బీఆర్కే భవన్లో ఎవరెక్కడ?
• తొమ్మిది అంతస్తులు.. మూడు బ్లాక్‌లు
• తొమ్మిదో అంతస్తులో సీఎం, డిప్యూటీ సీఎంలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం తరలించే చర్యల్లో భాగంగా తాత్కాలిక భవనాల ప్రణాళికను ప్రభుత్వం తయారు చేసింది. ప్రస్తుతమున్న సచివాలయంలో అత్యధిక శాఖల ఆఫీసులన్నీ సమీపంలోని బూర్గుల రామకృష్ణారావు (బీఆర్‌కే) భవన్‌కు తరలించాలని నిర్ణయించింది. బీఆర్‌కే భవన్‌లో మొత్తం తొమ్మిది ఫ్లోర్‌లున్నాయి. ఒక్కో ఫ్లోర్‌లో మూడు బ్లాక్‌లున్నాయి. వీటిలో ఏ ఫ్లోర్‌కు ఏ కార్యాలయం తరలించాలి.. తాత్కాలిక వసతికి ఎంత స్థలం కేటాయించాలనే ప్రణాళికను ప్రభుత్వం రూపొందించుకుంది.
ఎనిమిదో ఫ్లోర్‌లో సీఎస్...
ఎనిమిదో ఫ్లోర్‌లో డీ బ్లాక్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆఫీసు, సీఎస్ పేషీ, మీటింగ్ హాల్, అదే ఫ్లోర్‌లోని సీ బ్లాక్‌లో పొలిటికల్ ముఖ్య కార్యదర్శి, విజిటర్స్ రూమ్, ముగ్గురు డిప్యూటీ సెక్రెటరీలు, అడిషనల్ సెక్రెటరీ, ముఖ్య కార్యదర్శి (జీపీఎం అండ్ ఏఆర్), సెక్రెటరీ సర్వీసెస్ విభాగం. బీ బ్లాక్‌లో హోంమంత్రి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి, వైద్యారోగ్య మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఆఫీసు.
ఏడో ఫ్లోర్‌లో జీఏడీ..
ఏడో ఫ్లోర్‌లో డీ బ్లాక్‌లో జీఏడీ అసిస్టెంట్ సెక్రెటరీలు ముగ్గురు, జీఏడీకి సంబంధించి 19 సెక్షన్లుంటాయి. సీ బ్లాక్‌లో ముగ్గురు డీఎస్‌లు, ముగ్గురు డీఎస్, ముగ్గురు ఏఎస్‌లు, ఆర్థిక శాఖకు సంబంధించి 25 సెక్షన్లుంటాయి. బీ బ్లాక్‌లో ఆర్థిక మంత్రి, ముఖ్య కార్యదర్శి ఆఫీసు.
ఆరో ఫ్లోర్‌లో ఇంధన శాఖ...
ఆరో ఫ్లోర్‌లో అడ్వకేట్ జనరల్, జీఏడీ డీఎస్, ఏఎస్ సెక్షన్లు, పశుసంవర్థక ముఖ్య కార్యదర్శి, విద్యుత్ మంత్రి, ఆ శాఖ కార్యదర్శి.
అయిదో ఫ్లోర్...
స్టోర్ రూమ్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, డిజిటల్ విభాగాలు, సంబంధిత జాయింట్ సెక్రెటరీ, డిప్యూటీ, అసిస్టెంట్ సెక్రెటరీలు. పర్యాటక మంత్రి, శాఖ కార్యదర్శి, రవాణా మంత్రి, రాష్ట్ర ప్రణాళిక విభాగం ఉపాధ్యక్షుడు.
నాలుగో ఫ్లోర్...
ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి, మంత్రులు, కార్యదర్శులకు ఉమ్మడి ఆఫీస్ రూమ్, అదే ఫ్లోర్‌లో సీ బ్లాక్‌లో కాన్ఫరెన్స్ హాల్, బీ బ్లాక్‌లో ఐటీ, మున్సిపల్ మంత్రి, ఆ శాఖ స్పెషల్ సీఎస్, పేషీ, ఎక్సైజ్ మంత్రి, రెవెన్యూ(ఎక్సైజ్) ముఖ్య కార్యదర్శి.
మూడో ఫ్లోర్...
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ సెక్షన్లు, ప్రభుత్వ సంస్థల విభాగం, సీ బ్లాక్‌లో ఐదు గురు ప్రభుత్వ సలహాదారులు, పరిశ్రమలు , వాణిజ్యం, పబ్లిక్ ఎంటర్‌ప్రెజైస్ కార్యదర్శి, ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖల కార్యదర్శులు.
రెండో ఫ్లోర్...
రెవెన్యూ (వాణిజ్య పన్నులు), రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) విభాగాలు, ప్లానింగ్ విభాగం, పశుసంవర్ధక శాఖ, ఎస్సీ అభివృద్ధి శాఖ, కార్మిక ఉపాధి కల్పన, ఫ్యాక్టరీల శాఖ అధికారులు, సెక్షన్లు, కార్మిక ఉపాధి ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ ముఖ్య కార్యదర్శి, కమలనాథన్ కమిషన్, ఇంధన శాఖ అధికారులు, ఆఫీసులు.
ఒకటో ఫ్లోర్...
వైద్య ఆరోగ్య శాఖ, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ అధికారులు, సెక్షన్లు, సీపీఆర్‌వో, సీఎం పీఆర్‌వోలు, ఉన్నత విద్య, పాఠశాల విద్య శాఖ
గ్రౌండ్ ఫ్లోర్, గ్యారేజీలు..
చీఫ్ సెక్యూరిటీ ఆఫీస్, గిరిజన, మైనారిటీ సంక్షేమ విభాగాలు, ఎస్‌బీ స్టోర్స్, ఆర్ అండ్ బీ సివిల్ అండ్ ఎలక్ట్రికల్, ఎంఈఏ బ్రాంచ్.
తొమ్మిదో ఫ్లోర్‌లో సీఎం ఆఫీస్
బీఆర్‌కే భవన్‌లో అత్యంత ఎత్తున ఉన్న తొమ్మిదో ఫ్లోర్‌లో డీ బ్లాక్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కార్యాలయం, సీ బ్లాక్‌లో సీఎంవో కార్యదర్శులు, విజిటర్స్ రూమ్, జీఏడీ ప్యాంట్రీ, బీ బ్లాక్‌లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రెవిన్యూ ముఖ్య కార్యదర్శి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, విద్యా ముఖ్య కార్యదర్శి, డిప్యూటీ సీఎంల పేషీలు ఉంటాయి.