Tubelight movie
-
డబ్బులు తిరిగిచ్చేయనున్న టాప్ హీరో
ముంబై: భారీ అంచనాల నడుమ విడుదలైన సల్మాన్ ఖాన్ తాజా సినిమా ‘ట్యూబ్‌లైట్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అంతకుముందు రంజాన్‌కు విడుదలైన ఏక్ థా టైగర్, బజరంగీ భాయ్‌జాన్, సుల్తాన్ ఘన విజయాన్ని అందుకున్నాయి. ఇదే ఏడాది రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ట్యూబ్‌లైట్’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో కనీసస్థాయిలో కూడా కలెక్షన్లు వసూలు కాలేదు. తీవ్రంగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఊరట కలిగించాలని సల్మాన్ నిర్ణయించినట్టు బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. తన సినిమా కారణంగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు రూ. 55 కోట్లు చెల్లించేందుకు సిద్ధమయినట్టు సమాచారం. దీనిపై చర్చించేందుకు డిస్ట్రిబ్యూటర్లు సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్‌ను కలవనున్నారని తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లకు రూ. 50 నుంచి రూ.55 కోట్ల వరకు వరకు చెల్లించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ట్యూబ్‌లైట్ నిరాశపరచటంతో ఆ ప్రభావం తదుపరి సినిమా ‘టైగర్ జిందాహై’పై పడింది. పాత అగ్రిమెంట్లను సవరించాలని సల్మాన్‌పై డిస్ట్రిబ్యూటర్లు వత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. -
బాహుబలి-2 రికార్డుల్ని బ్రేక్ చేస్తుందట!
ముంబై: భారతీయ సినిమాల్లో ఆల్ టైమ్ గ్రేట్ గా దూసుకుపోతున్న బాహుబలిపై బాలీవుడ్ రగిలిపోతున్నదని, తెలుగు సినిమాకు ఇంతటి ఖ్యాతి దక్కడాన్ని అక్కడివాళ్లు జీర్ణించుకోలేని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బాహుబలికి పోటీగా(!) ఏ సినిమాను ప్రమోట్ చేద్దామా అని అక్కడివాళ్లు ఆలోచిస్తున్న తరుణంలోనే సల్మాన్ ఖాన్ కొత్త సినిమా ’ట్యూబ్‌లైట్’ ట్రైలర్ విడుదలైంది. మే 4న విడుదలైన ’ట్యూబ్‌లైట్’ ట్రైలర్‌ను రెండు రోజుల్లోనే దాదాపు కోటి మంది వీక్షించారు. అంతే, ‘ఈ సినిమా బాహుబలి-2 రికార్డుల్ని బ్రేక్ చేయబోతోంది..’ అంటూ ప్రచారం మొదలైంది. దీన్నిబట్టి ఖాన్ త్రంయం నెలకొల్పిన ఎన్నో రికార్డుల్ని బాహుబలి చెరిపేయడంపై బాలీవుడ్ రగిలిపోతోందన్న వర్మ వ్యాఖ్యలు నిజమేనని అనిపిస్తుంది. గొప్ప సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనడంలో సందేహంలేదు. ట్యూబ్‌లైట్.. బాహుబలి-2 కంటే గొప్పసినిమా అయితే తప్పక హిట్ సాధిస్తుంది.. రికార్డులు బద్దలుకొడుతుంది. కానీ కేవలం తెలుగోడి సినిమాను తక్కువచేయడానికి మాత్రమే ఈ తరహా ప్రచారాలు చేయడంపైనే విమర్శలు వస్తున్నాయి. నమ్మకం ట్యూబ్‌లైట్ లాంటిది.. బ్లాక్ బస్టర్ ‘బజరంగీ భాయిజాన్’ తర్వాత దర్శకుడు కబీర్ ఖాన్- హీరో సల్మాన్ ఖాన్ల కాంబినేషన్లో రూపొందిన ’ట్యూబ్‌లైట్’ సినిమా ఈద్ కానుకగా జూన్ 23న విడుదల కానుంది. చిన్నాపెద్దా అందరూ అభిమానించే అమాయక వ్యక్తిగా సల్మాన్ పాత్ర ’భాయిజాన్’ను తలపించేలా ఉంది. ’నమ్మకం ఓ ట్యూబ్‌లైట్ లాంటిది.. ఆలస్యంగా వెలుగుతుంది. కానీ ఒక్కసా వెలిగాక వెలుగులు విరజిమ్ముతుంది..’ అంటూ సల్మాన్ చెప్పిన డైలాగ్ సినిమా ఎలా ఉండబోతోందని చెప్పకనే చెప్పినట్లుంది. ‘ట్యూబ్‌లైట్’ ట్రైలర్.. -
సల్మాన్ సినిమాలో ప్రియురాలి పాట?
బాలీవుడ్ ముదురు బ్రహ్మచారి సల్మాన్ ఖాన్ ఈమధ్య కాలంలో లులియా వాంటూర్‌తో కలిసి తిరుగుతున్నాడనేది బహిరంగ రహస్యమే. తన ప్రియురాలిని బాలీవుడ్‌లోకి కూడా తీసుకురావాలని భావించిన సల్లూభాయ్... తన సినిమాతోనే ఆ అవకాశం కల్పించాలని అనుకుంటున్నాడట. ట్యూబ్‌లైట్ సినిమా షూటింగులో తరచు సల్మాన్‌తో కలిసి కనిపిస్తున్న లులియాతో ఆ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ పాడించాలని భావిస్తున్నట్లు టాక్. ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. రొమేనియాకు చెందిన ఈ సుందరి.. ఇటీవలే హిమేష్ రేషమ్మియా సంగీత దర్శకత్వంలో ఒక సింగిల్ ఆల్బం విడుదల చేసింది. ఇప్పుడు తన కొత్త పాటతో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని ఉత్సాహంగా కనిపిస్తోంది. ఎక్కడో రొమేనియా నుంచి వచ్చినా, హిందీ బ్రహ్మాండంగా మాట్లాడుతోందని బాలీవుడ్ జనాలు ప్రశంసిస్తున్నారు. ఆమె గొంతు, శ్రుతి రెండూ కూడా చాలా బాగున్నాయని, ఫైనల్ ట్రాక్ రికార్డింగ్ మాత్రం మిగిలి ఉందని చెబుతున్నారు. సుల్తాన్ సినిమాలోని 'బేబీకో బేస్ పసంద్ హై' పాటను లులియా ఇంతకుముందు రీమిక్స్ చేసింది. ఇప్పుడు డైరెక్ట్ పాట ఇవ్వడం ద్వారా ఆమెను మరో మెట్టు పైకి ఎక్కించాలని సల్మాన్ భావిస్తున్నాడు.