బాహుబలి-2 రికార్డుల్ని బ్రేక్ చేస్తుందట!
ముంబై: భారతీయ సినిమాల్లో ఆల్ టైమ్ గ్రేట్ గా దూసుకుపోతున్న బాహుబలిపై బాలీవుడ్ రగిలిపోతున్నదని, తెలుగు సినిమాకు ఇంతటి ఖ్యాతి దక్కడాన్ని అక్కడివాళ్లు జీర్ణించుకోలేని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బాహుబలికి పోటీగా(!) ఏ సినిమాను ప్రమోట్ చేద్దామా అని అక్కడివాళ్లు ఆలోచిస్తున్న తరుణంలోనే సల్మాన్ ఖాన్ కొత్త సినిమా ’ట్యూబ్‌లైట్’ ట్రైలర్ విడుదలైంది.
మే 4న విడుదలైన ’ట్యూబ్‌లైట్’ ట్రైలర్‌ను రెండు రోజుల్లోనే దాదాపు కోటి మంది వీక్షించారు. అంతే, ‘ఈ సినిమా బాహుబలి-2 రికార్డుల్ని బ్రేక్ చేయబోతోంది..’ అంటూ ప్రచారం మొదలైంది. దీన్నిబట్టి ఖాన్ త్రంయం నెలకొల్పిన ఎన్నో రికార్డుల్ని బాహుబలి చెరిపేయడంపై బాలీవుడ్ రగిలిపోతోందన్న వర్మ వ్యాఖ్యలు నిజమేనని అనిపిస్తుంది. గొప్ప సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనడంలో సందేహంలేదు. ట్యూబ్‌లైట్.. బాహుబలి-2 కంటే గొప్పసినిమా అయితే తప్పక హిట్ సాధిస్తుంది.. రికార్డులు బద్దలుకొడుతుంది. కానీ కేవలం తెలుగోడి సినిమాను తక్కువచేయడానికి మాత్రమే ఈ తరహా ప్రచారాలు చేయడంపైనే విమర్శలు వస్తున్నాయి.
నమ్మకం ట్యూబ్‌లైట్ లాంటిది..
బ్లాక్ బస్టర్ ‘బజరంగీ భాయిజాన్’ తర్వాత దర్శకుడు కబీర్ ఖాన్- హీరో సల్మాన్ ఖాన్‌ల కాంబినేషన్‌లో రూపొందిన ’ట్యూబ్‌లైట్’ సినిమా ఈద్ కానుకగా జూన్ 23న విడుదల కానుంది. చిన్నాపెద్దా అందరూ అభిమానించే అమాయక వ్యక్తిగా సల్మాన్ పాత్ర ’భాయిజాన్’ను తలపించేలా ఉంది. ’నమ్మకం ఓ ట్యూబ్‌లైట్ లాంటిది.. ఆలస్యంగా వెలుగుతుంది. కానీ ఒక్కసా వెలిగాక వెలుగులు విరజిమ్ముతుంది..’ అంటూ సల్మాన్ చెప్పిన డైలాగ్ సినిమా ఎలా ఉండబోతోందని చెప్పకనే చెప్పినట్లుంది.
‘ట్యూబ్‌లైట్’ ట్రైలర్..