ముంబై: భారత్‌లో వచ్చే ఏడాది వేతన పెంపులు అధిక స్థాయిలో ఉండొచ్చంటూ అంతర్జాతీయ అడ్వైజరీ సంస్థ ‘విల్లిస్ టవర్స్ వాట్సన్’ అంచనా వేసింది. 2021లో వేతన పెంపులు సగటు 8 శాతం స్థాయిలో ఉంటే, 2022లో సగటున 9.3 శాతానికి పెరగొచ్చంటూ ‘శాలరీ బడ్జెట్ ప్లానింగ్ రిపోర్ట్’లో పేర్కొంది. ఉద్యోగులను నిలుపుకోవడం, వారిని ఆకర్షించే సవాళ్లను కంపెనీలు ఎదుర్కొంటున్నాయని.. ఈ నేపథ్యంలో ఎక్కువ వేతన పెంపుల దిశగా అడుగులు వేయక తప్పదన్నది ఈ సంస్థ విశ్లేషణ.
వచ్చే 12 నెలల కాలానికి మెరుగైన వ్యాపార పరిస్థితుల దృష్ట్యా.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్‌లోనే ఎక్కువ వేతనాల పెంపు ఉంటుందని తన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఈ సంస్థ ద్వైవార్షిక సర్వే నిర్వహించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 13 దేశాల్లోని 1,405 కంపెనీల అభిప్రాయాలను తెలుసుకుంది. ఇందులో 435 భారత కంపెనీలు కూడా ఉన్నాయి. భారత్‌లో మెజారిటీ కంపెనీలు (52.2 శాతం) వచ్చే ఏడాది కాలానికి సానుకూల వ్యాపార ఆదాయ అంచనాలను వెల్లడించినట్టు ఈ నివేదిక తెలియజేసింది. 2020 నాలుగో త్రైమాసికంలో ఉన్న 37 శాతం కంటే ఇది ఎంతో మెరుగుపడినట్టు ప్రస్తావించింది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న దానికి ఇది నిదర్శనంగా పేర్కొంది.
సర్వే నివేదికలోని వివరాలు..
► 30 శాతం కంపెనీలు వచ్చే 12 నెలల్లో నియామకాలను పెంచనున్నట్టు తెలిపాయి. 2020లో ఉన్న గణాంకాలతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ.
► ఇంజనీరింగ్ (57.5 శాతం) ఐటీ (53.4 శాతం) సాంకేతిక నైపుణ్యాలతో కూడిన ట్రేడింగ్ (34.2 శాతం), విక్రయాలు (37), ఫైనాన్స్ 11.6 శాతం చొప్పున నియామకాలు ఉండనున్నాయి.
► ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్‌లోనే అట్రిషన్ (ఉద్యోగుల వలస) రేటు తక్కువగా ఉంది. స్వచ్చంద అట్రిషన్ రేటు (ఉద్యోగులు స్వయంగా మారిపోవడం) 8.9 శాతంగా, స్వచ్ఛందం కాని (కంపెనీలే ఉద్యోగులను తొలగించడం) అట్రిషన్ రేటు 3.3 శాతంగా ఉంది.
► 2022లో హైటెక్ రంగంలో 9.9 శాతం మేర వేతన పెంపు ఉండనుంది. ఆ తర్వాత కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, రిటైల్ రంగ్లాలో 9.5 శాతం మేర, తయారీలో 9.30 శాతం మేర పెంపు ఉండొచ్చు.
నిపుణులను నిలబెట్టుకోవడం సవాలు..
‘‘వ్యాపార ఆశావాదం పెరగడం అధిక వేతన బడ్జెట్‌కు, అధిక నియామకాలకు దారితీయనుంది. ఉద్యోగులపై ఖర్చు పెట్టే విషయంలో కంపెనీలకు కరోనా మహమ్మారి ఒక వాటర్òÙడ్ విప్లవం వంటిది’’ అని విల్లిస్ టవర్స్ వాట్సన్ కన్సలి్టంగ్ లీడర్ ఇండియా రాజుల్ మాథుర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment