BRK Bhavan
-
సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం ఎఫెక్ట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటించని భవ నాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రుల బృందం ఉన్నతాఅధికారులను ఆదేశించింది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర అ న్ని ప్రధాన నగరాల్లోని బహుళ అంతస్తుల భవ నాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసు కునే చర్యలకు సంబంధించి ‘ఫైర్ సేఫ్టీ ఆడిట్’ నిర్వహించాలని నిర్దేశించింది. అగ్నిమాపక శాఖకు ఆధునిక సామగ్రిని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రస్తుతం శాఖకు అవసరమైన అత్యవసర సా మగ్రికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయా లని సూచించింది. బహుళ అంతస్తుల భవనాల్లో అగ్ని మాపక చర్యలపై సందేహాలు తలెత్తిన నేప థ్యంలో బుధవారం మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ బీఆర్కేఆర్ భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అర్వింద్‌కుమార్, సునీల్‌శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి విపత్తులు సంభవించకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. సికింద్రాబాద్‌లోని డెక్కన్ మాల్లో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ముగ్గురు బలైన నేపథ్యంలో ప్రభుత్వం ఈమేరకు చర్యలు చేపట్టింది. డెక్కన్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన ముగ్గురి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని నిర్ణయించింది. డ్రోన్ సాంకేతికతను వినియోగించండి మునిసిపల్ నిబంధనల ప్రకారం ఐదంతస్తులు, ఆపై నిర్మించే భవనాల విషయంలో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు జర పడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతు న్నాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాలలోని వ్యాపార, వాణిజ్య భవనాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఎత్తైన అపార్ట్మెంట్లలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవసరమైతే ప్రస్తుతమున్న ఫైర్‌సేఫ్టీ చట్టాలను సవరించాలని చెప్పారు. హైదరాబాద్‌లో భారీగా నిర్మాణమవుతున్న బహుళ అంతస్తుల భవనాల ఫైర్ సేఫ్టీకి సంబంధించి డ్రోన్లు, రోబోటిక్ సాంకేతికతను వినియోగించుకునే అంశాలను పరిశీలించాలన్నారు. ఈ మేరకు పాశ్చాత్య దేశాలతోపాటు దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న మెరుగైన పద్ధతులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న అగ్నిమాపక సిబ్బందికి మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, వారిని నిష్ణాతులను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా భవనాల యజమానులను కూడా భాగస్వాములను చేసుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో ఇంకా జలమండలి ఎండీ దాన కిషోర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర , రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్, హైదరాబాద్ కలెక్టర్ అమేయ్ కుమార్ పాల్గొన్నారు. -
ఉద్యోగుల విభజన త్వరగా చేపట్టండి
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన, జిల్లాలు, జోన్ల కేటాయింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ ఆదేశించారు. ఈమేరకు సోమవారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, అన్ని విభాగాల అధిపతులతో ఉద్యోగుల విభజన ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించే ప్రక్రియ పూర్తయిందని, అన్ని కేడర్లలో సీనియారిటీ జాబితాలను సిద్ధం చేశామని ఉన్నతాధికారులు సీఎస్‌కు వివరించారు. అనంతరం సోమేశ్ మాట్లాడుతూ విభజన ప్రక్రియ గురించి సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నందున వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో వైద్య, మహిళా శిశు సంక్షేమ, యువజన సర్వీసులు, పర్యాటక–సాం స్కృతిక, అన్ని సంక్షేమ శాఖలు, రెవెన్యూ, పౌరసరఫరాలు, పోలీస్, పంచాయతీరాజ్, పురపాలక, విద్యుత్, అటవీ, వ్యవసాయ, రోడ్లు భవనాలు, రవాణా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మూడోవారం నుంచి ‘పోడు’ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: పోడు భూముల సాగుదా రుల నుంచి దరఖాస్తుల స్వీకరణకుగాను విధివిధానాలను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ నెల మూడోవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తు ఏ విధంగా ఉండాలి, అందులో పొందుపరిచే అంశాలు, అటవీ సరిహద్దుల కోఆర్డినేట్స్ నిర్ణయం, వివిధ స్థాయిల్లో కమిటీల ఏర్పాటు, అటవీ పరిరక్షణకు పౌరుల భాగస్వామ్యం తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ అంశాలపై త్వరలో జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ కన్జర్వేటర్లు, డీఎఫ్‌వోలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. -
‘కేసీఆర్ ఆదేశాలను సీఎస్ పట్టించుకోవడం లేదు’
సాక్షి, హైదరాబాద్: బీఆర్కే భవన్లో సీఎస్ చాంబర్ ముందు ఉద్యోగులు గురువారం ఆందోళన నిర్వహించారు. సచివాలయంలో తమకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ఒక్కసారి మాత్రమే ప్రమోషన్లు ఇచ్చారని ఉద్యోగులు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలను సీఎస్ పట్టించుకోవడంలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాలను వెంటనే అమలు చేయాలని సచివాలయ ఉద్యోగులు నినాదాలు చేశారు. ఇవీ చదవండి: గ్రామాభివృద్ధి కమిటీ అరాచకం.. 70 దళిత కుటుంబాల బహిష్కరణ సముద్రంలో అల్లకల్లోలం: ముందుకొచ్చి.. వెనక్కి మళ్లి.. -
40 నిమిషాలు లిఫ్టులోనే.. ఉక్కిరిబిక్కిరైన అధికారులు
సాక్షి, హైదరాబాద్: సచివాలయంగా వినియోగిస్తున్న బీఆర్కేఆర్ బిల్డింగ్‌లో శుక్రవారం ఓ లిఫ్టు ఏడుగురు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఏకంగా 40 నిమిషాల పాటు రెండు అంతస్తుల మధ్యలో నిలిచిపోవటంతో గందరగోళం నెలకొంది. అంతసేపు లిఫ్టు ఆగిపోవటంతో అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ లిఫ్టు కంపెనీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రభుత్వ కొత్త భవనాల్లో ఎక్కువగా ఇదే కంపెనీ లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారని, బీఆర్కేఆర్ భవనాన్ని సచివాలయంగా మార్చిన నేపథ్యంలో ఏడాది క్రితమే ఈ లిఫ్టు ఏర్పాటు చేశారని, ఇలాంటి నాసిరకం లిఫ్టులను ఇకపై కొత్తగా నిర్మించే భవనాల్లో అనుమతించవద్దని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది. శంషాబాద్–అరాంఘర్ మధ్య ఆరువరుసల రోడ్డుకు సంబంధించి శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి రోడ్లు, భవనాల శాఖకు చెందిన నలుగురు అధికారులు, కేంద్ర ఉపరితల రవాణా శాఖకు చెందిన ముగ్గురు అధికారులు హాజరు కావాల్సి ఉంది. సీఎస్ కార్యాలయానికి వెళ్లేందుకు వారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో లిఫ్టు ఎక్కారు. మొదటి–రెండో అంతస్తు మధ్యలోకి రాగానే సాంకేతిక కారణాలతో లిఫ్టు నిలిచిపోయింది. అది ఎంతసేపటికీ పనిచేయకపోవటంతో దాదాపు 40 నిమిషాల తర్వాత బలవంతంగా తలుపులు తెరిపించి చిన్న నిచ్చెన ద్వారా లోపల ఇరుక్కున్న వారిని అతికష్టంమీద బయటకు తీశారు. సాధారణంగా సమస్యలు తలెత్తితే లిఫ్టులు తదుపరి అంతస్తుకు వెళ్లి తలుపులు తెరుచుకునే సాంకేతికత ప్రస్తుతం అందుబాటులో ఉంది. కానీ ఏడాది క్రితమే ఏర్పాటు చేసిన ఈ లిఫ్టు అలా కాకుండా మధ్యలో నిలిచిపోవటం, కొంతసేపు ఫ్యాన్ కూడా ఆగిపోవటంతో లోపల ఉన్న అధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. -
బీఆర్కేఆర్ భవన్: కరోనా వచ్చిన విషయం దాచి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తాత్కాలిక సచివాలయం బీఆర్కేఆర్ భవన్లో కరోనా కలకలం రేపుతోంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్లో పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచి అధికారులు ఆఫీసుకు వచ్చినట్లు సమాచారం. గడిచిన వారం రోజుల్లో పదుల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదుకావటంతో మిగతా ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఆఫీసుకు వచ్చి విధులు నిర్వర్తించాలని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీ చేశారనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరైనా జాగ్రత్తలు తీసుకోకపోవండ వల్లే బీఆర్కేఆర్ భవన్లో కరోనా కేసులు పెరగుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: కట్టడి లేని కరోనా.. విజృంభిస్తున్న మహమ్మారి -
పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) రిపోర్టు బుధవారం విడుదలైన సంగతి తెలిసిందే. పీఆర్సీ కమిషన్ నివేదికపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. నివేదికకు వ్యతిరేకంగా బీఆర్కే భవన్ ఎదుట ఉద్యోగ సంఘాల ధర్నాకు దిగడమేకాక పీఆర్సీ ప్రతులను చించేశాయి. ఇక ధర్నా నేపథ్యంలో పోలీసులకు, ఉద్యోగ సంఘాలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దాంతో పోలీసులు పలువురు ఉద్యోగ సంఘం నేతలను అరెస్ట్ చేశారు. ఇక ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. -
యుద్ధప్రాతిపదికన మొక్కల పెంపకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రస్తుత వర్షాకాల సీజన్లో యుద్ధ ప్రాతిపదికన పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో పట్టణాల్లో హరితహారం నిర్వహణపై సమీక్ష జరిపారు. రాష్ట్రంలో అడవుల పునరుజ్జీవంతో పాటు ఆక్రమణలనుంచి కాపాడాలన్న సీఎం కేసీఆర్ విజన్‌ను అమలు చేయడానికి అధికారులు పచ్చదనం పెంపొందించడానికి పనిచేయాలన్నారు. రాష్ట్రంలో 129 లొకేషన్ల లోని 188 ఫారెస్ట్ బ్లాక్‌లకు సంబంధించి 1.60 లక్షల ఎకరాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నివసించడానికి మొక్కలు నాటడానికి వీలున్న ప్రతీ చోట మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను కోరారు. జీహెచ్ఎంసీ ద్వారా కాంప్రహెన్సివ్ రోడ్ మేనేజ్ మెంట్ కార్యక్రమం క్రింద చేపడుతున్న రోడ్లకు ఇరుప్రక్కల, శ్మశాన వాటికలు, పాఠశాలలు, చెరువులు, డ్రైన్ల వెంట నాటాలన్నారు. మెట్రో కారిడార్ల ఇరుప్రక్కలు, మీడియంలు, డిపోల వద్ద పచ్చదనం పెంపొందించాలన్నారు. హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ, హెచ్ఎంఆర్ఎల్, అటవీ శాఖల ద్వారా అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ లలో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని సూచించారు.క్యాంపా నిధుల కింద అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ల అభివృద్ధికి గాను కేంద్రానికి పంపడానికి రూ.900 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ల కోసం క్యాంపా కింద ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఫారెస్ట్ బ్లాక్‌ల భూసమస్యల పరిష్కారం కోసం ఆర్డీఓ, డీఎఫ్ఓ, సంబంధిత ఏజెన్సీలతో ఫారెస్ట్ బ్లాక్ లెవల్ కమిటీని ఏర్పాటు చేసి వారంలోపు పరిష్కరించాలన్నారు. నాటే మొక్కల పురోగతిపై క్రమం తప్పకుండా సమీక్షించనున్నట్లు సీఎస్ తెలిపారు. -
ఏపీ, తెలంగాణ అధికారుల భేటీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన వివాదాల పరిష్కారం దిశగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమై మరో దఫా చర్చలు జరిపారు. ఏపీ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి (ఎక్స్అఫీషియో) ఎల్.ప్రేమ్‌చంద్రారెడ్డి, తెలంగాణ ఆర్థిక శాఖ సీనియర్ కన్సల్టెంట్, రిటైర్డ్ ఐఏఎస్ ఎన్.శివశంకర్ల నేతృత్వంలో ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమై చర్చలు జరిపారు. రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్-9లో 89 ప్రభుత్వ రంగ సంస్థలుండగా, ఇప్పటికే 53 సంస్థల విభజన విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మిగిలిన వాటిలో నాలుగు సంస్థల విభజనపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోయినా, చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని అధికారవర్గాలు వెల్లడించాయి. వచ్చే సోమవారం మళ్లీ సమావేశమై చర్చలను ముందుకు కొనసాగించాలని నిర్ణయించారు. ఇచ్చిపుచ్చుకునే విధానంలో చర్చల ద్వారా విభజన వివాదాలు పరిష్కరించుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావులు నిర్ణయించిన విషయం తెలిసిందే. -
ఆలో‘చించే’ పడేశారా?
సాక్షి, హైదరాబాద్ : నిన్న మొన్నటి వరకు విలువైన కాగితాలేనని భద్రంగా దాచిపెట్టుకున్న కాగితాలను ఇప్పుడు ముక్కలుముక్కలుగా చించేసి పడేశారు. ఇది కూల్చివేతకు సిద్ధ మవుతున్న రాష్ట్ర సచివాలయ భవనాల్లోని దృశ్యం. సామాన్య ప్రజలతో పాటు వివిధ వర్గాల నుంచి వందలు, వేల సంఖ్యలో వచ్చిన అర్జీలను ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టిన సచివాలయ అధికారులు.. చివరకు సచివాలయ కార్యాలయాల తరలింపును సాకుగా చూపుతూ ఇలా వదిలించుకుని చేతులు దులుపుకుంటున్నారనే అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల నుంచి వచ్చిన అర్జీలతో పాటు పాత జీవోల కాపీలు, సర్క్యులర్లు, ప్రభుత్వ శాఖల మధ్య అంతర్గత వ్యవహారాలకు సంబంధిం చిన పాత లేఖలు, ప్రభుత్వ సమావేశాలకు సంబంధించిన కాగితాలను ముక్కలు ముక్కలుగా చించి చిందరవందరగా పడేస్తు న్నారు. పాత సచివాలయ భవనమంతా కుప్పలుతెప్పలుగా పడేసిన కాగితాల కుప్పలే దర్శనమిస్తున్నాయి. ఏ రోజైనా తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అర్జీలు పెట్టుకున్న వ్యక్తులు ఓ వైపు నిరీక్షిస్తుంటే.. వారికి తెలియకుండానే వీటన్నింటినీ బుట్టదాఖలు చేసేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చించిపడేసిన కాగితాల్లో వివిధ సమస్యలపై సామాన్య ప్రజల నుంచి వచ్చిన అర్జీలే ఎక్కువగా ఉండడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. రోజూ సచివాలయానికి వందల సంఖ్యలో ప్రజలు వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని అర్జీలు పెట్టుకుంటూ ఉంటారని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతస్థాయి వ్యక్తుల సిఫారసులు ఉన్న కొన్నింటికి మాత్రమే పరిష్కార యోగం లభిస్తుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. సాదాసీదా వ్యక్తుల అర్జీలు ఏళ్ల తరబడి సంబంధిత సెక్షన్ల అధికారుల వద్దే పెండింగ్‌లో ఉంటాయని, ఇలా నిర్లక్ష్యానికి గురైన ఫైళ్లను అవసరమైనప్పుడు వెతికినా దొరకని విధంగా వాటిని ఎక్కడో పడేస్తారని ఓ సీనియర్ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఇలా అదృశ్యమైన తమ ఫైళ్లను వెతుక్కుంటూ వచ్చే వారు ఎందరో ఉంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం సచివాలయం ఖాళీ చేస్తున్న తరుణంలో ఇలాంటి ఫైళ్లు, అర్జీలు బయటపడితే వాటిని అక్కడికక్కడే చించిపారేస్తున్నారన్నారు. ఇలా మొత్తం సచివాలయం ఖాళీ చేసేసరికి టన్నుల కొద్దీ కాగితాలు, పాత ఫైళ్లు బుట్టదాఖలు కావడం ఖాయమని సచివాలయ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్కే భవన్‌కు ఫైళ్లు ప్రస్తుత సచివాలయంలోని భవనాలన్నింటినీ కూల్చివేసి అక్కడే ఆధునిక సదుపాయాలతో కొత్త సచివాలయ భవన సముదాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత సచివాలయ భవనాలను ఖాళీ చేసే క్రమంలో.. ఇక్కడి కార్యాలయాలను తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌కు తరలిస్తోంది. గత సోమవారం ప్రారంభమైన సచివాలయం శాఖల కార్యాలయాల తరలింపు వేగవంతమైంది. సాధారణ పరిపాలన శాఖ సూచనల మేరకు ఫైళ్లు, ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర సామగ్రికి సంబంధించిన జాబితాలను అన్ని శాఖలు తయారు చేసుకున్నారు. తరలింపు సమయంలో ఫైళ్లు, ఇతర సామగ్రి గల్లంతు కాకుండా ఈ జాబితాలను ఉపయోగిస్తున్నారు. అయితే, ప్రజల నుంచి వచ్చిన అర్జీల ఫైళ్లను ‘ప్రాధాన్యత లేనివి’గా పరిగణించి వాటిని తాత్కాలిక సచివాలయానికి తరలించకుండా ఇక్కడే వదిలించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సచివాలయం డీ–బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని సంక్షేమ శాఖలు, కమర్షియల్ ట్యాక్సుల శాఖలు, పై అంతస్తుల్లోని రెవెన్యూ, సీ–బ్లాక్ తొలి అంతస్తులో జీఏడీ కార్యాలయాల వద్ద ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా చించిపడేసిన కాగితాలే కనిపిస్తున్నాయి. ప్రధానంగా సంక్షేమ శాఖలు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాల లబ్ధిదారుల నుంచి వచ్చిన అర్జీలను ఏళ్ల తరబడి అపరిష్కృతంగా పెట్టి ఇప్పుడు బుట్టదాఖలు చేశారనే విమర్శలొస్తున్నాయి. తక్షణమే సచివాలయ తరలింపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గడువు విధించడం కూడా ప్రాధాన్యత లేని ఫైళ్లు, కాగితాలపై ఆలోచించకుండానే పడేస్తున్నారన్న చర్చమొదలైంది. -
బీఆర్కే భవన్లో ఎవరెక్కడ?
• తొమ్మిది అంతస్తులు.. మూడు బ్లాక్‌లు • తొమ్మిదో అంతస్తులో సీఎం, డిప్యూటీ సీఎంలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం తరలించే చర్యల్లో భాగంగా తాత్కాలిక భవనాల ప్రణాళికను ప్రభుత్వం తయారు చేసింది. ప్రస్తుతమున్న సచివాలయంలో అత్యధిక శాఖల ఆఫీసులన్నీ సమీపంలోని బూర్గుల రామకృష్ణారావు (బీఆర్కే) భవన్‌కు తరలించాలని నిర్ణయించింది. బీఆర్కే భవన్లో మొత్తం తొమ్మిది ఫ్లోర్లున్నాయి. ఒక్కో ఫ్లోర్లో మూడు బ్లాక్‌లున్నాయి. వీటిలో ఏ ఫ్లోర్‌కు ఏ కార్యాలయం తరలించాలి.. తాత్కాలిక వసతికి ఎంత స్థలం కేటాయించాలనే ప్రణాళికను ప్రభుత్వం రూపొందించుకుంది. ఎనిమిదో ఫ్లోర్లో సీఎస్... ఎనిమిదో ఫ్లోర్లో డీ బ్లాక్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆఫీసు, సీఎస్ పేషీ, మీటింగ్ హాల్, అదే ఫ్లోర్‌లోని సీ బ్లాక్‌లో పొలిటికల్ ముఖ్య కార్యదర్శి, విజిటర్స్ రూమ్, ముగ్గురు డిప్యూటీ సెక్రెటరీలు, అడిషనల్ సెక్రెటరీ, ముఖ్య కార్యదర్శి (జీపీఎం అండ్ ఏఆర్), సెక్రెటరీ సర్వీసెస్ విభాగం. బీ బ్లాక్‌లో హోంమంత్రి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి, వైద్యారోగ్య మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఆఫీసు. ఏడో ఫ్లోర్లో జీఏడీ.. ఏడో ఫ్లోర్లో డీ బ్లాక్‌లో జీఏడీ అసిస్టెంట్ సెక్రెటరీలు ముగ్గురు, జీఏడీకి సంబంధించి 19 సెక్షన్లుంటాయి. సీ బ్లాక్‌లో ముగ్గురు డీఎస్‌లు, ముగ్గురు డీఎస్, ముగ్గురు ఏఎస్‌లు, ఆర్థిక శాఖకు సంబంధించి 25 సెక్షన్లుంటాయి. బీ బ్లాక్‌లో ఆర్థిక మంత్రి, ముఖ్య కార్యదర్శి ఆఫీసు. ఆరో ఫ్లోర్లో ఇంధన శాఖ... ఆరో ఫ్లోర్లో అడ్వకేట్ జనరల్, జీఏడీ డీఎస్, ఏఎస్ సెక్షన్లు, పశుసంవర్థక ముఖ్య కార్యదర్శి, విద్యుత్ మంత్రి, ఆ శాఖ కార్యదర్శి. అయిదో ఫ్లోర్... స్టోర్ రూమ్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, డిజిటల్ విభాగాలు, సంబంధిత జాయింట్ సెక్రెటరీ, డిప్యూటీ, అసిస్టెంట్ సెక్రెటరీలు. పర్యాటక మంత్రి, శాఖ కార్యదర్శి, రవాణా మంత్రి, రాష్ట్ర ప్రణాళిక విభాగం ఉపాధ్యక్షుడు. నాలుగో ఫ్లోర్... ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి, మంత్రులు, కార్యదర్శులకు ఉమ్మడి ఆఫీస్ రూమ్, అదే ఫ్లోర్లో సీ బ్లాక్‌లో కాన్ఫరెన్స్ హాల్, బీ బ్లాక్‌లో ఐటీ, మున్సిపల్ మంత్రి, ఆ శాఖ స్పెషల్ సీఎస్, పేషీ, ఎక్సైజ్ మంత్రి, రెవెన్యూ(ఎక్సైజ్) ముఖ్య కార్యదర్శి. మూడో ఫ్లోర్... మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ సెక్షన్లు, ప్రభుత్వ సంస్థల విభాగం, సీ బ్లాక్‌లో ఐదు గురు ప్రభుత్వ సలహాదారులు, పరిశ్రమలు , వాణిజ్యం, పబ్లిక్ ఎంటర్‌ప్రెజైస్ కార్యదర్శి, ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖల కార్యదర్శులు. రెండో ఫ్లోర్... రెవెన్యూ (వాణిజ్య పన్నులు), రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) విభాగాలు, ప్లానింగ్ విభాగం, పశుసంవర్ధక శాఖ, ఎస్సీ అభివృద్ధి శాఖ, కార్మిక ఉపాధి కల్పన, ఫ్యాక్టరీల శాఖ అధికారులు, సెక్షన్లు, కార్మిక ఉపాధి ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ ముఖ్య కార్యదర్శి, కమలనాథన్ కమిషన్, ఇంధన శాఖ అధికారులు, ఆఫీసులు. ఒకటో ఫ్లోర్... వైద్య ఆరోగ్య శాఖ, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ అధికారులు, సెక్షన్లు, సీపీఆర్వో, సీఎం పీఆర్వోలు, ఉన్నత విద్య, పాఠశాల విద్య శాఖ గ్రౌండ్ ఫ్లోర్, గ్యారేజీలు.. చీఫ్ సెక్యూరిటీ ఆఫీస్, గిరిజన, మైనారిటీ సంక్షేమ విభాగాలు, ఎస్బీ స్టోర్స్, ఆర్ అండ్ బీ సివిల్ అండ్ ఎలక్ట్రికల్, ఎంఈఏ బ్రాంచ్. తొమ్మిదో ఫ్లోర్లో సీఎం ఆఫీస్ బీఆర్కే భవన్లో అత్యంత ఎత్తున ఉన్న తొమ్మిదో ఫ్లోర్లో డీ బ్లాక్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కార్యాలయం, సీ బ్లాక్‌లో సీఎంవో కార్యదర్శులు, విజిటర్స్ రూమ్, జీఏడీ ప్యాంట్రీ, బీ బ్లాక్‌లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రెవిన్యూ ముఖ్య కార్యదర్శి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, విద్యా ముఖ్య కార్యదర్శి, డిప్యూటీ సీఎంల పేషీలు ఉంటాయి.