విపత్తుల నివారణకు ప్రణాళిక | Disaster prevention plan | Sakshi
Sakshi News home page

విపత్తుల నివారణకు ప్రణాళిక

Aug 1 2014 12:29 AM | Updated on Sep 2 2017 11:10 AM

తుపాను ప్రభావిత మండలాల అధికారులు విపత్తుల నివారణకు ప్రణాళిక రూపొందించుకోవాలని, రెండు రోజుల్లో తన కార్యాలయానికి అందజేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ఆదేశించారు.

  • అధికారులకు కలెక్టర్ ఆదేశం
  • విశాఖ రూరల్: తుపాను ప్రభావిత మండలాల అధికారులు విపత్తుల నివారణకు ప్రణాళిక రూపొందించుకోవాలని, రెండు రోజుల్లో తన కార్యాలయానికి అందజేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి విపత్తుల నివారణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

    ఆయన మాట్లాడుతూ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విశాఖ తీర ప్రాంతానికి తుపానుల ప్రభావం ఉండే అవకాశమున్నందున తీర ప్రాంతాల మండలాధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు. తుపాను షెల్టర్లకు మరమ్మతులు వెంటనే నిర్వహించాలన్నారు. తుపాను సమయంలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సెంట్రల్ కంట్రోల్ రూమ్ నిర్వహిస్తే బాగుంటుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఏజేసీ న రసింహారావు మాట్లాడుతూ రెండేళ్లుగా వచ్చిన భారీ వర్షాలు, తుపాన్లు, పరిస్థితుల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సరికొత్త ఆలోచనలకు రూపకల్పన చేసి విపత్తుల నివారణకు ప్రణాళిక తయారు చేయాలన్నారు.
     
    అంటు వ్యాధులపై అప్రమత్తం
     
    ఈ సీజన్‌లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను కలెక్టర్ ఎన్.యువరాజ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మలేరియా, డెంగీ, ఇతర అంటువ్యాధులకు సంబంధించిన కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రతి వారం మండలాల్లో పర్యటించే అధికార బృందం వ్యాధుల నివారణపై ప్రచారం చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ శ్యామల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డెంగీ, మలేరియా వ్యాధుల నియంత్రణపై తీసుకుంటున్న చర్యలను కలెక్టర్‌కు వివరించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement