసతుల కల్పనపై నివేదిక తయారు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా ముఖ్య ప్రణాళికా విభాగం, గణాంకశాఖలు నివేదికలు రూపొందించే పనిని చేపట్టారు. పట్టణంతో పాటు విలీన గ్రామాల్లో ఏఏ అంశాలతో నివేదిక సిద్ధం చేయాలో ప్రభుత్వం నిర్ణీత ఫార్మాట్‌ను పంపించింది. శనివారం యలమంచిలి వచ్చిన ముఖ్య ప్రణాళికా విభాగం, గణాంక శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్ ఎస్. శ్రీనివాసరావు, యలమంచిలి ఎంపీడీవో బి.శ్రీనివాసరావుతో చర్చించారు. యలమంచిలి విస్తీర్ణం, భౌగోళిక స్థితిగతులు, విలీన గ్రామాల పరిస్థితులను బట్టి ఏ అభివృద్ధి పనులు చేపడితే ఉపయోగం ఉంటుందో ఆరా తీశారు. అనంతరం మండల పరిషత్ సమావేశ మందిరంలో చైర్పర్సన్ పిళ్లా రమాకుమారి అధ్యక్షతన వార్డు సభ్యులు, డ్వాక్రా సంఘాల ప్రతినిధులు, పట్టణ పేదరిక నిర్మూలనా విభాగం, వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 8, 9 తేదీల్లో పెలైట్ ప్రాజెక్టు నివేదిక కోసం సర్వేకు మున్సిపల్ అధికారులు సన్నద్ధమవుతున్నారు. వార్డు స్థాయిలో సమావేశాలు నిర్వహించి జనాభా, ఇళ్లు, అద్దె ఇళ్లలో ఉంటున్న వారి వివరాలు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, విద్యాసంస్థలు, ఇతర మౌలిక వసతుల వివరాలను సేకరించనున్నారు. ఇందుకోసం వార్డు సభ్యుని అధ్యక్షతన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. సర్వే పక్కాగా చేపట్టేందుకు ఈ బృందాల్లో సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. యలమంచిలిలో తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుకు మున్సిపల్ పాలకవర్గం పెలైట్ ప్రాజెక్టును వినియోగించుకోవాలని భావిస్తోంది. నివేదికలు పూర్తయి కార్యరూపం దాల్చితే యలమంచిలి అభివృద్ధి పథంలో పయనించే అవకాశం ఉంది. -
సమష్టిగా జిల్లా అభివృద్ధి
వరంగల్‌లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ భూపాలపల్లిలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ వరంగల్ పార్లమెంట్ సభ్యుడు కడియం శ్రీహరి ప్రణాళిక సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణలో అభివృద్ధి పరంగా జిల్లాను ప్రత్యేక స్థానంలో నిలపడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని వరంగల్ లోక్‌సభ సభ్యుడు కడియం శ్రీహరి అన్నారు. మహబూబాబాద్ ఎంపీ ఆజ్మీరా సీతారాంనాయక్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావులతో కలిసి శ్రీహరి ఆదివారం టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధికి అన్ని పార్టీల నేతలను కలుపుని కృషి చేస్తామన్నారు. ఇందుకోసం సోమవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పని చేసిన జేఏసీల నేతలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ప్రజల పోరాటాలు, అమరుల త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదని, అభివృద్ధి, సంక్షేమం ముసుగులో జిల్లాను దోపిడీ చేశారని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన టీఆర్ఎస్కు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలి పారు. గతంలో రాష్ట్ర మంత్రిగా పని చేసిన అనుభవంతో వరంగల్ లోక్‌సభ సభ్యుడిగా తాను జిల్లా అభివృద్ధికి కృషి చేయనున్నట్లు వివరించారు. ఎన్నికల తర్వాత లోక్‌సభ సభ్యుడిగా అభివృద్ధి ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. బిల్ట్‌ను కాపాడుతాం : ఎంపీ సీతారాంనాయక్ జిల్లాలో ఏకైక పెద్ద పరిశ్రమ బల్లాపూర్ ఇండస్ట్రియల్ లిమిటెడ్(బిల్ట్) పరిశ్రమను మూతపడకుండా చర్యలు తీసుకుం టామని మహబూబాబాద్ ఎంపీ ఆజ్మీరా సీతారాంనాయక్ చెప్పారు. 10వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ పరిశ్రమ ఉత్పత్తి చేసే కాగితపు గుజ్జు(పల్ప్) విక్రయాలకు ఇబ్బందు లు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా బిల్ట్ నుంచి కాగితపు గుజ్జును ఈ రంగంలోని సంస్థలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. గుండాల-ఇల్లెందు రహదారి మంజూరుకు అడ్డంకిగా ఉన్న 14 ఎకరాల అటవీ భూముల సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, మార్నేని రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. దేవాదుల ఎత్తిపోతల పథకానికి ఇప్పటి వరకు రూ.ఏడు వేల కోట్లు ఖర్చు చేసినా ఏడు ఎకరాలకు సైతం నీళ్లివ్వలేదు. వచ్చే మూడేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. వర్ధన్నపేట, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో 3లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. రాంసాగర్ ప్రాజెక్టు, దేవాదుల పరిధిలోని ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించిన కంతనపల్లి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తాం. భారీ నీటిపారుదల ప్రాజెక్టులనే కాకుండా చెరువుల అభివృద్ధికి, వాగులపై చెక్‌డ్యాంల నిర్మాణానికి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్‌లో ప్రతిష్టాత్మక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బ్రాంచ్‌ను ఏర్పాటు చేయాలని ఆ సంస్థను కోరాము. 40 ఎకరాల భూములు అవసరమని అడిగారు. భూములను గుర్తించే ప్రక్రియ మొదలుకానుంది. ఉన్నత ప్రమాణాలు ఉండే ఈ స్కూల్‌తో జిల్లాలోని ఉద్యోగులు, ఇతరుల పిల్లలకు మెరుగైన విద్య అందనుంది. హైదరాబాద్-వరంగల్-భూపాలపల్లి ప్రాంతాన్ని పారి శ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. బొగ్గ గనులు ఉండి పరిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న భూపాలపల్లిలో అనుబం ధ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని జవహర్‌లాల్‌నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని(జేఎన్టీయూ -హైదరాబాద్) కోరాము. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రకారం తెలంగాణ లో ఏర్పాటు చేయనున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థను వరంగల్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. విద్యారంగానికి కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం సంస్థ ఏర్పాటుకు అనువుగా ఉంటుంది. ఆజంజాహి మిల్లు మూతపడిన తర్వాత జిల్లాలో పరిశ్రమ లు ఏర్పాటు కాలేదు. నిరుద్యోగ యువత ఉపాధి లేక అవస్థలు పడుతోంది. జిల్లాలో కొత్తగా కాంపోజిట్ టెక్స్టైల్ మిల్లు ఏర్పాటు చేయాలని కేంద్ర జౌళిశాఖ మంత్రిని కోరాము. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన మంత్రి మోడీకి లేఖ రాశారు. ఈ మిల్లు జిల్లాలోనే ఏర్పాటు చేసేలా కృషి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్, తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ అంశాలు ఉన్నాయి. కోచ్ ఫ్యాక్టరీని జిల్లాలోనే ఏర్పాటు చేయాలని, అలాగే కాజీపేటను రైల్వే డివిజన్‌గా చేయాలని రైల్వే మంత్రిని కోరాము. రైల్వే వ్యాగన్ వర్క్‌షాప్ ఏర్పాటుకు సాంకేతిక అంశాలే అడ్డంకిగా ఉన్నాయి. వర్క్‌షాప్ ప్రదిపాదిత భూములకు పాతచట్టం ప్రకారం పరిహారం ఇచ్చారు. కొత్త చట్టం ప్రకారం పరిహారం ప్రక్రియ పూర్తి చేస్తే ఈ అంశం ముగిసిపోతుంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న 100 స్మార్ట్ సిటీల్లో వరంగల్ నగరం ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం. విస్తరిస్తున్న వరంగల్ నగర అవసరాలకు అనుగుణంగా అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ముఖ్యమంత్రిని కోరాం. ఇది ప్రస్తుతం రోడ్లు, భవనాల శాఖ పరిధిలో ఉంది. కరెంటు అవసరాలను తీర్చేందుకు భూపాలపల్లిలో త్వర లోనే 660 మెగావాట్ల సామర్థ్యంతో రెండు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం వచ్చే ఏడాది ప్రారంభించనున్నాం. -
అగ్ర పథాన విశాఖ
సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక మెగా సిటీగా విశాఖ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు అక్టోబర్‌లో అరకు ఉత్సవ్ స్వాతంత్య్ర దినోత్సవంలో మంత్రి అయ్యన్న వెల్లడి విశాఖపట్నం : విశాఖ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో అగ్రగామిగా నిలపడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. విశాఖ నగరాన్ని మెగా సిటీగా, ప్రధాన ఆర్థిక కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. మెట్రోరైలు, అంతర్జాతీయ విమానాశ్రయం, పర్యాటక, ఐటీ ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టి పెట్టామన్నారు. ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులకు అనుమతులకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఐఐఎంతో పాటు మరికొన్ని జాతీయ స్థాయి విద్యా సంస్థలను నెలకొల్పి ఉన్నత విద్యా కేంద్రంగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని తెలిపారు. విశాఖను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో జిల్లా విజన్ డాక్యుమెంట్‌ను 30 రోజుల్లో రూపొందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. కచ్చితంగా రుణ మాఫీ అమలు రైతులు తీసుకున్న పంట రుణాలు, స్వయం సహాయక సంఘాలు తీసుకున్న బ్యాంకు రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా రుణ మాఫీ అమలు చేసి తీరుతామన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం జీవో జారీ చేశారన్నారు. దీని వల్ల జిల్లాలో 90 శాతం మంది రైతులు లబ్ధి పొందుతారన్నారు. 44 వేల 212 స్వయం సహాయక సంఘాలకు చెందిన 5 లక్షల 8 వేల 782 మంది మహిళలకు లబ్ధిచేకూర్చే విధంగా రూ.442.12 కోట్ల రుణ మాఫీ అవుతుందన్నారు. వ్యవసాయంలో అధికోత్పత్తికి పొలం పిలుస్తోంది ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ తక్కువ ఖర్చుతో అధికోత్పత్తులు సాధించేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రూ.93 లక్షల రాయితీపై 18 వేల 334 క్వింటాళ్ల వివిధ రకాలైన విత్తనాలు, 19 వేల 134 మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువులు సరఫరా చేస్తున్నామన్నారు. వివిధ శాఖల శక టాల ప్రదర్శన డ్వామా, ఐసీడీఎస్, ఆర్‌డబ్లూఎస్, సర్వశిక్షా అభియూన్, డీఆర్డీఏ, వ్యవసాయం, వైద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణ శాఖ, జీవీఎంసీ, మెట్రోరైల్ ప్రాజెక్టు, 108 శకటాలను ప్రదర్శించారు. వాటిలో మొదటి బహుమతి వ్యవసాయ శాఖ శకటానికి, ద్వితీయ బహుమతి జీవీఎంసీ మెట్రోరైలు నమూనాకు, తృతీయ బహుమతి డీఆర్డీఏ, నాల్గవ బహుమతి జిల్లా నీటియూజమాన్య సంస్థ శకటానికి, ఐదో బహుమతి ఐసీడీఎస్-అంగన్వాడీ శకటాలకు దక్కాయి. స్వాతంత్య్ర సమరయోధునికి సన్మానం స్వాతంత్య్ర సమరయోధుడు, క్విట్ ఇండియూ ఉద్యమకర్త కె.అప్పారావును మంత్రి అయ్యన్న ఘనంగా సన్మానించారు. అనంతరం కార్యక్రమానికి హాజరయిన న్యాయూధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, పోలీస్ అధికారులను కలిసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అలరించిన సాంస్కతిక కార్యక్రమాలు సాంస్కతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ఎస్.రాయవరం మండలం ఒమ్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రద ర్శించిన మల్లకంభ చూపరులను ఆకట్టుకుంది. సేక్రెట్ హార్ట్, పోలాక్, పెన్ స్కూల్, మధురవాడ విజయం స్కూల్, అల్లిపురం ప్రియూంకా విద్యోదయ హైస్కూల్, మేహాద్రిగెడ్డ ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ, గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ సేవలకు పురస్కారాలు జిల్లాలో పలు శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందితో పాటు సేవా, క్రీడా రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన 222 మందికి రాష్ట్ర స్థాయి పురస్కారాలతో పాటు జిల్లా స్థాయిలో పురస్కారాలను మంత్రి అయ్యన్నపాత్రుడు అందజేశారు. అవార్డులు పొందిన వారిలో రెవెన్యూ, జీవీఎంసీ, వాణిజ్య పన్నులు, వుడా, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక శాఖ, సమాచార, పౌర సంబంధాలు, పోలీస్, ఫైర్ తదితర శాఖల్లో పనిచేస్తున్నవారున్నారు. వారితో పాటు 2013లో ఉత్తమ ప్రతిభా పురస్కారాలు అందుకున్న పోలీస్ అధికారులను ఘనంగా సత్కరించారు. రూ.25.69 కోట్ల ఆస్తుల పంపిణీ జిల్లాలో వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ పథకాల ద్వారా రూ.25.69 కోట్ల మేర ఆస్తులను 9 వేల 514 మందికి లబ్ధి చేకూర్చే విధంగా మంత్రి అయ్యన్నపాత్రుడు పంపిణీ చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా రూ.25 కోట్లు, డ్వామా ద్వారా రూ.16.61 లక్షలు, వ్యవసాయశాఖ ద్వారా రూ.1.80 లక్షలు, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా రూ.11 లక్షలు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.32.26 లక్షలు, వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా రూ.7.71 లక్షల విలువైన ఆస్తులను అందజేశారు. -
పరిమితం....సతమతం!
ప్రణాళికల్లో 50 ప్రతిపాదనలకే పరిమితం పంచాయతీలో మూడు, మండలంలో పది పనులు జెడ్పీలో మండలానికి ఒకటి చొప్పున అవకాశం ఇప్పటికే రూ.18 వేల కోట్లకు చేరిన అంచనాలు కుదించిన పనులతో మల్లగుల్లాలు పడుతున్న జెడ్పీ చైర్పర్సన్, అధికారులు సాక్షి ప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ప్రణాళికల్లో పొందుపరిచే ప్రతిపాదనల విషయంలో జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు వచ్చిపడ్డాయి. జిల్లా స్థాయి ప్రణాళికలో చేర్చే అభివృద్ధి పనుల ప్రతిపాదనలను ప్రభుత్వం 50కి పరిమితం చేస్తూ ఆదేశాలు జారీచేయడమే ఇందుకు కారణం. జిల్లాలో 50 మండలాలు ఉన్నాయి. ఈ లెక్కన 50 మంది జెడ్పీటీసీ సభ్యులు ఇచ్చే ఒక్కో ప్రతిపాదనతోనే జిల్లాకు కేటాయించే కోటా పూర్తవుతుంది. ఇది వారికి చిక్కులు తెచ్చిపెట్టగా... పనుల ప్రతిపాదనలను పరిమితం చేయడం వల్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చాన్స్ లేకుండా పోయింది. గ్రామానికి మూడు పనులు... జిల్లాల సమగ్రాభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘మన ఊరు-మన ప్రణాళిక, మన మండలం-మన ప్రణాళిక, మన జిల్లా-మన ప్రణాళిక రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గ్రామ, మండల స్థాయిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించింది. అదేవిధంగా జిల్లాస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి పనుల ప్రతిపాదనలు సేకరించింది. ఈ మేరకు కుప్పలు తెప్పలుగా సిఫార్సులు వచ్చిపడ్డాయి. అభివృద్ధి పనుల అంచనా వ్యయం రూ.18 వేల కోట్లకు చేరింది. ఈ క్రమంలో ప్రణాళికల ప్రతిపాదనల్లో పరిమితి విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా... రాష్ట్ర గ్రామీణాభి వృద్ధిశాఖ నుంచి జిల్లా అధికార యంత్రాంగానికి సూచనలు అందాయి. ఇందుకనుగుణంగా మన ఊరు-మన ప్రణాళికల్లో ప్రతి ఆవాస ప్రాంతానికి మూడు పనులు... మన మండలం-మన ప్రణాళికలో పది పనులను మాత్రమే ప్రతిపాదించే విధంగా వెబ్సైట్లో పొందుపర్చారు. గ్రామ సభలు నిర్వహించిన సమయంలో పనుల ప్రతిపాదనలను మొదటి, రెండో, మూడో ప్రాధాన్యాన్ని బట్టి పేర్కొనాలని ప్రజాప్రతినిధులకు అధికారులు సూచించారు. ఈ లెక్కన మొదటి మూడు ప్రాధాన్యతా క్రమంలోని పనులను మాత్రమే మన ప్రణాళిక వెబ్సైట్లో అప్లోడ్ చేశారన్న మాట. దీంతో గ్రామ సభల్లో ప్రజలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు చేసిన సిఫారసులు నివేదికల్లో చోటుదక్కించుకునే విషయంపై అస్పష్టత నెలకొంది. అంచనా వ్యయం రూ.2,570 కోట్లు మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా జిల్లావ్యాప్తంగా 962 గ్రామ పంచాయతీల్లోని 3,461 ఆవాస ప్రాంతాల్లో మూడు పనుల చొప్పున చేసిన ప్రతిపాదనలకు రూ.2,570 కోట్లు అవసరమవుతాయని అధికారులు నిర్ధారించారు. అదే... గ్రామసభల్లో వచ్చిన అన్ని పనులను అప్లోడ్ చేస్తే ప్రతిపాదనల అంచనా వ్యయం భారీగా పెరిగేది. మండల పరిధిలో పది పనులు.. సర్కారు ఆదేశాల మేరకు మండల స్థాయిలో ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు మొదటి ప్రాధాన్యత ఉన్న పనులను గుర్తించారు. ప్రతి మండంలంలో పది పనులను వెబ్సైట్లోకి అప్లోడ్ చేశారు. మిగిలిన పనులను మండల స్థాయిలోనే రిజర్వ్‌లో పెట్టారు. వ్యయ అంచనా రూ.1,391కోట్లు.. 50 మండలాల పరిధిలోని గ్రామాల్లో మండల పరిషత్ ద్వారా చేపట్టే పనులు ప్రతిపాదనలకు రూ.1391 కోట్లు అవసరమవుతాయని అధికారులు తేల్చారు. మన మండలం-మన ప్రణాళిక కోసం నిర్వహించిన మండల సమావేశాల్లో ఎంపీటీసీ సభ్యులు ప్రతిఒక్కరూ వారి పరిధిలోని గ్రామాల్లో పదుల సంఖ్యకుపైనే అభివృద్ధి పనులను ప్రతిపాదించారు. సర్కారు ఆదేశాల మేరకు మండలానికి పది చొప్పున పనులను ఆయూ ప్రాంత ఎంపీడీఓలు మన ప్రణాళిక వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఖరారుకాని జిల్లా ప్రణాళిక... ఇటీవల జరిగిన జిల్లా ప్రణాళిక సమావేశంలో ప్రతి జెడ్పీటీసీ సభ్యుడు 30 పనులను ప్రతిపాదించాలని ఉప ముఖ్యమంత్రి రాజయ్య సూచించారు. ఈ మేరకు ప్రతి జెడ్పీటీసీ సభ్యుడు తన మండల పరిధిలో 30 పనులను ప్రతిపాదించారు. ఇలా.. కుప్పలుతెప్పలుగా ప్రతిపాదనలు వచ్చిపడ్డారుు. జిల్లాలోని 50 మంది జెడ్పీటీసీ సభ్యులు సుమారు 1,557 పనులను గుర్తించారు. వీటికి సుమారుగా రూ.14 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అరుుతే... మన ప్రణాళిక వెబ్సైట్లో కేవలం 30 పనులు మాత్రమే అప్లోడ్ చేసే అవకాశం ఉంది. ఈ విషయూన్ని ఉప ముఖ్యమంత్రి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. దీంతో ప్రతిపాదనలను చైర్పర్సన్ క్యాంపు కార్యాలయానికి పంపించాలని, వాటిలో నుంచి 30 పనులను ఖరారు చేయాలని రెండు రోజుల క్రితం జిల్లా పరిషత్ అధికారులకు వారు సూచించారు. ఈ పనుల గుర్తింపు కోసం క్యాంపులో కసరత్తు చేస్తున్న క్రమంలోనే గ్రామీణాభివృద్ధి శాఖ గురువారం మరో 20 పనులు అప్లోడ్ చేసే విధంగా వెబ్సైట్లో అవకాశం కల్పించడంతో జిల్లా పరిషత్ అధికారులు కొంతమేర ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని 50 మంది జెడ్పీటీసీ సభ్యులకు ఒక్కొక్క పని ప్రతిపాదించే అవకాశం లభించినట్లయింది. ఈ మేరకు జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులను ఫోన్లో సంప్రదించి మొదటి ప్రాధాన్యత క్రమంలో ఒక పనిని మాత్రమే సూచించాలని జిల్లా పరిషత్ అధికారులు కోరుతున్నారు. ఇలా.. వచ్చిన ప్రతిపాదనల అంచని వ్యయూన్ని లెక్కించి జిల్లా ప్రణాళికలను ఖరారు చేసేందుకు అధికారులు త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. పెద్దలకు నో చాన్స్... జిల్లా ప్రణాళికల్లో భాగంగా తమ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పలు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. జిల్లా ప్రణాళికల్లో 50 పనులకు మాత్రమే అవకాశం ఉండడం వల్ల జెడ్పీటీసీ సభ్యుల ప్రతిపాదనలను మాత్రమే పరిగణనలోకి తీసుకునే అవకాశమున్నట్లు తెలిసింది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వాటిని రాష్ట్ర ప్రణాళికల్లో పొందుపరిచే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
సృజనాత్మక వ్యాపారి..!
