ఏపీ కార్ల్‌లో టీకాల ఉత్పత్తికి సన్నాహాలు | vaccinations preparations for the production of AP Carl | Sakshi
Sakshi News home page

ఏపీ కార్ల్‌లో టీకాల ఉత్పత్తికి సన్నాహాలు

Published Tue, Nov 1 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

ఏపీ కార్ల్‌లో టీకాల ఉత్పత్తికి సన్నాహాలు

ఏపీ కార్ల్‌లో టీకాల ఉత్పత్తికి సన్నాహాలు

పులివెందుల రూరల్‌ : పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న ఏపీకార్ల్‌ (ఆంధ్రప్రదేశ్‌ అత్యున్నత స్థాయి పశుపరిశోధన కేంద్రం)లో గర్భకోశ వ్యాధులు (బ్రూసెల్లా) నివారణకు టీకాల ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నారు. అమెరికాకు చెందిన జినోమిక్స్‌ బయోటెక్‌ కంపెనీ ఆధ్వర్యంలో ఇదివరకే తమిళనాడు రాష్ట్రం కోసం డిమాండ్‌ మేరకు టీకాల ఉత్పత్తి చేసి ఆపివేశారు. అయితే తిరిగి వచ్చేనెల నుంచి బ్రూసెల్లా టీకాల ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వైఎస్‌ఆర్, అనంతపురం జిల్లాల్లో నాలుగు గ్రామాలు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 6 గ్రామాల్లో బ్రూసెల్లా వ్యాధికి నిర్ధారణకు రక్త నమూనాలు సేకరిస్తున్నారు. బ్రూసెల్లా వ్యాధి పాజిటివ్‌ అని తేలితే ఆ గ్రామంలోని మొత్తం గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలతోపాటు పశువుల కాపరులు, పశువైద్యుల రక్తనమూనాలను సైతం పరిశీలిస్తారు. ఆ గ్రామాల్లో పూర్తిస్థాయిలో నివారణకు సన్నాహాలు చేస్తారు. అనంతరం కేంద్రప్రభుత్వం నుంచి అనుమతి పొంది దేశం మొత్తం బ్రూసెల్లా వ్యాధి నివారణకు పులివెందుల ఏపీకార్ల్‌ నుంచి వ్యాక్సిన్‌ తయారుచేసేందుకు జినోమిక్స్‌ మరో ముందడుగు వేస్తోంది.
బ్రూసెల్లా వ్యాధి వలన కలిగే నష్టాలు
బ్రూసెల్లా(గర్భ సంబంధిత) వ్యాధి సోకిన ఆ పశువు గర్భం దాల్చితే అబార్షన్‌కు గురై అవకాశం ఉంది. పశువులకు వ్యాధి ఉన్నట్లయితే అది మనుషులకు సైతం సక్రమించే అవకాశం ఉంది. ఈ వ్యాధివలన పశువులతోపాటు మనుషులకు సైతం నష్టం కల్గనుంది.

త్వరలో ఉత్పత్తి చేస్తాం :
ఏపీకార్ల్‌లో జినోమిక్స్‌ ఆధ్వర్యంలో పశువుల్లో సక్రమించే బ్రూసెల్లా వ్యాధి నివారణకు టీకాల ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నాం. వచ్చేనెల నుంచి ఉత్పత్తికి చేసేలా ప్రణాళిక తయారుచేశాం. ఈ టీకాలు భవిష్యత్‌లో భారతదేశం మొత్తం సరఫరా చేసేలా ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకోనున్నాం.

                    – రత్నగిరి(జినోమిక్స్‌ ఎండీ),

పులివెందుల
01పీఎల్‌వీడీ104–15050007 :– పట్టణంలోని ఏపీ కార్ల్‌ పరిపాలన భవనం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement