singing debut
-
సల్మాన్ సినిమాలో ప్రియురాలి పాట?
బాలీవుడ్ ముదురు బ్రహ్మచారి సల్మాన్ ఖాన్ ఈమధ్య కాలంలో లులియా వాంటూర్‌తో కలిసి తిరుగుతున్నాడనేది బహిరంగ రహస్యమే. తన ప్రియురాలిని బాలీవుడ్‌లోకి కూడా తీసుకురావాలని భావించిన సల్లూభాయ్... తన సినిమాతోనే ఆ అవకాశం కల్పించాలని అనుకుంటున్నాడట. ట్యూబ్‌లైట్ సినిమా షూటింగులో తరచు సల్మాన్‌తో కలిసి కనిపిస్తున్న లులియాతో ఆ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ పాడించాలని భావిస్తున్నట్లు టాక్. ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. రొమేనియాకు చెందిన ఈ సుందరి.. ఇటీవలే హిమేష్ రేషమ్మియా సంగీత దర్శకత్వంలో ఒక సింగిల్ ఆల్బం విడుదల చేసింది. ఇప్పుడు తన కొత్త పాటతో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని ఉత్సాహంగా కనిపిస్తోంది. ఎక్కడో రొమేనియా నుంచి వచ్చినా, హిందీ బ్రహ్మాండంగా మాట్లాడుతోందని బాలీవుడ్ జనాలు ప్రశంసిస్తున్నారు. ఆమె గొంతు, శ్రుతి రెండూ కూడా చాలా బాగున్నాయని, ఫైనల్ ట్రాక్ రికార్డింగ్ మాత్రం మిగిలి ఉందని చెబుతున్నారు. సుల్తాన్ సినిమాలోని 'బేబీకో బేస్ పసంద్ హై' పాటను లులియా ఇంతకుముందు రీమిక్స్ చేసింది. ఇప్పుడు డైరెక్ట్ పాట ఇవ్వడం ద్వారా ఆమెను మరో మెట్టు పైకి ఎక్కించాలని సల్మాన్ భావిస్తున్నాడు. -
సన్నీలియోన్ మరో సంచలనం!
ముంబయి: తొలుత పోర్న్ చిత్రాల్లో.. అనంతరం బాలీవుడ్ లో అడుగుపెట్టి షేక్ చేసిన సన్నీ లియోన్ ఇప్పుడు సింగర్ గా మారబోతుందా అంటే.. ఆమె పోస్ట్ చేసిన ఓ ఫొటో అవుననే సమాధానం చెబుతోంది. బాలీవుడ్ మొత్తాన్ని ఒక్కసారిగా షేక్ చేసి ఇటీవల కనిపించడం మానేసిన సన్నీ లియోన్ తాజాగా కొత్త అవతారంలో దర్శనం ఇచ్చింది. అది కూడా ఓ మైక్ ముందు నిల్చొని. ఓ సాంగ్ రికార్డింగ్ స్టూడియోలో నిల్చొని గట్టిగా ఓ పాట పడుతున్నట్లు అందులో కనిపించింది. ఈ ఫొటోను స్వయంగా సన్నీనే పోస్ట్ చేసింది. ఆ ఫొటోకు ట్యాగ్ లైన్ గా ’నా భయాలన్నింటిని పక్కకు పెట్టి ముందుకెళ్లాను.. మొత్తానికి బిగ్గరగా పాడగలిగాను. రిహార్సింగ్ కోసం ఒక నెల వెచ్చించాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను’ అని ఆమె చెప్పింది. ప్రస్తుతం ఈ నటి యూత్ కు సంబంధించిన రియాలిటీ టీవీ స్ప్లిట్స్ విల్లా సీసన్ 9 అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. -
అప్పుడు చాలా భయమేసింది: సన్నీ లియోన్
ముంబై: బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ మరో కొత్త అవతారం ఎత్తింది. ఇప్పటి వరకు స్కిన్ షోకే పరిమితమైన అందాల భామ ఇప్పుడు సింగర్ గా మారింది. తొలిసారిగా గొంతు సవరించుకుని పాట అందుకుంది. మైక్ ముందు బుద్ధిగా నించుని తాను పాట పాడుతున్న ఫొటోను ట్విటర్ లో పెట్టింది. మైక్ ముందు గట్టిగా పాట పాడడానికి చాలా భయపడ్డానని, నెల రోజుల పాటు రిహార్సిల్ చేశానని వెల్లడించింది. తన పాట అందరికీ నచ్చుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. 'వన్ నైట్' సినిమాలో చివరిసారిగా కనిపించిన సన్నీ లియోన్ ప్రస్తుతం యూత్ రియాలిటీ షో 'ఎంటీవీ స్ల్పిట్స్ విల్లా సీజన్ ౯'కు హోస్ట్ గా చేస్తోంది. షారూఖ్ ఖాన్ తాజా చిత్రం 'రాయిస్' సినిమాలో ఐటెం పాట కోసం సన్నీ లియోన్ ను సంప్రదించినట్టు సమాచారం. 1980 దశకంలో హిట్టైన 'ఖుర్బానీ' సినిమాలోని లైలా ఓ లైలా' రీమిక్స్ పాటలో సన్నీ లియోన్ ను నటింపజేయాలని చూస్తున్నారు. ఈ సాంగ్ ఒరిజినల్ వెర్షన్ లో ఫిరోజ్ ఖాన్, జీనత్ అమన్ నటించారు. Went head on w/one of my biggest fears-singing out loud!Spent the month rehearsing!Hope u like it!! pic.twitter.com/b8chjZ7rt4 — Sunny Leone (@SunnyLeone) 4 July 2016