ప్రణాళిక ప్రకారం జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవడం ఒక కళ. తీసుకొన్న నిర్ణయంలో నేర్పు, వేసిన ఎత్తులో వ్యూహం, పడిన శ్రమకు ప్రతిఫలం.. కొన్ని జీవితాల్లోని సక్సెస్ పాఠం అది. అయితే మరికొన్ని జీవితాల్లో భిన్నమైన పరిస్థితులుంటాయి. శ్రమ, పోరాటం, ఓటమి, నిరుత్సాహం. అంతటితో ఆగిపోయే వ్యక్తులు కొందరు అయితే... ఆ అపజయాలనే విజయానికి సోపానాలుగా చేసుకొనే వారు మరికొందరు. ఎదురుదెబ్బలను, పరాజయాలను, అవమానాలను తృణప్రాయంగా తీసుకొని జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకొనే స్థితప్రజ్ఞత మరికొందరిలో ఉంటుంది. జీవితానికి, విజయానికి కొత్త నిర్వచనం ఇవ్వగల శక్తిమంతులు వాళ్లు. అలాంటి వారిలో ఒకరు సందీప్ మహేశ్వరి. ఇమేజెస్ బజార్‌తో అద్భుతాలు సాధిస్తున్న యువకుడు. అతడు ఒక మధ్య తరగతి కుటుంబంలోని వాడు. దేశరాజధాని ఢిల్లీలో నివాసం. మనసులో ఎన్నో ఆలోచనలు, మరెన్నో కలలు... అయితే లక్ష్యదిశగా దూసుకెళ్లడానికి తగిన వ్యూహమేలేదు. తండ్రిది అల్యూమినియం వ్యాపారం. బాగానే నడుస్తున్న ఆ వ్యాపారం అనుకోకుండా దెబ్బతిన్నది. ఫలితంగా ఆ కుటుంబంలో ఒక్కసారిగా కుదుపులు. ఆర్థికంగా తీవ్రమైన కష్టాలు. ఏం చేయాలో అర్థం కానిస్థితి. దీంతో చదువుమీద కూడా దృష్టి నిలపలేకపోయాడు, బీకాం చదువును ఫైనలియర్‌లోనే వదిలేశాడు. ఏం చేద్దామనుకొంటున్నావు? అని విధి ప్రశ్నిస్తే... చదుకొంటాను అని సమాధానం ఇచ్చాడు! జీవితాన్ని చదువుతానన్నాడు. అబ్బాయిలు అందంగా ఉంటారా..?! అబ్బాయిల్లో అందమేముంది! అది అమ్మాయిల సొత్తు కదా! అబ్బాయిలు అంతిమంగా ‘హ్యాండ్సమ్’గా ఉంటారు. తను కూడా అలాగే ఉన్నానని అనిపించింది సందీప్‌కు. స్నేహితుల ద్వారా ఉన్న పరిచయాలతో మోడలింగ్‌లో అవకాశాల కోసం ప్రయత్నించాడు. అదృష్టాన్ని వెదుక్కొన్నాడు. అవకాశాలు లభించాయి. అయితే అప్పుడు అర్థం కాలేదు.. పెనం మీద నుంచి పొయ్యిలో పడుతున్నానని! వేధింపులు! పోటీతత్వం ఎక్కువగా ఉంది. కలర్ఫుల్గా, జోష్‌గా కనిపించే ఆ రంగంలో సెటిల్ కావడానికి ప్రయత్నించే అనేకమంది మేల్ మోడల్స్ మధ్య తీవ్రమైన పోటీతో.. సీనియర్ మోడల్స్ తమలాంటి జూనియర్లను తొక్కిపెట్టడానికి ప్రయత్నించేవారట! సందీప్ గ్లామర్ కోసం ఆ ఫీల్డ్‌లోకి రాలేదు. పొట్టకూటి కోసం వచ్చాడు. అక్కడ తనలాగే ‘స్ట్రగులింగ్’ దశలో ఉన్న అనేకమంది యువకులను గమనించాడు. వారందరినీ చూశాక అతడికి ఒక ఐడియా వచ్చింది. చేతికి కెమెరా వచ్చింది. రెండు నెలల్లోనే ఫొటోగ్రఫీ విద్య అబ్బింది. మోడల్‌గా కాదు, కెమెరామెన్‌గా మోడలింగ్ ప్రపంచాన్ని మార్చేస్తానని అన్నాడు! అయితే ఆ ప్రయత్నం ఆరు నెలల్లో అతడి అడ్రస్‌ను మార్చేసింది. ముగ్గురు స్నేహితులతో కలిసి నెలకొల్పిన మాష్ ఆడియో విజువల్స్ అనే సంస్థ దిగ్విజయంగా మూతపడింది. ఉద్యోగం చేస్తానని వెళితే ఒత్తిళ్లు, వ్యాపారం చేద్దామని అనుకొంటే కలిసి రాలేదు. కుటుంబ కష్టాలు కామన్. అన్ని అనుభవాలు సంపాదించినప్పటికీ అతడి వయసు 21 యేళ్లు. ఈ క్షణం వరకూ నువ్వు సంపాదించుకొంది మొత్తం పోయినా.. నీ చేతిలో భవిష్యత్తు ఉంటుంది. సందీప్‌కు అదే అనిపించింది. తన బ్రెయిన్ ఇంకా ఫ్రెష్‌గానే ఉంది. అదే తన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అయితే తనకంటూ ఒక గుర్తింపు రావాలి. ఆ గుర్తింపే తన జీవితాన్ని మార్చగలదన్నాడు. అందుకోసం కొత్త వ్యూహాన్ని రచించాడు. పది గంటలా నలభై ఐదు నిమిషాలు... 122 మంది మోడల్స్.. మొత్తం పదివేల ఫొటోలు! ప్రపంచంలోని ఏ ఫొటోగ్రాఫర్కూ సాధ్యం కాని ఫీట్ అది. అలాంటి దాన్ని సాధించి రికార్డు సృష్టించాడు. దేశరాజధానిలోని మెట్రో పేజీల్లో పతాక శీర్షికలకు ఎక్కాడు. మోడలింగ్‌లో ఉన్న రోజుల్లో అక్కడ తనలాగే ఇబ్బంది పడుతున్న యువతీయువకులను అందరినీ కలుపుకొని, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సందీప్ ఆ ఫీట్‌ను సాధించాడు. అది అతడికి గుర్తింపును ఇచ్చింది. ఆ ఫొటోలే అతడికి అస్త్రాలుగా మారాయి. అలాంటి స్టఫ్‌తో ‘ఇమేజెస్బజార్డాట్కామ్’ను స్థాపించాడు. భిన్నమైన హావభావాలతో ఉన్న మోడల్ ఫొటోలకు వేదిక అది అనే ప్రచారాన్ని కల్పించాడు. ప్రపంచ రికార్డు హోల్డర్ కాబట్టి మీడియా కూడా ఇతడి గురించి రాస్తూ ఆ సైట్ గురించి మంచి ప్రచారం కల్పించింది. ప్రతీకాత్మక చిత్రాల అవసరం ఉన్న అనేక సంస్థలు, మీడియా ఈ సైట్ మీద ఆధారపడ్డాయి. ఇంకేముంది ప్రతి ఫొటో అమ్మకమే! పదేళ్లు గడిచి ప్రస్తుతానికి వస్తే విశ్వవ్యాప్తంగా అక్షరాలా ఏడువేల సంస్థలు ఫొటోల కోసం ఇమేజెస్బజార్పై ఆధారపడ్డాయి... ఈ సంస్థతో కాంట్రాక్టులు కుదుర్చుకొని ఫోటోలను వాడుకుంటున్నాయి. మొత్తం 45 దేశాల్లో ఈ నెట్వర్క్ ఉంది. సందీప్ సైట్ కోట్ల రూపాయల టర్నోవర్‌ను సాధించింది. ఇలా అతడు మోడలింగ్ ప్రపంచాన్ని మార్చివేశాడు! ఇప్పుడు సందీప్ జీవితం అనేక జీవితాలకు ఒక పాఠం. అతడు పడ్డ కష్టాలు, వాటిని ఎదుర్కొని ఎదిగిన తీరు.. సాధించిన విజయం... స్ఫూర్తిదాయకం. వ్యాపారవేత్తగా అతడు లెక్కకు మించి అవార్డులు అందుకొన్నాడు. సృజనాత్మక వ్యాపారిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. - జీవన్ -
విపత్తుల నివారణకు ప్రణాళిక
అధికారులకు కలెక్టర్ ఆదేశం విశాఖ రూరల్: తుపాను ప్రభావిత మండలాల అధికారులు విపత్తుల నివారణకు ప్రణాళిక రూపొందించుకోవాలని, రెండు రోజుల్లో తన కార్యాలయానికి అందజేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి విపత్తుల నివారణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విశాఖ తీర ప్రాంతానికి తుపానుల ప్రభావం ఉండే అవకాశమున్నందున తీర ప్రాంతాల మండలాధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు. తుపాను షెల్టర్లకు మరమ్మతులు వెంటనే నిర్వహించాలన్నారు. తుపాను సమయంలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సెంట్రల్ కంట్రోల్ రూమ్ నిర్వహిస్తే బాగుంటుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఏజేసీ న రసింహారావు మాట్లాడుతూ రెండేళ్లుగా వచ్చిన భారీ వర్షాలు, తుపాన్లు, పరిస్థితుల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సరికొత్త ఆలోచనలకు రూపకల్పన చేసి విపత్తుల నివారణకు ప్రణాళిక తయారు చేయాలన్నారు. అంటు వ్యాధులపై అప్రమత్తం ఈ సీజన్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను కలెక్టర్ ఎన్.యువరాజ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మలేరియా, డెంగీ, ఇతర అంటువ్యాధులకు సంబంధించిన కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రతి వారం మండలాల్లో పర్యటించే అధికార బృందం వ్యాధుల నివారణపై ప్రచారం చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ శ్యామల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డెంగీ, మలేరియా వ్యాధుల నియంత్రణపై తీసుకుంటున్న చర్యలను కలెక్టర్‌కు వివరించారు. -
దళితుల చేతిలో జెండానవుతా
డిప్యూటీ సీఎం డాక్టర్ టి.రాజయ్య జనగామలో అభినందన సభ జనగామ : దళితుల చేతిలో జెండానై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. బుధవారం స్థానిక ఉనృపుర బాప్టిస్ట్ చర్చి ఆవరణలో దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో డాక్టర్ సుగుణాకర్‌రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజయ్య, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మను సన్మానించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం రాజ య్య మాట్లాడుతూ త్యాగం, తెగింపు దళితుల రక్తంలో దాగి ఉందన్నారు. తెగింపు.. కసితో ఆనాడు బీఆర్ అంబేద్కర్ ఉన్నత చదువులు చదివి ప్రపంచ మేధావుల్లో ఒకరయ్యారని, అందుకే ఆయనకు రాజ్యాంగాన్ని రచిం చే అవకాశం వచ్చిందని చెప్పారు. అంబేద్కర్ అందించి న ఫలాలతో నేడు దళితులు అన్ని విధాల ఎదుగుతున్నారని పేర్కొన్నారు. దళితులపై ఎవరైనా దాడులకు దిగితే ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. దళితుల పక్షపాతి కేసీఆర్ అని, లక్ష కోట్ల ప్రణాళికలో దళితులకే రూ. 50వేల కోట్ల నిధులు వెచ్చించనున్నారని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెంచిన పింఛన్లను వచ్చే దసరా నుంచి అందించనున్నట్లు వివరించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ ఐదేళ్ల ప్రజాసేవ అనే కాలేజీలో ప్రస్తుతం అడ్మిషన్ మాత్రమే లభించిందని.. పరీక్ష పాసయ్యాకే తనకు సన్మానం చేయాలని.. ఇప్పుడు వద్దని అన్నారు. తెలంగాణను అన్ని విధాల ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలి పారు. నియోజకవర్గంలోని కమ్యూనిటీ హాల్‌లను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. భావోద్వేగానికి లోనైన జెడ్పీ చైర్పర్సన్ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. డిప్యూటీ సీఎం రాజయ్య, ఎంపీలు కడియం శ్రీహరి, సీతారాం నాయక్, ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి కృషి, అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలతో తనకు పదవి వచ్చింద న్నారు. ఒక పేదింటి బిడ్డను ఈ స్థాయికి తెచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు, మున్సిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, వైస్‌చైర్మన్ నాగార పు వెంకటేష్, పాస్టర్లు రెవరెండ్ ఫిలిప్, నర్సింగరావు, ఓజెస్, చర్చి అధ్యక్షుడు మంతపురి ప్రకాష్, దళిత గిరిజ న క్రైస్తవ సంఘాల సమాఖ్య నాయకులు, కౌన్సిలర్లు డాక్టర్ రాజమౌళి, పసుల ఏబెల్, ఎన్.శ్రీరాములు, మేడ శ్రీనివాస్, దేవర ఎల్లయ్య, కన్నారపు ఉపేందర్, బొట్ల నర్సింగరావు, ఉడుగుల రమేష్, బొట్ల పెద్దశ్రీనివాస్, రాజమౌళి, గిరిమల్ల రాజు తదితరులు పాల్గొన్నారు. -
నారాజ్..
ఏకగ్రీవ పంచాయతీలకు అందని నజరానా 73 గ్రామాల ఎదురుచూపు పంచాయతీ పాలనకు ఏడాది పూర్తి హన్మకొండ అర్బన్ : ఏకగ్రీవ పంచాయతీలకు ఏడాది గడిచినా ప్రోత్సాహకాలు అందలేదు. దీంతో పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. ప్రోత్సాహకాలకు తోడు పంచాయతీలకు అభివృద్ధి నిధులొస్తే తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుందామనుకున్న ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. గ్రామ పంచాయతీ సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న పంచాయతీలకు గత ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున నజరానా అందజేసిన విషయం విదితమే. దీనిని స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలో 2013లో జరిగిన ఎన్నికల్లో 73 గ్రామ పంచాయతీలకు ప్రతినిధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏడాది గడిచినా ప్రోత్సాహక నగదు బహుమతి ప్రభుత్వం నుంచి అంద లేదు. ప్రస్తుతం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15లక్షల వరకు ఇస్తామని ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రకటించింది. కానీ నిధులు మాత్రం విడుదల చేయకపోవడంతో ప్రజలు, ప్రజాపతినిధులు నిరుత్సాహంతో ఉన్నారు. నిధుల వరద... 2014 ప్రథమార్థంలో గ్రామ పంచాయతీలకు రావాల్సిన అన్ని రకాల నిధులను ప్రభుత్వం దాదాపు పూర్తి స్థాయిలో విడుదల చేసింది. దీంతో జిల్లాలోని పంచాయతీలకు కోట్లలో నిధులు వచ్చాయి. సర్పంచ్ల కు సాంకేతిక కారణాల వల్ల పదవిలో చేరిన వెంటనే కాకుండా సుమారు రెండు నెలల తర్వాత(31-10-2013)నుంచి చెక్‌పవర్ ఇచ్చారు. అనంతరం సర్పంచ్‌లకు కలెక్టర్ ఆదేశాలతో మొత్తం 29 రకాల శాఖలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి పాలనపై అవగాహన కల్పించారు. ఇది కొత్తగా ఎన్నికైన, రాజకీయ అనుభవం లేని వారికి ఎంతగానో ఉపయోగపడింది. పంచాయతీలకు ఇచ్చిన నిధుల వివరాలు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.1,42,72,000 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.16,81,40,200 షెడ్యూల్డ్ ఏరియా నిధులు రూ.66,37,600 గతంలో ఆగిపోయిన నిధులు రూ.15,27,93,000 పర్క్యాపిటల్ నిధులు రూ.17,48,600 {పొఫెషనల్ ట్యాక్స్ నిధులు రూ.59,61,400 సీనరేజ్ నిధులు రూ.23,07,000 ‘మన ప్రణాళిక’తో పెరిగిన ప్రాధాన్యం ప్రస్తుతం మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి పక్కాగా అమలు చేస్తుండటంతో పంచాయతీలకు, సర్పంచ్‌లకు ప్రాధాన్యం పెరిగింది. ప్రస్తుతం గ్రామస్థాయి ప్రణాళికలకే ప్రభుత్వం నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది. దీంతో గ్రామాలకు అవసరమైన అన్ని రకాల విషయాలను ప్రణాళికల్లో పొందుపరిచారు. -
‘మంచాల’కు మంచికాలం!
మంచాల: పర్యాటక అభివృద్ధిలో భాగంగా మంచాల మండలానికి మహర్దశ పట్టనుంది. కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధికి తలపెట్టిన ప్రణాళికలో మంచాల మండలానికి చోటుదక్కింది. అంతేకాకుండా మెగా సర్క్యూట్లో భాగం గా మండల సరిహద్దు ప్రాంతాలైన రాచకొండ కోటతోపాటు గాలిషాహీద్ దర్గా, నారాయణపురం, అల్లపురం గ్రామాల్లోని దేవాలయాలు, ఆరుట్ల దేవాలయంతోపాటు వ్యాలీ ఆఫ్ బంజారా సర్క్యూట్ కింద శివన్నగూడెం రాక్ ఫార్మేషన్స్లను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి శ్రీపద్ యశోనాయక్ ఈ నెల 22న లోక్‌సభలో లిఖిత పూర్వకంగా పేర్కొన్నారు. దీంతో రాచకొండ కోటను చారిత్రాత్మక కట్టడంగా గుర్తించడంతోపాటు దీని సమీపంలోని గాడిపీర్లవాగు సమీపంలోని గాలిషాహీద్ దర్గాను కూడా అభివృద్ధి చేయనున్నారు. అల్లాపూర్ సమీపంలోని సరళ మైసమ్మ దేవాలయం, ఆరుట్లలోని శ్రీ బుగ్గరామ లింగేశ్వరస్వామి దేవాలయం, నారాయణపురం మండలంలోని రాచకొండగుట్టల సరిహద్దులోని పలు దేవాలయాలు కూడా అభివృద్ధి చెందనున్నాయి. భూముల కొనుగోలుపై నజర్ మంచాల మండలానికి తూర్పు భాగంలో అటు రాచకొండకోట, నల్గొండ జిల్లా నారాయణపురం మండలం, ఇటు శివన్నగూడెం ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ముందుకు వస్తోంది. దీంతో ద్వీపకల్పంగా మారిన మంచాల మండల పరి సర భూములపై పారిశ్రామికవేత్తలు దృష్టి సారించారు. సర్కారు సైతం పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు ఇక్కడి ప్రభుత్వ భూములను గుర్తించారు. నారాయణపు రం మండలంలోని రాచకొండకోట పరిస ర ప్రాంతంలోని సర్వే నంబర్ 273లో దాదాపు 8 వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. ఇవి అటు నాగారం నుంచి మొదలుకొని అల్లాపురం, నారాయణపురం, జనగామ, పల్లెగుట్ట తండా, కడీలబావి తండా గ్రామాల పరిసర ప్రాంతాలను అనుసరించి ఉన్నాయి. ఇందులో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. మంచాల రెవెన్యూ పరిధిలోని ఆరుట్ల సమీపంలో 587 సర్వే నంబర్ నుంచి 619 సర్వే నంబర్లలో నాలుగు వందల ఎకరాల పట్టా భూములను బెంగళూరు- తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఓ కంపెనీ కొనుగోలు చేసింది. ఈ భూము లు ముచ్చర్లకుంట గ్రామం నుంచి బండలేమూర్, వాయిలపల్లి, జనగామ, లోయపల్లి శివారు ప్రాంతాలను అనుసరించి ఉన్నాయి. ఇదే కంపెనీ మంచాల మండలాన్ని అనుసరించి ఉన్న నల్గొండ జిల్లా ఖుదాభక్షుపల్లి, లచ్చమ్మగూడెం, చిల్లాపురం పరిసర ప్రాంతాల్లో మరో వెయ్యి ఎకరాలు కొనుగోలు చేశారు. రాచకొండగుట్టలకు మంచి రోజులు రావడంతో మంచాల మండలం, నారాయణపురం, మర్రిగూడ మండలాలు అభివృద్ధికి నోచుకోనున్నాయి. కాగా ఇప్పటికే రియల్టర్లు, వివిధ కంపెనీల యజమానులు గుట్టుచప్పుడు కాకుండా భూముల కొనుగొలుపై దృష్టి సారించినట్లు సమాచారం. -
‘మన ప్లాన్లు’ సిద్ధం చేయండి!
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రణాళికలు ప్రతి గ్రామానికీ ఓ అధికారి నియామకం కలెక్టర్లకు సహాయంగా ప్రతి జిల్లాకో ఐఏఎస్ ప్రణాళికల ఆధారంగానే రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన తెలంగాణ నవ నిర్మాణ ప్రణాళిక వర్క్‌షాప్‌లో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఒక్కో గ్రామానికి ఒక్కో అధికారిని నియమించి వారి ద్వారా గ్రామసభలు నిర్వహించి ‘మన ప్రణాళికలు’ రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ నెల 12 నుంచి 27 వరకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ నెల 12 నుంచి 17 వరకు గ్రామ స్థాయి ప్రణాళికలు, 17 నుంచి 22 వరకు మండల స్థాయి ప్రణాళికలు, 22 నుంచి 27 వరకు జిల్లా స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో సగటున వెయ్యి గ్రామాలు ఉన్నందున జిల్లా కలెక్టర్లు వెయ్యి మంది అధికారులను గుర్తించి ప్రణాళికల తయారీ కోసం గ్రామాలకు కేటాయించాలన్నారు. ఈ ప్రణాళికల తయారీలో కలెక్టర్లకు సహకరించేందుకు ప్రతి జిల్లాకు ఓ ఐఏఎస్ అధికారిని కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయి ప్రణాళికలు సిద్ధమైన తర్వాత ఆగస్టు ఒకటి నుంచి 10 వరకు రాష్ట్ర స్థాయి వర్క్ షాపు నిర్వహించి రాష్ట్ర స్థాయి ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ ప్రణాళికల ఆధారంగా ఆగస్టు 10 నుంచి 20 వరకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌కు రూపకల్పన చేస్తామన్నారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో సోమవారం జరిగిన ‘తెలంగాణ నవ నిర్మాణ ప్రణాళిక వర్క్‌షాప్’ముగింపు ఉపన్యాసంలో ఆయన ఈమేరకు వెల్లడించారు. ఒకటి రెండు రోజుల్లో ప్రత్యేకాధికారుల ఎంపిక పూర్తిచేసి వారితో పాటే తహశీల్దార్లు, ఎంపీడీఓలకు జిల్లా కేంద్రంలో ఒక రోజు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. ఒకవైపు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తయారుచేసిన ప్రణాళికలతో ప్రభుత్వ శాఖలు సమాంతరంగా తయారు చేసిన ప్రణాళికలను క్రోడీకరించి రాష్ట్ర బడ్జెట్‌ను తయారు చేయాలన్నారు. మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులకు ఈ బాధ్యతను కేసీఆర్ కట్టబెట్టారు. ప్రణాళికల తయారీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలను భాగస్వాములను చేయాలని సూచించారు. మార్పు కోసం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా కలెక్టర్ల వ్యవస్థకు పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వండి ఓ వైపు ఎక్కడికక్కడ ప్రణాళికలు తయారు చేస్తూనే మరోవైపు ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్హెచ్ఆర్డీ, ఎన్ఐఆర్డీ, అపార్డ్, బ్రహ్మకుమారి సంస్థల ద్వారా సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. 19 నుంచి సర్పంచ్‌లకు, 23 నుంచి మండల అధ్యక్షులకు, 27 నుంచి జెడ్పీటీసీలకు శిక్షణ ఇవ్వాలని నిర్దేశించారు. వచ్చే శనివారం లేదా ఆదివారం ఎంపీలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలకు హైదరాబాద్‌లో ఒకరోజు శిక్షణ ఉంటుందన్నారు. -
ఆదాయం-పొదుపు= ఖర్చులు
రాజా చిరుద్యోగి స్థాయి నుంచి కాస్త పై స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలో ఆదాయమూ పెరిగింది. జీతం పెరిగితే ఎంతో కొంత దాచిపెట్టొచ్చు .. కారో, ఇల్లో కొనుక్కునేందుకు ఉపయోగపడుతుంది కదా అని మొదట్లో సంతోషపడుతూ వచ్చాడు. కానీ ఆదాయంతో పాటు ఖర్చులూ పెరిగాయి. ఫలితంగా జీతం అయిదు వేలు ఉన్నప్పుడూ సరిపోలేదు.. యాభై వేలు వస్తున్నప్పుడూ ఏ మూలకూ సరిపోవడం లేదు. ఇక, పొదుపు ఎక్కణ్నుంచి చేయాలో అర్థం కాక తలపట్టుకున్నాడు. దీంతో అర్జంటుగా ఫైనాన్షియల్ ప్లానింగ్‌ను సమూలంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గట్లుగానే కొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాడు. అవేంటంటే.. పొదుపు చేయగా మిగిలినదే ఖర్చులకు.. సాధారణంగా అంతా ఖర్చులన్నీ పోగా ఏదో కొద్దిగా మిగిలితే దాన్ని పొదుపు చేద్దాం అనుకుంటారు. వారు ఫాలో అయ్యే ఫార్ములా ఆదాయం-ఖర్చులు = పొదుపు. కానీ, నిజంగా పొదుపు చేయడం ద్వారా లాభపడాలంటే.. దీన్ని కాస్త అటూ ఇటుగా మార్చుకోవాలి. ప్రతి నెలా కచ్చితంగా ఇంత పొదుపు చేయాలని నిర్ణయించుకుని దాన్నే ఆదాయం నుంచి తీసేస్తే మిగిలే మిగతా మొత్తాన్ని ఖర్చులకు కేటాయించాలి. అంటే ఆదాయం - పొదుపు = ఖర్చులు అన్నమాట. ఖర్చులను నియంత్రించడం సాధ్యం ఎలాగూ కాదు. ఎంత వద్దనుకున్నా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అదే మనకి వచ్చే ఆదాయంలో ముందస్తుగానే కొంత మొత్తాన్ని పొదుపు కోసం తీసి పక్కన పెట్టడం వల్ల చేతిలో ఉండే డబ్బుతోనే మిగతా ఖర్చులను చక్కబెట్టాల్సిన పరిస్థితి కల్పించుకుంటే ఆటోమేటిక్‌గా వ్యయాలపై కొంతైనా నియంత్రణ వస్తుంది. ఇక, ఈ పొదుపు మొత్తం కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు బైటికి లాగేసే విధంగా ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సదుపాయం ఉందంటే ఏదైనా కాస్త ఎక్కువ ఖర్చులు ఎదురైన ప్రతిసారీ మనసు అటు లాగేస్తూ ఉంటుంది. అందుకే, అంత సులభసాధ్యంగా విత్‌డ్రా చేసే వీలు ఉండని సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో ఉపయోగపడుతుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్ పథకాలు, ప్రావిడెంట్ ఫండ్ లాంటి సాధనాలు ఇలాంటి దీర్ఘకాలికమైన సాధనాలే. ప్రతి నెలా ఉద్యోగి జీతంలో నుంచి కొంత మొత్తాన్ని కంపెనీ పీఎఫ్ అకౌంట్లో జమ చేస్తుంటుంది. రిటైరయ్యే దాకా ఆ పొదుపు మొత్తం వడ్డీలతో కలిసి పెరుగుతూ ఉంటుంది. పదవీ విరమణ చేసే నాటికి కాస్త పెద్ద మొత్తం చేతికొస్తుంది. ఏవో కొన్ని అత్యవసర సందర్భాల్లో మాత్రమే దీన్ని ముందస్తుగా విత్‌డ్రా చేసుకునే వీలు ఉంటుంది. చిన్న మొత్తంతోనైనా శ్రీకారం.. పొదుపు, ఇన్వెస్ట్ చేయాలన్న తలంపు వచ్చినప్పుడు భారీ మొత్తం చేతికొచ్చినప్పుడే చేయాలనుకోనక్కర్లేదు. చాలా మంది ఈ తప్పే చేస్తుంటారు. ఎంతో కొంత చొప్పున ప్రతి నెలా చిన్న మొత్తాలను మొదలుపెట్టి ఆదాయం పెరిగే కొద్దీ పొదుపు, ఇన్వెస్ట్మెంట్లను పెంచుకుంటూ పోవచ్చు. చక్రవడ్డీల ప్రభావంతో కొన్నాళ్లకు పెద్ద మొత్తమే అవుతుంది. పెద్ద మొత్తం కూడబెట్టే దాకా వెయిట్ చేస్తూ కూర్చుంటే ఈలోగా కొంగొత్త ఖర్చు లంటూ పుట్టుకొస్తూనే ఉంటాయి. చేతిలో ఉన్న డబ్బు హారతికర్పూరం అయిపోతూ ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ప్రతీ సంవత్సరం పొదుపు మొత్తాన్ని ఎంతో కొంత పెంచుకుంటూ వెళ్లగలగాలి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ సిప్‌లలో పెట్టుబడులు కావొచ్చు మరొకటి కావొచ్చు చాలా మంది ఈ విషయాన్ని అంతగా పట్టించుకోరు. ఇక, మనం చేసే దాన్ని బట్టే ఫలి తాలు ఉంటాయి. ఇన్వెస్ట్ చేయడం బదులు అనవసర ఖర్చు చేయడం వల్ల మనకు రావాల్సిన రాబడి పోవడంతో పాటు.. కొన్నదాన్ని నిలబెట్టుకోవడం మరొకటి.. ఆపై మరొకటి కొనుక్కుంటూ పోవాల్సిన పరిస్థితి ఎదురుకావచ్చు. అలాగని, మరీ లోభిత్వం చేయాలనీ కాదు. ఎక్కడ ఖర్చు పెట్టాలి.. ఎక్కడ తగ్గాలి అన్నదీ కొంత ఎరుకతో వ్యవహరిస్తే మంచిది. లగ్జరీ ట్యాక్స్ విధించుకోవడం.. పొదుపు చేయడం అంటే చిన్న సరదాలను కూడా తీర్చుకోకుండా మరీ పర్సును బిగించేసి పిసినారిగా వ్యవహరించాలని కాదు. ఒకవేళ విలాసవంతమైన వస్తువేదైనా భారీ సొమ్ము వెచ్చించి కొన్నా.. మళ్లీ ప్రణాళిక గాడి తప్పకుండా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు.. ఖరీదైన మొబైల్ ఫోనో మరొకటో కాస్తంత లగ్జరీ వస్తువేదైనా తీసుకున్నప్పుడు.. దాదాపు అంతే మొత్తాన్ని ప్రత్యేకంగా పొదుపు కోసం మళ్లించేసేందుకు ప్రయత్నించాలి. ఇదొక విధంగా మనపై మనం విధించుకునే లగ్జరీ ట్యాక్స్ లాంటిదే. కానీ, ఇందులో ప్రయోజనం ఏమిటంటే.. మనకు కావాల్సిన వస్తువు దక్కించుకోవడంతో పాటు మన ఆర్థిక క్రమశిక్షణ కూడా గాడి తప్పకుండా చూసుకోవచ్చు. కెడిట్ కార్డులు తగ్గించాలి.. క్రెడిట్ కార్డులు అవసరానికి రుణం ఇచ్చి ఆదుకోగలిగినా.. ఖర్చులపై అదుపులేని వారి విషయంలో ఇవి చాలా ప్రమాదకరమైనవి. కార్డుతో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు సింపుల్‌గా ఒక స్లిప్పై సంతకం చేస్తే సరిపోతుంది. ప్రత్యేకంగా జేబులో నుంచి అప్పటికప్పుడు డబ్బు కట్టాల్సిన పని ఉండదు కాబట్టి సదరు కొనుగోలు భారం తక్షణం తెలియదు. కానీ మరుసటి నెల ఇతర ఖర్చులతో పాటు కార్డు బకాయిలు పేరుకుపోయి కట్టలేని పరిస్థితి తలెత్తినప్పుడు వస్తుంది అసలు తంటా. అందుకే, సాధ్యమైనంత వరకూ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నప్పుడు అసలు భారం అప్పటికప్పుడు తెలుస్తుంది కనుక కొంత అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి వీలవుతుంది. అలాగే, మన లక్ష్యాలు రాసుకున్న చిన్న చీటీని గానీ కుటుంబసభ్యుల ఫొటోలు గానీ క్రెడిట్ కార్డుపై అతికించి ట్రై చేయొచ్చు. స్వైప్ చేయడానికి కార్డు తీసిన ప్రతిసారీ దానిపై కనిపించే లక్ష్యాలు ఠక్కున కనిపించి.. సదరు కొనుగోలు గురించి పునరాలోచించుకునే వీలు కలుగుతుంది. వృథా ఖర్చులకు కొంతైనా అడ్డుకట్ట పడుతుంది. -
తూర్పున మరింత వెలుగు!
మెరుగైన ‘విద్యుత్తు’ సేవలకు ఈపీడీసీఎల్ సన్నద్ధం వంద రోజుల ప్రణాళికతో చర్యలు సౌర విద్యుదుత్పత్తికి ప్రోత్సాహం ఆస్తుల సంరక్షణకు ప్రత్యేక సర్వే సాక్షి, విశాఖపట్నం: ‘విద్యుత్ సరఫరాలో అసమానతల్ని తొలగించా లి. వినియోగదారులకు మెరుగైన సేవలందించాలి...’ ఇదే లక్ష్యంతో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) చర్యలు చేపట్టింది. ఇందుకు రూ.వందల కోట్లు కేటాయించింది. మరోవైపు ఈపీడీసీఎల్ ఆస్తుల సంరక్షణ, తక్షణ మరమ్మతు చర్యల కోసం వంద రోజుల ప్రణాళికనూ సిద్ధం చేసింది. రూ. 61.11 కోట్లతో డీడీజీ ప్రాజెక్టులు... రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుత్ యోజన పథకంలో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రూ. 61.11 కోట్లతో వికేంద్రీకృత పంపి ణీ, ఉత్పత్తి (డీడీజీ) ప్రాజెక్టుల్ని ఈపీడీసీఎల్ అధికారులు ప్రారంభించారు. ఇం దులో భాగంగా ఇప్పటికే రూ. 16.62 కోట్లతో 9 మండలాల్లోని 57 గిరిజన గ్రా మాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. విశాఖపట్నం (183), శ్రీకాకుళం (11) జిల్లాల్లోని మొత్తం 194 గిరిజన గ్రామాల్లో రూ. 44.49 కోట్ల వ్యయంతో విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీన్ని సోలార్ ఫొటోవాల్టిక్ (ఎస్పీవీ) విధానంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 5,592 గృహాలకు విద్యుత్ సౌకర్యం కలుగుతుంది. రూ. 105.52 కోట్లతో 69 సబ్స్టేషన్లు... ప్రస్తుతం ఈపీడీసీఎల్ పరిధిలో 33/11 కేవీ సబ్స్టేషన్లు 647 ఉన్నాయి. వీటి ద్వారా 50 లక్షల మంది వినియోగదారులకు సేవలందుతున్నాయి. ఇవిగాక రూ. 9.36 కోట్లతో శ్రీకాకుళంలోని గొప్పిల్లి, అక్కుపల్లి, తెలుకుంచిలో మూడు ఔట్‌డోర్ సబ్స్టేషన్లు, విశాఖలోని సీతమ్మధార, పాండురంగాపురం, టౌన్‌కొత్తరోడ్డులో మూడు ఇండోర్ సబ్స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయి. రానున్న రెండేళ్లలో రెండు దశల్లో కొత్తగా 33/11 కేవీ సబ్స్టేషన్లు 69 నిర్మించనున్నారు. తొలి దశలో రూ. 74.81 కోట్లతో 49 సబ్స్టేషన్లను ప్రతిపాదించారు. ఇందులో ఇప్పటికే 11 సబ్స్టేషన్ల నిర్మాణ పనులకు కేటాయింపులు జరిగాయి. మిగిలినవి టెండర్ దశలో ఉన్నాయి. రెండో దశలో రూ. 30.71 కోట్లతో 20 సబ్స్టేషన్ల నిర్మాణానికి బిడ్స్ రూపొందిస్తున్నారు. భూ సంరక్షణకు ప్రత్యేక వ్యవస్థ... ఈపీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాలో సంస్థకు చెందిన భవనాలు, భూముల సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 647 సబ్స్టేషన్లకు కేటాయించిన సుమారు 1,250 ఎకరాల స్థలాలపై సర్వే చేయించనున్నారు. సంస్థకు చెందిన స్థలాల పరిరక్షణకు కంచె లేదా ప్రహరీ నిర్మించనున్నారు. ఆక్రమణలో ఉన్న ఈపీడీసీఎల్ భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటైంది. ఇందుకోసం సర్వే విభాగం నుంచి అసిస్టెంట్ డెరైక్టర్ ను ఈపీడీసీఎల్‌కు ప్రత్యేకంగా కేటాయించారు. ఎనర్జీ పార్కు, సౌర విద్యుత్... నిర్మాణం, నిర్వహణ, బదలాయింపు (బూట్) విధానంలో ఎనర్జీ పార్కు నిర్మాణానికి ఈపీడీసీఎల్ ఆసక్తి వ్యక్తీకరణలను ఆహ్వానించింది. ఆధునిక, తరిగిపోని ఇంధన వనరుల్ని ఈ పార్కులో ఏర్పాటు చేయనున్నారు. పిల్లలు, విద్యార్థులు, ప్రజలు సందర్శించి విద్యుత్ ఆవశ్యకత, పొదుపు చర్యల్ని తెలుసుకునేందుకు ఇది దోహదపడనుంది. మరోవైపు ఆన్ గ్రిడ్ విధానంలో రూఫ్‌టాప్ సౌర విద్యుత్ ప్రోత్సాహ చర్యలు చేపడుతున్నారు. ఇందుకు ఈపీడీసీఎల్ భవనాలపైనున్న సుమారు లక్ష చదరపు అడుగుల ఖాళీ స్థలాన్ని కేటాయించారు. రానున్న ఆరు మాసాల్లో ఒక మెగావాట్ సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. -
వరి‘సిరులు’ కురిసేనా?
వ్యవసాయశాఖ ప్రణాళిక ఖరీఫ్ నుంచే అమలు తోట్లవల్లూరు : వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని పెరుగుతున్న ఆహార ఉత్పత్తుల డిమాండ్‌కు అనుకూలంగా సాగుఖర్చులను తగ్గించుకుని, అధిక దిగుబడుల సాధనే లక్ష్యంగా వ్యవసాయశాఖ ముందుకు సాగనున్నది. ఇప్పటికే ఈ ఏడాది ఖరీఫ్ ప్రణాళిక రూపొందించే పనిలో పడింది. ఇందుకోసం ఇక్రిశాట్ ఆధ్వర్యంలో మిషన్ప్రాజెక్టును అమలు చేయనుంది. సగటు దిగుబడికన్నా తక్కువ ఉత్పత్తి ఉన్న గ్రామాల్లో మండల వ్యవసాయాధికారి పర్యవేక్షణలో ఈ పథకాన్ని అమలు చేసి ఫలితం సాధించాలని భావిస్తున్నారు. కార్యక్రమం ఇలా... వర్షాభావ పరిస్థితులను అధిగమించి దిగుబడులను పెంచేందుకు ప్రతి గ్రామంలో 25 హెక్టార్లను ఎంపిక చేస్తారు. భూసార పరీక్షల నుంచి మార్కెటింగ్ వరకు అంతా వ్యవసాయశాఖ పర్యవేక్షణలోనే నిర్వహిస్తారు. వ్యవసాయశాఖ అందించే ఫౌండేషన్ విత్తనాన్ని గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా గ్రామాల్లో వినియోగిచడమే కాకుండా తద్వారా వచ్చే దిగుబడులను నూతన విత్తనంగా వాడతారు .అలాగే ఉపాధిహామీ పథకం ద్వారా పంటబోదెల తవ్వకం పనులు చేస్తారు. త్వరగా పంట నేలకొరగని విత్తనాలను ఎంపిక చేసుకుని,పంట ఒత్తుగా లేకుండా చూస్తారు. యూరియా వినియోగాన్ని తగ్గించేందుకు రైతులకు అవగాహనా తరగతులు నిర్వహిస్తారు. సాగు ఖర్చులు తగ్గిం చేందుకు వెదజల్లే పద్ధతి అవలంభిస్తూ వ్యవసాయశాఖ అందించే సబ్సిడీ యంత్ర పరికరాలు వినియోగించేలా చూస్తారు. సేంద్రీయ సాగును ప్రోత్సహించడంలో భాగంగా పచ్చిరొట్ట విత్తనాలు, వర్మి కంపోస్టు యూనిట్లు, బయోఫెర్టిలైజర్స్‌ను రైతులకు సబ్సీడీలపై అందజేస్తారు. గ్రామాలలో ధాన్యాన్ని భద్రపరచుకునేందుకు నాబార్డు సహకారంతో గోదాముల నిర్మించి, రైతుకు కనీస మద్దతు ధర అందించేందుకు ప్రాసెసింగ్ యూనిట్లను సబ్సిడీపై అందుబాటులో ఉంచుతారు. అధిక, మేలైన దిగుబడుల సాధనకే వరి పంట ఉత్పాదకతను పెంచేందుకు వ్యవసాయశాఖ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలిస్తాయి. ముఖ్యంగా భూసారాన్ని పెంచడంతోపాటు, పెరుగుతున్న సాగు ఖర్చులు అధిగమించడానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. దిగుబడులు సాధించటంతోపాటు సరైన గిట్టుబాటు ధర లభించటానికి ఆస్కారం కలుగుతుంది. - జివి శివప్రసాద్, మండల వ్యవసాయాధికారి, తోట్లవల్లూరు -
ప్రణాళికా శాఖకు బాబు అదేశాలు
-
ఆరోగ్యం కోసం ప్లానింగ్ తప్పదు మరి!
ఉద్యోగం పురుష లక్షణం అన్న మాటను ఎప్పుడో చెరిపేశారు మహిళలు. ప్రతి రంగంలోనూ పురుషులతో పోటీపడి విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఎంత సమర్థంగా పనిచేసినా మహిళలకు ప్రకృతి పరంగా ఏర్పడిన శారీరక బలహీనతలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సమయానుకూలంగా పని చేయక తప్పదు. టార్గెట్లు అందుకోకా తప్పదు. అలాగని ఈ టెన్షన్లో పడి టైముకు తినకపోవడం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మాత్రం తగదు. చాలామంది అంటుంటారు... ఇంత టెన్షన్లో తిండి గురించి ఎక్కడ ఆలోచిస్తాం అని. అది నిజం కావచ్చేమో కానీ సరి మాత్రం కాదు. పనులు ఎన్ని ఉన్నా, అందుకు తగ్గట్టుగానే భోజన వేళలను అడ్జస్ట్ చేసుకోవాలి. రోజును జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. మరునాడు ఏయే పనులున్నాయో ఈ రోజు రాత్రి డైరీలో రాసుకోండి. దాన్ని బట్టి తినడానికి ఎప్పుడు టైమ్ దొరుకుతుందో అర్థమవుతుంది. బయట ఏదో ఒకటి తినేద్దాంలే అన్న నిర్లక్ష్యం వద్దు. ఆ అలవాటు ఆరోగ్యాన్ని ఎంత దెబ్బ తీస్తుందో తెలియంది కాదు. అందుకే ఇంట్లో వండి తీసుకెళ్లడమే మంచిది. కాకపోతే మీ సమయాన్ని బట్టి తేలికగా తయారయ్యే వంటకాలను ప్లాన్ చేసుకోండి. తినడానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారా? అయితే ఓ పని చేయవచ్చు. తేలికగా తినేయగల, ఇంకా చెప్పాలంటే పని చేసుకుంటూనే ఆరగించగల ఆహార పదార్థాలు కొన్ని ఉంటాయి. బిస్కట్లు, పండ్లముక్కలు, బ్రెడ్, ఉడికించిన/మొలకెత్తిన గింజలు లాంటివి. వీటిని చిన్న చిన్న డబ్బాల్లో ప్యాక్ చేసుకుని తీసుకుపోండి. అప్పుడప్పుడూ కాస్త కాస్త తింటూ ఉంటే సరిపోతుంది. తినడం అసాధ్యం అనుకున్నప్పుడు తాగడానికి ప్రాధాన్యతనివ్వండి. జ్యూసులు, రాగి/జొన్న/చోడి/సగ్గు జావల్లాంటివి చేసుకుని మూత ఉండే చిన్న చిన్న గ్లాసుల్లో వేసు కుని తీసుకెళ్లండి. ఎంత పనిలో ఉన్నా, ఎంతమంది మధ్య ఉన్నా వాటిని సేవించడం చాలా తేలిక. కొబ్బరినీళ్లు, గ్లూకోజ్ కూడా తీసుకెళ్లవచ్చు.బిజీగా ఉన్నప్పుడు తినడానికి డ్రై ఫ్రూట్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. తక్కువ మోతాదులో తీసుకున్నా, ఎక్కువ శక్తినిస్తాయి. నిజానికి ఇవన్నీ ఆప్షన్స్ మాత్రమే. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్... ఏది ఎప్పుడు చేయాలో అప్పడు చేసి తీరాలి. లేదంటే గ్యాస్ట్రిక్, పేగు సంబంధిత సమస్యలు, ఊబకాయం వంటికి వెతుక్కుంటూ వస్తాయి. కష్టపడి పని చేసేది, సంపాదించేది ఆనందంగా జీవించడానికే కదా! ఆరోగ్యం లేనప్పుడు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది! అందుకే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దాన్ని కాపాడుకోవాలనుకుంటే ఆహారాన్నీ నిర్లక్ష్యం చేయకండి! -
కష్టాల్లో ఉన్న హిట్ నిర్మాత...
-
పింఛన్‌తో కూడా సొంతిల్లు కొన్నారు
వాళ్లిద్దరూ ఉద్యోగులే. ఉద్యోగంలో ఉన్నన్నాళ్లూ ప్లానింగ్ బాగానే కుదిరింది. ఉన్న చోటే సొంతిల్లు సమకూర్చుకున్నారు. అందులో పెద్ద విశేషమేముంది అనుకోవచ్చు!!. నిజమే... అదేం పెద్ద విశేషం కాదు. కానీ రిటైర్మెంట్ తరువాతి జీవితాన్ని కూడా చక్కగా ప్లాన్ చేసుకోవటంతో పాటు పెన్షన్ ఆధారంగా ఓ వెకే షన్ హోమ్‌ను కూడా కొనుక్కోగలిగారు. అరె.. అదెలా? అనిపించిందా!. దీనికి తాడేపల్లి ఉమాశంకర్, సుబ్బలక్ష్మి దంపతులు ఏం చెబుతున్నారో మీరే చూడ ండి... ‘‘మేమిద్దరం ప్రభుత్వ ఉద్యోగులమే. పిల్లలందరూ తలోరకంగా సెటిలయ్యారు. మేం కూడా కొన్నాళ్ల కిందట రిటైరయ్యాం. ఇప్పటిదాకా సిటీలోనే ఉన్నాం. రిటైరయ్యాకనైనా ఈ రణగొణ ధ్వనులకు దూరంగా ప్రశాంత జీవనం గడపాలని ముందు నుంచీ అనుకునేవాళ్లం. కానీ, పిల్లల దృష్ట్యా పదవీ విరమణ చేసినా ఇక్కడ ఉన్న పూర్తిగా వేరేచోటుకు వెళ్లే పరిస్థితి లేదు. అందుకని ఇక్కడ ఉంటూనే ప్రశాంతత కోసం అప్పుడప్పుడూ వెళ్లి రాగలిగే వెసులుబాటు ఉండే ప్రాంతంలో ఇల్లు తీసుకోవాలని అనుకున్నాం. రూ.20-25 లక్షల బడ్జెట్లో ఉంటే చాలనుకున్నాం. దీనికోసం రిటైర్మెంట్కు ముందే ఇద్దరం ఒక ప్రణాళిక వేసుకున్నాం. ఒకేసారి రూ. 20 లక్షలు చెల్లించటం కుదరదు కనక ఎలాగూ లోన్ తీసుకోవాలి. అయితే, రిటైరయ్యాక పెన్షనే ఆధారం కనక రుణభారం ఎక్కువగా ఉండకూడదని అనుకున్నాం. కనీసం సగమైనా డౌన్ పేమెంట్ చేయాలని, మిగతాది మరీ దీర్ఘకాలం కాకుండా తక్కువ వ్యవధిలో తేల్చేయాలని అనుకున్నాం. దానికి తగ్గట్టే ఇద్దరం మా జీతాల్లోంచి కొంత తీసి డౌన్‌పేమెంట్ కోసం పక్కనబెట్టాం. అలా మా బడ్జెట్లో సుమారు సగందాకా కూడబెట్టగలిగాం. ఇంటికోసం అన్వేషణ మొదలుపెట్టాం. మరీ మారుమూల కాకుండా అవసరమైన సదుపాయాలన్నీ ఉండేచోట ఇల్లు తీసుకోవాలనుకున్నాం. వైజాగ్‌ను ఎంచుకున్నాం. వెతగ్గా వెతగ్గా వైజాగ్ సమీపంలోని భీమిలి ఏరియా మాకు తగ్గట్లు ఆహ్లాదకరంగా కనిపించింది. అక్కడ ఇల్లు కోసం వెదికాం. ఆన్లైన్లో వెతకడంతో పాటు, స్వయంగా వెళ్లి కూడా వాకబు చేశాం. చివరికి మా బడ్జెట్లో, బీచ్ వ్యూ ఉండే ఫ్లాట్.. నిర్మాణం చురుగ్గా జరుగుతున్న దశలో దొరికింది. డౌన్‌పేమెంట్ కట్టి బుక్ చేశాం. మిగతాది బ్యాంక్‌లోన్ తీసుకున్నాం. పెన్షన్‌కు తగ్గట్టే ఈఎంఐలు ఉండటంతో పెద్దగా ఇబ్బంది లేదు. కొన్నాళ్లలో అది కూడా తీరిపోతుంది. ఇన్వెస్ట్మెంట్గా కూడా అది బాగానే ఉంటుంది. పెపైచ్చు మాకు కావాల్సిన మానసిక ప్రశాంతతా దొరుకుతుంది. -
అవసరం ఎలాంటిదైనా..నెలకో కొంత
‘‘ఏమండీ డిసెంబర్ వస్తోంది! పిల్లలిద్దరి సెకండ్ టెర్మ్ ఫీజు కట్టేశారా?’’ అజయ్‌ని అడిగింది ఆయన భార్య సుహాసిని. ’అరె! మరచిపోయానే!! ఇప్పటికిప్పుడు 60 వేలు ఎలా?’ ఆలోచనలో పడ్డాడు అజయ్. ఈ సమస్య అజయ్ ఒక్కడిదే కాదు. స్వల్పకాలంలో డబ్బు అవసరమయ్యే స్కూలు ఫీజులు, ఇంట్లో శుభకార్యాలు, ఇంటి రిపేర్లు, విహారయాత్రలు... వీటికీ ప్లానింగ్ తప్పనిసరి. మరి ఇలాంటి స్వల్పకాలిక లక్ష్యాల కోసం దేన్లో పొదుపు చేయాలి? ఏవి మంచివి? చాలామంది నెలనెలా కొంత మొత్తాన్ని తీసి పక్కన పెడుతుంటారు. కొందరు దాన్ని ఇంట్లోనే దాచుకుంటారు. మరికొందరు సేవింగ్స్ ఖాతాలోనే వదిలేస్తారు. కొందరైతే సిప్ వంటి సాధనాల ద్వారా షేర్ మార్కెట్లో పెడతారు. వీటిని చూసినట్లయితే... ఇంట్లో దాస్తే ఏ రాబడీ రాదు. సేవింగ్స్ ఖాతాలో వదిలేస్తే వడ్డీ అతితక్కువ వస్తుంది. షేర్లలో పెడితే రిస్కుంటుంది. మరి ఏం చేయాలి? ఇలా ఆలోచించేవారికి అక్కరకొచ్చేదే ఆర్డీ. అంటే రికరింగ్ డిపాజిట్. చిన్న లక్ష్యాల కోసం... మీరు రూ.20 వేల స్మార్ట్‌ఫోనుకు, రూ.25 వేలు విహారయాత్రకు, రూ.50 వేలు పిల్లల స్కూలు ఫీజుకు పెట్టాల్సి ఉంది. సాధారణంగా... స్కూలు ఫీజు తప్ప.. మిగతా రెండింటికీ డబ్బులుంటే చూద్దాంలే అనుకుంటాం. చాలా సందర్భాల్లో అంత మొత్తం ఒకేసారి సమకూరదు. ఆ సరదా తీరకపోనూ వచ్చు. ఆర్డీ ఉంటే ఇవి తీరనివేమీ కావు. ఎలాగంటే... ఫోన్ కోసం ప్రతి నెలా రూ. 2,000 చొప్పున పది నెలలు, వెకేషన్ కోసం ఏడాది పాటు రూ. 2,000, స్కూల్ ఫీజుల కోసం ఏడాది పాటు రూ.4,000 ఆర్డీ చేయడం మొదలు పెట్టి చూడండి. నెలకు రూ.8,000 వీటికోసం కేటాయించాల్సి వస్తుంది. అది కష్టమేమీ కాదు. కానీ ఏడాది తిరిగేసరికి మీ కోరికలన్నీ తీరుతాయి. పెపైచ్చు దీనిపై వడ్డీ కూడా వస్తుంది. ఆర్డీ ఎందుకంటే... దీని కనీస వ్యవధి 6 నెలలు. గరిష్ట వ్యవధి పదేళ్లు. కనీసం రూ.100 (ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంక్ లాంటివి) నుంచి ఆర్డీ చేయొచ్చు. ఐసీఐసీఐ వంటి ప్రైవేట్ బ్యాంకుల్లో ఈ మొత్తం రూ.500. పోస్టాఫీసులోనైతే నెలకు రూ.10 వేయొచ్చు. వడ్డీ రేట్లు 7-10% దాకా ఉన్నాయి. మూడు నెలలకోసారి వడ్డీని లెక్కించి అసలుకు జమచేస్తారు. గడువుకన్నా ముందే ఆర్డీని వెనక్కి తీసుకోవచ్చు. కొంత పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వెనక్కి తీసుకోవటం ఇష్టం లేకుంటే... ఆర్డీలో జమ అయిన మొత్తంలో 90 శాతం దాకా లోన్ తీసుకోవచ్చు. ఆర్డీపై వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. స్వల్పకాలానికి సింపుల్ సాధనం.. కొత్తగా పొదుపు ఆరంభించిన వారు... హడావుడిగా ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఆర్డీతో మొదలుపెట్టడం బెటర్. నెలనెలా కొంతమొత్తాన్ని నిర్దిష్ట కాలానికి డిపాజిట్ చేయటమే ఆర్డీ. దీనివల్ల క్రమం తప్పకుండా పొదుపు చేయడం అలవాటవుతుంది. ఒకటి రెండేళ్లు గడిచాక మెల్లగా మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ వంటి ఇతర సాధనాలపై అవగాహన పెంచుకుని ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టొచ్చు. -
‘కోడ్స్’తో కొడతారు!
మహారాష్ట్రలోని ఆటో, క్యాబ్ డ్రైవర్ల ప్లానింగ్ సంకేత పదాలతో ‘టార్గెట్స్’ ఎంపిక గుర్తించకుంటే దుండగుల బారిన పడ్డట్టే! అనూహ్య కేసు దర్యాప్తులో వెలుగులోకి ఒంటరిగా, తొలిసారి వెళ్లేవాళ్లు జాగ్రత్త: పోలీసుల సూచన సాక్షి, సిటీబ్యూరో: కొత్త ప్రదేశానికి వెళ్లాలంటేనే ఒక విధమైన బెరుకు. అక్కడి భాష, యాస ఇతరత్రా అన్నీ కొత్తగానే ఉంటాయి. ఒకవేళ మీరు మహారాష్ట్రలోని పట్టణాలకు తొలిసారి వెళ్తున్నా, అక్కడి క్యాబ్/ఆటోల్లో ఎక్కాలన్నా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ‘అక్కడి బస్సు, రైల్వే స్టేషన్లలో దిగగానే మీ చుట్టూ మూగిన డ్రైవర్ల నోటి వెంట ‘బెటర్’, ‘మాంగ్లో’, ‘జీపీఎల్’ వంటి కొత్త పదాలు వినిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వారి వాహనాల్లోకి ఒంటరిగా ఎక్కకండి. సదరు డ్రైవర్లు నిలువు దోపిడీకో, మోసగించడానికో పథకం పన్నారని గుర్తుంచుకోండి. మహిళలు, యువతులు మరింత అప్రమత్తంగా ఉండాలి’ అని పోలీసులు సూచిస్తున్నారు. ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్యకు గురైన నేపథ్యంలో ఒంటరిగా మహారాష్ట్రలోని పట్టణాలకు వెళ్లాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. అసలీ ‘కోడ్స్’ ఏమిటి? అవి ఎందుకు?.. చదవండి మీకే తెలుస్తుంది. అనూహ్య కేసు దర్యాప్తులో వెలుగులోకి.. ముంబైలోని టీసీఎస్‌లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, మచిలీపట్నం వాసి అనూహ్య అక్కడి కుందూర్ మార్గ్-భాందూప్ మధ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నెల 5న, ఉదయం 4.55 గంటలకు కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినల్ (ఎల్టీటీ) స్టేషన్లో రైలు దిగిన ఆమె ఆ తరవాత అదృశ్యమైంది. కొన్ని రోజుల తరవాత ఆమె మృతదేహం బయటపడింది. ఈ ఘాతుకం ఎల్టీటీ పరిసరాల్లో ఉండే ఆటో/క్యాబ్ డ్రైవర్ల పనిగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముంబై క్రైమ్‌బ్రాంచ్ అధికారుల దర్యాప్తులో ‘కోడింగ్’ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సంకేత పదాల ద్వారా ప్రయాణికులకు అర్థం కాకుండా ఒకరితో మరొకరు సంప్రదించుకుంటున్న డ్రైవర్లు టార్గెట్స్‌ను ఎంపిక చేసుకుని పంజా విసురుతున్నారని గుర్తించామని అధికారులు చెబుతున్నారు. ఇలా చేయడం ఉత్తమం ఈ తరహా పదాలు, ముఠాలు మహారాష్ట్రలో చాలా ఉన్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణ సందర్భంలో వారికి ఎదురు తిరిగినా, ప్రతిఘటించినా దాడులకు వెనుకాడరు. ఒంటరిగా, తొలిసారి ఆయా ప్రాంతాలకు వెళ్లే వారు కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. కొత్తగా, ఒంటరిగా ఆయా ప్రాంతాలకు వెళ్లే వారు వాహనాలను అద్దెకు తీసుకోరాదు. రాత్రి, తెల్లవారుజాము వేళల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి వీలున్నంత వరకు ప్రీపెయిడ్ సర్వీస్‌ను వినియోగించుకోవాలి. ఎక్కే వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, డ్రైవర్ పేరు, ఇతర వివరాలను బంధువులు, స్నేహితులకు ఫోన్‌చేసి చెప్పాలి. ఇది డ్రైవర్‌కు తెలిసేలా చేయాలి ప్రీపెయిడ్ సేవలు అందుబాటులో లేకుంటే తోటి ప్రయాణికుల్ని సంప్రదించి, వారితో కలిసే వాహనంలో ప్రయాణించాలి. అలాకాని పక్షంలో వాహనాన్ని మాట్లాడుకునేందుకు పోలీసుల సహకారం తీసుకోవాలి అక్కడకు వెళ్లగానే రిసీవ్ చేసుకునేందుకు అక్కడ నివసిస్తున్న బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల్ని రమ్మని కోరాలి. మహిళలు/యువతులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి బెటర్ ప్లాట్‌ఫామ్ వద్ద రైలు ఆగగానే అప్పటికే అక్కడకు చేరుకునే ‘డ్రైవర్ ముఠా’ సభ్యుడు ఒంటరిగా రైలు దిగుతున్న, ముఖ్యంగా మహిళలు, యువతుల్ని గుర్తిస్తాడు. వారు బయటకొచ్చి ఆటో/క్యాబ్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో, వారు ఒంటరిగా వచ్చారని తెలిపేందుకు ముఠా సభ్యుడు మిగిలిన వారికి ‘బెటర్’ అంటూ సమాచారమిచ్చి టార్గెట్ చేయాలని సూచిస్తాడు. మాంగ్లో ప్రయాణికుల ఆహార్యం, ప్రవర్తనను బట్టి వారికి మహారాష్ట్రతో పరిచయం ఉందా? లేదా? అనేది ఇట్టే గుర్తుపట్టేస్తారు. తొలిసారి వచ్చిన వారైతే మోసం చేయడం తేలిక కావడంతో ఆ విషయాన్ని ఇతర ముఠా సభ్యులకు తెలిపేందుకు వారికి వినిపించేలా ‘మాంగ్లో’ పదాన్ని ప్రయోగిస్తాడు. జీపీఎల్ మార్గమధ్యంలో మోసం చేయడానికి అనువుగా తయారు చేసుకున్న పదం ‘జీపీఎల్’. ప్రయాణికుడు ప్రీపెయిడ్ వాహనం తీసుకున్నా, ముందే కిరాయి చెల్లించినా అతడిని ఎక్కించుకునే ముఠా సభ్యుడు మరొకరితో ‘జీపీఎల్’ అంటాడు. అంటే తన వాహనాన్ని అనుసరించాలని అర్థం. మధ్యలో బ్రేక్‌డౌన్ పేరుతో ప్రయాణికుడిని దించేసిన తరువాత ఎక్కువ మొత్తం డిమాండ్ చేస్తూ ఎక్కించుకోమని అర్థం. -
కారు కోరిక తీరిందిలా...
ఏ కోరికైనా సరే! సరైన ప్లానింగ్ ఉంటే సాధించటం కష్టమేమీ కాదు. చిరుద్యోగులైనప్పటికీ అనురాధ, రాఘవ దంపతులు తమకిష్టమైన కారు కొనుక్కోగలిగారంటే ప్లానింగ్ వల్లే. ఇక్కడ కారు కొనటం పెద్ద విశేషమేమీ కాకపోవచ్చు. కానీ... తాము అనుకున్న రీతిలో, అనుకున్న కారును... ఇంకా చెప్పాలంటే ఇన్స్టాల్మెంట్ మొత్తం నుంచి డౌన్‌పేమెంట్ వరకు, లోను వ్యవధి వరకు అంతా తాము ప్లాన్ చేసినట్లుగానే చేయగలిగారు వీళ్లిద్దరూ. అదెలా సాధ్యమైందో మీరూ చూడండి. ‘మా ఇద్దరివీ ప్రైవేటు ఉద్యోగాలే. కారు కొనుక్కోవాలన్నది మా చిరకాల కోరిక. కొన్నాళ్లు ఆగినా... ఇక కొనేయాల్సిందేనని అనుకున్నాక ఎలా..? అనే ప్రశ్న తలెత్తింది. ముందు డౌన్‌పేమెంట్ గురించి ఆలోచించాం. మా ఇద్దరి జీతాల్లోంచీ నెలకు రూ.10 వేలు పక్కనపెట్టినా పెద్ద ఇబ్బంది ఉండదని మాకు తెలుసు. అందుకని నెలవారీ వాయిదా రూ.10 వేలు మించకూడదనుకున్నాం. దాన్నిబట్టి డౌన్‌పేమెంట్‌గా ఎంత చెల్లించాలన్నదానిపైనా ఒక అవగాహనకు వచ్చాం. డౌన్‌పేమెంట్ ఎంత కావాలో తెలిసింది కనుక దానికోసం రెండేళ్లపాటు జీతాల్లో నుంచి కొంత మేర తీసి పక్కన పెట్టడం మొదలుపెట్టాం. మారుతి కారు కొనాలని ముందే అనుకున్నాం. కాకపోతే ఏ మోడల్ తీసుకోవాలన్నది మాత్రం అంత త్వరగా తేలలేదు. మా వారు దీనికోసం దాదాపు ఏడాది పాటు స్టడీ చేశారు. ప్రతి మోడల్ ఖరీదు... మెయింటెనెన్స్ ఖర్చులు అన్నీ ఆరా తీసి తెలుసుకున్నారు. మా అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని... చివరకు స్విఫ్ట్ డిజైర్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. మొత్తం నగదు చెల్లించి కారు తీసుకునే అవకాశమెటూ లేదు. కాబట్టి రుణం తీసుకోక తప్పదు. అయితే మేం ఒక్కటే అనుకున్నాం. రుణం మూడేళ్లలో తీరిపోవాలి. ఈఎంఐ 10వేలు మించకూడదు. దాని ప్రకారమే మా ప్లానింగ్ సాగింది. ఇంకో విషయం చెప్పాలి. మేం బుక్ చేసుకున్నా కారు అంత సులువుగా రాలేదు. మారుతి ప్లాంటులో కార్మికుల సమ్మె వంటి గొడవల వల్ల డెలివరీకి దాదాపు ఏడాది పట్టేసింది. దాంతో బుక్ చేసినప్పుడున్న రూ. 7.6 లక్షల రేటు చేతికొచ్చేలోగా రెండు సార్లు పెరిగి రూ.7.8 లక్షలకు చేరింది. ఇలాంటివాటికి కూడా సిద్ధమై ఉండాలన్నది అప్పుడు తెలి సింది. మొత్తానికి ఏడాదిన్నర కిందట కారు చేతికొచ్చింది. మరో ఏడాదిన్నర గడిస్తే రుణం కూడా తీరిపోతుంది. క్రమం తప్పని పొదుపు... కొనాలనుకున్నదానిపై కొంత అధ్యయనం... బడ్జెట్ అదుపునకు ప్లానింగ్... ఈ మూడూ ఉంటే ఏదైనా కొనొచ్చని తెలుసుకున్నాం.’ - కామని అనూరాధ, హైదరాబాద్ ఇలాంటి విజయగాథలు మీకూ ఉంటే మాతో పంచుకోండి. మీ వివరాలతో సాక్షి కార్యాలయానికి లేఖ రాయండి. లేదా business@sakshi.comకి ఈమెయిల్ కూడా పంపవచ్చు. -
ఆగస్టు 8 నుంచి 28 దాకా మూడో విడత రచ్చబండ