Brucella
-
గతేడాది కరోనా.. ఇప్పుడు బ్రూసోల్లోసిస్
బీజింగ్: కరోనా వైరస్ ఈ ప్రపంచంలోకి ప్రవేశించి దాదాపు ఏడాది కావాస్తోంది. వుహాన్ ల్యాబ్ నుంచి బయటపడిందని భావిస్తున్న ఈ మహమ్మారి ఇంకా అదుపులోకి రాలేదు. ప్రపంచ దేశాలన్ని వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో ఇన్ఫెక్షన్ వెలుగులోకి వచ్చింది. చైనాలోని గన్సు ప్రావిన్స్ రాజధాని లాన్‌జౌలో 6,000 మందికి పైగా బ్రూసెల్లోసిస్ అనే బ్యాక్టీరియా వ్యాధి పాజిటివ్ వచ్చినట్లు స్థానిక ప్రభుత్వం తెలిపింది. ఇది కూడా స్థానికంగా ఉన్న ఓ వ్యాక్సిన్ ప్లాంట్ నుంచే ఏడాది క్రితం లీకైనట్లు సమాచారం. ఈ క్రమంలో లాన్జౌ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘పట్టణంలోని 55,725కి పరీక్షలు చేశాం. వీరిలో 6,620 మందికి పాజిటివ్‌గా తేలింది’ అని తెలిపారు. పశువుల మీద ఉండే బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని తెలిపారు. సెప్టెంబర్ 14 నాటికి కేసుల సంఖ్య 3,245 ఉండగా.. ప్రస్తుతం 6000 పైగా నమోదయ్యాయి. బ్రూసెల్లోసిస్ లక్షణాలు జంతువులతో ప్రత్యక్ష సంబంధం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, కలుషితమైన జంతు ఉత్పత్తులను తినడం, త్రాగటం ద్వారా లేదా గాలిలో ఉండే ఏజెంట్లను పీల్చడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో కూడా ఫ్లూలో కనిపించే లక్షణాలే కనిపిస్తాయి. కొన్ని లక్షణాలు దీర్ఘకాలికంగా మారి.. ఇక ఎన్నటికి తగ్గకపోవచ్చు అని వైద్యులు తెలిపారు. ఈ మేరకు లాన్జౌ హెల్త్ కమిషన్ సెప్టెంబర్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. (చదవండి: సెకండ్ వేవ్.. తస్మాత్ జాగ్రత్త! ) చైనా యానిమల్ హస్బండ్రీ ఇండస్ట్రీ కో యాజమాన్యంలోని బయోఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ నుంచి ఇది బయటకు వచ్చిందని ప్రకటనలో తెలిపింది. ‘కంపెనీ గత ఏడాది జూలై నుంచి ఆగస్టు మధ్యలో బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్ల తయారీకి గడువు ముగిసిన క్రిమిసంహారక మందులను ఉపయోగించింది. ఆ తరువాత బ్యాక్టిరియాను కలుషితమైన వ్యర్థ వాయువులో వదిలివేయడంతో అవి ఏరోసోల్స్‌ని ఏర్పాటు చేశాయి. ఆ తరువాత గాలి ద్వారా అవి లాన్జౌ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిసర ప్రాంతాలకు వ్యాప్తి చెందాయి. దాంతో మొదటి సారి గత ఏడాది నవంబర్‌లో ఇక్కడ బ్రూసెల్లోసిస్ వ్యాప్తి వెలుగులోకి వచ్చింది’ అని ఆరోగ్య కమిషన్ తెలిపింది. గ్లోబల్ టైమ్స్ ప్రకారం, బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్ ఉత్పత్తి వర్క్‌షాప్‌ను గత ఏడాది డిసెంబర్లో మూసివేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో దీనిని కూల్చివేశారు.(చదవండి: పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉంది..) విదేశీ విమానాలపై బ్యాన్ వందేభారత్ మిషన్‌లో భాగాంగా తాజాగా భారత్ నుంచి చైనాకు వెళ్లిన ఎయిరిండియా విమానంలో 19 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా భారత్‌తో సహా ఇతర దేశాల నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. నిషేధం తాత్కలికమేనని.. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని చైనా ప్రకటించింది. -
ఏపీ కార్ల్‌లో టీకాల ఉత్పత్తికి సన్నాహాలు
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న ఏపీకార్ల్ (ఆంధ్రప్రదేశ్ అత్యున్నత స్థాయి పశుపరిశోధన కేంద్రం)లో గర్భకోశ వ్యాధులు (బ్రూసెల్లా) నివారణకు టీకాల ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నారు. అమెరికాకు చెందిన జినోమిక్స్ బయోటెక్ కంపెనీ ఆధ్వర్యంలో ఇదివరకే తమిళనాడు రాష్ట్రం కోసం డిమాండ్ మేరకు టీకాల ఉత్పత్తి చేసి ఆపివేశారు. అయితే తిరిగి వచ్చేనెల నుంచి బ్రూసెల్లా టీకాల ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వైఎస్ఆర్, అనంతపురం జిల్లాల్లో నాలుగు గ్రామాలు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 6 గ్రామాల్లో బ్రూసెల్లా వ్యాధికి నిర్ధారణకు రక్త నమూనాలు సేకరిస్తున్నారు. బ్రూసెల్లా వ్యాధి పాజిటివ్ అని తేలితే ఆ గ్రామంలోని మొత్తం గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలతోపాటు పశువుల కాపరులు, పశువైద్యుల రక్తనమూనాలను సైతం పరిశీలిస్తారు. ఆ గ్రామాల్లో పూర్తిస్థాయిలో నివారణకు సన్నాహాలు చేస్తారు. అనంతరం కేంద్రప్రభుత్వం నుంచి అనుమతి పొంది దేశం మొత్తం బ్రూసెల్లా వ్యాధి నివారణకు పులివెందుల ఏపీకార్ల్ నుంచి వ్యాక్సిన్ తయారుచేసేందుకు జినోమిక్స్ మరో ముందడుగు వేస్తోంది. బ్రూసెల్లా వ్యాధి వలన కలిగే నష్టాలు బ్రూసెల్లా(గర్భ సంబంధిత) వ్యాధి సోకిన ఆ పశువు గర్భం దాల్చితే అబార్షన్‌కు గురై అవకాశం ఉంది. పశువులకు వ్యాధి ఉన్నట్లయితే అది మనుషులకు సైతం సక్రమించే అవకాశం ఉంది. ఈ వ్యాధివలన పశువులతోపాటు మనుషులకు సైతం నష్టం కల్గనుంది. త్వరలో ఉత్పత్తి చేస్తాం : ఏపీకార్ల్‌లో జినోమిక్స్ ఆధ్వర్యంలో పశువుల్లో సక్రమించే బ్రూసెల్లా వ్యాధి నివారణకు టీకాల ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నాం. వచ్చేనెల నుంచి ఉత్పత్తికి చేసేలా ప్రణాళిక తయారుచేశాం. ఈ టీకాలు భవిష్యత్‌లో భారతదేశం మొత్తం సరఫరా చేసేలా ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకోనున్నాం. – రత్నగిరి(జినోమిక్స్ ఎండీ), పులివెందుల 01పీఎల్‌వీడీ104–15050007 :– పట్టణంలోని ఏపీ కార్ల్ పరిపాలన భవనం