సన్నీలియోన్ మరో సంచలనం! | Sunny Leone Planning to Make Her Singing Debut? | Sakshi
Sakshi News home page

సన్నీలియోన్ మరో సంచలనం!

Published Tue, Jul 5 2016 10:58 AM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM

సన్నీలియోన్ మరో సంచలనం!

సన్నీలియోన్ మరో సంచలనం!

ముంబయి: తొలుత పోర్న్ చిత్రాల్లో.. అనంతరం బాలీవుడ్ లో అడుగుపెట్టి షేక్ చేసిన సన్నీ లియోన్ ఇప్పుడు సింగర్ గా మారబోతుందా అంటే.. ఆమె పోస్ట్ చేసిన ఓ ఫొటో అవుననే సమాధానం చెబుతోంది. బాలీవుడ్ మొత్తాన్ని ఒక్కసారిగా షేక్ చేసి ఇటీవల కనిపించడం మానేసిన సన్నీ లియోన్ తాజాగా కొత్త అవతారంలో దర్శనం ఇచ్చింది.

అది కూడా ఓ మైక్ ముందు నిల్చొని. ఓ సాంగ్ రికార్డింగ్ స్టూడియోలో నిల్చొని గట్టిగా ఓ పాట పడుతున్నట్లు అందులో కనిపించింది. ఈ ఫొటోను స్వయంగా సన్నీనే పోస్ట్ చేసింది. ఆ ఫొటోకు ట్యాగ్ లైన్ గా ’నా భయాలన్నింటిని పక్కకు పెట్టి ముందుకెళ్లాను.. మొత్తానికి బిగ్గరగా పాడగలిగాను. రిహార్సింగ్ కోసం ఒక నెల వెచ్చించాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను’ అని ఆమె చెప్పింది. ప్రస్తుతం ఈ నటి యూత్ కు సంబంధించిన రియాలిటీ టీవీ స్ప్లిట్స్ విల్లా సీసన్ 9 అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement