Willis Towers Watson survey
-
వేతనాలు 10 శాతం పెంచే చాన్స్
ముంబై: భారత్‌లోని కంపెనీలు తమ ఉద్యోగులకు వచ్చే ఏడాది 10 శాతం వేతనం పెంచే అవకాశం ఉందని అడ్వైజరీ, బ్రోకింగ్, సొల్యూషన్స్ కంపెనీ విల్లిస్ టవర్స్ వాట్సన్ నివేదిక తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇదే అధికం అని వెల్లడించింది. ప్రస్తుత సంవత్సరంలో జీతాలు 9.5% అధికం అయ్యాయని వివరించింది. ‘ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, టెక్నాలజీ, మీడియా, గేమింగ్ రంగాల్లో వేతనాలు అత్యధికంగా 10–10.4 శాతం పెరగనున్నాయి. ఈ రంగాల్లో 2022లో ఇప్పటికే గణనీయంగా సాలరీలు పెరిగాయి. పెంపు 2023లోనూ ఇదే తరహాలో ఉండనుంది. గత ఏడాదితో పోలిస్తే దేశంలోని కంపెనీల యజమానుల్లో 58 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అధిక జీతాల పెంపుదల కోసం బడ్జెట్‌ను కేటాయించారు. 24.4% ఎటువంటి మార్పు చేయలేదు. 5.4% మంది తగ్గించారు. వచ్చే 12 నెలలు ఆదాయం మెరుగ్గా ఉంటుందని 42 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. తిరోగమనం ఉండొచ్చని 7.2 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి’ అని నివేదిక వెల్లడించింది. డిజిటల్ నిపుణుల కోసం.. ‘తదుపరి 12 నెలల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, అమ్మకాలు, సాంకేతికంగా నైపుణ్యం కలిగిన వ్యాపారాలు, ఫైనాన్స్ రంగాల్లో నియామకాలు ఉంటాయి. డిజిటల్ నైపుణ్యాలు కలిగిన వారి కోసం డిమాండ్ ఉండడం వేతనాల పెంపునకు కారణం అవుతోంది. హాంకాంగ్ తర్వాత రెండవ స్థానంలో ఉన్న భారత్‌లో స్వచ్ఛంద అట్రిషన్ అత్యధికంగా 15.1 శాతంగా కొనసాగుతోంది’ అని నివేదిక వివరించింది. గత సంవత్సరం బడ్జెట్ల కంటే వాస్తవ జీతాల పెంపుదల ఎక్కువగా ఉంది. ఊహించిన దాని కంటే మెరుగైన వ్యాపార పనితీరు, ప్రతిభను నిలుపుకోవాల్సిన అవసరం కారణంగా వేతన సవరణ జరిగిందని విల్లిస్ టవర్స్ వాట్సన్ కన్సల్టింగ్ ప్రతినిధి రాజుల్ మాథుర్ తెలిపారు. ఇక చైనా 6 శాతం, హాంగ్‌కాంగ్ 4, సింగపూర్ 4 శాతం వేతనాలు పెంచే చాన్స్ ఉంది. 2022 ఏప్రిల్–మే నెలల్లో 168 దేశాల్లో సర్వే జరిగింది. భారత్ నుంచి 590 కంపెనీలు పాలుపంచుకున్నాయి. -
వచ్చే ఏడాది ‘వేతన’ పండుగ!
ముంబై: భారత్‌లో వచ్చే ఏడాది వేతన పెంపులు అధిక స్థాయిలో ఉండొచ్చంటూ అంతర్జాతీయ అడ్వైజరీ సంస్థ ‘విల్లిస్ టవర్స్ వాట్సన్’ అంచనా వేసింది. 2021లో వేతన పెంపులు సగటు 8 శాతం స్థాయిలో ఉంటే, 2022లో సగటున 9.3 శాతానికి పెరగొచ్చంటూ ‘శాలరీ బడ్జెట్ ప్లానింగ్ రిపోర్ట్’లో పేర్కొంది. ఉద్యోగులను నిలుపుకోవడం, వారిని ఆకర్షించే సవాళ్లను కంపెనీలు ఎదుర్కొంటున్నాయని.. ఈ నేపథ్యంలో ఎక్కువ వేతన పెంపుల దిశగా అడుగులు వేయక తప్పదన్నది ఈ సంస్థ విశ్లేషణ. వచ్చే 12 నెలల కాలానికి మెరుగైన వ్యాపార పరిస్థితుల దృష్ట్యా.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్‌లోనే ఎక్కువ వేతనాల పెంపు ఉంటుందని తన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఈ సంస్థ ద్వైవార్షిక సర్వే నిర్వహించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 13 దేశాల్లోని 1,405 కంపెనీల అభిప్రాయాలను తెలుసుకుంది. ఇందులో 435 భారత కంపెనీలు కూడా ఉన్నాయి. భారత్‌లో మెజారిటీ కంపెనీలు (52.2 శాతం) వచ్చే ఏడాది కాలానికి సానుకూల వ్యాపార ఆదాయ అంచనాలను వెల్లడించినట్టు ఈ నివేదిక తెలియజేసింది. 2020 నాలుగో త్రైమాసికంలో ఉన్న 37 శాతం కంటే ఇది ఎంతో మెరుగుపడినట్టు ప్రస్తావించింది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న దానికి ఇది నిదర్శనంగా పేర్కొంది. సర్వే నివేదికలోని వివరాలు.. ► 30 శాతం కంపెనీలు వచ్చే 12 నెలల్లో నియామకాలను పెంచనున్నట్టు తెలిపాయి. 2020లో ఉన్న గణాంకాలతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. ► ఇంజనీరింగ్ (57.5 శాతం) ఐటీ (53.4 శాతం) సాంకేతిక నైపుణ్యాలతో కూడిన ట్రేడింగ్ (34.2 శాతం), విక్రయాలు (37), ఫైనాన్స్ 11.6 శాతం చొప్పున నియామకాలు ఉండనున్నాయి. ► ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్‌లోనే అట్రిషన్ (ఉద్యోగుల వలస) రేటు తక్కువగా ఉంది. స్వచ్చంద అట్రిషన్ రేటు (ఉద్యోగులు స్వయంగా మారిపోవడం) 8.9 శాతంగా, స్వచ్ఛందం కాని (కంపెనీలే ఉద్యోగులను తొలగించడం) అట్రిషన్ రేటు 3.3 శాతంగా ఉంది. ► 2022లో హైటెక్ రంగంలో 9.9 శాతం మేర వేతన పెంపు ఉండనుంది. ఆ తర్వాత కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, రిటైల్ రంగ్లాలో 9.5 శాతం మేర, తయారీలో 9.30 శాతం మేర పెంపు ఉండొచ్చు. నిపుణులను నిలబెట్టుకోవడం సవాలు.. ‘‘వ్యాపార ఆశావాదం పెరగడం అధిక వేతన బడ్జెట్‌కు, అధిక నియామకాలకు దారితీయనుంది. ఉద్యోగులపై ఖర్చు పెట్టే విషయంలో కంపెనీలకు కరోనా మహమ్మారి ఒక వాటర్òÙడ్ విప్లవం వంటిది’’ అని విల్లిస్ టవర్స్ వాట్సన్ కన్సలి్టంగ్ లీడర్ ఇండియా రాజుల్ మాథుర్ పేర్కొన్నారు. -
ఒత్తిడిలో ఉద్యోగులు..
న్యూఢిల్లీ: ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి అంశాలు ఉద్యోగులకు జీవన శైలిపరమైన రిస్కులుగా ఉంటున్నాయి. వీటితో పాటు స్థూలకాయం, ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం, పొగాకు వినియోగం సైతం ఉద్యోగులను కుంగదీస్తున్నాయి. దేశీయంగా ఉద్యోగుల స్థితిగతులపై కన్సల్టెన్సీ సంస్థ విలిస్ టవర్స్ వాట్సన్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న కంపెనీలు ఈ అంశాలు వెల్లడించాయి. ఉద్యోగుల్లో ఒత్తిడిని అధిగమించడంపై ప్రస్తుతం దేశీ సంస్థలు ప్రధానంగా దృష్టి పెడుతున్నాయని నివేదిక పేర్కొంది. ‘ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గించేందుకు, మానసిక పరిస్థితులు మెరుగుపర్చేందుకు గతేడాది దాదాపు 80 శాతం సంస్థలు కనీసం ఏదో ఒక్క ప్రయత్నం చేశాయి. మరికొన్ని సంస్థలు ఉద్యోగుల్లో ఒత్తిడి, ఆరోగ్యపరమైన సమస్యలను గుర్తించి, పరిష్కరించడంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాయి‘ అని వివరించింది. శారీరక శ్రమ లేకపోవడం (62 శాతం), ఒత్తిడి (55 శాతం) ఉద్యోగులకు ప్రధానమైన లైఫ్‌స్టయిల్ రిస్కులుగా ఉంటున్నాయని కంపెనీలు గుర్తించాయని విలిస్ టవర్స్ వాట్సన్ వివరించింది. గతేడాది జూన్–ఆగస్టు మధ్యకాలంలో నిర్వహించిన ఈ సర్వేలో 100 పైచిలుకు సంస్థల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
భవిష్యత్‌కు భరోసా ఎంత!
రిటైర్మెంట్ జీవితంపై 56 శాతం ఉద్యోగుల ఆందోళన: తేల్చిన సర్వే న్యూఢిల్లీ: క్షణం తీరిక లేని బిజీ జీవన గమనంలో కొట్టుకుపోతున్న సగటు ఉద్యోగికి భవిష్యత్‌పై భరోసా ఎంత? దేశంలోని సగానికి పైగా ఉద్యోగుల మదిని తొలుస్తున్న ప్రశ్న ఇది. తమ తల్లిదండ్రులతో పోలిస్తే... పదవీ విరమణ తరువాత జీవితంపై 56 శాతం మంది ఉద్యోగులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ సంస్థ ‘విల్స్ టవర్స్ వాట్సన్’ నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మొత్తం రెండు వేల మంది ఉద్యోగులపై సంస్థ అధ్యయనం చేసింది. వీరిలో 46 శాతం మంది ప్రస్తుతం తమ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. ప్రతి ముగ్గురులో ఒకరు ఆర్థిక సమస్యలు తమ జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని భావిస్తున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు ఉన్నతమైన పదవీ విరమణ లేదంటే హెల్త్ బెనిఫిట్స్, బోనస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో ఉద్యోగుల దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వానికి సంబంధించి సంస్థలు తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని విల్స్ టవర్స్ వాట్సన్ ఇండియా డెరైక్టర్ కులిన్ పటేల్ చెప్పారు. ఉద్యోగులను పొదుపు వైపు మళ్లించేలా సహకారం అందించాలన్నారు.