‘మెట్రో’కు పటిష్ట భద్రత
- ‘ప్రత్యేక ఠాణా’పై హెచ్‌ఎంఆర్ ఎండీ, సైబరాబాద్ కమిషనర్ చర్చ
- మెట్రో స్టేషన్ల పరిశీలన
సాక్షి,సిటీబ్యూరో: మెట్రో రైలు స్టేష న్లు, డిపోలు, కారిడార్ భద్రత కో సం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చే యనున్న ప్రత్యేక పోలీసుస్టేషన్ విధివిధానాలపై సైబరాబాద్ పోలీస్ క మిషనర్ సీవీ ఆనంద్, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి గురువారం చ ర్చించారు. నాగోల్-మెట్టుగూడ రూట్లో మెట్రో స్టేషన్లు, ఉప్పల్ మె ట్రో డిపో, మెట్రో కారిడార్‌లో భ ద్రతా ఏర్పాట్లను ఇద్దరూ పరిశీలించారు.
మెట్రో భద్రత కోసం తాము రూపొందించిన ప్రణాళికను త్వరలో హెచ్‌ఎంఆర్‌కు అందజేస్తామని ఈ సందర్భంగా సీవీ ఆనంద్ తెలిపారు. ఉప్పల్ మెట్రో డిపో, ఆపరేషన్ కం ట్రోల్ సెంటర్, నాగోల్-మెట్టుగూడ 8 కి.మీ మార్గంలోని ఏడు మెట్రో స్టేషన్లలో భద్రతా ఏర్పాట్లను కమిషనర్ పరిశీలించారు. మెట్రో స్టేషన్లలో అడుగడుగునా సీసీటీవీలతో నిఘా ఏర్పాటు చేస్తామని ‘మెట్రో’ ఎండీ తెలిపారు. భద్రతా సిబ్బంది లేని చోట సెన్సార్లు, సెక్యూరిటీ అలారం లు ఏర్పాటు చేస్తామన్నారు.
ఆటోమేటిక్ టికెట్ జారీ యంత్రాల వద్ద తనిఖీలతో పాటు బ్యాగేజీ స్కానర్లు ఏర్పాటు చేస్తామన్నారు. స్టేషన్లను నిరంతరం పహరా కాసేందుకు వాచ్‌టవర్లుతో పాటు డిపోలోనూ కట్టుది ట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నా రు. భారీగా ప్రయాణికులు మెట్రో స్టేషన్లకు వచ్చినపుడు రద్దీని ఎలా క్రమబద్దీకరించవచ్చో మెట్రో ఎండీ కమిషనర్‌కు వివరించారు. ప్రయాణికుల కోసం ఏర్పా టు చేయనున్న పార్కింగ్, ఇతర సదుపాయాలను ఉన్నతాధికారులిద్దరూ పరిశీలించా రు. వారి వెంట సైబరాబాద్, హెచ్‌ఎంఆర్ ఉన్నతాధికారులున్నారు.