చిత్తూరు (టౌన్) : కొత్త ఇసుక పాల సీని జిల్లాలో అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అక్రమ రవాణాను నివారించేందుకు ఇసుక అమ్మకం బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నారు. ఇసుక లభించే ప్రాంతాల్లోనే మండలానికోచోట నిల్వచేసి మహిళాసంఘాల నుంచి కొనే విధంగా ప్రణాళికలను రూపొందించారు. జిల్లాలో కుప్పం మండలంలో కంగుంది, పాలారు, నాగలాపురంలో సురుటుపల్లె, నగరిలో సత్రవాడ, నిండ్రలో కొప్పేడు, రామాపురం, చిత్తూరు రూరల్‌లో ఆనగల్లు, నీవానది, ఎన్‌ఆర్ పేట, చంద్రగిరిలో శానంబట్ల, నారాయణవనంలో పాల మంగళం, నయనార్ కండ్రిగలో ఇసుక రీచ్‌లున్నట్లు గుర్తించారు.
యూనిట్ ధర రూ.850
కొత్త ఇసుక పాలసీ ప్రకారం ఒక యూనిట్ (ట్రాక్టర్ లోడ్) 2.75 క్యూ బిక్ మీటర్ల ఇసుక ధరను రూ. 850గా అధికారులు నిర్ణరుుంచారు. ఇసుక అవసరం ఉన్నవారు తమ ప్రాంతంలోని మీ -సేవ కేంద్రాల్లో వినతిపత్రాలను సమర్పించి అనుమతి పొం దొచ్చు. డబ్బులు మాత్రం నేరుగా మహిళా సంఘాలకు చెల్లించాలి. ఇసుక అమ్మకాలపై ఆసక్తి ఉన్న మహిళా సంఘాలు డీఆర్‌డీఏ పీడీకి దరఖాస్తు చేసుకోవాలి. ఆయన అమ్మకాలను చేపట్టే అధికారాన్ని కల్పిస్తారు. ఇప్పటికే కుప్పం ప్రాంతంలో ఒక సంఘానికి ఈ అధికారాన్ని కల్పిం చారు. ఖర్చులుపోను మిగిలిన ఆదాయంలో 25 శాతాన్ని అమ్మకాలు చేపట్టే సమాఖ్యల ఖాతాలకు జమచేస్తారు. మిగిలిన మొత్తంలో 50 శాతం మండల పరిషత్‌లకు, 25 శాతం జెడ్పీకి, మరో 25 శాతం గ్రామ పంచాయతీ ఖాతాకు జమవుతుంది.
అక్రమ రవాణాపై కఠిన చర్యలు
ఇసుకను అక్రమంగా రవాణాచేస్తే ప్రభుత్వం ఇకపై కఠిన చర్యలు తీసుకుంటుంది. తొలిసారి పట్టుబడితే అపరాధం విధిస్తారు. రెండోసారైతే రెట్టింపు అపరాధం వేస్తారు. మూడోసారి వాహనాన్ని సీజ్ చేస్తారు. తహశీల్దార్లు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులకు ఈ చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది.
కృత్రిమ ఇసుక తయారీ యూనిట్లను ఏర్పాటుచేయండి
జిల్లాలో ఇసుక క్వారీలు తక్కువగా ఉన్నందున ఔత్సాహికులు కృత్రిమ ఇసుక తయారీ (రోబో శాండ్) యూనిట్లను ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రావు కోరారు. శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఇసుక కొరతను అధిగమించాలంటే కృత్రిమ ఇసుక తయారీ యూ నిట్లను విరివిగా నెలకొల్పాలని కోరా రు. ఇప్పటికే కేవీబీ పురం మండలంలో ఏర్పాటు చేసిన ఒక యూని ట్‌లో ఇసుక తయారవుతోందని చెప్పారు.
కార్యదర్శులు గ్రామాల్లోనే కాపురం ఉండాలి
గ్రామ పంచాయతీ కార్యదర్శులు తా ము పనిచేసే గ్రామాల్లోనే కాపురం ఉం డాలని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రావు కోరారు. చాలామంది పంచాయతీ కార్యదర్శులు తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో మాత్రమే అందుబాటులో ఉంటున్నట్లు ఫిర్యాదులొస్తున్నాయని చెప్పా రు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు అంటువ్యాధులు ప్రబలే పరిస్థితి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఇసుక కొత్తపాలసీ అమలుపై అధికారుల కసరత్తు
Published Sun, Nov 2 2014 4:43 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM
Advertisement