సల్మాన్ సినిమాలో ప్రియురాలి పాట?
సల్మాన్ సినిమాలో ప్రియురాలి పాట?
Published Tue, Feb 21 2017 7:08 PM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM
బాలీవుడ్ ముదురు బ్రహ్మచారి సల్మాన్ ఖాన్ ఈమధ్య కాలంలో లులియా వాంటూర్‌తో కలిసి తిరుగుతున్నాడనేది బహిరంగ రహస్యమే. తన ప్రియురాలిని బాలీవుడ్‌లోకి కూడా తీసుకురావాలని భావించిన సల్లూభాయ్... తన సినిమాతోనే ఆ అవకాశం కల్పించాలని అనుకుంటున్నాడట. ట్యూబ్‌లైట్ సినిమా షూటింగులో తరచు సల్మాన్‌తో కలిసి కనిపిస్తున్న లులియాతో ఆ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ పాడించాలని భావిస్తున్నట్లు టాక్. ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
రొమేనియాకు చెందిన ఈ సుందరి.. ఇటీవలే హిమేష్ రేషమ్మియా సంగీత దర్శకత్వంలో ఒక సింగిల్ ఆల్బం విడుదల చేసింది. ఇప్పుడు తన కొత్త పాటతో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని ఉత్సాహంగా కనిపిస్తోంది. ఎక్కడో రొమేనియా నుంచి వచ్చినా, హిందీ బ్రహ్మాండంగా మాట్లాడుతోందని బాలీవుడ్ జనాలు ప్రశంసిస్తున్నారు. ఆమె గొంతు, శ్రుతి రెండూ కూడా చాలా బాగున్నాయని, ఫైనల్ ట్రాక్ రికార్డింగ్ మాత్రం మిగిలి ఉందని చెబుతున్నారు. సుల్తాన్ సినిమాలోని 'బేబీకో బేస్ పసంద్ హై' పాటను లులియా ఇంతకుముందు రీమిక్స్ చేసింది. ఇప్పుడు డైరెక్ట్ పాట ఇవ్వడం ద్వారా ఆమెను మరో మెట్టు పైకి ఎక్కించాలని సల్మాన్ భావిస్తున్నాడు.
Advertisement
Advertisement